Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
చైనా ఎలా ప్రపంచ శక్తి అయింది!

(ఆదికాండముపై #88 వ ప్రసంగము)
HOW CHINA BECAME A WORLD POWER!
(SERMON #88 ON THE BOOK OF GENESIS)
(Telugu)

డాక్టర్ సి.యల్. కాగన్
by Dr. C. L. Cagan

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము ఉదయము, ఫిబ్రవరి 7, 2016
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, February 7, 2016

"మరియు దేవుడు నోవాహును, అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి, అభివృద్ధి పొంది, భూమిని నింపుడు" (ఆదికాండము 9:1).


ఈరోజు మన సంఘము చైనీయ నూతన సంవత్సరము ఆచరిస్తుంది. చైనీయ నూతన సంవత్సరము చాలా ప్రాముఖ్యమైన చైనీయ సెలవు దినము. అది క్రీస్తు పూర్వము రెండు వేల సంవత్సరాల క్రితము, చక్రవర్తి హాంగ్ టై మొదటి క్యాలెండర్ ను ప్రవేశ పెట్టినప్పుడు ఆరంభమైనది. పాశ్చాత్య క్యాలెండర్ వలే, చైనీయ క్యాలెండర్ ప్రతీ సంవత్సరాన్ని లెక్కిస్తుంది. కాని పాశ్చాత్య క్యాలెండర్ ల కాకుండా, చైనీయ క్యాలెండర్ చంద్రుని చక్రాలపై ఆధారపడి ఉంటాయి. పాశ్చాత్య క్యాలెండర్ సూర్యుని చుట్టూ తిరుగే భూమి చక్రాలపై ఆధారపడి ఉంటుంది. భూమి సంవత్సరానికి ఒకసారి భూమి చుట్టూ తిరుగుతూ, వేసవి, వర్షాకాలము, శీతాకాలము, చలికాలాలను కల్గిస్తుంది.

చైనీయ క్యాలెండర్ భూమి చుట్టూ తిరిగే చంద్రుని చక్రాలపై ఆధారపడి ఉంటుంది. చంద్రుడు సరిగ్గా సంవత్సరానికి పన్నెండు సార్లు భూమి చుట్టూ తిరగదు. అందుకే చైనీయ నూతన సంవత్సరము ప్రతీ సంవత్సరము వేరువేరు తేదీలలో ఆచరింపబడుతుంది, యూదా మతంలో పస్కావలే, క్రైస్తవ మతంలో ఈస్తరు వలే. చైనీయ నూతన సంవత్సరము ప్రారంభము జనవరి ఆఖరి నుండి ఫిబ్రవరి మధ్యలో ఎప్పుడైనా రావచ్చు. ఇక్కడ చైనీయ నూతనవత్సరము, రేపు అనగా ఫిబ్రవరి 8 న వస్తుంది. సాంప్రదాయకంగా సంబరాలు చాలా రోజులు ఉంటాయి, నూతన వత్సరము జరుపు కోవడం సమంజసం.

పూర్తి చైనీయ లూనర్ చక్రము అరవై సంవత్సరాలు తీసుకుంటుంది ఒక్కొక్క చక్రానికి 12 సంవత్సరాలు ఉంటాయి. ప్రతీ 12 సంవత్సరాలకు, చైనీయ క్యాలెండర్ క్షీరదాలు – ప్రాకేవి లేక పక్షి ఎలుక, ఎద్దు, పులి, కుందేలు, నాగము, పాము, గుఱ్ఱము, గొర్రె, కోతి, కోడిపుంజు, కుక్క, పంది పేర్లు ఇవ్వబడుతాయి. ఈ సంవత్సరము (2016 ఎ.డి.) కోతి సంవత్సరము. నూతన సంవత్సర వేడుకలు చైనాచే ప్రభావితమైన, కొరియా, కంబోడియా, వియత్నాం, మంగోలియా, థాయిలాండ్, ఇండోనేషియా, మలేసియా, ఫిలిప్పీయులు, సింగపూరు, తైవాన్ దేశాలలో జరుగుతాయి, చైనీయ సమాజాలు ప్రతి చోట ఉన్నాయి, 1873 వరకు జపాన్ లో కూడ, జపానీయులు పాశ్చాత్య క్యాలెండర్ ను అవలంభించినప్పుడు.

