Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
క్రీస్తు యొక్క గాయములు

THE WOUNDS OF CHRIST
(Telugu)

డాక్టర్ ఆర్. యల్. హైమర్స్, జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము ఉదయము, జూన్ 26, 2016
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord's Day Morning, June 26, 2016

"ఆయన తన చేతులను పాదములను వారికి చూపెను" (లూకా 24:40).


క్రీస్తు గాయములను గూర్చి నేను బోధింపబోతున్నాను. ఆయన మేకులతో సిలువకు కొట్టబడ్డాడు. ఆయన మృతుల నుండి లేచిన తరువాత కూడ ఆయన చేతులకు కాళ్ళకు రంధ్రాలు ఉన్నాయి. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆ గాయాలను వారికి చూపించాడు. మీ పాపానికి పూర్తి పరిహారము చెల్లించడానికి ఆయనకు మేకులతో సిలువకు కొట్టబడ్డాడు. మీరు మీ పాపము నుండి రక్షింపబడడానికి ఒకే మార్గము యేసు నొద్దకు వచ్చి ఆయనను నమ్మడం.

కాని మీ పాపమును గూర్చిన నేరారోపణ లేకుండా మీరు యేసును నమ్మలేరు. ఒక మంచి వ్యక్తి అవడం ద్వారా నిన్ను నీవు రక్షించుకోన ప్రయత్నిస్తావు. కాని నీవు నశించు పాపివని ఒప్పుకొనడానికి ఇష్టపడవు. యేసు ఒక్కడే సిలువపై ఆయన మరణము ద్వారా నిన్ను రక్షింపగలడని ఒప్పుకోవడానికి ఇష్టపడవు. కాయ్ పెర్నగ్ చేసినట్టు నీవు పాపివని ఒప్పుకోన ఇష్టపడవు. కాయ్ అన్నాడు, "నేను పాపినని నాకు తెలుసు. మంచి బాలునిగా ఉండ ప్రయత్నించాను, కాని ఎంత కష్టపడి ప్రయత్నించినా నన్ను నేను నిరీక్షణ లేనివాడనని అనిపించింది. నాకు అనిపించింది నేను నశించి పోయిన పాపివని, నేను దేవునికి వ్యక్తిరేకిగా గొప్ప పాపము చేసాను...నేను అనుకున్నాను నాకు నిరీక్షణ లేదని." గత ఆదివారము ఉదయము ఆ మాటలే చదివాను, నన్ను నేను మార్చుకోలేక పోయాను. నేను పాపినని గ్రహించాను. నిరీక్షణ లేని వాదనని అనిపించింది. అయినను కొన్ని గంటల తరువాత ఒక చైనీయ అమ్మాయిని అడిగాను రక్షింపబడ్డావా అని. ఆమె చెప్పింది, "ఔను" అని. ఎలా రక్షింపబడ్డావని అడిగాను. ఆమె మార్చుకొని మంచి వ్యక్తినైనానని చెప్పంది. తన తల్లిదండ్రులకు లోబడుతున్నానని చెప్పింది. మంచి వ్యక్తిగా తనను మార్చుకుంది! ఆమె అలా చెప్పిందంటే నేను నమ్మలేక పోతున్నాను! తనను తానూ మార్చుకుంది. తనను మంచి వ్యక్తిగా చేసుకుంది! నమ్మశక్యము కాదు!

ఆమె మన సంఘములో చాలాకాలముగా ఉంటుంది. ఆమె నా బోధ చాలా చాలా చాలాసార్లు వినియున్నది, నిన్ను నీవు మార్చుకోవడం వలన రక్షింపబడవని మరియు మంచి వ్యక్తి అవడం ద్వారా అని. నేను చెప్పడం చాలా సార్లు వినియున్నది, యేసు ద్వారానే రక్షింపబడతావని, ఆయన నీ పాపము నిమిత్తము సిలువపై మరణించాడు. అయినను ఆ బోధ అంతా ఆమెకు ఏమి మంచి చెయ్యలేదు! తనను తానూ మార్చుకోగాలడని రక్షించుకోగలడని ఆమె అనుకుంటూ ఉంది. ఆమె యేసు పేరు కూడ చెప్పలేదు. ఆయన పాప పరిహారార్ధ రక్తాన్ని గూర్చి మాట్లాడలేదు! ఒక్కసారి కూడ! యేసు నామమును ఒక్కసారి కూడ పలకలేదు!

