Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




ప్రసంగమునకు ముందు పాటలు, డాక్టర్ హైమర్స్ గారు నడిపించారు:
"నా దృష్టి అంతటినీ నింపు" (ఆవిస్ బర్ట్ సన్ క్రిస్టియాన్ చే, 1895-1985)
"నన్ను శోధించు, ఓ దేవా" (కీర్తనలు 139:23-24).

సాతాను మరియు ఉజ్జీవము

SATAN AND REVIVAL
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
గురువారము సాయంకాలము, సెప్టెంబర్ 15, 2016
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Thursday Evening, September 15, 2016


దయచేసి నిలబడి స్కోఫీల్ద్ పఠన బైబిలులో 1255 పేజి చూడండి. అది ఎఫేస్సీయులకు 6:11 మరియు 12.

"మీరు అపవాది కుతంత్రములను ఎదిరించుటకు శక్తి మంతులగునట్లు, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించు కొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాదులతోను, అకాశమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము" (ఎఫెస్సీయులకు 6:11-12).

కూర్చోండి.

నిజ క్రైస్తవ్యానికి సాతాను దురాత్మల సమూహాలు విరోధులని ఈ వచనాలు చూపిస్తున్నాయి. కొత్త అమెరికను ప్రామాణిక బైబిలు 12 వచనాన్ని ఇలా అనువదిస్తుంది,

"మన పోరాటము శరీరముతో రక్తముతో కాదు, గాని పరిపాలకులు, శక్తులు, ఈ అంధకారమునకు సంబంధించిన లోకపు ["పరిపాలకులు," అంగర్] పరలోకపు స్థలములో, దురాత్మల సమూహముతోను పోరాడుచున్నాము" (ఎఫెస్సీయులకు 6:12, ఎన్ఏఎస్ బి).

డాక్టర్ మెర్రిల్ ఎఫ్. అంగర్ అన్నాడు, "దురాత్మ సమూహములకు ఆసక్తి కరమైన నామము... ‘ఈ లోకపు అంధకార పరిపాలకులు’...ఈ దుష్ట పరిపాలించే ఆత్మలు" (Biblical Demonology, Kregel Publications, 1994, p. 196). డాక్టర్ చార్లెస్ రైరీ దానియేలు 10:13 పై ఈ వ్యాఖ్యానము ఇచ్చాడు, "పెర్షియా రాజ్యపు రాజు... అసాధారణ సృష్టి అతడు దేవుని పధకాన్ని వ్యతిరేకించమని పెర్షియా పరిపాలకులకు నిర్దేశించాడు. దుష్ట దూతలు [దయ్యపు ‘ఈలోకపు శక్తులు’] రాజ్యాల వ్యవహారాలూ చూసేవి... మంచి చెడ్డ దూతల మధ్య పోరాటము రాజ్యాల నియంత్రణ విషయములో కొనసాగుతుంది" (Ryrie Study Bible; note on Daniel 10:13).

పరిపాలించే దయ్యము అమెరికా పాశ్చాత్య ప్రపంచముపై అధికారము తీసుకుందనే విషయంలో నేను ఒప్పింపబడ్డాను. దానియేలు 10:20 స్కోఫీల్ద్ గమనికపై చెప్తుంది, "దయ్యములు సాతాను లోక పధ్ధతిని గూర్చి పట్టింపు కలిగియున్నాయి." ఈ గమనిక "పెర్షియా రాజ్యపు రాజుకు" సంబంధించినది. ఈ "రాజు" పెర్షియన్ రాజ్యాన్ని నియంత్రించే ప్రాముఖ్య దయ్యము. ఈనాడు "పాశ్చాత్యపు రాజు" అమెరికాను అనుబంధ దేశాలను నియంత్రిస్తూ ఉన్నాడు. అమెరికాను పడమర దేశాలను అదుపు చేస్తున్న ముఖ్య దెయ్యమునకు మన నాగరికత పూర్తిగా భౌతికంగా మార్చడానికి శక్తి ఇవ్వబడింది. భౌతికతను పరిపాలించే దయ్యము ఉజ్జీవమును, ప్రార్ధనలను, ఆటంక పరచి ప్రజలను బానిసలుగా చేస్తుంది. ఈ పాలించే దయ్యము మన ప్రజలకు ఏమి చేస్తుంది? దయ్యాలను గూర్చి చెప్తూ, డాక్టర్ ల్లాయిడ్ జోన్స్ మనతో అన్నాడు ఈ దయ్యపు శక్తి ఏపని చేస్తుందో చెప్పాడు. మన ప్రజల మనసులకు దయ్యపు శక్తి గ్రుడ్డి తనము కలిగించిందని అతడు చెప్పాడు. అతడన్నాడు, ‘ఆత్మీయతను గూర్చిన పూర్తి [అభిప్రాయలు] పోయింది. దేవునిలో విశ్వాసము కూడ క్రమంగా పోయింది… దేవుని మతము రక్షణలను గూర్చిన నమ్మకము [పోయింది] మర్చిపోబడింది" (Revival, Crossway Books, 1992, p. 13). ఇది "పడమర రాజు" అతని క్రింద ఉన్న దయ్యముల కారణంగా ఇది సంభవించింది.

