Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
దేవుడు జవాబిచ్చే ప్రార్ధనలు

THE PRAYERS GOD ANSWERS
(Telugu)

డాక్టర్ ఆర్. యల్. హైమర్స్, జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము సాయంకాలము, మే 22, 2016
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, May 22, 2016

"ఏలీయా మనవంటి స్వభావము గల మనష్యుడే, వర్షింప కుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్ధన చేయగా: మూడున్నర సంవత్సరములు వరకు భూమి మీద వర్షింప లేదు" (యాకోబు 5:17).


ఏలీయా ఈ ప్రార్ధనలు చేయడం పాత నిబంధనలో చెప్పబడక పోవడం ఆసక్తికరము. అది మనకు చెప్తుంది ప్రవక్తకు తెలుసు చెప్పబడని ప్రార్ధనలకు కూడ దేవుడు జవాబు ఇస్తాడని (I రాజులు 17:1). నాకనిపిస్తుంది ఏలియా ప్రార్ధనలు ప్రత్యేక దర్శనములో యాకోబుకు చెప్పబడ్డాయి. కాని పాత నిబంధన రాజైన ఆహాబుకు ప్రవక్త ఏమి చెప్పాడో తెలియచేస్తుంది. డాక్టర్ మెక్ గీ అన్నారు ప్రవక్తలు మనష్యులతో మాట్లాడారు, కాని యాజకులు దేవునితో మాట్లాడారు. ఏలియా ఒక ప్రవక్త, ఏలియా ఆహాబుకు ఏమి చెప్పాడో అదే బైబిలు తెలియచేస్తుంది. ఏలియా దేవునికి చెప్పినది గుప్తముగా ఉంది అది దేవుడు యాకోబుకు బయలు పరచే వరకు. ఏలియా ఆహాబుతో మాట్లాడి ఇలా అన్నాడు,

"ఎవని సన్నిధిని నేను నిలబడి యున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు, నామాట ప్రకారము గాక, ఈ సంవత్సరంలో ముంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను" (I రాజులు 17:1).

మనకు కరువు వర్షమును గూర్చిన ఏలీయా ప్రార్ధనను గూర్చి అంతగా తెలియదు యాకోబు 5:17 దేవుని ప్రేరేపణను బట్టి యాకోబు కు ఇవ్వబడకపోతే (II తిమోతి 3:16).

పాఠ్యభాగము తెలియ చేస్తుంది ఏలియా "ఆసక్తితో" కరువును గూర్చి వర్షమును గూర్చి ప్రార్ధించాడని. "ఆసక్తితో" పదమునకు గ్రీసు అనువాదము అర్ధము "అతడు ప్రార్ధనతో ప్రార్ధించాడు." ధామస్ మాంటన్ (1620-1677) అన్నాడు దాని అర్ధము "నాలుకకు హృదయానికి మధ్య అంగీకారము; హృదయము ప్రార్ధించింది నాలుక [కూడ] ప్రార్ధించింది" (Commentary on James, The Banner of Truth Trust, 1998 reprint). నేను నమ్ముతాను అది గట్టి స్వరముతో ప్రార్ధించుట కంటే ఎక్కువని. నేననుకుంటాను మాంటన్ సరిగానే చెప్పాడు హృదయము ప్రార్ధనలోని మాటలు అంగీకరించాలని. దాని అర్ధము హృదయము ఆసక్తితో ఆశిస్తుంది ప్రార్ధనలలో చెప్పే మాటలతో.

చాలా సంవత్సరాలుగా ప్రార్ధనకు అద్భుత సమాధానాలు నేను చూసాను. కాని ప్రార్ధించిన ప్రతిదానికి వెంటనే జవాబు పొందుకోలేదు. ప్రార్ధనకు గొప్ప జవాబులు దొరికాయి నేను ప్రార్ధిస్తున్న దాని విషయంలో గొప్ప భారము నేను కలిగి యున్నప్పుడు. దాని గూర్చి నేను ఆలోచింప కుండా ఉండలేను. పాతకాలపు క్రైస్తవులు దానిని "భారము" అని పిలుస్తారు, అది మీకు బరువుగా ఉంటుంది, లోతైన భారము ఉంటుంది, లోతుగా దానిని గూర్చి భారము కలిగి ఉంటారు. జవాబు వచ్చే వరకు దానిని గూర్చి ప్రార్ధిస్తూ ఉంటారు.