ఈ ఉదయాన మీతో చెప్తున్నాను – నీవు నిరీక్షణ లేని పాపివని అనుకున్నంత వరకు నీవు రక్షింపబడలేవు. నీవు నిరీక్షణ లేని పాపివని అనుకో లేకపోతే యేసు అవసరత నీకు అనిపించదు – ఆయన నీ పాప పరిహారార్ధం సిలువపై మరణించాడు. ఈ ఉదయ కాలపు నా ప్రసంగము మీకు అర్ధవంతముగా ఉండదు – మీరు పాపాత్ములని నిరీక్షణ లేని వారని పరిశుద్ధాత్మ మీకు అనిపించేటట్టు చెయ్యకపోతే తప్పు. మీరు పాపాత్ములుగా నిరీక్షణ లేని వారుగా అనుకుంటే తప్ప యేసు ఆయన కాళ్ళు చేతుల గాయాలను వారికి ఎందుకు చూపించాడో అర్ధము కాదు.

"ఆయన తన చేతులను పాదములను వారికి చూపెను" (లూకా 24:40).

తన చేతులకు కాళ్ళకు ఉన్న గాయాలను ఆయన ఎందుకు వారికి చూపించాడు? దానికి కారణము ఏమిటి? ఆయన గాయాలను వారికి ఎందుకు చూపించాడు? మూడు కారణాలు ఇస్తాను ఎందుకు,

"ఆయన తన చేతులను పాదములను వారికి చూపెను" (లూకా 24:40).

I. మొదటిది, యేసు ఆయన గాయాలను వారికి చూపించాడు మనము తెలుసుకోడానికి ఆయనే సిలువపై సిలువ వేయబద్దాడని.

వేర్పాటు వాదులు అన్నారు యేసు నిజంగా సిలువపై మరణించలేదని. ముస్లీముల కురాన్ చెప్తుంది యేసు సిలువపై చనిపోలేదని. ఈనాడు చాలామంది నమ్మడం లేదు దేవుడు తన కుమారునికి అంత భయంకరమైన మరణాన్ని ఇస్తాడని. తన సిలువ మరణమును గూర్చి అపనమ్మకము ఉంటుందని యేసుకు తెలుసు. అందుకే ఆ కారణాన్ని బట్టి,

"ఆయన తన చేతులను పాదములను వారికి చూపెను" (లూకా 24:40).

ఆయన నిజంగా శ్రమ పడి సిలువపై మరణించాడనే విషయము ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని యేసు కోరుకున్నాడు. కనుక, శిష్యులను తన గాయాలను చూడనిచ్చాడు, ముట్టనిచ్చాడు కూడ. అపోస్తలుడైన యోహాను, ప్రత్యక్ష సాక్షి, చెప్పాడు, "మేమేది వింటిమో, ఏది కన్నులారా చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనితాకి చూచేనో" (I యోహాను 1:1). డాక్టర్ వాట్స్ అన్నాడు,

చూడండి, ఆయన తల నుండి, ఆయన చేతుల నుండి, ఆయన పాదముల నుండి,
     విచారము ప్రేమ మిళితమై ప్రవహిస్తున్నాయి:
అలాంటి ప్రేమ విచారము ఎప్పుడైనా కలిసాయా,
     లేక ముళ్ళు అంత గొప్ప కిరీటాన్ని తయారు చేశాయా?
("అద్భుత సిలువను నేను సమీపిస్తున్నప్పుడు" ఐజాక్ వాట్స్ చే, డి.డి., 1674-1748).
      (“When I Survey the Wondrous Cross” by Isaac Watts, D.D., 1674-1748).

