Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
యోనా – మరణము నుండి జీవములోనికి!

JONAH – FROM DEATH TO LIFE!
(Telugu)

డాక్టర్ ఆర్. యల్. హైమర్స్, జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము ఉదయము, జూన్ 5, 2016
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, June 5, 2016


మొదటిగా, మత్స్యమును గూర్చి ఒక మాట. యోనా 1:17 చూడండి. "గొప్ప మత్స్యము ఒకటి యోనాను మ్రింగ వలెనని యెహోవా నియమించి యుండెను." హెబ్రీ పదము "నియమించుట" అనగా "మనావ్." దాని అర్ధము "ఏర్పరుచుట," "సిద్ధ పరచుట." అది ప్రత్యేకంగా నియమింపబడి సిద్ధ పరచబడింది. మునుపెప్పుడు లేదు, తరువాత కూడ. అది ప్రభువైన దేవునిచే ఏర్పాటు చేయబడింది. మత్స్యము కూడ. హెబ్రీ పదము "డెగ్." అంటే సముద్ర చారము – పెద్దది, మనిషిని మ్రింగి వేయగలది, నమలకుండా. అది మన పాఠ్యభాగమునకు నడిపిస్తుంది,

"నేను మరి ఎన్నడూ ఎక్కిరాకుండా భూమి గడియలు వేయబడియున్నవి; పర్వతముల పునాదులలోనికి నేను దిగి యున్నాను: నా దేవా యెహోవా నీవు నా ప్రాణము కూపములో నుండి, పైకి రప్పించి యున్నావు" (యోనా 2:6).

యోనా గ్రంధముపై వ్యాఖ్యానిస్తూ, గొప్ప సంస్కర్త జాన్ కేల్విన్ ఇలా అన్నాడు,

…దీనిలో [క్రీస్తు] యోనా వలే ఉంటాడు, ఆయన తిరిగి బ్రతికిన ప్రవక్త లాంటివాడు... తిరిగి బ్రతికినప్పుడు, యోనా నివేదనను మార్చినట్టు. ఈ భాగపు సామాన్య భావము అది. కనుక యోనా క్రీస్తు వంటివాడు కాదు, ఎందుకంటే అన్యుల వద్దకు పంపబడ్డాడు, కాబట్టి కాని అతడు తిరిగి జీవించాడు కాబట్టి... (John Calvin, Commentaries on the Twelve Minor Prophets, Baker Book House, 1998 reprint, volume 3, page 21).

కేల్విన్ పదాలు గమినించండి – యోనా "తిరిగి జీవించిన ప్రవక్త." యోనా పునరుత్థానము మూడవ దినమున క్రీస్తు పునరుత్థానము లాంటిది.

డాక్టర్ యం. ఆర్. డిహాన్ అన్నాడు, "ప్రవక్త యోనా సముద్రములో పడవేయబడి గొప్ప చేపచే మ్రింగబడిన తరువాత, అతడు క్రీస్తు మరణము పునరుత్థానము లాంటిది పొందుకున్నాడు" (M. R. DeHaan, M.D., Jonah – Fact or Fiction?, Zondervan Publishing House, 1957, p. 80). డాక్టర్ జె. వెర్నోన్ మెక్ గీ అదే విషయము చెప్పాడు అతని బైబిలు వ్యాఖ్యానములో.

డాక్టర్ మర్ఫీలమ్ దక్షిణ కాలిఫోర్నియాలో ఒక సెమినరీలో హెబ్రీ నేర్పించాడు. డాక్టర్ లమ్ నాతో అన్నాడు, "యేసు యోనాపై మత్తయి 12:40 లో శ్రేష్టమైన వ్యాఖ్యానము ఇచ్చాడు." ఆ వచనంలో, యేసు అన్నాడు,

"యోనా మూడు రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో [సముద్రం గర్భంలో] ఎలాగుండెనో; ఆలాగు మనష్యు కుమారుడు మూడు రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును" (మత్తయి 12:40).

