Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
క్రమము మరియు ప్రార్ధనలో వాదము – మొదటి భాగము

ORDER AND ARGUMENT IN PRAYER – PART I
(Telugu)

జాన్ సామ్యూల్ కాగన్ గారిచే
by Mr. John Samuel Cagan

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్
నందు ప్రభువు దినము సాయంకాలము, సెప్టెంబర్ 2, 2016
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Friday Evening, September 2, 2016

"ఆయన నివాస స్థానము నొద్ద నేను చేరినట్లుగా! ఆయనను ఎక్కడ కనుగొందునో ఆదినాకు తెలియ చేయబడును గాక! ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యెమును విశదపరచెదను, వాదములతో నానోరు నింపు కొనెదను" (యోబు 23:3-4).


ఈభాగము సి. హెచ్. స్పర్జన్ గారి "క్రమము మరియు ప్రార్ధనలో వాదము" అనే ప్రసంగముపై ఆధారపడి ఉంది. స్పర్జన్ తలంపులు సామాన్య ఆంగ్లములోనికి కుదింపబడ్డాయి. దానికి తోడు, డాక్టర్ హైమర్స్ డాక్టర్ కాగన్ ల సహాయంతో, కొన్ని కొన్ని తలంపులు బైబిలు వచనాలు జతచేసాను.

ఇప్పుడు చదువబడిన వచనంలో, యోబు దేవుని కనుగొని ఆయనకు ప్రార్ధించాలనుకున్నాడు. మామూలుగా దేవునితో మాట్లాడ తలచుకోలేదు. యోబు తలంపులలో ఎక్కువ తీవ్రత ఉంది. ఇలా ప్రార్ధిద్దామను కుంటున్నాడు: "ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యెమును విశద పరచెదను, వాదములతో నా నోరు నింపు కొనెదను" (యోబు 23:4). ఈ వచనము నుండి నిజమైన ప్రార్ధనను గూర్చి – తీవ్రమైన ప్రార్ధనను గూర్చి రెండు విషయాలు నేర్చుకోవచ్చు.

I. మొదటిది, తీవ్రమైన ప్రార్ధన క్రమముగా ఉంటుంది – పద్దతిలో ఉంటుంది.

యోబు అన్నాడు, "ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యెమును విశద పరచెను" (యోబు 23:4).

దేని గూర్చి ప్రార్ధించబోవుచున్నారో ఆలోచించండి. మీకు నిజంగా ఏమి కావాలో ఆలోచించుకోండి. దానిపైనే దృష్టి సారించండి. అది మీకు ప్రాముఖ్యమైనదయి ఉండాలి. జాన్ ఆర్. రైస్ కు ఒక ప్రార్ధన విన్నపము ఇవ్వబడినప్పుడు, దాని గూర్చి ప్రార్ధించడానికి అతడు అంగీకరించలేదు. దానికి బదులు అతనికి చెప్పేవాడు అతడు భారము కలుగునట్లుగా దేవుని అడుగుతానని. లేనిచో ఆ మానవుని నిజంగా కోరుకోడు అది నిజమైన ప్రార్ధన అనబడదు. మీకు నిజంగా ఏమి కావాలి? ఎందుకు కావాలో తేల్చుకోండి. అది ఎందుకు జరగలేదో అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ శక్తికి బయట అది ఎందుకుందో ఆలోచించండి. దానిని గూర్చి మీకు తపన లేకపోతే, తపన కొరకు దేవుని అడగండి. మామూలు ప్రార్ధనలు ఒక క్రమములో ఉండవు. మామూలు ప్రార్ధనలు హృదయ పూర్వకంగా ఉండవు. మీరు దేనినైనా సగం మనస్సుతో సమీపిస్తే, మీకు సిద్ధంగా లేనట్లు. ప్రార్ధించే ముందు మిమ్మును మీరు సిద్ధ పరచుకోండి. ముఖ్యంగా ఇంటిలో గాని, గుడిలో గాని ప్రార్ధనను నడిపించేటప్పుడు, మెరుగుదనముపై ఆధారపడొద్దు. ఉన్న పని విషయంలో హృదయములో సమ్మతి ఉండాలి. పరిస్థితిపై దృష్టి పెట్టాలి. మీకు ఎదో కావాలి. తప్పకుండా ఎదో కావాలి. కానీ దాని పొందుకోలేరు. మీశక్తికి మించినది. మీ అదుపులో లేనిది. కాబట్టి యేసు నామములో విశ్వదేవుని సమీపించబోతున్నారు. దేవుని ఒప్పింప ప్రయత్నంతో దేవుని సమీపిస్తారు. మీ అవసరాలను బట్టి దేవుడు మీకు అగుగ్రహించేలా దేవుని ఒప్పించడం. అది తీవ్ర పరిస్థితి. ఆలోచనలులేకుండా సమీపించలేరు. దేవుని గూర్చి ప్రార్ధిస్తున్నారో ఆలోచించండి.