క్రీస్తు రెండు ఉపమానములు ఇచ్చారు భారముతో ప్రార్ధన కొనసాగించడంలో ఉన్న ప్రాముఖ్యతను గూర్చి జవాబు పొందుకునే వరకు. "పట్టు వదలని స్నేహితుని గూర్చిన ఉపమానము." దాని అర్ధము "అదేపనిగా" లేక "తొందర పెడుతూ." అది లూకా సువార్త 11:5-113 లో ఇవ్వబడింది, ఇది స్కోఫీల్డ్ పఠన బైబిలులో 1090 వ పేజీలో ఉంది. దయచేసి నిలబడి గట్టిగా చదవండి.

"మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవనికైన ఒక స్నేహితుడు ఉండగా, అతడు అర్ధరాత్రి వేళ, ఆ స్నేహితుని యొద్దకు వెళ్లి, స్నేహితుడా, నాకు మూడు రొట్టెలు బదులిమ్ము; నా స్నేహితుడు ప్రయాణము చేయుచూ, మార్గములో నా యొద్దకు వచ్చియున్నాడు? అతనికి పెట్టుటకు నా యెద్ద ఏమియు లేదని అతనితో చెప్పిన యెడల, అతడు లోపలనే యుండి నన్ను తొందర పెట్టవద్దు: తలుపు వేసియున్నది, నా చిన్న పిల్లలు నాతో కూడ పడుకొని యున్నారు; నేను లేచి ఇయ్యలేనని చెప్పునా. అతడు, తన స్నేహితుడైనందున, లేచి ఇయ్యాక పోయినను, అతడు సిగ్గుమాలి మాటిమాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసిన వన్నియు ఇచ్చునని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును, అడుగుడి, మీకియ్యబడును; వెదకుడి, మీకు దొరకును; తట్టుకు, మీకు తీయబడును. అడుగు ప్రతివానికి య్యబడును; వెదుకు వానికి దొరకును; తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రియైన వాడు తన కుమారుడు రొట్టె నడిగితే, రాయి ఇచ్చునా? చేపనడిగితే, చేపకు ప్రతిగా పామునిచ్చునా? గుడ్డు నడిగితే, తెలునిచ్చునా? కాబట్టి, మీరు చెడ్డవారై యుండియు, మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్య నెరిగి యుండగా: పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించుననెను?" (లూకా 11:5-13).

కూర్చోండి.

మొత్తము ఉపమానము మనకు నేర్పుతుంది మనము అడుగుతూ ఉండాలి ప్రార్ధిస్తూ ఉండాలి మనము అడిగినది పొందుకునే వరకు. వచనములు తొమ్మిది పది చెప్తున్నాయి,

"అటు వలే మీరును, అడుగుడి, మీకియ్యబడును; వెదకుడి, మీకు దొరకును; తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును; వెదకు వానికి దొరకును; తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను" (లూకా 11:9-10).

"అడుగుడి," "వెదకుడి," "తట్టుడి" ఇవి గ్రీకులో వర్తమానకాలమునకు సంబందించినది. అవి ఎలా అనువదింపబడవచ్చు "అడుగుతూ ఉండండి, వెదకుతూ ఉండండి, తట్టుచు ఉండండి." ఇప్పుడు 13 వచనము చూడండి,

"కాబట్టి, మీరు చెడ్డవారై యుండియు, మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి యుండగా: పరలోక మందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించును?" (లూకా 11:13).

కనుక ఎడతెగని ప్రార్ధనలకు దేవుడు జవాబిచ్చి అవసరతలో ఉన్న మన "స్నేహితులకు" దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. డాక్టర్ జాన్ ఆర్. రైస్ సరిగ్గా చెప్పాడు ఇది ఆత్మల సంపాదనకు పరిశుద్ధాత్మ శక్తిని గూర్చి అడిగే క్రైస్తవులకు వర్తిస్తుంది (Prayer: Asking and Receiving, pp. 212, 213).

కాని అదే బోధ మత్తయి 7:7-11 లో కూడ ఇవ్వబడింది. స్కోఫీల్డ్ పఠన బైబిలులో 1003 వ పేజీలో ఉంది. గట్టిగా చదవండి,

"అడుగుడి, మీకియ్యబడును; వెదకుడి, మీకు దొరకును; తట్టుడి, మీకు తీయబడును: అడుగు ప్రతివాడును పొందును; వెదకు వానికి దొరకును; తట్టువానికి తీయబడును. మీలో ఏమనుష్యుడైనను, తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన యెడల, వానికి రాతినిచ్చునా? చేపనడిగితే, చేపకు ప్రతిగా పామునిచ్చునా? కాబట్టి, మీరు చెడ్డవారై యుండియు, మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్య నెరిగి యుండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించుననెను?" (మత్తయి 7:7-11).

