Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
అంతమునకు సూచనలు – నవీకరించబడింది విస్తరించబడింది

SIGNS OF THE END – UPDATED AND EXPANDED
(Telugu)

డాక్టర్ ఆర్.ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

సంస్కరణ ఉదయము బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము, జనవరి 3, 2016
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord's Day Morning, January 3, 2016

"యేసు దేవాలయము నుండి, బయలుదేరి వెళ్ళుచుండగా: ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడము ఆయనకు చూపింప వచ్చిరి. అందుకాయన, మీరు ఇవన్నియు చూచుచున్నారు గదా? రాతి మీద రాయి యొకటియైనను, ఇక్కడ నిలిచి యుండకుండా పడ ద్రోయబడునని, మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి యున్నప్పుడు, శిష్యులాయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, చెప్పండి, ఇవి ఎప్పుడు జరుగును, అని అడిగెను? నీ రాకడను ఈ యుగ సమాప్తికిని సూచనలేవి, మాతో చెప్పమనిరి?" (మత్తయి 24:1-3).


దయచేసి ఇచ్చట మీ బైబిలు తెరచి ఉంచండి. ఈ పాఠ్యభాగమును "ఆలివేట్ ఉపన్యాసము" అని పిలుస్తారు. ఒలీవల కొండ మీద క్రీస్తు ఈ ప్రసంగము చేసాడు. క్రీస్తు తన శిష్యులతో యేరూషలేములోని దేవాలయము కూల్చబడుతుందని చెప్పాడు. వారన్నారు, "ఇవి ఎప్పుడు జరుగును?" ఈ ప్రశ్నకు జవాబు మత్తయి 24 లో వ్రాయబడలేదు. క్రీస్తు జవాబిచ్చాడు, ఆయన జవాబు లూకా సువార్తలో వ్రాయబడి ఉంది,

"వారు కత్తి చేత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్య జనుల మధ్యకు పోవుదురు: అన్యజనుల కాలములు సంపూర్ణ మగు వరకు, యేరూష లేము అన్య జనుల చేత త్రొక్కబడును" (లూకా 21:24).

"వారు కత్తి చేత కూలుదురు." ఈ ప్రవచనము యేరూష లేమును గూర్చి 70 ఎ.డి.లో రోమా జనరల్ చే ఇవ్వబడింది – క్రీస్తు ఊహించినట్లు 40 సంవత్సరాల తరువాత జరిగింది. అప్పుడు "[వారు] చెర పట్టబడి వారి అన్య జనుల మధ్యకు పోవుదురు." డాక్టర్ హెన్రీ యం. మోరిస్ అన్నాడు, "ఈ అద్భుత ప్రవచనము ఒక శతాబ్ధము ముందు చెప్పబడింది ఎ.డి. 135 లో నెరవేరింది" – అప్పుడు యేరూష లేము పూర్తిగా ఎ.డి. 135 లో హేడ్రీయన్ సైన్యముచే చెరపట్టబడింది, యూదా ప్రజలు ప్రపంచపు పలు దేశాలకు చెదరిపోయారు (see Henry M. Morris, Ph.D., The Defender’s Study Bible, World Publishers, 1995, p. 1122; note on Luke 21:20, 24).

అలా వారు అడిగిన మొదటి ప్రశ్నకు క్రీస్తు జవాబిచ్చాడు, "ఇవి ఎప్పుడు జరుగును?" దేవాలయము 70 ఎ.డి.లో నాశనము చేయబడుతుంది. 135 ఎ.డి.లో యూదా ప్రజలు ప్రపంచపు పలు దేశాలకు చెదిరిపోతారు.

వారు రెండవ ప్రశ్న అడిగారు, "నీ రాకడకు, ఈ యుగ సమాప్తికి సూచనలేమీ?" "ప్రపంచము" నకు గ్రీకు అనువాదము "ఆయోన్" దాని అర్ధము. అనగా "కాలము" – మనము జీవించు "కాలము", క్రైస్తవ కాలము, ప్రస్తుతపు మినహాయింపు. నేను ఒప్పింపబడ్డాను యుగంతమునకు దగ్గరలో మనము జీవిస్తున్నాము. చివరి దినాలలో జీవిస్తున్నాము – మనకు తెలిసినట్టు ప్రపంచపు అంతము సమీపంలో.