ఇతర దేశాల విషయంలో ఇది వాస్తవము కాదు. మూడవ లోకములో కొన్ని దేశాలున్నాయి "భౌతికత" అనే గొప్ప దయ్యము అమెరికా పడమర దేశాలపై ఉపయోగించే శక్తి కంటే తక్కువ శక్తి వాడతాయి. చైనాలో, ఆఫ్రికా, ఇండోచైనాలో, ముస్లీము దేశములలో కూడ – లక్షల కొలది యవనస్తులు మార్చబడ్డారు. లక్షల మంది నిజ క్రైస్తువులవుతున్నారు. కాని అమెరికా మరియు పడమరలో, లక్షల కొలదీ యవనస్తులు సంఘాలను విడిచి పెడుతున్నారు. అమెరికా పడమటి దేశాలలో కొద్దిమంది యవనస్తులు నిజ క్రైస్తవులవుతున్నారు. మన సంఘాలు శక్తిహీనంగా ఉన్నాయి. మన ప్రార్ధనా కూటాలు కనబడుట లేదు. మన యవనస్తులలో దేవుని పట్ల తపన లేదు. మనకు చెప్పబడింది 25 సంవత్సరాలకు 88% మంది సంఘాలు వదిలేస్తున్నారు, "తిరిగి రారు," ఇది పాల్ స్టర్ జార్జి బర్నా ప్రకారము. వారు అంతర్జాలములో గంటల తరబడి, అశ్లీల చిత్రాలు చూస్తున్నారు. మరి జువానా ఎక్స్ టసీ లాంటి మత్తు పదార్ధాలు తీసుకుంటున్నారు. ప్రార్ధన అంటే నవ్వుతున్నారు, కాని గంటల తరబడి సామాజిక మధ్యమాలపై ఆకర్షితులవుతున్నారు. వాళ్ళు చేతులలో ఎప్పుడు ఖరీదైన ఫోన్లు ఉంటున్నాయి. ఈ పరికరాల అదుపులో వారుంటున్నారు. ప్రతీక్షణం అదే చూస్తుంటారు. యెషయా ప్రవక్త రోజులలో ఇశ్రాయేలీయులు విగ్రహాలు చూచినట్లుగా వాటిని చూస్తున్నారు. మన యవనస్తులను అదుపు చేయడానికి సామాజిక మధ్యమము సాతానుచే వాడబడే విగ్రహము. అమెరికా పడమరలో మన సంఘాలు ఎందుకు లోకరిత్యా బలహీనంగా ఉంటున్నాయో చాలామంది మన సంఘ కాపరులు గ్రహించరు! డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ చెప్పినట్టు దుష్ట శక్తులతో పనిచేస్తున్నారని, వారు గ్రహించరు!

హోషేయ రోజుల్లో ఎంత ఘోరమంటే దేవుడు చెప్పాడు, "[ఇశ్రాయేలు] విగ్రహాలతో కలిసి కొనెను: వానిని అలాగుననే ఉండనిమ్ము" (హోషేయ 4:17). దేవుడు దేశాన్ని వదిలేసాడు. దేవునిచే పరిత్యజింప బడ్డారు. దెయ్యాల శక్తి క్రింద, వారు ఒంటరిగా విడిచిపెట్టబడ్డారు. శక్తిగల దయ్యాల క్రింద మన యవనస్తులు అశ్లీల చిత్రాలకు, మారిజువానా, సామాజిక మాధ్యమాలని బానిసలుగా మారుచున్నారు! దెయ్యాల వలన యవనస్తులు నశించిపోతున్నారు. దయ్యాలు యవనస్తులను భౌతికతకు, భవిష్యత్తు ప్రణాళికకు బానిసలూ చేసి ఆత్మీయ క్రైస్తవులు అవకుండా చేస్తున్నాయి, ఇతరులను వివాహేతర లైంగిక సంబంధాలకు అశ్లీల చిత్రాలకు బానిసలుగా చేస్తున్నాయి. "[ఇశ్రాయేలు] విగ్రహాలతో కలిసి కొనెను: వానిని అలాగే ఉండనిమ్ము" (హోషేయ 4:17). మీలో కొందరు ఈరాత్రి దయ్యపు శక్తులకు బానిసలయ్యారు.

మీరు మాగుడికి వస్తారు. కాని దేవుడు ఇక్కడ లేడు. దేవుడు ఇక్కడ లేడని అనిపిస్తుంది! ప్రవక్త హోషేయ అన్నాడు, వారు వెళ్తారు... "వారు యెహోవాను వెదక బోవుదురు; కాని ఆయన వారికి తన్ను మరుగు చేసుకొనెను; కనుక వారికి కనబడ కుండును" (హోషేయ 5:6). దేవుడు లేడు! మన సంఘాలను వదిలేసాడు. మన సంఘాన్ని వదిలేసాడు. ఆయన లేదు. ఆయన ఉనికిలో లేడు కాబట్టి లేకుండా లేడు. ఆయన లేడు ఎందుకంటే ఆయన ఉనికిలో ఉన్నాడు కాబట్టి! దేవుడు ఉన్నాడు – అందుకే మనలను విడిచి పెట్టాడు. ఆయన పరిశుద్ధుడు. మన పాపము వలన కోపముగా ఉన్నాడు. అందుకే నిన్ను ఒంటరిగా విడిచి పెట్టాడు. ఇంటిలో ఒంటరిగా. నీ ప్రార్ధనలో ఒంటరిగా. గుడిలో ఒంటరిగా. ఒంటిరిగా దేవుని సన్నిధి లేకుండా. నాస్వానుభవములో తెలుసు నాకు ఎంత భయంకరమనిపించిందో యవనస్తినిగా కకాసియన్ గుడికి వచ్చాను దేవుడు అక్కడ లేడు. నేను ఒంటరిగా ఉన్నాను – ఆ గుడిలో. ఒంటరిగా, గ్రీన్ డే ఒక ప్రసిద్ధ పాటలో ఇలా అన్నాడు,

కొన్నిసార్లు ఒకరు నన్ను కనుగొంటారనుకుంటాను
అప్పటి వరకు నేను ఒంటరిగా నడుస్తాను.
   (గ్రీన్ డే, "చెదిరిన కళలు," 2004).
      (Green Day, “Boulevard of Broken Dreams,” 2004).

మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలుసు. నేను మీలా యవనస్తుడుగా ఉన్నప్పుడు, యువకునిగా లాస్ ఎంజిలాస్ వీధులలో, ఒంటరిగా నడిచాను! చైనీయ బాప్టిస్టు సంఘములో చేరక మునుపు, కాకాసియాన్ గుడిలో కూడ ఒంటరిగా ఉన్నాను. ఓ, అవును! ఎలా అనిపిస్తుందో నాకు గుర్తుంది! అది నాకు అసహ్యము! బౌతికత అనే దయ్యమును నేను అసహ్యించుకుంటాను, అది మీ ఇంటిలో ప్రేమను నశింప చేస్తుంది, మీ సంతోషాన్ని మీ హృదయాన్ని నశింప చేసి మిమ్మలను ఒంటరిగా చేస్తుంది. మన సంఘాన్ని చల్లగా కలివిడితనము లేనిదిగా చేసే దయ్యమంటే నాకు అసహ్యము. దేవుడు మీ కొరకు ఉంచిన మంచి వాటిని దొంగిలించిన అమెరికా పాపము నాకు అసహ్యము! మీకు అన్ని వాగ్ధానము చేసిన అమెరికా అధ్యక్ష అభ్యర్ధి వెంట మీలో కొందరు పరుగెత్తారు. కాని అతడు మీకేమి మిగల్చలేదు! అలాగే చాలామంది బోధకులు కూడ. వారు అన్ని వాగ్ధానము చేసారు. కాని నిజంగా మీకు ఇవ్వడానికి ఏమి లేదు! మీరు బంధించే దయ్యము ప్రభావము క్రింద ఉన్నారు! ఆ సాతాను ప్రభావాల వలన మీరు ఒంటరిగా ఉన్నారు! దేవుడు అమెరికా పడమరను విడిచి వెళ్ళిపోయాడు! మన పాపాన్ని బట్టి దేవుడు మనలను ఒంటరిగా విడిచి పెట్టాడు! మీ పాపాన్ని బట్టి దేవుడు మిమ్ములను ఒంటరిగా విడిచి పెట్టాడు.

మన సంఘములో దేవుడు ఉండాలి! ఆయన సన్నిధి మనతో ఉండాలి! మీ యవ్వనులకు మేము సహాయము చెయ్యలేము. మేము ఏమి సహాయ పడలేము. దేవుడు దిగి రాకుండా మీకు సహాయ పడలేము. మన పాపాలను బట్టి పశ్చాత్తాప పడాలి! ప్రార్ధించేటప్పుడు ఏడవాలి. ఎడ్వకపోతే మన ప్రార్ధనలు కేవలము పదాలే! చైనాలో ఏడుస్తారు దేవుడు దిగి వస్తాడు! దేవుడు లేకుండా యవనులైన మీకు ఏమి ఇవ్వలేము! ఒక పార్టీ ఇవ్వవచ్చు. దేవుని ఇవ్వలేము! ఒక బాస్కెట్ బాల్ ఆటను ఇవ్వగలము. దేవుని ఇవ్వలేము! దేవుని ఇవ్వలేకపోతే ఏమి ఇవ్వలేము. మీ ఒంటరితనానికి మందులేదు! మీ హృదయ ఉల్లాసానికి ఏమిలేదు! మీ ఆత్మల రక్షణకు ఏమిలేదు! మీరు వస్తారు, మా దగ్గర ఏమి ఉండదు. పార్టీ తప్ప ఏమి ఉండదు. పుట్టినరోజు కేకు తప్ప ఏమి ఉండదు! పాత కార్టూను తప్ప ఏమి ఉండదు. మీ ముందు ఏమి ఉంచలేము, సహాయ పడలేము, నరకాగ్ని నుండి రక్షింపలేము! దేవుడు లేకుండా ఏమి ఇవ్వలేము! ఒకటి రెండు పాటలు, ప్రార్ధన పలుకులు అంతే! మృత ప్రసంగము మాత్రమే. మనము నిర్జీవ స్థితిలో ఉన్నాము. నిస్సహాయంగా ఉన్నాము. మీకు కావలసినది ఏమి లేదు. దేవుడు లేకుండా ఏమి లేదు!

రెండు శనివారపు రాత్రుల ముందు, కంఠత వాక్యాలు చదవమని చెప్పాను. మీలో చాలామంది కంఠస్తం చేసారు.