11 వ వచనంలో వేరే పదాలుండడం మీరు గమనిస్తారు. లూకా 11 లో యేసు చెప్పాడు, "పరలోకమందున్న తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించును?" కాని మత్తయి 7:11 లో యేసు చెప్పాడు, "పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులనిచ్చును?"

ప్రవక్త ఏలీయా వర్షింపకుండునట్లు ప్రార్ధించగా, మూడున్నర సంవత్సరాల వరకు వర్షము రాలేదు. ఆ భారాన్ని దేవుడు అతని హృదయములో ఉంచాడు. మరల, ప్రార్ధించగా, వర్షాన్ని ఆపడం ద్వారా దేవుడు జవాబిచ్చాడు. కొన్నిసార్లు దేవుడు వెంటనే జవాబిస్తాడు. కొన్నిసార్లు దేవుడు జవాబు ఇవ్వడు.

త్వరగా దేవుడు నా ప్రార్ధనకు జవాబిచ్చిన రాత్రి నాకు గుర్తుంది. నాకు పన్నెండు సంవత్సరాలు. టుపంగ కాన్యాన్ పైన ఒక జంటతో నివసించడానికి నేను పంపబడ్డాను. అక్కడ రెండు నెలలు పాఠశాలకు వెళ్ళాను – ఇరవై రెండు పాఠశాలలో అది ఒకటి దాని నుండి పట్టభద్రుడనయ్యాను. అందుకే నేను వెళ్లిన తొలిసారే కళాశాల నుండి పంపి వేయబడ్డాను. ఇరవై రెండు సార్లు ఇటు అటుకు కదిలితే, ఎక్కువ నేర్చుకోలేము. ఎలా చదవాలో నేర్చుకున్నాను. దీర్ఘంగా ఎలా వ్రాయాలో నేర్చుకున్నాను. ఎలా కలపాలో తియ్యాలో నేర్చుకున్నాను. అంతే. కాని టోపంగ కాన్యాన్ పైన, పినతల్లితో ఉండేవాడిని, ఆమె ఎప్పుడు త్రాగుతూ ఉండేది. ఒక రాత్రి నా సహోదరుడు అతని స్నేహితుడు తాగుతున్నారు. వాస్తవానికి, బాగా తాగారు. వారన్నారు, "రా, రాబర్ట్. కారులో కలిసి బయటకు వెళ్దాం." నాకు వెళ్లాలని లేదు, నేను పన్నెండు సంవత్సరాల వాడినే, ఆ పెద్ద వారు నన్ను లాక్కెళ్ళి కారు వెనుక పడేసారు. అది 1940 పినతండ్రి ఫోర్డ్ కారు. దానిలో ముందు సీతే ఉంది. నన్ను వెనుక సీట్లో పడేసారు. వారు బీరు విస్కీ తాగుతున్నారు. ఆ "చిన్న ప్రయాణము" భయంకరంగా మారి, సముద్ర మార్గానికి వెళ్ళింది. మీరు ఆ మార్గములో వెళ్లి ఉంటే అది ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. దాని అంతా పొగమయమయింది. వారు బాగా తాగి ఉన్నారు నా సహోదరుడు కొండ ప్రక్కన నుండి గంటకు అరవై మైళ్ళ వేగముతో పయనిస్తున్నాడు. వేగ పరిమితి, 25 మైళ్ళు, కాని వారు 65 లేక 70 లో వెళ్తున్నారు. నేను జీవించినంతకాలము అది నేను మర్చిపోలేను. అప్పుడప్పుడు దాని గూర్చి చాలా భయపడుతుంటాను. తలదించి నాకు తెలిసిన ప్రార్ధన చేసాను. ప్రభువు ప్రార్దన చేసాను పర్వతము ప్రక్క – "దుష్టుని నుండి మమ్మును తప్పించుము." ఈ మాటలు గట్టిగా పలుకుచూ, కొండ దిగువన నేను కారు దిగి చీకటిలో నిలబడ్డాను. మమ్ములను దేవుడే రక్షించాడని తెలిసింది. ఆ రహదారిలో పెద్ద ప్రమాదాలు జరిగి ఉండేవి. కారు అంచులు తాకి అగ్ని మంటలలో కాలిపోవడం చూసాను. దేవుడు ప్రార్ధనకు జవాబిచ్చి మమ్ములను రక్షించాడు. అప్పుడు నాకు తెలుసు, ఇప్పుడు నాకు తెలుసు, అరవై మూడు సంవత్సరాల తరువాత! చాలాసార్లు దేవుడు చిన్న ప్రార్ధనలకు జవాబు ఇస్తాడు ఆ రాత్రి చేసినట్టు.

