Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
యోసేపు మరియు యేసు

(ఆదికాండముపై #86 వ ప్రసంగము)
JOSEPH AND JESUS
(SERMON #86 ON THE BOOK OF GENESIS)
(Telugu)

డాక్టర్ ఆర్.ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

సంస్కరణ సాయంత్రము బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము, డిసెంబర్ 6, 2015
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord's Day Evening, December 6, 2015

"అయితే దేవుడు, అతని సంతానము అన్యదేశమందు పరవాసుల గురురనియు; ఆ దేశస్థులు నాలుగు వందల సంవత్సరాల మట్టుకు వారని దాస్యమునకు లోపరుచుకొని, బాధ పెట్టుదురనియు చెప్పెను. మరియు దేవుడు ఏ జనమునకు వారు దాసులై యుందురో, ఆ జనమును నేను విమర్శ చేయుదుననియు: ఆ తరువాత వారు వచ్చి, ఈ చోట నన్ను సేవించురని చెప్పెను. మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతనికి అనుగ్రహించెను: అతడు ఇస్సాకును కని, ఆ నిబంధన చొప్పున ఎనిమిదవ దినమందు అతనికి సున్నతి చేసెను; ఇస్సాకు యోకోబును; యాకోబు పన్నిద్దరు గోత్ర కర్తలను కని వారికి సున్నతి చేసిరి. ఆగోత్ర కర్తలు, మత్సరపడి, యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మి వేసిరి: గాని దేవుడతనికి తోడైయుంది, అతని శ్రమలన్నిటిలోనుండి తప్పించి, దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో యెదుట అతనికి అనుగ్రహించినందున; ఫరో ఐగుప్తునకున తన ఇంటికి అంతటికిని అతనిని అధిపతిగా నియమించెను. తరువాత ఐగుప్తు దేశమంతటికిని, కరువును బహుశ్రమయు వచ్చెను: గనుక మన పితరులకు ఆహారము లేకపోయెను. ఐగుప్తులో ధ్యానము కలదని యాకోబు విని, మన పితరులను అక్కడికి మొదటిసారి పంపెను. వారు రెండవ సారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తన్ను తెలియ చేసికొనెను; అప్పుడు యాసేపు యొక్క వంశము ఫరోకు తెలియవచ్చును. యోసేపు, తన తండ్రియైన యాకోబును, తన స్వజనుల నందరిని పిలువనంపెను, వారు డెబ్బది ఐదుగురు" (అపోస్తలుల కార్యములు 7:6-14).


యోసేపు పేరుతో ఉన్న ఇద్దరు బైబిలులో ప్రముఖులు. నూతన నిబంధనలోని యేసును పెంచిన తండ్రి యోసేపు, ఆయన దేవుని అద్వితీయ కుమారుడు. పాత నిబంధనలోని యోకోబు కుమారుడైన యోసేపు. ఈ సాయంకాలము నేను పాత నిబంధనలోని యోసేపును గూర్చి మాట్లాడుతాను. ఆదికాండములోని చెప్పబడిన ఏడుగురు గొప్ప భక్తులలో యోసేపు ఒకరు. ఆ ఏడుగురు ఆదాము, హేబెలు, నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మరియు యోసేపు. ఆదికాండములో ఎక్కువ అధ్యాయాలు మిగిలిన అందరికంటే ఎక్కువగా యోసేపును గూర్చి చెప్పాయి. ఆర్ధర్ డబ్ల్యూ. పింక్ అన్నాడు,

యోసేపు జీవితము హెబ్రీయుల యొక్క విశిష్ట [ఎదుగుదల] ను గూర్చి వివరించండి వారు సంచరించే కొద్దిమంది పశువుల కాపరులుగా ఉండేవారు వారు ఐగుప్తులో [పెద్ద] నివాస స్థలముగా మారారు. సందేహము లేదు [ప్రముఖ] కారణము యోసేపు జీవితము అంత పూర్ణతతో వివరించ బడినదంటే [అతని జీవితము]లోని ప్రతీ అంశము క్రీస్తుతో సంబంధము కలిగి ఉంది...[యోసేపు] చరిత్రకు క్రీస్తు చరిత్రకు ఆ వివరణలో నుండి వంద విషయాలను మనము గ్రహించుకోవచ్చు! (Arthur W. Pink, Gleanings in Genesis, Moody Press, 1981 reprint, pp. 342, 343).

