Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
ఎలా యూదా ఇస్కరి యోతు
సాతానుచే నాశనము చేయబడ్డాడు

HOW JUDAS ISCARIOT
WAS DESTROYED BY SATAN
(Telugu)

డాక్టర్ ఆర్. యల్. హైమర్స్, జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము సాయంకాలము, మార్చి 13, 2016
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, March 13, 2016

"వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను" (యోహాను 13:27).


"ముక్క" అనగా యేసు శిష్యులు ఆఖరి రాత్రి భోజనములో తినిన రొట్టె ముక్క. "వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను." ఇది బైబిలులో ఒక భయంకరమైన వచనము. అది చెప్తుంది సాతానే యూదాలో ప్రవేశించిందని – అతడు సాతానుచే పట్టబడ్డాడు. ఇది చాలా గమనింపదగినది ఎందుకంటే యూదా క్రీస్తు సన్నిహిత శిష్యులలో ఒకడు. యూదా కథలో మన అందరికీ ఒక హెచ్చరిక ఉంది – మనము రక్షింపబడినను లేక నశించినను.

యూదా ఇస్కరి యోతు సీయోను ఇస్కరి యోతు కుమారుడు. "ఇస్కరి యోతు" దక్షిణ యూదయలోని, అతని స్వస్థలము కేరి యోతును సూచిస్తుంది. పన్నెండు మంది శిష్యులలో యూదా ఒక్కడే ఉత్తర గలిలీయ నుండి వచ్చిన వాడు కాదు. శిష్యుల జాబితాలో ఎప్పుడు అతని పేరు ఆఖరిలో చెప్పబడింది. అతడు ఒక ప్రాముఖ్యమైన శిష్యుడయి ఉండాలి. అతడు వారికి కోశాధికారిగా పనిచేసాడు.

యూదా ఇస్కరి యోతు కథ చీకటి మయము భయకంపితము. అది నాలుగు సువార్తలలో ఇవ్వబడింది కనుక అది ప్రాముఖ్యము, కొన్ని సార్లు దానిపై మాట్లాడవలసిన అవసరము భోధకునికి ఉంది. యూదా ఎలా దెయ్యముచే పట్టబడ్డాడో నేను మీకు చెప్పబోతున్నాను. కథ ఇలా ఉంది.

మార్కు మూడవ అధ్యాయము చెప్తుంది క్రీస్తు ఒక కొండ పైకి వెళ్లి తన శిష్యులను ఆయన దగ్గరకు పిలిచాడని. క్రీస్తు పరలోకమునకు ఆరోహణ మైన తరువాత వీరు సంఘాలను స్థాపించవలసి ఉంది. ఇప్పటి నుండి క్రీస్తు ప్రాముఖ్యమైన పని పన్నెండు మంది శిష్యులకు బోధించడం తర్భీదు ఇవ్వడం. యేసు వారిని అపోస్తలులు అని పిలిచాడు – దాని అర్ధము "పంప బడిన వారు." ఆయనతో ఉండడానికి, ఆయన ఉదాహరణ ద్వారా నేర్చుకోవడానికి ఆయన పరిచర్యను పంచడానికి ఆయన వారిని పిలిచాడు. బోధించడానికి, రోగాలను స్వస్థ పరచడానికి ఆయన నామములో దెయ్యాలను వెళ్ళ గొట్టడానికి ఆయన వారికి అధికారము ఇచ్చాడు. వారి ఒక భాద్యత దెయ్యముల శక్తిని జయించడం. వారి పేర్లు మార్కు 3:16-19లో వ్రాయబడ్డాయి. మొదటి పేరు పేతురు. పన్నెండవ పేరు యూదా ఇస్కరి యోతు.