క్రీస్తు ప్రకటనలో మూడు పాఠాలు వస్తాయి:

1. క్రీస్తు మరణ పునరుత్థానములకు యోనా ఒక చిత్ర పఠము.

"యోనా మూడు రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో [సముద్రం గర్భంలో] ఎలాగుండెనో; ఆలాగు మనష్యు కుమారుడు మూడు రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును" (మత్తయి 12:40).

2. కనుక యోనా కృప ద్వారా రక్షణకు సాదృశ్యము.

"ఆయన క్రీస్తు నందు వినియోగ పరచిన బలాతిశయమును బట్టి, ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్య మెట్టిదో, ఆయన ఆ బలాతిశయము చేత, క్రీస్తును మృతులలో నుండి లేపెను..." (ఎఫెస్సీయులకు 1:19-20).

క్రీస్తు పునరుత్తానము మారే వానికి అన్వయింప బడుతుంది.

"మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై యుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ [బ్రతికించెను]" (ఎఫెస్సీయులకు 2:1).

మరియు, మళ్ళీ, మనకు చెప్పబడింది,

"మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై యుండినప్పుడు, సయితము మన యెడల చూపిన తన మహా ప్రేమచేత, (మహిమ వలన రక్షింపబడును;) మనలను క్రీస్తుతో...కూడ బ్రతికించెను (ఎఫెస్సీయులకు 2:5-6).

ఈ వచనాలు చూపిస్తున్నాయి మారని వ్యక్తి పాపములో చచ్చిన వాడు క్రీస్తులో అతడు జీవింపబడాలి. "జీవితానికి మరణము" మార్పు అనుభవము క్రీస్తు మరణ పునరుత్థానములకు ముడిపడి ఉంది – అది యోనాకు సంభవించిన దానిని చూపిస్తుంది (సిఎఫ్. మత్తయి 12:40).

3. మారిన వ్యక్తి ముంచుడు బాప్తిస్మము యోనా పునరుత్థానమునకు సాదృశ్యముగా ఉంది. రోమా 6:3-4 చెప్తుంది,

"క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము, ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో: అలాగే మనలను నూతన జీవము పొందిన వారమై నడుచుకొనునట్లు మనము బాప్తిస్మము వలన మరణంలో పాలు పొందుటకై, ఆయనతో కూడ పాతిపెట్టబడితిమి" (రోమా 6:3-4).

విశ్వాసము ద్వారా, మారినవాడు క్రీస్తులోనికి ముంచబడుతున్నాడు, ఆయన మరణ పునరుత్తానములలో క్రీస్తుతో ఏకమగుచున్నాడు. డాక్టర్ మెక్ ఆర్డర్ సరిగ్గా చెప్పాడు, "తప్పకుండా నీటి బాప్తిస్మము ఈ నిజాన్ని చూపిస్తుంది... " (ఐబిఐడి., రోమా 6:3 పై గమనిక). అలా, మార్పు అనుభవము, నీటి బాప్తిస్మము ద్వారా చూపించబడి, క్రీస్తు మరణ పునరుత్తానములను తెలియచేస్తే, యోనాను చూపిస్తుంది (సిఎఫ్. మత్తయి 12:40).


తిరిగి చెప్పడానికి,


1. యోనా క్రీస్తు యొక్క మరణ పునరుత్థానములను చూపిస్తున్నాడు.

2. యోనా మార్పు యొక్క ఆత్మీయ మరణమును పునరుత్తానమును చూపిస్తున్నాడు.

3. యోనా విశ్వాసి బాప్తిస్మాన్ని చూపిస్తున్నాడు.


క్రీస్తు నిజంగా చనిపోయాడా? అవును. మారని వ్యక్తి నిజంగా పాపముల చేతను అపరాధముల చేతను చనిపోయాడా? అవును. మారిన వ్యక్తి మృతులలో నుండి నిజంగా లేస్తాడా? అవును. అనుభవజ్ఞుడైన బోధకుడు వారి ముఖాలలో హావభావాలలో మార్పు చూస్తాడు.

