Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
పేతురు – పిలువబడి, నొచ్చుకొని మార్పిడి చేయబడ్డాడు

PETER – CALLED, CONVICTED AND CONVERTED
(Telugu)

డాక్టర్ ఆర్. యల్. హైమర్స్, జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము ఉదయము, ఫిబ్రవరి 14, 2016
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, February 14, 2016

"సియోను, సియోను, ఇదిగో సాతాను, మిమ్మును పట్టి, గోదుమల వలే జల్లించుటకు, మిమ్మును కోరుకొనెను: గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు, నేను నీ కొరకు వేడుకొంటిని: నీ మనసు తిరిగిన తరువాత, నీ సహోదరులను స్థిర పరచుమని చెప్పెను" (లూకా 22:31-32).


పేతురు ఎప్పుడు మార్చబడ్డాడో సగటు బోధకుని అడగండి. వెళ్ళండి! చెయ్యండి! వాళ్ళందరూ చెప్తారు క్రీస్తు ఆయనను వెంబడించామని పిలిచినప్పుడు (మత్తయి 4:19). పేతురు మార్చబడినాడని యేసు జవాబిచ్చాడు, "పరలోక మందున్న నా తండ్రి, ఈ సంగతి నీకు బయలు పరచెను గాని," యేసు జవాబిచ్చాడు " పరలోక మందున్న నా తండ్రి తప్ప, నరులు నీకు బయలు పరచలేదు" (మత్తయి 16:16, 17). కాని ఆ రెండు సందర్భాలు పేతురు మార్పును చూపడం లేదు. యేసును వెంబడించడం ద్వారా పేతురు మార్చబడితే, అది క్రియల ద్వారా రక్షణ –కనుక అది పేతురు మార్పిడి కాదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని, పేతురు ఒప్పుకున్నప్పుడు మార్చబడితే, అది సిద్ధాంత నమ్మకము ద్వారా, మార్పిడి అవుతుంది. పేతురుకు బయలు పరచబడింది దెయ్యాలకు తెలుసు, మనం చదువుతాం, "ఇంతేకాక దెయ్యములు, నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి, అనేకులను, వదిలిపోయెను... వారు క్రీస్తును తెలుసుకోవడానికి" (లూకా 4:41). కనుక పేతురు అవగాహన దెయ్యము దానికంటే గొప్పది కాదు! జాగ్రత్త పఠన తరువాత మనం బలవంతంగా చెప్పాలి పేతురు ఇంకా మార్చబడలేదని. అతడు తొట్రిల్లుతున్నారు, క్రైస్తవునిగా ఉండాలని ప్రయత్నిస్తున్నాడు, మార్చబడ కుండా.

ఈనాటి అనేక మంది సువర్తికుల చిత్ర పఠము పేతురులో ఉంది! పేతురు వలే, వారు తొట్రిల్లుతున్నారు – క్రీస్తును వెంబడింప ప్రయత్నిస్తున్నారు! వారికి క్రీస్తును గూర్చిన కొంత జ్ఞానము ఉంది, కాని వారు పేతురు కంటే మార్చబడిన వారు కాదు ఈస్టరు ఆదివారము ముందు. చాలామంది బోధకులు మార్చబడలేదు! వారు క్రీస్తును వెంబడింప ప్రయత్నిస్తారు. ఆయన దేవుని కుమారుడని వారికి తెలుసు. కాని వారు మార్పు వాస్తవికతలో గుడ్డివారు. నేననుకుంటాను అది ఒక ముఖ్య కారణము ఈనాడు తక్కువ సువార్త ప్రకటింపబడడానికి. చాలామంది కాపరులు మార్చబడని వారు ప్రజలకు క్రైస్తవ జీవితమూ ఎలా జీవించాలో చెప్పడంలో వారి సమయాన్ని వృధా చేసుకుంటారు! చమత్కారము! "పాపములలో చనిపోయిన" వ్యక్తీ ఎలా క్రైస్తవ జీవితమూ జీవింపగలడు? (ఎఫెస్సీయులకు 2:1, 5).

