Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
యేసు – తోటలో శ్రమపడుట

JESUS – SUFFERING IN THE GARDEN
(Telugu)

డాక్టర్ ఆర్. యల్. హైమర్స్, జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము ఉదయము, ఫిబ్రవరి 28, 2016
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, February 28, 2016

"వారు గెత్సమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు: ఆయన నేను ప్రార్ధన చేసి వచ్చు వరకు, మీరిక్కడ కూర్చోండని, తన శిష్యులతో చెప్పి. పేతురును యాకోబును, యోహానును, వెంట పెట్టుకొని పోయిరి; మిగుల వారికి చెప్పెను, నా ఆత్మ విభ్రాంతి నొందుటకు చింతాక్రాంతుడగుటకు ఆరంభించెను: ఇక్కడే కూర్చొని, చూడండి అని చెప్పెను" (మార్కు 14:32-34).


క్రీస్తు తన శిష్యులతో పస్కా బోజనాన్ని భుజించాడు. భోజనమైన పిమ్మట, క్రీస్తు వారికి రొట్టెను గిన్నెను ఇచ్చాడు – దానిని మనము "ప్రభు రాత్రి భోజనము" అని పిలుస్తాము. ఆయన వారితో అన్నాడు రొట్టె ఆయన శరీరము ను గూర్చి మాట్లాడుతుందని, ఆ శరీరము మరునాడు ఉదయము సిలువ వేయబడుతుంది. ఆయన వారితో చెప్పాడు గిన్నె తన రక్తాన్ని గూర్చి మాట్లాడుతుందని, దానిని మన పాపాలను కడగడానికి ఆయన కార్చబోతున్నాడు. తరువాత యేసు శిష్యులు ఒక కీర్తన పాడి, గదిని విడిచి చీకటిలోనికి వెళ్ళారు.

వారు యేరూషలేము తూర్పు దిగువను దాటి కేద్రోను వాగు దాటారు. తరువాత వారు కొంచెము ముందుకు నడిచి, గెత్సమనే తోట చేరువకు వచ్చారు. యేసు తన ఎనిమిది మంది శిష్యులను తోట ఆరంభములో ఉంచి వారిని ప్రార్దించమని చెప్పారు. అక్కడ పేతురును, యాకోబును యోహానును ఉంచి తోట లోపలికి వెళ్ళాడు. యేసు తానే చీకటిలోనికి, ఒలీవల చెట్ల క్రిందకు వెళ్ళాడు. అక్కడ ఆయన "మిగుల విభ్రాంతినొందుట [ఆశ్చర్య చకితుడగుచు] చింతా క్రాంతు డగుటకు [మిక్కిలి వేదనతో] ఆరంభించెను; అప్పుడాయన నా ప్రాణము మరణము అగునంతగా, దుఃఖముతో మునిగి యున్నది... మీరిక్కడ ఉండి మెలకువగా ఉండుడని వారితో చెప్పి, కొంత దూరము సాగిపోయి నేల మీద పడి, సాధ్యమైతే, ఆ గడియ తన యొద్ద నుండి, తొలగి పోవలెనని ప్రార్ధించెను" (మార్కు 14:33, 35).

బిషప్ జె. సి. రైల్ ఇంగ్లాండ్ సంఘస్తుడు అన్నాడు, "గెత్సమనే తోటలో మన ప్రభువు వేదనను గూర్చిన చరిత్ర లోతైన మర్మముతో కూడిన లేఖన పాఠ్యభాగము. అత్యధిక తెలివైన [వేదాంతులు] పూర్తిగా వివరించలేని విషయాలు అందులో ఉన్నాయి. అయినను... ప్రాముఖ్యత [గొప్ప] గల సత్యాలు దాని ఉన్నాయి" (J. C. Ryle, Expository Remarks on Mark, The Banner of Truth Trust, 1994, p. 316; notes on Mark 14:32-42).

