Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




నీ హృదయము ముండ్ల పొదనా?

IS YOUR HEART THORNY GROUND?
(Telugu)

డాక్టర్ ఆర్. యల్. హైమర్స్, జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము ఉదయము, మే 1, 2016
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, May 1, 2016

"అక్రమము విస్తరించుట చేత, అనేకుల ప్రేమ చల్లారును" (మత్తయి 24:12).


మన సంఘాలలో ఉన్న పొరపాటును అర్ధం చేసుకొనడానికి క్రొత్త నిబంధనలో ఇది మూల వచనము. ఈ వచనాన్ని వారు అర్ధం చేసుకోలేకపోతే మన సంఘాలలోని సమస్య సమస్యకు పరిష్కారము మీరు అర్ధము చేసుకోలేరు. అది అంత మూల వచనము మళ్ళీ మళ్ళీ, సంవత్సరము తరువాత సంవత్సరము, దశాబ్ధము తరువాత దశాబ్ధము నా మనసు దాని దగ్గరకే వెళ్తుంది. నేను మొదటిసారి బిల్లీ గ్రేహం నుండి ఈ వచనము విన్నాను. నేను యుక్త వయస్కునిగా ఉన్నప్పుడు ప్రతీ ఆదివారము మధ్యాహ్నము ఆయన రేడియోలో బోధించడం నేను విన్నాను. గ్రేహం గారు యుగ సమాప్తి సూచనలను గూర్చి బోధించేటప్పుడు తరుచు ఈ వచనము వాడేవాడు. అతని ఆఖరి మంచి పుస్తకము ప్రపంచము అగ్నిలో (డబుల్ డే 1965). బిల్లీ గ్రేహము ఈ ప్రకటన చేసారు,

         యేసు చెప్పాడు, "న్యాయము లేని స్థితి విస్తరించును, కాబట్టి ఒకరి పట్ల ఒకరి ప్రేమ చల్లారుతుంది" (మత్తయి 24:12 ఎన్ఈబి). "అంతేకాక, అంత్య దినములలో కదిలించే కాలములు వస్తాయి. మనష్యులు తమమును తాము, ప్రేమించుకుంటారు...దేవుని కంటే ఎక్కువగా; పైకి భక్తీ గలవారి వలే ఉండియు, వాని శక్తిని ఆశ్రయింపని వారునై యుందురు: అట్టి వారికి విముఖడవై యుండుము" (II తిమోతి 3:1-5)...ఇది ఎక్కువగా ఉండే వేషధారణను చూపిస్తుంది బహు జన సమూహములు యేసు క్రీస్తుతో వ్యక్తిగత అనుభవము లేకుండా సంఘములోనికి ప్రవేశిస్తాయి...అబద్ద ప్రవక్తలు సంఘములో చొరబడతారు...'పడిపోవుటకు,' వారు నాయకులు. యుగాంతములో సంఘము ఈ లక్షణాలు కలిగి ఉంటుంది (Billy Graham, D.D., World Aflame, Doubleday and Company, 1965, pp. 220, 221, 219).

తరువాత నేను డాక్టర్ యం. ఆర్. డిహాను కుమారునికి గ్రాహం గారు పంపిన గమనిక చదివాను. 1965 లో డాక్టర్ డిహాన్ కారు ప్రమాదంలో చనిపోయినప్పుడు, గ్రాహం గారు అన్నారు రేడియో కార్యక్రమాలలో డాక్టర్ డిహాను నుండి వినడం ద్వారా ఆయనకు చాలా తలంపులు వచ్చాయని. ఆయన పుస్తకములో కాలముల సూచనలలో, డాక్టర్ డిహాన్ అన్నారు,

మత సిద్ధాంతము ఉదాహీనత తరువాత చెప్పబడిన పాపాలు. "అక్రమము విస్తరించుట చేత, అనేకుల ప్రేమ చల్లారును" (మత్తయి 24:12). మానవ చరిత్ర ప్రారంభంలో అది ఎంత వాస్తవమో ఈనాడు కూడ అంతే నిజము. కొన్ని దశాబ్దాలలో, మనము పురిటాన్ తండ్రుల సామాన్య విశ్వాసము నుండి తొలగిపోయాయి... క్రైస్తవుల మధ్య అది సత్యముతో కూడిన విషాద విషయము "అనేకుల ప్రేమ చల్లారును." చాలామంది ప్రేమ చల్లారి పోయింది (M. R. DeHaan, M.D., Signs of the Times, Zondervan Publishing House, 1951, p. 58).

