Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
ఒక వ్యక్తి గుణశీలత యొక్క శక్తి –

డాక్టర్ హైమర్స్ కు ఆయన 75 వ పుట్టిన రోజు సందర్భంగా నివాళి
THE STRENGTH OF A MAN’S CHARACTER –
A TRIBUTE TO DR. HYMERS ON HIS 75TH BIRTHDAY
(Telugu)

డాక్టర్ సి.ఎల్. కాగన్ గారిచే
by Dr. C. L. Cagan

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము సాయంకాలము, ఏప్రిల్ 10, 2016
sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, April 10, 2016

"శ్రమ దినమున నీవు కృంగిన యెడల, నీవు చేత కాని వాడవగుదువు" (సామెతలు 24:10).


ఒక వ్యక్తి యొక్క విలువ ఎలా కొలవగలము? ప్రపంచము ధన రూపంలో లెక్కగడుతుంది. కాని యేసు అన్నాడు, "ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు" (లూకా 12:15). అది ధనము కాదు – బిరుదులు కావు, ప్రతిష్ట, లేక భోగాలు కాదు – అవి నిజ విలువను చూపించవు. ఏమి చూపిస్తుంది? మన పాఠ్యభాగము చెప్తుంది,

"శ్రమ దినమున నీవు కృంగిన యెడల, నీవు చేత కాని వాడవగుదువు" (సామెతలు 24:10).

పదము "కష్టము" అంటే అర్ధము "పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉండడం." "మూర్ఛ" అనగా "విడిచి పెట్టడం." మేత్యూ పూలే వ్యాఖ్యానము చెప్తుంది, "ఇది ఒక సూచన నీకు తక్కువ క్రైస్తవ శక్తి లేక ధైర్యము ఉంది, దానినే కష్టము అని అంటారు." ఒక వ్యక్తికి పరీక్ష పరిస్థితులు తనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆయన ఏమి చేస్తాడు అనేది! 1599 జెనేవా పఠన బైబిలు చెప్తుంది, "శ్రమ లేకపోతే ఒక వ్యక్తి శక్తికి పరీక్ష అనేది లేదు" (గమనిక ‘బి’ సామెతలు 24:10 పై).

అవి ఒక వ్యక్తికి నిజమైన పరీక్ష – అంతా ప్రకాశవంతంగా ఉన్నప్పుడు కాదు, అంతా అందకారంగా ఉన్నప్పుడు. ఆ పరీక్ష ద్వారా, మన సంఘ కాపరి డాక్టర్ హైమర్స్ ఒక అసాధారణ క్రైస్తవుడు! ఆయన జీవితమంతా కష్టాలతో నిండికొనినది. ఆయన బలహీనంగా ఉన్నప్పటికినీ, అతడు వదిలి పెట్టలేదు. డాక్టర్ బాబ్ జోన్స్, సీనియర్ (1883-1968) అన్నాడు, "నీ గుణశీలతకు పరీక్ష నిన్ను ఆపేయడానికి ప్రయత్నించేది." దానిని ఇలా చెప్పుదాం. "నీ గుణశీలతకు పరీక్ష ఏది నిన్ను ఆపనిదో అది." "ఏదీ నిన్ను ఆపలేకపోతే, నీకు గొప్ప గుణశీలత ఉన్నట్టు." అదీ మన సంఘ కాపరి కలిగియున్నారు!

ఈ రాత్రి మనము ఆయన 75 వ జన్మదినము జరుపుకుంటున్నాము. ఆయన జీవితమంతా కష్టాలే. పరిస్థితులు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు. కాని ఆయన కొనసాగుతూనే ఉన్నారు. అది ఆయన స్వంత శక్తితో కాదు. ఆయన జీవిత వచనము ఫిలిప్పీయులకు 4:13, "నన్ను బలపరచు క్రీస్తు యందే నేను సమస్తమును చేయగలను." ఈ రాత్రి మనము మన సంఘ కాపరిని గౌరవిస్తాను – క్రీస్తును వందనాలు చెల్లిస్తాము!

నేను డాక్టర్ హైమర్స్ జీవితాన్ని గూర్చి ఆయన ఎదుర్కొనవలసిన దానిని గూర్చి మీకు తెలియచేస్తాను. ఆయన జీవితము శక్తి పట్టుదల క్రీస్తు ద్వారా విజయములతో కూడిన కథ! కష్టాలలోతు ఆయన శక్తి యొక్క లోతును చూపిస్తుంది.