యుగాంతము సూచనల విషయంలో మూడు ప్రధాన లోపాలు ఉన్నాయి. మొదటిలోపము తేది ఏర్పాటు. ఎవరైనా తేదీ నిర్ణయిస్తున్నారు అని వింటే, వారు తప్పనిసరిగా తప్పు. క్రీస్తు అన్నాడు,

"ఆ దినమున గూర్చియు ఆ గడియను గూర్చియు, తండ్రి తప్ప, ఏమనష్యుడైనను, పరలోక మందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగుడు. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్ధన చేయుడి: ఆ కాలమెప్పుడు వచ్చునో మీకు తెలియదు" (మార్కు 13:32,33).

రెండవ లోపము సూచనలన్నింటిని గతంలోనికి నెట్టివేయడం. దీనిని "ప్రవచనాల నమ్మిక" అది పిలుస్తారు. చాలామంది ఆధునిక కాల్వినిస్టూలు అలా చేస్తారు. కాని వారు తప్పు. మీరు చేయవలసినది మత్తయి 24:14 చూడడం. మీరు చదివితే వారు తప్పు అని తెలుస్తుంది. సూచనలన్నీ చాలాకాలము క్రితమే జరిగి ఉంటే, క్రైస్తవ చరిత్ర ప్రారంభంలోనే, అప్పుడు వచనము 14 నిజము కాదు!

"మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్ధమై లోకమంతట ప్రకటింప బడును; అప్పుడు అంతము వచ్చును" (మత్తయి 24:14).

శిష్యులు సువార్తను రోమా సమ్రాజ్యమంతా విస్తరింప చేసారు. కాని వారు సువార్తను "సాక్ష్యార్ధమై సకల జనులకు బోధించలేదు" – వారు తప్పకుండా సువార్తను ఉత్తర మరియు దక్షిణ అమెరికాలో, జపాన్ లో, ఆస్ట్రేలియాలో, సముద్ర దీవులలో, ఇంకా పలుచోట్ల బోధించలేదు. వారు తప్పకుండా సువార్తను "సాక్ష్యార్ధముగా ప్రపంచ పలు దేశాలలో" బోధించలేదు. అది మన కాలములోనే నెరవేరుతుంది. "తరువాత అంతము వచ్చును." సువార్త ఇప్పుడు ప్రపంచమంతా వ్యాపిస్తుంది – చరిత్రలో తొలిసారిగా. ఉదాహరణకు, ప్రపంచములోని మారుమూల ప్రాంతాలలోని వారు నా ప్రసంగాలను అంతర్జాలములో 33 భాషలలో చదువుతున్నారు. రేడియో ద్వారా, టివి సేటిలైట్ ద్వారా, తరంగముల ద్వారా, వేలకొలది మిసేనరీల ద్వారా, ఈ ప్రవచనము ఇప్పుడు నెరవేరుతుంది. "తరువాత అంతము వచ్చును." అలా, ముందుగానే ప్రవచన నెరవేర్పు నమ్మేవారు తప్ప!