"గగనము చీల్చుకొని, నీవు దిగి వచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక, నీ శత్రువులకు నీ నామమును తెలియ చేయుటకై, అగ్ని గచ్చ పొదలను కాల్చు రీతిగాను, అగ్ని నీళ్ళను పొంగ చేయు రీతిగాను, నీవు దిగి వచ్చెదవు గాక! జరుగునని మేమనుకొని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్య జనులు నీ సన్నిధిని కలవర పడుదురు గాక, నీవు దిగి వచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక" (యెషయా 64:1-3).

మీలో కొందరు ఇవి వల్లిస్తూ ఉండగా దేవుడు దిగి వచ్చునట్టు అనిపించింది. నాలో నేను కదిలింపబడ్డాను. దేవుని శక్తితో నా హృదయము కదిలింప బడింది. ఒక ఆహ్వానము ఇచ్చాను. ప్రసంగము చేయలేదు. ప్రార్ధన లేదు. కేవలము ఈ మాటలు మాత్రమే,

"గగనము చీల్చుకొని, నీవు దిగి వచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక, నీ శత్రువులకు నీ నామమును తెలియ చేయుటకై, అగ్ని గచ్చ పొదలను కాల్చు రీతిగాను, అగ్ని నీళ్ళను పొంగ చేయు రీతిగాను, నీవు దిగి వచ్చెదవు గాక! జరుగునని మేమనుకొని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్య జనులు నీ సన్నిధిని కలవర పడుదురు గాక, నీవు దిగి వచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక" (యెషయా 64:1-3).

మరియు శ్రీమతి________కన్నీటితో ప్రార్ధించారు! జాసన్________మూలుగుతూ మోర పెట్టాడు. రెబెక్కా________ఏడుస్తూ వేదిక దగ్గరకు వచ్చింది. ఒకరన్నారు, "అబ్రహాము సంగతేంటి________?" ఆయన వస్తున్నాడు. ఇటు అటు చూచి వెళ్ళిపోయాడు. ముగ్గురు అతని వెంట పరుగెత్తారు. దెయ్యాలు బయటకి వచ్చాయి. కన్నీరు కారాయి. విజ్ఞాపనలు జరిగాయి. చివరకు అతనికి సమాధానము వచ్చింది. రెండు రోజుల తరువాత అతడు రక్షింప బడ్డాడు! తరువాత క్రిస్టనా________వచ్చింది. జాన్ కాగన్ కొన్ని మాటలు ఆవెంతో చెప్పాడు తరువాత వేరే వ్యక్తీతో మాట్లాడాడు. ఆమె తనకు తానే యేసు నొద్దకు వచ్చింది – డాక్టర్ కాగన్ ఆమె సాక్ష్యము విని అన్నాడు, "ఆమె మరణము నుండి జీవానికి వచ్చింది." సిలువ వేయబడిన రక్షకుని రక్తము ద్వారా ఆమె రక్షింపబడింది. అబ్రహాము కొరకు ప్రార్ధించిన తరువాత________, జాక్ జ్ఞాన్ మరియు నేను పాట పాడాము. మూడు రోజులలో 13 మార్పిడిలు జరిగాయి, ఆగష్టు 18, 27 మరియు 28 తేదిలలో. ఒక ప్రసంగీకునితో చెప్తే అతనన్నాడు, "మీరు కొంత ఉజ్జీవము అనుభవిస్తున్నారు." నిజమే, అది మార్పులతో ఆరంభమయింది. క్రైస్తవులు వారి పాపాలు ఒప్పుకోవడంతో సాధారణంగా అది ప్రారంభమవుతుంది. కాని 4 క్రైస్తవులు మాత్రమే వారి పాపాలు ఒప్పుకొని ఉజ్జీవింపబడ్డారు. నలుగురు క్రైస్తవులు మాత్రమే! మిగిలిన వారు చల్లగా నిర్జీవంగా ఉన్నారు.

Q_____ ______ఆరడుగుల ఎత్తు. ఆఫ్రికన్ అమెరికన్ ముఖము కోపంగా ఉంటుంది. మోకాళ్ళ మీదపడి ఏడ్చి కన్నీరు కార్చాడు. అతడు గత ఆదివారము రాత్రి రక్షింపబడ్డాడు.

ఆ కూటాలలో నన్ను కలవర పరిచినవి, ఇంకా కలవర పెట్టేవి రెండు విషయాలు నేను గమనించాను. మొదటిది మార్పిడి నొందిన 13 మంది విషయంలో మీరు సంతోషించడం లేదు. వారిని డాక్టర్ కాగన్ రెండు మూడు సార్లు గమనించారు. వారు రక్షింపబడ్డారని చెప్పాడు. మీరు సంతోషించలేదు. డాక్టర్ కాగన్ వారు రక్షింపబడ్డారని నిర్ధారించిన తరువాత కూడ మీరు సంతోషించలేదు. జాక్ నేను మాత్రమే పాట పాడాము! స్తుతి కేకలు లేవు. దేవునికి స్తుతి లేదు. కేవలము మితమైన సంతోషము. కేవలము చిన్న, నులివెచ్చని ఆనందగానము. ఉజ్జీవమును బట్టి ఆనంద స్వరము లేదు. క్రైస్తవులైన మీరు ఈ చిన్న కూటములలో జరిగిన 13 మార్పులను బట్టి సంతోషించలేదు! నవ్వులేదు! హల్లెలూయా లేదు! ఉజ్జీవాల్లో కనబడే సంతోష గానము లేదు. గతంలోని ఉజ్జీవాల్లో మనము గమనించే కృతజ్ఞత కనబడలేదు! ఆనంద గానము లేదు. రక్షింపబడిన వారి పేర్లు చదివాక నులి వెచ్చని ఆనందము మాత్రమే వ్యక్తము చేసారు. నేననుకున్నాను మీరు లేచి గొప్ప శబ్దముతో "దేవునికి స్తోత్రము" చెప్తారని అనుకున్నాను. కాని, లేదు. చిన్న వ్యక్తత మాత్రమే – ఇంత గొప్ప విజయము విషయంలో! ఇది నన్ను కలవర పరిచింది.

