Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




వాతవేయబడిన మనస్సాక్షి

THE SEARED CONSCIENCE
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము ఉదయము, అక్టోబర్ 16, 2016
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, October 16, 2016

"అయితే కడవరి దినములలో కొందరు, అబద్ధికుల వేషధారణ వలన, మోసపరచు ఆత్మల యందును, దయ్యముల బోధయందును లక్ష్యముంచి; విశ్వస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు; ఆ అబద్ధికుల వాతవేయబడిన మనస్సాక్షి గలవారై యుందురు" (I తిమోతి 4:1-2).


కడవరి దినములలో మానవాళి అతి భయంకర మవుతుందని బైబిలు బోధిస్తుంది. ప్రస్తుతము మనము చివరి దినాలలో ఉన్నామని ప్రతీ సూచన తెలియచేస్తుంది. ఒక ఆధునిక తర్జుమా ఎలా ఉందో వినండి. ఈ ఆఖరి దినాల చరిత్రలో ప్రజలు ఎలా వ్యవహరిస్తారో చెప్తుంది. ఇలా ఉంది,

"అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చును. ఏలాగనగా మనుష్యులు స్వార్ధప్రియులు, ధనాపేక్షులు, బింకము లాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహలు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించు వారు... క్రీస్తు యేసు నందు సద్భక్తితో బ్రతుకు నుద్దేశించు వారందరు హింస పొందుదురు, అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరచుచు, తాము మోసపోవుచూ అంతకంతకు చెడిపోవుదురు" (II తిమోతి 3:1-4, 12-13, ఎన్ఐవి).

ఈ ఆఖరి దినాలలో మనమందరము ఈ భయంకర పరిస్థితిలో ఉన్నాము. ఈ అధర్మ పాపపు సమయంలో ఇదే మనము ఎదుర్కొనేది. మనము అపాయకరమైన కాలములో ఉన్నామని, బైబిలు చెప్తుంది. మనము లైంగిక వక్ర బుద్ధి దినాలలో జీవిస్తున్నాము. సినిమాలు భయంకరంగా ఉండి, కామము, పిశాచాలు, హత్యలతో నింపబడి ఉంటున్నాయి. ప్రజలు హాలోవీన్ మరియు దయ్యాలు మరియు మరణంలను ప్రేమించడంలో ఏమాత్రం ఆశ్చర్యపోనవసరం లేడు. యవ్వనస్థులు గబగబా వెళ్లి మరిజువానాలాంటి పరివసింప చేసే మత్తు పదార్ధాల కొరకు వెళ్తున్నారు, కనుక గుడులు ఖాళీగా ఉంటున్నాయి. ప్రతీ ఆదివారము గుడికి వెళ్తే మిమ్ములను చూసి నవ్వడంలో ఆశ్చర్యము లేదు. మీరు పవిత్రంగా జీవించి ప్రార్ధించి బైబిలు చదివితే వారు మీ గురించి అసహజంగా ఆలోచిస్తారు. అందుకే బైబిలు చెప్తుంది, "అంత్యదినాలలో అపాయకరమైన కాలములు వచ్చెను" (II తిమోతి 3:1).

ఈ పాపానికి, తికమకకు, చావుకు కారణమేంటి? మన రాజకీయ నాయకులు ఎందుకు దుష్టులుగా ఉన్నారు? ఎందుకు గుంపులు వీధులలో కూడుకొని పోలీసులను కాల్చి భవనాలను తగల బెట్టుతున్నారు? ముస్లీముల ఉగ్రవాదుల హత్యలకు బాంబులు కారణాలేమిటి? మీ తరము వారు మన సంఘాలను విడిచి ఎందుకు స్వార్ధ పూరిత పాప భూ ఇష్టత జీవితాలు జీవిస్తున్నారు? జవాబు మన పాఠ్య భాగములో ఇవ్వబడింది,

"అయితే కడవరి దినములలో కొందరు, అబద్ధికుల వేషధారణ వలన [కడవరి దినములలో], మోసపరచు ఆత్మల యందును, దయ్యముల [దయ్యముల] బోధయందును లక్ష్యముంచి; విశ్వసభ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు; ఆ అబద్ధికుల వాతవేయబడిన మనస్సాక్షి గలవారై యుందురు" (I తిమోతి 4:1-2).