నేను బిల్లీ గ్రాహం మరియు డాక్టర్ డిహాన్ ల నుండి వినుచున్నప్పటి నుండి, నేను మత్తయి 24:12 పై ధ్యానిస్తూ ఉన్నాను. యేసు క్రీస్తు మాటలు, శిష్యుల ప్రశ్నకు సమాధానముగా చెప్పబడినవి, "యుగ సమాప్తికి, సూచనలు ఏమిటి?" ఆ ప్రశ్నకు క్రీస్తు సమాధానము మన పాఠ్యభాగము,

"అక్రమము విస్తరించుట చేత, అనేకుల ప్రేమ చల్లారును" (మత్తయి 24:12).

I. మొదటిది, ఇది ఎప్పుడు సంభవిస్తుందని క్రీస్తు చెప్పాడు?

ఆయన అన్నాడు ఇది జరుగుతుంది "[ఆయన] రాకడకు సూచనగా, యుగ సమాప్తి యందు" (మత్తయి 24:3). చాలా ఇతర లేఖనాలు అంత్య దినాల సూచనగా దీనిని చెప్పాయి. స్కోఫీల్ద్ గమనిక పేజీ (1033) దిగువన సరిగ్గా చెప్పాయి ఈ వచనము "యుగ సమాప్తికి ప్రత్యేకంగా అన్వయింప బడుతుందని...అంతములో భయకరత్వ తీవ్రత ఉన్న తరములో" (Scofield Study Bible, 1917, p. 1033; note on Matthew 24:3). నేను ఇంకా చాలా వచనాలు చెప్పగలను, II తిమోతి 3:1-13; యూదా 4, 19; ప్రకటన 3:14:22, మొదలగునవి.

అలా సంఘాలు ఎంత పతనమయ్యాయో యవనస్తులైన మీకు తెలియదు. కాని నా జీవిత కాలంలో అది తేటగా చూస్తున్నాను. ఒక స్థానిక సంఘ ఉజ్జీవము 1969 లో నేను చూసాను. 1971 లో ఒక భాగములో జరిగిన ఉజ్జీవము చూసాను. 1992 లో మరియొక స్థానిక సంఘములో ఉజ్జీవము చూసాను. కాని అప్పటి నుండి అమెరికాలో కాని, పాశ్చాత్య ప్రపంచంలో కాని అప్పటి నుండి ఉజ్జీవాన్ని గూర్చి, ఎన్నడూ వినలేదు! ఒక్కసారి కూడ! ఇప్పుడు, చాలా ఎక్కువగా, మత్తయి 24:12 లోని విషాద చిత్రాన్ని మన సంఘాలలో చూస్తున్నాము,

"అక్రమము విస్తరించుట చేత, అనేకుల ప్రేమ చల్లారును" (మత్తయి 24:12).

మన కాలములో బాప్టిస్టు మరియు సువర్తీకరణ సంఘాలలో ఈ పరిస్థితి ఉంది. ఇలాంటి రకమైన సంఘాలను గూర్చి యవనస్తులైన మీరు మీ సంక్షిప్త జీవిత కాలములో ఎప్పుడు చూచి ఉండరు విని ఉండరు. గతమునకు సంబంధించిన ఉజ్జీవాలను గూర్చి చదవకపోతే, ఈనాటి మన సంఘాలలోని ఉన్న భయంకర పరిస్థితిని గూర్చి మీకు అవగాహన ఉండదు! నేను అసహజంగా మాట్లాడుతున్నానని మీరు అనుకోవచ్చు మెరుగైన సంఘాన్ని గూర్చి నేను మాట్లాడుతున్నప్పుడు, మీ కొద్ది జీవిత కాలములో, మీరు ఎప్పుడు చూడలేదు, కాబట్టి వినలేదు కాబట్టి. మన సంఘములో మాట్లాడిన, డాక్టర్ కెన్నెత్ కొన్నొల్లి అన్నాడు, ఎప్పుడు ఉజ్జీవము చూడని తరములో మీరు జీవిస్తున్నారు – పాశ్చాత్య ప్రపంచంలో కనీసం ఒకసారి కూడ!

"అక్రమము విస్తరించుట చేత, అనేకుల ప్రేమ చల్లారును" (మత్తయి 24:12).