మన సంఘ కాపరి ప్రారంభపు జీవితము కష్టాలతో నిండుకొన్నదే. ఆయన క్రైస్తవ గృహములో పెంచబడలేదు. నిజానికి, ఆయన చెదిరిన కుటుంబము నుండి వచ్చియున్నాడు. తాను రెండు సంవత్సరాల వయస్సులో తన తండ్రి వదిలి పెట్టేసాడు. ఆయన తల్లి, సెసేలియా, అతని ప్రేమించి పన్నెండు సంవత్సరాలు వచ్చేంత వరకు జాగ్రత్త తీసుకుంది. తరువాత ఆయన తిరుగుతూ, బంధవులతో జీవించే వాడు. ఆయన పాఠశాల నుండి పట్ట భద్రుడవక ముందు 22 వేర్వేరు పాఠశాలలో చదివాడు. పాఠశాలలో ఎప్పుడు "కొత్త పిల్లవానిగా" – బయటి వానిగా ఉండేవాడు. తన జీవితంలో "నిజంగా అనాధ" – సహకారము ప్రేమ పట్టింపు లేకుండా.

అయినను, దేవుడు తన పట్ల మంచిగా ఉన్నాడు. బైబిలు చెప్తుంది, "యెహోవా అందరికి ఉపకారి: ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి" (కీర్తనలు 145:9). దేవుడు తన పిల్లలను పట్టించుకుంటాడు, వారు రక్షింపబడకముందే. డాక్టర్ హైమర్స్ మాటల నాటక గురువు, రేఫిలిఫ్స్, నటించడంలో మాట్లాడడంలో ఉన్న తలంతు గుర్తించాడు. మన కాపరి విషయంలో శ్రద్ధ తీసుకొని నిజంగా బాగా పట్టించుకున్నాడు. ఫిలిప్ దయతో మంచిగా ఉన్నారు. కాని నాకు ఆనందంగా ఉంది డాక్టర్ హైమర్స్ ఆవరణ శూన్యమని గ్రహించి, ఆయన సువార్త బోధకునిగా అయ్యాడు!

డాక్టర్ హైమర్స్ ఒక గుడిలో పెరగలేదు. ఆయనకు మామూలు కుటంబం లేదు. ఉండి ఉంటే, ఆయన బయటికి వెళ్తూ కలివిడిగా ఉండేవాడు – వ్యక్తపరుస్తూ. కాని తిరగడం లేక తిరస్కార ముండడం ఆయనను లోపల ఆలోచించే వానిగా చేసింది – అంతర్గతంగా చూస్తాడు. తనను తీవ్రంగా చూసుకుంటూ, దేవుని గూర్చి ఆలోచించే వాడు. మీరు డాక్టర్ హైమర్స్ ను లోపల ఆలోచించే వానిగా భావించరు, ఎందుకంటే ఆయనగా చాలా బాగా బోధిస్తారు, ప్రజలతో తరుచు మాట్లాడుతుంటారు. కాని అంతరంగములో ఆయన సున్నితమైన వ్యక్తి, స్వంత బలహీనతలు తెలిసిన వాడు. ఆయన తనపై కాదు దేవునిపై ఆధారపడతాడు.

అలాంటి కష్టాల జీవితంలోనికి, దేవుడు తన ప్రేమను పంపించాడు దానిని నేను "కృపా కిటికీలు" అంటారు. మన కాపరి పొరుగువారు డాక్టర్ మరియు శ్రీమతి మెక్ గోవన్. వారు ఆయనకు కృపా కిటికీలు. వారు ఆయన పట్ల దయ చూపించారు. భోజనానికి పిలిచేవారు. వారు గుడికి తీసుకెళ్ళారు, అక్కడ ఆయన బాప్టిస్టు అయ్యాడు. దేవుడు మన సంఘ కాపరి పట్ల మంచిగా ఉన్నాడు అతడు ఒంటరి యవనస్తునిగా ఉన్నప్పుడు. యవనునిగా డాక్టర్ హైమర్స్ తన బంధువులులా ఉండకూడదని నిర్ణయించుకున్నాడు. వారు త్రాగుచూ శపిస్తుండడం చూసాడు. గుడికి వెళ్లి క్రైస్తవునిగా జీవించాలని ఆయన నిర్ణయించుకున్నాడు. ఇంకా అప్పటికి మారలేదు. అతడు అబ్రహాములా ఉన్నాడు దేవుడు అతనితో చెప్పేటప్పుడు, "నీవు లేచి నీ దేశము నుండియు, నీ బంధువుల యెద్ద నుండియు నీ తండ్రి ఇంటి నుండియు బయలు దేరి…నీకు నేను చూపించు దేశమునకు వెళ్ళుము" (ఆదికాండము 12:1). మరియు

"అబ్రహాము పిలువబడినప్పుడు, విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి, తానూ స్వాస్థ్యముగా పొందనైయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను; మరియు ఎక్కడికి వెళ్ళవలెనో, అది ఎరుగక బయలు వెళ్ళెను " (హెబ్రీయులకు 11:8).

దేవుని మనసులో ఏముందో అబ్రహాముకు పూర్తిగా తెలియదు. అతడు ఇంకా మారలేదు. కాని అతడు "విధేయుడై; బయటికి వెళ్ళాడు." అదే డాక్టర్ హైమర్స్ కూడ చేసారు. ఆయన ఇంకా మారలేదు. కాని ఆయన తన జీవితాన్ని మార్చేసాడు. వేదాంత పండితులు దీనిని "విశ్వాసమునకు ముందు విశ్వాసము" అని పిలుస్తారు – మారక ముందు దేవునికి బదులివ్వడం.