యోసేపు తేటగా ఒక విధమైన, రాబోవుచున్న క్రీస్తు యొక్క చిత్రపటము. కొందరన్నారు నూతన నిబంధన గ్రంధములో యోసేపు వ్యతిరేక అంశాలు లేవు అని. ఆదికాండము 37:2 పై స్కోఫీల్ద్ బైబిలు గమనిక ఏమి చెప్తుందంటే "ఎక్కడా సూచించబడలేదు యోసేపు క్రీస్తు లాంటి వాడని." అది తప్పు. నూతన నిబంధన గ్రంథములోని నాలుగు సువార్తలు చూపిస్తున్నాయి యోసేపు జీవితము చాలా విధాలుగా ఒక విధమైనదని, యేసు క్రీస్తు ప్రభువు విరుద్ధమైనదని, నెరవేర్పు విధానమని. స్కోఫీల్ద్ గమనిక ఇంకా ఇలా చెప్పింది, "వివరణలు చాలా ఎక్కువగా ఉన్నాయి అనుకోకుండా అలా జరిగింది అని చెప్పలేము." అర్ధర్ డబ్ల్యూ. పింక్ "వంద విషయాల వివరణ" ఇచ్చాడు – యోసేపు మరియు దేవుని కుమారుడైన యేసుకు మధ్య పోలికలను గూర్చి. ఈ ప్రసంగములో ఆ 100 వివరణలను తప్పకుండా ఇవ్వలేను. కాని వాటిలో అతి ప్రాముఖ్యమైన వాటిని మీకు ఇస్తాను.

1. మొదటిది, యోసేపు పుట్టుక మరియు యేసు పుట్టుక రెండు అద్భుతాలే.

యోసేపు తల్లి, యాకోబు భార్యయైన రాహేలు. ఆమెకు బిడ్డ కలుగలేదు. భర్తకు మోర పెట్టింది, "నాకు గర్భఫలము నిమ్ము, లేని యెడల నేను చచ్చెదను" (ఆదికాండము 30:1). అతడు ఆమెను గద్దించి అన్నాడు, "దేవునికి ప్రతిగా ఉన్నానా?" – దేవుని స్థానములో ఉన్నాను, ఆయన నీకు పిల్లలను ఇవ్వలేదు? కాని చాలా సంవత్సరాల తరువాత, మనం చదువుతాం, "దేవుడు రాహేలు జ్ఞాపకము చేసుకొని, ఆమె మనవి విని, ఆమె గర్భము తెరచెను. అప్పుడామె గర్భవతియై, కుమారుని కని...అతనికి యోసేపు అని పేరు పెట్టెను" (ఆదికాండము 30:22-24). డాక్టర్ జె. వెర్నోన్ మెక్ గీ అన్నాడు, "యోసేపు పుట్టుక అద్భుతము అది ప్రార్ధనకు జవాబుగా దేవుని ప్రమేయముతో జరిగినది. ప్రభువైన యేసు కన్యకకు పుట్టాడు. ఆయన పుట్టుక తప్పకుండా అద్భుతమే!" (Thru the Bible, Thomas Nelson Publishers, 1981, vol. 1, p. 150). The angel said to the Virgin Mary,

"దూత పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును: గనుక పుట్టబోవు శిశువు పరిశుద్దుడై దేవుని కుమారుడన బడును" (లూకా 1:35).

2. రెండవది, యోసేపు యేసు ఇద్దరు వారి తండ్రులు ప్రేమకు ప్రత్యేక నిదర్శనాలు.