మత్తయి 10:1-4 లో మనకు చెప్పబడింది, యేసు తన శిష్యులను దెయ్యములను వెళ్ళ గొట్టడానికి, రోగులను స్వస్థ పరచడానికి బోధించడానికి పంపాడని. మళ్ళీ పన్నెండు మంది పేర్లు వ్రాయబడ్డాయి. మళ్ళీ మొదటి పేరు పేతురు, ఆఖరి పేరు యూదా ఇస్కరి యోతు. మత్తయి 10:1 చెప్తుంది యేసు ఈ శిష్యులందరికీ "దురాత్మలపై శక్తిని, వాటిని వెళ్ళ గొట్టడానికి ఇచ్చాడని," మరియు ఇతర అద్భుతాలు చెయ్యడానికి బోధించడానికి. యూదాకు ఈ "శక్తి" ఇవ్వబడింది – అతడు కూడ దెయ్యాలను వెళ్ళ గొట్టాడు, రోగులను స్వస్థ పరిచాడు, మరియు బోధించాడు. యూదా తరువాత క్రీస్తును అప్పగించిన వ్యక్తి. కాని యేసు ఈవ్యక్తికి బోధించడానికి శక్తిని అధికారాన్ని ఇచ్చియున్నాడు (మత్తయి 10:7). ఆయనకు శక్తి ఇవ్వబడింది "రోగులను స్వస్థ పరచడానికి, కుష్టు రోగులను బాగు చేయడానికి, చనిపోయిన వారిని లేపడానికి, దెయ్యములను వెళ్ళ గొట్టడానికి" (మత్తయి 10:8). ఈరోజు ఈ విషయం ప్రాముఖ్యమైనది గుర్తుంచుకోడానికి. అది చూపిస్తుంది క్రైస్తవులని చెప్పుకునే వారందరూ నమ్మదగిన వారు కారని – వారు రోగులను స్వస్థ పరచగలిగినప్పటికి, దెయ్యములను వెళ్ళ గొట్టగలిగినప్పటికి – మరియు, అవును, చనిపోయిన వారిని లేపినప్పటికినీ! కొంతమంది దుష్టులు క్రైస్తవ చరిత్ర అంతటిలో ఈ కార్యములు చేయ గలుగుతూ ఉన్నారు. ఉదాహరణకు రస్పుటిన్, రష్యా ముని అతడు రష్యా జార్ తన స్వంత భవంతిలోనికి జార్ కుమారుని స్వస్థ పరచడానికి తీసుకురాబడ్డాడు. ఈనాడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి బెన్నీ హిన్, ఇతర "స్వస్థ పరిచే" సువర్తికులను చూసేటప్పుడు. వారు యూదా ఇస్కరి యోతు అంత చెడ్డ వారు – అతడు తరువాత గెత్సమనే వనంలో క్రీస్తును అప్పగించాడు. కాని యూదా నేరుగా దయ్యముచే పట్టబడలేదు. అతని నాశనానికి ముందు కొన్ని మెట్లు ఉన్నాయి!

నేను చెప్పినట్టుగా, యూదా శిష్యులకు కోశాధికారి. "సంచిలో" ఉన్న కొంచెము డబ్బును అతడు కలిగి ఉండేవాడు. ఆసంచి నుండి కొంత డబ్బు తీసు అవసరాన్ని బట్టి ఇతర శిష్యులకు ఇచ్చేవాడు. బైబిలు చెప్తుంది యూదా ఇస్కరి యోతు "దొంగాయై ఉండి, అందులో వేయబడిన [డబ్బు] ను, దొంగిలించుచు వచ్చెను" (యోహాను 12:6).

యూదా "ఒక దొంగ." దాని అర్ధము దొంగ హృదయము అతనికి ఉంది. అతని దగ్గరున్న (సంచిలో) నుండి కొంత డబ్బును దొంగిలించాడు. మాత్యూ హెన్రీ వ్యాఖ్యానము చెప్తుంది, "డబ్బును దొంగిలించడం తన హృదయంలో ప్రేమించాడు." నిజాయితీగా పనిచేసి డబ్బును సంపాదించడం తప్పు కాదు. కాని అపోస్తలుడైన పౌలు అన్నాడు,

"ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము: కొందరు దానిని ఆశించి, విశ్వాసము నుండి తొలగిపోయి, నానా బాధలతో తమ్మును తామే పొడుచుకోనిరి" (I తిమోతి 6:10).

జె. సి. రైర్ "ధనాన్ని ప్రేమించడంలో ఉన్న ప్రమాదాన్ని గూర్చి అన్నాడు... పేదవారికి గొప్పవారికి కూడా అది ఒక ఉచ్చు. దానిని నమ్మితే అది ఆత్మను నాశనము చేస్తుంది. మనకున్న వాటితో సంతృప్తి కలిగియుందము" (J. C. Ryle, Expository Thoughts on Mark, Banner of Truth, 1994 paperback, pp. 210, 211; note on Mark 10:23).