కాని మిగిలిన సమయాలలో మనం కనిపెట్టాలి, కొన్నిసార్లు చాలాకాలము, జవాబు రావడానికి. పదిహేడవ ఏట నటుడు కాకుండా పరిచర్యలోనికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను. భావోద్రేకము లేదు, ఎలాంటి అనుభూతి లేదు. బోధించడానికి "పిలువబడుట" అనేది వినినట్టు నాకు గుర్తు లేదు. ఎవరో చెప్పి ఉంటారు, నేను ఎన్నడూ వినలేదు. అప్పటిలో బోధించడానికి "సమర్పించుకోవడం" గూర్చి మాట్లాడే వారు. సంఘ కాపరులు మాట్లాడేవారు ఎన్నో కష్టాలు పడి చివరకు కాపరిగా "సమర్పించుకోవడం" నేను ఏ శ్రమ ద్వారా వెళ్ళలేదు. మంచిది, నేను ఎలాంటి శ్రమలను అనుభవించలేదు. నేననుకున్నాను నటించడం అవివేకము నిరుపయోగమని, బోధించడానికి సమర్పించుకున్నాను, దాని అర్ధమేదైనా! నేను దేవుని చిత్తానికి అప్పగించుకున్నాను. అదే చైనీయ సంఘానికి నడిపించింది, మిస్సనరీ అవడానికి. గొప్ప చైనా మిస్సెనరీ జేమ్స్ హేడ్ సన్ టేలర్, జీవితాన్ని గూర్చి చదివాను. నాకు తెలుసు అతడు వెంబడించడానికి నాకు ఒక గొప్ప మార్గదర్శకుడు అని.

కనుక నేను చైనీయ సంఘములో ఉండి ఉన్న ప్రతి పనిచేసే వాడిని. గుడికి తోటమాలిని కూడ అయ్యాను, నెల ఊడ్చి, కుర్చీలు వేసి, దేవుని సేవించడానికి ఏపని అయినా చేసేవాడిని. ఆ సమయంలో మూడీ ప్రెస్ నుండి ముద్రింపబడిన, జాస్ వెస్లీ సంచిక నుండి కొన్ని ప్రతులు కొన్నాను. ఒక బైబిలు వలే, అవన్నీ చదివాను. అది అప్పుడు నేను గ్రహించలేదు కాని అది నాకు మొదటి గొప్ప మేల్కొలుపును గూర్చి ఒక అవగాహన ఇచ్చింది. ఉజ్జీవమును గూర్చిన విషయము వెస్లీ సంచిక నాకు గొప్ప ఆసక్తిని ఇచ్చింది. నేను బాగా చిన్నవాడిని అనుభవము లేని వాడిని 1960 లో ఉజ్జీవము ఎంత అరుదయిందో తెలుసుకోవడానికి. నాకు ఆలోచన ఉండేది, నేను ఉజ్జీవమును గూర్చి ప్రార్ధిస్తే అది వస్తుందని. కనుక చైనీయ సంఘ ఉజ్జీవము కొరకు ప్రార్ధించాను. ప్రతి రోజు ప్రార్ధించాను. ప్రతి ప్రార్ధన కూటములో గట్టిగా ప్రార్ధించేవాడిని. సంఘములో భోజనము ముందు ప్రార్ధించే అవకాశము వస్తే ఉజ్జీవము పంపమని దేవునికి ప్రార్ధించే వాడిని. 1960 అంతా దానిగూర్చే ప్రార్ధించాను. ఉజ్జీవము వచ్చినప్పుడు నేను ఆశ్చర్య పోలేదు, 1960 లో వేసవి కూటమిలో ఉజ్జీవము వచ్చినప్పుడు. అది వస్తుందని నాకు తెలుసు ఎందుకంటే, చిన్న పిల్లల వంటి విశ్వాసముతో, దాని కొరకు ప్రార్ధించాను. డాక్టర్ మర్ఫీ మరణానికి కొన్ని సంవత్సరాల ముందు ఆ ప్రార్ధనలను గూర్చి నాకు గుర్తు చేసాడు. అతనన్నాడు, "బాబ్, ఉజ్జీవం కొరకు ఎప్పుడు ప్రార్ధించే వాడిని, వేరే వారెవ్వరూ చేయకున్నా." అతనన్నాడు, "బాబ్, నీవు ప్రార్ధన చేస్తూ ఉన్నావు, కాబట్టి ఉజ్జీవము వచ్చిందని నమ్ముతాను." అది అతడు చెప్పేటప్పుడు దాని గూర్చి నేను మర్చిపోయాను.