మన సంఘ కాపరి గుడికి వెళ్తున్నందుకు ప్రోత్సాహము లేదు మెప్పులేదు. ఆయన బంధువులు అపహాస్యము చేసి అన్నారు, "రోబర్ట్ మతపరమైన వాడని." ఆ అపహాస్యములో, మన సంఘ కాపరి దేవుని పిలుపును వెంబడించాడు. మన పాఠ్యభాగము చెప్తుంది, "శ్రమ దినమున నీవు కృంగిన యెడల, నీవు చేతకాని వాడవగుదువు." దేవునికి వందనాలు ఆయన మూర్చపోలేదు. ఆయన శక్తి తక్కువ కాలేదు, దేవుడు ఆయనకు శక్తి నిచ్చాడు!

యేసు అన్నాడు, "నన్ను పంపిన తండ్రి, వానిని ఆకర్షించి తేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు" (యోహాను 6:44). ఆకర్షించడం అంటే ఏమిటి? మనం అనుకుంటాం దేవుడు ఆత్మపై కదలడం అతడు క్రీస్తును నమ్మినప్పుడు, లేక అతని మార్పు ముందు. కాని దేవుని ఆకర్షణ దానికంటే ముందే ప్రారంభమవుతుంది. దేవుడు డాక్టర్ హైమర్స్ ను ఒక బాప్టిస్టు సంఘానికి తీసుకురావడానికి వెంక్ గోవన్స్ ను వాడుకున్నప్పుడే, దేవుడు ఆకర్షించుకోవడం ప్రారంభం అయింది.

పదిహేడవ సంవత్సరంలో డాక్టర్ హైమర్స్ తన సంఘ కాపరి డాక్టర్ మేపిల్స్ ఇలా చెప్పడం విన్నాడు, "ఒక యవనస్తుడు ఉన్నాడు పరిచర్యకు సమర్పించుకోవాలి." డాక్టర్ హైమర్స్ తన కాపరిని ప్రశంసించి అతనిలా ఉండాలనుకున్నాడు. ఎవరా తలంపు పెట్టారు? దేవుడే. డాక్టర్ హైమర్స్ పరిచర్యకు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. అలా చెయ్యడానికి ఎవరు కదిలించారు? అది దేవుని ఆకర్షణలో భాగమే. ప్రారంభంలో తను బోధించడంలో బాగా విఫలుడయినప్పటికి, ఆయన బోధించడం కొనసాగించాడు. తరువాత, చైనాకు మిస్సెనరీగా అవాలనుకున్నాడు. కనుక ఆయన మొదటి చైనీయ బాప్టిస్టు సంఘానికి వెళ్ళాడు. అది, కూడా, దేవుని ఆకర్షణలో ఒక భాగమే.

1961 లో మన సంఘ కాపరి బయోలా కళాశాలకు హాజరయ్యారు. డాక్టర్ చార్లెస్ జే. ఉడ్ బ్రిడ్జి గుడిలో వారము రోజులు బోధించారు. డాక్టర్ ఉడ్ బ్రిడ్జి చైనాలో పుట్టాడు. ఆయన స్వతంత్రతను బట్టి పుల్లర్ వేదాంత కళాశాల వదిలి పెట్టారు. కనుక, ఆ రెండు కారణాలను బట్టి, డాక్టర్ హైమర్స్ ఆ ప్రసంగీకుని పై ఇష్టము పుట్టి ఆయన చెప్పేది జాగ్రత్తగా వినేవాడు. ఇది ఎవరు ఏర్పాటు చేసారు? దేవుడే! ఆ గుడిలో ఆరాధనలలో డాక్టర్ హైమర్స్ చార్లెస్ వెస్లీ పాట, "అద్భుత ప్రేమ! ఎలా వీలవుతుంది, దేవుడు, నా కొరకు చనిపోవడం పాడాడు?" ఆయన చూసాడు యేసు తనను ప్రేమించి తన కొరకు చనిపోయాడని. డాక్టర్ ఉడ్ బ్రిడ్జి 1961, సెప్టెంబర్ 28, ఉదయము 10:30 కు బోధిస్తుండగా, డాక్టర్ హైమర్స్ క్రీస్తును విశ్వసించి మార్పిడి చెందాడు!