చైనా ప్రపంచపు గొప్ప దేశాలలో ఒకటి. మిగిలిన ఏ దేశములో లేనంత మంది చైనాలో ఉన్నారు – దగ్గరగా 1.4 బిలియన్లు, సంయుక్త రాష్ట్రాల కంటే నాలుగు రెట్లు ఎక్కువ. చైనా గొప్ప రాజకీయ, ఆర్ధిక సైనిక శక్తిగా ఎదిగింది. అమెరికా పాశ్చాత్య దేశాలు తగ్గు ముఖం పట్టడంతో, చైనా త్వరలో ప్రపంచంలో నాయక దేశంగా అవుతుంది.

బైబిలు ప్రవచనము చైనాలో గొప్ప ఆత్మీయ ఉజ్జీవము ఉంటుందని ముందుగానే చెప్పింది. క్రీస్తుకు పూర్వము ఏడూ వందల సంవత్సరముల ముందు యెషయా అన్నాడు, "చూడుడి, వీరు దూరము నుండి వచ్చుచున్నారు: మరియు, వీరు, ఉత్తర దిక్కు నుండియు పడమటి దిక్కు నుండియు వచ్చుచున్నారు; వీరు సేనీయుల దేశము నుండి వచ్చుచున్నారు" (యెషయా 49:12). చైనాలో క్రైస్తవ విస్పోటము ద్వారా ఈ ప్రవచనము నెరవేరింది. ఇప్పుడు అక్కడ 130 మిలియనులకు పైగా క్రైస్తవులున్నారు. "సేనీయ" చైనాకు పురాతన పేరు. డాక్టర్ హెన్రీ యం. మోరిస్ మరియు ఇతర వేత్తలు గుర్తించారు "సీనియ" ను చైనాగా (ద డిఫెండర్స్ స్టడీ బైబిలు ; గమినిక యెషయా 49:12). ప్రవచనము ఈనాడు నెరవేరింది. ప్రతీ ఆదివారము ఉదయము చైనాలో ఎక్కువ మంది గుడికి వెళ్తారు సంయుక్త రాష్ట్రములు, కెనడా, యూరపులు – కలిపినా దానికంటే ఎక్కువగా! చాలా మంది చైనీయ యువకులు మన గుడికి వస్తున్నారు. కొంతమంది క్రీస్తును విశ్వసించారు, దానిని బట్టి మేము దేవునికి వందనస్తులము!

చైనాకు సుదీర్ఘ చరిత్ర ఉంది. నాగరికత చైనాలో, పుసుపు నది దగ్గర, జియా పరిపాలన క్రింద క్రీస్తు పూర్తము రెండు వేల సంవత్సరములకు ముందు ప్రారంభమైంది. షాంగ్ పరిపాలనలో చైనీయ నాగరికత బాగా బలపడింది క్రీస్తుకు 1,600 సంవత్సరాల ముందు.

నోవహు జళ ప్రళయము తరువాత రెండు వందల సంవత్సరాలకు చైనాలో ప్రజలు జీవించారు. దేవుడు గొప్ప ప్రలయములో మానవ జాతిని తీర్పు తీర్చాడు. ప్రపంచము నీటితో నిండిపోయింది. ఓడలో కేవలము నోవహు అతని కుటుంబము రక్షింపబడింది. తరువాత నీరు తగ్గింది. నోవహు తన కుటుంబము ఓడలో నుండి బయటకు వచ్చారు. దయచేసి బైబిలులో ఆదికాండము 9:1 చూడండి. స్కోఫీల్ద్ పఠన బైబిలులో 16 వ పేజీలో ఉంది. దేవుడు వారితో చెప్పాడు, "మీరు ఫలించి, అభివృద్ధి, భూమిని నింపుడి" (ఆదికాండము 9:1).

కొందరు ఆశ్చర్యపోవచ్చు, "అది నిజంగా వాస్తవమా? అది చైనీయ చరిత్రలో ఇముడుతుందా? ఎలా మానవాళి ఎనిమిది మంది నుండి మిలియనుల ప్రజలు అవగలరు రెండు మూడు వందల సంవత్సరాలలో – తద్వారా ప్రజలు చైనాలో, ఇండియాలో, ఐగుప్తులో, మిగిలిన చోట్ల పట్టణాలు కట్టగలరు?" ఈ ఉదయాన్న ఈ ప్రశ్నలకు జవాబిస్తాను.

మొదటిది, జళ ప్రళయము ముందు ఏమి జరిగిందో ఆలోచించండి. ఆరు వేల సంవత్సరాలకు ముందు, మన తోని తల్లిదండ్రులతో దేవుడు చెప్పాడు, "మీరు ఫలించి, విస్తరించి అభివృద్ధి పొంది, భూమిని నింపుడి" (ఆదికాండము 1:28). పిల్లలను కలిగి భూమిని నింపమని దేవుడు వారితో చెప్పాడు.