మూడవ లోపము సూచనలన్నిటిని భవిష్యత్తులోనికి నెట్టివేయడం, ఏడూ సంవత్సరాల శ్రమల కాలమునకు. చాలామంది ఆధునిక మినహాయింపు వారు అలా చేస్తారు. ప్రాముఖ్యమైన సూచనను నిర్లక్ష్యము చేస్తున్నారు సూచనలన్నీ ఏడూ సంవత్సరాల శ్రమల కాలమునకు నెట్టడం ద్వారా. క్రీస్తు నోవాహు దినములను ఒక సూచనగా ఇచ్చాడు. ఆయన అన్నాడు, "[నోవాహు] దినముల వలే, మనష్యు కుమారుని రాకడయు ఉండును" (మత్తయి 24:37). మీరు గొప్ప వేదాంతి కానవసరము లేదు తెలుసుకోవడానికి "నోవాహు దినములు" ఏడూ సంవత్సరాల కంటే బాగా ఎక్కువని! బైబిలు చెప్తుంది నోవాహు దినములు 120 సంవత్సరాలని (ఆదికాండము 6:3). హానోకు తీర్పును గూర్చి ముందుగానే వారించాడు (యూదా 14, 15). నేను ఒప్పింపబడ్డాను ప్రపంచము ఆఖరి దినాల వైపు కదలడం ఆరంభమైనదని మేల్కొలుపు దినాలలో 18 వ శతాబ్దములో (1730-1790). పంతొమ్మిదవ శతాబ్దములో ఆఖరి దినాల బోధ బైబిలు, విమర్శల ద్వారా, ఫిన్నీయిజం ద్వారా, డార్వినిజం ద్వారా ఎక్కువైంది. ఆఖరి దినాల సూచనలు ఇంకా ఎక్కువగా కనిపిస్తున్నాయి I ప్రపంచ యుద్ధము ప్రారంభమయింది.

కనుక, ఈ యుగాంతము అకస్మాత్తుగా "పైకిరాదు" మనపై! సాతాను చాలాకాలము నుండి వంటకము చేస్తుంది. ఇప్పుడు కూడా మరగడానికి సిద్ధంగా ఉంది ప్రపంచ వ్యాప్త స్వధర్మానిక ఆఖరి దినాల సంక్రమణకు. లినార్డ్ రెవెన్ హిల్ చెప్పినట్టు, "ఇవి ఆఖరి దినాలు!"

శిష్యులు ఆయన రాకడను గూర్చి ఒక సూచన అడిగారు "[యుగ] సమాప్తి యందు," కానీ క్రీస్తు వారికి చాల సూచనలు ఇచ్చాడు. క్రీస్తు ఇచ్చిన అనేక సూచనలు అపోస్తలులు ఇచ్చినవి, మూడు వర్గాలుగా పట్టిక ఇస్తున్నాను.

I. మొదటిది, సంఘాలలో సూచనలున్నాయి.

ఇది యేసు ఇచ్చిన మొదటి సూచన, మత్తయి 24:4-5 లో,

"యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోస పరచకుండా చూచుకోండి. అనేకులు నా పేరిట వచ్చి, నేనే, క్రీస్తునని చెప్పెను; పలువురిని మోస పరచెను" (మత్తయి 24:4-5).

ఇది ప్రాధమికంగా దెయ్యాలను సూచిస్తుంది, వారు క్రీస్తు వలే చూపించు కుంటారు. అపోస్తలుడైన పౌలు హెచ్చరించాడు "మేము బోధింపని, మరియొక యేసును గూర్చి" (II కొరిందీయులకు 11:4). అపోస్తలుడు ఇంకా అన్నాడు,

"అయితే కడవరి దినములలో కొందరు అబద్ధీకుల వేషదారణ వలన, మోస పరచు ఆత్మలయందును, దయ్యముల బోధ యుండును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టుల గుదురని ఆత్మా తేటగా చెప్పుచున్నాడు" (I తిమోతి 4:1).