ఆదికాండము 37:3 చెప్తుంది, "యోసేపు [యాకోబు] వృద్ధాప్యము నందు పుట్టిన కుమారుడు, కనుక తన కుమారులందరి కంటే ఎక్కువగా అతని ప్రేమించెను." యేసు బాప్తిస్మము పొందినప్పుడు, ఆయన నీళ్ళలో నుండి బయటికి వస్తున్నప్పుడు దేవుని స్వరము ఇలా పలికింది, "ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను" (మత్తయి 3:17).

3. మూడవది, యోసేపు యేసు ఇద్దరు వారి ఈ లోకపు పరిచర్యను ముప్ఫైవ సంవత్సరములో ప్రారంభించారు.

ఆదికాండము 41:46 చెప్తుంది, "యోసేపు ఐగుప్తు రాజైన ఫరో యెదుట నిలిచినప్పుడు ముప్పది సంవత్సరాల వయసు వాడు." అప్పుడే యోసేపు అతని జీవితపు ముఖ్య పని ప్రారంభించాడు. కొత్త నిబంధన గ్రంధము చెప్తుంది, "యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు దాదాపు ముప్ఫై సంవత్సరాల వాడు" అప్పుడు ముఖ్య పనిని ప్రారంభించాడు (లూకా 3:23).

4. నాల్గవది, యోసేపు యేసు ఇద్దరు వారి సహోదరులచే అసహ్యింప బడ్డారు.

ఆదికాండము 37:8 లో మనకు చెప్పబడింది,

"అందుకతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మునేలుదువా? మా మీద నీవు అధికారివగుదువా? అని అతనితో చెప్పి అతని కళలను బట్టియు మాటలను బట్టియు, అతని మీద మరింత పగ పట్టిరి " (ఆదికాండము 37:8).

యోసేపు సహోదరులు అతని అసహ్యించుకున్నారు ఎందుకంటే వారి తండ్రి అతనిని ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి, "అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు, వారు అతని మీద పగబట్టి, అతని క్షేమ సమాచారము అడగలేకపోయిరి" (ఆదికాండము 37:4). వారు యోసేపును అసహ్యించుకొని అన్నారు, "నీవు మమ్మును నిజంగా ఏలుదువా?" (ఆదికాండము 37:8). నూతన నిబంధన గ్రంధములో, యేసు అన్నాడు, "అతని పట్టణస్తులతనిని ద్వేషించి, యితడు మమ్ము నేలుట మా కిష్టము లేదని, అతని వెనుక రాదు, భారము పంపిరి" (లూకా 19:14). యేసు అన్నాడు, "నన్ను నిర్హేతుకముగా ద్వేశించిరి" (యోహాను 15:25). డాక్టర్ జె. వెర్నోన్ మెక్ గీ అన్నాడు, "యోసేపు తన సహోదరులను సమీపిస్తున్నప్పుడు, వారు తనకు వ్యతిరేకంగా పన్నాగము పన్నుతున్నారు. అతడు చిత్ర విచిత్రమైన రంగుల వస్త్రాన్ని ధరించాడు...అది స్థితికి గుర్తు. మనము గుర్తుంచుకోవాలి యోసేపు తన సహోదరుల కంటే చిన్నవాడు కాని అధికారంలో వారిపై ఉన్నాడు. అందుకు అసహ్యత అసూయ వచ్చాయి – చంపే వరకు తీసుకెళ్ళాయి!" (McGee, ibid.; note on Genesis 37:18-20).

5. ఐదవది, యోసేపు యేసు ఇద్దరు వారి సహోదరులచే కుట్ర పన్నబడ్డారు.

ఆదికాండము 37:18 చెప్తుంది,

"వారు అతని [యోసేపు]ను దూరము నుండి చూచి...చంపుటకు దురాలోచన చేసిరి."