చాలామంది బోధకులు వారి ప్రజలకు వేరే వారు సువార్త ప్రకటించడం విషయంలో భయపడుతున్నారు! దక్షిణ ప్రాంతములో ఒక సంఘములో నేను సువార్త ప్రకటింపవలసి ఉంది. అది తల్లుల దినము. నేను ఒక మృదువైన ప్రసంగము చెప్పి ఎవరినీ తొందర పెట్టకూడదనుకున్నాను, ఎందుకంటే నేను ఆ సంఘమునకు అతిధిని కాబట్టి. నా తల్లి మార్పు సాక్ష్యము చెప్పాలనుకున్నాను. నేను కేవలము 12 నుండి 15 నిమిషాలు మాట్లాడాను. నాతల్లి యేసును నమ్మి ఎలా రక్షింపబడిందో సమూహానికి చెప్పాను. మీరను కోవచ్చు సమూహము ప్రతి స్పందన బట్టి నరకాన్ని గూర్చి రెండు గంటలు బోధించి ఉంటానని! కాపరి అతని భార్య గుడిలోనుండి మాయమయిపోయారు నాతో కరచలనము కూడా చెయ్యలేదు. సంఘస్తులు నిలబడి నన్ను నా భార్యను చూస్తున్నారు వారెప్పుడు వినని వింతైన కొత్త సిద్ధాంతాన్ని నేను వారికి బోధించినట్టుగా! చివరకు ఒక వృద్ధ స్త్రీ వచ్చి మాతో కరచాలనము చేసింది. నవ్వుతూ ఆమె చెప్పింది, "అది అద్భుతమైన ప్రసంగము. చాలా సంవత్సరాలుగా ఇలాంటి ప్రసంగము వినలేదు!" అది ప్రసంగమే కాదు! అది కేవలము నా మధుర వృద్ధ తల్లి మార్పును గూర్చిన 12 లేక 13 నిమిషాల సాక్ష్యము!

నా భార్య నేను ప్రయాణిస్తూ నేననుకున్నాను, "ఇది నిజంగా అంత చెడ్డగా ఉందా? ఇక్కడ మనము దక్షిణములో ఉన్నాము, స్వతంత్ర ప్రాధమిక బాప్టిస్టు సంఘములో, వారు తిరగబడి "ముగ్ధులయ్యారు" నా తల్లి మార్పును గూర్చిన సామాన్య కథతో!

ఇంకొక ప్రాధమిక బాప్టిస్టు సంఘములో, నా స్వంత మార్పును గూర్చి చిన్న ప్రసంగము చేసాను. తరువాత ఒక వృద్ధ స్త్రీ నా భార్యను అడిగింది తన వృద్ధ భర్తను క్రీస్తు నొద్దకు నడిపించుటలో సహాయపడమని. నా భార్య సూచించింది ఆ వృద్ధుని యేసు నొద్దకు నడిపించడానికి తన కాపరిని అడగమని. ఆ స్త్రీ చెప్పింది, "ఓ, ఆయన అది చెయ్యడు. చాలాసార్లు అతని అడిగాను. నా భర్తను తొందర చేయడానికి ఆయన భయపడుతున్నాడు."

అది నిజంగా అంత చెడ్డదా, డాక్టర్ హైమర్స్? ఓ, అవును! అది నిజంగా భయంకరము! శ్రేష్టులైన కాపరులు కూడా సాగదీస్తారు, నోటి మాటలతో, కనికరము, ఉద్రేగము, దాక్షిణ్యము లేకుండా – ఆదివారము ఉదయము అరగంట సేపు నింపడం, ఆకలితో ఉన్న ఆత్మలకు ద్రవ్యాన్ని గరిటెతో పట్టడం! సగటు సువార్త కాపరి సగం చచ్చిన యాజకుని వలే మాట్లాడుతాడు. మన బాప్టిస్టు కాపరులు తక్కువ కాదు. ప్రజలు కళ్ళు మూసుకొని నిద్రలోనికి వెళ్ళిపోతారు "వివరణాత్మక" ప్రసంగాలు చెప్పేటప్పుడు. వారు యవనస్తులకు సవాలు లివ్వరు నశించు వారికి నిరీక్షణ ఇవ్వరు. అలాంటి కాపరులు మ్యూజియం కాపలాదారుల కంటే అధ్వానము! ఆత్మీయ మాంత్రికుల కంటే ఎక్కువ కాదు! దేవుడే మనకు సహాయము చెయ్యాలి! మన సంఘాలు చనిపోవడం లేదు – చనిపోయాయి! ఎవరు రక్త సిద్ధ సువార్త ప్రకటిస్తున్నారు? "మీరు తిరిగి జన్మించాలని" ఎవరు ఉరుముతూ చెప్తున్నారు? ఎవరు ధైర్యముగా నిలబడి సిలువ వర్తమానము పాపుల మార్పును గూర్చి చెప్తున్నారు? సంఘములో మధ్య వయస్కుల స్త్రీలకూ అది నచ్చదు! ఓ, ఆ స్త్రీలను మనం తొందర పెట్టకూడదు! కాబట్టి మన యవనస్తులు ఎలుకల వలే సంఘాల నుండి మాయమై మునుగుతున్న ఓడ నుండి ఈతకొడుతూ పోతున్నారు!

