Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




దేవునిచే విడువబడిన క్రీస్తు!

THE GOD-FORSAKEN CHRIST!
(Telugu)

డాక్టర్ ఆర్.ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

సంస్కరణ ఉదయము బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము, జనవరి 24, 2016
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, January 24, 2016

"నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి?" (మత్తయి27:46).


ఆదివారము ఉదయము బోధించేటప్పుడు సాధారణంగా యవనస్తులతో మాట్లాడతాను. ఇలా ఎందుకు చేస్తానంటే ఎప్పుడు చాలామంది యవనస్తులు తేటగా బోధింపబడిన సువార్త వినని వారు ఆదివారము ఉదయము గుడికి వస్తారు. మేము వాణిజ్య సముదాయములకు, కళాశాలలకు ఇతర స్థలాలకు వెళ్లి యవనస్తులను రమ్మని ఆహ్వానిస్తాము. మీరు వచ్చారు, వచ్చినందుకు వందనాలు. వచ్చినందుకు మీకు వందనాలు.

కాని ఇంకొక కారణమూ కూడ ఉంది ప్రతీ ఆదివారము ఉదయము యవనస్తులతో మాట్లాడడానికి. రెండవ కారణము ముఫై సంవత్సరాలలోపు యవనస్తులు పెద్దవారి కంటే ఎక్కువగా రక్షణ అనుభవము పొందడానికి అవకాశము ఉంది. ప్రతి అధ్యయనం అది మాకు చెప్తుంది. నా స్వంత అనుభవము కూడ అది నిజమని చెప్తుంది. ఒక వ్యక్తి రక్షింపబడ్డాడంటే, అది సామాన్యంగా పదహారు ఇరవై ఐదు సంవత్సరాల మధ్య జరుగుతుంది. మినహాయింపులు ఉన్నాయని గ్రహించాను, కాని అవి ఎక్కువ కాదు.

ఇది మనము ఎలా వివరించవచ్చు? ఒక వివరణ యవనస్తులు జీవతము కష్టతరంగా ఉందని గ్రహించడం ప్రారంభిస్తారు. మీరు గ్రహిస్తారు మీరు అనిత్యులని, చనిపోతారని. మీరు చూడడం ఆరంభిస్తారు లోకము భయపెట్టేదని తరుచు ఒంటరి స్థలమని. మీరు ఇంకా నేర్చుకోలేదు మీ భయాలను కొన్ని కార్యకలాపాలతో, వివిధ మళ్లింపులతో మీ భయాలను కప్పి పుచ్చుకోవడం.

యవనస్తులు వారి జీవితపు ఆరంభ దశలో ఉన్నారు, మీలో చాలామంది మిమ్మును మీరు ప్రశ్నించుకుంటున్నారు, "నేను ఎలా ఈ చల్లని, ప్రేమింపని ఒంటరి ప్రపంచంలో జీవించగలను?" కనుక, నేను మళ్ళీ మళ్ళీ ఒంటరి తనము అంశానికి వస్తాను. ఓ, నేను బాగా అర్ధము చేసుకున్నాను ఒంటరి తనము అనే అంశము ప్రతీ యవనస్తుని ఆకట్టుకోదు. నాకు తెలుసు మీలో చాలామంది ఇప్పటికే నేర్చుకున్నారు ఎలా వివిధ కార్యకలాపాల కిటుకులను మళ్లింపులను ఒంటరి తనాన్నుండి తప్పించు కోవడానికి ఉపయోగించాలో. నాకు తెలుసు ఈ కిటుకులను నేర్చుకున్న వారు నా ప్రసంగాల పట్ల ధ్యాస ఉంచరు. కాని నాకు తెలుసు ఒక నెమ్మదియైన అబ్బాయి ఉన్నాడు ఆలోచించే అమ్మాయి ఉంది వారు ఇంటికి వెళ్లి అనుకుంటారు, "ఆ వృద్ధుడు ఈ రోజు నాతో మాట్లాడాడు. నేను తిరిగి వెళ్లి ఆయన బోధించేది మళ్ళీ వినాలి."