ఈ రోజు యోగా శాస్త్రము యొక్క "క్రీస్తు ఆత్మ" చాలా సంఘాలలో బోధింపబడుచున్నది. ఈ యోగా క్రీస్తు ఒక ఆత్మ, నిజ శరీరము ఎముకల లేఖన క్రీస్తు కాదు. బైబిలు చెప్తుంది, "ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు" (I యోహాను 4:3). అన్ని ఆధునిక తర్జుమాలలో, కేజేవి (KJV) మాత్రమూ దానిని సరిగా తర్జుమా చేస్తుంది. గ్రీకు పదము "ఎలెలు తోట." అది పరిపూర్ణ కాలములో ఉంది, అది క్రీస్తు ప్రస్తుతపు స్థితిని సూచిస్తుంది (cf. Jamieson, Fausset and Brown). కేజేవి (KJV) సరిగ్గా అనువదించినట్టుగా, "క్రీస్తు శరీరధారియై వచ్చియున్నాడు." ఆయన శరీరముగా వచ్చి, శరీరములోనే ఉండి, శరీరము ఎముకలతో పునరుత్థానుడయ్యాడు. ఆయన మృతులలో నుండి లేచినప్పుడు, యేసు అన్నాడు, "ఆత్మకు శరీరము ఎముకలు ఉండవు, నాకున్నది చూడండి" (లూకా 24:39). ఆయన ఇంకను పునరుత్థాన శరీరములో మాంసము ఎముకల కలిగియున్నాడు – పరలోకములో. బైబిలు చెప్తుంది, "యేసు నిన్న, నేడు, నిరంతరమూ ఏకరీతిగా ఉన్నాడు" (హెబ్రీయులకు 13:8). కనుక, ఈనాటి ఆత్మ క్రీస్తు ఒక దెయ్యము, "మోస పరచు ఆత్మ." (I తిమోతి 4:1)! మన బాప్టిస్టు సంఘాలలో కూడ చాలామంది అనుకుంటారు క్రీస్తు ఒక ఆత్మ అని. అలా, వారు నిజ క్రీస్తు కాక దెయ్యాన్ని నమ్ముతున్నారు! డాక్టర్ మెకల్ హర్టన్ తన గొప్ప పుస్తకము క్రీస్తులేని క్రైస్తవ్యములో యోగా ఆత్మ క్రీస్తును గూర్చిన మాట్లాడాడు, (బేకర్ బుక్స్, 2008). సంపాదించుకొని చదవండి!

మళ్ళీ, క్రీస్తు అన్నాడు,

"అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి, సాధ్యమైతే ఏర్పరచబడినవి; వారిని సహితము మోసపరచుటకై, గొప్ప సూచక క్రియలను, మహాత్కర్యములను కనుపరచెదరు" (మత్తయి 24:24).

అపోస్తలుడైన పౌలు గద్దించాడు,

"ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశాలకు అనుకూలమైనవి; బోధకులను తమ కొరకు పోగు చేసుకొని, సత్యమునకు చెవి; ఇయ్యాక కల్పనా కథల వైపునకు, తిరుగు కాలము వచ్చును" (II తిమోతి 4:3-4).

నేను ఒప్పింపబడ్డాను మనము స్వధర్మ ఆరంభ దశలో ఉన్నాము, "పడిపోవుట" అపోస్తలుడైన పౌలు II దెస్సలోనీకయులకు 2:3 లో ఊహించాడు.

అప్పుడు, కూడ, క్రీస్తు చెప్పాడు,

"అక్రమము విస్తరించుట చేత, అనేకుల ప్రేమ [చల్లారును]" (మత్తయి 24:12).

క్రీస్తు ఊహించాడు సంఘాలలో నీతిమత్వము నశించి "దైవిక" ప్రేమ సంఘస్తుల మధ్య చల్లారుతుంది. చాలా సంఘాల ఆదివారము రాత్రులు మూయబడ్డాయి ఎందుకంటే నిజ సహవాసము క్రైస్తవ ప్రేమ గతానివి. ఆదిమ సంఘాలలో జరిగినట్టు సంఘస్తులు కలిసి ఉండి ప్రేమించుకోరు (సిఎఫ్. అపోస్తలుల కార్యములు 2:46-47). యేసు, ఇంకా ఊహించాడు ఆఖరి దినాలలో ప్రార్ధనలు తగ్గిపోతాయి (సిఎఫ్. లూకా 18:1-8). ఈనాడు చాలా తక్కువ ప్రార్ధన కూటాలున్నాయి. బుధవారము రాత్రి ఆరాధన (ఉండి ఉంటే!) ప్రార్ధన కూటము నుండి బైబిలు పఠనానికి మార్చబడింది, రెండు ఒకటి సామాన్య ప్రార్ధనలతో. నిజంగా . ఇది యుగంతానికి . సూచన! "మనుష్య కుమారుడు వచ్చునప్పుడు, ఆయన విశ్వాసము కనుగొనును [విశ్వాసముతో నిత్యమూ ప్రార్ధించుట] భూమి మీద?" (లూకా 18:8). కాని, గుర్తుంచుకోండి, యేసు అన్నాడు,

"ఇవి జరగనారంభించినప్పుడు, మీరు ధైర్యము తెచ్చుకొని, మీ తలలు ఎత్తుకొనుడి; మీ విడుదల సమీపించుచున్నదనేను" (లూకా 21:28).