నేను ఒప్పింపబడ్డాను మన సంఘాలు మన దేశాన్ని ప్రభావితం చెయ్యలేవు పాతకాలపు సువార్త సందేశాలు చెప్పకుండా! మన గుడి కళాశాల యవనస్తులతో నిండి ఉంది! నేను పాపము – నరకము – నిజ మార్పును గూర్చి ప్రతి ఆదివారము బోధిస్తాను! లోకములో ఉన్న యవనుల మాయము చేయబడ్డారు! అలాంటిది వారు ఎప్పుడు వినలేదు! వారిలో చాల మార్పిడిలు మనం చూస్తున్నాము. గత రెండు వారాల్లో ఏడుగురు మారడం చూసాం – యవనస్తులు క్రైస్తవేతరులయిన వారు.

నిజ మార్పిడులను గూర్చి నేర్చుకోవడానికి ఒక మార్గము బైబిలులో ఉన్న మార్పిడులను ధ్యానించడం. ఈ ఉదయాన్న అదే చేయబోతున్నాను. సీయోను పేతురు మార్పిడిని గూర్చి మనం ఆలోచింపబోతున్నాము. గతమంతటిలో పేతురు ఒక గొప్ప క్రైస్తవుడు. కాని అతడు ఎలా మార్చబడ్డాడు? అతడు ఎలా క్రైస్తవుడయ్యాడు?

I. మొదటిది, పేతురు పిలువబడ్డాడు.

మత్తయి సువార్త చెప్తుంది,

"యేసు, గలిలియ సముద్ర తీరముల నడుచుచుండగా, పెతురునబడిన, సీయోను, అతని సహోదరుడైన అంద్రేయ అను ఇద్దరు, సహోదరులు సముద్రంలో వలవేయుట చూచెను: వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనష్యులను, పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి, ఆయన వెంబడించిరి" (మత్తయి 4:18-20).

అది అంత సులువా! లేక అలా అనిపిస్తుంది. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి, క్రీస్తును వెంబడించిరి. అది పేతురుకు అంత సులభము ఎందుకయింది? బైబిలు చెప్తుంది,

"యుద్ధ సన్నాహ దినముల నీ ప్రజలు ఇష్ట పూర్వకంగా వచ్చెదరు" (కీర్తనలు 110:3).

దేవుడు రక్షించడానికి ఎన్నుకొన బడిన వారు, పేతురు వలే ఇష్ట పడతారు.

ఈ వాక్యము వ్రాస్తున్నప్పుడు నా భార్య గ్రేరేది నుండి ఉత్తరం తీసుకొచ్చింది. దానిని వెంటనే గుర్తించాను. దానిపై నా ఫోటో ఉంది అది హంటింగ్ టన్ పార్క్ లోని నాతొలి సంఘము నుండి. 1950 సంవత్సరంలో అది గుర్తింపబడింది, నేను మర్చబడకముందు. ఆ కార్డు సబ్బాతు పెద్ద నుండి వచ్చింది, శ్రీమతి బోకర్ నుండి. ఆమె వ్రాసారు,

ప్రియ బాబ్,

మనలో చాలామంది వలే, నీవు అనారోగ్యముతో లేవని నేను నిరీక్షిస్తున్నాను. మేము నిన్ను గుర్తు చేసుకుంటున్నాము, తిరిగి వచ్చేయి, దూరంగా ఉండడానికి కారణమేమయినా.

           శ్రీమతి బోకర్

ఆ మంచి స్త్రీ తన సంఘాలని నేను రావాలని ప్రయత్నిస్తుంది. అవివేకిగా ఉన్న, యుక్త వయస్కుడిని. ఆ కార్డు మీద తేదీ గమనించాను. కొన్ని నెలలు తరువాత నన్ను సంఘము నుండి వెలి వెయ్యడానికి చేయగలిగేది ఏమి లేకపోయేది. ఆ కొన్ని నెలలో ఏమి జరిగింది? నేను ఒకటే చెప్పగలను దేవుడు ప్రత్యేక పిలుపుతో నన్ను పిలిచాడు. యుద్ధ సన్నాహ దినముల నేను ఇష్ట పూర్వకంగా వచ్చాను.

"యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్ట పూర్వకంగా వచ్చెదరు" (కీర్తనలు 110:3).

దేవుడు నన్ను ఆకర్షించినప్పుడు, నాకు బోకర్ గాని ఎవ్వరు కాని అవసరం లేకపోయింది నన్ను సంఘానికి తిరిగి రప్పించడానికి. దేవుని శక్తి నన్ను దరిచేర్చినప్పుడు, నన్ను కొంతమంది దుష్ట గుర్రాల సహాయముతో గుడి నుండి వెలివెయ్య లేకపోయారు!

పేతురు విషయంలో కూడ అంతే. ఆయన ఇంకా రక్షింపబడలేదు. నేను కూడ అంతే శ్రీమతి బోకర్ ఆ కార్డు పంపక ముందు. దేవుని శక్తి నన్ను అంగీకరించేటట్టు చేసింది – పేతురుకు కూడ అంతే. అతడు ఇంకా నా నాలా తప్పిపోయిన వాడే, గాని దేవుడు అతడు యేసును వెంబడించేలా చేసాడు. కనుక పేతురు వెంటనే తన వలలు విడిచి పెట్టి యేసును వెంబడించాడు. కాని అతడు అప్పటికి రక్షింపబడ్డాడు అని అర్ధము కాదు.

మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనం గుడికి రమ్మన్న యువకులు అంత త్వరితంగా ఎందుకు అలా చేస్తారో? ఎందుకంటే దేవుని శక్తి వారిని దరికి చేర్చింది. కాని వారు రక్షింపబడ్డారు అని అర్ధము కాదు. యేసు అన్నాడు, "పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే" (మత్తయి 20:16; 22:24). దేవుడు చాలామందిని పిలుస్తాడు. ఆయన ఈ ఉదయము నిన్ను పిలిచాడు. మీరు మీ పేరు ఫోను నంబరు ఇచ్చారు. అందుకే మీ కొరకు కారు పంపాము. "చాలామంది పిలువబడ్డారు" – మీరు పిలువబడినట్టే. "కాని ఏర్పరచబడిన వారు కొందరే." ఇది నాకు అస్సలు అర్ధం కాదు. కాని నా సుదీర్ఘ అనుభవంలో నాకు తెలుసు, మీరు దేవునిచే ఎన్నుకొనబడిన వారైతే, ఆయన మిమ్మును ఆయన వైపు తిప్పుకుంటాడు, ఆయన ఇక్కడ నిమ్ములను ఉంచుతాడు, మిమ్ములను పట్టుకుంటాడు, మీరు మార్చబడే వరకు! మీరు దేవునిచే ఎన్నిక చేయబడకపోతే, త్వరగానో తరుమితో మీరు గుడిని వదిలేస్తారు – ఎందుకంటే "పిలివ బడినవారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే"!

కృప చేతనే రక్షింపబడ్డాను,
   ఇదినా విన్నపము.
మన పాపమంతటి కొరకు యేసు చనిపోయాడు,
   యేసు నా కొరకు చనిపోయాడు.
("కృప! 'అది విన సంపైన స్వరము" ఫిలిఫ్ దొడ్రిజ్ చే, 1702-1751; పల్లవి కాపరిచే).
(“Grace! ‘Tis a Charming Sound” by Philip Doddridge, 1702-1751;
      chorus by the Pastor).

II. రెండవది, పేతురు నొచ్చుకొనబడ్డాడు.

పేతురు యేసును వెంబడించిన మూడు సంవత్సరాల విషయాలు వదిలి పెట్టేస్తున్నాను. ఆ మూడు సంవత్సరాలలో పేతురుకు చాల అనుభవాలు ఉన్నాయి. కాని అతని జీవితంపై నిజంగా ముద్ర వేసినది యేసు ఎవరో అతడు ఒప్పుకోనిన విషయము. నేను అది ముందుగా చెప్పాను, ఈ ప్రసంగమునకు ముందు. పేతురు అన్నాడు, "నీకు సజీవుడైన, దేవుని కుమారుడవైన క్రీస్తువు." "యేసు తనకు జవాబిచ్చాడు...పరలోకమందున్న తండ్రి మాత్రమే నీకు బయలు పరిచాడు, కాని నరులు నీకు బయలు పరచలేదు" (మత్తయి 16:16, 17).