ఈ ఉదయము మన మనసులో గెత్సమనే వెళ్తాము. మార్కు చెప్తున్నారు ఆయన "మిగుల విభ్రాంతి నొందాడని" (మార్కు 14:33). గ్రీకు పదము "ఎక్తామ్ బెస్తామ్" – అనగా "మిక్కిలి ఆశ్చర్యపడుట, మిగుల చింతా క్రాంతుడగుట, విభ్రాంతి నొంది భయము చెందుట అని అర్ధము." "కొంత దూరము సాగిపోయి, నేల మీద పడి" ...ఆయన వారితో చెప్పాడు, "నా ప్రాణము మరణము అగునంతగా దుఃఖముతో మునిగియున్నది" (మార్కు 14:33, 35).

బిషప్ రైల్ అన్నాడు, "ఈ భావాలకు ఒక సమగ్ర వివరణ ఉంది. శారీరక శ్రమను గూర్చి భయము కాదది... అది మానవాళి నేరారోపణ బరువు, అది విచిత్రంగా ఆయనపై మోపబడింది. అది [చెప్పన శక్యము కాని] మన పాపాల అతిక్రమాల బరువు ఆయనపై మోపబడింది. ఆయన మన నిమిత్తము ‘మనకే శాపమయ్యాడు.’ ఆయన మన దుఃఖాన్ని విచారాన్ని భరించాడు... పాప ‘రహితుడైనప్పటికి మన నిమిత్తమై పాపమయ్యాడు.’ ఆయన పరిశుద్ధ స్వభావము అనిపించింది [లోతుగా] భారము ఆయనపై మోపబడిందని. ఆ అసాధారణ విచారానికి ఇవి కారణాలు. గెత్సమనేలో ప్రభువు వేదనలో అధికమైన పాప భూయిస్టతను చూడాలి. [ఈనాటి సువర్తికుల తలంపులు] పాపాన్ని పరిగణించడం విషయంలో చాల తక్కువగా ఉన్నాయి" (రైల్, పేజి 317).

గుడికి రాకపోవడం బైబిలు పఠనము నిర్లక్యము చేయడం, విడియో ఆటలు, అశ్లీల చిత్రాల చూడడం నాట్యమాడడం మత్తులై ఉండడం లాంటి, పాపాలను తేలికగా తీసుకోవద్దు. ఈ మీ పాపాలన్నీ గెత్సమనేలో యేసుపై మొపబడ్డాయి. కాని ఇంకా – చాల ఉంది. గెత్సమనే తోటలో యేసుపై వేయబడిన అతిపెద్ద పాపమూ, మన మూల పాపమూ, మన పూర్తీ వేర్పాటు అది మన పాప భూ ఇష్టత నుండి వచ్చినది. అది "దురాశ వలన లోకమందున్న భ్రష్టత్వము" (II పేతురు 1:4). వాస్తవము "మేమందరమూ అపవిత్రుల వంటి వారమైతిమి" (యెషయా 64:6). అది స్వార్ధము, దురాశ, మన స్వభావములో దేవునికి వ్యతిరేకముగా తిరిగుబాటు. అది "శరీరనుసారమైన మనస్సు [అది] దేవునికి వ్యతిరేకము" అది దేవునిపై తిరిగుబాటు చేసి ఆయన లేకుండా జీవించాలని పింప చేస్తుంది (రోమా 8:7). అలాంటి అసహ్యా, దుష్ట హృదయాన్ని నీవు కలిగియున్నావు (రోమా 8:7). నీవు పాపపు హృదయాన్ని కలిగి యున్నావు, మొదటి పాపియైన ఆదాము నుండి, నీకు సంక్రమించింది. అది అతని నుండి నీ కణాలలోనికి, నీ రక్తములోనికి, నీ ఆత్మలోనికి వచ్చింది. (రోమా 5:12) – "...ఒక మనష్యుని అవిదేయుత ద్వారా [మానవులు అందరు] పాపులయ్యారు" (రోమా 5:19).