పరిశుద్ధాత్మ దీని గూర్చి "తేటగా" చెప్తున్నాడు. దాని అర్ధము దేవుడు దీని గూర్చి చాలా తేటగా చెప్తున్నాడు. ఈ ప్రాముఖ్య సత్యాన్ని మీరు తెలుసుకోవాలని ఆయన కోరుచున్నారు. దెయ్యాలు నిజంగా ఉన్నాయని మీరు ఎరగాలని దేవుడు సాఫీగా తేటగా చెప్తున్నాడు. వేధించే [మోసపుచ్చే] దెయ్యాలున్నాయని దేవుడు చెప్తున్నాడు. దెయ్యాలు అబద్ధ బోధల వైపు నడిపిస్తాయి, "దెయ్యము సిద్ధాంతాలు." ఈ అబద్ధపు బోధలు వేషధారులైన బోధకుల ద్వారా వస్తాయి. వారు మీ పాఠశాలలో లేక కళాశాలలో ఉపాధ్యాయులు కావచ్చు. పరిణామం అబద్ధం వారు బోధిస్తారు. మీరు జంతువని చెప్తారు. దేవుడు లేదని బోధిస్తారు. మంచిచెడు లేవని బోధిస్తారు. బైబిలు నిండా తప్పులున్నాయని వారు బోధిస్తారు. చాలామంది తల్లిదండ్రులు కూడ ఈ అబద్ధాలే చెప్తారు! మన పట్టణాలు నేరపూరితమయ్యాయి. ఏది నమ్మాలో మీకు అర్ధం కాదు.

ఈ దెయ్యపు ప్రజలు ఇలా ఎందుకు చేస్తారంటే వారి మనస్సాక్షి "వేడి ఇనుముతో వాత పెట్టబడింది." అంటే వారి మనస్సాక్షి కాల్చబడి నల్లగా మారింది. వారి మనస్సాక్షి పూర్తిగా దెయ్యాలచే దారుణంగా కాల్చబడ్డాయి. మంచి చెడులకు తేడా తెలియనంత వరకు వారి మనస్సాక్షులు కాల్చబడి వాత వేయబడ్డాయి. చాలామంది హృదయాలు మనస్సులు పూర్తిగా దెయ్యాల ఆధీనంలో ఉన్నాయి.

మీ మనస్సాక్షిని నాశనము చేయడమే ఈ దయ్యాల ఉద్దేశము. మిమ్ములను నియంత్రిస్తాయి. మీ మనస్సాక్షిని వాతపెట్టి మిమ్ములను అదుపులో ఉంచుతాయి.

దేవుడు మానవుని సృజించినప్పుడు అతనికి మనస్సాక్షినిచ్చాడు. మానవునిలో "జీవాత్మ" ఊదాడు. హెబ్రీయ పదము "నిషామా." నిషామా జంతువులకు లేని రెండు విషయాలను మనిషికి ఇచ్చింది – మొదటిది, దేవుని తెలుసుకొనే శక్తి, రెండవది, మంచి చెడులు తెలుసుకొనే శక్తి.

మీరు డిస్నీ సినిమా "పినాచ్చియా" చూసారు? పినాచ్చియా చెక్క బొమ్మ. అది నిజమైన అబ్బాయిగా ఆవాలనుకుంటుంది. బొమ్మగా తనకు మనస్సాక్షి లేదు. మనస్సాక్షి బదులు, ఒక చిన్న పరికరము అమర్చారు అది అతనికి తప్పు ఒప్పులను గూర్చి చెప్పేది. ఆ పరికరము లేనప్పుడు అది చాలా కష్టాలలో పడేది. అతడు నిజమైన అబ్బాయిగా మారినప్పుడు అతనికి మార్గదర్శకం చేయవలసిన అవసరం లేదు. అది నిజమైన అబ్బాయి అయినప్పుడు తప్పు ఒప్పులను తెలిపే నిజ మనస్సాక్షి అతడు పొందుకున్నాడు.