అలాంటి ఆలోచించ గలిగే యవనస్తునితో స్త్రీతో ఈ ఉదయాన్న నేను మాట్లాడుతున్నాను. నా అంశము ఒంటరి తనము – చల్లని, కష్టతర, భయపెట్టే, హృదయ విదారక ఒంటరి తనము. అది మునుపెన్నడూ మంచిగా ఉచ్చరింపబడలేదు, అనుభవింపబడలేదు, కాని యేసు క్రీస్తు సిలువపై కేక వేసిన దానికంటే,

"నా దేవా, నాదేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి?" (మత్తయి 27:46).

మీ మనసు దృష్టిలో ఆయన చిత్రపటాన్ని చూడండి. ఆయన ఒంటరిగా గెత్సమనే తోటలో ప్రార్దిస్తూన్నప్పుడు, వారు ఆయనను బంధించారు. ఆయన వస్త్రములను తీసివేసి చావ చితకబాదారు. ఆయన తలపై ముండ్ల కిరీటము ఉంచారు. వీధులలో సిలువను మోసు కెల్తున్నప్పుడు ఆయనను అపహసించి పరిహసించారు. ఆయన చేతులకు కళ్ళకు మేకులు కొట్టారు. సిలువపై కెత్తారు. వారు ఆయనను తులనాడుతున్నప్పుడు ఆయన శరీరము వేలాడుతుంది. చివరకు, ఆయన ఇలా అరిచాడు,

"నా దేవా, నాదేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి?" (మత్తయి 27:46).

దాని ప్రాముఖ్యత అర్ధము చేసుకోవడానికి, రెండు ప్రశ్నలకు జవాబు చెప్పాలి.

I. మొదటిది, ఈ వ్యక్తి యేసు ఎవరు?

ఆయన సామాన్య మానవుడు కాదు. బైబిలు చెప్తుంది దేవుడు "ఆయన తన అద్వితీయ కుమారుని అనుగ్రహించాడు" (యోహాను 3:16). ఈ కేకవేసిన వ్యక్తి దేవుని అద్వితీయ కుమారుడు. ఇంకా ఆయన చెప్పాడు

"[తండ్రి దేవా] లోకము పుట్టుక మునుపు మీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమ పరచుము" (యోహాను 17:5).

సిలువ నుండి కేకవేసిన ఈ వ్యక్తి యేసు క్రీస్తు, నిత్యత్రిత్వములో రెండవ వ్యక్తి. తండ్రి దేవునితో ఐక్యమైయున్న అతడు ఇలా అన్నాడు,

"నేను నా తండ్రియు ఏకమైయున్నాయి" (యోహాను 10:30).

తండ్రియైన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ఏకత్వము గతములోని నిరంతర నిత్యత్వము నుండి భవిష్యత్తు నిరంతర నిత్యత్వము వరకు ఉన్నది. ఆయన దేవుని వాక్యము.

"ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద యుండెను, వాక్యము దేవుడై యుండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను; కలిగియున్న దేదియు ఆయన లేకుండా కలుగ లేదు" (యోహాను 1:1-3).

"ఆ వాక్యము శరీరదారియై కృపా సత్య సంపూర్ణుడుగా, మన మధ్య నివసించెను" (యోహాను 1:14).

యేసు పరలోకము నుండి దిగి వచ్చాడు. యేసు, త్రిత్వములో రెండవ వ్యక్తి, భూమిపై జీవించాడు. ఆయన ఈలోకపు జీవితమంతటిలో కూడ తండ్రి దేవునితో ఐక్యమైయున్నాడు. అంధకార గెత్సమనేలో కూడ, శిష్యులు నిద్రిస్తున్నప్పుడు, యేసు ప్రార్ధించి దేవునితో సహవాసము కలిగి యున్నాడు ఆయన తండ్రితో. ఆయన బంధింపబడి అబద్ధముగా విచారింపబడినను, దేవుడు ఆయనకు సమీపంగా ఉన్నాడు. ఆయన లాగుకొని వెళ్లి సిలువ వేసినప్పుడు, ఆయన ఇంకను దేవుని వైపు తిరిగి ఇలా ప్రార్ధించాడు,

"తండ్రీ, వారేమి చేయుచున్నారో వారెరుగరు; కనుక వారిని క్షమించుము" (లూకా 23:34).