చూడండి పసిబిడ్డలు ఎలా పాపములో పుడతారో. ఎ. డబ్ల్యూ. పింక్ అన్నాడు, "మనవ స్వభావములో ఉండే భ్రష్టత్వము చిన్న పిల్లలలో కనిపిస్తుంది...ఎంత త్వరగా వస్తుందో! మనిషిలో ఏదైనా [స్వాస్థ్యంగా] వచ్చే మంచి ఉంటే, అది తప్పక [కొత్తగా జన్మించిన పిల్లల్లో] కనిపిస్తుంది, ప్రపంచంలో కలిశాక చెడు అలవాట్లు ఏర్పడక ముందు. కాని [పసిపిల్లలను] మంచివారుగా కనుగొంటారు? అది చాల దూరము. మానవుల ఎదుగుదల ఫలితము వారు పెద్ద వారవుతున్నప్పుడు [వారు] చెడ్డవారే. దారిలో స్వంత చిత్తము, వ్యతిరేకత మరియు ప్రతీకారము ప్రత్యక్షమవుతాయి. మంచిది కాని దాని కొరకు వారు ఏడుస్తారు, వారు [తల్లి దండ్రులతో కోపంగా ఉంటారు] తిరస్కరించినప్పుడు, తరుచు [వారిని కరుస్తుంటారు]. యదార్ధత మధ్య పుట్టి పెరిగిన వారు దొంగతనము చూచినప్పుడు [దొంగిలించే] నేరారోపణ కలిగి యుంటారు. ఈ [పొరపాట్ల వలన]...మనవ స్వభావము ఉనికి ప్రారంభము నుండి [పాప భూ ఇష్టంగా] కనిపిస్తుంది" (A. W. Pink, Gleanings from the Scriptures, Man’s Total Depravity, Moody Press, 1981, pp. 163, 164). ద మిన్నే సోటా నేర కమీషను ఒక నివేదికలో చాలా తేట తెల్లము చేసింది. "ప్రతీ శిశువు తన జీవితాన్ని చిన్న స్వార్ధ పరునిగా ప్రారంభిస్తుంది. అతడు పూర్తిగా స్వార్ధ పరుడు స్వార్ధ కేంద్రీకృతుడయిపోతాడు. అతడు ఏది కోరుకుంటాడో అదే కావాలనుకుంటాడు...తన తల్లి దృష్టి, తన ఆట వస్తువు, పిన తండ్రి వాచీ. [వీటిని] వద్దంటే అతడు అరుస్తాడు కోపంతో దూకుడుతో, నిస్పృహతో చంపెంత పని చేస్తాడు...దీని అర్ధం పిల్లలందరూ, ఒక కోవవారు కాదు, అందరు పాపులుగానే జన్మించారు, అందరు పాపులే" (quoted by Haddon W. Robinson, Biblical Preaching, Baker Book House, 1980, pp. 144, 145). డాక్టర్ ఐజాక్ వాట్సన్ అన్నారు,

పసిబిడ్డలు ఊపిరి పీల్చడం ప్రారంభించిన వెంటనే,
పాపపు విత్తనాలు ఎదుగుతాయి మరణము కొరకు;
మీ ధర్మశాస్త్రము పరిపూర్ణ హృదయాన్ని ఆదేశిస్తుంది,
కాని మనము ప్రతి భాగములోను అపవిత్ర పర్చబడ్డాం.
(కీర్తన 51," డాక్టర్ ఐజాక్ వాట్స్ చే, 1674-1748).
(“Psalm 51,” by Dr. Isaac Watts, 1674-1748).