మొదటి మానవుడు, ఆదాముకు సరిగ్గా వ్యతిరేకమైంది. ఆదాము పాపమూ చేసినప్పుడు నిజమైన మానవుని బదులు సాతాను కీలు బొమ్మ అయ్యాడు. సాతాను అతని మనస్సాక్షిని నాశనము చేసింది అతడు సాతాను చేతిలో కీలు బొమ్మ అయిపోయాడు. ఆదాము పాపమూ చేసినప్పుడు సరిగ్గా పనిచేయకుండా అతని మనస్సాక్షి వాత పెట్టబడింది. పాపాన్ని గూర్చి దేవుడు అడిగినప్పుడు అతడు కుంటిసాకులు చెప్పాడు. పాపపు ఒప్పుకోలు బదులు, దేవుని నుండి దాగుకొన ప్రయత్నించాడు. దేవుడు తనను కనుగొన్నప్పుడు, దేవునికి తన పాపాన్ని ఒప్పుకునే బదులు కుంటిసాకులు చెప్పాడు. అతని పెద్ద కుమారుడు కయీను నాశనము చేయబడిన తన తండ్రి మనస్సాక్షిని స్వాస్థ్యంగా పొందాడు. తన సహోదరుని చంపినప్పుడు, అతనికి పాపపు ఒప్పుకోలు లేదు. పాపాన్ని ఒప్పుకునే బదులు అతడు కుంటి సాకులు చెప్పాడు. అతని పాపాన్ని ఒప్పుకునే బదులు అతడు బాగా భయంకరుడయిపోయాడు. సాతాను అతని మనస్సాక్షిని వేడి ఇనుముతో వాత పెట్టింది. "అంతట కయీను దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోయి" నోడు ప్రాంతములో జీవించెను, దాని అర్ధము "తిరుగులాడుట." పాప పశ్చత్తాపము అవసరము లేదననుకున్నాడు. అతడు దేవునిపై కోపంగా ఉంటాడు. అతడు దేశ దిమ్మరియై, లోకమంతా తిరుగుచూ చనిపోయి నరకానికి పోయాడు. సాతాను అతని శోధించింది. తన సహోదరుని చంపి పోయాడు. వేడి ఇనుముతో అతని మనస్సాక్షికి వాత పెట్టింది – రక్షింపబడడానికి చాలా ఆలస్యమైంది. సాతాను మీ మనస్సాక్షికి వాత పెడితే మీరు రక్షింపబడడానికి చాలా ఆలస్యమయిపోతుంది. మీకు నేరారోపణ ఉండదు. మీ మనస్సాక్షి చచ్చిపోయింది. ఆయన రక్తము ద్వారా కడగబడడానికి మీరు యేసు నొద్దకు రారు. జీవితమంతా తిరుగులాడుచు చివరకు చనిపోయి నిత్యత్వములో నరకానికి వెళ్ళిపోతారు. ఈ ఉదయాన్న ఇక్కడ ఉన్న మీ అందరికి అలా జరుగుతుంది మీ మనస్సాక్షికి వాతపడే వరకు. మీరు పాపమూ చేస్తూ ఉంటే పాపపు ఒప్పుకోలు లేకపోతె. క్రీస్తు నొద్దకు రానంత వరకు సిలువపై ఆయన కార్చిన రక్తంలో కడగబడనంత వరకు. తన పాపమును గూర్చి నేరారోపణ లేనివాడు రక్షింపబడనేరడు. అతడు దేవునిచే విడిచి పెట్టబడతాడు. అతడు క్షమింపరాని పాపమూ చేసాడు. అతడు కయీను వలే దెయ్యానికి బానిస అయిపోయాడు.