దీనిని "ఊహించుకోవడం" అంటాము. ఇది మార్పుకు ముందు, మార్పులో, మార్పు తరువాత జరుగుతుంది! పేతురు విషయంలో క్రీస్తు ఎవరో అనే విషయాన్ని దేవుడు దాచి ఉంచాడు పేతురు మర్చబడక ముందు. నాకు కూడ అదే జరుగుతుంది. చాలా సంవత్సరాలు క్రీస్తును ఒక మంచి వ్యక్తిగా భావించాను, తన శత్రువులచే హత సాక్షిగా చంపబడినట్టుగా భావిచాను. నా మార్పునకు కొన్ని రోజుల ముందు, యేసు దేవుని అవతారము అని దేవుడు బయలు పరిచాడు అది నాకు అర్ధం అయింది. చార్లెస్ వెస్లీ పాట పాడుచున్నప్పుడు – "అద్భుత ప్రేమ, ఎలా వీలు అవుతుంది, నా దేవుడవైన, నీవు, నా కొరకు చనిపోవడం?" ఆ పాట నన్ను ఊహింప చేసింది, ఇంకా అప్పటికి మార్చబడనప్పటికి. పేతురుకు అంతే!

ఇప్పుడు లూకా 18:31-34 చూడండి పేతురు ఇతర శిష్యులు అప్పటికి ఇంకా రక్షింప బడలేదు అనే విషయాన్ని స్పష్టంగా చూస్తారు.

"ఆయన తన పన్నెండు మంది, శిష్యులను పిలిచి, ఇదిగో, యేరూషలేమునకు వెల్లుచున్నాము, మనష్యు కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నియు నెరవేర్చబడును. ఆయన అన్య జనులకు అప్పగింపబడును, వారు ఆయనను అపహసించి, అవమాన పరచి, ఆయన మీద ఉమ్మివేసి: ఆయనను కొరడాలతో కొట్టి, చంపుదురు: మూడవ దినముల ఆయన మరల లేచునని చెప్పెను. ఈ మాటలలో ఒకటైనను గ్రహింప లేదు: ఈ సంగతి వారికి మరుగు చేయబడెను, గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధ పడలేదు" (లూకా 18:31-34).

పేతురుకు ఇతరులకు యేసు సువార్తను వివరించుట ఇది మూడవ సారి. క్రీస్తు హింసింపబడి, చంపబడి, మూడవ దినముల మృతులలో నుండి లేస్తాడు. అది సువార్త – క్రైస్తవ్యములో చెప్పబడిన మూల సందేశము, I కొరిందీయులకు 15:1-4 లో చెప్పబడినట్టు. కాని ఇవే మీ పేతురుకు అర్ధం కాలేదు, ఇది అతని నుండి "మరుగు చేయబడింది." పేతురు సువార్తను నమ్మలేదు!

నీవు ఇంకా రక్షింపబడకపోతే – నీది కూడ పేతురు లాంటి పరిస్థితి కదా? మీరు ఈ సంఘానికి "పిలువబడ్డారు." మీరు మీ తల్లిదండ్రుల చేత కాని వేరే వారితో కాని ఇక్కడకు రప్పింపబడ్డారు. మీరు పుట్టినరోజు సంబరాలకు వచ్చారు. ప్రతీ ఆదివారము మాతో మధ్యాహ్న భోజనము రాత్రి భోజనము చేసారు. సువర్తీకరణకు మిమ్ములను బయటికి పంపాము కూడ. ప్రతి ఆదివారము నేను రెండుసార్లు ప్రసంగించడం మీరు వింటున్నారు. నేను క్రీస్తు సిలువ మరణాన్ని గూర్చి, ఆయన రక్తమును గూర్చి, ఆయన మృతులలో నుండి ఎలా లేచాడో చెప్పడం విన్నారు. కాని మీ మనసు తొలగింపబడింది నేను క్రీస్తు రక్తమును గూర్చి ఆయన పునరుత్థానమును గూర్చి మీతో మాట్లాడినప్పుడు. మీరు పదే పదే విన్నారు కాని అది మిమ్ములను "పట్టుకోలేదు." అది వాస్తవమని లేక అంత ప్రాముఖ్యమని మీకు అనిపించలేదు! మీరు ఏమి అనుకున్నా – ఆ విషయాలు అంత ప్రాముఖ్యమని మీకు స్పష్టమవలేదు. మీరు పేతురు వలే ఉన్నారు ఆయన పాపపు ఒప్పుకోలు పొందక మునుపు!