మీ ప్రార్ధనను చక్కదిద్దండి. కొంతమంది అనుకుంటారు అవే మానవులను మళ్ళీ మళ్ళీ వల్లించడమని. కొంతమంది అనుకుంటారు ప్రార్ధించినప్పుడల్లా అవే విషయాలు చెప్పడమని. ఎవరైనా ప్రతిసారి ఒకదానిని గూర్చే ప్రార్ధిస్తే, అతడు తన ప్రార్ధనను గూర్చి ఆలోచించలేదని అర్ధము. అతడు దేవునికి చేయు తనమనవి విషయంలో ఒక్క క్షణం కూడ పెట్టి ఆలోచించలేదని అర్ధము. మతపర పదాలు పలకడం ప్రార్ధన అని కొంతమంది అనుకుంటారు. కానీ పదాల ఎన్నిక యదార్ధ వాదనమునకు అవకాశము ఇవ్వదు. నేను మీనుండి కొంతడబ్బు తీసుకోవాలనుకుంటే, నేను నా వాదన బలవంత పెట్టేదిగా ఉండడానికి పెద్ద పదాలపై మాత్రమే ఆధారపడను. నేను అకస్మాత్తుగా నా పదజాలం మారిస్తే మీరు ఒప్పింప బడదు, నేనడిగే విషయములో అర్ధము ఉండదు. మతపర పదాలు మంచి తలంపు స్థానాన్ని మార్చలేవు.

కొంతమంది దేవునికి అరుస్తూ ప్రార్థిస్తున్నారు. కానీ ఒకని స్వరము వాదనకు ప్రత్యామ్నాయము కాదు. అది ఒక దాని నుండి ఇంకోదానికి భయంకరంగా దారి తీస్తుంది. ఒక ప్రత్యేక మనవి మీకు ప్రాముఖ్యమైతే, మీరు ఒక మనవి నుండి వేరే మనవికి వెళ్లడం మొదటి దానిని గూర్చే వాదన చేయకుండా ఉండడంలో అర్ధము లేదు. కొంతమంది సామాన్య పదాలతో ప్రార్ధిస్తారు: "ప్రియమైన దేవా, సంఘాన్ని దీవించు, నశించు వారిని రక్షించు, నన్ను నా కుటుంబాన్ని దీవించు." దీనిలో సరియైన తలంపు లేదు. యదార్థత లేని స్థితి రుజువు అవుతుంది. అది పటిష్టమైన క్రమబద్దమైన ప్రార్ధన కాదు.

మీరు ఒక న్యాయమూర్తితో మాట్లాడడానికి కోర్టుకు వెళ్ళేటప్పుడు, ఏమి చెప్పబోతున్నారో ముందే ఆలోచిస్తారు. మీరు అడగబోయే దానిని గూర్చి జాగ్రత్తగా ఆలోచిస్తారు. మీకు కావలసినది న్యాయమూర్తి మీకిచ్చేటట్టు ఎలా ఒప్పించాలో బాగా ఆలోచిస్తారు. నేను వాదిస్తాను కూడ ఆ సంభాషణ కొరకు మీ సిద్ధపాటు మనవి తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. మీరు మీపని స్థలములో మీ అధికారి నుండి ఏదైనా అడగబోతుంటే, మీరు ఏమి చెప్పాలో ఎలా చెప్పాలో ముందే గానే ఆలోచించుకుంటారు. దేవునికి ప్రార్ధించేటప్పుడు అది చెయ్యండి. అస్పష్ట తలంపులతో దేవుని సమీపించవచ్చు. అసంపూర్ణ ఆలోచనలతో దేవుని సమీపించవద్దు. మీకు అన్వయించుకోండి.