నూతన నిబంధన గ్రంధములో మనం చదువుతాం,

"ఆ సమయాన ప్రధాన యాజకులను, ప్రజలు పెద్దలను, కయప అను ప్రధాన యాజకుని, మందిరములోనికి కూడి వచ్చి, యేసును మాయోపాయము చేత పట్టుకొని, చూపవలేనని మేకమై, చంపుటకు ఆలోచన చేసిరి" (మత్తయి 26:3, 4).

6. ఆరవది, యోసేపు యేసు ఇద్దరు ఎక్కువ వెండి నాణెములకు అమ్మబడ్డారు.

యోసేపు అన్నలు అతనిని గోతిలో పడేసారు. అరబు వ్యాపారులు అటు వెళ్తున్నప్పుడు, "ఇశ్రాయెలీయులకు ఇరవై వెండి నాణెములకు అమ్మేసారు" (ఆదికాండము 37:28).

యూదా యేసును అప్పగించినప్పుడు, అతడు ప్రధాన యాజకులు యొద్దకు వెళ్లి, "[యేసును] మీకు అప్పగించిన యెడల, నాకెమిత్తురని, వారిని అడిగెను? అందుకు వారు ముప్పది వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి" (మత్తయి 26:15).

7. ఏడవది, యోసేపు యేసు ఇద్దరు రక్తపు వస్త్రాలు కలిగియున్నారు.

యోసేపు సహోదరులు తనను అరబ్బులకు అమ్మినప్పుడు "వారు యోసేపు అంగీని తీసుకొని, ఒక మేక పిల్లను చంపి, దాని రక్తములో ఆ అంగీ ముంచిరి" (ఆదికాండము 37:31). వారు యేసు ప్రభువు వస్త్రము తీసుకొని ఆయన సిలువపై మరణిస్తున్నప్పుడు ఆ వస్త్రముతో జూదమాడారు.

"సైనికులు, యేసును సిలువ వేసిన తరువాత, ఆయన వస్త్రములు తీసుకొని, ఒక్కొక్క సైనికునికి, ఒక్కొక్క భాగము వచ్చునట్టు వాటిని నాలుగు భాగములు చేసిరి; ఆయన అంగీని కూడ తీసుకొని: ఆ అంగీ కుట్టు లేక, పైనుండి యావత్తు వేయబడినది" (యోహాను 19:23).

8. ఎనిమిదవది, యోసేపు యేసు ఇద్దరు చాలా కాలము వరకు వారి సహోదరుల నుండి వేరు చేయబడ్డారు.

డాక్టర్ మెక్ గీ అన్నాడు,

"యోసేపు ఐగుప్తునకు అమ్మబడినప్పుడు, చాలా సంవత్సరాలు ఆయన కనిపించలేదు. యేసు ఆకాశమునకు ఆరోహాణుడయ్యాడు. యేసు ఆయన శిష్యులతో చెప్పాడు ఆయన తిరిగి వచ్చే వరకు తిరిగి వారు ఆయనను చూడరు అని చెప్పారు" – ఆయన రెండవ రాకడ యందు.

9. తొమ్మిదవది, యోసేపు యేసు ఇద్దరు చీకటిలోనికి వెళ్లి పోయారు.

యోసేపు ఐగుప్తుకు ఒక బానిసగా అమ్మబడ్డాడు, అది ఒక విధమైన చీకటి మరియు మరణము. యేసు మృత దేహము ఒక సమాధిలో చీకటిలో ఉంచబడింది. డాక్టర్ యం. ఆర్. డిహాన్ అన్నాడు, "యోసేపు వస్త్రహీనుడై చనిపోవడానికి గోతిలో వేయబడ్డాడు, కాని సజీవంగా ఆ స్థలము నుండి బయటికి వచ్చాడు" – యేసు ఈస్తరు ఆదివారము ఉదయము సమాధిలో నుండి లేచినట్టు (యం. ఆర్. డిహాన్, యం. డి. ఆదికాండము లో క్రీస్తు ప్రస్తావన, జోండేర్వాన్ పబ్లిషింగ్ హౌస్, 1966, పేజి 171). డేవిడ్ అన్నాడు, "నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు; నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు" (కీర్తనలు 16:10). అపోస్తలుడైన పేతురు, అపోస్తలుల కార్యములు 2:31 లో, క్రీస్తును గూర్చి ఇలా చెప్పాడు. ఈ విధంగా, యోసేపు యేసు ఇద్దరు చీకటిలోనికి వెళ్లి, మృతులలో నుండి, సజీవులుగా బయటికి వచ్చారు.