శిశువు జన్మించిన వెంటనే అరుస్తాడు. జంతువూ బిడ్డ అలా చెయ్యదు. పసిబిడ్డలు చేసినట్టు అరిస్తే అవి అరణ్యంలో ఇతర జంతువులచే వెంటనే చంపబడతాయి. కాని పసిబిడ్డలు దేవునికి, అధికారానికి, జీవితానికి వ్యతిరేకంగా అరుస్తారు జన్మించిన వెంటనే. ఎందుకు? ఎందుకంటే మీ పూర్వికుడు ఆదాము నుండి వచ్చిన పాపముతో వారు జన్మించారు కనుక, అందుకే. అందుకే మీ దృక్పధము తిరుగుబాటు, క్రైస్తవ నాయకులతో ఏకీభవించకపోవడం, నీ మార్గాన్నే నిర్దేశించడం, ఏదీ సరియే అది చేయక నిరాకరించడం. అది ప్రపంచ వ్యాప్త శ్రమకు మరణానికి మూల కారణము –పాప భూ ఇష్టత. అందుకే మీరు పాపమూ చేస్తారు, మారిన తరువాత కూడ. మీ తల్లిదండ్రులను కుంటారు మీరు యవ్వన క్రైస్తవుడని, కాని నీవు నిజంగా ఒక యవ్వన పాపివి దేవుని చిత్తాన్ని చెయ్యడం నీకు అసహ్యము!

మూల పాపము తలంపులు ద్వారా, మాటల ద్వారా క్రియల ద్వారా మానవులు చేసిన పాపాలు కలిపితే యేసు ఎందుకు దిగ్బ్రాంతి చెందాడో సులువుగా చూడవద్దు! దేవుడు పాప భారాన్ని ఆయనపై మోపినప్పుడు ఆయన నలిగి పోయాడు.

దయచేసి బైబిలులో లూకా వివరణ చూడండి. ఇది స్కోఫీల్ద్ స్టడీ బైబిలులో 1108 వ పేజీలో ఉంది. అది లూకా 22:44. దయచేసి లేచి నిలబడి గట్టిగా చదవండి.

"ఆయన వేదన పడి మరింత ఆతురంగా ప్రార్ధన చేయగా: ఆయన చెమట, నేల పాడుచున్న గొప్ప రక్త బిందువుల వలే ఆయెను" (లూకా 22:44).

కూర్చోండి.

బిషఫ్ రైల్ అన్నాడు, "తోటలో మన ప్రభువు అనుభవించిన ఆలోతైనా ఆవేదనను మనము ఎలా [వివరించగలరు]? ఆయన భరించిన మానసిక, శారీరక, భయంకర శ్రమకు కారణము [ఏమిటి]? ఒకే సంతృప్తికర సమాధానము ఉంది. [అది] ప్రపంచపు పాపభారము, అది ఆయనపై మోపబడింది...ఈ [పాపాల] భారము ఆయనను వేదనకు గురి చేసింది. [అది] లోకపు నేరారోపణ ఆయనపై మోపబడి దేవుని నిత్య కుమారుడు గొప్ప రక్త బిందువులు కార్చేలా చేసింది" (J. C. Ryle, Luke, Volume 2, The Banner of Truth Trust, 2015 edition, pp. 314, 315; note on Luke 22:44).

"మనం ఆయన [దేవుని] యందు నీతి అగునట్లు, పాపమోరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను" (II కొరిందీయులకు 5:21).

"యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను" (యెషయా 53:6).

"ఆయన తానే తన శరీరమందు మన పాపమును మ్రానుమీద మోసికొనేను" (I పేతురు 2:24).

బిషప్ రైల్ అన్నాడు, "పాత సిద్ధాంతానికి మనం కట్టుబడి ఉండాలి, అది [గెత్సమనే] తోటలోను సిలువపై కూడ క్రీస్తు ‘మన పాపములను భరించాడు’. ఇతర ఏ సిద్ధాంతము కూడ [క్రీస్తు చెమటతో కూడిన రక్తము]ను గాని, నేరారోపణతో ఉన్న మనిషి మన స్సాక్షిని వివరింప లేదు" (ఐబిఐడి.). జోశాప్ హార్ట్ అన్నాడు,

దేవుని కుమారుని శ్రమను చూడు,
అలసిపోతూ, మూలుగుచు, చెమటను రక్తంగా కార్చుతూ!
ఆయన శ్రమ బహు తీవ్రమైనది
దేవా దూతలకు పరిపూర్ణ తెలివి లేదు.
దేవునికి దేవునికి మాత్రమే
దాని భారము పూర్తిగా తెలుసు.
("మీ తెలియని శ్రమలు" జోషఫ్ హార్ట్ గారిచే, 1712-1768;
స్వరము "అది అర్ధరాత్రి, ఒలీవ నుదుటిలో").
   (“Thine Unknown Sufferings” by Joseph Hart, 1712-1768;
      to the tune of “‘Tis Midnight, and on Olive’s Brow”).