3 వ పాట, రెండవ చరణము పాడదాం!

అంధకార రాత్రి, పాపము మనకు వ్యతిరేకంగా విజ్రుంభించింది;
   మనం చాలా విచారపు భారాన్ని మోస్తున్నాం;
కాని ఇప్పుడు మనము ఆయన రాకడ సూచనలు చూస్తున్నాం;
   మన హృదయాలు మనలో వెలుగుతున్నాయి, ఆనందపు గిన్నె పొంగి పొరలుతుంది!
ఆయన మళ్ళీ వస్తున్నాడు, ఆయన మళ్ళీ వస్తున్నాడు,
   ఆ యేసే, మనష్యులచే తృణీకరింపబడినవారు;
ఆయన మళ్ళీ వస్తున్నాడు, ఆయన మళ్ళీ వస్తున్నాడు,
   శక్తితో గొప్ప మహిమతో, ఆయన మళ్ళీ వస్తున్నాడు!
("ఆయన మళ్ళీ వస్తున్నాడు" మాచెల్ జాన్ స్టన్ కెంప్ చే, 1871-1937).
(“He Is Coming Again” by Mabel Johnston Camp, 1871-1937).

II. రెండవది, హింసింపబడే సూచనలున్నాయి.

యేసు అన్నాడు,

"అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి, చంపెదరు: మీరు నానామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి, యొకని నొకడు అప్పగించి, యొకని నొకడు ద్వేశింతురు" (మత్తయి 24:9-10).

మళ్ళీ యేసు చెప్పాడు,

"నానామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు: అంతము వరకు సహించిన వాడే, రక్షణ పొందును" (మార్కు 13:13).

ఇప్పుడు ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో భయంకర హింస జరుగుతుంది. అది చదవడానికి www.persecution.com ఇక్కడ క్లిక్ చెయ్యండి. పాశ్చాత్య ప్రపంచంలో నిజ క్రైస్తవులకు వ్యతిరేకంగా ఒత్తిడి జరుగుతుంది. నమ్మకస్తులైన కాపరులు సంఘ విభజనకు కారకులైన వారిచే దాడి చేయబడుచున్నారు. తల్లిదండ్రులు స్వంత పిల్లలను క్రైస్తవులయినందుకు హింసిస్తున్నారు. నిజ క్రైస్తవులైన ముసలి క్రైస్తవులపై కొందరు చేసేది దిగ్భాంతి కలిగిస్తుంది! చాలామంది ఇప్పుడు బంధింపబడి, ఒంటరిగా ఉంచబడి, స్వంత క్రైస్తవేతర పిల్లలు దర్శించడం లేదు. చాలామంది కాపరులు నాతో చెప్పారు అమెరికాలోని క్రైస్తవులు ఇంకా గొప్ప హింసలు అనుభవిస్తారని. కాని గుర్తుంచుకోండి, యేసు అన్నాడు,

"మనష్యు కుమారుని నిమిత్తము, మనష్యులు మిమ్మును ద్వేశించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేయునప్పుడు, మీరు ధన్యులు. ఆ దినమందు, మీరు సంతోషించి గంతులు వేయుడి: ఇదిగో, మీ ఫలము, పరలోక మందు గొప్పదైయుండును: వారి పితురుల ప్రవక్తలను అదే విధంగా చేసిరి" (లూకా 6:22:23).