మీ మనస్సాక్షి దెయ్యముచే వాత పెట్టబడ కూడదని నేను మిమ్ములను హెచ్చరిస్తున్నాను. నిరంతరమూ మీ మనస్సాక్షి వాతపెట్ట బడక మునుపే పాపమూ నుండి వైదొలగి యేసు వైపు తిరగండి.

మీరు అవిటి మనస్సాక్షితో జన్మించారు. మీరు ఆదాము నుండి, కయీను నుండి ఉద్భవించారు. బాలునిగానే మీ మనస్సాక్షి వాత పెట్టబడింది. మీ తల్లిదండ్రులతో అబద్ధము చెప్పినప్పుడల్లా, దానిని ఇంకా పాడు చేస్తున్నారు. దొంగిలించినప్పుడల్లా, ఇంకా పాడు చేస్తున్నారు. పాఠశాలలో మోసము చేసినప్పుడల్లా, దానిని ఇంకా పాడు చేస్తున్నారు. అశ్లీల చిత్రాలు చూచి లైంగిక తలంపులతో మిమ్మును ఉద్రేక పరచుకొన్నప్పుడు అది ఇంకా మొండి తీరిపోతుంది. చివరకు వీటిని బుద్ధి పూర్వకంగా చేస్తారు – పెద్ద పెద్ద పాపలతో మీ మనస్సాక్షిని పాడు చేసుకుంటారు. ఎవరికీ తెలియని పాపలు. మీ తల్లిని అవమానపరిచేవి. మీ మనస్సాక్షి ఎక్కువగా పాడై పోతుంది, చివరకు మీరనుకొని విధంగా మీరు పాపలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు అవి చేస్తుంటారు ఆనందిస్తారు – మిమ్ములను అవి ఏ మాత్రమూ బాధ పెట్టావు. మీ పాపాలు మీకు తెలుసు. నేను చెప్పనవసరం లేదు. వాటిని గూర్చి మీరు చింతపడడం లేదు. పాపిగా ఉండడాన్ని ప్రేమిస్తున్నారు.

అందుకే మీలో కొందరు గుడికి రావడం అసహ్యించుకుంటారు. మీ పాపాలను గూర్చి బోధిస్తున్నందుకు. మీ పాపాలను గూర్చి బోధిస్తున్నందుకు అసహ్యించుకుంటారు. నేను బాగా లేక గట్టిగా బోధించ లేనప్పుడు మీలో కొందరు ఆనందంగా ఉన్నారు. నా బదులు జాన్ కాగన్ నోవాసాంగ్ బోధిస్తునందుకు మీరు సంతోషంగా ఉన్నారు. నాకంటే వారు నయమనుకుంటారు. కానీ వారు మీ పాపాలను గూర్చి నాకంటే గట్టిగా బోధిస్తున్నారు. మీలో కొందరనుకుంటున్నారు గుడికి వదిలేయడం ద్వారా బోధ నుండి తప్పించుకోవచ్చునని! మీరెవరో నాకు తెలుసు. హృదయ మంతటిలో నన్ను ద్వేషిస్తున్నారు! నేను పోతే బాగుండు అనుకుంటున్నారు. నోవా జాన్ లు కూడ పోవాలని కోరుతున్నారు. మీ మనస్సాక్షి బండ దేరిపోయింది గుడి వదిలేయాలని ప్రణాళిక చేస్తున్నారు. దెయ్యము తన గుప్పెటలో గట్టిగా పెట్టుకోండి. వేడి ఇనుముతో మీ మనస్సాక్షిని వాత పెట్టాడు. మీరు ఇప్పటికే యేసు వైపు తిరిగి రక్షింపబడవలసింది. కానీ ఇప్పుడు మీలో కొందరు యేసును కూడ ద్వేషిస్తున్నారు! యేసు నామమును వినాలంటే మీకు అసహ్యంగా ఉంది!

