Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
మంచి విషయాలు ప్రార్ధన ద్వారా వస్తాయి

GOOD THINGS COME THROUGH PRAYER
(Telugu)

డాక్టర్ ఆర్. యల్. హైమర్స్, జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము సాయంకాలము, జూన్ 5, 2016
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, June 5, 2016

"మీరు చెడ్డవారై యుండియు, మీ పిల్లలకు, మంచి ఈవుల నియ్య నెరిగి యుండగా, పరలోక మందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవుల నిచ్చును?" (మత్తయి 7:11).


ఈ అద్భుత వాక్యభాగములో మనము ప్రార్ధించాలని యేసు ప్రోత్సహిస్తున్నాడు. 7 మరియు 8 వ వచనాలు గ్రీకులో వర్తమాన కాలములో ఉన్నాయి. దాని అర్ధము అడుగుతూ ఉండాలి, తడుతూ ఉండాలి. పరిశుద్ధాత్మ మీ హృదయములో మళ్ళీ మళ్ళీ అవసరత చూపించే కొద్ది, అది ప్రభువు నుండి వచ్చు భారము. అప్పుడు దానిని గూర్చి మళ్ళీ మళ్ళీ ప్రార్ధించాలని జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది, పరలోకపు తండ్రి నుండి జవాబు వచ్చే వరకు.

నేను నా కుటుంబము మెక్సికో నుండి సెలవు నుండి తిరిగి వచ్చిన తరువాత, మన సంఘములో ఎనిమిది పెద్ద సమస్యలు వెంటనే ఎదుర్కొనవలసి వచ్చింది. ఈ సమస్యలు పరిష్కారానికి మార్గమే మీకు కనపడలేదు. వాటిని గూర్చి ఏమి చెయ్యాలో తెలియక, వాటన్నిటినీ ప్రార్ధనలో దేవుని ముందు పెట్టాను. అది చాలా పెద్ద సమస్యలు. దెయ్యము అనుమానాలతోను భయాలతోను నా మనసు నింపేసింది. బహుశా, ఈ విషయాలన్నీ దేవుడు చూసుకుంటాడని నా పాత స్వభావము నమ్మలేదు. కాని నేను ప్రార్ధించాను, యేసుతో చెప్పిన ఆ మనిషి వలే, "ప్రభువా, నమ్ముచున్నాను; నాకు అపనమ్మక ముండకుండ సహాయము చేయుము" (మార్కు 9:24). నీ విశ్వాసము బలహీనంగా ఉన్నప్పుడు అది మంచి ప్రార్ధన, "ప్రభువా, నమ్ముచున్నాను; నాకు అపనమ్మక ముందకుండా సహాయము చేయుము" – నా అపనమ్మకాన్ని అధికమించడానికి, నా విశ్వాసాన్ని బలపరచడానికి. కనుక ఈ ఎనిమిది పెద్ద సమస్యల కొరకు నేను ప్రార్ధించాను.

ఒకదాని తరువాత ఒకదానికి దేవుడు నా ప్రార్ధనలకు జవాబిచ్చాడు. ఒకదాని తరువాత ఒకటి, అసాధ్యమనుకున్న ఆ సమస్యలు, ప్రార్ధనకు జవాబుగా జయింపబడ్డాయి. ఒక సమస్య కొరకు పదిహేను సంవత్సరాలు పైన ప్రార్ధించాను దానికి గత ఆదివారము జవాబు ఇవ్వబడింది! ఎంత గొప్ప అద్భుతము! ఆశీర్వాదాలు క్రుమ్మరించు దేవునికి స్తోత్రము! తరువాత, ఒకదాని తరువాత ఒకటి, నేను చెప్పిన ఎనిమిది సమస్యలు జయింప బడ్డాయి. ఆఖరి దానికి ఈ ప్రసంగము వ్రాయడానికి కూర్చునే ముందు జవాబు దొరికింది! అది నిజంగా చాలా పెద్ద సమస్య. అది నెలలుగా నా హృదయానికి భారంగా ఉంది! కాని దేవుడు దానికి జవాబు ఇచ్చినప్పుడు, అది చాలా సులభము అనిపించింది! భారము తీసివేయబడింది, దేవుడు జవాబు ఇచ్చాడు సునాయాసంగా ఇప్పుడు నాకనిపిస్తుంది నేను అవివేకంగా దాని గూర్చి ఎక్కువగా పట్టించుకున్నానని!