అలా, ఆయన తన క్రైస్తవ జీవితాన్ని ఆరంభించాడు. అది సులభము కాదు. కళాశాలకు వెళ్ళవలసి వచ్చింది. అది తనకు కష్ట తరముగా ఉంది. ఆయన బంధువులు కళాశాలకు వెళ్ళలేదు. ఆయనకు ప్రోత్సాహము లేదు డబ్బులేదు. చేయలేననుకున్నాడు. కాని కళాశాలకు వెళ్ళవలసి వచ్చింది మిస్సెనరీ అవడానికి, అందుకు వెళ్ళాడు. దేవుడు తనకు జీవిత వచనము ఇచ్చాడు, "నన్ను బలపరచు క్రీస్తు నందే నేను సమస్తమును చేయగలను" (ఫిలిప్ఫీయులకు 4:13). క్రీస్తు శక్తితో, తానూ చేయలేననుకున్నది చేసాడు! రోజంతా పనిచేసి రాత్రి కళాశాలకు వెళ్ళేవాడు – సంవత్సరము వెంబడి సంవత్సరము, ఎన్నో గంటలు గుడిలో పనిచేస్తూ. మార్గము పొడవైన కష్ట తరమైన, ఆయన మూర్చపోలేదు. ఆయన డిగ్రీలు ఉన్నత డిగ్రీలతో పాటు, మూడు డాక్టరేట్లు కూడ పొందుకున్నాడు. క్రీస్తులో, ఆయనకు శక్తి ఉంది. "శ్రమ దినమున నీవు కృంగిన యెడల, నీవు చేతకాని వాడవగుదువు" (సామెతలు 24:10). క్రీస్తులో, ఆయన శక్తి గొప్పది!

డాక్టర్ హైమర్స్ ఇంకోక వ్యక్తి పేరు చెప్పమన్నారు. ఆ వ్యక్తి డాక్టర్ హైమర్స్ పనిచేసే దగ్గర టైపిస్టుగా పని చేసిన నడివయస్సురాలైన స్త్రీ. రాత్రులు పాఠశాలలో చాలా సంవత్సరాలు చదవడం వలన ఆయన చాలా నిస్పృహకు లోనయ్యారు. ఆ స్త్రీ, గ్వెన్ డెవెలిన్, పని తర్వాత ప్రతి రాత్రి ఆయనతో మాట్లాడి ఆయనను ప్రోత్సహించింది. తరుచు నాతో చెప్పారు ఆమె సహాయము లేకుండా ఆయన ఇంత వరకు వచ్చేవారు కాదని.

ఈ ప్రసంగము బోధించిన తరువాత డాక్టర్ హైమర్స్ నన్ను అడిగారు ఆయనకు సహాయము చేసిన నలుగురు ఇతరులను గూర్చి మీకు చెప్పమన్నారు. చైనీయ సంఘములో మార్ఫీ మరియు లోర్నాలం యవన దంపతులు. డాక్టర్ హైమర్స్ మొదటిసారి అక్కడకు వెళ్ళినప్పుడు వారు ఆయనను బాగా చూసుకొని చిన్న సహోదరుని వలే చూసుకున్నారు. వారింటికి ఆయనను తీసుకెళ్ళారు. సాయంకాలము ఆరాధన తరువాత దాదాపు ప్రతీ ఆదివారం వారు ఆయనను భోజనానికి తీసుకెళ్ళేవారు నిజ స్నేహితులుగా ఉండేవారు. మూడవ వ్యక్తి యూజేన్ విల్ కేర్ సన్ గారు ఆయనను గూర్చి మీతో చెప్పమన్నారు. ఆయన చైనీయ సంఘములో పెద్ద తెల్లని వ్యక్తి. అతడు చైనీయ సంఘములో సంఘ కార్యదర్శిగా మాత్రమే కాకుండా ఇతర విధులు కూడ నిర్వర్తించేవాడు. ఆయన డాక్టర్ హైమర్స్ కు జీవితకాల స్నేహితుడు అయ్యాడు. మన సంఘ కాపరి చాలా సమయం ఆయనతో గడిపాడు డాక్టర్ హైమర్స్ ప్రతీ శనివారము రాత్రి సంఘ పత్రిక తయారుచేసాక ఆయనతో తనను తీసుకొని వెళ్ళేవారు. ఆయన చనిపోయిన తరువాత ఆయన కుటుంబ సభ్యులు మొదటి చైనీయ బాప్టిస్టు సంఘములో తన అంత్యక్రియలు చెయ్యాలని డాక్టర్ హైమర్స్ ని కోరారు. ఇంకొక స్నేహితుడు డాక్టర్ హైమర్స్ కు సహాయపడినవాడు జాక్సావ్ లా, ఒక యువక చైనీయుడు అతడు హైమర్స్ గారికి శ్రేష్టమైన స్నేహితుడు అయ్యాడు.

చైనీయ సంఘములో, డాక్టర్ హైమర్స్ డాక్టర్ తిమోతి లిన్ (1911-2009) వరకు ఆయన క్రింద, పనిచేసారు. డాక్టర్ లిన్ అసాధారణ బైబిలు వేత్త. ఆయన పరిశుద్ధుడు క్రైస్తవ్యము బాహ్యమైనది కాదు, జీవించే వాస్తవము అని ఆయన నమ్మేవాడు. దేవుడు మన కాపరిని డాక్టర్ లిన్ క్రింద ఉంచి ఒక శక్తివంతమైన దైవ జనునిగా తర్పీడు నిచ్చాడు.