చాలామంది యవనస్తులు తప్పిపోవడం నేను చూసాను ఎందుకంటే వారికి "సంరక్షణ" కావాలి. గట్టి క్రైస్తవ కట్టుబాటును కూడ "సంరక్షణ" కొరకు విడిచి పెట్టడం నేను చూసాను. ఈ మాటలను రాస్తున్నప్పుడు మొన్నటి రాత్రి ఒక పాత స్నేహితుని గూర్చి తలంచాను, అతడు చాలాకాలము క్రితము లోకము చేత శోధింపబడి యేసు నుండి తప్పిపోయాడు. సంరక్షణకు ఇంకొక మాట డబ్బు. డబ్బును నమ్మడం ప్రమాదకరము. యేసు అన్నాడు, "తమ [డబ్బు] నందు నమ్మిక యుంచు వారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము" (మార్కు 10:24).

నా జత పనివాడు డాక్టర్ కాగన్ జీవిత కాలపు వచనము సామెతలు 11:4, "ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు" (సామెతలు 11:4). డాక్టర్ కాగన్ ఇటీవల నాతో చెప్పాడు యవనస్తులు తరుచు అనుకుంటారు "ఇచ్చ" అంటే లైంగిక పాపానికి మత్తు పదార్ధాలకు సంబంధించినదని. ఆయనన్నాడు, "వారు గ్రహించడం లేదు డబ్బుకు పేరు ప్రతిష్టల పట్ల ఉన్న ఆకాంక్ష లైంగిక పాపము హెరాయిన్ కంటే భయంకరమైనది – యవన క్రైస్తవులకు ఇంకా ఎక్కువ." డాక్టర్ కాగన్ కూడ సంరక్షణ కొరకు ప్రతిష్ట కొరకు సాతానుచే శోధింపబడ్డాడు. ఆయన పెద్ద కోరిక ముఫై సంవత్సరాల లోపే మిలియన్ డాలర్లు సంపాదించడం. అతడు మార్పు నొందినప్పుడు ఆ కోరిక విడిచి పెట్టాడు. ఇప్పుడు ఆయన మన సంఘ సహాయక కాపరి. ఆయన మాదిరి వెంబడించండి!

యూదా ఇస్కరి యోతు నశించి నరకాని కెళ్ళాడు ఎందుకంటే అతని దగ్గర ఉన్న సంచిలో ఉన్న డబ్భును ఆశించాడు! విత్తు వాని ఉపమానము జ్ఞాపకము చేసుకోండి!

"ముండ్ల పొదలలో పడిన విత్తనమును, పోలిన వారేవరనగా, విని, కాలము గడిచిన కొలదీ, ఈ జీవన సంబంధమైన విచారము చేతను ధన భోగము [డబ్బు] చేతను అణచి వేయబడి, పరిపర్వముగా ఫలించని వారు" (లూకా 8:14).

"ఐశ్వర్యము ధన భోగములచేత" మీరు పట్టబడి క్రమేణా "అణచి వేయబడి" నామకార్ద క్రైస్తవులుగా అయిపోతారు. కొన్ని సంవత్సరాల క్రిందట మన సంఘాన్ని చీలిక చేసిన నాయకునికి అదే సంభవించింది. దాని నుండి పారిపోండి! దాని నుండి పారిపోండి! యూదా కోరికల నుండి పారిపోండి!

"ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకు అనుగ్రహింప బడును" (మత్తయి 6:33).