రమ్ము, నా ఆత్మ, నీ స్థలము సిద్ధ పరచబడింది,
   ప్రార్ధనకు జవాబివ్వడం యేసు ప్రేమిస్తాడు;
ఆయనే నీవు ప్రార్ధించాలని తలంచాడు,
   కాబట్టి నీకు కాదు అని చెప్పడు,
   కాబట్టి నీకు కాదు అని చెప్పడు.

నీవు రాజు యొద్దకు వస్తున్నావు;
   పెద్ద మానవులు నీవు తీసుకొని వస్తున్నావు;
ఆయన కృప శక్తి ఎలాంటివంటే,
   ఎవరు అధికంగా అడగలేదు,
   ఎవరు అధికంగా అడగలేదు!
("రమ్ము, నా ఆత్మ, నీ స్థలము సిద్ధ పరచబడింది" జాన్ న్యూటన్, 1725-1807).
(“Come, My Soul, Thy Suit Prepare” by John Newton, 1725-1807).

దేవుడు నా ప్రార్ధనలకు ఎలా జవాబిచ్చాడో చూస్తే అది నా హృదయాన్ని పాడేలా చేస్తుంది! నా హృదయము పాడుతుంది జవాబిచ్చిన ప్రార్ధనలకు నేను దేవునికి వందనాలు చెల్లించినప్పుడు! దేవుడు ఒక ప్రార్ధనాకు జవాబు ఇచ్చినప్పుడు, నీవు త్వరితంగా ఆయనకు వందనాలు చెల్లించాలి!

"మీరు చెడ్డవారై యుండియు, మీ పిల్లలకు, మంచి ఈవుల నియ్య నెరిగి యుండగా, పరలోక మందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవుల నిచ్చును?" (మత్తయి 7:11).

ఆయన కృప శక్తి ఎలాంటిదంటే,
   ఎవరు అధికంగా అడగలేరు,
ఎవరు అధికంగా అడగలేరు!

హల్లెలూయా! హల్లెలూయా! హల్లెలూయా! దేవునికే మహిమ చెల్లించండి! దేవునికే మహిమ చెల్లించండి! ఆయన ప్రార్ధనలకు జవాబిస్తాడు! (సంతోశించుడి).

ఈ సంవత్సరము ప్రార్ధనకు అద్భుతమైన జవాబులు చూసాము. ఎనభై సంవత్సరాలలో ఉన్న ఇద్దరు స్త్రీలు మారారు. కొద్ది రోజులలో పన్నెండు మంది కొత్త యవనస్తులు మారడం చూసాం. తరువాత ఈస్టరు ఆదివారము ఉదయము డాక్టర్ రాస్ ముస్సేన్ బోధించినప్పుడు రోబర్ట్ వాంగ్ మారాడు. దుష్ట శక్తుల అణచివేత నుండి ఊడీ విడుదల పొందాడు – నిజంగా కృప చేత అద్భుతము ఇది! తరువాత జెస్సీ జక మీట్ జిన్! నన్ను కోపము కళ్ళతో చూసాడు నేను ట్రాండ్ ను ఇష్టపడుతున్నానని కనుగొన్నప్పుడు. కాని తరువాత విచారణ గదిలో డాక్టర్ కాగన్ అతనిని రక్షకుని యొద్దకు నడిపించినప్పుడు, అతని బుగ్గలు మీదుగా కన్నీళ్లు కారాయి! అద్భుతం! దేవుడే తన జీవితంలో అది చేసాడు! వేలంటైన్ హేర్రేరా ఏ మంచి గుణము లేనట్టుగా కనిపించాడు! అతడు రక్షింపబడాలని దేవుడు నాతో చెప్పాడు. అతడు త్వరలో మారాడు! అద్భుతం! దేవుడే అలా చేయగలడు! క్రైస్తవులకు ఒక ప్రసంగము బోధించాను. సువార్త సంక్షిప్తంగా చెప్పాను. ఎంత ఆశ్చర్యము వారు నాతో చెప్పారు తరువాత టామ్ జియా రక్షింప బడ్డాడని! చెప్పడం మర్చిపోయాను శ్రీమతి జబలగాను గూర్చి ఆమె మార్పును గూర్చి జాన్ కాగన్ ఆమెతో యేసును నమ్మమని చెప్పాడు – ఆమె అలా చేసింది – 35 సంవత్సరాల అనుమానము తికమక తరువాత! అద్భుతం! దేవుడే చేస్తాడు! ఈ సంవత్సరం ఇప్పటి 17 మంది మార్చబడ్డారు – సంవత్సరము సగమే అయింది! (సంతోషించండి)

