Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
గర్భ స్రావము మరియు క్రీస్తు రెండవ రాకడ!

ABORTION AND THE SECOND COMING OF CHRIST!
(Telugu)

డాక్టర్ సి.ఎల్. కాగన్ గారిచే
by Dr. C. L. Cagan

సంస్కరణ ఉదయము బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము, జనవరి 17, 2016
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, January 17, 2016

"నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు: లేని యెడల, మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధ పరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్లి మీకు స్థలము సిద్ధ పరచిన యెడల, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి, నా యెద్ద ఉండును; నా యొద్ద నుండుటకు, మిమ్మును తీసుకొని పోవుదును" (యోహాను 14:2-3).


చైనాలో, ఆఫ్రికాలో, మూడవ ప్రపంచపు ఇతర ప్రాంతాలలో, లక్షలాది మంది క్రీస్తును నమ్ముచున్నారు. ఆకాశము నుండి ఉజ్జీవము ప్రవహిస్తుంది. కాని అమెరికాలో పాశ్చాత్య దేశాలలో, సంఘాలు చల్లగా ఉన్నాయి ఉజ్జీవము లేదు.

యూరపు మరియు అమెరికాలలో మనము దేవుని నుండి తిరిగి పోయాము. 1973 లో సంయుక్త రాష్ట్రాలలోని ఉన్నత న్యాయ స్థానము గర్భ స్రావమును చట్టబద్ధము చేసింది. నలభై మూడు సంవత్సరాలుగా లక్షలాది పిల్లలు చనిపోయేటట్టు అనుమతిస్తున్నాం దానిని ఆపకుండా. యాభై ఎనిమిది మిలియనుల అమెరికన్ పిల్లలు తల్లుల గర్భములోనే గర్భస్రావము ద్వారా చంపబడ్డారు. మన దేశము హిట్లర్ చంపిన వారికి తొమ్మిది రెట్లు ఎక్కువమందిని చంపింది. ఈ దేశము దేవుని తీర్పు క్రింద ఉంది. సంప్రదాయ వాదులు అని పిలువబడే వారు కూడ గర్భస్రావమునకు వ్యతిరేకంగా నిలబడడం లేదు. రిపబ్లికన్ కాంగ్రెస్ ఆదాయ వ్యవ పట్టీలో మీ పన్నులో ఎక్కువ డబ్బును పధకపు పితృత్వానికి కేటాయించారు, అది పిల్లల శరీర భాగాలను ప్రయోగాలకు అమ్ముతారు. రిపబ్లికన్ లకు సిగ్గు చేటు! ఫ్రేంక్ లిన్ గ్రాహం రిపబ్లికన్ పార్టీ నుండి వచ్చేసినందుకు దేవునికి వందనాలు! దేవునికి వందనాలు ఆయన ఇలా చెప్పినందుకు, "నాకు రిపబ్లికన్ పార్టీలో నిరీక్షణ లేదు, అలాగే డెమోక్రటిక్ పార్టీ , లేక [ద] టీ పార్టీలో అమెరికాకు శ్రేష్ట మైనది చెయ్యడానికి" (http://www.foxnews.com/politics/2015/12/22/evangelist-franklin-graham-slams-quits-gop.html?intcmp=hppop). నన్ను చాల తేటగా చెప్పనివ్వండి డెమోక్రటిక్ పార్టీ రిపబ్లికన్ పార్టీ కంటే దారుణంగా ఉంది. రిపబ్లికన్ పార్టీలో గాని, డిమొక్రటిస్ పార్టీలో గాని, ఇంకా ఏ రాజకీయాలలోనూ నిరీక్షణ లేదు. నిజమైన నిరీక్షణ క్రీస్తు నందు ఉంది! క్రీస్తు అన్నాడు, "నేను మళ్ళీ వస్తాను." ఆయన రాకడను గూర్చి మన చుట్టూ చాలా సూచనలు ఉన్నాయి.

