Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




రక్తమయమయిన చెమట

THE BLOODY SWEAT
(Telugu)

డాక్టర్ ఆర్. యల్. హైమర్స్, జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము సాయంకాలము, మార్చి 6, 2016
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, March 6, 2016

"ఆయన వేదన పడి మరింత ఆతురంగా ప్రార్ధన చేయగా: ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువు వలే ఆయెను" (లూకా 22:44).


సి. హెచ్. స్పర్జన్ గారి రెండు గొప్ప ప్రసంగాలపై ఈ ప్రసంగము ఆధారపడి ఉంది, "తోటలో వేదన" (అక్టోబర్ 18, 1874) మరియు "గెత్సమనే" (ఫిబ్రవరి 8, 1863). బోధకుల బోధకుడి ఈ రెండ విశిష్ట అద్భుత ప్రసంగాలను సంక్షిప్తంగా మీకు తెలియ చేస్తాను. ఇక్కడ మూలము ఏదీ లేదు. తక్కువ విద్యగల ఆధునిక మానవునికి తగినట్టుగా ఈ ప్రసంగాలను నేను సులభ పరిచాను. గొప్ప బోధకుని ప్రసంగాల నుండి ఈ తలంపులను రాబట్టాను, వాటిని మీ ముందు ఉంచుతున్నాను ఒక నిరీక్షణతో గెత్సమనే తోటలో క్రీస్తును స్పర్జన్ చూపించిన విధానము మీ ఆత్మలను పట్టుకొని మీ నిత్యత్వ గమ్యాన్ని మారుస్తుందనే నమ్మకంతో.

యేసు పస్కా భోజనము తిని తన శిష్యులతో ప్రభు రాత్రి భోజనాన్ని ఆచరించాడు. తరువాత ఆయన వారితో గెత్సమనే తోటకు వెళ్ళాడు. ఆయన వేదన ఆరంభించడానికి గెత్సమనేను ఆయన ఎందుకు ఎన్నుకున్నాడు? ఏదేను వనంలో, ఆదాము పాపము మనలను నాశనము చేసినందున; ఆఖరి ఆదాము ఇంకొక వనము, గెత్సమనే వనంలో మనలను పునరుద్దరింపదలచినందువలనా?

క్రీస్తు తరుచు ప్రార్ధనకు గెత్సమనేకు వచ్చేవాడు. మునుపు చాలాసార్లు ఆయన ఆ స్థలానికి వెళ్ళాడు. యేసు ఉద్దేశము మన పాపము ఆయనను పూర్తిగా మార్చేసిందని విచారమునకు గురి చేసిందనే విషయము మనము చూడాలని. ఏ స్థలములో ఆయన ఎక్కువ ఆనందించాడో ఆ స్థలంలోనే ఆయన ఎక్కువ శ్రమపడాలని పిలువబడ్డాడు.

లేక ఆయన గెత్సమనేను ఎందుకు ఎన్నుకున్నాడంటే గతంలో ఆయన ప్రార్ధనలో గడిపింది ఆయనకు జ్ఞాపకము చేసింది. ఆ స్థలంలో తరచు దేవుడు తనకు జవాబిచ్చాడు. బహుశా ఆయనకు అనిపించింది ఆయన ప్రార్ధనకు దేవుని సమాధానాలు ఇప్పుడు సహాయపడేటట్టుగా, ఆయన వేదనలోనికి ప్రవేశించాడు.

బహుశా ముఖ్య కారణము ఆయన ప్రార్ధించడానికి గెత్సమనేకు వెళ్ళడం ఆయనకు అలవాటు, అది అందరికి తెలుసు. యోహాను చెప్తున్నాడు, "యేసు తన శిష్యులతో పాటు, పలుమారు అక్కడికి వెల్లుచుండు వాడు, గనుక ఆయనను అప్పగించిన యూదాకును: ఆ స్థలము తెలిసి యుండెను" (యోహాను 18:2). యేసు కావాలనే ఆ స్థలానికి వెళ్ళాడు ఆయనను తెలుసు వారు ఆయనను బందిస్తారని. ఆయన అప్పగింపబడే సమయము వచ్చినప్పుడు, ఆయన "వధకు తేబడు గొర్రె పిల్ల వలే వెళ్ళాడు" (యెషయా 53:7). ప్రధాన యాజకుని సైనికుల నుండి ఆయన దాచుకోలేదు. ఆయన తనను తరిమి ఒక దొంగ వలే పట్టుకోవాలనుకోలేదు, గూడాచారులచే వెదికింపబడాలనుకోలేదు. యేసు బుద్ధి పూర్వకంగా ఆ స్థలానికి వెళ్ళాడు అప్పగించువాడు సులభంగా ఆయనను గుర్తు పట్టడానికి ఆయన శత్రువులు ఆయనను బంధించడానికి.