నా ప్రియ స్నేహితులారా, దేవుడు అద్భుతాలు చేసే దేవుడు! ఆయన ప్రార్ధనకు జవాబిస్తాడు! ఆయనను అడుగు వారికి మంచి ఈవుల నిస్తాడు! ప్రియ సహోదరీ సహోదరులారా, మన ఆరాధనలలో దేవుని సన్నిధి కొరకు దృష్టి పెట్టి ప్రార్ధిద్దాం. మీరు ప్రార్ధించిన ప్రతీసారి దేవుని సన్నిధి ఉండేటట్టు ప్రార్ధించండి. చైనీయ గుడిలో నా కాపరి డాక్టర్ తిమోతి లిన్ (1911-2009). గుడిలో దేవుని సన్నిధి కొరకు ప్రార్ధించే అవసరాన్ని గూర్చి ఆయన తరుచు చెప్పేవాడు. డాక్టర్ లిన్ అన్నాడు,

     ప్రార్ధన గురి ఏమిటంటే ఆయన కృపతో మనలను దీవించడానికి దేవుని అనుమతి, రోగులను స్వస్థ పరచడం, అణిగిన వారిని ఆచరించడం, అవసరతలో ఉన్నవారికి ఇవ్వడం, శ్రమలో ఉన్నవారికి విడుదల, అవిశ్వాసులు నమ్మేటట్టు విశ్వాసులు ఎదిగేటట్టు, మొదలగునవి... వాస్తవానికి, ఈ మనవులన్నీ సూచనలకు స్వస్థతలు కాని సమస్య మూలానికి కాదు. మన ప్రభువు...సమస్య మూలమునకు స్వస్థత ఇచ్చాడు – ఆయన సన్నిధి మనతో!
     ఆయన సన్నిధితో, ఈ సమస్యలన్నీ తీరిపోతాయి, చీకటి వెలుగుగా మారుతుంది, కలవరము ఐశ్వర్యాలవుతాయి... ప్రభువుకు స్తోత్రము! ప్రార్ధన ద్వారా ఆయన మనతో ఉంటానని మనకు వాగ్ధానము చేసాడు... ప్రార్ధన గురి దేవుని సన్నిధి కలిగి యుండడం (Timothy Lin, Ph.D., The Secret of Church Growth, FCBC, 1992, pp. 108, 109).