నేను అతీతమవుతున్నాననుకుంటే, ఫాక్స్ వార్తలు ఇచ్చిన నివేదిక వినండి ప్రేంక్ లిన్ గ్రేహం ను గూర్చి కొన్ని రోజుల క్రిందట. ప్రాంక్ లిన్ గ్రాహం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సువార్తికుడు బిల్లీ గ్రేహం కుమారుడు. ప్రాక్సు వార్తలు చెప్పాయి,

సువార్తకుడు ప్రాంక్ లిన్ గ్రాహం వ్యంగ పరచబడ్డాడు, జివోపి (GOP) వదిలేసాడు

ఫాక్స్ వార్తలు, డిసెంబర్ 22, 2015

http://www.foxnews.com/politics/2015/12/22/evangelist-franklin-graham-slams-quits-gop.html?intcmp=hppop

సువార్తికుడు ప్రాంక్ లిన్ గ్రాహం ప్రకటించాడు మంగళవారం రిపబ్లికన్ పార్టీని వదిలి పెట్టుచున్నట్టు జివోపికి పైగా గతవారము, బిల్లు ఆమోదింప బడింది "వ్యర్ధము" అని పిలిచి ప్రణాళిక బద్ధ పిత్రుత్వానికి ధన సహాయం నాజి ఏకాగ్రత స్థావరాలకు బదులుగా.

గ్రాహం చెప్పాడు,

"గతవారము వ్యర్ధమైన బిల్లు ఆమోదు చెయ్యడం రిపబ్లికన్ లకు డేమోక్రేటు లకు సిగ్గుచేటు," అతనన్నాడు, "పైగా పధక, పితృత్వానికి ధన సహాయము!"

గ్రాహం, ముందు రెండు రాజకీయ పార్టీపై విరుచుకు పడ్డాడు, అతని నిస్పృహ ఫేస్ బుక్ లో కూడ ప్రవహించింది.

"చూడడం వినడం పధక పితృత్వం మాట్లాడుతుంది స్రావమైన పిండం భాగాలు అమ్మడం మానవ జీవనానికి వ్యతిరేకం [డాక్టర్] జోసెఫ్ మెంగేలే మరియు నాజి ఏకాగ్రత కాంపులు!," అతడు వ్రాసాడు. "కావలసినంతా అదే నిధులను ఆపేయడానికి. ఈ 2,000 పేజీ, $1.1 ట్రిల్లియన్ బడ్జెట్ పూడ్వడానికి ఏమి జరగలేదు."

గ్రాహం, వైట్ హౌస్ జివోపికి మద్దతు పలికాడు డోనాల్డ్ ట్రంప్ వివాదాస్పద పిలుపును సమర్ధించాడు అమెరికా నుండి ముస్లీములను నిషేదించడం విషయంలో., రాజకీయ వ్యవస్థలో నమ్మకము కోల్పోయినట్టు చెప్పాడు.

"నాకు రిపబ్లికన్ పార్టీ, డెమోక్ర టిక్ పార్టీ, లేక టీ పార్టీలో నిరీక్షణ లేదు అని అమెరికాకు శ్రేష్టమైనవి ఏమి చెయ్యలేదు," అని వ్రాసాడు.

ఓవ్! ఏమి ప్రకటన, ఒక సువార్తిక నాయకుని నుండి! మళ్ళీ పాడండి – పాట సంఖ్య 3 – రెండవ చరణము!

అంధకార రాత్రి, పాపము మనకు వ్యతిరేకంగా విజ్రుంభించింది;
   మనం చాలా విచారపు భారాన్ని మోస్తున్నాం;
కాని ఇప్పుడు మనము ఆయన రాకడ సూచనలు చూస్తున్నాం;
   మన హృదయాలు మనలో వెలుగుతున్నాయి, ఆనందపు గిన్నె పొంగి పొరలుతుంది!
ఆయన మళ్ళీ వస్తున్నాడు, ఆయన మళ్ళీ వస్తున్నాడు,
   ఆ యేసే, మనష్యులచే తృణీకరింపబడినవారు;
ఆయన మళ్ళీ వస్తున్నాడు, ఆయన మళ్ళీ వస్తున్నాడు,
   శక్తితో గొప్ప మహిమతో, ఆయన మళ్ళీ వస్తున్నాడు!