10. పదవది, యోసేపు యేసు ఇద్దరు లోక రక్షకులయ్యారు.

యోసేపు 20 వెండి నాణెములకు అరబ్బులకు అమ్మబడి ఐగుప్తునకు పంపబడ్డాడు. ఐగుప్తులో అతని మరియు యేసు యొక్క విధానము చాల గొప్పదయింది. డాక్టర్ డిహాన్ అన్నాడు,

"యోసేపు...ఐగుప్తుకు పంపబడ్డాడు [అది లోక చిత్రము. అతడు] సేవకుడయ్యాడు [యేసు వలే]. అతడు ఫోతీఫరు భార్యచే తప్పుగా నిందింప బడి చెరసాలలో వేయబడ్డాడు. అతడు సమర్ధించుకోలేదు, చెరసాలలో అతిక్రమములు చేసిన వారితో ఒకనిగా ఎంచబడ్డాడు [సిలువపై, యేసు చేయబడినట్టు]. తిరస్కరణతో చెరసాలలో ఉన్నప్పుడు, అతడు రాజు పాన దాయకునికి రక్షకుడయ్యాడు రాజు భక్ష్య కారునికి తీర్పరి అయ్యాడు [యేసుతో సిలువ వేయబడిన ఇద్దరు దొంగలు సూచింపబడుతున్నారు]. పానదాయకుడు విడిపింపబడ్డాడు, [తరువాత] అతడు యోసేపు పేరును రాజుకు చెప్తాడు, అతనికి వచ్చిన భయంకరమైన కళను గూర్చి. యోసేపు పిలువబడి మరియు ఫరో యొక్క కలకు భంగం కలిగించాడు [‘చూడండి, మర్మముతో మందంతటను బహు సమృద్ధిగా పంటపండు ఏడూ సంవత్సరాలు వచ్చుచున్నవి: మరియు కరువు గల ఏడు సంవత్సరాల తరువాత...అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరువబడును,’ ఆదికాండము 41:29, 30]. యోసేపు ఉన్నతముగా హెచ్చింపబడ్డాడు" (డిహాన్, ఐబిఐడి., పేజి 171).

యోసేపు మీద ఫరోకు చాల ఇష్ట మయింది తనను అన్నాడు "దేవుని ఆత్మ ఇతనిలో ఉన్నది" (ఆదికాండము 41:38). తరువాత ఫరో యోసేపును తన ప్రధాన మంత్రిగా చేసాడు, ఫరో తరువాత రెండవ వ్యక్తి అతడే. ఏడు సమృద్ధి సంవత్సరాలలో ఐగుప్తు ప్రజలు ఆహారము దాచునట్లు యోసేపు చేసాడు. తరువాత ఏడు కరువు సంవత్సరాలు ప్రారంభమయ్యాయి.

"ఐగుప్తు దేశమంతటను కరువు వచ్చినప్పుడు, ఆ దేశస్థులు ఆహారము కొరకు ఫరోతో మోర పెట్టుకొనిరి: అప్పుడు ఫరో మీరు యోసేపు నొద్దకు వెళ్లి, అతడు మీతో చెప్పునట్లు చేయుడని; ఐగుప్తీయులందరితో, చెప్పెను. కరువు ఆ దేశమంతటను ఉండినందున: యోసేపు కోట్లన్నియు విప్పించి, ఐగుప్తీయులకు ధాన్య మమ్ముకము చేసెను; ఐగుప్తు దేశమందు ఆ కరువు భారముగా ఉండెను. మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున; సమస్త దేశస్థులు యోసేపు నొద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి" (ఆదికాండము 41:55-57).