ఇప్పుడు మనము గెత్సమనే వనంలో ప్రవేశిస్తున్నాము. ఈ రాత్రి అది ఎంత అందకారంగా భయంకరంగా ఉంది. తప్పకుండా యాకోబుతోపాటు మనం చెప్పవచ్చు, "ఈ స్థలము ఎంతో భయంకరము!" (ఆదికాండము 28:17). గెత్సమనే పై ధ్యానము చేస్తుండగా, మనము క్రీస్తు వేదనను గూర్చి ఆలోచిస్తాము, నేను వనంలో ఆయన వేదనను గూర్చిన మూడు ప్రశ్నలకు నేను సమాధానమును ఇవ్వ ప్రయత్నిస్తాను.

I. మొదటిది, గెత్సమనేలో క్రీస్తు బాధకు వేదనకు కారణమేమిటి?

లేఖనాలు మనకు చెప్తున్నాయి యేసు "విచారముతో కూడిన, దుఃఖమును కలిగిన వాడు" (యెషయా 53:3), కాని ఆయనకు నిరుత్సాహ వ్యక్తిత్వము లేదు. ఆయన తనలో ఎంత గొప్ప సమాధానము కలిగి యున్నాడంటే ఆయన అనగలిగాడు "నా శాంతిని మీకను గ్రహించు చున్నాను" (యోహాను 14:27). యేసు శాంతియుత సంతోష వ్యక్తి అని నేను చెప్తున్నప్పుడు నేను పొరబడుచున్నాడని, అనుకోవడం లేదు.

కాని గేత్సమనేలో అంతా మారిపోయింది. ఆయన శాంతి పోయింది. ఆయన సంతోషము బహు విచారంగా మారిపోయింది. కేద్రోను వాగు దాటి, యేరూషలేము నుండి కొండదిగువకు వెళ్తున్నప్పుడు, గెత్సమనేకు, రక్షకుడు ప్రార్ధించి సంతోషంగా మాట్లాడాడు" (యోహాను 15-17).

"యేసు ఈ మాటలు చెప్పి, తన శిష్యులతో కూడ కేద్రోను వాగు [కేద్రోను] దాటెను, అక్కడ ఒకతోట ఉండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతో, కూడ వెళ్ళెను" (యోహాను 18:1).

తన జీవిత కాలమంతటిలో యేసు ఎన్నడు విచారంగా మనస్తాపం చెందినట్లుగా ఒక్కమాట కూడ పలకలేదు. కాని ఇప్పుడు, తోటలో ప్రవేశించగానే, అంతా మారిపోయింది. ఆయన అరిచాడు, "నీ చిత్తమైతే, ఈ గిన్నెను నాయొద్ద నుండి తొలగింపుము" (మత్తయి 26:39). తన జీవిత మంతటిలో, యేసు ఎప్పుడు దుఃఖాన్ని గూర్చిన, కాని మనస్తాపాన్ని గూర్చికాని, ఒక్కమాట పలకలేదు, అయినను ఇక్కడ ఆయన మూలుగుచు చెమట రక్తము కారుస్తూ అంటాడు, "మరణం అగునంతగా, నా ప్రాణము బహు దుఃఖములో మునిగియున్నది" (మత్తయి 26:38). యేసు ప్రభు, ఏమి జరిగింది, మీకు అంతలోతుగా కలవరపడడానికి?

ఇది తేట తెల్లము ఈ విచారము నిరుత్సాహము తన శరీరములోని నొప్పిని బట్టి జరుగలేదు. యేసు మునుపెన్నడూ ఏ శారీరక సమస్యను గూర్చి ఫిర్యాదు చెయ్యలేదు. ఆయన స్నేహితుడు లాజరు మరణించినప్పుడు ఆయన విచారంగా ఉన్నాడు. అయన నిస్సందేహంగా విచార పడ్డాడు, ఆయన శత్రువులు సాతాను శక్తి వలన దయ్యాలు వెళ్ళ గొట్టుచున్నాడని నేరారోపణ చేసినప్పుడు. కాని ఆయన అంతటిలో ధైర్యంగా ఉండి జయించుకొచ్చాడు. అది ఆయన వెనుక ఉంది. నొప్పి కంటే పదునైంది, నిందించడం కంటే చేక్కేది, మరణము కంటే భయంకరమైనది, ఇప్పుడు రక్షకుని ఆవరించింది, ఆయనను "విచారకరంగా, భారయుక్తంగా చేసింది" (మత్తయి 26:37).