III. మూడవది, ప్రపంచ వ్యాప్త సువర్తీకరణ సూచన ఉంది.

గమనించండి ఎంత వింతగా ఈ ప్రోత్సహించే సూచన అకస్మాత్తుగా దర్శన మిచ్చింది, ఈ భయంకర సూచనల మధ్యలో,

"అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి, చంపెదరు: మీరు నానామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింప బడుదురు. అనేకులు అభ్యంతర పడి, యొకని నొకడు అప్పగించి, యొకని నొకడు ద్వేశింతురు. అనేకులైన అబద్ద ప్రవక్తలు వచ్చి, పలువురిని మోస పరచెదురు. అక్రమము విస్తరించుట చేత, అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడెవడో, వాడే రక్షింప బడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్ధమై లోక మంతటను ప్రకటింపబడును; అటు తరువాత అంతము వచ్చును" (మత్తయి 24:9-14).

"రాజ్య సువార్త" అసలు "సువార్త" మార్కు 13:10 లో, చెప్పబడింది, "సకల జనులకు సువార్త ముందుగా [ప్రకటింపబడవలెను]." స్వధర్మత హింసల మధ్య అకస్మాత్తుగా, క్రీస్తు అన్నాడు ప్రపంచమంతటా సువార్త ప్రకటింప బడును, "తరువాత అంతము వచ్చును"( మత్తయి 24: 14).

ఏమి ప్రవచనము! ప్రపంచములో ఇంకా కొన్ని ప్రదేశాలు ఉన్నాయి అక్కడకు సువార్త వినబడదు. అంతర్జాలము ద్వారా, రేడియో ద్వారా, తరంగాల ద్వారా, శాటిలైట్ టెలివిజన్ ద్వారా, వేలకొలది మిస్సేనరీల ద్వారా – ఈ ఉదయము సువార్త ప్రపంచమంతటా వ్యాపిస్తుంది. మత్తయి 24:11-14 ఈ తరములో నెరవేరుతుంది! ఎంత వింత, పాశ్చాత్య దేశాలలో సంఘాలు ప్రార్ధనా కూటాలు మూసేస్తున్నారు సాయంత్రము ఆరాధనా ఆపేస్తున్నారు, ఈ మూడవ ప్రపంచములో సువార్త విస్తోటము చోటు చేసుకోవాలి – చైనాలో, దక్షిణ ఆసియా, ఆఫ్రికాలో చాలా దేశాలు, ఇతర ప్రజలు, ఇండియాలోని అంటరానివారు! స్వధర్మము మరియు ఉజ్జీవము – ఒకేసారి జరుగుతున్నాయి – యేసు ఊహించినట్టే! ఎంత విలువైన విపరీతత! అయినను ఇదే జరుగుతుంది, యేసు క్రీస్తు ఊహించినట్టే!

"అనేకులైన అబద్ద ప్రవక్తలు వచ్చి, పలువురిని మోస పరచెదరు. అక్రమము విస్తరించుట చేత, అనేకుల పేర్లు చల్లారును. అంతము వరకు సహించిన వాడే, రక్షింపబడును. మరియు రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్ధమై లోకమంతట ప్రకటింపబడును; అటు తరువాత అంతము వచ్చును" (మత్తయి 24:11-14).

హల్లెలూయా! యేసు వస్తున్నాడో! మళ్ళీ పాడండి!

అంధకార రాత్రి, పాపము మనకు వ్యతిరేకంగా విజ్రుంభించింది;
   మనం చాలా విచారపు భారాన్ని మోస్తున్నాం;
కాని ఇప్పుడు మనము ఆయన రాకడ సూచనలు చూస్తున్నాం;
   మన హృదయాలు మనలో వెలుగుతున్నాయి, ఆనందపు గిన్నె పొంగి పొరలుతుంది!
ఆయన మళ్ళీ వస్తున్నాడు, ఆయన మళ్ళీ వస్తున్నాడు,
   ఆ యేసే, మనష్యులచే తృణీకరింపబడినవారు;
ఆయన మళ్ళీ వస్తున్నాడు, ఆయన మళ్ళీ వస్తున్నాడు,
   శక్తితో గొప్ప మహిమతో, ఆయన మళ్ళీ వస్తున్నాడు!