ఆ సంవత్సరాలు బాగానే గడిచాయి. డాక్టర్ హైమర్స్ ఒక్కడే తెల్లని యవనస్థుడు ఆ సంఘములో. పనిభారంగా ఉండేది, బోధించడం నేర్పడం శుక్రవారము రాత్రి, శనివారము రాత్రి ఆదివారము అంతా. క్రమశిక్షణ కఠినంగా ఉండేది. కాని అది మంచికే. బైబిలు చెప్తుంది, "ఈ వన కాలమున కాడి మోయుట నరునికి మేలు" (విలాప వాక్యములు 3:27). గొప్ప దైవ జనునిగా చేయడానికి దేవుడు అలా వాడుకున్నాడు. ఇది ఆయన నిజ వేదాంత కళాశాల. దేవుడు క్రైస్తవ పరిచర్య అంటే ఏమిటో చూపించడానికి ఆ సమయాన్ని వాడుకున్నాడు. ఆ సంవత్సరాలు కష్టతరము. కష్ట తరమార్గము మన సంఘ కాపరి గుణశీలత శక్తిని చూపిస్తుంది. డాక్టర్ హైమర్స్ మూర్చపోలేదు. మార్గము కష్టతరము – కాని శక్తి గొప్పది!

చైనీయ సంఘము దక్షిణ బాప్టిస్టు సంఘము. కనుక డాక్టర్ హైమర్స్ దక్షిణ బాప్టిస్టు సెమినరీకి వెళ్ళాడు. కాని అది స్వతంత్రులు సెమినరీ అధ్యాపకులు బైబిలునే దాడి చేసేవారు. దేవుడు మన సంఘ కాపరికి నేర్పించాడు బైబిలు కొరకు నిలబడడానికి, ఒంటరిగా నిలబడ వలసిన ప్పటికినీ. దేవుడు ఆయనను బలపరిచాడు ఆదరించాడు ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు విచారముగా ఉన్నప్పుడు. "నన్ను బలపరచు క్రీస్తు నందే నేను సమస్తమును చేయగలను" (ఫిలిప్పీయులకు 4:13).

పరిచారకునిగా, డాక్టర్ హైమర్స్ ధైర్యంగా నమ్మకంగా ఉండేవారు. ఈనాడు చాలామంది బోధకులు సులభ మార్గాన్ని తీసుకుంటున్నారు. వారు ఏమి చెప్పరు ఏమి చెయ్యరు. వారు ఇశ్రాయేలు భోధకుల వలే ఉన్నారు వారిని గూర్చి ఇర్మియా ఇలా అన్నాడు,

"ప్రవక్త లేమి యాజకులేమి అందరు వంచకులు సమాధానము లేని సమయమున...శాంతి, శాంతి, అని సమాధానము చెప్పుదురు; అక్కడ శాంతి లేనప్పటికినీ"(యిర్మియా 6:13,14).

కాని డాక్టర్ హైమర్స్ సులభంగా లేనప్పుడు సత్యము మాట్లాడాడు. ఆయన స్వతంత్రులకు వ్యతిరేకంగా దక్షిణ బాప్టిస్టు సెమినరీలలో నిలబడ్డాడు. దానిని చూపిస్తూ ఆయన ఒక పుస్తకము వ్రాసాడు, సాహిత్యాన్ని ఆయా సంఘాలకు పంపి మళ్ళీ మళ్ళీ చూపించాడు. ఈనాడు ఆ సెమినరీలు గుప్తంగా ఉన్నాయి.

ఆయన మతదూరులకు వ్యతిరేకంగా నిలిచాడు – అంటే క్రైస్తవుడిగా ఉంటూ పాప జీవితం జీవించాడం. నూతాన సువార్తికులు ఆదివారం గుడి మానేసి, ఆడుతూ, మత్తు పదార్ధాలు సేవిస్తూ, వివాహేతర లైంగిక జీవితంలో ఉంటున్నారు. డాక్టర్ హైమర్స్ అప్పుడు కూడ చెప్పారు – ఇప్పుడు చెప్తున్నారు – అలా జీవించే వారు క్రైస్తవులు కానేకారు!

మన సంఘ కాపరి గర్భ స్రావమునకు వ్యతిరేకంగా నిలబడ్డాడు. అది అంట సులువు కాదు. డాక్టర్ హైమర్స్ గర్భస్రావము చేసే ఆసుపత్రుల దగ్గర కూర్చొనే వారు, వీధులలో పోలీసులుండగా దెబ్బలు చెరసాల ప్రమాదము కూడ ఉండినప్పటికినీ. కాని మన సంఘము రెండు గర్భాశ్రావపు ఆసుపత్రులను మూయించింది. కష్టం చాలా ఉంది, కాని డాక్టర్ హైమర్స్ మూర్చపోలేదు. ఎలాంటి దైవజనుడు!