మీలో చాలామంది విని ఉంటారు నేను కళాశాలలో ఉన్నప్పుడు నీకు ఏమి జరిగిందో. అది చాల కష్టమనిపించింది. ఉదయము 8:00 నుండి సాయంకాలము 5:00 వరకు పనిచేసే వాడిని. తరువాత రాత్రిలో కాల్ స్టేట్ లాస్ ఎంజిలాస్ తరగతులు తీసుకునే వాడిని. రాత్రి కళాశాలలో పట్టభద్రుడ నవడానికి ఎనిమిది సంవత్సరాలు పట్టింది. కళాశాల సగ జీవితము నేను చాలా అలసిపోయి నిరుత్సాహ పడ్డాను నేను ధారుణంగా సాతానుచే శోధింప బడ్డాను. అప్పుడు నా అధ్యాపకులలో ఒకరు ఉపాధ్యాయునిగా అవాలని సలహా ఇచ్చారు. అతడంటే నాకు అభిమానము, నాకు ఆధునిక సాహిత్యము బోధించారు. ఆంగ్ల బోధకునిగా నాకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. నేను పరిచర్యకు వెళ్ళే తలంపు విడిచి, ఉపాధ్యాయుడు కావాలని చాలా తీవ్రముగా ఆలోచించాను. దాదాపు అలా చేసాను, ముందు నా కాపరి డాక్టర్ లిన్ ను చూడాలనుకున్నాను. ఆయన నాతో అన్నాడు పరిచర్యలో తప్ప ఎందులో నేను తృప్తి పొందలేనని. నేను గ్రహించాను జనపకం చేసుకున్నాను ఆంగ్ల ఉపాధ్యాయుడు కాలవను కోవడం దెయ్యము నుండి వచ్చిన శోధన. డాక్టర్ జాన్ ఆర్. రైస్ కూడ పరిచర్యకు వచ్చే ముందు ఇలాగే శోధింపబడ్డాడు. ఉపాధ్యాయుడు కావడం వేరే వారికి పాపము కాకపోవచ్చు, కాని నాకైతే అది పాపమే ఉండేది. నా జీవితంలో అలా చెయ్యాలనుకోవడం దేవుని చిత్తము కాదు.

ఆ శోధనకులోనై ఉంటే, మీలో ఏ ఒక్కరు ఈరాత్రి ఇక్కడ ఉండేవారు కాదు! గ్రిఫిత్ గారు రక్షింపబడకపోయే వారు. డాక్టర్ చాన్ రక్షింపబడక పోయేవారు. లీ గాని, మన సంఘములో ఏ నాయకుడు కూడ. మీరు కూడ రక్షింపబడక పోయేవారు. వాస్తవానికి మీలో చాలామంది పుట్టి ఉండేవారు కాదు! మీలో చాలామంది తల్లిదండ్రులు సంఘములోనే కలిసారు. వారు పెండ్లి చేసుకొని ఉండేవారు కాదు మీరు పుట్టి ఉండేవారు కాదు. ఈ గుడి ఉనికిలో ఉండేది కాదు. నా అద్భుతమైన భార్యను ఎరిగి ఉండేవాడిని కాదు. నా కొడుకు పుట్టి ఉండేవాడు కాదు, అతనికి బిడ్డ హన్నా ఇవ్వబడి ఉండేది కాదు.

నేను స్థాపించిన ఉత్తర కాలిఫోర్నియాలోని సంఘము ఉండి ఉండేది కాదు. దాని నుండి వచ్చిన నలభై సంఘాలు ఉండి ఉండేవి కాదు. వందల మంది రక్షింప బడక పోయేవారు – ప్రసంగప్రతులు విడియోలు వెబ్ సైట్ నుండి బోధింపబడి ఉండేవి కాదు ప్రపంచమంతటా ముద్రింపబడి ఉండేవి కాదు. వాస్తవానికి వేలకొలది జీవితాలు భయంకరంగా ఉండి ఉండేవి ఏదో ఒక కళాశాలలోనో విశ్వ విశ్యాలయములోనో ఆంగ్ల బోధకునిగా ఉండాలనే శోధనకు నేను తావు యిచ్చి ఉంటే.

తరువాత, నేను పట్ట భద్రుడనై సెమినరీకి వెళ్ళినప్పుడు, పరిచర్య వదిలేయాలని ఎంతగానో శోధింపబడ్డాను. నిజానికి కొన్ని రోజులు పరిచర్య మానేసాను. కాని ఒక రాత్రి దేవుడు తిరిగి నన్ను పిలిచాడు. ఒంటరి తనము ద్వారా హృదయ వేదనలో నేను వెళ్ళాను – అలా అయినందుకు సంతోషించాను. భూమిపై ఉన్న బంగారము అంతటి కంటే ఈ సంఘము నాకు ఎక్కువ. అంతర్జాలములో ప్రపంచ వ్యాప్త పరిచర్య మిలియనుల డాలర్లు కంటే నాకు ఎక్కువ! ఇది మీకు చిన్నదిగా కనిపించవచ్చు, కాని ఈ సంఘము ప్రపంచములోనే నాకు అతి ప్రాముఖ్యమైనది!