ఆ గొప్ప చేపలో యోనా నిజంగా చనిపోయాడా? జవాబు అవుననే అనుకుంటాను! డాక్టర్ లామ్ చెప్పినట్టు, "మత్తయి 12:40 లో యేసు యోనాను గూర్చి శ్రేష్టమైన వ్యాఖ్యానము చేసాడు."

"యోనా మూడు రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో [సముద్రం గర్భంలో] ఎలాగుండెనో; ఆలాగు మనష్యు కుమారుడు మూడు రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును."

యేసు నిజంగా చనిపోయాడు – కనుక ఆయన పోలిక చూపిస్తుంది యోనా నిజంగా చనిపోయాడని క్రీస్తు నమ్మాడు. వాదన ముగుస్తుంది! యోనా దానిని తేటగా ఇలా చెప్పాడు,

"నేను మరెన్నటికినీ ఎక్కిరాకుండా భూమి గడియలు వేయబడియున్నవి; పర్వతముల పునాదులలోనికి నేను దిగి యున్నాను: నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించి యున్నావు" (యోనా 2:6).

కూపమునకు హెబ్రీ పదము "సచత్." దాని అర్ధము "సమాధి," అది యోనా మరణాన్ని సూచిస్తుంది.

యోనా మొదటి రెండు అధ్యాయాలు మార్పును చూపిస్తున్నాయి. చాలా రీతులుగా నా మార్పును అది ఉదాహరిస్తుంది. దేవుడు యోనా హృదయంతో మాట్లాడి నీనెవేకు వెళ్లి బోధించమని చెప్పాడు. దేవుడు నా హృదయంతో మాట్లాడి నన్ను సాక్షిగా ఉండమన్నాడు. యోనా దేవుని సన్నిధి నుండి పారిపోయాడు. ఓడలోనికి వెళ్లి నినేవేకు సాధ్యమైనంత దూరంగా పారిపోదలిచాడు. నేను హంటింగ్ టన్ పార్క్ సంఘాన్ని వదిలి లాస్ ఎంజిలాస్ వీదులలో అంధకారములో భయంలో తిరిగాను. యోనా చేసినట్టు నేను దేవుని నుండి పారిపోయాను. కానీ దేవుడు యోనా ఉన్న ఓడలోనికి గొప్ప తుఫాను రప్పించాడు. నేను ఇటు అటు తిరుగుతూ నిరీక్షణ లేదనుకున్నాను. యోనా సముద్రములో పడవేయబడి గొప్ప చేపచే మింగబడ్డాడు. నేను చైనీయ గుడికి వెళ్లి కళాశాలకు వెళ్ళు ప్రయత్నించాను. నేను మనస్థాపము నిరీక్షణ లేని స్థితిచే మ్రింగి వేయబడ్డాను. నాకు కారు లేదు కాబట్టి కళాశాలకు వెళ్ళలేక పోయాను. చాలా గంటలు బస్సులో ప్రయాణించవలసి వచ్చింది. కళాశాల నుండి వచ్చాక పనిచేయవలసి వచ్చేది. చదవడానికి సమయము ఉండేది కాదు. నేను విఫలుడనవు తున్నానని నాకు తెలుసు. నేను దయ్యముచే మింగబడినట్టుగా నాకు అనిపిస్తుంది. వెలుగు లేదు. నిరీక్షణ లేదు. సమాధానము లేదు. నాకు కూడ యోనా వలే చేప కడుపులో ఉన్నట్టు అనిపించింది.

"ప్రాణాంతకము వచ్చునంతగా, జలములు నన్ను చుట్టూ కొనియున్నాయి: సముద్ర గాదము నన్ను ఆవరించి యున్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని యున్నది. నేను మరి ఎన్నటికి ఎక్కిరాకుండా [భూమి] గడియలు వేయబడి యున్నవి; పర్వతముల పునాదులలోనికి నేను దిగి యున్నాను..." (యోనా 2:5, 6).

నాకు అలాగే అనిపించింది. దానిని గ్రహించలేదు, కాని దేవుడు నాకు జీవితము యొక్క శూన్యతను నిరీక్షణ లేని స్థితి చూపిస్తున్నాడు. నా పాపములు నాముందే ఉన్నాయి!