హాలివుడ్ దేవదూషణ చేసే ఒక సినిమా నిర్మించింది దానిపేరు "క్రీస్తు చివరి శోధన." నిజమే, ఇతరులు కూడ ఆ సినిమాతో ఏకీభవించ లేదు. కాని డాక్టర్ హైమర్స్ దానికి వ్యతిరేకంగా గట్టిగా పోరాడాడు! సైనికులు అన్నారు అతడు "చూపించే వ్యక్తి," ఇతరుల కంటే ముందుగా నడిచి శత్రువు అగ్నిని కాల్పులను ఎదుర్కొన్నాడు. కష్టము గొప్పది, కాని డాక్టర్ హైమర్స్ మూర్చపోలేదు. ఆగష్టు 1988 లో, క్రైస్తవ్యము ఈనాడు అనే సంచికలో, బాబ్ జోన్స్ యూనివర్షిటి చాన్సలర్, డాక్టర్ బాబ్ జోన్స్, జూనియర్., అన్నాడు, "నాకనిపిస్తుంది డాక్టర్ హైమర్స్ ప్రతి ఘటనలు మాత్రమే మార్పు తెచ్చేవిగా ఉన్నాయి!" హాలీవుడ్ అలాంటి సినిమా మళ్ళీ తియ్యలేదు! ఆయన మార్గములోని కష్టము ఆ బాధ డాక్టర్ హైమర్స్ ఎలాంటి వ్యక్తి చూపిస్తున్నాయి. అధ్యక్షుడు తిమోడోర్ రూజువేల్డ్ అన్నాడు,

విమర్శకుడు లెక్కింప లేదు; బలవంతుడు ఎలా తొట్రిల్లు తాడో చెప్పే వ్యక్తి కాదు, చేసేవారు మంచిగా చేయడం కాదు. ఆ పరిస్థితిలో ఉండే వ్యక్తికి ఆ ఘనత చెందుతుంది, అతని ముఖము దుమ్ముతో చెమటతో రక్తముతో నిండుకుంటుంది, అతడు భయంకరంగా శ్రమిస్తాడు... ఒక సదుద్దేశముతో ఉంటాడు, గొప్ప నెరవేర్పులో ఉన్న శ్రేష్ట తను అతడు చూస్తాడు, ఒకవేళ విఫలుడైతే, ధైర్యముతో పోరాడి, అతడు విజయము పరాజయములను తెలియని చల్లని నులివెచ్చని ఆత్మలతో తన స్థానము లేకుండా చూసుకుంటాడు.

డాక్టర్ హైమర్స్ ఆ పరిస్థితిలో ఉన్నవ్యక్తి, ఆయన తన రక్షకుని కొరకు చెమటను రక్తాన్ని చిందించాడు – అతని రక్షకుని కొరకు!

డాక్టర్ హైమర్స్ సంఘ కాపరిగా నమ్మకంగా కష్టపడ్డాడు. రెండు సంఘాలు స్థాపించాడు. ఒకటి మన సంఘము. కాని అన్ని చోట్ల ప్రతికూలాలు శ్రమలు, నలభై యాదు సంవత్సరాలలో పోరాటాలలో వెనుకంజలలో. అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు, "కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించియున్నది, చాలా కష్టములు ఉన్నవి" (I కొరిందీయులకు 16:9). నలభై సంవత్సరాలు, కష్ట సమయాలు చాలామంది వ్యతిరేకులతో. అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు, "అనేక పర్యాయాలు ప్రయాణాలలోను, నరుల వలననైన ఆపదలలోనూ, దొంగల వలననైన ఆపదలలోను, అరణ్యముల ఆపదలలోను, సముద్రంలో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటిని" (II కొరిందీయులకు 11:26). పౌలు భారమును డాక్టర్ హైమర్స్ మోసాడు, "సంఘములన్నింటిని గూర్చిన చింత ఆయనకు ఉంది" (II కొరిందీయులకు 11:28). అయినను డాక్టర్ హైమర్స్ వదిలి పెట్టలేదు. ఆయన అసమర్దుడయ్యాడు, మనస్థాపము నొందాడు. కాని ఆయన వదిలలేదు. ఆయన గుణశీలత శక్తి గొప్పది!

అవును, కృపా కిటికీలు ఉన్నాయి. దేవుడు హైమర్స్ కు అద్భుతమైన భార్యను ఇద్దరు కుమారులను – ఒక మనమరాలిని ఇచ్చాడు. అన్నింటి కంటే శ్రేష్టము, ప్రజలు మార్పిడి నొందారు. చాలా తక్కువ మంది కాపరులు ఈనాడు లోకములో ప్రజలను మార్చగలుగుతారు. దానికి బదులు ఇతర సంఘాల నుండి ప్రజలను బదిలీ చేస్తారు. డాక్టర్ హైమర్స్ కు నివాళి ఆయన క్రైస్తవేతరుల నుండి క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదిస్తారు. ఆయనకే ఘనత అంతా!