"ఆయనను కొరడాలతో కొట్టి, చంపుదురు: మూడవ దినమున ఆయన మరల లేచునని చెప్పెను. వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింప లేదు: మరియు ఈ సంగతి వారికి మరుగు చేయబడెను, గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధ పడలేదు" (లూకా 18:33-34).

ఇప్పుడు నిలబడి లూకా 22:31 బైబిలులో చూడండి. స్కోఫీల్ద్ పఠన బైబిలులో 1108 పేజిలో ఉంది.

"సీయోను, సీయోను, ఇదిగో సాతాను, మిమ్మును పట్టి, గోధుమల వలే జల్లించుటకు, మిమ్మును కోరుకొనెను: గాని నీ నమ్మిక తప్పి పోకుండునట్లు, నేను నీ కొరకు వేడుకొంటివి: నీ మనసు తిరిగిన తరువాత, నీ సహోదరులను స్థిర పరచుమని చెప్పెను. అయితే, అతడు ప్రభువా, నీతో కూడ చెరలోనికిని, మరణమునకు వెళ్ళుటకు, సిద్ధముగా ఉన్నానని. ఆయనతో, అనగా, ఆయన పేతురు, నీవు నన్నేరుగనని ముమ్మారు చెప్పు వరకు, నేడు కోడి కూరయదని నీతో చెప్పుచున్నాను అనెను" (లూకా 22:31-34).

కూర్చోండి.

నేను ఒక ఆసక్తికర పుస్తకము చదువుతూ ఉన్నాను, లేఖనములో సీయోను పేతురు మరియు జ్ఞాపకాలు (బెకర్ ఎకడెమిక్, 2012). అది డాక్టర్ మార్కస్ బాక్ మొహెల్ చే వ్రాయబడింది. ఇంగ్లాండ్ లో ఆక్స్ ఫర్డ్ విశ్వ విద్యాలయములో అతడు బైబిలు పర ఆది క్రైస్తవ పఠనలులో అధ్యాపకుడిగా ఉన్నాడు. ఈ ప్రఖ్యాత వేదాంతి విషయాన్ని సరిగ్గా చెప్తాడు. అతడు భయపడకుండా చూపించాడు పేతురు ఇంకా మార్చబడలేదని. అతడు చాలా బాగా చెప్పాడు! ఇతర వ్యాఖ్యాతలు దీనిని దాస్తారు, లేక వదిలేస్తారు. కాని డాక్టర్ బాక్ మొహెల్ అలా చెయ్యలేదు! అతడు దానిని తేటగా వివరించాడు! ఆయన చెప్పింది వినండి.

"సీయోను, సీయోను, ఇదిగో సాతాను, మిమ్మును పట్టి, గోధుమల వలే జల్లించుటకు, మిమ్మును కోరుకొనెను: గాని నీ నమ్మిక తప్పి పోకుండునట్లు, నేను నీ కొరకు వేడుకొంటివి: నీ మనసు తిరిగిన తరువాత, నీ సహోదరులను స్థిర పరచుమని చెప్పెను" (లూకా 22:31-34).

డాక్టర్ బాక్ మొహెల్ అన్నాడు,

"ఇక్కడ తేటగా సందర్భము ఉంది పేతురు [త్వరలో] సాతానుతో పోరాటము చేస్తాడు, అందులో అతడు తీవ్రంగా పరీక్షింపబడతాడు [మరియు విఫలుడవుతాడు], కనుక 'వెనుదిరుగుట' ను గూర్చి మాట్లాడుతాడు. ఇక్కడ నొక్కి వక్కానించుట అవసరము 'నీ మనసు తిరిగి పోయినప్పుడు మార్చబడకపోతే,' చాలామంది అనువాదకులు సమర్ధించినప్పటికినీ, దానికి గ్రీకులో ఆధారము లేదు" (Dr. Bockmuehl, ibid., pp. 156, 157).

అలా ఎన్ఐవి, ఎన్ఏయస్ వి, ఇఎస్ వి మరియు ఇతర ఆధునిక అనువాదములు తప్ప. "మాట 'వెనుదిరుగుట' మర్చబడకపోతే చాలామంది అనువాదకులు సమర్ధించినప్పటికినీ, దానికి గ్రీకులో ఆధారము లేదు." డాక్టర్ బాక్ మొహెల్ ఇంకా ఇలా చెప్పాడు గ్రీకు పదము "ఎఫిస్ట్రోఫో" "మర్చబడుట" గా ఇక్కడ తర్జుమా చేయబడాలి. కనుక, మళ్ళీ నేను కనుగొన్నాను, కెజెవి సరియైనది మరియు ఆధునిక అనువాదాలు తికమక చేసేవిగా ఉన్నాయి! కాని డాక్టర్ బాక్ మొహెల్ ఇంకా ఎలా అన్నాడు,