యవనస్థుడు, సెర్జియో మెలో వలే నాకు అనిపించింది. ఒప్పుకోలు వచ్చినప్పుడు, సెర్జియో అన్నాడు, "ఈ భారాన్ని నేను ఇక మొయ్యలేను. భారంతో కలవర పడ్డాను...భయంకర శ్రమలో ఉన్నాను, పాప నేరారోపణతో...నన్ను ఏదీ నవ్వించలేక పోతుంది ఈ కష్టముల నుండి బయటకు తీయలేకపోతుంది...నాతో అనుకున్నాను, ‘ఇప్పుడు చనిపోతే మంచిది?’ ‘నేను ఇప్పుడే చనిపోలేను, ఈ స్థితిలో కాదు.’ వెళ్తున్న ప్రతి ఒక్కరి ముఖం చూడడం ప్రారంభించాను, డాక్టర్ హైమర్స్ చెప్పింది అది జ్ఞాపకము చేసింది, ఆయన ప్రజలను ఆత్మల విషయమై శ్రద్ధ లేని వారిగా చూసాడు." ఆయన సెర్జియో, అర్ధరాత్రి లోతైన ఒప్పుకోలుతో ఇంటికి నడుచుకుంటూ వెళ్ళాడు, సముద్ర అగాధములో, యోనా వలే.

జాన్ కాగన్ కు కూడ అలాంటి అనుభవమే. జాన్ అన్నాడు, "నా మార్పుకు [ముందు] వారాలలో చనిపోవాలనుకున్నాను; నిద్రపట్టలేదు, నవ్వులేదు. ఎలాంటి శాంతి లేదు...దేవుడు మార్పును గూర్చిన తలంపులన్ని తిరస్కరించాను, ఆలోచించడానికి నిరాకరించాను, శాంతి దొరకలేదు... వేధింపబడ్డాను...నన్ను నేను అసహ్యించుకున్నాను, నా పాపాన్ని, అది నన్ను ఎలా చేసిందో...నా పాపాలు నిరంతరంగా దారుణమయ్యాయి."

సోరియా యాన్సీ అన్నాడు, "డాక్టర్ హైమర్స్ పాపముపై గట్టిగా బలంగా బోధించాడు... నేను చేసిన తప్పులన్నీ గుర్తు చేసుకున్నాను. నా తలంపులలో, పాపము, అబద్ధాలు ఇంకా చాలా [ఇతర] పాపాలు. నేను సిగ్గుపడి దేవుని ఎదుర్కోలేక పోయాను... నేను ఏడ్చాను. నేననుకున్నాను, ‘నేను క్రీస్తును కనుగొనలేదు’...బాగా ఏడ్చాను. క్రీస్తును రక్షకునిగా కలిగియుండ లేనని అనుకున్నాను."

యోనా అన్నాడు, "జలములు నన్ను చోట్టుకొని యున్నవి, ప్రాణాంతకము వచ్చునంతగా: సముద్ర గాధము నన్ను ఆవరించి యున్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని యున్నది...ప్రవాహములు తరంగములు నన్ను చుట్టుకొని యున్నవి" (యోనా 2:5, 3).

నాకు అలాగే అనిపించింది క్రీస్తు నా దగ్గరకు వచ్చే వరకు, క్రీస్తు తన ప్రేమను నాపై క్రుమ్మరించాడు, నేను పాడాను, "అద్భుత ప్రేమ, ఎలా సాధ్యము, నా దేవుడవైన నీవు నా కొరకు చనిపోవడం?" యోనా మోర పెట్టి ఇలా అన్నాడు, "రక్షణ ప్రభువుది" (యోనా 2:9).

"అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞా ఇయ్యగా, అది యోనాను నేలమీద కక్కివేసెను" (యోనా 2:10).