పరిస్థితి అన్ని వైపులా ఆలోచించండి. ఆ పరిస్థితి నిన్ను నీ చుట్టూ ప్రక్కల వారిని ఎలా ప్రభావితం చేస్తుందో చూడండి. ఆ పరిస్థితి దేవుని మహిమను ఎలా ప్రభావితం చేస్తుంది? ఆపరిస్థితి దేవుని పరిచర్యను ఆయన రాజ్య అభివృద్ధిని ఎలా ప్రభావ పరుస్తుంది? ఆ మనవికి జవాబు రాకపోతే పరిమాణాలు ఏంటి? దేవుడు మీ మనవి అనుగ్రహిస్తే ఏమి జరుగుతుంది? ప్రతి పరిస్థితికి ఇవి వివిధ వైపుల. ఒక పనిలేక మనవి మీ అనుభవంతో మొదలవదు ముగియదు. ఈ మనవి ప్రాముఖ్యము. ఇది మీకు ప్రాముఖ్యము. మీ కుటుంభానికి, మీ సంఘానికి, మీ స్నేహితునికి, దేవునికి కూడ ఇది ప్రాముఖ్యము కావచ్చు. దేవుడు వింటున్నాడని గుర్తుంచుకోండి. ఒక మానవ అధికారి కంటే న్యాయమూర్తి కంటే దేవుడు చాలా ఉన్నతుడు గొప్పవాడు కూడ.

ప్రార్ధనలో ఎలాంటి వైఖరి మీరు కలిగియుండాలి? గుర్తుంచుకోండి మనము "ధూళి బూడిదే" (ఆదికాండము 18:27). దేవుని నుండి ఏదైనా అడగడానికి మనకు హక్కులేదు. కానీ యేసు క్రీస్తు ద్వారా మీరు "ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదుము" (హెబ్రీయులకు 4:16). క్రీస్తులో క్రీస్తు ద్వారా మీరు నేరుగా తండ్రి దగ్గరకు రావచ్చు. యేసు నామములో మీరు ప్రార్ధిస్తే, ఆయన తన సొంత కుమారుడు యేసు క్రీస్తుకు విన్నట్టుగానే మీ మాటలు కూడ వింటాడు. మీరు క్రీస్తును విశ్వసిస్తే, ఆయన ద్వారా మీరు దేవుని కుమారుడు కుమార్తె వలే వింటాడు. అది చిన్న తలంపు కాదు. యేసును బట్టి మీరు ప్రియులు అంగీకరింపబడిన వారు. దేవుడు మీ మానవులు వింటాడు!

మీరు ఏమి అడగబోతున్నారో ఆలోచించండి. ఏది కావాలో తేటగా ఉండాలి. యేసు మనకు ఇలా ప్రార్ధించాలని చెప్పాడు, "మా అనుదిన ఆహారము నేడు మీకు దయచేయుము" (మత్తయి 6:11). ప్రార్ధనను గూర్చి శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు యేసు ఈ ఉదాహరణ ఇచ్చాడు, "స్నేహితుడా, నాకు మూడు రొట్టెలిమ్ము" (లూకా 11:5).

మీరు దేని కొరకైనా ప్రార్ధించాలనుకుంటే, దానిగూర్చే ప్రార్ధించండి. అబ్రాహాము ప్రార్ధించాడు, "ఇస్మాయేలును నీ సన్నిధిని బ్రతుక అనుగ్రహించెను!" (ఆదికాండము 17:18). స్పర్జన్ అన్నాడు, "ఇస్మాయేలు అని చెప్పు, ‘ఇస్మాయేలు’అనుకుంటే."