నేను ఒప్పింపబడ్డాను మన సంఘాలలో మన దేశములో మనము చూసే పాపము క్రీస్తు రెండవ రాకడ సమీపంగా ఉందనడానికి సూచన. ఇంకొక సూచన కూడ ఉంది. యూదులు వారి భూభాగానికి తిరిగి వస్తున్నారు. దేవుడు యూదులతో అన్నాడు ఆయన "అన్ని దేశముల నుండి మిమ్ములను సమకూర్చి, మీ స్వదేశములోనికి మిమ్మును రప్పించెను" (యేహెజ్కేలు 36:24). దేవుడు వారితో అన్నాడు, "నేను మిమ్మును... ఇశ్రాయేలు దేశములోనికి తోడుకొని వచ్చెదను" (యేహెజ్కేలు 37:12). ఆ ప్రవచనము 1948 లో నెరవేరనారంభించింది ఇశ్రాయేలు దేశము ఏర్పడినప్పుడు. ఇశ్రాయేలు వారి స్వదేశము నకు తిరిగి వస్తున్నప్పుడు –మనకు తెలుసు అంతము సమీపంగా ఉందని! మన జీవిత కాలంలో అది చూస్తాము. మనము యుగ సమాప్తికి క్రీస్తు రెండవ రాకడకు సమీపంగా జీవిస్తున్నాం.

ఈ రోజు నేను క్రీస్తు రెండవ రాకడను గూర్చి ఎక్కువ వివరంగా చూడాలనుకుంటున్నాను. ఆయన రాకడ రెండు భాగాలుగా ఉంటుందని బైబిలు చెప్తుంది. మొదటిది, ఆయన మధ్య ఆకాశంలో వస్తాడు. తరువాత ఆయన భూమి మీదికి వస్తాడు.

I. మొదటిది, క్రీస్తు మధ్య ఆకాశంలోనికి వచ్చునప్పుడు ఏమి జరుగుతుంది.

క్రీస్తు మధ్య ఆకాశంలోనికి వచ్చి ఆయనతో పాటు క్రైస్తవులను ఆకాశంలోనికి తీసుకెళతాడు. బైబిలు చెప్తుంది,

"ఆర్భాటముతోనూ ప్రధాన దూత శతాబ్దముతోను, దేవుని బూరతోను, పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును: క్రీస్తు మృతులైన వారు యెదుట లేతురు: ఆ మీదట సజీవులమై నిలిచి యుండు వారము వారితో కూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు, మేఘముల మీద కొనిపోబడుదుము: కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము" (I దెస్సలోనీకయులకు 4:16-17).

దీనినే "ఎత్తబడుట" అంటాము. ఆంగ్ల పదము "ఎత్తబడుట" లాటిన్ పదము నుండి వచ్చింది దాని అర్ధము "కొనిపోబడుట" లేక "పట్టుకొనబడుట." బైబిలు చెప్తుంది "క్రీస్తులో మృతులైన వారు మొదట లేతురు," వారు మృతులలో నుండి లేచి క్రీస్తును కలుస్తారు. తరువాత భూమి మీద సజీవంగా ఉన్న క్రైస్తవులు "వారితో కూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు, ఆకాశ మండలానికి మేఘముల మీద కొనిపోబడుతాము." క్రైస్తవులందరు మహిమ శరీరాలు పొందుకుంటారు. బైబిలు చెప్తుంది,

"మనమందరము నిద్రించము, కాని నిమిషంలో, ఒక రెప్పపాటున, కర బూర మ్రోగగానే, మన మందరము మార్పు పొందుదుము: బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము" (I కొరిందీయులకు 15:51-52).

"ఒక క్షణంలో, కను రెప్పపాటులో" విశ్వాసులు ఎన్నడూ చనిపోని శరీరాలు పొందుకుంటారు. మనము మధ్యాకాశములో యేసు ప్రభువును కలిసి ఆయనతో పాటు పరలోకమునకు వెళ్తాము.

ఇది ఎప్పుడు జరుగుతుంది? ఎవరికీ ఆ దినము తెలియదు, క్రీస్తు చెప్పాడు, "ఆ దినమైనను ఆ ఘడియయైనను ఏ మనష్యునికి తెలియదు" (మత్తయి 24:36). క్రీస్తు రాకడను గూర్చిన తేది ఎవరైనా ఇస్తే అతడు అబద్ధపు ప్రవక్త! కాని సామాన్య సమయము మనము తెలుసుకోవచ్చు. ఒక సూచన వెంబడి ఒక సూచన నెరవేరుచున్నందున, ఆఖరి దినాలలో మనం జీవిస్తున్నామని మనకు తెలుసు.