నా జీవితము, నా ప్రేమ మీకిచ్చుచున్నాను,
     నీవు నా కొరకు చనిపోయిన దేవుని గొర్రె పిల్ల;
ఓ నేను నిత్యమూ నమ్మకస్తునిగా ఉండాలని,
     నా రక్షకా నా దేవా!
నా కొరకు చనిపోయిన వాని కొరకు నేను జీవిస్తాను,
     నా జీవితము ఎంత తృప్తిగా ఉంటుంది!
నా కొరకు చనిపోయిన వాని కొరకు నేను జీవిస్తాను,
     నా రక్షకా నా దేవా!
("నేను ఆయన కొరకు జీవిస్తాను" రాల్ఫ్ ఇ. హడ్సన్ చే, 1843-1901;
డాక్టర్ హైమర్స్ చే మార్చబడింది).
(“I’ll Live For Him” by Ralph E. Hudson, 1843-1901; altered by Dr. Hymers).

ఈ సంఘము ఇప్పుడు ఎంత ధన నిదో నేను చూడడం మాత్రమే కాదు – ఈ సంఘము ఎలా ఉండాలో, నేను చూస్తున్నాను, అది ఎలా ఉండబోతుందో, దేవుని కృపను బట్టి ఎలా ఉంటుందో! నా మనసులో నేను చూడగలను ఈ ఆవరణంలో ప్రతీ మూల సంతోషకరమైన యవనస్తులతో నింపబడడం! దేవుని ఆత్మ దిగి రావడం చూస్తున్నాను. మెరుస్తున్న యవనస్తుల ముఖాలు ఏడుస్తూ ప్రార్దిస్తుండడం నేను చూడ గలుగుతున్నాను, వారు ఆనందంతో అరుస్తున్నారు! పరిచర్య నిమిత్తము యవనస్తులు జీవితాలు ఇవ్వడం నేను చూస్తున్నాను – కొంతమంది మిస్సెనరీలుగా విదేశాలు వెళ్ళారు. నేను బలమైన సంఘము, విరువబడి – దేవుని ప్రేమ ఈ స్థలము నుండి మన దేశము మరియు ప్రపంచములోని చీకటి మూలలకు వెళ్ళడం చూస్తున్నాను! భూభాగమంతటిలో వందల కొలది ఆత్మలపై క్రీస్తు యేసుపై కెత్తబడి ఆయన ప్రేమను క్రుమ్మరించడం నేను చూస్తున్నాను! వారు పాడడం నేను వింటున్నాను,

నా కొరకు చనిపోయిన వాని కొరకు నేను జీవిస్తాను,
   నా జీవితము ఎంత తృప్తిగా ఉంటుంది!
నా కొరకు చనిపోయిన వాని కొరకు నేను జీవిస్తాను,
   నా రక్షకా నా దేవా!

యూదాకు ఒకప్పుడు అలా అనిపించింది. కాని అతడు యేసును అసంపూర్ణంగా ప్రేమించాడు. రెండు మార్గాలుగా లాగ బడ్డాడు. ఒక భాగము యేసు కావాలనుకుంది. అతనిలో ఇంకొక భాగము ఈ లోక విషయాలు కావాలనుకుంది. బైబిలు చెప్తుంది, "అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు" (యాకోబు 1:8). కనుక, యూదా శిష్యుల దగ్గర ఉన్న డబ్బు సంచిలో చేతులు పెట్టాడు. అది ఎక్కువ కాదు – కొన్ని నాణెములు మాత్రమే ప్రజలు యేసుచే దీవింపబడినప్పుడు వారు ఆయనకు ఇచ్చినవి. కాని యూదా మళ్ళీ మళ్ళీ డబ్బు దొంగిలించాడు. తరుచు తన కొరకు కొన్ని నాణెములు తీసుకున్నాడు.

ఇతర శిష్యుల వలే అతడు అనుకున్నాడు యేసు భూ సంబంధ రాజ్యాన్ని అప్పుడే స్థాపిస్తాడని. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత కూడ వారన్నారు, "ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలు నకు రాజ్యమును మరల అనుగ్రహించెదవా?" (అపోస్తలుల కార్యములు 1:6). రాజ్యములో ఎవరు గొప్ప వారవుతారని వారు పన్నాగము పన్నుతున్నారు. "తమలో ఎవడు గొప్పవాడో అని, వారిలో తర్కము పుట్టెను" (లూకా 9:46).