దేవునికి స్తోత్రము! నీవు క్రీస్తును విశ్వసించిన వెంటనే నీ పాపముల నుండి "వాంతి చేయబడతావు"! దెయ్యపు బంధకాల నుండి వాంతి చేయబడతావు! మరణము నుండి వాంతి చేయబడతావు – యేసు క్రీస్తు నందలి నూతన జీవములోనికి! నా ప్రియ స్నేహితులారా, మీరు యేసు వైపు తిరిగితే యోనా సరియే అని అనిపిస్తుంది – "రక్షణ ప్రభువుది." ఆధునిక అనువాదము చెప్తుంది, "రక్షణ ప్రభువు నుండి వస్తుంది." అది క్రీస్తులో దేవుని నుండి ఉచిత బహుమానము.

రక్షణ అవసరత చూస్తున్నారా? అవసరత అనిపించక పోవడం సామాన్యము. మానవులు వారి సహజ సామాన్య స్థితిలో, వారికి అవసరత అనిపించదు. సెర్జియోకు, జాన్ కాగన్ కు, సోరియాకు జరగడం ఒక అద్భుతము – యోనాకు జరిగినట్టు – లేక ఇరవై సంవత్సరాలప్పుడు నాకు జరిగినట్టు, లాస్ ఎంజిలాస్ వీధులలో ఒంటరిగా నడిచేటప్పుడు. ఒక వ్యక్తి ఒప్పుకోలుకు పరిశుద్ధాత్మ అద్భుతము అవసరము. పరిశుద్ధాత్మ కార్యములు మాత్రమే. ఒక వ్యక్తి హృదయంలో ఇలా అనుకునేలా చేస్తుంది, "నా పాపము ఎల్లప్పుడూ నా యెదుట నున్నది" (కీర్తనలు 51: 3).

మిమ్ములను మీరు పరీక్షించుకున్నారా? మీ హృదయము చూసుకున్నారా? మీరలా చెయ్యకపోతే నిరీక్షణ లేదు. చాలా మంది దాని నుండి పారిపోతున్నారు – యోనా దేవుని సన్నిధి నుండి పారిపోయినట్టు. ప్రజలు పాపాన్ని గూర్చి ఆలోచించరు. కొందరైతే నిరంతరంగా విడియో గేములు చూస్తారు, దేవుని నుండి దాచుకోవడానికి. ఇతరులు ఏవో పనులు చేస్తూ పారిపోతుంటారు – ఆలోచన నుండి తప్పుకోవడానికి. కొందరు పనిలో చదువులో, భవిష్యత్తును చూడడం, ఇంకా మిగిలినవి చేస్తారు పాపమును గూర్చి ఆలోచించకుండా ఉండడానికి. డాక్టర్ ల్లాయిడ్ జోన్స్ అన్నాడు, "మీరు మీ జీవితము కొరకు ఆత్మ కొరకు పోరాడాలి. మిమ్ములను మీరు చూసుకోకుండా చేయడానికి లోకము చేయవలసినదంతా చేస్తుంది" – మీ పాపమును గూర్చి ఆలోచించకుండా చెయ్యడానికి ("పాపి యొక్క ఒప్పుకోలు").

మీ అతిక్రమములను గూర్చి ఆలోచించాలి. అతిక్రమము అంటే తిరుగుబాటు అని అర్ధము, నీ మార్గము కలిగి ఉండాలనే కోరిక, తప్పు చేయాలనే కోరిక. దాని అర్ధము నీ మనస్సాక్షికి తప్పని తెలిసినా చేయడం. అది బాహాటపు పాపపు క్రియ. మీ మనస్సాక్షి "వద్దు" అని చెప్తుంది – కాని మీరు చేస్తారు. అది అతిక్రమము అంటే!

మీ అక్రమము గూర్చి ఆలోచించాలి. దాని అర్ధము మీరు ఆలోచించారు లేక చేసారు, విపరీత పనులు – చెడు ఆలోచనలు, వంచబడినవి, త్రిప్పబడినవి, అసహ్యమైనవి, సరికానివి – అక్రమము మీ హృదయాలలో మీ జీవితములో!