సిలువలో, సిలువలో,
     మహిమ ఎన్నటికి ఉండనిమ్ము;
నా ఎత్తబడిన ఆత్మ కనుగొనే వరకు
     నది అవతల విశ్రాంతి.
("సిలువ చెంత" ఫేన్నీ జే. క్రాస్ బీ, 1820-1915).
(“Near the Cross” by Fanny J. Crosby, 1820-1915).

"ఆయన తన చేతులను పాదములను వారికి చూపెను" (లూకా 24:40).

II. రెండవది, యేసు ఆయన గాయాలను వారికి చూపించాడు మన పాపముల కొరకై మనకు ప్రతిగా ఆయన శ్రమ నొందాడని మనము తెలుసుకోవడానికి.

బాప్మిస్మమిచ్చు యోహాను అన్నాడు,

"ఇదిగో లోక పాపమును, మోసికొని పోవు దేవుని గొర్రె పిల్ల" (యోహాను 1:29).

కాని ఆయన చెప్పలేదు ఎలా యేసు మన పాపాలను తీసివేస్తాడో. యేసు మృతులలో నుండి లేచిన తరువాత వారు అర్ధం చేసుకున్నారు యేసు అన్నాడు,

"...ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనేను" (I పేతురు 2:24).

ఆయన చేతుల పాదములపై ఉన్న గాయపు ముద్రలను చూచినా తరువాత మాత్రమే వారికి తెలుసు,

"మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు, పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పడెను" (I పేతురు 3:18).

ఇది రెండవ కారణము,

"ఆయన తన చేతులను పాదములను వారికి చూపెను" (లూకా 24:40).

ఆయన మన కొరకు శ్రమపడి మన పాప పరిహారము నిమిత్తము సిలువపై మరణించాడని, తద్వారా పాపము నుండి నరకము నుండి మనము రక్షింపబడతాము అనే విషయాన్ని మనము కచ్చితంగా తెలుసుకోవడానికి ఆయన కోరుకున్నాడు. ఆయన చేతులతో ఉన్న గాయాల ముద్రలను మనం చూడాలనుకున్నాడు తద్వారా మనం తెలుసుకోవడానికి దేవుని ఉగ్రత సిలువపై ఆయనపై పడిందని, మనము ఈ విషయము తెలుసుకోవాలని

"...క్రీస్తు నందలి విమోచనము ద్వారా: ఆయన రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయన కరుణా ధారము బయలు పరచెను" (రోమా 3:24-25).

అందుకే,

"ఆయన తన చేతులను పాదములను వారికి చూపెను" (లూకా 24:40).

డాక్టర్ వాట్స్ పాట పాడండి!

చూడండి, ఆయన తల నుండి, ఆయన చేతుల నుండి, ఆయన పాదముల నుండి,
     విచారము ప్రేమ మిళితమై ప్రవహిస్తున్నాయి:
అలాంటి ప్రేమ విచారము ఎప్పుడైనా కలిసాయా,
     లేక ముళ్ళు అంత గొప్ప కిరీటాన్ని తయారు చేశాయా?

"సిలువలో." పాడండి!

సిలువలో, సిలువలో,
   మహిమ ఎన్నటికి ఉండనిమ్ము;
నా ఎత్తబడిన ఆత్మ కనుగొనే వరకు
    నది అవతల విశ్రాంతి.

"ఆయన తన చేతులను పాదములను వారికి చూపెను" (లూకా 24:40).

III. మూడవది, యేసు ఆయన గాయములను వారికి చూపించాడు తరతరాలకు ఆయనే రక్షకుడు అని మనము తెలుసుకోడానికి.

క్రీస్తు తన గాయాలను తన రక్తమును తనతోపాటు పరలోకానికి తీసుకొని వెళ్ళాడు మనకు నిత్య విమోచనము అనుగ్రహించడానికి.

"అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన, పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింప లేదు; కాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖ మందు కనబడుటకు, పరలోకమందే ప్రవేశించెను" (హెబ్రీయులకు 9:24).