ఎవరైనా మారాలని ప్రార్ధిస్తుంటే, అతని పేరుతో ప్రార్ధిచండి. ప్రార్ధనలో నడిపిస్తున్నప్పుడు, ఆవ్యక్తి పేరు మీ తలంపులలో దేవునికి చెప్తే సరిపోతుంది. మీరు మాట్లాడక పోయినా, మీరు దేవునితో సరిగ్గా వ్యక్తిము చేయవద్దు. ఎవరి గురించి ప్రార్ధిస్తున్నారో దేవుడు మీ హృదయపు మూలుగులు ఉచ్ఛరణలను వినగలడు. ఒకమనవి చేసేటప్పుడు, ప్రత్యేకంగా దానిని గూర్చే అడగాలి. "ఈ ఉద్యోగమూ వచ్చేటట్టు సహాయము చెయ్యండి." "నా రోగము స్వస్థ పరచబడి (లేక వేరే వ్యక్తి రోగము)." "పేర్లు ఫోను నంబర్లు సంపాదించునట్లు సహాయము చెయ్యండి." ఈ రాత్రి నేల కలవబోయే వారు వారి పేర్లు ఫోను నంబర్లు ఇచ్చునట్లు ప్రజల హృదయాలు మనసులు తెరవండి."

వాటిని గూర్చి ఆలోచించకుండా ప్రార్ధిస్తే, మీరు "మళ్ళీ మళ్ళీ అదే చెప్తూ" ప్రార్ధిస్తున్నారంతే. యేసు అన్నాడు, "మరియు మీరు ప్రార్ధన చేయునప్పుడు, అన్య జనుల వలే వ్యర్ధమైన మాటలు వంచించవద్దు: విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు" (మత్తయి 6:7). మీరు అలవాటుగా కొన్ని అంశాలను గూర్చి ఆలోచన లేకుండా, ప్రార్ధిస్తే – ఇంట్లో కానీ గుడిలోకాని – వ్యర్థముగా వల్లించినట్లే అవుతుంది. మీరు కేథలిక్ రోజరీలా బుద్ధిమంత్రము వల్లించినట్లు చేసిన వారవుతారు.

ప్రతి సంఘ ప్రార్ధన కూటములో మీరు లేచి ఆ విషయము చెప్పండి, జవాబు కొరకు ఎదురు చూడవద్దు. మీరు ప్రార్ధించబోయే దాని గూర్చి ఆలోచించండి. మీరు దేవుని అడుగుతున్నారు – ఒక వ్యక్తి – ప్రత్యేకించి ఒకదానిని గూర్చి. కనుక దేవునితో మాట్లాడి మీకు ఏమి కావాలో ఆయనను అడగండి.

II. రెండవది, తీవ్ర ప్రార్ధన వాదములను వాడుతుంది – కారణాలు.

యెబూ అన్నాడు, "వాదములతో...నానోరు నింపు కొనెదను" (యోబు 23:4). "నేనడిగేది దేవుడు నాకెందుకివ్వాలో అనే విషయంలో కారణాలతో నా నోటిని నింపుకుంటాను." ఎలాంటి వాదములు – సమంజసమైనవి – ఉపయోగించాలి?

మొదటిగా, దేవుని గుణ లక్షణాలను గూర్చి మాట్లాడాలి – ఆయన ఎలాంటివాడో. అబ్రాహాము సోదోమోను నశింప చేయవద్దని దేవునికి ప్రార్ధించాడు. అతనన్నాడు,

"దుష్ఠులతో కూడ నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణములో [ఒకవేళ] ఏబదిమంది నీతిమంతులు ఉండిన యెడల వారిని నాశనము చేయుదువా: దానిలో ఉన్న ఏబది మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయవా? ఆ చొప్పున చేసి దుష్ఠులతో కూడ నీతిమంతులను చంపుట, నీకు దూరమగును కాక: నీతిమంతుని దుష్టునితో సమానంగా ఎంచుట, నీకు దూరమవు కాక: సర్వ లోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పెను?" (ఆదికాండము 18:23-25).