కాని ఇప్పుడు అంతా చీకటి.

"మధ్యాహ్నము మొదలుకొని ఆరు గంటల వరకు ఆదేశ మందంతట చీకటి కమ్మెను. ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు, ఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను? ఆ మాటకు, నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్ధము" (మత్తయి 27:45-46).

ఆ భయంకర ఘడియలో భూమిపై వచ్చిన చీకటి తండ్రియైన దేవుని మొట్టమొదటిసారిగా కుమారుడైన దేవుని నుండి వేరుచేసిన చీకటిని చిత్ర పఠముగా ఉన్నది. మునుపెన్నడూ దేవుని కుమారుడు తన పరలోకపు తండ్రి నుండి వేరి చేయబడలేదు, కాని ఇప్పుడు అలా జరిగింది. ఆ చీకటి ఘడియలో ఆయన ఇలా కేక వేసాడు,

"నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి?" (మత్తయి 27:46).

ఈ వ్యక్తి ఎవరు? ఆయనే యేసు, నిత్యత్వ దేవుని అద్వితీయ కుమారుడు – పూర్తిగా మొట్టమొదటి సారిగా నిత్యత్వముతో తన పరలోకపు తండ్రి నుండి వేరు చేయబడ్డాడు.

II. రెండవది, ఆయన ఎందుకు కేకవేసాడు?

ఇది సామాన్యంగా మీకు వివరించడానికి నాకు చాలా కష్టతరంగా ఉంది. ఆశ్చర్యము లేదు! క్రీస్తు పలికిన ఈ మాటలు వివరణకు అతీతము. స్పర్జన్ కు కూడ అదే కష్టమొచ్చింది. ఆయన అన్నాడు, ఈ మాటలను గూర్చి, వాటిని ఏ ఒక్కడు పూర్తిగా అర్ధం చేసుకోలేదు. స్పర్జన్ అన్నాడు,

మార్టిన్ లూథర్ [గొప్ప సంస్కరణ నాయకుడు] ఈ పాఠ్యభాగము అధ్యయనము చేయడానికి కూర్చున్నాడు. గంటల తరబడి ఆ గొప్ప దైవజనుడు మౌనంగా కూర్చున్నాడు; తన కొరకు కనిపెట్టుచున్న వారు తన గనిలోనికి వచ్చారు, మళ్ళీ మళ్ళీ, కాని అతడు ధ్యానంలో పూర్తిగా నిమగ్నమైపోయాడు అతనిని శవము అనుకున్నారు. అతడు కాళ్ళు చేతులు కదపలేదు, తినలేదు త్రాగలేదు; కాని కళ్ళు బాగా తెరుచుకొని కూర్చున్నాడు, భ్రమలో ఉన్నట్టు, ఈ ఆశ్చర్యకర మంటలును గూర్చి ఆలోచిస్తూ, "నాదేవా, నా దేవా, నన్నెలా చెయ్యి విడిచితివి?" తరువాత, చాలా గంటల తరువాత, అంతా మర్చిపోయి, కుర్చీ నుండి లేచి, ఇలా అన్నాడు, "దేవుడు దేవుని విడిచి పెట్టుటా! ఏ వ్యక్తి దీనిని అర్ధం చేసుకోలేడు;" తన మర్గాన వెళ్లిపోయాడు. అది సరియైన వ్యక్తీకరణ కానప్పటికినీ – అది చెప్పడానికి వెనకాడుతున్నాయి అయినను నేను ఆశ్చర్యపోవడం లేదు – మన పాఠ్యభాగము ఆ వెలుగులో లూథర్ బుర్రకు ఇవ్వబడింది. ఏమి చెప్పబడిందంటే లూథర్ లోతైన గనాలో ఉంది, మళ్ళీ వెలుగులోనికి వచ్చినట్టు అనిపించింది. నా భావన అతడు గనిలో లేడు, కాని దానిలోనికి చూసాడు – లేక ఆ మార్గములో ఒక భాగమైపోయాడు, ఆ కఠిక చీకటిలో వెళ్తూ, ఇంకా లోతుగా వెళ్ళలేక పోయాడు ఆ కేక విషయంలో ["నా దేవా, నా దేవా, నన్నెలా విడిచితివి?"] అది చాలా లోతైనది; ఏ వ్యక్తి అర్ధము చేసుకోలేనిది. కనుక దానిని వివరించడానికి ప్రయత్నించడం లేడు (C. H. Spurgeon, “The Saddest Cry From the Cross,” The Metropolitan Tabernacle Pulpit, Pilgrim Publications, 1977, volume XLVIII, pp. 517-518).