"ఎప్పుడు, ఎక్కడ, లేక ఎలా పేతురు తిరుగుత [మార్పిడి] సంభవించింది? ఇక్కడ మనము సమస్య మూలానికి వస్తున్నాము. ఆయన పరిచర్య ఆఖరి రాత్రి కూడ, లూకా యొక్క యేసు [ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు] పేతురు మార్పిడి భవిష్యత్తులో జరగబోతుందని" (ఐబిఐడి., పేజి 156).

"లూకా 22:32 లో పేతురు మార్పిడి కనిపిస్తుంది భవిష్యత్తులో అబద్ధము చెప్పడానికి" (ఐబిఐడి.).

"ఎప్పుడు నీవు మార్చబడతావో [భవిష్యత్తు]" (ఐబిఐడి., పేజి 156). "యేసు రుజువు చేయబడినట్టుగా ఎదురు చూస్తున్నాడు పేతురు మార్పిడి భవిష్యత్తులో జరుగ బోయేదిగా" (ఐబిఐడి., పేజి, 158).

కానీ పేతురు నమ్మకంగా ఉన్నాడు తనకు మార్పిడి చెందాల్సిన అవసరము లేదని. అతడాన్నాడు,

"ప్రభు, తాడు ప్రభువా, నీతో కూడ చేరలోనికని మరణము నాకు వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నానని, ఆయనతో చెప్పెను" (లూకా 22:33).

యేసు జవాబిస్తాడు, "పేతురు, నీవు నన్నెరుగనని [కోడి] ముమ్మారు చెప్పు వరకు, నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నా అనెను" (లూకా 22:34). పేతురు అనుకున్నాడు తానూ దెయ్యమునకు వ్యతిరేకంగా నిలబడగలనని క్రీస్తు కొరకు జీవించగలనని అనుకున్నాడు మార్చబడకుండా (ఎఫిస్ట్రోఫో). ఎంత తప్పు అతడు! మరియు నీవు ఎంత తప్పు!

వారు యేసు బంధించి ప్రధాన యాజకుని ఇంటికి తీసుకొస్తారు. "పేతురు దూరము నుండి వెంబడించుచుండెను" (లూకా 22:54). పేతురు బయట ప్రజలతో కూర్చున్నాడు. ఒక యవనస్తురాలు చెప్పింది, "వీడును అతనితో కూడ [యేసు] తో కూడ ఉన్నవాడే" (లూకా 22:56). పేతురు అన్నాడు, "నేనతనిని ఎరుగను." కొంత సేపయిన తరువాత ఒకడన్నాడు పేతురు క్రీస్తును వెంబడించు వారిలో ఒకడని. పేతురు అన్నాడు, "ఓయీ, నేను కాను అనెను." మరియొక ఘడియ అయిన తరువాత మూడవ వ్యక్తీ పెతురును చూపించి అన్నాడు, "వీడును అతనితో కూడ ఉండెను." పేతురు అన్నాడు, "ఓయీ, నీవు చెప్పునది నాకు తెలియదనెను." పేతురు ఇంకను మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసేను.

నా భార్య నేను యేరూష లేములో ఇది జరిగిన చోటుకు వెళ్ళాము. యేసు ఎక్కడ నిలుచున్నాడో పేతురు ఎక్కడ నిలుచున్నాడో మార్గదర్శకుడు చూపించాడు. యేసు తిరిగి పేతురు వైపు చూచెను. యేసు కళ్ళల్లోకి పేతురు చూసాడు.

"పేతురు వెలుపలికి పోయి, సంతాప పడి ఏడ్చెను" (లూకా 22:62).

ఇప్పుడు, చివరకు పేతురు పాపపు ఒప్పుకోలు పొందాడు. నీకు నిజమైన మార్పు కలిగే నిరీక్షణ ఉండదు నీకు ఒప్పుకోలు అనుభవము లేకుండా కనీసం పేతురు కు కలిగినట్లు.

"పేతురు వెలుపలికి పోయి, సంతాప పడి ఏడ్చెను" (లూకా 22:62).