అబ్రాహాము దేవుని న్యాయము కొరకు బ్రతిమాలుచున్నాడు. అతనంటున్నాడు, "ఒక వేళా 50 మంది నీతిమంతులుంటే, వారిని దుష్ఠులతో కూడ నాశనము చేయుదువా?" అది సమంజసమా? "సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా?" వాస్తవానికి, అతడు ప్రార్ధిస్తూనే ఉన్నాడు అక్కడ 10 మంది నీతిమంతులున్నా దేవుడు ఆ పట్టణాన్ని నాశనము చేయకుండా ఉండడానికి అంగీకరించే వరకు. గమనించండి అబ్రాహాము నిలకడగా ఉన్నాడు. ఉగ్రత ఉన్నప్పటికినీ అబ్రాహాము ఒకదాని కొరకు అడగడానికి ధైర్యము ఉంది. పాపమున్నప్పటికినీ అబ్రాహాము కృప కొరకు అడగడానికి విశ్వసము కలిగిఉన్నాడు. దేవుని గుణగణాలలో అబ్రాహామునకు నమ్మకము ఉంది అందుకే వాదించాడు. అబ్రాహాము అగౌరవంగా లేడు. అబ్రాహాము దేవుని పట్ల ఎంతో గౌరవము కలిగియున్నాడు అందుకే దేవుని గుణశీలత నాణ్యతకు మొరపెట్టాడు. దేవుడు న్యాయస్థుడని అబ్రాహాము నమ్మకపోతే, అతడు మౌనముగా ఉండిపోయే వాడు. కానీ, దేవుడు నీతిమంతుడని అబ్రహాము ఎరుగును. కాబట్టి అబ్రహాము దేవునితో వాదన చేసాడు.

దేవుడు నేను కూడ అలాగే ఉన్నాడు. బైబిలు చెప్తుంది, "యెహోవానైనా నేను, మార్పు లేని వాడను" (మాలాకి 3:6). బైబిలు చెప్తుంది, "యేసు క్రీస్తు నిన్న, నేడు, నిరంతము ఏకరీతిగా ఉన్నాడు" (హెబ్రీయులకు 13:8). అప్పటిలానే దేవుడు ఇప్పుడు కూడ అలాగే ఉన్నాడు. మీరు దేవునికి ప్రార్ధించవచ్చు, ఆయన వింటాడు, అప్పటిలో ప్రజల మోర దేవుడు వినినట్టుగా. న్యాయస్థానంలో, న్యాయవాదులు ముందున్న వారికి చెప్పుకుంటారు. గత సంఘటన అదే పరిస్థితికి ఉదాహరణగా తీసుకోవచ్చు. మీరు బైబిలు చదువుతున్నప్పుడు లేక వింటున్నప్పుడు, మీరు చదివేది వినేది గుర్తుంచుకోండి. ఆలోచించండి దేవుడు గతంలో చేసింది నేడు కూడ చేయగలడు. దేవుడు మీ జీవితంలో చేసింది గమనించండి. దేవుడు భవిష్యత్తులో చేయబోయే దానికి సూచికగా పెట్టుకోండి. మీ చుట్టూ ఉన్న ప్రజలలోవారి జీవితాలలో దేవుడు చేసింది గుర్తుంచుకోండి. మెలకువగా ఉండి ప్రార్ధించమని యేసు తన శిష్యులతో చెప్పాడు. జవాబివ్వబడిన ప్రార్ధనలో దేవుని శక్తిని గూర్చిన విషయాలను అన్వయించుకోండి. దేవుని గుణశీలతతో ఎలా నిలకడగా ఉందో ఆలోచించండి. గతంలో దేవుడు చేసింది గుర్తు చేసుకోండి. దేవుడు ఎవరో అని గ్రహించుకోవాలి. బైబిలులో గొప్ప వ్యక్తులు ఎలా ప్రార్ధించారో అలాగే మీరు దేవునికి ప్రార్ధించండి.

రెండవది, మీరు దేవుని ఉనికిని మోర పెట్టవచ్చు. ఏలీయా బయలు ప్రవక్తలను ఎదిరించాడు. ఈ అబద్ధపు ప్రవక్తలు ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వలేదు. కానీ ఏలీయా తన అర్పణను అంగీకరించమని దేవునికి ప్రార్ధించాడు. ఏలీయా అన్నాడు,

"యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీలు దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై యున్నావనియు, నేను నీ సేవకుడనై యున్నాననియు, ఈ కార్యములన్నియు నీ సెలవు చేత చేసితిననియు ఈ దినమున కనుపరచుము. యెహోవా, నా ప్రార్ధన, ఆలకింపుము, యెహోవావైన నీవే దేవుడవై యున్నాడనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తీరుగ చేయుదువని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్ధన అంగీకరించుము" (I రాజులు 18:36-37).

ఏలియా ప్రార్ధించాడు, "మీరు నిజ దేవుడని మాకు కనుపరచుము." దేవుడు ఏలీయాకు జవాబిచ్చాడు. దేవుడు పరలోకము నుండి అగ్నిని పంపి ఏలియా అర్పణను దహించి వేసాడు.