ఆదాము అతని వారసులు అలా భూమిని నింపారు. అప్పుడు ప్రజలు 800 లేక 900 సంవత్సరాలు బ్రతికారు. అప్పటి వాతావరణము ఇప్పటి కంటే బాగుంది. భూమి నీటి భాష్పపు పందిరితో కప్పబడి ఉంది అది అంతరిక్షపు వికిరణము నుండి సంరక్షణ ఇచ్చింది. వర్షము లేదు. బదులు "అయితే ఆవిరి భూమి నుండి లేచి, నేల అంతటిని తడిపెను" (ఆదికాండము 2:6). అది పచ్చని స్థలము, జీవించడానికి ఆహ్లాద స్థలము. చెట్లు జంతువులూ వృద్ధి చెందాయి. ప్రజలు కూడ. వారు 900 సంవత్సరాలకు పైగా జీవించారు. బైబిలు చెప్తుంది, "ఆదాము బ్రతికిన దినములు తొమ్మిది వందల ముప్పది ఏండ్లు" (ఆదికాండము 5:5).

కాని ఆదాము పాపమూ చేసి, మనవ జాతికి పాపాన్ని మరణాన్ని తెచ్చాడు. అందుకే ఆదాము మొదటి కుమారుడు కయీను తన సహోదరుడు హేబెలును చంపాడు (ఆదికాండము 4:8). దేవుడు కయీనుతో అన్నాడు, "నీవు భూమి మీద దిగులు పరుచు దేశ దిమ్మరివై యుండువనేను" (ఆదికాండము 4:12). కయీను "ఏదేనుకు తూర్పు దిక్కున ఉన్న, నోవహు దేశమునకు" పారిపోయాడు (ఆదికాండము 4:16). "నొదు దేశము" అంటే వాస్తవంగా అర్ధము "తిరుగులాడు ప్రదేశము." డాక్టర్ యం. ఆర్. డిహాన్ అన్నాడు, "సాంప్రదాయము చెప్తుంది కయీను ఇండియా చైనా ఇతర మారుమూల ప్రాంతాలకు వచ్చాడని" (నోవహు దినములు, జోండేర్వాన్, 1971, పేజి 33). కయీను తన తల్లిదండ్రులకు దూరముగా ఒక ఊరు కట్టించాడు (చూడండి ఆదికాండము 4:17).

కయీను పారిపోయాడు. హేబెలు చనిపోయాడు. ఆదాము హవ్వాలకు షేతు అను మరొక కుమారుడు ఉన్నాడు (ఆదికాండము 4:25). వారికి "కుమారులు కుమార్తెలు" ఉన్నారు (ఆదికాండము 5:4). 930 సంవత్సరాలలో, ఆదాము చాలామందిని కన్నాడు. యుదా సంప్రదాయము ప్రకారము, ఆదాము హవ్వలకు 56 మంది పిల్లలున్నారు!

షేతు 912 సంవత్సరాలు జీవించాడు. ఆయనకు "కుమారులు కుమార్తెలు" ఉన్నారు (ఆదికాండము 5: 7, 8). షేతు కుమారుడు ఎనోషు 905 సంవత్సరాలు బ్రతికాడు. ఆయనకు "కుమారులు కుమార్తెలు" ఉన్నారు (ఆదికాండము 5:10, 11). ఎనోషు కుమారుడు కయినను 910 సంవత్సరాలు బ్రతికాడు. ఆయనకు "కుమారులు కుమార్తెలు ఉన్నారు" (ఆదికాండము 5:13, 14). ఆదికాండము ఐదవ అధ్యాయము ఆనాటి గొప్ప వ్యక్తుల పేర్లు వయస్సులు ఇచ్చింది. చాలామంది 900 సంవత్సరాలకు పైగా జీవించారు. వారికి చాలామంది పిల్లలున్నారు. మనవ జాతి భూమిని నింపింది.

జళ ప్రళయము సమయంలో చాల మిలియనుల, బిలియన్లు ప్రజలు ఉన్నారు. భూభాగము అంతటికి వారు విస్తరించారు. ప్రపంచవ్యాప్త జళ ప్రళయానికి వారు సరిపోయారు. జళ ప్రళయము భూమి అంతటికి వ్యాపించింది ఎందుకంటే భూభాగమంతా జనులున్నారు!

వారు పాపులుగా విస్తరించారు. "నరుల చెడుతనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచెను" (ఆదికాండము 6:5). "భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండియుండెను" (ఆదికాండము 6:11).