ఓ, అంతగా ఆయనను ఎలా ద్వేషించగలరు? ఎవరు మిమ్మును ప్రేమించనంతగా ఆయన మిమ్మును ప్రేమిస్తున్నారు! యేసు పరలోకపు మహిమను విడిచి పెట్టి దిగివచ్చి మీ కొరకు శ్రమపడ్డాడు. మీ పాపమూ ఆయన పాప రహిత ఆత్మపై పడింది. మిమ్ములను రక్షించడానికి గెత్సమనేలో ఆయన చెమట రక్తము వలే మారింది. ఆయన మౌనంగా నిలబడ్డాడు వారు ఆయనను కోరుతున్నపుడూ ఆయన గడ్డమును లాగి ఆయన ముఖంపై ఉమ్మివేసినప్పుడు. ఏ ఒక్కరు కూడ అలా అంత ఎక్కువగా మిమ్ములను ప్రేమించరు శ్రమ పడరు మిమ్మును రక్షించడానికి స్వస్థ పరచడానికి నూతన జీవాన్ని ఇవ్వడానికి. యేసు మిమ్మును ప్రేమిస్తున్నాడు. ఆయన మిమ్మును తప్పిస్తాడు. ఆయన మీ భయాలను తొలగించి ఆత్మలను స్వస్థ పరుస్తాడు. మీ దరిద్ర, నలిగినా మనస్సాక్షిని ఆయన పునరుద్ధరిస్తాడు. అందుకే మీ నిమిత్తము ఆయన సిలువపై మరణించాడు. వారు ఆయన కళ్ళకు చేతులకు పెద్ద మేకులు కొట్టారు. మండుటెండలో ఆయన సిలువపై వ్రేలాడాడు – ఆయన నాలుక ఎండిపోయే వారికు అది ఆయన నోటిలోని అంగటికి అంటుకుంది.

యేసు మిమ్ములను ద్వేషించడు. అయన మిమ్ములను ఎలా ద్వేషిస్తాడు? ఆయన మిమ్మును ప్రేమిస్తున్నాడు కాబట్టే ఆయన ఈలోకానికి వచ్చాడు. ఆయన మిమ్మును ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన సిలువపై చెప్పనా శక్యము కానీ భయంకర మరణాన్ని పొందాడు. యేసు ఎప్పుడు మిమ్మును పేమించాడు. యేసు ఇప్పుడు మిమ్మును ప్రేమిస్తున్నాడు.

జాన్ కాగన్ దానికి వ్యతిరేకమైంది నా సాక్ష్యము. కానీ వాస్తవానికి ఒకటే. జాన్ తన పాపాలలో గర్విస్తూ ఇతరులను బాధించుటలో సంతోషించే వాడు. నేను పాపాలలో గర్వించలేదు ఇతరులను బాధింప ప్రయత్నింప లేదు. జాన్ దేవుని వ్యతిరేకించే వారితో కలిసే వాడు – ఇంకొక మాట్లల్లో, నశించు సంఘ పిల్లలు. నేను సంఘ పిల్లలను అయిష్ట పడి వారికి దూరంగా ఉండేవాడిని. కొన్ని వారాలు జాన్ పాపపు ఒప్పుకోలు పొందుకున్నాడు. నేను ఏడూ సంవత్సరాలుగా పాపపు ఒప్పుకోలు క్రింద ఉన్నాను. జాన్ చెడ్డ బాలునిగా ఉండదలుచుకున్నాడు. నేను మంచి బాలునిగా ఉండ దలచుకొన్నాను. ఈ విషయంలో మా సాక్ష్యాలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి.