II. రెండవది, ఇది సంభవిస్తుందని క్రీస్తు ఎందుకు చెప్పాడు?

పాఠ్యభాగములోని మొదటి పదము గమనించండి, "మరియు." "అక్రమము విస్తరించుట చేత, అనేకుల ప్రేమ చల్లారును." గమనించండి "అనేకుల" అనే పదము 10 వ వచనము నుండి 12 వరకు. "మరియు...అనేకుల అభ్యంతర పడుదురు" (వచనము 10). "మరియు ఒకరినొకరు అప్పగించు కొందురు" (వచనము 10). "మరియు ఒకరినొకరు ద్వేషింతురు" (వచనము 10). "మరియు అనేకులైన అబద్ద ప్రవక్తలు వచ్చుదురు" (వచనము 11). "మరియు చాలా మందిని మోస పరచెదరు" (వచనము 11). "మరియు ఎందుకంటే అక్రమము విస్తరించుట వలన" (వచనము 12). ఈ దీర్ఘమైన "అనేకులు" అవి ఉత్పత్తి చేసే వాటితో ఆగుతాయి – అవి ఉత్పత్తి చేసేవి "అనేకుల ప్రేమ చల్లారును." "అనేకుల" యొక్క తుది ఫలితము సంఘాలలో "చాలామంది ["చాలా" ఎన్ఐవి] ప్రేమ చల్లారి [పోతుంది]." సంఘ చీలికలు సంఘములో గొడవలు 10 వ వచనములోనివి, అబద్ద బోధకుల కారణంగా వస్తాయి వారు ["తప్పుత్రోవ" ఎన్ఎఎస్ వి] ప్రజలను పట్టిస్తారు, తద్వారా సంఘాలలో [అనోమియా; "న్యాయము లేని స్థితి" ఎన్ఎఎస్ వి] ఉత్పన్నమవుతుంది, సంఘములో అంతా చల్లబడిన ప్రజలుంటారు వారికి "అద్వితీయ," క్రైస్తవ ప్రేమ ఉండదు –క్రీస్తు పట్ల ఉండదు, దేవుని పట్ల ప్రేమ ఉండదు, గుడిలో ఇతరుల పట్ల ప్రేమ ఉండదు! అక్కడ అవి ఉంటాయి! "అనేకులు" సముదాయము మనకెందుకు "గొప్ప సువార్తిక పతనము" వచ్చిందో చెప్తున్నాయి (to use Dr. Francis Schaeffer’s book title!). బాప్టిస్టు సువార్తిక సంఘాలు పతనానికి కారణము సంఘములో గొడవలు (వచనము 10), తగ్గట్టుగా అబద్ధపు బోధకులు (వచనము 11), మరియు విస్తారమైన న్యాయము లేని స్థితి చాలామంది మారని వెనుదిరిగిన సభ్యులలో, ఇది క్రీస్తు కొరకు ప్రేమలేని, ఒకరి పట్ల ఒకరికి ప్రేమలేని చల్లారి పోయిన సంఘాలను ఉత్పన్నము చేస్తాయి!

"అక్రమము విస్తరించుట చేత, అనేకుల ప్రేమ [పెరుగును] చల్లారును" (మత్తయి 24:12).

III. మూడవది, చల్లబడిపోయే చాలామంది ఎవరు?

"చాలామంది" అనగా మారని వారు, లోతుగా వెనుదిరిగిన వారు, నిరూపింపబడిన వాస్తవము ఈ తరము న్యాయము లేని ఆత్మ వారి ఉత్సాహాన్ని ప్రేమను అణగ దొక్కుతున్నారు. వారు "చల్లబడిపోతారు" ఎందుకంటే ఈ లోకపు ఆత్మ వారు చూపించే రోషపూరిత ప్రేమను అధిగమిస్తుంది.