దేవుడు జల ప్రలయంతో మానవ జాతికి తీర్పు తీర్చాడు. నీళ్ళు 150 దినములు భూమి మీద ప్రభలేను (ఆదికాండము 7:24). కేవలము నోవాహు అతని కుటుంబము – ఎనిమిది మంది – ఓడలో సజీవంగా ఉన్నారు. మిగిలిన వారు మునిగి పోయి నరకానికి పోయారు. జల ప్రలయపు నీరు తగ్గింది. ఆర్మేనియం అరారాతు కొండల మీద, ఓడ నిలిచెను (ఆదికాండము 8:4). నోవహు అతని కుటుంబము ఓడ నుండి బయటకి వచ్చినప్పుడు, దేవుడు వారితో చెప్పాడు, "మీరు ఫలించి, అభివృద్ధి పొంది, భూమిని నింపుడి" (ఆదికాండము 9:1).

అదే ఆజ్ఞ దేవుడు ఆదాము హవ్వలకు ఇచ్చాడు. అది సులభమే. జనులు శతాబ్దాలు జీవించారు – జల ప్రళయము ముందు, అంతకాదు పందిరి తగ్గిపోయింది కనుక. కాని ఒక జంట 20, 30 లేక ఇంకా ఎక్కువ మందిని కానవచ్చును.

లేచి పాడండి "నా ప్రాణమా, పరలోకపు, రాజును స్తుతించు."

నా ప్రాణమా, పరలోకపు, రాజును స్తుతించు, ఆయన పాదాలకు నా నివాళి ఇస్తున్నాను;
   విమోచింపబడి, స్వస్థత నొంది, పునరుద్దరింపబడి, క్షమింపబడి, మీకు కాక ఇంకెవరికి స్తుతి పాడగలం?
ఆయనను స్తుతించు! ఆయనను స్తుతించు! నిత్యత్వపు రాజును స్తుతించు.
("నా ప్రాణమా, పరలోకపు, రాజునూ స్తుతించు," కీర్తనలు 103 నుండి;
   హెన్రీ ఎఫ్. లైట్ చే, 1793-1847).
(“Praise, My Soul, the King of Heaven,” from Psalm 103;
      by Henry F. Lyte, 1793-1847).

కూర్చోండి.

ప్రపంచమంతా విస్తరించడం సులభమే. జల ప్రళయము తరువాత వాతావరణము చల్లబడింది. శాస్త్రజ్ఞులు ఈ కాలాన్ని "మంచు యుగము" అన్నారు. మంచు గడ్డలలో నీరు బంధింపబడింది. పర్వతాలు కదిలాయి, సముద్రాలు తగ్గాయి. ఆసియా నుండి ఉత్తర అమెరికాకు వెళ్ళడం సులువు. రష్యా అలాస్కాల మధ్య నీరు తగ్గింది. రష్యా అలాస్కా మధ్య భూవంతెన ఉంది. శాస్త్రజ్ఞులు చూపించారు ప్రత్యేక "భారతీయులు" – అలస్కా నుండి దక్షిణ అమెరికా వరకు, వారు చైనా ప్రజలే.

ఇంకొక కారణమూ ఉంది రెండు మూడు వందల సంవత్సరాలలో భూమిని నింపడం సులువు అనడానికి. ప్రజలకు అప్పటికే ప్రపంచ భూగోళ శాస్త్రము తెలుసు. జల ప్రళయము ముందు భూభాగపు కొలతలు వారికి తెలుసు. వారి పూర్వికులు ఇండియాకు చైనాకు వచ్చారు. వారు ఎక్కడికి వెళ్తున్నారో వారికి తెలుసు!

భూమిని నింపడం సులభమే. అనుకున్నదానికంటే ఎక్కువ సమయము పట్టింది. ఎందుకో తరువాత వివరిస్తాను. కాని ప్రజలు వ్యాపించినప్పుడు, చాలా భూమిని ఆక్రమించి దానిని త్వరగా నింపారు! నోవహు కుమారులు శేము, హోము మరియు యాపేతు (ఆదికాండము 10:1). షేము మిడిల్ ఈస్ట్ ప్రజలైన, సెమిటిక్ లకు పూర్వికుడు. అబ్రహాము షేము నుండి వచ్చిన వారు. తన కుమారుడు ఇస్సాకు ద్వారా, అబ్రహాము యూదులకు తండ్రి అయ్యాడు. తన కుమారుడైన ఇస్మాయేలు ద్వారా, అరబ్భులకు అబ్రహాము తండ్రి అయ్యాడు. యూదులు అరబ్బులు సెమెటిక్ ప్రజలే.