ఇంకా, పోరాటాలు అప్పగింపడాలు వెనుకంజలతో కూడిన సంవత్సరాలు ఉన్నాయి. రెండడుగులు ముందుకు, ఒక అడుగు వెనుకకు – తరుచు రెండడుగులు ముందుకు, మూడు అడుగులు వెనుకకు. డాక్టర్ హైమర్స్ మట్టిలా చూడబడ్డాడు కొన్నిసార్లు అలా అనుకున్నాడు. అయినను ఆయన నమ్మకస్థుడు. ఆయన మూర్చపోలేదు!

ఒక గొప్ప కష్టము వచ్చింది. మన సంఘపు "మునుపు నాయకుడు" బయటికి పోయి 400 మంది పెద్దలను తనతో తీసుకు పోయాడు. మన సంఘము దాదాపు భవనాన్ని కోల్పోయింది. మనము దాదాపు దివాలా తీసాం. ఒక ప్రసిద్ధ బోధకుడు సాన్ జోస్ దగ్గర డాక్టర్ హైమర్స్ ను కుదుర్చాలనుకున్నాడు. ఆయన అన్నాడు, "ఇది బయటికి పోవడానికి ఆఖరి తరుణము." చాలా మంది కాపరులు అలా పోయేవారు. కాని సభ్యులు వెళ్తుండడం సంఘము ఆర్ధిక సంక్షోభంలో ఉండగా – డాక్టర్ హైమర్స్ ఉండి పోయాడు! ఆయనను బట్టి వారి సమయాన్ని డబ్బును ఇచ్చిన నమ్మకస్తులైన, "ముప్ఫై తొమ్మిది" మందిని బట్టి మీ కొరకు ఒక సంఘమును కలిగి యున్నారు!

నాకు తెలుసు కష్టములో ఒక వ్యక్తి ఏమి చేస్తాడో అదే అతనికి పరీక్ష. ఇరవై సంవత్సరాలు అంతా చెడుగానే కనిపించింది. మన సంఘ కాపరి ఎదుర్కొన్న శ్రమలు ఆయన గుణశీలతలోని శక్తిని చూపిస్తున్నాయి. ఆయన కష్టాలు గొప్పవి. ఆయన శక్తి ఎంత గొప్పది!

ఇప్పుడు సంఘ చీలిక ఇక్కడ లేదు. కాని ఇంకొక రకమైన కష్టము ఉంది. రెండు సంవత్సరాల క్రితం డాక్టర్ హైమర్స్ నాతో చెప్పారు ఇంకా చాలా పరీక్షలు ఆయనకు ఉన్నాయని. 70 సంవత్సరాల వయసు. నాకు అరవై. నాకర్ధం కాలేదు. నేనన్నాను, "ఏంటి? నీ మరణ పడక మీద నీవు క్రీస్తును కాదనవా!" అయినను పరీక్షలు ఉన్నాయి, క్రీస్తులో మన సంఘ కాపరి వయసు సంబందిత పరీక్షలు ఎదుర్కొని గొప్పగా ముందుకు సాగుతున్నారు.

75 సంవత్సరాలలో, కేన్సర్ తో వైద్యముతో వచ్చే బలహీనత వలన, చాలామంది పదవి విరమణ చేసి ఉండేవారు. కాని మన కాపరి మన సంఘము కొరకు దేవుని కొరకు ముందుకు సాగుతున్నారు! ఆయన ప్రసంగ వేదికకు బలవంతముగా రావడం బోధించడం, నడవ లేకపోవడం, కడుపు ముడుచుకోవడం ముందురాత్రి నిద్రలేక పోవడం ఇవన్ని నేను చూస్తున్నాను. ఆయన ఎలా బోధిస్తున్నారు? సింహము వలే! నాకు తెలుసు ఆయన అలసటతో కూడిన ప్రసంగము వేరేచోట మీరు విన్న వాటికంటే చాలా నయము. అందుకే 140,000 మంది ఆయన ప్రసంగా ప్రతులు చదువుతారు గత నెలలో 217 దేశాల వారు ఆయన విడియోలు చూసారు. అందుకే ప్రపంచంలోని కాపరులందరూ వారి సంఘాలలో ఈయన ప్రసంగాలు బోధిస్తుంటారు. ఆయన జీవిత వచనానికి రుజువు, "నన్ను బలపరుచు క్రీస్తు నందే నేను సమస్తమును చేయగలను" (ఫిలిప్పీయులకు 4:13).