తరువాత పదము "పాపము." దాని అర్ధము "ప్రమాణము కోల్పోవుట." అది ఒక వ్యక్తి గురిని చూచి కాల్చడం, కాని గురి తప్పడం. దాని అర్ధము ఉండవలసిన రీతిగా ఉండకపోవడం. అంటే జీవించవలసిన రీతిలో జీవించక పోవడం. అంటే మీరు గురి తప్పిపోయారు. దేవుడు జీవించమని చెప్పిన రీతిలో జీవింపలేకపోవడం. అందుకే ఆనందము ఉండదు!

దేవుని ఆత్మ ఈ విషయాలన్నీ మీ మనస్సులోనికి తీసుకొని వచ్చినప్పుడు, వాటిని త్రోసి పుచ్చవచ్చు. అప్పుడు మీరు ఒప్పుకోలు క్రిందకు వస్తారు. ఆ తలంపులు త్రోసి పుచ్చకుండా ఉండేటట్టు చూసుకోండి. లేనిచో, ఇంకొక అవకాశము మీకు ఉండదు. దేవుడు తిరిగి ఒప్పుకోలు క్రిందకు మిమ్ములను తీసుకొని రాడు. దేవుడు అలా చెయ్యకపోతే, మీరు నాశనమవుతారు నిత్యత్వములో నశించి పోతారు, మీరు ఈ లోకములో జీవించడం కొనసాగించినప్పటికీ.

మా ప్రార్ధన పరిశుద్ధాత్మ మీలో అసంతృప్తి కలిగించాలని, నశించి పోయారని, విరక్తి చెందారని, ఉన్నారని తెలుసుకోనేటట్టు చెయ్యాలని – నిరీక్షణ లేకుండా! అప్పుడే మీరు చెప్పగలరు, "నా దోషములు నా తల మీదుగా పొర్లి పోయినవి: నేను మోయలేని బరువు వలే అవి నా మీద మోపబడియున్నవి" (కీర్తనలు 38:4). అప్పుడు మీకనిపిస్తుంది యేసు మాత్రమే మీకు సహాయము చేయగలడని. అప్పుడు మాత్రమే మీకనిపిస్తుంది సిలువపై కార్చబడిన యేసు రక్తము మాత్రమే, మిమ్ములను శుద్ధి చేస్తుందని. అప్పుడే మీతో మీరు ఆటలాడడం మానేస్తారు. అప్పుడు మాత్రమే మీ పాపాన్ని అసహ్యించుకొని యేసు వైపు తిరిగి, ఆయనను మాత్రమే నమ్ముకుంటారు. అప్పుడే మీరు యోనాతో పాటు చెప్పగలరు, "రక్షణ ప్రభువు నుండి వస్తుంది" (యోనా 2:9). అప్పుడు మాత్రమే ఆ పాటలో చెప్పబడినట్టు మీరు చేస్తారు,

నేను వస్తున్నాను, ప్రభు!
ఇప్పుడే మీ దగ్గరకు వస్తున్నాను!
నన్ను కడుగు, రక్తములో నన్ను శుద్ధి చేయి
కల్వరిలో ప్రవహించిన రక్తములో.
("నేను వస్తున్నాను, ప్రభు" లూయిస్ హార్ట్ షా చే, 1828-1919).

యేసు రక్తముచే కడుగుబడుటను గూర్చి మాతో మాట్లాడాలనుకుంటే, మీ స్థలము వదిలి ఆవరణము వెనుకను డాక్టర్ కాగన్ జాన్ కాగన్ ను వెంబడించండి. ఒక ప్రశాంత గదికి తీసుకొని వెళ్లి మీతో మాట్లాడి ప్రార్ధిస్తారు. ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఎబెల్ ప్రుదోమ్: యోనా 2:1-9.
ప్రసంగము ముందు పాట బెంజమెన్ కినీకెయిడ్ గ్రిఫిత్ గారు:
"నేను వస్తున్నాను, ప్రభు" (లూయిస్ హార్ట్ షా చే, 1828-1919).
“I Am Coming, Lord” (by Lewis Hartsough, 1828-1919).