"అప్పటి నుండి తానూ యేరూష లేమునకు వెళ్లి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి, మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయు మొదలుపెట్టెను..." (మత్తయి 16:21). నేను నమ్ముతాను యూదా యేసు చనిపోయి రాజ్యాన్ని స్థాపించడని అనుకున్నాడు – యేసును వెంబడించడం ద్వారా లాభము లేదని అనుకున్నాడు. ఈ విషయాలు ఆలోచిస్తున్నప్పుడు సాతాను యూదాకు అతి సమీపంగా వచ్చెను.

ఇప్పుడు పస్కా పండుగ వస్తుంది. ప్రధాన యాజకులు శాస్త్రులు యేసును చంపాలని మార్గము కొరకు చూస్తున్నారు. "అప్పుడు యూదాలో సాతాను ప్రవేశించెను... గనుక వాడు వెళ్లి, ఆయనను వారికే లాగు [మాట్లాడెను] అప్పగింపవచ్చునో, దానిని గూర్చిన అధిపతుల తోనూ ప్రధాన యాజకుల తోనూ మాట్లాడెను. అందుకు వారు సంతోషించి, వానికి ద్రవ్యమివ్వ [సమ్మతించిరి] "(లూకా 22:3-5). "అప్పుడు సాతాను యూదాలో ప్రవేశించెను." అతనికి డబ్బే కావాలి. ఇప్పుడు సాతాను అతని బలహీనతపై దెబ్బకొట్టింది, యూదా తావు ఇచ్చాడు – " అప్పుడు సాతాను యూదాలో ప్రవేశించింది" – అతడు రక్షకుని అప్పగించడానికి ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళాడు. యూదా ఇస్కరి యోతు డబ్బు కొరకు క్రీస్తును అప్పగించాడు! దురాశ తన ఆత్మను నాశనము చేసింది!

డాక్టర్ కాగన్ ఈ ఉదయము "నేత్రాశ, జీవపుడంబముపై" అద్భుతమైన ప్రసంగము చేసారు (I యోహాను 2:16). డాక్టర్ కాగన్ అన్నారు, "'నేత్రాశ, జీవపు డంబము అంటే అర్ధము ఏమిటి'? నేను డబ్బును గూర్చి అదికొనే వాటిని గూర్చి మాట్లాడుతున్నాను – ఇల్లు, కారు, మంచి బట్టలు, విలాస ప్రయాణాలు, మిగిలినదంతా...ఎప్పుడైతే డబ్బు అది కొనేవి నీ కాంతిని ఆకర్షించి నీ ముఖ్య గమ్యము అవుతుందో, ఇంకా ఇంకా కావాలనుకుంటావో, నీవు పట్టబడి నేత్రాశకు బానిసవై పోయావు. నేను నశించు వారి ప్రశంశలను గూర్చి [కూడ] మాట్లాడుతున్నాను. మిమ్ములను గూర్చి ఇవ్వబడిన ఘనతలు పదోన్నతులు పేర్లు సర్టిఫికేట్లు మంచి విషయాలను గూర్చి, నేను మాట్లాడుతున్నాను. అవును, మీరు పాఠశాలలో బాగా చదవాలి. అవును, ఉద్యోగమూ తెచ్చుకోవాలి కష్టపడి పనిచెయ్యాలి. కాని ఎప్పుడైతే గౌరవాలు పదోన్నతులు పేర్లు ప్రశంశలు దేవుని విషయాల నుండి మీ తలను తిప్పివేస్తే, జీవడంబము ద్వారా మీరు పట్టబడినట్లే."