కనుక, మీరు ప్రార్ధించిన ప్రతీసారి దేవుని సన్నిధి మన సంఘములో ఉండేటట్టు మీరు ప్రార్ధించాలని నేను మిమ్మును కోరుచున్నాను. మీరు ఉదయము ప్రార్ధించేటప్పుడు, దేవుని సన్నిధి మన మధ్య ఉండేటట్టు చూసుకోండి. మీరు తినేముందు దేవునికి వందనాలు చెప్పేముందు, ఆయన మన సంఘములో ఉండేటట్టు కొన్ని మాటలు చెప్పి ప్రార్ధించండి. నా గురించి ప్రార్ధించేటప్పుడు, నా బాధలో దేవుని సన్నిధి ఉండేటట్టు ప్రార్ధించండి. నేను నా ఆఫీసులో ఈ ప్రసంగాలు వ్రాసేటప్పుడు దేవుని సన్నిధి ఉండేటట్టు ప్రార్ధించండి. కోత పండుగ కొరకు ప్రార్ధించేటప్పుడు, దేవుని సన్నిధి మన మధ్యలో ఉండేటట్టు ప్రార్ధించండి. ఆయన సన్నిధి లేకుండా, మన సువార్త ఫలమును ఇవ్వదు. ప్రపంచానికి మన అంతర్జాల మిస్సను గూర్చి ప్రార్ధించేటప్పుడు, దేవుని సన్నిధి కొరకు ప్రార్ధించండి ప్రసంగాలు చదివే వారి కొరకు, బోధించే వారి కొరకు, విడియోలలో చూచే వారి కొరకు. మన సువార్త నిమిత్తము ప్రార్ధించేటప్పుడు, మనము సువర్తీకరణ చేస్తున్నప్పుడు దేవుని సన్నిధి ఉండేటట్టు ప్రార్ధించండి. గ్రిఫిత్ గారు పాడేటప్పుడు, సంఘమంతా పాడేటప్పుడు, పాటలతో దేవుని సన్నిధి ఉండేటట్టు ప్రార్ధించండి. మన ప్రార్ధనా కూటాలలో దేవుని సన్నిధి కొరకు ప్రార్ధించండి. నశించు "సంఘపు పిల్లల" హృదయాలు పగిలేటట్టు దేవుని సన్నిధి కొరకు ప్రార్ధించండి. అక్కడ ఆగిపోకండి – కొత్తగా వచ్చువారు మారడానికి దేవుని సన్నిధి కొరకు ప్రార్ధించండి. కొత్త వారి పేర్లు తెలుసుకోండి – క్రీస్తు కొరకు వారి అవసరత దేవుని సన్నిధి కొరకు ప్రార్ధించండి – వారిని రక్షకుని దగ్గరకు చేర్చడానికి. సాతానును తన దెయ్యాలను బంధించడానికి దేవుని సన్నిధి కొరకు ప్రార్ధించండి. ఆరాధన తరువాత విచారణ గది కొరకు దేవుని సన్నిధి కొరకు ప్రార్ధించండి. రొగులైన, శ్రీమతి రూప్ మరియు నా కొరకు స్వస్థత నిమిత్తము దేవుని సన్నిధి కొరకు ప్రార్ధించండి. మన సంఘ ప్రతీ పనిలో దేవుని సన్నిధి కొరకు ప్రార్ధించండి. నోవా సాంగ్ మరియు జాన్ కాగన్ లు కోత పండుగ సమయంలో బోధించేటప్పుడు దేవుని సన్నిధి కొరకు ప్రార్ధించండి. నేను మాట్లాడే ప్రతీసారి దేవుని సన్నిధి ఉండేటట్టు ప్రార్ధించండి. డాక్టర్ చాన్ మాట్లాడే ప్రతిసారి దేవుని సన్నిధి ఉండేటట్టు ప్రార్ధించండి. స్నేహితుని గూర్చిన ఉపమానంలో, యేసు అన్నాడు,

"మీరు చెడ్డవారై యుండియు, మీ పిల్లలకు, మంచి ఈవుల నియ్య నెరిగి యుండగా: పరలోక మందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను పరిశుద్ధాత్మ నిచ్చును?" (లూకా 11:13).

పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనతో ఉండాలని మనము అనునిత్యము అడుగుతూ ఉండాలి. ఉజ్జీవంలో దేవుడు మహిమ పర్చబడేటట్టు మనం ప్రార్ధించడానికి అది మనలను నడిపిస్తుంది. మనం ప్రార్ధించే ప్రతీసారి దేవుడు ఉజ్జీవాన్ని పంపించేటట్టు మీరు ప్రార్దిస్తారని నిరీక్షణ! అవును – ప్రతీసారి! ఉజ్జీవము అంటే ఎక్కువ మోతాదులో ఆయన సన్నిధి క్రుమ్మరింపు. హబక్కుకు ప్రార్ధన కూడ మనము చెయ్యాలి,

"ఓ ప్రభువా, సంవత్సరాలు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుము, సంవత్సరాలు జరుగుచుండగా దానిని తెలియ చేయుము; కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము" (హబక్కుకు 3:2).