పరలోకంలో దేవుని కుడి పార్శ్వమున కూర్చొని, యేసు యొక్క గాయాలు నిత్యమూ దేవునికి దూతలకు జ్ఞాపకము చేస్తూనే ఉంటాయి,

"ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు: మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకము నకు శాంతికరమై యున్నాడు " (I యోహాను 2:2).

అయినను ఈరోజు ప్రపంచములోని చాలామంది ప్రజలు యేసును తిరస్కరిస్తారు. చాలామంది వారి మంచి క్రియల ద్వారా స్వంత మత నమ్మకాల ద్వారా రక్షింపబడాలనుకుంటున్నారు. అందుకు వారు యేసును తిరస్కరించారు, ఆయనే రక్షణకు దేవుని ఏర్పాటు. యేసు ఒక్కడే దేవునికి మార్గము చూపువాడు ఎందుకంటే ఆయనే శ్రమపడి మన పాపాల నిమిత్తము చనిపోయాడు. ఏ ఇతర మత నాయకుడు అలా చెయ్యలేదు – కనుఫూసియాన్ కాదు, బుద్ధ కాదు, మహమ్మద్ కాదు, జోసఫ్ స్మిత్ కాదు, ఏ ఒక్కరు కాదు! యేసు క్రీస్తును గూర్చియే చెప్పబడింది,

"మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగ గొట్టబడెను: మన సమాధానార్ధమైన శిక్ష అతని మీద పడెను; అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది" (యెషయా 53:5).

యేసును గూర్చి మాత్రమే ఇలా చెప్పబడింది,

"పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకునకు వచ్చెను" (I తిమోతి 1:15).

యేసును గూర్చి మాత్రమే ఇలా చెప్పబడింది,

"అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు, ఎట్లనగా, మన మింకను పాపులమై యుండగా, క్రీస్తు మన కొరకు చనిపోయెను" (రోమా 5:8).

అందుకే,

"ఆయన తన చేతులను పాదములను వారికి చూపెను" (లూకా 24:40).

డాక్టర్ వాట్స్ పాట మళ్ళీ పాడండి!

చూడండి, ఆయన తల నుండి, ఆయన చేతుల నుండి, ఆయన పాదముల నుండి,
     విచారము ప్రేమ మిళితమై ప్రవహిస్తున్నాయి:
అలాంటి ప్రేమ విచారము ఎప్పుడైనా కలిసాయా,
     లేక ముళ్ళు అంత గొప్ప కిరీటాన్ని తయారు చేశాయా?

"సిలువలో." పాడండి!

సిలువలో, సిలువలో,
   మహిమ ఎన్నటికి ఉండనిమ్ము;
నా ఎత్తబడిన ఆత్మ కనుగొనే వరకు
    నది అవతల విశ్రాంతి.

రెండవసారి యేసు వచ్చునప్పుడు కూడ, ఆయన తన చేతులలోను కాళ్ళలోను సిలువ మరణము గురుతులు కలిగియుంటాడు. క్రీస్తు అన్నాడు, ప్రవక్త జెకర్యా ద్వారా,

"వారు తాము పొడిచిన నా మీద దృష్టి యుంచి, అతని విషయమై దుఃఖించు చు ప్రలాపింతురు" (జెకర్యా 12:10).

జీవిస్తున్నప్పుడు ఎవరైతే క్రీస్తు వైపు తిరగరో, వారు నరకంలో నిత్యత్వములో విషాదములో ప్రలాపిస్తూ ఉంటారు. గొప్ప స్పర్జన్ అన్నాడు, "ఆ చాచిన హస్తాలు పొడవబడిన వైపు నీకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాయి, నీకే వ్యతిరేకంగా, ఒకవేళ ఆయనను తిరస్కరించి చనిపోయి, దుష్ర్కియాల ద్వారా క్రీస్తు వ్యతిరేక శత్రువుల నిత్యత్వములోనికి వెళ్ళిపోతే" (C. H. Spurgeon, “The Wounds of Jesus,” The New Park Street Pulpit, Pilgrim Publications, volume V, p. 237).