మరణ భయము, సిలువ ఆందోళన అని మీరనుకుంటున్నారా? చాలామంది హత సాక్షులు వారి విశ్వాసము కొరకు ధైర్యంగా చనిపోయారు. వారికంటే క్రీస్తుకు తక్కువ ధైర్యము ఉందనడం ఆయనను అగౌర పరచినట్టే. మన యజమానిని మరణ పర్వంతము వెంబడించిన ఆయన హత సాక్షుల కంటే తక్కువగా తలంచరాదు! ఇంకా, బైబిలు చెప్తుంది, "ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందముకై, సిలువ సహించి అవమానమును నిర్లక్ష్య పెట్టాడు..." (హేబ్రీయులకు 12:2). యేసు కంటే ఎక్కువగా ఎవ్వరు మరణ బాధను పొంది యుండలేదు. వనంలో ఆయన వేదనకు ఇది కారణమూ కాకపోవచ్చు.

మరియు, సాతాను దాడివలన గెత్సమనేలో ఆవేదన సంభవించింది అనే విషయాన్ని నేను నమ్మను. పరిచర్య ప్రారంభములో, క్రీస్తు ఆయన అరణ్యంలో ఉన్నప్పుడు సాతానుతో చాలా భయంకర పోరాటము సలిపాడు. అయినను మనము చదవం యేసు అరణ్యంలో "వేదనలో ఉన్నాడని" ఆ అరణ్యంలోనికి శోధనలో. గెత్సమనే లోని చెమట రక్తంగా కారణము అనేది లేదు. ప్రభువు దూతలు ముఖాముఖిగా సాతానుకు ఎదురుగా ఉన్నప్పుడు, ఆయన గట్టిగా కేకలు వెయ్యడం కాని కన్నీరు కాని, నేలపై పడి తండ్రికి మోర పెట్టడం కాని చెయ్యలేదు. దీనితో పోలిస్తే, సాతానుతో క్రీస్తు పోరాటము సులభమే. కాని గెత్సమనే లో ఈ వేదన ఆయన ఆత్మనే గాయపరచి దగ్గరగా ఆయనను చంపేసింది.

ఏది ఆయనకు వేదన, కలిగించింది? మన నిమిత్తము దేవుడు ఆయనను వేదనకు గురి చేసినప్పుడు. ఇప్పుడు యేసు ఒక గిన్నెను తండ్రి చేతి నుండి తీసుకోవలసి వచ్చింది. అది ఆయనకు భయంకరమైనది. కనుక కచ్చితము ఏమిటంటే అది శారీరక బాధ కంటే భయంకరము, ఆయన దాని వలన కుదింపబడలేదు. ప్రజలు ఆయనపై కోపంగా ఉన్నారు అది దారుణము – దానివలన ఆయన ప్రక్కకు జరగలేదు. సాతాను శోధన కంటే అతి భయంకరము – దానిని ఆయన జయించాడు. ఇది అనూహ్యంగా భయంకరం, ఆశ్చర్య కరంగా ఘోరము – అది తండ్రి దేవుని నుండి ఆయన పైకి వచ్చియున్నది.

ఆయన వేదనకు కారణము ఏమిటనే విషయంలో ఉన్న అనుమానా లన్నిటినీ ఇది తొలగించి వేస్తుంది:

"యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపెను" (యెషయా 53:6).

పాపులపై పడవలసిన శాపమును ఆయన భారిస్తున్నాడు. పాపి స్థానంలో ఆయన నిలబడి శ్రమ నొందాడు. అది రహస్యము ఆ వేదనలకు అది పూర్తిగా వివరించడం నాకు సాధ్యము కాదు. మానవుని తన ఈ శ్రమను పూర్తిగా అవగాహన చేసుకోలేదు.

‘అది దేవుడు, దేవుడు మాత్రమే,
ఆవేదనలన్నీ పూరిగా తెలుసు.
("ఆయన తెలియని శ్రమలు" జోసఫ్ హార్ట్ చే, 1712-1768).
(“Thine Unknown Sufferings” by Joseph Hart, 1712-1768).

దేవుని గొర్రె పిల్ల మానవాళి పాపాలను తన శరీరంలో భరించాడు, మన పాపాల భారము ఆయన ఆత్మపై మొప బడ్డాయి.

"మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించునట్లు, ఆయన తానే, తన శారీరమందు మన పాపములను, మ్రాను మీద మోసికొనేను: ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి" (I పేతురు 2:24).

గేత్సమనేలో "ఆయన శరీరంపై" మన పాపాలన్నీ మొపబడ్డాయని నేను నమ్ముతాను, మరునాడు ఆయన మన పాపాలను సిలువపై భరించాడు.