చైనీయ సంఘము కొరకు ఉజ్జీవము నా హృదయంలో ఒక భారముగా ఉండేది. దేవుడు ఆ భారాన్ని నాలో ఉంచాడని నమ్ముతాను. దాని గూర్చి ఆలోచించకుండా ఉండలేను. దేవుడు జవాబిచ్చే వరకు దాని కొరకు ప్రార్ధించాను. పాతకాలపు క్రైస్తవులు దానిని "ప్రార్ధిస్తూ ఉండడం" అంటారు. అది ప్రాముఖ్యంగా, ఆసక్తితో ప్రార్ధించడం – దేవుడు జవాబు ఇచ్చే వరకు మీరు అడిగినది పొందుకునే వరకు! యేసు అన్నాడు,

"మీరు చెడ్డవారై యుండియు, మీ పిల్లలకు మంచి ఈవుల ఇయ్య నెరిగి యుండగా, పరలోకమందున్న తండ్రి, తన్ను [అడుగు వారిని] అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవుల నిచ్చును?" (మత్తయి 7:11).

మళ్ళీ, యేసు అన్నాడు,

"అటు వలే, మీరును అడుగుడి, మీకియ్యబడును; వెదకుడి, దొరకును; తట్టుడి, తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును; వెదకు వానికి దొరకును; తట్టు వారిని తీయబడును" (లూకా 11:9, 10).

"అడుగు," "వెదుకు" "తట్టు" గ్రీకులో వర్తమాన కాలములో ఉన్నాయి. దాని అర్ధము, "అడుగుతూ ఉండండి, వెదకుతూ ఉండండి, తట్టుచూ ఉండండి." డాక్టర్ జాన్ ఆర్. రైస్ అన్నాడు, "దేవుని బిడ్డకు హక్కు ఉంది...ఎడతెగక నిత్యమూ, దేవుని వాగ్ధానమును గూర్చి అడగడానికి, తిరస్కరణను నిరాకరించడానికి అవసరమైనది... దేవుని నుండి పొందుకునే వరకు. ఓ, నా దేవుని ప్రజలు ప్రోత్సహించబడాలి ప్రార్ధించడానికి, ప్రార్ధించడానికి, ప్రార్ధించడానికి – పొందుకునేంత వరకు!

ప్రార్ధిస్తూ ఉండండి
   ప్రార్ధించింది పొందుకునే వరకు,
ప్రార్ధిస్తూ ఉండండి
   ప్రార్ధించింది పొందుకునే వరకు,
దేవుని గొప్ప వాగ్దానాలు
   ఎప్పుడు సత్యమే,
ప్రార్ధిస్తూ ఉండండి
   ప్రార్ధించింది పొందుకునే వరకు".
(John R. Rice, D.D., Prayer: Asking and Receiving,
Sword of the Lord Publishers, 1970, pp. 213, 214).

డాక్టర్ ఆర్.ఏ. టోరీ, అతని గొప్ప చిన్న పుస్తకంలో, ప్రార్ధించుట ఎలా, అదే విషయము చెప్పాడు. డాక్టర్ టోరీ అన్నాడు,