చాలామంది అమెరికన్లకు ఒక అభిప్రాయము ఉంది వారు జీవితాన్ని డబ్బుతోనూ వినోదముతోను మూడు రోజుల వారాంతపు సెలవులతోను సుఖ పడవచ్చు – ఒక రోజు వారు సముద్రపు ఒడ్డు నుండి గాని కొండల మీద నుండి గాని ఎలాంటి శ్రమ లేకుండా ఎత్త బడవచ్చని భావిస్తున్నారు. ఉత్తర కొరియా క్రైస్తవులకు అది వింతగా అనిపిస్తుంది, అక్కడ వారు చెరసాల పాలవుతారు, ఆకలి భాద మరియు చావు పొందుకుంటారు యేసును నమ్మినందుకు. ఇరాన్ ఇరాక్ సిరియాలోని క్రైస్తవులను అది ఆశ్చర్య పరుస్తుంది, అక్కడ ముస్లీములు దేవుని కుమారుని నమ్మితే తలలు నరికి వేస్తారు. క్రీస్తు మధ్యాకాశములోనికి రాకముందు అమెరికాకు పేదరికము, హింస మరణము ఎందుకు రావో కారణము తెలియదు. పుట్టబోయే పిల్లలను చంపే దేశానికి, దేవుని తీర్పు రాకపోతే నాకు ఆశ్చర్యమనిపిస్తుంది.

మీలో చాలామంది విడిచి పెట్టబడుతారు. క్రీస్తు పదిమంది కన్యకలు ఉపమానము చెప్పాడు. "కన్యకలు" ఈ లోకపు అవిశ్వాసులు కాదు, కాని మత పరమైన వారు. ఐదుగురు రక్షింపబడ్డారు, ఐదుగురు నశించారు. అప్పుడు పెండ్లి కుమారుడు, క్రీస్తు, వచ్చాడు. "సిద్ధముగా ఉన్న వారు ఆయనతో పాటులోనికి పెళ్ళికి వెళ్ళారు: తలుపు మూయబడింది" (మత్తయి 25:10). రక్షింపబడిన ఐదుగురు క్రీస్తును కలిసారు. మిగిలిన ఐదుగురు విడిచి పెట్టబడ్డారు. "తలుపు మూయబడింది." వారు అరిచారు, "ప్రభువా, ప్రభువా, మా కొరకు తెరవండి" (మత్తయి 25:11). కాని ప్రభువు జవాబిచ్చాడు, "మీరెవరో నేను ఎరుగను" (మత్తయి 25:12).

నీవు క్రీస్తుకు ఎందుకు తెలియవు? ఎందుకంటే ఆయనను తెలుసుకోవడానికి నీవు నిరాకరించావు కాబట్టి! నీవు ఆయనను నమ్మలేదు! క్రీస్తు రక్తము ద్వారా నీ పాపము కడుగబడలేదు. సిలువపై ఆయన మరణము ద్వారా నీ పాప ప్రాయాశ్చిత్తము జరుగలేదు. ఆయన పునరుత్థానము ద్వారా నీవు జీవితాన్ని పొందుకోలేదు. ప్రుదోమ్ గారు చదివిన వాక్యభాగములో, యేసు అన్నాడు, "నా ద్వారా తప్ప, ఎవడును తండ్రి యొద్దకు రాడు" (యోహాను 14:6). నీవును యేసును నమ్మలేదు కాబట్టి, దేవునితో ఉండలేవు. రాకడ వచ్చినప్పుడు, నీవు విడిచి పెట్టబడతావు!

II. రెండవది, మధ్యాకాశములో క్రీస్తు వచ్చిన తరువాత ఏమి జరుగుతుంది.

రాకడలో క్రీస్తు వస్తాడు మధ్యాకాశములో క్రైస్తవులు ఆయనను కలవడానికి లేపబాడతారు. క్రీస్తు తన ప్రజలను పరలోకానికి తీసుకు వెళ్తాడు. వారికి ఏమి జరుగుతుంది?

పదిమంది కన్యకల ఉపమానములో, క్రీస్తు తనను పెండ్లి కుమారునిగా చెప్పుకున్నాడు. ఆయన అన్నాడు, "పెండ్లి కుమారుడు వచ్చాడు; సిద్ధంగా ఉన్నవారు ఆయనతోపాటు పెండ్లికి వెళ్ళారు" (మత్తయి 25:10). నిజ క్రైస్తవులు క్రీస్తుకు కన్యక, వారు ఆయనను రాకడ తరువాత పరలోకములో పెళ్లి చేసుకుంటారు, గొర్రె పిల్ల వివాహములో. బైబిలు ప్రవచిస్తుంది,

"గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్నుతాను సిద్ధ పరచుకొని యున్నది. గనుక మనము సంతోషపడి ఉత్సాహించి, ఆయనను మహిమ పరచెదమని చెప్పగా వింటిని: మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములును నిర్మలములునైనా సన్నపునార బట్టలు ఆమెకియ్యబడెను. అవి పరిశుద్ధులు నీతిక్రియలు మరియు అతడు నాతో, ఈలాగు చెప్పెను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని వ్రాయుము మరియు యీ మాటలు దేవుని యదార్ధమైన మాటలని నాతో చెప్పెను" (ప్రకటన 19:7-9).