వనంలో క్రీస్తు పూర్తిగా గ్రహించాడు పాప భారాన్ని మోయడం అంటే ఏమిటి. ఆయన బలి పశువు అయ్యాడు, ఇశ్రాయేలీయుల పాపాలను ఆయనపై మోస్తూ, పాపానికి అర్పింపబడ్డాడు, దేవుని ఉగ్రత అగ్నిచే వెలుపల దహింపబడ్డాడు. ఇప్పుడు మీరు చూస్తున్నారా దీని నుండి క్రీస్తు ఎలా నలిగిపోయాడో? మన పాపుల స్థానంలో దేవుని యెదుట నిలబడడం క్రీస్తుకు చలా భయకంపితమనిపించింది – లూథరు చెప్పినట్టు, ఆయన ఒక్కడే లోకములోని పాపులందరూ దేవునిచే చూడబడడం. దేవుని ఉగ్రతకు ప్రతీకారానికి ఆయన కేంద్ర బిందువయ్యాడు. పాపిపై పడాల్సిన తీర్పును ఆయనే భరించాడు. ఈ పరిస్థితిలో ఉండడం క్రీస్తుకు చాలా భయంకరమైనది.

తరువాత, కూడ, వనంలో పాపము నకు శిక్ష ఆయనపై పడడం ఆరంభమయింది. మొదటిది, పాపము ఆయనపై పడింది, పాపమునకు శిక్ష కూడ పడింది. అది చిన్న శ్రమ కాదు మానవుల పాపాల నిమిత్తము దేవుని న్యాయము భరించుట. మన ప్రభువు సహించిన దానిని ఎక్కువ చేసి చెప్పడానికి నేనెప్పుడు భయపడను. ఆయన త్రాగిన ఆ గిన్నెలో నరకమంతా పోయబడింది.

రక్షకుని ఆత్మను కుదిపేసిన ఆ దుఃఖము, గొప్ప చెప్పన శక్యము కాని ఆవేదన ఆయన త్యాగ పూరిత మరణములో రక్షకుని ఆత్మను నలిపి వేసినది, అది చాలా అనూహ్యమైనది నేను ముందుకు వెళ్ళలేను, ఎందుకంటే వివరింపలేని దానిని అభివర్ణింప ప్రయత్నిస్తున్నానని ఎవరైనా నా మీద నింద మోపవచ్చు. కాని ఇది నేను చెప్తాను, భయంకరమైన లోతైన మానవాళి పాపము, అది క్రీస్తుపై పడినప్పుడు, చెమటతో కూడిన రక్తములో ఆయనకు బాప్తిస్మము ఇచ్చింది. పాపిగా పరిగణించబడడానికి, పాపిగా శిక్షింప బడడానికి, ఆయన ఎన్నడూ పాపము చెయ్యనప్పటికినీ – ఇది ఆయనకు ఆవేదన కలిగించింది మన పాఠ్యభాగము ఆ విషయము చెప్తుంది.

"ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్ధన చేయగా: ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలే ఆయెను " (లూకా 22:44).

ఇప్పుడు మనము తరువాతి ప్రశ్నకు వస్తాము.

II. రెండవది, క్రీస్తు యొక్క రక్తముతో కూడిన చెమట అంటే అర్ధము ఏమిటి?

ఎల్లీకాట్ మనకు చెప్తాడు రక్తముతో కూడిన చెమట వాస్తవికత ఏమంటే "సాధారణంగా తీసుకొనబడే ఉద్దేశము" (Charles John Ellicott, Commentary on the Whole Bible, volume VI, p. 351). ఆయన చూపిస్తున్నాడు "పదము ‘రక్తముతో కూడిన చెమట,’ [అది] అరిస్టాటిల్ విపరీత అలసటగా సూచింప బడింది" (ఐబిఐడి.). అగస్టీన్ నుండి ఇప్పటి వరకు చాలామంది వ్యాఖ్యానము ఆ పదాలను "ఉన్నట్టుగానే" వాస్తవమైన రక్తముగా చెప్పారు. మనము కూడ నమ్ముతాం క్రీస్తు నిజంగా రక్తము చెమటగా కార్చాడని. ఇది సాధారణము కానప్పటికినీ, ఇది చరిత్రలో ఆయా సమయాలలో ఆయా ప్రజలచే సాక్ష్యమివ్వబడింది. గాలెన్ పాత వైద్యపు పుస్తకాలలో, ఈ మధ్య తేది వరకు, చాలామంది ప్రజలు దీర్ఘ బలహీనత తరువాత చెమటను రక్తముగా కార్చినట్టు నమోదు అయింది.