నీకు క్రీస్తు తెలుసా? ఆయన వచ్చే సరికి నీవు సిద్ధంగా ఉంటావా? నీవు మార్పు నొందావా? "తిరిగి సమర్పించుకొనుట" నీకు సహాయ పడదు నీవు నశిస్తే. ఒకరోజు వారు క్రీస్తు నొద్దకు వస్తారు, తప్పిపోయిన కుమారుని వలే. కాని బైబిలు చెప్పలేదు తప్పిపోయిన కుమారుడు ఒకప్పుడు రక్షింప బడి, వెనుదిరిగి, తిరిగి తన జీవితాన్ని తిరిగి సమర్పించుకున్నాడని. లేదు! బైబిలు తేటగా చెప్తుంది అతడు నశించాడని! ఆయన తండ్రే అది చెప్పాడు!

"ఈ నాకుమారుడు చనిపోయి, మరల బ్రతికెను; తప్పిపోయి, దొరికెను" (లూకా 15:24).

నీవు నశించావని ఒప్పుకొని క్రీస్తు నొద్దకు రావాలి! తప్పోపోయినట్టు గ్రహించకపోతే యేసు నొద్దకు రాలేరు, ఆయనను నమ్మలేదు, నిజ మార్పును అనుభవించలేరు, క్రీస్తు రక్తము ద్వారా కడుగ బడలేదు, క్రీస్తు పునరుత్థానము ద్వారా పునరుద్దరింపబడలేరు. నీవు తెలుసుకోవాలి తప్పిపోయిన నీవు రక్షింప బడేముందు!

ఓ దేవా, మేము ప్రార్ధిస్తున్నాము కొందరు వినుచున్న, ఈ ప్రసంగము వినుచున్నవారు, పాపపు ఒప్పుకోలు కలిగి మీ కుమారుడైన యేసు క్రీస్తును నమ్మేటట్లు చేయండి. ఆమెన్. క్లిక్ చెయ్యండి చదవడానికి "కృపకు పధ్ధతి" గొప్ప సువార్తికుడు జార్జి వైట్ ఫీల్డ్ చే (1714-1770).

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము అబెల్ ప్రుదోమ్: మార్కు 13:1-13.
ప్రసంగము ముందు పాట బెంజమిన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్:
"మనమంతా సిద్ధమని నేను ఆశిస్తున్నాను" (లారీ నార్మన్ చే, 1947-2008).
“I Wish We’d All Been Ready” (by Larry Norman, 1947-2008).


ద అవుట్ లైన్ ఆఫ్

అంతమునకు సూచనలు – నవీకరించబడింది విస్తరించబడింది

SIGNS OF THE END –UPDATED AND EXPANDED

డాక్టర్ ఆర్.ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

"యేసు దేవాలయము నుండి, బయలుదేరి వెళ్ళుచుండగా: ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడము ఆయనకు చూపింప వచ్చిరి. అందుకాయన, మీరు ఇవన్నియు చూచుచున్నారు గదా? రాతి మీద రాయి యొకటియైనను, ఇక్కడ నిలిచి యుండకుండా పడ ద్రోయబడునని, మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి యున్నప్పుడు, శిష్యులాయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, చెప్పండి, ఇవి ఎప్పుడు జరుగును, అని అడిగెను? నీ రాకడను ఈ యుగ సమాప్తికిని సూచనలేవి, మాతో చెప్పమనిరి?" (మత్తయి 24:1-3).

(లూకా 21:24; మార్కు 13:32, 33; మత్తయి 24:14, 37)

I.    మొదటిది, సంఘాలలో సూచనలున్నాయి, మత్తయి 24:4-5; II కొరిందీయులకు 11:4;
I తిమోతి 4:1; I యోహాను 4:3; లూకా 24:39; హెబ్రీయులకు 13:8;
I తిమోతి 4:1; మత్తయి 24:24; II తిమోతి 4:3-4; II దెస్సలోనీకయులకు 2:3;
మత్తయి 24:12; అపోస్తలుల కార్యములకు 2:46-47; లూకా 18:1-8; 21:28.

II.   రెండవది, హింసింపబడే సూచనలున్నాయి, మత్తయి 24:9-10; మార్కు 13:13;
లూకా 6:22-23.

III.  మూడవది, ప్రపంచ వ్యాప్త సువర్తీకరణ సూచన ఉంది, మత్తయి 24:9-14;
మార్కు 13:10; లూకా 15:24.