విత్తువాని ఉపమానము ఎందుకు "చాలామంది" "చల్లారిపోతారో" తేటగా చూపిస్తుంది. విత్తువాని ఉపమానము నాలుగు రకాల ప్రజలను చూపిస్తుంది, సువార్త బోధకు ప్రతీ గుంపువారు ఎలా స్పందిస్తారో తెలియ చేస్తుంది. ఉపమానములో నాలుగు రకాల ప్రజలున్నారు. మొదటి మూడు రకాల వారు నిజమైన క్రైస్తవులు కాదు. డాక్టర్ జె. వెర్నోన్ మెక్ గీ అన్నాడు, "ఈ [మొదటి] మూడు రకాల మూడు రకాల విశ్వాసులను చూపించవు –వారు విశ్వాసులు కానేకాదు! వారు వాక్యాన్ని విని పొందుకున్నట్టు మాత్రము ప్రకటించారు" (J. Vernon McGee, Th.D., Thru the Bible, volume IV; note on Matthew 13:22). కనుక, నాల్గవ రకము వారు నిజంగా రక్షింపబడినవారు. మిగిలిన వారు నశించిన ప్రజలు.

ఉపమానములో "విత్తనము" దేవుని వాక్యము. డాక్టర్ మెక్ గీ అన్నాడు, "గమనించండి విత్తనము ఎక్కడ పడిందో. అది నాలుగు రకాల నెలలలో పడింది – మూడవ వంతు విత్తనము ఎదగలేదు – అవి చనిపోయాయి. విత్తనముతో సమస్య కాదు, సమస్య అంతా నేలతో." రోడ్డు ప్రక్కన పడిన విత్తనము, వారు వాక్యాన్ని వింటారు కాని సాతాను వెంటనే ఎత్తికొనిపోతుంది. వారెవరంటే వారు కొన్నిసార్లు గుడికి వస్తారు, కాని వారిలో చలనము ఉండనే ఉండదు. రెండవ రకము విత్తనము రాతినేలను పడుతుంది, వారు దేవుని వాక్యమును పొందుకుంటారు, కాని వారు సమస్యలతోను హింసలతోను పరీక్షింపబడినప్పుడు వారు పడిపోతారు. మూడవ రకము వారు ముండ్ల పొందలలో వాక్యము పొందుకుంటారు. వారు దేవుని వాక్యము విని మారినట్టు అనిపిస్తారు. లూకా 8:14 వినండి,

"ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన, వారెవరనగా, విని కాలము గడిచిన కొలది, ఈ జీవ సంబంధమైన విచారముల చేతను, ధన భోగముల చేతను అణచి వేయబడి, పరిపక్వముగా ఫలింపని వారు" (లూకా 8:14).

దేవుని వాక్యము "అణచి వేయబడుతుంది" – "విచారముల చేత జీవిత ధనభోగమూల చేత అణచి వేయబడుతుంది, పరిపక్వముగా ఫలింపరు" (పరిపక్వత); లూకా 8:14. డాక్టర్ మెక్ ఆర్డర్, క్రీస్తు రక్తము విషయంలో తప్పు చెప్పినా, లూకా 8:14 విషయంలో సరిగ్గానే చెప్పాడు. అతనన్నాడు, "ఈద్వి మనష్యులు (యూదా 1:8) తాత్కాలిక [ఈలోక] విషయాలతో మ్రింగి వేయబాడతారు – పాపపు భోగములు, చిరకాల కోరికలు, అత్యాశ, భవిష్యత్తు, గృహములు, వాహనాలు, ప్రతిష్ట, సంబంధ భాందవ్యాలు, ప్రఖ్యాతి – ఇవన్ని కూడ సువార్త విత్తనాన్ని అణచివేస్తాయి వారిలో పరిపక్వతతో కూడిన ఫలము ఉండదు... ఇది ముందుగా నింపబడిన లోకపూరిత హృదయము, ‘విచారములు జీవిత ధన భోగముల చేత అణచి వేయబాడతారు’" (The MacArthur New Testament Commentary; note on Luke 8:14).

మొదటివారు ఎలాంటి వారో చూడడం సులభము. "సాతాను వెంటనే వచ్చి, వారి హృదయాలలో విత్తబడిన విత్తనాన్ని వాక్యాన్ని ఎత్తికొని పోతుంది" (మార్కు 4:15). వారు కొన్ని ప్రసంగాలు వింటారు, మళ్ళీ వారిని తిరిగి చూడము. రెండవ రకము వారిని చూడడం కూడ చాలా సులభము. వారు రక్షింపబడినట్టుగా అనిపిస్తారు, కాని "కొంతకాలము వారు నిలుతురు: తరువాత, కాని వాక్యము నిమిత్తము [శ్రమ] అయినను హింసయైన కలిగినప్పుడు...వారు [‘పడిపోతారు,’ ఎన్ఐవి]," మార్కు 4:17.