కాని క్రీస్తు రక్తపు చెమటను కార్చడం విశిష్టం. ఆయన చెమటను రక్తముగా కార్చడం మాత్రమే కాకుండా, అది బిందువుల వలే "ముద్దల వలే," పెద్ద, బరువైన చుక్కల్లా పడ్డాయి. ఇది ఎక్కడా చూడలేదు. రోగులలో చెమటలో రక్తము కనిపించింది, కాని పెద్ద చుక్కలు కాదు. తరువాత మనకు చెప్పబడింది ఈ గొప్ప రక్త బిందువులు ఆయన బట్టల మీదుగా కారలేదు, కాని "భూమిపై పడుచున్నాయి." ఇక్కడ క్రీస్తు వైద్య చరిత్రలో ఒంటరిగా నిలిచి పోతాడు. ఆయనకు మంచి ఆరోగ్యము ఉంది, ముప్పై మూడు సంవత్సరాల వయసు. అయినను పాప భార కారణంగా ఆయనపై ఉన్న మానసిక ఒత్తిడి, ఆయన శక్తి అంతా ఉడిగి పోవడం, ఆయన శరీరాన్ని బలవంత పెట్టింది అసాధారణంగా స్పందించడానికి తద్వారా ఆయన గ్రంధులు తెరచుకొని గొప్ప రక్తపు బిందువులు ప్రవహించి నేలపై పడ్డాయి. ఇది చూపిస్తుంది ఎంత గొప్ప పాపభారము ఆయనపై మోపబడింది. అది రక్షకుని నలుగ గొట్టింది ఆయన శరీరము నుండి రక్తము వచ్చే వరకు.

ఇది క్రీస్తు ఐచ్చిక సహజ శ్రమను చూపిస్తుంది, కత్తిలేకుండా రక్తము ప్రవహించింది. వైద్యులు చెప్తారు చాలామంది గొప్ప భయానికి గురి అయితే, రక్తము గుండెకు పరిగెడుతుంది అని. బుగ్గలు తెల్లబడ్డాయి; స్పృహ తప్పే పరిస్థితిని; రక్తము లోపలి వెళ్ళింది. కాని ఆవేదనలో ఉన్న రక్షకుని చూడు. ఆయన తన్ను తానూ మర్చిపోయాడు ఆయన రక్తము, ఆయన సంరక్షణకు లోనికి వెళ్ళకుండా, నేలమీద పడునట్లు బయటికి ఉబికింది. ఆయన రక్త ప్రవాహము భూమిపై నీకు ఉచితముగా ఇవ్వబడిన సంపూర్ణ రక్షణను చూపిస్తుంది. ఆయన చర్మము నుండి రక్తము ఉచితముగా ప్రవహిస్తుండగా, నీవు యేసును నమ్మడం ద్వారా నీ పాపాల నుండి కడుగ బడతావు.

"ఆయన వేదన పడి మరింత ఆతురంగా ప్రార్ధన చేయగా: ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలే ఆయెను" (లూకా 22: 44).

ఆత్మలో ఆయనకున్న విచారము కారణంగా చెమట ద్వారా రక్తము వచ్చింది. అన్ని బాధలలో హృదయ బాధ అతి భయంకరము. విచారము మనస్థాపము రెండు అంధకార వేదనలు. లోతైన మనస్థాప ము తెలిసిన వారు ఇది నిజమని మీకు చెప్పగలరు. మత్తయిలో మనం చదువుతాం ఆయన "దుఃఖ పడి చింతా క్రాంతుడాయెను" (మత్తయి 26:37). "చాలా భారము" – ఆ పలుకులోనే పూర్తి అర్ధము ఉంది. అది పూర్తిగా విచారముతో నిండుకున్న మనసును వివరిస్తుంది, వేరే తలంపులు ఏమిలేకుండా. మా పాపాల మోయువానిగా ఆయన పరిస్థితి ఆయన మనస్సు సమస్తానికి దూరమయింది. ఆయన ఏకధాటిగా మానసిక కలవరము అనే గొప్ప సముద్రముతో కొట్టబడ్డాడు. "అతడు మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింప బడిన వానిగాను, ఆయెను" (యెషయా 53:4). "అతడు తనకు కలిగిన వేదనను చూచి, తృప్తి నొందును" (యెషయా 53:11). ఆయన హృదయము విఫలమయింది. ఆయన భయంతో త్రునీ కారముతో నింప బడ్డాడు. ఆయన "చాలా భాద భరితుడయ్యాడు." చదవరి ధామస్ గుడ్ విన్ అన్నాడు, "పదాలు విఫలత, లోటు, ఆత్మ కృషించుట, రోగ స్థితిలో ఉండే మనష్యులలో ఉండేవి కనిపిస్తున్నాయి." ఎఫఫ్రోడిటస్’ రోగ స్థితి, మరణానికి చేరువగా తీసుకొచ్చిన రోగము, అదే పేరుతో పిలువబడింది. కనుక, మనము క్రీస్తు ఆత్మ రోగముతో మూర్చబోయేలా చూస్తాము. అలసిపోవడం వలన చెమట ఆయనలో ఉద్భవించింది. చల్లని, చెమట చనిపోయే వారిలో శరీర బలహీన కారణంగా వస్తుంది. కాని యేసు యొక్క చెమటతో కూడిన రక్తము తన అంతరంగిక ఆత్మ చనిపోవడం ద్వారా, మన పాపాలు భారము ద్వారా వెలువడింది. ఆయన భయంకరమైన అంతర్గత, మరణ శ్రమలో ఉన్నాడు, అంతేకాక ఆయన శరీరమంతటి నుండి రక్తము కారుతుంది. ఆయన "చాలా భారముగా ఉన్నాడు."