III. మూడవది, పేతురు మార్చబడినాడు.

దయచేసి లూకా 24:34 చూడండి. ఇది ప్రాముఖ్యతలేని వచనముగా కనబడవచ్చు, కాని డాక్టర్ బాక్ ముహెల్ అన్నాడు ఇప్పుడు పేతురు మార్చబడినాడని. "యేసు తిరిగి పేతురును చూస్తాడు తన నేరారోపణను ఒప్పుకునేటట్టు (లూకా 22:61), మరియు పేతురు ఈస్టరు ఉదయాన్న యేసును చూడడం (లూకా 24:34) అతని చీకటి నుండి వెలుగు లోనికి తీసుకొచ్చింది" (బాక్ ముహెల్, పేజీ 163). అపోస్తలుడైన పౌలు కూడ మనకు చెప్తాడు పేతురు యేసును ఈస్టరు ఉదయాన్న కలుసుకోవడాన్ని గూర్చి. పౌలు చెప్పాడు, "మరియు...ఆయన కేఫాకును [పేతురు], తరువాత పన్నెండు గురికి కనబడెను" (I కొరిందీయులకు 15:5).

ఎందుకు బైబిలు ఎక్కువగా చెప్తుంది పేతురు పిలుపు, అతడు తొట్రిల్లుట, అతని విశ్వాసము లేని స్థితి, అతని సువార్తను గూర్చిన గుడ్డితనము మరియు యేసు శ్రమలను గూర్చి? మొత్తం అధ్యాయమంతా ఎందుకు కేటాయింపబడింది పేతురు క్రీస్తును కాదనడాన్ని ఒప్పుకోలుతో సంతాపపడి ఏడవడాన్ని గూర్చి? తరువాత, దానంతటి తరువాత, చిన్న వచనము మనకు ఇవ్వబడుతుంది పేతురు మార్పును గూర్చి, "ప్రభువు నిజంగా లేచియున్నాడు, సీయోను [పేతురు] కు కనబడియున్నాడు." ఎందుకు – ఎందుకంటే తొట్రిల్లడం ఒప్పుకోలు నిజ మార్పిడిలో చాల ప్రాముఖ్యమైన విషయాలు. నీవు పోయిన స్థలము నుండి తిరిగి రాబడే వరకు "బయటకు వెళ్లి, సంతాప పడి ఏడ్చే వరకు" నీ పాపమును బట్టి, నీకు నిరీక్షణ అనేది ఉండదు. పేతురు చేసినట్టుగా నీ కనిపించే వరకు, సువార్త నీకు ఏ మాత్రము అర్ధవంతంగా ఉండదు! నీవు తప్పకుండా నీ పాపాలలో చచ్చిపోతావు. యేసును గూర్చి అవసరత నీకు అనిపించాలి నీవు ఆయనను నమ్మే ముందు ఆయన రక్తములో నీ పాపము కడుగబడేముందు . ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఎబెల్ ప్రుదోమ్: లూకా 22:31-34.
ప్రసంగము ముందు పాట బెంజమెన్ కినీకెయిడ్ గ్రిఫిత్ గారు:
"కృప! 'ఇది మధురమైన స్వరము" (ఫిలిఫ్ దొడ్రిడ్జిచే, 1702-1751; పల్లవి కాపరిచే).
“Grace! ‘Tis a Charming Sound” (by Philip Doddridge, 1702-1751; chorus by the Pastor).


ద అవుట్ లైన్ ఆఫ్

పేతురు – పిలువబడి, నొచ్చుకొని మార్పిడి చేయబడ్డాడు

PETER – CALLED, CONVICTED AND CONVERTED

డాక్టర్ ఆర్. యల్. హైమర్స్, జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

"సియోను, సియోను, ఇదిగో సాతాను, మిమ్మును పట్టి, గోదుమల వలే జల్లించుటకు, మిమ్మును కోరుకొనెను: గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు, నేను నీ కొరకు వేడుకొంటిని: నీ మనసు తిరిగిన తరువాత, నీ సహోదరులను స్థిర పరచుమని చెప్పెను" (లూకా 22:31-32).

(మత్తయి 4:19; 16:16, 17; లూకా 4:41; ఎఫెస్సీయులకు 2:1, 5)

I.    మొదటిది, పేతురు పిలువబడ్డాడు, మత్తయి 4:18-20; కీర్తనలు 110:3;
మత్తయి 20:16; 22:14.

II.   రెండవది, పేతురు నొచ్చుకొనబడ్డాడు, మత్తయి 16:16, 17; లూకా 18:31-34;
లూకా 22:31-34; 54, 56, 62.

III.  మూడవది, పేతురు మార్చబడినాడు, లూకా 24:34; I కొరిందీయులకు 15:5.