నన్ను కలవర పరచిన రెండవ విషయం నలుగురు పాతకాలపు క్రైస్తవులు మాత్రమే ఈ కూటాలలో ఉజ్జీవింపబడ్డారు. కేవలము నలుగురు మాత్రమే! ఇతర క్రైస్తవులు చల్లగా నిర్జీవంగా ఉండిపోయారు! ఒక వ్యక్తి అన్నాడు, "నేను ఉజ్జీవింపబడ్డాను. కాని శ్రీమతి_______లా కాదు." నా ప్రియ సహోదరీ సహోదరులారా, మీరు శ్రీమతి_______లా అనకపోతే, మీరు ఉజ్జీవింపబడనట్టే! మీరు దేవునిచే తాకబడలేదు మీరు శ్రీమతి_______లా అవకపోతే!

నేను జాన్ కాగన్ కు అడిగాను రక్షింపబడిన వారితో ఎందుకు తక్కువ ఉజ్జీవము వచ్చిందని. ఆయనన్నాడు మీరు అపనమ్మకుండా ఉన్నారని. అతడు సరియే అన్నాడు. గొప్ప ఆత్మా కదలిక వచ్చి 13 మంది మార్పు నొందారు, కాని మీరు ముభావంగా ఉన్నారు. మీరు నమ్మలేదు. దేవుడు గొప్పగా కదిలాడు, గాని మీరు నిజంగా నమ్మలేదు. మీరు ఎందుకు నిజంగా నమ్మలేదు? ఎందుకో చెప్తాను. ఎందుకంటే మీలో ఏదో తప్పు ఉంది! ఏదో గొప్ప తప్పు మీలో ఉంది! ఆనంద భాష్పాలు లేవు. ఆనంద స్పందన లేదు. మీ హృదయము సరిగా లేదు కనుక మీకు ఆనందము లేదు. మీరు జాగ్రత్తగా పరీక్షించలేదు కాబట్టి మీ హృదయము సరిగా లేదు. సాతానుచే మోసగించబడ్డారు. మీరు గ్రహించడం లేదు. "దెయ్యపు మోసాలతో" మీరు మోస పోయారని కూడ మీరు గ్రహించలేదు. దెయ్యము మిమ్మును మోసగించిందని కూడ మీరు గ్రహించలేదు! ఓ, మీరు ఎలా "ప్రభువులో బలంగా, ఆయన శక్తితో గొప్పగా అవుతారు?" ఎలా మీరు దెయ్యానికి "వ్యతిరేకంగా పోరాడుతారు" అది మిమ్ములను మోసగించిందని తెలుసుకోకపోతే? (సిఎఫ్ ఎఫెస్సేయులకు 6:10-11). డాక్టర్ మెర్రిల్ ఎఫ్. అంగర్ డాలస్ వేదాంత కళాశాలకు చెందిన వ్యక్తి అన్నాడు, "[క్రైస్తవులు] ఆత్మీయంగా ఉండి విజయవంతంగా జీవించేవారు, సాతాను [దెయ్యాల] ద్వారా పోరాటాన్ని ఎదుర్కొంటారు అవి నిజ క్రైస్తవ్యాన్ని క్రైస్తవ ఉపయోగతను వ్యతిరేకిస్తాయి" (Biblical Demonology, Kregel, 1994, p. 101).

సహోదరీ సహోదరులారా, మన హృదయాలను పరీక్షించుకోవాలి. మన పాపాలు ఒప్పుకోవాలి, "సాతాను మనపై ఆధిపత్యము తీసుకోకూడదు: సాతాను కుతంత్రములను మనము ఎరుగని వారముకాము" (II కోరిందీయులకు 2:11). డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు, "ఈనాటి సంఘపు [దుస్థితి] ముఖ్య కారణము సాతాను మరువబడినది... సంఘము నిర్వీర్యము అయింది; దానికి సందిగ్ధత తెలియడం లేదు" (Christian Warfare, Banner of Truth, 1976, pp. 292, 106). సంఘర్షణను గూర్చి తెలియనే తెలియదు. మీ పాపము మీ హృదయాన్ని నిర్వీర్య పరచిందని గ్రహింపు లేదు. ఒప్పుకోనని పాపము దేవుని నుండి మిమ్ములను వేరు పరచిందని తెలియలేదు!

మనం ఎలా సాతానును జయించగలము? మొదట మనం దేవుని మాన హృదయ పాపములను చూపించమని అడగాలి. మనం యదార్ధంగా ప్రార్ధించాలి,

"దేవా, నన్ను పరిశోధించి, నా హృదయమును తెలుసుకొనుము: నన్ను పరీక్షించి, నా ఆలోచనలను తెలిసికొనుము: నీ కాయసకరమైన మార్గము నాయందున్న దేమో చూడుము నిత్య మార్గమున నన్ను నడిపించుము"(కీర్తనలు 139:23, 24).