నేను లూథర్ తోనూ స్పర్జన్ తోనూ ఏకీభవిస్తున్నాను మనము పూర్తిగా అర్ధము చేసుకోలేము ఎలా తండ్రి దేవుడు కుమారుడైన దేవుని ఎలా "విడిచి పెట్టాడో." ఈ పదాలను నేను వివరింప ప్రయత్నించను, కాని వాటిని గూర్చి కొన్ని తలంపులు ఇస్తాను.

క్రీస్తు ఒక వ్యక్తిగా ఇక్కడ మాట్లాడుచున్నాడు. ఆయన పూర్తిగా దేవుడు, కాని ఆయన పూర్తిగా మానవుడు కూడ. ఇది అమోఘ కలయిక, క్రీస్తు దైవ వ్యక్తి. కాని ఇక్కడ ఒక మనవునిలా మాట్లాడుచున్నాడు. కేవలము నిజమైన వ్యక్తి ఇలా చెప్పగలడు తన దేవునిచే విడిచి పెట్టబడ్డానని.

క్రీస్తు దేవునిచే విడిచి పెట్టబడ్డాడు ఎందుకంటే మనము దేవుని చేత విడిచి పెట్టబడ్డానికి తగిన వారము. సిలువపై క్రీస్తు మన స్థానాన్ని తీసుకున్నాడు, మన పాపముల నిమిత్తము శ్రమ పడ్డాడు.

"నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను" (యెషయా 53:4).

మన ఆదిమ తండ్రి నుండి, మనకు పాపమూ సంక్రమించినది, మనము జన్మించి ఎదిగి, దేవుని నుండి వేరు చేయబడ్డాము, ఒంటరిగా ఉన్నాము; మన జీవితమూ ఒంటరి తనములో, దేవుని నుండి వేరు చేయబడి, మన పాప స్వక్రియలను బట్టి, మన పాపములను బట్టి ఉన్నాము.

"వారు అందమైన మనస్సు గలవారై, తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత, దేవుని వలన కలుగు జీవములో నుండి వేరు పరచ బడి యున్నారు" (ఎఫెస్సీయులకు 4:18).

దేవుడు ఉండి తీరాలి అనే విషయము ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడు మీకు వాస్తవంగా ఎందుకు లేడో ఆలోచించారా? ఇక్కడ జవాబు ఉంది, బైబిలు నుండి – దేవుడు నీకు వాస్తవంగా లేడు ఎందుకంటే నీ ఆత్మీయ అవగాహన "అంధమైనది," ఎందుకంటే "గుడ్డితనము" వలన హృదయము యొక్క. అందుకే మీరు "దేవుని జీవము నుండి వేరు చేయబడ్డారు." గ్రీకు భాష క్రియ కొనసాగే స్థితిని వక్కాణింఛి చెప్తుంది. అంటే నీకు ఒకప్పుడు దేవుడు తెలుసు అని అర్ధం కాదు. దాని అర్ధము నీకు ఆయన మునుపు తెలియదు, ఇంకా నీకు ఆయన తెలియదు. నీవు దేవుని నుండి వేరు చేయబడిన, స్థితిలో కొనసాగుతున్నావు "[నీ] హృదయ అంధత్వాన్ని బట్టి" (cf. Dr. Fritz Rienecker, A Linguistic Key to the Greek New Testament, Zondervan, 1980, p. 533).

యేసు సిలువపై మరణించాడు దేవునితో నిన్ను మెకము చెయ్యడానికి.

"ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, అనీతి మంతుల కొరకు, నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చూపబడి ఆత్మ విషయంలో బ్రతికింప బడి ఒక్కసారే శ్రమపడెను" (I పేతురు 3:18).