     దేవుడు ఎప్పుడు మన మొదటి ప్రయత్నంలోనే అనుగ్రహించడు. ఆయన మనకు తర్ఫీదు నిచ్చి బలవంతులుగా చేస్తాడు కష్ట పడడానికి శ్రేష్టమైన విషయముల కొరకు... మొదటి ప్రార్ధనకు జవాబుగా అడిగిన వెంటనే ఎప్పుడు అనుగ్రహించడు. మనకు తర్ఫీదు ఇష్ట పడతాడు ప్రార్ధనలో బలవంతులుగా చేస్తాడు శ్రేష్టమైన వాటి కొరకు కష్టపడి ప్రార్ధించాలని బలవంత పెడతాడు. పొందుకునే వరకు ప్రార్ధింప చేస్తాడు.
     దీనిని బట్టి నాకు సంతోషము. ఇంకొక ఆశీర్వాదకర తర్ఫీదు లేదు మళ్ళీ మళ్ళీ అడగమని బలవంతము చేయుటకంటే, సుదీర్ఘ కాలము, అడిగేది దేవుని నుండి పొందుకునే వరకు. చాలామంది దానిని దేవుని చిత్తానికి అప్పగించుకొనుట అంటారు మొదటి రెండు సార్లు దేవుడు మానవులను అనుగ్రహించకపోతే. వారంటారు, "బహుశా, ఇది దేవుని చిత్తము కాకపోవచ్చు."
     నియమావళి ప్రకారము, ఇది అప్పగింత కాదు కాని ఆత్మీయ సోమరితనము... ఒక బలమైన స్త్రీ గాని పురుషుడు కాని ఒకటి సాధించాలనుకొని చేయకపోతే ఒకటి రెండు వంద ప్రయత్నాలలో, అతడు గాని ఆమె కాని అది పొందుకునే వరకు ప్రాధేయపడతారు. ఒక బలమైన ప్రార్ధనా పరుడు అడిగేది పొందుకునే వరకు ప్రార్దిస్తూనే ఉంటాడు... ఒకదానిని గూర్చి ప్రార్ధింప ప్రారంభించినప్పుడు, అది పొందుకునే వరకు వదిలి పెట్టకూడదు (R. A. Torrey, D.D., How to Pray, Whitaker House, 1983, pp. 50, 51).

కాని దానికి ఇంకొక వైపు ఉంది. మీ హృదయము దేవునితో సరిగ్గా లేనిచో మీ ప్రార్ధనలకు జవాబు దొరకదు. నేను నా కుటుంబాన్ని సెలవులకు జనవరి ఆరంభంలో కేన్కన్, మెక్సికోకు తీసుకెళ్ళాను. ఒకరోజు, వారు మాయున్ రూయిన్స్ చూడడానికి వెళ్ళినప్పుడు, నేను ఒంటరిగా ఉన్నాను. ఒక పుస్తకము చదివాను 1949 నుండి 1952 వరకు లూయిస్ దీవిలో వచ్చిన ఉజ్జీవమును గూర్చి. నేను ప్రార్ధించి ఒక ప్రసంగము వ్రాసాను. తిరిగి వచ్చాక ప్రతీ రాత్రి సువార్తిక కూటము పెట్టాలని ప్రకటించాను. మీకు తెలుసు, దేవుడు అందులో ఉన్నాడు. అది డాక్టర్ కాగన్ తన 89 సంవత్సరాల తల్లిని క్రీస్తు నోద్దకు నడిపించడంతో ప్రారంభమవుతుంది. అది ఒక గొప్ప అద్భుతము ఎందుకంటే ఆమె చాలా సంవత్సరాలుగా కఠినమైన నాస్తికురాలు. తరువత డాక్టర్ కాగన్ అత్తగారు మార్చబడ్డారు – 86 వ ఏట. లెక్కల ప్రకారం డబ్భై సంవత్సరాలు పైబడిన వారిలో మార్పులు చోటు చేసుకోవు. ఇక్కడ, కొద్ది రోజుల్లో, ఎనభై పై ఉన్న ఇద్దరు స్త్రీలు రక్షింపబడ్డారు. అద్భుతము! తరువాత, ఒకరి తరువాత ఒకరు, 11 మంది యవనస్తులు రక్షింపబడ్డారు. కొన్ని దినాల తరువాత, ఇంకొక మార్పిడి జరిగింది. కొన్ని దినాలలో పద్నాలుగు మంది రక్షింపబడ్డారు.

నేను రోమా 12:1 మరియు 2 చదివాను దానిని అనేక సంవత్సరాల క్రితం గుడిలో రక్షింపబడిన వారికి అన్వయించాను.

"కాబట్టి సహోదరులురా, పరిశుద్ధమును, దేవునికి అనుకూలమైన, సజీవ యాగాముగా, మీ శరీరములను, ఆయనకు సమర్పించుకొనుడని, దేవుని వాశ్చల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది: మీరు ఈలోక మర్యాదను, అనుసరింపక ఉత్తములను అనుకూలమును సంపూర్ణమునైన, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనునట్లు, మీ మనసు మారి, నూతనమగుట వలన రూపాంతరము పొందుడి" (రోమా 12:1, 2).