మార్కు సువార్త మనకు చెప్తుంది ఆయన "మిగుల విభ్రాంతి నొందాడు" (మార్కు 14:33). గ్రీకు పదానికి అర్ధము ఆయన విభ్రాంతి భయంకర పరిస్థితిని కలిగించింది, ఎలా అంటే ప్రజల శరీరము భయంతో వణుకుచున్నప్పుడు వెంట్రుకలు లేచి నిలబడుచున్నట్లు. ఆజ్ఞలు ఇవ్వబడినప్పుడు మోషే భయంతో వణికి పోయాడు; అలాగే మన ప్రభువు భయంతో వణికి పోయాడు ఆయనపై మోపబడిన పాప భారమును చూచినప్పుడు.

రక్షకుడు మొదట విచారంగా ఉంది, భారంతో మనస్తాపం చెంది, చివరకు "మిగుల దిగ్భ్రాంతి నొందాడు." ఆయన వణికించే ఆతృతతో నింప బడ్డాడు. మన పాపాలు భరించే సమయం వచ్చినప్పుడు, ఆయన మిక్కిలి ఆశ్చర్యపడి దేవుని ముందు పాపి స్థానంలో నిలిచాడు. పాపి ప్రతినిధిగా దేవుడు తనను చూడడం ఆయనను ఆశ్చర్యపరిచింది. దేవునిచే విడిచి పెట్టబడడం అనే ఆలోచన తనను ఆశ్చర్యచకితున్ని చేసింది. అది ఆయన పరిశుద్ధ, సౌమ్య, ప్రేమచే, గుణములను విచ్చిన్నము చేసింది ఆయన "మిగుల దిగ్భ్రాంతి నొందాడు" మరియు "చాలా భారంగా" భావించాడు.

మనకు ఇంకా చెప్పబడింది ఆయన అన్నాడు, "మరణమగునంతగా, నా ప్రాణము బహు దుఃఖముతో నిండియున్నది" (మత్తయి 26:38). గ్రీకు పదము "పెరిటపోస్" అనగా విచారాల్లో ముంచబడుట అని అర్ధము. మామూలు శ్రమలో తప్పించుకొనే అవకాశము, నిరీక్షణ అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా కష్టాల్లో ఉన్నవారికి మనం గుర్తు చెయ్యవచ్చు వారి పరిస్థితి అధ్వానము అవుతుందని. కాని యేసు విషయంలో అధ్వాన స్థితిని ఊహించలేము, ఎందుకంటే ఆయన దావీదుతో చెప్పాడు, "మరణ బంధకము నన్ను చుట్టుకొని యుండెను" (కీర్తనలు 116:3). దేవుని తరంగాలు అన్ని ఆయనపై దొర్లాయి. ఆయన పైనా, క్రింద, చుట్టూ, బయటా, ఆయనలో, అంతా, విషాదమే ఆయన భాధ నుండి విచారము నుండి తప్పించుకునే మార్గమే లేదు. క్రీస్తు దుఃఖమును మించినది ఇంకొకటి లేదు, ఆయన అన్నాడు, "నా ఆత్మ విచారముతో మునిగి యున్నది," విచారముతో చుట్టబడింది, "మరణమగునంతగా" – మరణపు అంచునకు!

గెత్సమనే వనంలో ఆయన చనిపోలేదు, కాని చనిపోవునంతగా ఆయన శ్రమపడ్డాడు. ఆయన బాధ వేదన మరణపు అంచు వరకు వెళ్ళాయి – అక్కడ ఆగాయి.

లోపలి ఒత్తిడి వలన ప్రభువు చెమట గొప్ప రక్త బిందువులుగా కారణము నాకు ఆశ్చర్యము కలిగించడం లేదు. మనవ దృక్పదములో నేను దానిని చాలా తేట తెల్లము చేసాను.

‘అది దేవునికి, దేవునికి మాత్రమే,
ఆవేదనలు పూర్తిగా తెలుసు.

"ఆయన వేదన పడి మరింత ఆతురమా ప్రార్ధన చేయగా: ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలే ఆయెను" (లూకా 22:44).