క్రీస్తు "లోక వాయులను మోసుకొని పోవు, దేవుని గొర్రెపిల్ల" (యోహాను 1:29). ఆయన భార్య అన్ని తరాల క్రైస్తవులు, "పరిశుద్ధుల నీతి"ని ధరించువారు. యేసు తన వివాహము కొరకు చాలాకాలము వేచి యున్నాడు. ఎంతమంచి సమయమిది! "దేవుని గొర్రె పిల్ల వివాహ భోజనానికి పిలువబడి వారు ఆశీర్వదింపబడినవారు."

పరలోకములో ఇంకొకటి జరుగుతుంది ప్రభువుతో పాటు క్రైస్తవులు భూమికి రాకమునుపు. అది విశ్వాసులకు తీర్పు బహుమానములను ఇచ్చుట. దీనిని "భీమా తీర్పు" అంటారు. గ్రీకు పదము "భీమా" అంటే "తీర్పు ఆశనము" అని అర్ధము. అపోస్తలుడైన పౌలు వ్రాసాడు, "మనమందరము తానూ జరిగించిన క్రియల చొప్పున [బీమా] ఉండును; అవి మంచివైనను సరే చెడ్డ వైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు, మనమందరమును క్రీస్తు న్యాయ పీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును" (II కొరిందీయులకు 5:10).

ఇది రక్షింపబడకుండ చనిపోయిన వారికి ఆఖరి తీర్పు కాదు, అవిశ్వాసులు వారి పాపాలకు తీర్పు తీర్చబడి అగ్ని గుండములోనికి పంప బడుతారు. ఇది క్రైస్తవులకు వారు భూమి మీద చేసిన దానికి తీర్పు. ఇది క్రైస్తవులకు మాత్రమే, బైబిలు చెప్తుంది, "వేయబడినది తప్పు మరియొక పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది యేసు క్రీస్తే" (I కొరిందీయులకు 3:11). క్రీస్తు పునాది లేకుండా, నీవు నశించి నరకానికి వెళ్తావు. కాని నీవు క్రీస్తును కలిగి యుంటే, నీవు ఆయన కొరకు చేసిన దానిని బట్టి తీర్పు తీర్చబడతావు. బైబిలు చెప్తుంది, "ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి కొయ్యకాలతో, కట్టిన యెడల; ప్రతి ఒక్కరి క్రియల ప్రకారం తయారుచేయబడును: వారిని నిర్ణయిస్తారు" (I కొరిందీయులకు 3:12-13). ఒకవేళ క్రైస్తవుడు "బంగారం, వెండి, వెల గల రాళ్ళు... అతనికి బహుమానము ఇవ్వబడును" (I కొరిందీయులకు 3:12,14). కాని నీవు "చెక్కతో, కొయ్యకాలుతో, గడ్డితో," సమయాన్ని దుర్వినియోగ పరిస్తే నీ "పని కాల్చబడుతుంది" నీకు ఆయన రాజ్యములో బహుమానము ఉండదు (I కొరిందీయులకు 3:15).

క్రీస్తు ఏ బహుమనమాలిస్తాడు, ఎందుకిస్తాడు? యేసు నిన్ను మర్చిపోలేదు. నీవు ఆయన నమ్మకస్తుడైన సేవకుడవైతే, నీకు ఆయన రాజ్యంలో పెద్ద స్థానము ఇవ్వబడుతుంది. ఆయన నీతో అంటాడు, "భళా, నమ్మకమైన మంచి దాసుడా; నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను: నీ యజమానిని సంతోషములో పాలు పొందును" (మత్తయి 25:21, 23). ఒకనితో ఆయన అంటాడు, "నీవు...ఐదు పట్టణముల మీద ఉండుము" (లూకా 19:19). మరొకరు అన్నారు, "మీకు పది పట్టణాల మీద ఉండును" (లూకా 19:17). నమ్మకస్తుడైన క్రైస్తవులు క్రీస్తుతో పాటు వెయ్యి ఏండ్ల పరిపాలనలో ఆయన రాజ్యములో భూమిని ఏలుతారు.