జనముల స్పందన ఉన్నంత వరకు నేర్చుకునే వరకు నేను బోధిస్తూనే ఉంటాను. అది మంచిదిగా అనిపించలేదు. నేను యవనస్తులను చూస్తున్నాను దవడలు బిగించి నేలపై చూస్తున్నారు. నేను లోతైన తిరస్కారము క్రీస్తు అపవిత్ర పరచాబడడం చూస్తున్నాను, వారు ఆయనకు ఎన్నడు సమర్పించుకోరు. నా హృదయములో చల్లని దిగ్భ్రాంతి చోటు చేసుకుంది. వారు మళ్ళీ మార్చబడాలా అనిపించింది. వారి హృదయాలలో క్రీస్తు స్థానంలో ఈలోక విషయాలు ఉంచుకొనే వారి స్థితి అంతే. వారి హృదయము మార్పుకు మునుపు ఉన్నంత కఠినము అయిపొయింది. హృదయము పగలింది మళ్ళీ క్రీస్తుకు సమర్పించబడాలి.

క్రీస్తుకు నిరంతరమూ అర్పించుకోడానికి తిరస్కరించే వారి హృదయాలలో తిరుగుబాటు పెత్తనము చేస్తుంది. ఆయన అన్నాడు నీ సిలువను ఎత్తుకొని "ప్రతి దినము, నన్ను వెంబడించాలి." "రోజు" క్రీస్తుకు సమర్పించుకోవాలి, లేనిచో మన హృదయాలు చల్లారి కఠినమవుతాయి. ఇలా అనుకోవడం తప్ప, "నేను రక్షింపబడ్డాను. నేను క్రీస్తుకు మళ్ళీ అర్పించుకునే అవసరత లేదు." పౌలు చెప్పిన దానికి అది ఎంత విరుద్ధంగా ఉంది, "సజీవ యాగాములుగా మీ శరీరములను సమర్పించుకోండి... దేవునికి, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈలోక మర్యాదను అనుసరించక ఉత్తమము: అనుకూలతను సంపూర్ణమైన దేవుని చిత్తమేమో." మీరు తెలుసుకుంటారు "పరీక్షించి తెలుసుకోనట్లు, మీ మనస్సు మారి, నూతనమగుట వలన, రూపాంతరము పొందుడి" (రోమా 12:1, 2). దేవుని చిత్తనము తెలుసుకోవడానికి సజీవ యాగాముగా మీ శరీరాలు ఆయనకు సమర్పించాలి, ఈలోక మర్యాదను అనుసరించకూడదు.

"సజీవ యాగాముగా" సమర్పించబడని హృదయము వేర్పాటు హృదయము. బైబిలు చెప్తుంది, "అట్టివాడు ప్రభువు వలన తనకు ఏమైనను దొరకునని తలంచు కొనరాదు" (యాకోబు 1:7). యేసు అన్నాడు, "ఎవడైనాను, నన్ను వెంబడింపగోరిన యెడల, తన సిలువను ఎత్తికొని, ప్రతిదినము నన్ను వెంబడింపవలెను" (లూకా 9:23). నిన్ను నీవు ఉపేక్షించుకోవాలని యేసు పిలిచుచున్నాడు. ఆయనను వెంబడించాలని పిలుస్తున్నాడు. ఓ, ఎన్నిసార్లు నా జీవితాలులో రక్షణానందము కోల్పోయాను ఎందుకంటే నన్ను నేను ఉపేక్షించుకోవడానికి ఆయనను వెంబడించడానికి నేను ఇష్ట పాడడం లేదు కాబట్టి! కాని, ఓ, ప్రభువులో ఆనందము ఎలా తిరిగి వచ్చింది, సమయానుకూలంగా, యేసుకు సజీవ యాగంగా అర్పించుకొని ఇష్టపడినప్పుడు! ఈరాత్రి మీరలా చెయ్యాలని నేను ప్రార్ధిస్తున్నాను. గ్రిఫిత్ గారు పాడిన పాట నా జీవితమంతా ప్రేమిస్తాను. ఒంటరి, తికమకలో ఉన్న యుక్త వయస్కునిగా, ఆ పాట పాడినప్పుడల్లా నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి,

ఓ కృపకు నేను గొప్ప ఋణస్తుడను
   రోజు నేను నియంత్రించుకుంటున్నాను!
మీ మంచితనము, సంకెళ్ళ వలే,
   నా తిరుగులాడే హృదయాన్ని మీకు బంధింపనిమ్ము.
తిరిగు వాడును, ప్రభు, నాకనిపిస్తుంది,
   నేను ప్రేమించే దేవుని విడిచే బుద్ధి గలవాడను;
ఇదిగో నా హృదయము, తీసుకొని ముద్రించు;
   పైనున్న నివాసాలకు దానిని ముద్రించు.
("రమ్ము, ప్రవాహమా" రాబర్ట్ రోబిన్ సన్ చే, 1735-1790).
(“Come, Thou Fount” by Robert Robinson, 1735-1790).