కానీ రెండు విధాలుగా మేము సరిగ్గా ఒకలాగే ఉన్నాము. మేమిద్దరమూ రక్షింపబడాలని ప్రయత్నిస్తున్నాము కానీ అలా జరగలేదు. జాన్ చెప్పాడు, "నేను క్రీస్తుకు ఇచ్చుకోలేక పోయాను, క్రైస్తవునిగా అవడానికి నిర్ణయించుకోలేకపోయాను, అది నన్ను నిరీక్షణ లేనివానిగా చేసింది." నాకు అలాగే అనిపించింది. జాన్ కొన్ని వారాలు పాపపు ఒప్పుకోలు క్రింద ఉన్నాడు. నేను ఏడూ సంవత్సరాలు పాపపు ఒప్పుకోలు క్రింద ఉన్నాను. జాన్ చెప్పాడు దేవుడు తనను క్రీస్తు నొద్దకు ఆకర్షించాడు, "ఎందుకంటే నాకు నేనుగా యేసు నొద్దకు నేను రాలేక పోయే వాడిని." అదే నాకు కూడ, జరిగింది కూడ. జాన్ చెడ్డవానిగా ఉండ ప్రయత్నించాడు. నేను మంచివానిగా ఉండ ప్రయత్నించాను. మేమిద్దరం కూడ క్రీస్తును విశ్వసించకుండా మమ్మును మేము విశ్వసించుకున్నాము.

నేను మంచివానిగా ఉండ ప్రయత్నించాను. మంచి బాలునిగా ఉండడానికి నేనెంత ప్రయత్నించానో దేవునికి తెలుసు. పొగ త్రాగడం మానేసాను. ప్రతి ఆదివారము ఉదయము గుడికి వెళ్లాను. ప్రతి ఆదివారము రాత్రి గుడికి వెళ్ళాను. సంఘ కాపరినవడానికి సులభ జీవితాన్ని వదులుకున్నాను. 17 సంవత్సరాలకు బోధింప సమర్పించుకున్నాను. 19 సంవత్సరాలకే బాప్టిస్టు బోధకునిగా అనుమతి లభించింది. తరువాత కొన్ని నెలలకు చైనీయ సంఘములో మిస్సేనరీగా వెళ్లాను. నేను మంచి బాలుడనని అందరు అనుకున్నారు. కానీ నన్ను గూర్చిన సత్యము వారికి తెలియదు. నా హృదయము ఎంత చెడ్డదో వారికి తెలియదు. లూకా 18 లో యేసు మాట్లాడిన పరిశయ్యని లాంటి వాడనని వారికి తెలియదు – మంచిగా ఉండడం ద్వారా రక్షింపబడ ప్రయత్నించాడు. చైనీయ బాలునిలా ఉన్నాను. నా మనస్సాక్షి నాతో చెప్తూ ఉంది నేను హృదయంలో పాపినని. యేసును ప్రేమించలేని అసహ్య పాపిని. ఒక ఉదయము యేసు నా దగ్గరకు వచ్చాడు ఆయన నన్ను ప్రేమించాడని తెలుసు. మునుపు అది నాకు తెలియలేదు. ఇతర సంఘ బాలుర కంటే నేను మంచివాడు అనుకున్నాను – కానీ నేను వారికంటే బహు చెడ్డవాడిని. నాకు ఒక మతముంది, కానీ నేను యేసును ఎరుగను. అప్పుడు ఆయన నా దగ్గరకు వచ్చాడు. నాకు నేనుగా ఆయన దగ్గరకు వచ్చేవాడిని కాదు. నేను మంచి వాడననుకున్నాను, అది అబద్దమని నా మనస్సాక్షి చెప్తుంది. అప్పుడు యేసు నా దగ్గరకు వచ్చాడు. నన్ను రక్షింపమని అడగలేదు. కానీ ఆయనే రక్షించాడు. ఆయన దిగివచ్చి నన్ను చేర్చుకున్నాడు. ఆయన ప్రశస్త రక్తములో నన్ను కడిగాడు.

ఒకరుడిగారు, "పాస్టర్ గారు, యేసు రక్తమును గూర్చి ఎప్పుడు ఎందుకు మాట్లాడతారు?" అది చాలా సులువు. నాకు నేను చేసుకోలేనిది ఆయన రక్తము నా కొరకు చేసింది. ఆయన నన్ను ఎంతగానో ప్రేమించి ఆయన స్వరక్తంలో నా పాపపు ఆత్మను కడిగేసాడు.