కాని చాలా సమయము పడుతుంది "ముండ్ల పొద" ప్రజలను గూర్చి చెప్పడానికి. మన ఆధునిక బాప్టిస్టు సంఘాలలో (మన సంఘములో కూడ) వారు విశ్వాసాన్ని ప్రకటించినట్టుగా చూస్తాము. చాలాసార్లు శ్రమ కన్నీళ్ళతో కూడిన ఒప్పుకోలుగా ఉంటుంది. వారు పిల్లలుగా, యుక్త వయస్కులుగా, నేర్చుకుంటారు వారు క్రీస్తు నొద్దకు వచ్చేముందు శ్రమల ద్వారా వెళ్ళాలనే విషయము. వారు చెప్పారు క్రీస్తును సేవించిన వారిని వారు మంచివారుగా అనిపించేవారు. చాలాసార్లు నన్ను మోసగించారు. మంచివారుగా అనిపించేవారు. గొప్ప క్రైస్తవులుగా కనిపిస్తారు. అది యుక్త వయస్కులయ్యే వరకు. అప్పుడు మాత్రమే వారి సాక్ష్యములోని బీటలు కనిపించడం ప్రారంభిస్తాయి. వారి తల్లిదండ్రులు వారికి డబ్బు ఇచ్చారు. వారి తల్లిదండ్రుల ఇంట్లో ఉచితముగా ఉండడానికి గది ఇచ్చారు. ఖర్చు పెట్టడానికి డబ్బు ఇవ్వబడింది. అప్పుడు వారు కళాశాల ముగిస్తారు. ఇప్పుడు వారుకి ఉద్యోగమూ వస్తుంది, పట్ట భద్ర పాఠశాలకు వెళ్తే, అప్పులు పుడతాయి. ఇప్పుడు వారు "విడుదల" పొందడంలో లాభాలు చూస్తారు – అలా పిలుస్తారు. అప్పుడు మాత్రమే వారి సాక్ష్యములో బీటలు పాడడం గమనింపబడుతుంది. మునుపు వారి తండ్రులు కాని వారి కాపరులు కాని వద్దన్న పనిని చెయ్యడానికి గాని నమ్మడానికి గాని ఇష్టపడే వారు కాదు. సంఘ పెద్దలు తప్పు చేస్తున్నట్టు చాలా ఆలస్యముగా చూస్తారు. వారిని ఏదీ ఆపలేదు మన సహాయము వాళ్లకి అవసరము లేదు. క్రమేణా క్రీస్తు కొరకు ఉన్న ఉత్సాహాన్ని ప్రేమను వదిలేస్తారు "వారు [తాము] ఈ జీవన వ్యాపారములలో చిక్కుకుంటారు" (II తిమోతి 2:4). సంఘ నాయకులు తిరిగి వారిని రక్షిత స్థలానికి తీసుకు రావాలనుకుంటే, వారు కోపపడి మత్సర పడతారు. తరువాత సాతాను వచ్చి వారితో గుసగుసలాడడం ప్రారంభిస్తుంది, "వారి మాటలు వినవద్దు! వారికి ఏమి తెలుసు?" కనుక, చివరకు, వారు దెయ్యములోకము చేతులలోనికి వెళ్ళిపోతారు. "నేను గుడిని వదిలి పెట్టలేదు," వారంటారు – గుడిని వదిలిపెట్టడం ఒకటే పాపము అన్నట్టు! కాని వారి హృదయాలు క్రీస్తును ఎప్పుడో వదిలి పెట్టేశాయి!

బైబిలు మనము ఉజ్జీయాను చూసినప్పుడు అతడు పదహారు సంవత్సరముల వాడు. అతడు యవనస్థినిగా ఉన్నప్పుడు "అతడు యెహోవా దృష్టికి యదార్ధంగా ప్రవర్తించెను" (II దినవృతాంతములు 26:4). ప్రవక్తయైన జకర్యా అతని కాపరి. "అతడు యోహావాను ఆశ్రయించినంత కాలము, దేవుడు అతని వర్దిల్ల చేసెను" (II దినవృత్తాంతములు 26:5). మనకు చెప్పబడినట్టు, "అతడు బలముగా ఉన్నంత కాలము, అద్భుత రీతిగా సహాయము చేయబడ్డాడు." కాని తరువాత, "అతడు బలముగా ఉన్నప్పుడు, అతడు మనస్సున గర్వించి చేడిపోయెను – అతని హృదయము గర్వముతో నిండింది కనుక అతని దేవుడైన ప్రభువుకు నమ్మకంగా ఉండలేక పోయాడు" (II దినవృత్తాంతముల 26:16 కేజేవి, ఎన్ఏఎస్ వి). అతడు బలవంతుడైనప్పుడు, అతని హృదయము గర్వముతో నిండింది కనుక అతడు తొలగిపోయాడు! ప్రభువు ఉజ్జీయాను మొత్తెను గనుక అతడు "తన మరణ దినము వరకు కుష్టు రోగియై యుండెను" (II దినవృత్తాంతములు 26:21).