యాపేతు యూరపు ఆసియా దేశ ప్రజలకు పూర్వికుడయ్యాడు. అతని ఒక కుమారుడు గోమేరు, పాశ్చాత్య యూరపులో చాలా దేశాలకు తండ్రి. మరియొక కుమారుడు మాగొను, రష్యా యుక్రెయిన్ ప్రజలకు పూర్వికుడు. యాపేతు మనవడు తార్శిష్, స్పెయిన్ ప్రజలకు పూర్వికుడు. చైనా ప్రజలకు యాపేతు నుండి వచ్చిన వారు.

హోము ఆఫ్రికా దేశపు, హమెటిక్ ప్రజలకు పూర్వికుడు. హోము కుమారులలో ఒకరు మిశ్రాయిము (ఆదికాండము 10:6), అది ఐగుప్తుకు హెబ్రీ పేరు, అది ప్రజలు చేరిన ఆఫ్రికాలోని మొదటి దేశము.

తక్కువ కాలంలో నోవహు వారసులు ప్రపంచాన్ని నింపేశారు. కాని ఇది అలా జరిగిపోలేదు! మొదట వారు దేవునికి లోబడడానికి తిరస్కరించారు. నూతన నిబంధన చెప్తున్నట్టుగా, "శరీరానుసారమైన మనస్సు [మారని] దేవునికి విరోధము" (రోమా 8:7). ఇది పాపి స్వభావము దేవునిపై తిరుగుబాటు చేయడం. ప్రజలు విస్తరించడానికి భూమిని నింపడానికి తిరస్కరించారు. ఏమి జరిగింది?

హోము కుమారులలో ఒకడు కూషు, అతడు నిమోదు తండ్రి (ఆదికాండము 10:6-9). నిమ్రోదు గర్వముతో కూడిన దుష్టుడు. అతడు ఒక రాజ్యాన్ని స్థాపించి, బాబులు (బబులోను) పట్టణము నుండి పరిపాలించాడు, శీనారు భూభాగములో (తరువాత బబులోనియా అని పిలువబడింది). రాజైన నిమ్రోదు దినములలో, జనులు భూమిని నింపడానికి తిరస్కరించారు. వారు అన్నారు, "మరియు వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా, ఒక పట్టణమును ఆకాశమును అంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని; పేరు సంపాదించుకొందుము రండని, మాట్లాడు కొనిరి" (ఆదికాండము 11:4). వారు విస్తరింప ఇష్టపడలేదు. వారు వారి స్వంత మహిమను చూపించుకోడానికి ఒక పట్టణాన్ని, ఒక గోపురాన్ని ఒక శక్తి కేంద్రాన్ని కట్టాలనుకున్నారు.

కాని దేవుడు వారికి తీర్పు తీర్చాడు. వారు గోపురము కట్టకుండా ఆయన వారిని ఆపేసాడు. అప్పటి వరకు అందరు ఒకే భాష మాట్లాడారు. "భూమి యందంతట ఒక్క భాషయు, ఒక్క పలుకును ఉండెను" (ఆదికాండము 11:1). మరియు దేవుడు అన్నాడు,

"గనుక మనము దిగిపోయి, వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా, అక్కడ వారి భాషనూ తారుమారు చేయుదము రండని అనుకొనెను. ఆలాగు యెహోవా అక్కడ నుండి భూమి యందంతట వారిని చెదర గొట్టెను: గనుక వారు ఆ పట్టణము కట్టుట మానిరి. దానిని బాబెలు అని పేరు పెట్టిరి [‘బబెల్’ అనగా ‘తికమక’]; ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషనూ [తికమక] తారుమారు చేసెను: అక్కడ నుండి యెహోవా భూమి యందంతట వారిని చెదర గొట్టెను" (ఆదికాండము 11:7-9).

దేవుడు వారి భాషనూ తారుమారు చేసెను. "బాబెలు" అనగా "తారుమారు" అని అర్ధము. ప్రజలు ఒకరినొకరు అర్ధం చేసుకోలేక పోయారు. ప్రతి ఒక్కరు తన భాష ప్రజలతోనే మాట్లాడ గలిగాడు. వారు గోపురాన్ని ముగించలేదు. వారి సమాజము పడిపోయింది. ప్రతి ఒక్కరు విడిపోయి మాట్లాడ గలిగిన వారితో – సమీప బంధువులతో వెళ్ళిపోయారు. వారు భూమిని నింపారు – బలవంత పెట్టబడినప్పుడు. బైబిలు చెప్తుంది ఆ రోజులలో "భూమి విభాగింప బడెను" (ఆదికాండము 10:25).