నా ప్రార్ధన ఆయన కేన్సరును జయించి ఇంకా చాలా సంవత్సరాల పరిచర్యలో ఉండాలని. కాని డాక్టర్ హైమర్స్ నిరంతరమూ జీవించరు. బైబిలు చెప్తుంది, "మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయుము, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము" (కీర్తనలు 90:12). చాలా మంది జీవిత పరిమితిని గూర్చి ఆలోచించరు. చాలామంది కాపరులు కూడ అంతే. వారు వెళ్లి పోయాక ఏమి జరుగుతుందో వారు ప్రణాళిక చెయ్యరు. కనుక వారి సంఘాలు చీలిపోతాయి, లేక నెమ్మదిగా బలహీనమై చనిపోతాయి. దేవునికి వందనాలు మన కాపరి మన సంఘమును గూర్చి చింత కలిగియున్నారు! బలహీనత బట్టి లేక స్వజాలిని బట్టి ఆయన మరణమును గూర్చి మాట్లాడి మిమ్ములను బలపరచడం లేదు యవన బిడ్డలారా – అది ధైర్యముతో నమ్మకత్వముతో కూడిన క్రియ! ఆయన క్రైస్తవ యవనస్తులను పరిచర్యలో ఎంతదూరము వెళ్ళగలిగితే అంత దూరము వెళ్లమనడం – అది బాధ్యత విధితో కూడిన క్రియ, గౌరవము ప్రేమతో నిండిన కార్యము!

ఈనాడు మన సంఘ కాపరి వయసును, అనారోగ్యమును, జీవిత పరిమితిని ఎదుర్కొంటున్నారు. ఓ వ్యక్తి కొలత కష్టాలలో, ప్రతి కూల పరిస్తితులలో కొలవబడుతుంది. డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్, జూనియర్., నిజంగా మనం ఒక గొప్ప వ్యక్తిని చూస్తున్నాము!

ఈ పనులన్నీ ఆయన ఎలా చేసారు? ఎలా చేయగలిగారు? క్రీస్తులో! గొప్పగా చెప్పగలరు మన సంఘ కాపరి "[ఆయనను] బలపరచు క్రీస్తు నందు [మాత్రమే] ఆయన సమస్తమును చేయగలడు." శక్తి ఎక్కడ ఉంది? క్రీస్తు, క్రీస్తు, మళ్ళీ క్రీస్తు మాత్రమే!

అపోస్తలుడైన పౌలు అన్నాడు, "నేను క్రీస్తును పోలి నడుచు కొనుచున్న ప్రకారము, మీరును నన్ను పోలి నడుచుకొనుడి" (I కొరిందీయులకు 11:1). నేను మీకు చెప్తున్నాను, మన కాపరి క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము, మీరును ఆయనను పోలి నడుచు కొనుడి. క్రీస్తును విశ్వసించండి. వీలున్నంతగా ఆయనను సేవించండి. నేను మీకు చెప్తున్నాను, క్రీస్తు, క్రీస్తు, మళ్ళీ క్రీస్తు మాత్రమే!

ఈ రాత్రి మనం మన సంఘ కాపరి 75 వ జన్మ దినము జరుపుకుంటున్నాము. ఆయన కొరకు ప్రేమ పూర్వక కానుక తీసుకున్నాము. మీరు ఇవ్వగలిగిన దానికంటే ఇంకా ఎక్కువ ప్రాముఖ్యమైనది ఒకటి ఉంది. ఆయనకు గొప్ప సంఘాన్ని ఇవ్వండి! నేను ఆలోచిస్తున్నాను మన సంఘము ఎలా ఉండగలిగిందో, ఎలా ఉంటుందో, దేవుని కృపను బట్టి, ఎలా ఉండబోతుందో! యవనస్తులతో నిండిన సంఘాన్ని ఆయనకు ఇవ్వండి! ప్రార్ధించండి సువార్త ఇవ్వండి ప్రజలను ప్రేమించండి దేవుడు కోరుకునే సంఘముగా మన సంఘము తయారయ్యే వరకు! గొప్ప సంఘాన్ని ఆయనకు ఇవ్వండి!

ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నాను, మన కాపరి క్రీస్తు నీకు ఉన్నాడా? ఆయన రక్షకుడు నీకు ఉన్నదా? యేసును నీవు విశ్వసించావా? క్రీస్తు లేకుండా నీకు పాపము తప్ప ఏమి ఉండదు. నీవు ఆయనను విశ్వసిస్తే ఆయన రక్తము ద్వారా నీకు క్షమాపణ ఉంటుంది. నీవు ఆయనను నమ్మితే, నీవు నిత్య జీవములో తిరిగి జన్మిస్తావు. నీవు త్వరలో యేసును నమ్మునట్టుగా నేను ప్రార్ధిస్తాను. ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఎబెల్ ప్రుదోమ్: డాక్టర్ హైమర్స్ ప్రీతి పాత్ర కీర్తన, కీర్తనలు 27:1-14.
ప్రసంగము ముందు పాట బెంజమెన్ కినీకెయిడ్ గ్రిఫిత్ గారు:
"యజమానుడు వచ్చియున్నాడు" (సారా డౌడ్ నీచే, 1841-1926).
“The Master Hath Come” (by Sarah Doudney, 1841-1926).