మీరు సంఘములో చేస్తున్న పనితో విశ్రమించవద్దు. మీలో చాలామంది గుడిలో కష్టపడి పని చేస్తున్నారు. మీరు కష్ట పడతారు, కాని మీ హృదయాలలో పాపాలున్నాయి. ప్రార్ధనలతో కూడ విశ్రమించవద్దు. మీరు రోజు ప్రార్ధించవచ్చు అయినను మీ హృదయాలలో దుష్టత్వము ఉండవచ్చు. మనం సంఘములో ఒకతని నేను అడిగాను, "బాగున్నావా?" ఆయనన్నాడు, "బాగున్నాను." బాగున్నానని అనుకున్నాడు. కాని నేను అతని నాశనము చేస్తున్న బలమైన పాపాన్ని చూపించాను. అతనన్నాడు, "అది పాపమని నేను అనుకోలేదు." మీ హృదయంలో కూడ అది నిజమేనా? మీ హృదయంలో పాపముందా అది పాపమని మీరెన్నడు తలంచలేదా?

ఇతరులు మన సంఘాన్ని చీలిక సమయంలో వదిలిపెట్టినప్పుడు మీరు నమ్మకస్తులుగా ఉన్నారు. దానితో విశ్రమించకండి! మీరు సంఘములో పట్టుదలగా ఉంటూ కూడ మీ హృదయంలో పాపము ఉంచుకోవచ్చు "మీరు ఊహించనిది." మీ పిల్లలు రక్షింపబడాలని మీలో కొందరు ప్రార్ధిస్తున్నారు. కానీ మీ ప్రార్ధనలకు జవాబు రావడం లేదు. మీ హృదయంలో ఏదో దాగిన పాపము ఉందేమో? మీరు అనుకోనని పాపము. కాని అది పాపమే, మీకది అనిపించేటట్టు నేను ప్రార్ధిస్తాను. మీ పాపము ఒప్పుకోకపోతే మీ పిల్లల కొరకు మీరు చేసే ప్రార్ధనలకు జవాబు దొరకదు. దేవుని వాక్యము చెప్తుంది, "నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల, ప్రభువు నా మనవి వినకపోవును" (కీర్తనలు 66:18). కేవలం శుద్ధమైన క్రైస్తవుల ప్రార్ధనలకు మాత్రమే సమాధానం ఇవ్వబడుతుంది. మీరు మీ సహోదరి లేదా సహోదరుడు రక్షింప బడాలని ప్రార్ధించారు. కాని మీ ప్రార్ధనలు సమాధానం ఇవ్వబడలేదు. మీరు "ప్రార్ధన" ద్వారా మీకు సమాధానం వస్తుంది అనుకుంటారు. కాని మీరు ఎప్పుడు కూడా "ప్రార్ధన ద్వారా" వాటిని పొందలేరు. "ఒకవేళ నా హృదయంలో దేవుని గూర్చి సేవించిన, దేవుడు నా మాట వినడు" (కీర్తనలు 66:18). కాని, మీరంటారు, "అది చిన్న పాపమే." దెయ్యము చెప్తుంది అది "చిన్నదని" – కాని మీరు చూడాలి మీ ప్రార్ధనలకు ఆటంకంగా ఉంటుంది. దేవునికి మీ హృదయ పాపములను ఒప్పుకోవాలి. మీరు వాటిని ఒప్పుకోవాలి లేనిచో ప్రభువు మీ ప్రార్ధన వినడు.

1904 లో వేల్స్ లోని ఉజ్జీవంలో యవన సువార్తికుడు ఈవన్ రోబర్ట్స్ బాగా ఉపయోగాబడ్డాడు. ఈవాన్ రోబర్ట్స్ అన్నాడు, ఉజ్జీవములో ఆత్మ రాకముందు, "సంఘములో అన్ని చెడు భావాలూ విడిచిపెట్టాలి – చెడుతనము [అసత్యము, మత్సరము], అసూయ, భావన [ఇతరులకు తీర్పు తీర్చుట], అపార్ధాలు [అవగాహన, గర్వము]. అపరాధములు [సంఘములో ఇతరులతో] [ఒప్పుకొని] క్షమింపబడే వరకు ప్రార్ధించవద్దు, కాని క్షమించలేమని మీకనిపిస్తుంది, [మోకాళ్ళని], క్షమించగలిగే ఆత్మలను గూర్చి ప్రార్ధించండి. మీరు పొందుకుంటారు" (Brian H. Edwards, Revival, Evangelical Press, 2004, p. 113)..."మామూలు సమయాల్లో క్రైస్తవులు వాటిని పట్టుకుంటారు...కాని నిజ ఉజ్జీవంలో రహస్య పాపములు బయట పడతాయి...క్రైస్తవుని మనసులలో, అన్ని ఒప్పుకునే వరకు మనశ్శాంతి ఉండదు" (Edwards, ibid., p. 114).