III. మూడవది, దీని అంతటి ద్వారా క్రీస్తు ఎందుకు వెళ్ళవలసి వచ్చింది?

నేను కచ్చితంగా చెప్తాను చాలామంది ఆశ్చర్య పోతారు క్రీస్తు ఈ గొప్ప వేదన ద్వారా వెళ్లి చెమట రూపంలో రక్తపు బిందువులను ఎందుకు కార్చడా అని. వారనవచ్చు, "దీని అంతటి ద్వారా ఆయన వెళ్ళాడని తెలుసు, కాని దీని ద్వారా ఆయన ఎందుకు వెళ్ళాడో నాకర్ధం కావడం లేదు." గెత్సమనే వనంలో ఈ అనుభవము ద్వారా యేసు ఎందుకు వెళ్ళాడో ఆరు కారణాలు నేను మీకు ఇస్తాను.

1. మొదటిది, ఆయన నిజ మానవత్వము మనకు చూపడానికి. ఆయనను దేవునిగానే తలంచవచ్చు, ఆయన దైవత్వము కలవాడయినప్పటికినీ, కాని ఆయన నీకు సమీపస్తుడు, నీ ఎముకలో ఎముక, నీ మాంసములో మాంసము. ఆయన నీకు పూర్తి సానుభూతి చూపగలడు! ఆయన నీ భారలన్నింటిని మోసాడు నీ దుఃఖాలను తీసుకున్నాడు. యేసుకు అర్ధము కానిది ఏదీ నీకు ఎప్పుడు సంభవించదు. అందుకే శోధ వల సమయంలో ఆయన నిన్ను మోసుకేళ్తున్నాడు. యేసును నీ స్నేహితునిగా పట్టుకో. ఆయన నీకు ఆదరణను ఇచ్చి కష్టాలన్నింటిలోను నీ జీవితాన్ని తీసుకు వెళ్తాడు.

2. రెండవది, మనకు మాదిరి చూపడానికి. అపోస్తలుడైన పేతురు అన్నాడు, "క్రీస్తు కూడ మీ కొరకు బాధపడి, మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనునట్లు, మీకు మాదిరి ఉంచి పోయెను" (I పేతురు 2:21). క్రైస్తవునిగా నీ జీవితము సులభము అని చెప్పే బోధకులతో నేను అస్సలు ఏకీభవించను! అపోస్తలుడైన పౌలు అన్నాడు, "క్రీస్తు యేసు నందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు" (II తిమోతి 3:12). ఆయన అన్నాడు, "క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలే, నాతో కూడ శ్రమను అనుభవించుము" (II తిమోతి 2:3). ఆయన అన్నాడు పౌలు ఈ మాటలను యవ్వన బోధకునికి చెప్పాడు. పరిచర్య కష్టమైన పని. చాలామంది దానిని చెయ్యలేరు. జార్జియా బర్నా ప్రకారము, కాపరులలో 35 నుండి 40 శాతము మంది ఈనాడు పరిచర్య వదిలేస్తున్నారు. ప్రపంచములో ఇది అతి కష్టమైన పిలుపు. క్రీస్తు సైనికుడు కాకపొతే దానిని ఎవరు భరించ లేరు! కాపరులే కాకుండా, మంచి క్రైస్తవులందరు దేవుని సేవించడం శ్రమల ద్వారా వెళ్తారు. బైబిలు చెప్తుంది, "అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెను" (అపోస్తులుల కార్యములు 14:22). డాక్టర్ జాన్ సంగ్ చెప్పాడనుకుంటాను, "సిలువ లేకుండా – కిరీటము లేదు."

3. మూడవది, వనంలో ఆయన అనుభవము పాపపు దుష్టత్వాన్ని చూపిస్తుంది. నీవు పాపివి, యేసు మాత్రమే కాదు. ఓ పాపి, నీ పాపము భయంకరము క్రీస్తుకు అది ఎంతో బాధ కలిగించింది. మన పాప భూ ఇష్టత ఆయనకు రక్తమయమైన చెమట కలిగించింది.

4. నాల్గవది, వనంలో ఆయన శ్రమ విచారణ మన పట్ల ఆయనకున్న ప్రేమను చూపిస్తుంది. మన స్థానంలో పాపిగా లెక్కింపబడడాన్ని ఆయన భరించాడు. మన బదులుగా ఆయన శ్రమ పడినందుకు, మన పాపానికి వెల చెల్లించినందుకు మనము ఆయనకు ఋణస్తులము. మనలను అంత గొప్పగా ప్రేమించినందుకు మనము ఆయనను ప్రేమించాలి.