తరువాత డాక్టర్ కాగన్ మిమ్ములను శోధించడానికి సాతాను ప్రజలను ఎలా ఉపయోగిస్తాడో చెప్పారు. డాక్టర్ కాగన్ అన్నాడు, "నీవు ఇష్టపడే గౌరవించే వారినే వాడు వాడుకుంటాడు. వారినే వాడుకుంటాడు... ఎవరి దగ్గర నుండి నేర్చుకున్నావో – వ్యాపార ప్రపంచంలో 'నేర్పే వారు' వారిని వాడుకుంటాడు. కళాశాలలో మీరు మెచ్చుకునే గౌరవించే వారిని వాడు ఉపయోగించుకుంటాడు – మీ అధ్యాపకులు నీ జీవతంలో ఇతర 'నేర్పేవారు.' వారి మాట విని వారి సలహాలు పాటిస్తాడు. మీరు ఇలా ఆలోచించరు, కాని వారు మీకు నిజమైన కాపరి – మీ గొర్రెల కాపరి, నిన్ను నడిపించే వాడు అవుతారు... అది శోధన అని మీరు అనుకోరు. నీకు మంచిగా అనిపిస్తుంది. అది క్రీస్తు ప్రేమ నుండి నిన్ను వేరు చేస్తుంది... నీవు యవనునిగా ఉన్నప్పుడు, క్రీస్తు మరియు సంఘము చాలా ప్రాముఖ్యంగా కనిపిస్తాయి, కాని ఇప్పుడు నీవు నీ జీవితంలో చిన్న భాగానికి ఒక బీరువాకు పరిమితం చేస్తున్నావు... మరియు అది కొనసాగి – అది కొనసాగి – నీవు బందీవవుతావు – సంఫోను వలే, గుడ్డి వాడై, లోక చక్రంలో త్రిప్పబడ్డాడు!" (Christopher L. Cagan, Ph.D., “The Church World or the Wide World?”, Lord’s Day Morning, March 13, 2016).

నేను డాక్టర్ కాగన్ గొప్ప ప్రసంగము చదివినప్పుడు నేననుకున్నాను, "ఓ దేవా! చాలాకాలము క్రిందట నేను అది బోధించవలసి ఉండేది!" ఇది మన ఒక ఇద్దరు యవనస్తులకే వర్తిస్తుందా? దాని గూర్చి కొంతసేపు ఆలోచించాను. తరువాత ఒక కాగితముపై మన సంఘములోని పన్నెండు మంది యవనస్తుల పేర్లు వ్రాసాను వారు డాక్టర్ కాగన్ మాట్లాడిన చిన్న శోధనలచేత సాతాను గుడ్డి తనములోనికి నడిపింపబడ్డారు. నా హృదయము బాధ పడింది నేను గ్రహించాను ఈ విషయమై నా బాధలో విఫలడనయ్యాను, ఎందుకంటే ఆ పన్నెండు మంది యవనస్తులు లోకములోనికి ఇవ్వబడ్డారు అదే దురాత్మతో దేనితో ఇస్కరి యోతు యూదా, క్రమేణా, రక్షకుని అప్పగించాడో అదే రీతిలో!

ఇలా ముగుస్తుందని యూదా ఊహించలేదు, కొంచెము కొంచెము శోధనలో పడుతున్నప్పుడు. చివరకు సాతాను అతనిలో ప్రవేశించింది అతడు యేసును అప్పగించాడు. క్రీస్తును అప్పగించడానికి ఎంత డబ్బు అతనికి వచ్చిందో మీకు తెలుసా? 30 వెండి నాణెములు అతనికి వచ్చాయి. డేవిస్ బైబిలు నిఘంటువు చెప్తుంది "సుమారు $19.50 డాలర్లు, బానిసకు చెల్లించే వెల." సాతాను చాలామందిని చవకగా పొందుకుంటుంది! వాడు అరుదుగా ఈకువ చేల్లిస్తాడు. చాలామందిని చవకగా పొందుకుంటాడు! విచిత్రంగా, నేను మన గుడిలో 12 మంది యవనస్తులను లెక్కించాను దెయ్యము వారిని ఇలాగే పొందుకుంది. నా మనసులో ముప్పై ఏళ్ల క్రిందటకి వెళ్లాను, నేను సరిగ్గా 12 మంది పేర్లు వ్రాసాను వారు ఒకప్పుడు మన గుడిలో జీతానికి పని చేసిన వారు – ఇదే విధంగా సాతాను వారిని నాశనము చేసింది! ఓ నా ప్రభువా, ఈ విషయము మీద మళ్ళీ మళ్ళీ బోధించాలి! అవును దేవా, నేను వాగ్ధానము చేస్తున్నాను బోధలో ఈ రాత్రి నుండి లోకరీతి శోధనలకు ఎక్కువ ప్రాధాన్య స్థానము ఇస్తాను!

కనుక, యూదా ఆ భయంకర రాత్రి గెత్సమనే వనంలోనికి క్రీస్తు శత్రువులను నడిపించాడు. కనుక, వారు యేసును ఈడ్చుకొని పోయి సిలువ వేసారు. కనుక, యూదా 30 వెండి నాణెములు పొందుకున్నాడు – సుమారు $19.50 డాలర్లు.