1969 మరియు 1970 లో చైనీయ బాప్టిస్టు సంఘములో క్రైస్తవుల మధ్య భయంకర పాపపు ఒప్పుకోలు వచ్చింది. అది నేను చూసాను. కొన్నిసార్లు పాపపు ఒప్పుకోలు విరిచేదిగా ఉంటుంది. ప్రజలు అదుపు లేకుండా ఏడ్చారు. కాని ఉజ్జీవము అనేది లేదు [క్రైస్తవులమధ్య] ఒప్పుకోలు విచారము లేకుండా. ఆవరణలో ఒక వైపు ఒకరు ఏడవడం మొదలు పెట్టారు. అప్పుడు ప్రతి ఒక్కరు ఏడుస్తున్నారు. గంటల తరబడి కూటము ఒప్పుకోలు, ఏడ్పు, ప్రార్ధన మృదువైన గానములతో జరిగింది. ఇతరులు ఏమనుకుంటారు అనేది ప్రతి ఒక్కరు మర్చిపోయారు. వారు దేవునితో ముఖాముఖిగా ఉన్నారు.

క్రైస్తవులు లోతైన, అసౌకర్యమైన తగ్గింపుతో కూడిన పాపపు ఒప్పుకోలు లేకుండా ఉజ్జీవము ఉండదు. దేవుడు మలుచుచున్న క్రైస్తవులతో మౌనముమైపోతుంది. నా చైనీయ సంఘ కాపరి, డాక్టర్ తిమోతి లిన్ కు, ఏమి చెయ్యాలో తెలుసు. అది జరిగేలా చేసాడు ఎందుకంటే చైనాలోని అనుభవముతో అతనికి తెలుసు దేవుడు తన ప్రజల మధ్య సంచారిస్తున్నాడని. నేనెప్పుడు అంత అద్బుతమైన కూటములు చూడలేదు. దేవుడు అలా మన సంఘములో చెయ్యాలని నా ప్రార్ధన. మనకు "ఉజ్జీవపు తాకిడి" కలిగింది నలుగురు క్రైస్తవులు హృదయ పాపాలను ఒప్పుకొనినప్పుడు. పరిశుద్ధాత్మ దిగి వచ్చింది 13 మంది నశించు వారు మారారు. కాని ఇతరులు కదిలింపబడలేదు. 13 మంది మారినప్పుడు నలుగురు క్రైస్తవులు ఉజ్జీవింపబడినప్పుడు, ఆలోచించండి ఏమి జరుగుతుందో ఒకవేళ 15 నుండి 20 మంది శ్రీమతి______లా హృదయ పాపాలు ఒప్పుకుంటే! ఈ రాత్రి మీ పాపాలు ఒప్పుకుంటారా? ఆనందము లేకుండా వెళ్తారా? ఒప్పుకోలు లేకుండా? కన్నీరు లేకుండా? ఉజ్జీవింపబడిన హృదయము లేకుండా? చల్లగా చచ్చిన వానివలే?

క్యూ డాంగ్ లీ అన్నాడు, "’39’ మందిలో నేనొకడిని. నా స్నేహితులు ఇతరులు గుడి చీలిక సమయంలో వెళ్ళిపోయినప్పుడు నేను గుడిలో ఉండిపోయాను. నేను రక్షింపబడ్డాను. డాక్టర్ హైమర్స్ నేను దిగజారిపోతున్నానని చెప్పినప్పుడు, నేననుకున్నాను, ‘ఏమి చెయ్యాలి ఇంకా? నేను మారే ఉన్నాను. ఇంకేమి కావాలి నాకు?’ యేసు పట్ల నా తొలిప్రేమను నేను కోల్పోయినట్లు నేను గ్రహించలేదు. డాక్టర్ హైమర్స్ ప్రకటన గ్రంధము 2:4 మరియు 5 చెప్పారు, ‘మొదటి నీకూడిన ప్రేమను వదిలితివి అని ఒక తప్ప, నీ మీద మోప వలసి యున్నది. నీవు నీ స్థితిలో నుండి పడితివో, అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు నొందుము" (ప్రకటన 2:4, 5). అప్పుడు నేను గ్రహించాను మొదట రక్షింప బడినట్టు నేనులేనని. మనం ‘ఉన్నపాటున’ ‘అద్భుత కృపలాంటి’ పాటలు పాడేటప్పుడు ఆనంద భాష్పాలు కారేవి. ఇప్పుడు నేను ప్రేమ ఆనందము లేకుండా పదాలు పాడుతున్నాను. ఇప్పుడు నా ప్రార్ధనలు గట్టిగా ఉన్నాయి, కాని మాటలు మాత్రమే, మంచి మాటలే, కాని వెలితి ప్రార్ధనలు. క్రమముతో వాదనతో ప్రార్ధిస్తున్నాను, కాని నిజంగా దేవుని నుండి జవాబు ఎదురు చూస్తూ కాదు. నా గట్టి ప్రార్ధనలు పదాలు మాత్రమే. అవి వెలితి ప్రార్ధనలు. నాకు తెలుసు నా పాపాలు ఒప్పుకోవాలని, నా హృదయ పాపాలు. బైబిలు చెప్పేది నాకు గుర్తుంది,

‘మన పాపములు మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి, సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును’ (I యోహాను 1:9).

నాకు గుర్తింది కీర్తనకారుడు ప్రార్ధించాడు, ‘రక్షణానందము తిరిగి నాకు మరల పుట్టించుము’ (కీర్తనలు 51:12). ఆయన చెప్పింది నాకు గుర్తుంది, ‘విరిగిన మనస్సే దేవుని కిష్టమైన బయలు దేవా: విరిగి నలిగిన మనస్సు, ఓ, దేవా, నీవు అలక్ష్యము చేయువు’ (కీర్తనలు 51:17)."