క్రైస్తవులు వారి శ్రమను బట్టి బహుమానము పొందుతారు. బైబిలు చెప్తుంది, "సహించిన వారమైతే, ఆయనతో కూడ ఏలుదుము" (II తిమోతి 2:12). యేసు కొరకు హత సాక్షులైన వారు బహుమానము పొందుతారు. క్రీస్తు అన్నాడు, "మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము నిచ్చెదను" (ప్రకటన 2:10).

ఆత్మలు సంపాదించే క్రైస్తవులకు బహుమానాలు ఉంటాయి. బైబిలు చెప్తుంది, "బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించేదరు; నీతి మార్గమును అనుసరించి నడుచుకొనునట్లు ఎవడు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలే నిరంతరమును ప్రకాశించెదరు" (దానియేలు 12:3). నీతి వైపు తిప్పడం అంటే ఏమిటి? ఎందుకు, క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించాలి!

క్రీస్తును కలవడానికి నీవు పరలోకమునకు వెళ్ళినప్పుడు, నీకు ఎలాంటి కారు ఉంది, ఎంత డబ్బు ఉంది, ఎన్నిసార్లు ప్రయాణాలు చేసావు ఇవి లెక్కలోనికి రావు. కాని నీవు ఆత్మలను సంపాదించావా లేదా! నీతోపాటు పరలోకానికి తీసుకు వెళ్ళేవి నీవు క్రీస్తు కొరకు సంపాదించిన ఆత్మలు! ఆత్మలను సంపాదించడములో నిమగ్నమవ్వాలి! సువార్తీకరణ నుండి పేర్లు తీసుకొనిరావాలి! సువార్త వినడానికి ప్రజలను తీసుకురావాలి! ఆత్మల సంపాదన కిరీటాన్ని క్రీస్తు మీకు ఇచ్చును గాక!

కాని నీవు మార్పు నొందకపోతే, ఈ తీర్పులో నీవు ఉండవు. నీవు క్రీస్తును నమ్మవు, ఆయన నీ పాప ప్రాయాశ్చిత్తము కొరకు చనిపోయాడు. నీవు క్రీస్తును నమ్మవు, ఆయన నీ పాపాలు కడగడానికి ఆయన రక్తాన్ని ఇచ్చాడు. కనుక నీవు భూమి మీద విడిచి పెట్టబడదువు మాహా శ్రమలలో కాలడం నొప్పి రక్తము మరణములో శ్రమ పడడానికి. నీవు చనిపోయినప్పుడు, నరకానికి వెళ్తావు. ఆఖరి తీర్పులో, అగ్ని గుండములో పడ వేయబడతావు. అదే నీకు జరుగుతుంది.

III. మూడవది, క్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఏమి జరుగుతుంది.

మొదటిగా, యేసు మధ్యాకాశములోనికి వస్తాడు తనతో పాటు క్రైస్తవులను పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి. తరువాత ఆయన నేరుగా క్రైస్తవులతో పాటు భూమి మీదకు వస్తాడు ఆయన రాజ్యమును స్థాపించడానికి. ఒలీవల కొండనుండి క్రీస్తు ఆరోహనుడయ్యాడు, అది యేరూష లేము తూర్పు భాగాన ఉంది. ఆయన ఆరోహణమగుట శిష్యులు చూచినప్పుడు, ఇద్దరు దేవదూతలు వారితో అన్నాడు,

"మీ వద్దనుండి పరలోకమునకు చేర్చుకొనబడిన, ఈ యేసే, ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి" (అపోస్తలుల కార్యములు 1:11).

యేసు ఒలీవల కొండనుండి పైకి వెళ్ళాడు, అలాగే ఆయన భౌతికంగా, ఒలీవల కొండపైకి దిగి వస్తాడు – క్రైస్తవులు ఆయనతో పాటు వస్తారు. బైబిలు చెప్తుంది, "ఆయన పాదములు ఆ దినమున ఒలీవల కొండపై మోపబడును... నా ప్రభువైన దేవుడు వచ్చును, పరిశుద్ధులందరు వచ్చెదరు" (జెకర్యా 14:4-5). రాకడలో, క్రీస్తు మధ్యాకాశములో, క్రైస్తవుల కొరకు వస్తాడు. తరువాత ఆయన క్రైస్తవులతో పాటు, భూమి పైకి వస్తాడు. ఇవి రెండవ రాకడలో రెండు భాగాలు. ఆయన భూమి మీదికి వచ్చినప్పుడు, క్రీస్తు ఆయన రాజ్యమును స్థాపించి వెయ్యి ఏండ్లు పరిపాలిస్తాడు. బైబిలు చెప్తుంది క్రైస్తవులు "క్రీస్తుతో పాటు జీవించి వెయ్యి ఏండ్లు పరిపాలిస్తారు" (ప్రకటన 20:4).