మళ్ళీ, జోషప్ హార్ట్ అన్నాడు,

అక్కడ దైవ కుమారుడు నా నేరారోపణ అంతటినీ భరించాడు;
ఇది కృప ద్వారా నమ్మబడును;
కాని ఆయన అనుభవించిన భయములు
చాలా విశాలమైనవి దాల్చడానికి.
మీ ద్వారా ఎవరు దూసుకుపోలేరు,
అంధకార, గెత్సమనేలో.
("చాలా ఒడంబడికలు ఆయన సహించాడు" జోషప్ హార్ట్ చే, 1712-1768;
స్వరము "రండి, పాపులారా").
   (“Many Woes He Had Endured” by Joseph Hart, 1712-1768;
      to the tune of “Come, Ye Sinners”).

మరియు విలియం విలియమ్స్ అన్నాడు,

మానవాళికి నేరారోప భారము రక్షకుని పై వేయబడింది;
ఒప్పందముతో వస్త్రము వలే, పాపుల కొరకు ఆయనకు తోడిగింపబడింది,
పాపుల కొరకు తొడిగింపబడింది.
("ఆవేదనలో ప్రేమ" విలియం విలియమ్స్ చే, 1759;
స్వరము "అద్భుత మాధుర్యత ఆశీనమైనది").
   (“Love in Agony” by William Williams, 1759;
      to the tune of “Majestic Sweetness Sits Enthroned”).

"ఆయన వేదన పడి మరింత ఆతురంగా ప్రార్ధన చేయగా: ఆయన చెమట నేలను పాడుచున్న గొప్ప రక్త బిందువుల వలే ఆయెను" (లూకా 22:44).

"యోహావ మన అందరి దోషములను అతని మీద మోపెను" (యెషయా 53:6).

క్రీస్తు ప్రత్యామ్నాయ ప్రాయశ్చిత్తమునకు ఇది ఆరంభము. "ప్రత్యామ్నాయము" అనగా ఒకరి స్థానంలో మరియొకరు శ్రమ పడుట. క్రీస్తు నీ స్థానంలో, నీ పాపమూ నిమిత్తము శ్రమపడుచున్నాడు, ఆయన పాప రహితుడు. క్రీస్తు ఒలీవ చెట్టు క్రింద అర్ధరాత్రి గెత్సమనేలో, మన పాపాలు మోసేవాడయ్యాడు. ఉదయాన్న ఆయన మేకులతో సిలువకు కొట్టబడ్డాడు, నీ పాపానికి పూర్తీ వెల చెల్లించాడు. అలాంటి ప్రేమను నీవు ఎలా తిరస్కరిస్తావు – యేసుకు నీ పట్ల ఉన్న ప్రేమను? నీ హృదయాన్ని కఠిన పరచుకొని అలాంటి ప్రేమను ఎలా తిరస్కరిస్తావు? ఈదైవ కుమారుడు, నీ స్థానంలో శ్రమపడి, నీ పాపానికి ప్రాయాశ్చిత్తము చేసాడు. నీవు ఎంత చల్లగా కఠినంగా ఉంటావా ఆయన ప్రేమ నీకు ఏమి కానట్టుగా?