"ఓ ప్రభువా, నీ కార్యములు నూతన పరచుము." బాగా పాతకాలపు పాట నాకు బాగా ఇష్టమైనది ఇలా చెప్తుంది.

ఆశీర్వదపు జల్లులు,
   మనకు కావలసిన ఆశీర్వదపు జల్లులు;
కృపాదారాలు మన చుట్టూ పడుతున్నాయి,
   మనము మొరపెట్టే జల్లులు.
("ఆశీర్వదపు జల్లులు ఉంటాయి" డానియల్ డబ్ల్యూ. విట్టల్ చే, 1840-1901).
(“There Shall Be Showers of Blessing” by Daniel W. Whittle, 1840-1901).

"కృపాధారలు" ఈ సంవత్సరము రక్షింపబడిన 17 లేక 18 ఆత్మలు. కాని "ఆశీర్వాదపు జల్లులు" ఎప్పుడు వస్తాయంటే దేవుడు తన ఆశీర్వదపు సంపూర్ణ శక్తితో ఉజ్జీవమును పంపించినప్పుడు.

ఉజ్జీవము వచ్చిందంటే అది దేవుడు పంపినదే. సంఘము సాగుతూ మంచిగా ఉండవచ్చు. ఆత్మలు రక్షింపబడడం చూస్తాం. మనకు దేవుని సన్నిధి ఉంటుంది. కాని ఉజ్జీవములో ప్రతీది తీవ్ర పరచబడుతుంది. ప్రార్ధనలు అకస్మాత్తుగా ఎక్కువ శక్తివంతమవుతాయి. ప్రసంగాలు ఉజ్జేజ భరితమవుతాయి. పాపపు ఒప్పుకోలు చాలా గొప్పగా ఉంటుంది. ప్రతీ ఆరాధన శక్తివంత విచారణ గది అవుతుంది. ప్రజలు కన్నీటితో పాపాలు ఒప్పుకుంటారు. ఇప్పటికే రక్షింపబడిన వారు వారి పాపాలు ఒప్పుకుంటారు – తరుచు బాహాటంగా అందరి ముందూ. చాలా సంవత్సరాలుగా సువార్త వింటున్న వారికి ఒక కొత్త ప్రసంగముగా అనిపిస్తుంది, మునుపు వారు దాని గ్రహించుకోలేదు.

ఉజ్జీవము సామాన్యంగా వస్తుంది గుడిలో ఉన్న కొందరికి ఇంకా ఎక్కువ అవసరము అని అనిపించినప్పుడు. వారు ఆనవాయితీగా గుడిలో జరిగే వాటితో తృప్తి చెందరు. అద్భుత రీతిగా దేవుడు వారి మధ్య సంచరించాలని వారు ప్రార్ధింప ప్రారంభిస్తారు. క్రైస్తవులు అనుకుంటారు వారు అనుకున్న దానికంటే ఎక్కువగా చల్లారి పోయారని. లోక స్థితిని వారు ఒప్పుకుంటారు. వారి హృదయాలలో ఉన్న పాపాలను ఒప్పుకుంటారు. తరుచు బాహాటంగా వారి పాపాలు ఒప్పుకుంటారు. వారిని క్షమించి పునరుద్ధరించాలని దేవునికి మోర పెడతారు. దేవుడు సంఘాన్ని మండింప చేస్తాడు, అది అపోస్తలుల కార్యములలోని సంఘము వలే అయిపోతుంది.

ఉజ్జీవ శక్తి కొరకు గొప్ప ప్రార్ధన ప్రవక్తయైన యెషయాచే ఇవ్వబడింది. ఆయన ప్రార్ధించాడు,

"ఓ గగనము చీల్చుకొని, నీవు దిగి వచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక" (యెషయా 64:1).

మీలో కొందరు ఆ ప్రార్ధన కంఠస్థము చేస్తారని నా నిరీక్షణ, నిజానికి మీరు ఉజ్జీవానికి ప్రార్ధించేటప్పుడు ఆ పదాలు వాడండి.

డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ యెషయా 64:1 ను, "ఉజ్జీవము కొరకు అసలైన ప్రార్ధన అని పిలిచాడు." అతడన్నాడు,

"’ఓ గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక’ – నేను [చెప్పడానికి] వెనకాడను ఉజ్జీవానికి సంబంధించి ఇది అసలైన ప్రార్ధన. బహుశా, దేవుడు మనలను ఆశీర్వదించాలని, ప్రార్ధించడం సరియే... మన పట్ల కృప కలిగి యుండాలని, అది మన నిత్య ప్రార్ధనయై ఉండాలి. కాని ఇది ఇంకా ముందుకు వెళ్తుంది, ఇక్కడ మనం ఒక తేడా చూస్తాము సంఘము ఎప్పుడు ప్రార్ధించే దానికి, మరియు ప్రత్యేక, విచిత్ర, అత్యవసర ప్రార్ధన ఉజ్జీవంలో దేవుని ఆత్మ దర్శనము నిమిత్తము ప్రార్ధన... ‘ఓ’ ఆయనంటాడు, ‘గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చెదవు గాక.’ అక్కడ చీల్చే ప్రక్రియ ఉంది. దేవుడు [మన] మధ్యకు దూసుకొని వస్తాడు" (Martyn Lloyd-Jones, M.D., Revival, Crossway Books, 1992, pages 305-307).

యెషయా ప్రార్ధన మనం తరుచు పాడే చిన్న పాటలో సూచించబడింది,

సజీవుడైన దేవుని ఆత్మ,
   దిగి రమ్ము, మేము ప్రార్ధిస్తున్నాము.
సజీవుడైన దేవుని ఆత్మ,
   దిగి రమ్ము, మేము ప్రార్ధిస్తున్నాము.
కరిగించండి, మలచండి, విరుగ గొట్టండి, వంచండి.
   సజీవుడైన దేవుని ఆత్మ,
దిగి రమ్ము, మేము ప్రార్ధిస్తున్నాము.
("సజీవుడైన దేవుని ఆత్మ" డానియెల్ ఐవర్ సన్ చే,
   1899-1977; డాక్టర్ హైమర్స్ గారిచే మార్చబడినది).
(“Spirit of the Living God” by Daniel Iverson, 1899-1977;
      altered by Dr. Hymers).

మీరు ఉజ్జీవము కొరకు ప్రార్ధించేటప్పుడు ఆ పాట పాడండి, తరువాత యెషయా 64:1 లోని పదాలను ఉపయోగించి ప్రార్ధించండి,

"ఓ గగనము చీల్చుకొని, నీవు దిగి వచ్చెదవు, గాక నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక" (యెషయా 64:1).

గర్వము అనే పర్వతాలు, పాపము తిరుగుబాటు అనే పర్వతాలు, అపనమ్మకము అనే పర్వతాలు అవన్నీ కూలిపోతాయి – దేవుడు గగనము చీల్చుకొని మన మధ్యకు దిగి వచ్చినప్పుడు.

కనుక, సంఘములో మనం చేసే ప్రతి దానిలో దేవుని సన్నిధి ఉండేటట్టు మనం ప్రార్ధించాలి. కాని దేవుని ఆత్మ ఇంకా గొప్పగా ఉజ్జీవంలో క్రుమ్మరింప బడేటట్లు మనం ప్రార్ధన చెయ్యాలి. ఉజ్జీవము వచ్చేటప్పుడు అది ఎప్పుడు అకస్మాత్తుగా వస్తుంది. నేను నా జీవితంలో ఉజ్జీవము మూడుసార్లు చూసాను. మొదటిసారి మూడవసారి నేను ఉజ్జీవాన్ని చూసాను పరిశుద్ధాత్మ అకస్మాత్తుగా దిగి వచ్చింది మేము ఆశ్చర్యపోయాము దేవుని శక్తితో నింపబడ్డాము! దేవుడు ఇచ్చటికి ఉజ్జీవమును పంపిస్తే మీరు బ్రతికినంత కాలము దానిని మరచిపోలేరు. గొప్ప పని ఒక నెలలో మన గుడిలో జరుగుతుంది గత ఇరవై సంవత్సరాలలో మనము చూడనిది! నాకు తెలుసు. నా కళ్ళతో నేను చూసాను దేవుడు ఏమి చేయగలడో ఆయన గగనము చీల్చుకొని మన మధ్యకు మునుపెన్నడూ చూడని అధిక శక్తితో వచ్చినప్పుడు. ఈ ప్రసంగాన్ని ఇంటికి తీసుకెళ్ళి ప్రార్ధించేటప్పుడు చదవండి. మొదటిగా, మనం చేసే అంతటిలో దేవుని సన్నిధి ఉండేటట్టు. తరువాత ఉజ్జీవంలో దేవుని అత్యధిక ఆత్మ క్రుమ్మరింపు కొరకు ప్రార్ధించండి.