"ఆయన తన చేతులను పాదములను వారికి చూపెను" (లూకా 24:40).

కానీ మళ్ళీ, స్పర్జన్ అన్నాడు,

పేద పాపి.... [యేసు నొద్దకు] రావడానికి నీవు భయపడుతున్నావా? ఆయన చేతుల వైపు చూడు – ఆయన చేతుల వైపు చూడు, అవి నిన్ను కదిలించడం లేదా?...ఆయన ప్రక్కలో చూడు, ఆయన హృదయానికి చేరువ అవవచ్చు. ఆయన ప్రక్క బాహాటంగా ఉంది. ఆయన ప్రక్క [నీ కొరకు] బాహాటంగా ఉంది... ఓ పాపి, ఆయన గాయాలను నీవు నమ్మాలి! అవి విఫలమవవు; ఆయన యందు నమ్మిక ఉంచు వారిని క్రీస్తు గాయాలు స్వస్థ పరుస్తాయి (ఐబిఐడి., పేజీ 240).

"ఆయన తన చేతులను పాదములను వారికి చూపెను" (లూకా 24:40).

పాత రక్షణ, సైన్యము యొక్క ఎవంజ లిన్ బూత్, ఇలా అన్నారు,

క్రీస్తు గాయాలు తెరచి ఉన్నాయి,
   పాపి, నీ కొరకు అవి చేయబడ్డాయి;
క్రీస్తు గాయాలు తెరచి ఉన్నాయి,
   ఆశ్రయము కొరకు వాటి దగ్గరకు వెళ్ళు.
("క్రీస్తు గాయాలు" ఎవంజలిన్ బూత్ చే, 1865-1950).
(“The Wounds of Christ” by Evangeline Booth, 1865-1950).

యేసు నొద్దకు రమ్ము. యేసును నమ్ము. నీ పాప పరిహారార్ధం యేసు సిలువపై మరణించాడు. యేసు నొద్దకు రమ్ము. యేసును నమ్ము. మంచి వ్యక్తివవడానికి ప్రయత్నించడం ఆపేయి. అది నిన్ను రక్షించ నేరదు. యేసు మాత్రమే పాపము నుండి నరకము నుండి నిన్ను రక్షించగలడు! ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఎబెల్ ప్రుదోమ్: యోహాను 20:24-29.
ప్రసంగము ముందు పాట బెంజమెన్ కినీకెయిడ్ గ్రిఫిత్ గారు:
      "క్రీస్తు యొక్క గాయములు" (ఎవాంజలిన్ బూత్ చే, 1865-1950).
         “The Wounds of Christ” (by Evangeline Booth, 1865-1950).


ద అవుట్ లైన్ ఆఫ్

క్రీస్తు యొక్క గాయములు

THE WOUNDS OF CHRIST

డాక్టర్ ఆర్. యల్. హైమర్స్, జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

"ఆయన తన చేతులను పాదములను వారికి చూపెను" (లూకా 24:40).

(యోహాను 19:34, 35, 41; 20:1, 5, 6-7, 9, 19; లూకా 24:37-40; యోహాను 20:27)

I. మొదటిది, యేసు ఆయన గాయాలను వారికి చూపించాడు మనము తెలుసుకోడానికి ఆయనే సిలువపై సిలువ వేయబద్దాడని, I యోహాను 1:1.

II. రెండవది, యేసు ఆయన గాయాలను వారికి చూపించాడు మన పాపముల కొరకై మనకు ప్రతిగా ఆయన శ్రమ నొందాడని మనము తెలుసుకోవడానికి, యోహాను 1:29;
I పేతురు 2:24; 3:18; రోమా 3:24-25.

III. మూడవది, యేసు ఆయన గాయములను వారికి చూపించాడు తరతరాలకు ఆయనే రక్షకుడు అని మనము తెలుసుకోడానికి, హెబ్రీయులకు 9:11-12, 24; I యోహాను 2:2; యోహాను 14:6; యెషయా 53:5; I తిమోతి 1:15; రోమా 5:8; జెకర్యా 12:10.