లీ గారు "39" మందిలో ఒకరు వారు దివాలా నుండి మన సంఘాన్ని కాపాడారు. ఆయన నమ్మకస్తుడైన పరిచారకుడు. ఆయన నేను బోధించేటప్పుడు నా వెనుక వేదికపై కూర్చునేవాడు. ఆయన మనకు మాదిరి. ఆయనన్నాడు, "ఇంకేమి కావాలి నాకు?" దేవుడు చూపించాడు హృదయ పాపాలు ఒప్పుకోవాలని. ముందుకు వచ్చి పాపాలు ఒప్పుకున్నాడు. గట్టిగా ఏడ్చాడు ముఖము కందిపోయింది. దేవుడు తనకు క్షమించి హృదయ ఆనందాన్ని పునరుద్ధరించాడు. ఇప్పుడు అతడు కన్నీటితో ఆనందముతో ప్రార్ధిస్తాడు. అతనన్నాడు, "మనవి కాలీ ప్రార్ధనలు. మనవి దొంగానవ్వురా, అబద్ధపు నవ్వులు, మనము సహవసములో కరచలనము చేసుకునేటప్పుడు. నిజమైన ప్రేమలేదు. అబద్ధపు నవ్వులు."

లీ గారు సంఘములో నాయకుడు. కాని మీ మొదటి ప్రేమను పోగొట్టుకుంటే ఎలా సంఘాన్ని నడిపించగలరు? కేవలము మన యవనస్తులను శూన్యమతములోనికి నడిపించగలరు. సంఘములో ప్రతి నాయకుడు తన పాపాలు ఒప్పుకోవాలి, లేనిచో నిరీక్షణ లేదు. నేను చెప్పాను, "మనలను దర్శించే వారు అనుకుంటారు మన సంఘము గొప్పదని. వారికి గ్రహింపు లేదు మనది నిజమైన ప్రేమ లేని అబద్ధపు మతమని. మన సంఘము త్వరలో ఇతర మృతమైన సువార్త సంఘముగా మారిపోవచ్చు మన నాయకులు సభ్యులు దేవుని అవసరత గ్రహించకపోతే, కన్నీటితో వారి పాపాలు ఒప్పుకొని, యేసు రక్తముతో పునరుద్దరింపబడితేనే తప్పు, యేసు మన హృదయాలను స్వస్థ పరచడానికి తన రక్తాన్ని కార్చాడు, పవిత్ర ప్రేమను ఇచ్చాడు మొదట్లో మనం రక్షింప బడినప్పుడు దానీని కలిగి ఉండే వారము. యేసు చెప్పాడు, "మీరు ఒకరి యెడల ఒకరు ప్రేమ కలిగి ఉండుడి, దీనిని బట్టి మీరు నా శిష్యుల్ని మనష్యులు తెలుసుకొందును" (యోహాను 13:35). సహోదరీ సహోదరులారా, మనలో చాలామంది, పెద్దవారు చిన్నవారు, పాపాలు ఒప్పుకోకపోతే మనకు నిజమైన ప్రేమ ఉండదు.

నేను ప్రార్ధిస్తున్నారు మీరు విని ఈరాత్రి మీ పాపాలు ఒప్పుకోవాలని. దయచేసి నిలబడి, "నన్ను శోధించు, ఓ దేవా" పాట పాడండి.

"నన్ను శోధించు, ఓ దేవా, నా హృదయము తెలుసుకో:
నన్ను ప్రయత్నించి నా ఆలోచనలు గ్రహించు:
నా హృదయాన్ని తెలుసుకో;
నన్ను ప్రయత్నించి నా ఆలోచనలు గ్రహించు;
నాకాయసకర మైన మార్గము నాయందున్న దేమో చూడుము,
నిత్య మార్గమున నన్ను నడిపించుము."
      (కీర్తనలు 139:23, 24).

ఇప్పుడు పాడండి, "నా దృష్టినంతటినీ నింపు, పాపము లేనిదిగా."

నా దృష్టి నంతటినీ నింపు, పాపము లేనిదిగా
   వెలుగు నాలో ప్రకాశింప నిమ్ము.
మీ ఆశీర్వదపు ముఖమును మాత్రమే చూడనిమ్ము,
   మీ అనంత కృపలో నా ఆత్మ ఆనందించుము.
నా దృష్టి నంతటినీ నింపు, దైవిక రక్షకా,
   నా ఆత్మ మీ మహిమతో ప్రకాశించే వరకు.
నా దృష్టి అంతటిని నింపు, అందరు చూచునట్లు
   మీ పరిశుద్ధ ఆకారము నాలో ప్రతి బింబింపనిమ్ము.
("నా దృష్టినంతటినీ నింపు" ఆవిస్ బర్జ్ సన్ క్రిస్టియాన్ సేన్, 1895-1985).
(“Fill All My Vision” by Avis Burgeson Christiansen, 1895-1985).

దయచేసి ముందుకు వచ్చి బలిపీఠం దగ్గర పాపాలు ఒప్పుకోవడానికి భయపడవద్దు. దయచేసి రావడానికి భయపడవద్దు. దయచేసి అలా చెయ్యండి మన సంఘము తిరిగి జీవించునట్లుగా.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు పాట బెంజమన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్ గారిచే:
"మీ పనిని ఉజ్జీవింపజేయి" (ఆల్బర్ట్ మిడ్ లేన్ చే, 1825-1909).
“Revive Thy Work” (by Albert Midlane, 1825-1909).