కాని నీవు మార్పు నొందకపొతే, ఇందులో ఏదీ నీకు ఉండదు ! అంతా కోల్పోతావు. నీకు ఏమి జరుగుతుంది? తీర్పు, బాధ, హింస, మరియు అగ్ని! రాకడలో నీవు విడిచి పెట్టబడతావు. దేవుని ఉగ్రత నీపై క్రుమ్మరింప బడుతుంది. గొప్ప శ్రమల కాలములో శ్రమ వెంబడి శ్రమ పొందుతావు. చనిపోయినప్పుడు నీవు నరకంలో పడవేయబడతావు "అగ్నిలో...చిత్ర హింసలు పొందుతావు" (లూకా 16:24). ఆఖరి తీర్పులో, నరకము నుండి లాగబడి, దేవుని గ్రంధము లోనుండి చదవబడు నీ పాపాలు బలవంతంగా వింటావు. తరువాత నీవు "అగ్ని గుండము"లో వేయబడుతావు నిరంతరమూ కాలిపోవడానికి" (ప్రకటన 20:15).

నీవు మార్పు నొందక పోతే, రాకడ ఉండదు, బహుమానాలుండవు, పరలోక ముండదు, నీకు రాజ్యము ఉండదు! క్రీస్తును నమ్మడాన్ని తిరస్కరించావు. ఆయన మరణము ద్వారా నీకు పాప పరిహారము జరగలేదు. ఆయన రక్తము ద్వారా నీ పాపాలు కడగ బడలేదు! కనుక నీవు తప్పకుండా నీయొక్క నిమిత్తము నీ పాపము నిమిత్తము శ్రమను అనుభవించాలి. నీకు "పాపాలకు అర్పణ ఉండదు" (హెబ్రీయులకు 10:26), కాని "తీర్పు కొరకు భయంతో కూడిన చూపు ఉంటుంది" (హెబ్రీయులకు 10:27). తీర్పు! అగ్ని గుండము! నీ కొరకు, నీ కొరకు, నీ కొరకు! ఓ, అలా జరగకూడదు. యేసు నామములో, ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఎబెల్ ప్రుదోమ్: యోహాను 14:1-6.
ప్రసంగము ముందు పాట కుమారి జూలీ సివిలే చే:
"ఈలాంటి సమయాలలో" (రూత్ కాయ్ జోన్స్ చే, 1902-1972).
“In Times Like These” (Ruth Caye Jones, 1902-1972).


ద అవుట్ లైన్ ఆఫ్

గర్భ స్రావము మరియు క్రీస్తు రెండవ రాకడ!

ABORTION AND THE SECOND COMING OF CHRIST!

డాక్టర్ సి.ఎల్. కాగన్ గారిచే
by Dr. C. L. Cagan

"నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు: లేని యెడల, మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధ పరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్లి మీకు స్థలము సిద్ధ పరచిన యెడల, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి, నా యెద్ద ఉండును; నా యొద్ద నుండుటకు, మిమ్మును తీసుకొని పోవుదును" (యోహాను 14:2-3).

(యేహెజ్కేలు 36:24; 37:12)

I. మొదటిది, క్రీస్తు మధ్య ఆకాశంలోనికి వచ్చునప్పుడు ఏమి జరుగుతుంది, I దెస్సలోనీకయులకు 4:16-17; I కొరిందీయులకు 15:51-52; మత్తయి 24:36; మత్తయి 25:10, 11, 12;
యోహాను 14:6.

II. రెండవది, మధ్యాకాశములో క్రీస్తు వచ్చిన తరువాత ఏమి జరుగుతుంది, మత్తయి 25:10; ప్రకటన 19:7-9; యోహాను 1:29; II కొరిందీయులకు 5:10; I కొరిందీయులకు 3:11-15;
మత్తయి 25:21, 23; లూకా 19:19, 17; II తిమోతి 2:12; ప్రకటన 2:10; దానియేలు 12:3.

III. మూడవది, క్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఏమి జరుగుతుంది, అపోస్తలుల కార్యములు 1:11; జెకర్యా 14:4-5; ప్రకటన 20:4; లూకా 16:24; ప్రకటన 20:15; హెబ్రీయులకు 10:26, 27.