ఒకసారి నేను అంత్య క్రియలు ఏర్పాటు చేయు వ్యక్తిని కలిసాను అతడు సంఘా కాపరిలేని భూ స్తాపనలు చేయడానికి నన్ను ఏర్పాటు చేసాడు. అతడు నన్ను భోజనానికి తీసుకెళ్ళాడు. అది వింతైన భోజనము మునుపెన్నడూ అలాంటిది తినలేదు. భయము పుట్టించే చూపుతో అతడు నాతో చెప్పాడు తను తరుచు సమాధుల తోటలో మృత దేహాలతో పనిచేస్తూ రొట్టె తినేవాడని చెప్పాడు. నేను ఆ పని చెయ్యలేక పోయాను! భయంతో ఆ హోటల్ నుండి పరిగెత్తాను. మృత దేహానికి అత్తరు జల్లుతో ఒక వ్యక్తీ రొట్టె ఎలా తినగలదు? భయంకరము! తరువాత నేను గ్రహించాను అతని మనసు చల్లగా బండగా అయిపొయింది అలాంటిది పట్టించుకోకుండా. నేను మిమ్ములను అడగనా, నీవు అంత చల్లగా బండగా అయిపోయావా యేసు శ్రమను గూర్చి నీవు విన్నప్పుడు నీవు కదిలింపబడకుండా అయిపోయావా? నీవు అంత దారుణంగా తయారయ్యావా నేను యేసు’ వేదనను గూర్చి నీ పాప ప్రాయశ్చిత్తము నిమిత్తమును చెప్తున్నప్పుడు అది నీకు అర్ధవంతం కాకుండా పోతుందా? నీవు సిలువకు యేసును మేకులతో కొట్టిన సైనికుల వలే కఠినుడవాయిపోయావా – వారు ఆయన చనిపోయిన తరువాత ప్రక్కనే ఆయన వస్త్రముల కొరకు చీట్లు వేసారు? ఓ, అలా కాకుండా ఉండాలి! నేను ఈ ఉదయ కాలాన మిమ్ములను బ్రతిమాలుచున్నాను రక్షకుని విశ్వసించి ఆయన పరిశుద్ధ రక్తములొ నీ పాపాలు కడగబడాలని!

నీవంటావు "వదిలి పెట్టాల్సింది చాల ఉంది" అని. ఓ, దెయ్యము మాట వినడం ఆపేస్తావా! దీని అంత ప్రాముఖ్యమైనది ఈ ప్రపంచములో ఏమి లేదు!

అయ్యో! నా రక్షకుడు రక్తము కార్చాడా? నా సర్వాధికారి చనిపోయాడా?
అంత ప్రశస్తమైన తలను పురుగులాంటి నా కొరకు ఆయన దానమిచ్చాడు?

కాని దుఃఖముతో కూడిన [కన్నీళ్లు] ఆ ప్రేమ అప్పనకు బదులు [చెల్లింపు లేదు];
ఇక్కడ, ప్రభు, నన్ను నేను ఇచ్చుకుంటున్నాను, ‘ఇదే నేను చేయగలిగింది.
("అయ్యో! నా రక్షకుడు రక్తము కార్చాడా?" డాక్టర్ ఐజాక్ వాట్స్ చే, 1674-1748).
   (“Alas! And Did My Saviour Bleed?” by Dr. Isaac Watts, 1674-1748).

నీవు యేసును నమ్మటానికి సిద్ధంగా ఉన్నావా? నిన్ను నీవు ఆయనకు ఇచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన పట్ల ప్రేమతో నీ హృదయము కదిలింపబడుతుండా? లేనిచే, దయచేసి వెళ్ళవద్దు. కాని, అట్లయితే, ఇప్పుడు ఆవరణము వెనుకకు వెళ్ళండి మరియు డాక్టర్ కాగన్ గారు ఒక ప్రశాంత స్థలానికి తీసుకొని వెళ్తాడు అక్కడ మేము మీతో మాట్లాడుతాము. ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఎబెల్ ప్రుదోమ్: మార్కు 14:32-34.
ప్రసంగము ముందు పాట బెంజమెన్ కినీకెయిడ్ గ్రిఫిత్ గారు:
"చాలా ప్రమాణాలు ఆయన భరించాడు" (జోషేఫ్ హార్ట్ చే, 1712-1768).
“Many Woes He Had Endured” (by Joseph Hart, 1712-1768).