క్రీస్తు సిలువపై మరణించాడు "మనలను దేవుని దగ్గరకు తేవడానికి," మన పాప స్వభావాన్ని మన వాస్తవ పాపాలను తీసివేయడానికి, దేవునితో మేకము చెయ్యడానికి. అలా చెయ్యడానికి క్రీస్తు మన "దుఃఖములను" "విచారములను" సిలువపై భరించాడు.

"నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను" (యెషయా 53:4).

ఒక మారని పాపిగా, ఈ లోకంలో ఒంటరిగా విడువబడ్డావు. నీకలా అనిపిస్తుంది. ఏదో పొరపాటు ఉందని నీవు గమనించావు. యన్వనస్తులు వారి ఒనరితనాన్ని, దేవునిచే విడువబడిన తనాన్ని, అంధకార భయపెట్టే లోకంలో ఉండే విషయాన్ని బాగా పసిగట్ట గలదు. అందుకే దేవుడు తరుచు యవన దశలో ప్రజలను మారుస్తాడు. పెద్ద వాడైనప్పుడు వెలితిని, ఒంటరి భావనను మత్తు పదార్ధాలలో, మధ్యము, లైంగిక సంబంధాలు, డబ్బు సపాదించడు, "విజయానికి" "ఆట ప్రణాళిక" లలో ముంచడానికి ప్రయత్నిస్తావు. ఏదో ఒక "కిటుకు" ఉపయోగింప నేర్చినప్పుడు ఒంటరి తనాన్ని తప్పించు కోవడానికి, నీవు రక్షింపబడడానికి చాలా ఆలస్యము అవుతుంది.

"మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లక పోయిరి, కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను" (రోమా 1: 28).

కాని ఈ ఉదయము, నీవు ఇంకా యవనుడిగా ఉండగానే, దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నీ ఒంటరితన భావనలో దేవుడు నిన్ను పిలుస్తాడు, నీ హృదయంతో దేవుడు మాట్లాడుతాడు. తరువాత, వినండి, యేసు సిలువపై పలికిన మాటలు చూడండి,

"నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి?" (మత్తయి 27:46).

ఈ మాటలు మనం యవ్వనంగా ఉన్నప్పుడు మనతో మాట్లాడుచున్నాయి. దైవ కుమారుడు తండ్రి దేవుని నుండి మీ యొక్క ఎడబాటు ఆనుభవించాడు ఆయన నుండి నీ వేర్పాటును నెరవేర్చడానికి. నీవు దేవుని నుండి దూరంగా వెళ్లి పోయావు – క్రీస్తు నీ పాపమునకు పరిహారము చెల్లించాడు! నీవు దేవుని మర్చిపోయావు – క్రీస్తు నీ పాప పరిహారము చెల్లించాడు! నీవు ఆదివారము వెంబడి ఆదివారము పాప కార్యములు చెయ్యడానికి గుడి మానేస్తావు – క్రీస్తు నీ పాప పరిహారము చెల్లించాడు! నీవు గిడికి వచ్చావు, కాని పదాలు "వల్లిస్తున్నావు", దేవుని గూర్చి ఎన్నడు ఆలోచించ లేడు – క్రీస్తు అయితే నీ పాప పరిహారము చెల్లించాడు! సిలువపై క్రీస్తు నీ దేవుడు లేని స్థితిని బట్టి పరిహారము చెల్లించాడు! ఎంత భయంకర వెల ఆయన చెల్లించాడు!

వారు ఆయన వస్త్రములు తీసివేసి చితక బాదారు. ఆయన చేతులకు కాళ్ళకు మేకులు కొట్టారు. అంధకారము నిండింది. దేవుని ఉగ్రత ఆయన పైకి వచ్చింది,

"అతని నలుగ గొట్టుట యెహోవాకు ఇష్టమాయెను; ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను" (యెషయా 53:10).

దేవుడు క్రీస్తును భయంకరంగా శిక్షించాడు, నీ స్థానంలో, నీ పాపముల నిమిత్తము. కాబట్టి చివరకు అతి భయంకర శిక్ష వచ్చింది. దేవుడు తన కుమారుని విడిచి అంధ కారము చేసాడు. కుమారుడైన క్రీస్తు ఒంటరిగా శిలువపైన నీ పాపాన్ని భారిస్తున్నాడు.

"నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి?" (మత్తయి 27:46).

ప్రశ్నించే కేకకు అతడు అడుగగా, అపోస్తలుడైన పేతురు, ఇలా జవాబు ఇచ్చాడు,

"ఏలయనగా మనలను దేవుని [ఆయన] యొద్దకు తెచ్చుటకు, అనీతి మంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు [నీవు], శరీర విషయంలో చంపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పడెను" (I పేతురు 3:18).

నీవు దేవుని విడిచి పెట్టావు, యేసు దేవునిచే విడువబడడం ద్వారా నీ పాపాల కొరకు వెల చెల్లించాడు, ఆయన – నీ స్థానంలో, సిలువకు మేకులు కొట్టబడ్డాడు, ఒంటరిగా, తండ్రి దేవుని నుండి ఎడబాటు పొందాడు, ఆయనను పూర్ణ ఆత్మతో ప్రేమించాడు.

దిగంబరిగా శాప గ్రస్త మ్రానుపై మేకులచే కొట్టబడ్డాడు,
మరణానికి పరలోకానికి అతీతంగా అగు పర్చబడ్డాడు,
గాయాల రక్త ప్రవాహంలో,
గాయముల ప్రేమ నిషాద బహిర్గత!

ఎంత భయంకరమైన కేక
చూచుచుండగా, దేవదూతలను కదిలించాయి;
రాత్రిలో స్నేహితులు కూడ ఆయనను విడిచి పెట్టారు,
రాత్రిలో ఆయన దేవుడు కూడ ఆయనను విడిచి పెట్టాడు!
("ఆయన తపన" జోసెఫ్ హార్ట్ చే, 1712-1768; కాపరిచే మార్చబడినది).
   (“His Passion” by Joseph Hart, 1712-1768; altered by the Pastor).

క్రీస్తు మాటలలోని మర్మమును గూర్చి కొంత మనము ఆలోచించాము,

"నా దేవా, నా దేవా, నీవెలా నా చెయ్యి విడిచితివి?" (మత్తయి 27:46).

కాని నా నిరీక్షణ నీవు ఎక్కువగా విన్నావు యేసు నీ పాపాల నిమిత్తము చనిపోయాడని, తిరిగి లేచాడని, అవును, పరలోకంలో దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడని తెలుసుకోవడానికి. నా నిరీక్షణ నీవు ఎక్కువగా విన్నావు క్రీస్తులోనే నీకు నిరీక్షణ ఉందని – వేరే సుస్థిర నిరీక్షనే లేదని తెలుసుకోవడానికి. నా ప్రార్ధన నీవు నేరుగా క్రీస్తు నొద్దకు వస్తావని ఆయనను స్వీకరిస్తావని ఆయన నిత్యత్వ రక్తములో నీ పాపాలను శుభ్రము చేసుకుంటావని – ఎందుకంటే వేరే నిరీక్షణ లేదు, భూమి మీద కాని నిత్యత్వములో కాని . ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఎబెల్ ప్రుదోమ్: మత్తయి 27:35-46.
ప్రసంగము ముందు పాట జాక్ గాన్ చే:
"ఆయన తపన" (జోసెఫ్ హార్ట్ చే, 1712-1768).
“His Passion” (by Joseph Hart, 1712-1768).


ద అవుట్ లైన్ ఆఫ్

దేవునిచే విడువబడిన క్రీస్తు!

THE GOD-FORSAKEN CHRIST!

డాక్టర్ ఆర్.ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

"నా దేవా, నా దేవా, నీవెలా నా చెయ్యి విడిచితివి?" (మత్తయి 27:46).

I. మొదటిది, ఈ వ్యక్తి యేసు ఎవరు? యోహాను 3:16; 17:5; 10:30; 1:1-3, 14;
లూకా 23:34; మత్తయి 27:45-46.

II. రెండవది, ఆయన ఎందుకు కేకవేసాడు? యెషయా 53:4;
ఎఫెస్సీయులకు 4:18; I పేతురు 3:18; రోమా 1:28; యెషయా 53:10.