కొన్ని సంవత్సరాల తరువాత, ఏలియా పరలోకమునకు కొనిపోబడినప్పుడు, తన శిష్యుడు ఎలీషా ప్రార్ధించాడు, "ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు?" (II రాజులు 2:14). "ఎక్కడున్నావు, దేవా?" దేవుడు తనను కనుపరచుకొన్నాడు ఎలీషాకు మొర్ధాను నదిని పాయలు చేయడం ద్వారా. దేవుడు తానూ వాస్తవమని చూపించుకున్నాడు.

మూడవది, దేవుని వాగ్దానములను గూర్చి మాట్లాడుట – ఎందుకంటే ఆయన వాక్యము విషయంలో ఆయన నమ్మదగిన వాడు. II సమూయేలు, 7వ అధ్యాయములో, దేవుడు సాతాను ప్రవక్త ద్వారా దావీదుకు వాగ్దానము చేస్తాడు కుమారుని అనుగ్రహిస్తానని, అతడు దేవుని ఆలయమును కడతాడని, యెరూషలేములో అతడు సింహాసనా శీనుడౌతాడని, ఇశ్రాయేలు ప్రజలు నిరంతరమూ నిలుచుదురు అని. దావీదు దేవునితో అన్నాడు,

"వారు నిత్యమూ నీకు ఇశ్రాయేలీయులను పేరు గల జనులై యుండునట్లుగా వారిని నిర్ధారణ చేసితివి: మరియు, యెహోవావైన నీవు, వారికి దేవుడవై యుంటివి. మరియు, ఓ దేవా యెహోవా, నీ దాసుడగు నన్ను గూర్చియు నా కుటుంబము గూర్చియు, మరియు సంఘం గూర్చి, నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలుచునట్లు దృఢపరచి, సైన్యముల కధిపతియగు యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడైయున్నాడను మహిమ కలుగునట్లును చెప్పెను. మరియు మీ నామము శాశ్వతంగా, ఇశ్రాయేలులో ఉండేటట్లు, దేవుడు చెప్పెను: మరియు నీ దాసుడనైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిర పరచబడునట్లు నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. అంతేకాక, ఓ దేవా, ఇశ్రాయేలు దేవుడు, అతని సేవకునికి, చెప్పాడు, నేను ఒక ఇల్లును నిర్మిస్తున్నాను: అందువలన దానిలో నీవు హృదయంతో ప్రార్ధన చేయుము. మరియు ఇప్పుడు, ఓ యెహోవా దేవా, ఇశ్రాయేలీయులు దేవా, నీ మాట సత్యము, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యమూ నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము: ఇప్పుడు సేవకుని ద్వారా నా ఇంటిని దీవించండి, అది ఇంతకుముందు లేనట్లుగా ఎల్లప్పుడూ ఉండేటట్లు చూడుము: యెహోవా, నా ప్రభువా, నీవు సెలవిచ్చియున్నావు: నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక" (II సమూయేలు 7:24-29).

ఆయన ఇచ్చిన వాగ్ధానాలన్నీ నెరవేర్చు అన్ని జరుగునట్లు చెయ్యాలని దావీదు దేవునికి ప్రార్ధించాడు. బైబిలు చెప్తుంది, "ప్రతి మనుష్యుడు, అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు" (రోమా 3:4). ఆధునిక ఆంగ్లములో మనం చెప్పవచ్చు, "ప్రతిఒక్కరు అబద్ధికుడయినప్పటికినీ, దేవుడు సత్యము." బైబిలు చెప్తుంది "దేవుడైన యెహోవా, తానే దేవుడనియు, తన్ను ప్రేమించి, తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొను వారికి తన నిబంధనను స్థిర పరచు వాడను అయి ఉన్నాడు" (ద్వితీయోపదేశ కాండము 7:9). దేవుడు తన వాగ్దానాలు నెరవేరుస్తాడు. ప్రార్ధనలో దేవుని వాగ్ధానాలను ఆయన దగ్గరకు తేవచ్చు. వచ్చే ప్రసంగములో ఈ అంశాన్ని కొనసాగిస్తాను.