జల ప్రళయము తరువాత 100 సంవత్సరాలకు ఇది సంభవించింది. మనవ జాతికి ఒక ప్రజయే. అది ఇంకను అంతే! బైబిలు చెప్తుంది దేవుడు "ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనషులను సృష్టించెను" (అపోస్తలుల కార్యములు 17:26). అందుకే ఏ వ్యక్తీ అయినా ఏ స్త్రీ నైనా పెళ్లి చేసుకొని పిల్లలను కనవచ్చును. నోవహు అతని కుటుంబములో మనవ జాతి జీవశాస్త్ర విభిన్నత కలిగియుండి. బాబెలు గోపురము తరువాత, ప్రజలు చిన్న భాషల గుంపులుగా విడిపోయారు. వందల సంవత్సరాలుగా, గుంపులోని వారినే పెళ్లి చేసుకున్నారు. ఒక తెగ వారు వేరే వారిలా కనిపించలేదు. అలా వేరువేరు తెగలు భాషలు దేశాలు వచ్చాయి. కొంతమంది ఐరోపా వెళ్లి వారి భాషలు మాట్లాడారు. ఇతరులు ఆఫ్రికా వెళ్ళారు. కొందరు చైనా వెళ్లి చైనీయ భాషలో ఒకరితో ఒకరు మాట్లాడారు.

ఈ ప్రక్రియ కొంతకాలమే ఉంది. ఈ భాషల గుంపులు ప్రపంచమంతా విస్తరించారు. యాపేతు వారసులు ఐరోపా, ఇండియా చైనా, తరువాత చివరకు అమెరికా ఖండానికి వచ్చారు. హోము వారసులు ఆఫ్రికా వెళ్ళారు. షేము వారసులు మిడిల్ ఈస్ట్ ను నింపారు.

వారు ఎక్కడకు వెళ్ళినా జల ప్రళయాన్ని జ్ఞాపకము చేసుకున్నారు. ఎందుకె లోకములోని తెగలందరూ జల పరాజయాన్ని గూర్చిన కథనాలు కలిగియున్నారు. ఉత్తర పశ్చిమ అమెరికా వాసులు ఓడను చేసిన మనిషిని గూర్చి మాట్లాడుతారు. ఫిజీ దీవి ప్రజలు జల ప్రళయము కథనము కలిగియున్నారు.

వారు ఎక్కడకు వెళ్ళినా ప్రజలు ఒక దేవునిలో నమ్మకము కలిగి యున్నారు. వారు ఇది నోవహు అతని కుమారుల నుండి నేర్చుకున్నారు. ఉత్తర అమెరికా తెగ వారు ఒక దేవుని నమ్మారు ఆయనను గొప్ప ఆత్మ అని పిలిచారు. ప్రోటో-ఇండో-ఐరోపా భాషలో, అది ఐరోపా ఇండియా భాషలకు దారి తీసింది, దానిలో మనం కొన్ని మాటలు "డయాస్-పాటర్," "తండ్రి- దేవుడు," పరలోకపు తండ్రి-దేవుడు వింటాము. దయ్స్-పాటర్ నుండి గ్రీకు దేవుడు జియాస్ రోమా దేవుడు జూపిటర్ వచ్చాయి.

మంగోలులు తండ్రి దేవుని నుండి వచ్చిన, గొప్ప ఆకాశము దేవుడు టెంగ్రీని నమ్ముతారు. చైనీయ పూర్వికులు ఒకే దేవుని నమ్మారు. డాక్టర్ జేమ్స్ లేగ్గే (1815-1897) ఆక్స్ ఫర్డ్ విశ్వ విద్యాలయంలో చైనీయ భాషా సాహిత్యంలో అధ్యాపకుడు. అతని పుస్తకము, చైనా మతాలూ (చార్లెస్ స్క్రిబ్ నర్స్ కుమారులు, 1881), డాక్టర్ లేగ్గే చూపించాడు చైనా అసలు మతము ఒక దేవుని యందు నమ్మకము, వారు షాంగ్ టై (పరలోకపు రాజు) అని పిలిచారు. క్రీస్తుకు పూర్వము రెండు వేల సంవత్సరాలకు ముందు, చాల శతాబ్దాల ముందు కన్ఫ్యుసియాస్ బుద్ధ పుట్టుక పూర్వము, చైనీ ప్రజలు ఒక దేవుని ఆరాధించారు – తండ్రియైన దేవుడు, పరలోకపు రాజు.