తరువాత ఆ రాత్రి, "యూదా, ఆయనను అప్పగించిన తరువాత, అతడు ఖండింపబడ్డాడని తెలుసుకున్నప్పుడు, [పశ్చాత్తాప పడి] ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకు ముప్పై వెండి నాణెములు తీసికొని వచ్చి, ఇలా అన్నాడు

'నేను నిరపరాధి రక్తాన్ని అప్పగించడం ద్వారా పాపము చేసాను.'

అతడు ఆ వెండి నానేములను దేవాలయములో పారవేసి, వెళ్లి పోయి, ఉరి తీసుకున్నాడు" (మత్తయి 27:3-5). తన మెడ చుట్టూ తాడు బిగించుకొని ఉరి తీసుకున్నాడు! నేను కంఠస్తము చేసిన మొదటి బైబిలు వచనము, "నిరపరాధి రక్తాన్ని అప్పగించి నేను పాపము చేసాను" (మత్తయి 27:4). ఆ వచనాన్ని కంఠస్తము చేసి నాటికలో ఒక భాగంగా యూదా ఇస్కరి యోతు పాత్రలో ఆ మాటలు చెప్పను కాలిఫోర్నియా లోని, హనింగ్ టన్ పార్కు మొదటి బాప్టిస్టు సంఘములో. నా వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు. ఆ వచనము నన్ను వెంటాడింది రెండు సంవత్సరాల తర్వాత నేను మార్పు నొందాను. "నిరపరాధి రక్తాన్ని అప్పగించడం ద్వారా నేను పాపము చేసాను."

ఈ రాత్రి నేనడుగుతాను, నీ జీవితంలో నీవు యేసును అప్పగిస్తావా? లేక క్రీస్తుకు సంఘానికి నీ హృదయములో జీవితంలో మొదటి స్థానము ఇస్తావా? ఆయనను విశ్వసించి ఆయన కొరకు జీవిస్తావా, ఆయన కొరకు మాత్రమే జీవిస్తావా? ఇప్పటి నుండి ముప్పై సంవత్సరాలు నీ హృదయములో నుండి ఆ పాట పాడగలవా?

నా జీవితము, నా ప్రేమ మీకిచ్చుచున్నాను,
   నీవు నాకొరకు చనిపోయిన దేవుని గొర్రె పిల్ల;
ఓ నేను నిత్యమూ నమ్మకస్తునిగా ఉండాలి,
   నా రక్షకా నా దేవా!
నా కొరకు చనిపోయిన వాని కొరకు నేను జీవిస్తాను,
   నా జీవితము ఎంత సంతృప్తిగా ఉంటుంది!
నా కొరకు చనిపోయిన వాని కొరకు నేను జీవిస్తాను,
   నా రక్షకా నా దేవా!

ఓ, యవనస్తుడా, నీ హృదయము నీ జీవితము యేసు క్రీస్తుకు అప్పగించు – ఎన్నడూ ఆయన నుండి తొలగి పోవద్దు లోక పాపముల వలన! నాతో ఆ పాట పాడండి. మీ పాటల కాగితంలో మూడవ పాట.

నా జీవితము, నా ప్రేమ మీకిచ్చుచున్నాను,
   నీవు నాకొరకు చనిపోయిన దేవుని గొర్రె పిల్ల;
ఓ నేను నిత్యమూ నమ్మకస్తునిగా ఉండాలి,
   నా రక్షకా నా దేవా!
నా కొరకు చనిపోయిన వాని కొరకు నేను జీవిస్తాను,
   నా జీవితము ఎంత సంతృప్తిగా ఉంటుంది!
నా కొరకు చనిపోయిన వాని కొరకు నేను జీవిస్తాను,
   నా రక్షకా నా దేవా!

ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఎబెల్ ప్రుదోమ్: యోహాను 13:21-30.
ప్రసంగము ముందు పాట బెంజమెన్ కినీకెయిడ్ గ్రిఫిత్ గారు:
"శోధనకు లోను అవవద్దు" (హొరేషియో ఆర్. పామర్ చే, 1834-1907).
“Yield Not to Temptation” (by Horatio R. Palmer, 1834-1907).