క్రమము మరియు ప్రార్ధనలో వాదమునకు జాగ్రత్తతో కూడిన తలంపు సిద్ధపాటు అవసరము. నిజంగా దేవుని నుండి ఏమి కావాలో దానికి నిన్ను నీవు సిద్ధపరచుకో. జాగ్రత్తగా ఆలోచించి ఆ మనవి విషయంలో దేవునిపైననే ఆధారపడాలి. ఆ అవసరత దేవుడే ఇస్తాడని ఒప్పింపబడినప్పుడు, అది ఎందుకు జరగాలో మీ తలంపులను నిర్దేశించండి. ఆ మనవి ఎందుకు ప్రాముఖ్యము? ఆ సమయంలో ఆ మనవి ఎందుకు మీకనుగ్రహింపబడాలి? ఆ తలంపు మీలో అత్యవసరతను భారాన్ని మీపై ఉంచేటట్టు చెయ్యాలి. ఒక మనవి పొందుకోవాలనే ఆ కోరిక చాలా క్లిష్టము ఒక నిర్ణేత వాదము చేపట్టడానికి. ఒక బలమైన వాదము సిద్ధత లేని హృదయము నుండి రానేరాదు. విభిన్న మార్గాల ద్వారా మానవుని సమీపించండి. స్వరముపై అనవసరమైన వల్లింపులపై ఆధారపడి ప్రార్ధనలు ఆపేయండి. అనాలోచనగా మీ ప్రార్ధనలు మళ్ళీ మళ్ళీ చెప్పకండి. సర్వ సామాన్య ప్రార్ధనలు ఆపండి. ప్రార్ధనలో కచ్చితంగా ఉండండి. బైబిలులో దేవుడు చేసినవాటిని గుర్తు చేస్తూ మీ ప్రార్ధనలు కట్టాలి. మీ జీవితాలలో దేవుడు చేసిన వాటిని గుర్తుచేస్తూ మీ ప్రార్ధనలు కట్టండి. మళ్ళీ మళ్ళీ పదాలు వల్లించడం వలన దేవుడు స్పందిస్తాడు అనుకోకూడదు. కానీ, దాని బదులు ఒక క్రమంలో వాదనతో కూడిన ప్రార్థనలతో దేవుని సమీపించండి. దేవునితో కారణాలు చెప్పండి. దేవుని గుణగణాలలో మోర పెట్టండి. దేవుని ఉనికిని విన్న వించండి. దేవుని వాగ్దానాలకు విన్న వించండి. దేవుడు తన వాగ్దానాలు గౌరవిస్తాడు. దేవుడు మీ యదార్ధ క్రమబద్ధ వాదనలతో కూడిన ప్రార్ధన వింటాడు.

"ఆయన నివాస స్థానము నొద్ద నేను చేరినట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందురు! అది నాకు తెలియ చేయబడును గాక! ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యెమును విశదపరచెదను, వాదములతో నా నోరు నింపు కొనెదను" (యోబు 23:3-4).

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ద అవుట్ లైన్ ఆఫ్

క్రమము మరియు ప్రార్ధనలో వాదము – మొదటి భాగము

ORDER AND ARGUMENT IN PRAYER – PART I

జాన్ సామ్యూల్ కాగన్ గారిచే
by Mr. John Samuel Cagan

"ఆయన నివాస స్థానము నొద్ద నేను చేరినట్లుగా! ఆయనను ఎక్కడ కనుగొందునో ఆదినాకు తెలియ చేయబడును గాక! ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యెమును విశదపరచెదను, వాదములతో నానోరు నింపు కొనెదను" (యోబు 23:3-4).

I.   మొదటిది, తీవ్రమైన ప్రార్ధన క్రమముగా ఉంటుంది – పద్దతిలో ఉంటుంది, ఆదికాండము 18:27; హెబ్రీయులకు 4:16; మత్తయి 6:11; లూకా 11:5; ఆదికాండము 17:18; మత్తయి 6:7.

II.  రెండవది, తీవ్ర ప్రార్ధన వాదములను వాడుతుంది – కారణాలు, ఆదికాండము
18:23-25; మలాకి 3:6; హెబ్రీయులకు 13:8; I రాజులు 18:36-37; II రాజులు 2:14;
 II సామూయేలు 7:24-29; రోమా 3:4; ద్వితీయోపదేశకాండము 7:9.