చైనా అసలు మతము బుద్ధిజం కాదు. బుద్ధుడు చైనీయుడు కాదు! అతడు ఇండియాలో జీవించాడు. బుద్ధిజం ఇండియా నుండి చైనాకు తేబడింది. చైనా అసలు మతం మొనోతీజం, ఒక దేవుని యందు నమ్మకము – షాంగ్ టై, పరలోకపు రాజు. తరువాత, మూఢ నమ్మకాలు పొరపాట్లు కలిసాయి. కాని షాంగ్ టై, పరలోకపు రాజు, చైనా అస్సలు దేవుడు! "నా ప్రాణమా, స్తుతించు, పరలోకపు రాజును." లేచి పాడండి!

నా ప్రాణమా, పరలోకపు, రాజును స్తుతించు, ఆయన పాదాలకు నా నివాళి ఇస్తున్నాను;
   విమోచింపబడి, స్వస్థతనొంది, పునరుద్దరింపబడి, క్షమింపబడి, మీకు కాక ఇంకెవరికి స్తుతి పాడగలం?
ఆయనను స్తుతించు! ఆయనను స్తుతించు! నిత్యత్వపు రాజును స్తుతించు.

మీరు కూర్చోవచ్చు.

ఎందుకు చైనా ప్రజలు నిజ దేవుని నుండి వెళ్ళిపోయారు? ఎందుకంటే వారు పాపులు కాబట్టి. లోకములోని ప్రజలందరూ పాపులే. ప్రతీ భూభాగములోని పూర్వికులందరూ పాపులే. వారు "దేవునికి శత్రువులై యున్నారు" (రోమా 8:7). దేవుని వారు కోరుకోలేదు. కనుక వారు మూఢ నమ్మకాలను విగ్రహాలను అబద్ధపు మతాలను కనుగొన్నారు. బైబిలు చెప్తుంది,

"మరియు వారు దేవుని నెరిగియు, ఆయనను దేవునిగా మహిమ పరచలేదు, కృతజ్ఞతా స్తుతులు చెల్లింప లేదు; గాని తమ వాదముల యందు వ్యర్దులైరి, వారి అవివేక హృదయము అంధకారము ఆయెను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు, బుద్ధిహీనులైరి, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనష్యుల యొక్కయు, పక్షుల యొక్క, చతుష్పాద జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతి మా స్వరూపముగా మార్చిరి" (రోమా 1:21-23).

ఇది మానవాళి అంతటికి సంభవించింది. ఇది ఐగుప్తులో, బబులోనియాలో, ఐరోపాలో, ఇండియాలో, మరియు చైనాలో కూడ జరిగింది. ఇక్కడ నుండి ప్రపంచపు అబద్ధపు మతాలూ వచ్చాయి. పాపులు నిజాన్ని తిరస్కరించి అబద్ధాలను అంగీకరించారు. వెలుగు మసకగా మారింది. చీకటి పెరిగింది. మానవుని ద్వారా నిరీక్షణ లేదు.

దేవుడు చేరువయ్యాడు. దేవుడు కల్దీయుల ఊర్ పట్టణాన్ని చూసాడు. అక్కడ ఆయన అబ్రహముతో అన్నాడు, "నీవు లేచి నీ దేశము నుండియు... నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను ఆశీర్వాదింతును...నీవు ఆశీర్వాదముగా ఉందువు...భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింప బడును" (ఆదికాండము 12:1-3). దేవుడు తనతో అన్నాడు, "నేను నిన్ను పిలుచుకున్నాను." అబ్రహాము నిజ దేవుని నమ్మాడు. అతడు యూదులకు తండ్రి అయ్యాడు, వారు భూమి మీద దేవునిచే ఎన్నుకొన బడిన వారు