ఈ రాత్రి ఇక్కడ ఎవరైనా ఉన్నారా నూతనంగా మిమ్ములను మీరు ఉపేక్షించుకోవాలి – మీ సిలువను ఎత్తుకొని నూతనంగా యేసును వెంబడించలి? మీలో కొందరు "మీ శరీరములను" "సజీవ యాగములుగా" ఆయనకు సమర్పించాలి? మీతో దేవుడు అలా మాట్లాడుతూ ఉంటె, ఒక్క క్షణంలో, నేను మిమ్మును అడగబోవు చున్నాను మీ స్థలములను వదిలి ఇక్కడ ఆవరణంలో ముందర మోకాళ్లను వంచండి. వచ్చి నూతనంగా మీ జీవితాలు, అర్పించుకోండి, మిమ్ములను రక్షించడానికి సిలువపై మరణించిన యేసుకు అర్పించుకోండి. క్రిందికి వచ్చి మీ హృదయాలను జీవితాలను నూతనంగా తాజాగా యేసుకు సంపరించుకోండి. వచ్చి మీ హృదయంలో మీ జీవితంలో ఉన్న తిరుగుబాటును గూర్చి పాపమును గూర్చి ఆయన యెదుట ఒప్పుకొండి. వచ్చి మిమ్ములను క్షమించాలని యేసును అడగండి, ఆయనకు మీ విధేయతను పునరుద్ధరించుకోండి. మనము కలిసి నిలబడి ఉండగా, మీరు వచ్చి ఇక్కడ మోకరించండి, మరియు ప్రార్ధించండి. గ్రిఫిత్ గారు ఆ పాటను నెమ్మదిగా పాడుచూ ఉండగా, మీరు రండి.

రమ్ము, మీ ప్రతీ ఆశీర్వాదపు ఊట,
   మీ క్రుపను గూర్చి పాడేటట్టు నా హృదయాన్ని సంధానించు;
కృపా ప్రవాహాలు, ఎన్నటికి ఆగిపోవు,
   గట్టి స్తుతులతో కూడిన పాటలు పాడనిమ్ము.
నాకు మాధుర్య సంగీతాన్ని నేర్పించు,
   అగ్ని నాలుకలతో పైన పాడబడేవి;
పర్వతాన్ని స్తుతించు – నేను దానిపై నిలబడ్డాను –
   మీ విమోచించే ప్రేమ పర్వతము.

ఇక్కడ నేను నా ఎచేనే జారును పై కేట్టుచున్నాను,
   మీ సహాయముతో నేను ఇచ్చటకు వచ్చియున్నాను;
నా నిరీక్షణ, మీ మంచి ఆహ్లాదములో,
   భద్రముగా ఇంటికి చేరనిమ్ము.
యేసు నన్ను కనుగొన్నాడు నేను అపరిచితునిగా ఉన్నప్పుడు,
   దేవుని నుండి వైగోలగి తిరుగులాడుచున్నాప్పడు;
ఆయన, అపాయము నుండి నన్ను తప్పించడానికి,
   ఆయన తన ప్రశస్త రక్తాన్ని ధారపోసాడు.

ఓ కృపకు నేను గొప్ప రుణస్తుడును
   రోజు నేను నియంతించుకుంటున్నాను!
మీ మంచితనము, సంకెళ్ళ వలే,
   నా తిరుగులాడే హృదయాన్ని మీకు బంధింప నిమ్ము.
తిరుగువాడను, ప్రభు, నాకనిపిస్తుంది,
   నేను ప్రేమించే దేవుని విడిచే బుద్ధిగల వాడను;
ఇదిగో నా హృదయము, తీసుకొని ముద్రించు;
   పైనున్న నివాసాలకు దానిని ముద్రించు.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఎబెల్ ప్రుదోమ్: యాకోబు 4:1-10.
ప్రసంగము ముందు పాట బెంజమెన్ కినీకెయిడ్ గ్రిఫిత్ గారు:
"రమ్ము, మీ ప్రవాహము" (రోబర్ట్ రాబిన్ సన్ చే, 1735-1790).
“Come, Thou Fount” (by Robert Robinson, 1735-1790).