5. ఐదవది, వనంలో యేసును చూచి ఆయన నెరవేర్పులో ఉన్న గొప్పతనాన్ని నేర్చుకోవాలి. నేను ఎంత నల్లగా ఉన్నాను, దేవుని దృష్టిలో ఎంత మురికిగా ఉన్నాను. నాకనిపిస్తుంది నరకంలో పడవేయడానికి నేను తగిన వాడనని. దేవుడు నన్ను ఎప్పుడో అందులో పడవేయలేదు అది నాకు ఆశ్చర్యము. కాని నేను గెత్సమనేకు వెళ్తాను, ఒలీవ చెట్ల క్రింద చూస్తాను, నా రక్షకుని చూస్తాను. ఔను, నేలమీద పడి శ్రమపడడం, ఆయన మూలగడం నేను చూస్తాను. ఆయన చుట్టూ ఉన్న నేలను చూస్తాను ఆయన రక్తముతో ఎర్రగా కనిపిస్తుంది, ఆయన ముఖమంతా చెమటతో నిండుకొని ఉంది. నేను ఆయనతో అంటాను, "రక్షకుడా, నీలో పొరపాటు ఏంటి?" ఆయన జవాబు వింటాను, "నీ పాపము నిమిత్తము నేను శ్రమపడుచున్నాను." అప్పుడు నేను గ్రహిస్తాను దేవుడు నా కొరకైన ఆయన త్యాగము ద్వారా నా పాపాలను ఆయన క్షమాపణ అనుగ్రహిస్తాడని. యేసు నొద్దకు వచ్చి ఆయనను విశ్వసించండి. ఆయన రక్తము ద్వారా మీ పాపములు క్షమింపబడతాయి.

6. ఆరవది, ఆయన ప్రాయశ్చిత్త రక్తాన్ని తిరస్కరించే వారికి వచ్చు శిక్ష భయంకరత్వాన్ని గూర్చి ఆలోచించండి. ఆలోచించు నీవు ఆయనను తిరస్కరిస్తే ఒకరోజు నీవు పరిశుద్ధ దేవుని యెదుట నిలబడి నీ పాపాల నిమిత్తము తీర్పు నొందాలి. నేను నీకు చెప్తున్నాను, నాలో హృదయ భారముతో, రక్షకుడైన యేసు క్రీస్తును తిరస్కరిస్తే, నీకు ఏమి సంభవిస్తుంది. వనంలో కాదు, మంచము మీద, నీవు ఆశ్చర్యపడి మరణముచే జయింపబడతావు. నీవు చనిపోయి నీ ఆత్మ మోసికొని పోబడి తీర్పు తీర్చబడి నరకానికి పంపింపబడుతుంది. గెత్సమనే మిమ్ములను హెచ్చరింపనివ్వండి. దాని మూలుగులు కన్నీళ్లు రక్తమయమైన చెమట మిమ్ములను కదిలించి మీ పాపాలు ఒప్పుకొని యేసును నమ్మేటట్టుగా చేయనివ్వండి. ఆయన యొద్దకు రండి. ఆయనను నమ్మండి. ఆయన మృతులలో నుండి లేచాడు ఆయన సజీవుడు, పరలోకములో దేవుని కుడి పార్శ్వాన్న ఆశీనుడై యున్నాడు. ఇప్పుడు ఆయన యొద్దకు రండి, చాల ఆలస్యము కాకమునుపే క్షమింప బడండి. ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఎబెల్ ప్రుదోమ్: లూకా 22:39-44.
ప్రసంగము ముందు పాట బెంజమెన్ కినీకెయిడ్ గ్రిఫిత్ గారు:
"మీ తెలియని శ్రమలు" (జోసెఫ్ హార్ట్ చే, 1712-1768).
“Thine Unknown Sufferings” (by Joseph Hart, 1712-1768).


ద అవుట్ లైన్ ఆఫ్

రక్తమయమయిన చెమట

THE BLOODY SWEAT

డాక్టర్ ఆర్. యల్. హైమర్స్, జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

"ఆయన వేదన పడి మరింత ఆతురంగా ప్రార్ధన చేయగా: ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువు వలే ఆయెను" (లూకా 22:44).

(యోహాను 18:2; యెషయా 53:7; ఆదికాండము 28:17)

I. మొదటిది, గెత్సమనేలో క్రీస్తు బాధకు వేదనకు కారణమేమిటి?
యెషయా 53:3; యోహాను 14:27; 18:1; మత్తయి 26:39, 38, 37;
హెబ్రీయులకు 12:2; యెషయా 53:6; I పేతురు 2:24; లూకా 22:44.

II. రెండవది, క్రీస్తు యొక్క రక్తముతో కూడిన చెమట అంటే అర్ధము ఏమిటి?
లూకా 22:44; మత్తయి 26:37; యెషయా 53:4, 11; మార్కు 14:33;
మత్తయి 26:38; కీర్తన 116:3; లూకా 22:44.

III. మూడవది, దీని అంతటి ద్వారా క్రీస్తు ఎందుకు వెళ్ళవలసి వచ్చింది?
I పేతురు 2:21; II తిమోతి 3:12; 2:3; అపోస్తలుల కార్యములు 14:22.