మనం చేసే సమస్తములో దేవుని సన్నిధి ఉండేటట్టు ఎల్లప్పుడూ ప్రార్ధించండి. కాని ఉజ్జీవంలో మన మధ్య గొప్ప క్రుమ్మరింపు వచ్చేటట్టు ప్రార్ధించండి. యేసు అన్నాడు,

"ప్రభు, ఉజ్జీవము పంపించు." పాడండి!

ప్రభువా ఉజ్జీవము పంపించు,
   ప్రభువా, ఉజ్జీవము పంపించు,
ప్రభువా, ఉజ్జీవము పంపించు,
   మీ నుండి అది దిగిరానిమ్ము.
("ప్రభువా, ఉజ్జీవము పంపించు" డాక్టర్ బి. బి. మెక్కిన్నీ, 1886-1952; డాక్టర్ హైమర్స్ గారిచే సవరించబడినది).
(“Lord, Send a Revival” by Dr. B. B. McKinney, 1886-1952;
altered by Dr. Hymers).

ప్రతిఒక్కరు మార్పిడి కొరకు ఈ రాత్రి ప్రార్ధించండి (అందరు ప్రార్ధించండి).

రమ్ము, నా ఆత్మ, నీ స్థలము సిద్ధ పరచబడింది,
   ప్రార్ధనకు జవాబివ్వడం యేసు ప్రేమిస్తాడు;
ఆయనే నీవు ప్రార్ధించాలని తలంచాడు,
   కాబట్టి నీకు కాదు అని చెప్పడు,
కాబట్టి నీకు కాదు అని చెప్పడు.

నీవు రాజు యొద్దకు వస్తున్నావు;
   పెద్ద మానవులు నీవు తీసికొని వస్తున్నావు;
ఆయన కృప శక్తి ఎలాంటి వంటే,
   ఎవరు అధికంగా అడగలేరు,
ఎవరు అధికంగా అడగలేరు!

ఈ సాయంకాలము పాపము నుండి నీవు రక్షింపబడవచ్చు. పరిశుద్ధాత్మ నీ పాపము విషయంలో నిన్ను మేల్కొల్పుతాడు. పరిశుద్ధాత్మ నిన్ను క్రీస్తు నొద్దకు చేర్చి ఆయన ప్రశస్త రక్తము ద్వారా నీ పాపాలను కడిగేస్తాడు. రక్షింపబడడము విషయంలో మీరు మాతో మాట్లాడాలంటే, దయచేసి డాక్టర్ కాగన్ ను మరియు జాన్ కాగన్ ను ఇప్పుడే ఆవరణము వెనుక భాగానికి వారిని వెంబడించి వెళ్ళండి. వారు మిమ్ములను ఒక ప్రశాంత గదికి తీసుకొని వెళ్లి మీతో మాట్లాడి మీ కొరకు ప్రార్ధిస్తారు. ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఎబెల్ ప్రుదోమ్: మత్తయి 7:7-11.
ప్రసంగము ముందు పాట బెంజమెన్ కినీకెయిడ్ గ్రిఫిత్ గారు:
"రమ్ము, నా ఆత్మ, నీ స్థలము సిద్ధపరచబడింది" (జాన్ న్యూటన్ చే, 1725-1807).
“Come, My Soul, Thy Suit Prepare” (by John Newton, 1725-1807).