ఒక ఉదాహరణగా దేవుడు ఉజ్జీయా జీవితాన్ని మనకు ఇచ్చియున్నాడు. వారి హృదయాలలో విత్తబడిన వాక్యాన్ని అణచి వేసేటట్టుగా చేసే యువతీ యువకుల చిత్రము అతడు. వారు విచారము చేతను, ధనము పట్ల అత్యాశ, ఆత్మలను నశింప చేసే వాటిలో కొట్టుకుపోవడం, కేన్సర్, క్రమంగా శరీరాన్ని చంపేస్తుంది, కనుక ఈ ముళ్ళులు నెమ్మదిగా కాని కచ్చితంగా అలా అనుమతించే వారి ఆత్మలను అణచి వేస్తాయి. మీ ప్రేమ చల్లరిందా? మీరు లోకస్థులై పోతున్నారా? మీరు తిరుగుబాటుదారులవుతున్నారా? మీరు ఒకప్పటి కంటే అధ్వాన స్థలములో ఉన్నారా? ఓ, మీలోకరిత్యా ఉండే స్థితి నుండి వెనుకకు మరలండి. మీ తిరుగుబాటు నుండి తిరగండి. వెనుకకు తిరగండి. పశ్చాత్తాప పడండి. మీరు ఉన్నట్టుగానే ఎందుకు వెళ్తారు క్రీస్తులో మీకు సమాధానము ఉన్నప్పుడు? – మీరు మీ తిరిగుబాటు నుండి గర్వము నుండి వెనుతిరిగి ఆయన పాదములపై పడితే, మీరు రక్షింపబడతారు కదా ఆయన మరణము ద్వారా?

"అక్రమము విస్తరించుట చేత, అనేకుల ప్రేమ చల్లారును" (మత్తయి 24:12).

విత్తువాని ఉపమానము ఎందుకు ఇవ్వబడిందంటే – "నీవు ఏ గుంపుకు చెందినా వాడవో నిన్ను నీవు పరీక్షించు కొని కనుగొనడానికి. నీవు మొదటి మూడు గుంపులకు చెందినవాడవైతే, నీవు మార్పిడి నొందాలి" – లేక కనీసము, "నీవేలాగు ఉపదేశము పొందితివో, ఎలాగు వాటివో జ్ఞాపకము చేసుకొని, దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము" (ప్రకటన 3:3). కనీసము నీ జీవితాన్ని తిరిగి క్రీస్తుకు అంకితము చేసి పశ్చాత్తాప పడు, నీవు నిజంగా ఒక "ముండ్ల పొద" వ్యక్తిగా అవకముందే! (William Hendriksen, Th.D., The Gospel of Luke, Baker Book House, 1978, p. 429; note on Luke 8:14).

నీవు చెప్పాలి, "ఓ, దేవా, నేనునా తిరిగుబాటు నుండి గర్వము నుండి మల్లుతాను! ఓ దేవా, క్రీస్తు రక్తముతో నన్ను నిజముగా కడుగు!" "నాలో శుద్ధ హృదయము కలుగ చేయుము, ఓ దేవా" (కీర్తనలు 51:10).

దయచేసి నిలబడి పాటల కాగితంలో 4 వ పాట పాడండి.