యేసు మిమ్మును కూడ ప్రేమిస్తున్నాడు. ఆయన మీ దగ్గరకు వస్తాడు. యేసును విశ్వసించే నీ పాపమూ, నీ మనస్సాక్షి మీ సందేశాలు మీ శోధనలు ఆయన ప్రశస్త రక్తములో హిమము కంటే తేటగా కడగబడతాయి – ఆయన మిమ్మును ప్రేమిస్తున్నాడు కాబట్టి!

నన్ను ఎవరు ప్రేమించలేదు. నేను వెలివేయబడిన వాడను. రెండేళ్లకు నా తండ్రి విడిచిపెట్టాడు. పన్నెండేళ్లకు నా తల్లితో జీవించలేకపోయాను. నన్ను ఇష్టపడని ప్రజలతో నేను జీవించాను. ఎవ్వరు నన్ను ఇష్టపడలేదు. అది నన్ను పరిషయ్యనీలా చేసింది. అందరికంటే మంచివాడను! నేను క్రైస్తవుడనగలను అనుకున్నాను!

అలా చెయ్యలేకపోయాను! చాలా ప్రయత్నించాను! చెయ్యలేక పోయాను. నశించి పోయాను – మతంలో నశించిపోయాను! కానీ యేసు నన్ను ప్రేమించాడు. ఆయన నన్ను ప్రేమించినట్టు అకాస్ట్మాట్టుగా గ్రహించాను. ఆయన నా దగ్గరకు వచ్చి తన రక్తముతో నా ఆత్మను రక్షించాడు. ఆయన నాలాంటి వేషదారుని రక్షిస్తే, ఈ ఉదయాన ఎవరినైనా రక్షింపగలడు. ఆయన మిమ్మును ప్రేమిస్తున్నాడు. ఆయన మీ పాపాన్ని కడిగేస్తాడు – మీ హృదయ పాపాలు, జీవిత పాపాలు. ఆయన మిమ్మును ప్రేమిస్తున్నాడు. ఆయన మీ దగ్గరకు వస్తాడు. ఆయన పరిశుద్ధ రక్తములో మిమ్ములను శుద్ధి చేస్తాడు. ఆయన మిమ్మును ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఆమెన్.

రక్షకుడు చెప్పడం విన్నాను, "నీ శక్తి చాలా చిన్నది;
     బలహీన బిడ్డవు, లేచి ప్రార్ధించు, నీ దంతానాలో కనుగొను."
యేసు అంతా చెల్లించాడు, నేను ఆయనకు పూర్తిగా రుణస్తుడను;
     పాపపు మరకపోయింది, ఆయన హిమము కంటే తెల్లగా కడిగాడు.

ప్రభు, ఇప్పుడు నిజంగా నీ శక్తిని నిన్ను మాత్రమే నేను కనుగొన్నాను,
     కుష్ఠు రోగిని శుద్ధి చేస్తుంది కఠిన హృదయాన్ని కరిగించింది.
యేసు అంతా చెల్లించాడు, నేను ఆయనకు పూర్తిగా రుణస్తుడను;
     పాపపు మరకపోయింది, ఆయన హిమము కంటే తెల్లగా కడిగాడు.

నాలో ఏ మాత్రమూ మంచి లేదు మీ కృపను పొందడానికి,
     కల్వరి గొర్రె పిల్ల రక్తములో నా వస్త్రాలు తెల్లగా కడుగుకొంటాను.
యేసు అంతా చెల్లించాడు, నేను ఆయనకు పూర్తిగా రుణస్తుడను;
     పాపపు మరక పోయింది, ఆయన హిమము కంటే తెల్లగా కడిగాడు.
("యేసు అంతా చెల్లించాడు" ఎల్వినా యం. హాల్ చే, 1820-1889).
(“Jesus Paid It All” by Elvina M. Hall, 1820-1889).

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు బైబిలు పఠనము యారోన్ యాన్సీ: II తిమోతి 3:1-8.
ప్రసంగమునకు ముందు పాట నోవాసాంగ్ గారిచే:
"యేసు అంతా చెల్లించాడు" (ఎల్వినా యం. హాల్ చే, 1820-1889).
“Jesus Paid It All” (by Elvina M. Hall, 1820-1889).