దేవుడు యూదులను మనకు బైబిలు ఇవ్వడానికి ఉపయోగించు కున్నాడు. దేవుడు తన కుమారుడైన యేసును యూదా స్త్రీ మరియకు జన్మింపచేసాడు. ఇశ్రాయేలులో యేసు పెరిగి పెద్దవాడయ్యాడు. ఇశ్రాయేలులో ఆయన మన పాప ప్రాయశ్చిత్తము కొరకు సిలువపై మరణించాడు. మన పాపము తీసివేయడానికి ఆయన తన రక్తాన్ని ఇచ్చాడు. మనకు జీవాన్ని ఇవ్వడానికి ఆయన మృతులలో నుండి లేచాడు. యేసు మానవులందరి కొరకు చనిపోయాడు – యూదుల కొరకే కాదు, చైనా ప్రజల కొరకు లోకమంతటి కొరకు! క్రీస్తు "శాంతికరము...సర్వలోక పాపుములకు" (I యోహాను 2:2). క్రైస్తవ్యము మాత్రమె మనవలి అంతటికి ఒకే ఒక నిజమైన మతము. అది "అమెరికనుల మతము కాదు." చాలామంది అమెరికనులు నిజ క్రైస్తవులు కాదు. క్రీస్తు ఒక దేశానికో సంస్కృతికో కాదు. ప్రపంచములోని ప్రతీ దేశములో క్రైస్తావులున్నారు, ఎందుకంటే క్రీస్తు "సర్వ మానవాళి పాపాల నిమిత్తము" చనిపోయాడు – చైనీయులు, కొరియనులు, హిస్ పానిక్స్, ఆఫ్రికనులు కొరకు – మరియు నీ కొరకు! చైనా నుండి ప్రపంచమంతటి నుండి ప్రజలు యేసును నమ్ముతున్నారు. యేసు నీతో అంటున్నాడు, "నా యొద్దకు రమ్ము" (మత్తయి 11:28). యేసు నొద్దకు రమ్ము. ఆయనను విశ్వసించు.

మానవుడు స్వంతంగా దేవుని కనుగొనలేడు. బైబిలు చెప్తుంది, "నీవు వెదకుట ద్వారా దేవుని కనుగొనగలవా?" (యోబు 11:7). వాస్తవానికి, ఏ ఒక్కరు దేవుని కనుగొనడానికి ఇష్టపడుట లేదు. బైబిలు చెప్తుంది, "దేవుని వెదుకు వాడెవడును లేడు" (రోమా 3:11). దేవుడు పాపులను రక్షించడానికి వచ్చాడు.

లోకము సృష్టింపబడక మునుపు, దేవుడు కొంతమందిని భూమి మీద విమోచించాలని ప్రణాళిక వేసాడు. అది ఎప్పుడు దేవుని ప్రణాళిక తన కుమారుడైన యేసును పాపుల కొరకు చనిపోవడానికి పంపడం. బైబిలు యేసును గూర్చి పలుకుతుంది, "జగుదుత్పత్తి మొదలుకొని వధింప బడియున్న గొర్రెపిల్ల" (ప్రకటన 13:8). ఇది దేవుని ప్రణాళిక ప్రతీ చోట ఆయన ప్రజల కొరకు. క్రీస్తు రక్షించడానికి ప్రతి ఒక్కరి కొరకు చనిపోయాడు.

బైబిలు చెప్తుంది, "అయితే [చూపడం] దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడి పరుచుచున్నాడు, ఎట్లనగా, మన మింకను పాపులమై యుండగానే, క్రీస్తు మన కొరకు చనిపోయెను" (రోమా 5:8). బైబిలు చెప్తుంది, "మనము దేవుని ప్రేమించితిమని, కాదు [మనము ప్రేమించ లేదు], తానె మనలను ప్రేమించి, మన పాపములను ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను [చెల్లించడంలో తృప్తి]" (I యోహాను 4:10). దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఆయన తన కుమారుడు యేసును పంపాడు అతడు నీ పాప పరిహారార్ధము సిలువపై మరణించాడు. యేసు నీ పాపాలు కడిగి వేయడానికి తన రక్తము కార్చాడు. నీవు త్వరగా యేసును నమ్మాలని నా ప్రార్ధన.

నిలబడి మళ్ళీ పాడండి – "నా ప్రాణమా, పరలోకపు, రాజును స్తుతించు."

నా ప్రాణమా, పరలోకపు, రాజును స్తుతించు, ఆయన పాదాలకు నా నివాళి ఇస్తున్నాను;
   విమోచింపబడి, స్వస్థతనొంది, పునరుద్దరింపబడి, క్షమింపబడి, మీకు కాక ఇంకెవరికి స్తుతి పాడగలం?
ఆయనను స్తుతించు! ఆయనను స్తుతించు! నిత్యత్వపు రాజును స్తుతించు.

ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఎబెల్ ప్రుదోమ్: రోమా 1:21-23.
ప్రసంగము ముందు పాట బెంజమెన్ కినీకెయిడ్ గ్రిఫిత్ గారు:
"యేసు పాలించును" (డాక్టర్ ఐజాక్ వాట్స్ చే, 1674-1748)
“Jesus Shall Reign” (by Dr. Isaac Watts, 1674-1748).