"నీ హృదయము నాకిమ్ము," పైనున్న తండ్రి అంటున్నాడు,
     మన ప్రేమను మించిన ప్రశస్తమైన బహుమతి ఆయనకు లేదు;
మృదువుగా ఆయన గుసగుసలాడుచున్నాడు, నీవెక్కడ ఉన్నాను,
     "కృతజ్ఞతా పూర్వకంగా నన్ను నమ్ము, మరియు నీ హృదయము నాకిమ్ము."
" నీ హృదయము నాకిమ్ము, నీ హృదయము నాకిమ్ము,"
     మృదువైన గుసగుస విను, నీవెక్కడ ఉన్ననూ:
ఈ అంధకార లోకము నుండి నిన్ను ఆయన వేరు పరుస్తాడు;
     నెమ్మదిగా మాట్లాడుతున్నాడు, "నీ హృదయము నాకిమ్ము."

"నీ హృదయము నాకిమ్ము," అని మనుష్య రక్షకుడు చెప్తున్నాడు,
     కృపతో పిలుస్తున్నాడు మళ్ళీ మళ్ళీ;
"పాపము నుండి తొలగు, చెడు నుండి వేరవు,
     నేను నీ కొరకు చనిపోలేదా? నీ హృదయము నాకిమ్ము."
"నీ హృదయము నాకిమ్ము, నీ హృదయము నాకిమ్ము,"
     మృదువైన గుసగుస విను, నీవెక్కడ ఉన్ననూ:
ఈ అంధకార లోకము నుండి నిన్ను ఆయన వేరు పరుస్తాడు;
     నెమ్మదిగా మాట్లాడుతున్నాడు, "నీ హృదయము నాకిమ్ము."

"నీ హృదయము నాకిమ్ము," దైవిక ఆత్మ చెప్తున్నాడు;
     "నీకు కలిగినదంతా, నా కొరకు వదిలిపెట్టు;
ఇవ్వడానికి విస్తారమైన కృప నా దగ్గర ఉంది,
     సంపూర్ణంగా అర్పించుకో మరియు నీ హృదయము నాకిమ్ము."
"నీ హృదయము నాకిమ్ము, నీ హృదయము నాకిమ్ము,"
     మృదువైన గుసగుస విను, నీవెక్కడ ఉన్ననూ:
ఈ అంధకార లోకము నుండి నిన్ను ఆయన వేరు పరుస్తాడు;
     నెమ్మదిగా మాట్లాడుతున్నాడు, "నీ హృదయము నాకిమ్ము."
("నీ హృదయము నాకిమ్ము" ఎలీజా ఇ. హేవిడ్ చే, 1851-1920).
            (“Give Me Thy Heart” by Eliza E. Hewitt, 1851-1920).

నీవు ఇంకా రక్షింపబడకపోతే, నీవు నీ పాపము నుండి తిరిగి యేసును విశ్వసించాలని నేను నిన్ను బతిమాలుచున్నాను. నీ పాప పరిహారార్ధం ఆయన సిలువపై మరణించాడు. ఆయన నీకు నిత్య జీవము ఇవ్వడానికి మృతులలో నుండి లేచాడు. నీవు ఆయనను విశ్వసించి ఆయన కొరకు జీవించాలని నా ప్రార్ధన. ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఎబెల్ ప్రుదోమ్: మార్కు 4:13-20.
ప్రసంగము ముందు పాట బెంజమెన్ కినీకెయిడ్ గ్రిఫిత్ గారు:
"నా జీవితము తీసుకొని ఉండనిమ్ము" (ఫ్రాన్సిస్ ఆర్. హవేర్గల్ చే, 1836-1879).
“Take My Life and Let It Be” (by Frances R. Havergal, 1836-1879).


ద అవుట్ లైన్ ఆఫ్

నీ హృదయము ముండ్ల పొదనా?

IS YOUR HEART THORNY GROUND?

డాక్టర్ ఆర్. యల్. హైమర్స్, జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

"అక్రమము విస్తరించుట చేత, అనేకుల ప్రేమ చల్లారును" (మత్తయి 24:12).

(II తిమోతి 3:1-5)

I.     మొదటిది, ఇది ఎప్పుడు సంభవిస్తుందని క్రీస్తు చెప్పాడు? మత్తయి 24:3.

II.    రెండవది, ఇది సంభవిస్తుందని క్రీస్తు ఎందుకు చెప్పాడు? మత్తయి 24:10, 11, 12.

III.  మూడవది, చల్లబడిపోయే చాలామంది ఎవరు? లూకా 8:14; యూదా 1:8;
మార్కు 4:15, 17; II తిమోతి 2:4; II దిన వృత్తంతములు 26:4, 5, 16, 21;
కీర్తనలు 51:10; ప్రకటన 3:3.