అలా యోసేపు లోకానికి రక్షకుడయ్యాడు. డాక్టర్ మెక్ గీ అన్నాడు, "నేను వాస్తవానికి మీ దృష్టి సారించమంటున్నాను యోసేపు దగ్గర మాత్రమే రొట్టె ఉంది. ఇక్కడ ఇంకొక సమాంతరము ఉంది. యేసు క్రీస్తు అన్నాడు, ‘నేను జీవాహరమును: నా దగ్గరకు వచ్చువాడు ఎన్నడు ఆకలిగొనడు’" (యోహాను 6:35), మెక్ గీ, ఐబిఐడి., పేజి 168; గమనిక ఆదికాండము 41:54, 55.

"మరియు ఆ కరువు ప్రతి దేశమందు [ధాన్యము] భారమైనందున; సమస్త దేశస్థులు యోసేపు నొద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి" (ఆదికాండము 41:57).

లోక ప్రజలు ఆహారము కొరకు యోసేపు దగ్గరకు వచ్చారు. యేసు అన్నాడు ఆయన జీవాహరమని – "నా దగ్గరకు వచ్చువాడు ఎన్నడు ఆకలిగొనడు." లోక ప్రజలంతా ఆహారము కొరకు యోసేపు దగ్గరకు వచ్చినట్టు, రక్షింప బడడానికి మీరు యేసు నొద్దకు రావాలి. యోసేపు లోకమంతట ఉన్న, ఆయన దగ్గరకు వచ్చిన వారిని రక్షించాడు. యేసు లోకమంతట ఉన్నవారు విశ్వాసముతో ఆయన దగ్గరకు వచ్చిన వారిని రక్షిస్తాడు.

ఐగుప్తులో ఆహరమున్నదని యోసేపు సహోదరులు విన్నారు. వారికి కావలసినది కనుక్కోవడానికి వారు యోసేపు దగ్గరకు వెళ్ళారు. యోసేపు తన సహోదరులను గుర్తు పట్టాడు, కాని వారు అతనిని గుర్తు పట్టలేదు. యోసేపు చాల కాలముగా ఐగుప్తులో ఉంటున్నాడు. ఐగుప్తీయుని వలే వస్త్రాలు ధరించాడు. వారు అతనిని గుర్తు పట్టలేదు. వారు రెండవ సారి వచ్చినప్పుడు, యోసేపు తనను వారికి బయలు పరచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు.

ఇప్పుడు మీరు ఆదికాండము 45:1 చూడండి. యోసేపు ఇప్పుడు తన సహోదరులతో ఒంటరిగా ఉన్నాడు వారు తనను చంపదలచి, గోతిలో పడవేసి, ఐగుప్తులో బానిసగా అమ్మివేసారు. ఇప్పుడు వారు అతని ముందు నిలువబడ్డారు, అతడు ఐగుప్తు ప్రధాన మంత్రి. వారికి అతనెవరో తెలియదు, కాని వారు అతనికి తెలుసు. నేను ఆదికాండము 45 వ అధ్యాయము మొదటి ఐదు వచనాలు చదువుతున్నాను. ఇది బైబిలు అంతటిలో చాలా భావో ద్రేకాలతో కూడిన పాఠ్యభాగము. నాతో పాటు చూడండి.

"అప్పుడు యోసేపు తన వద్ద నిలిచిన వారందరి ఎదుట; తన్ను తానూ అణచు కొనజాలక, నా యొద్ద నుండి ప్రతి మనష్యుని వెలుపలికి పంపి వేయుడని బిగ్గరగా చెప్పెను. యోసేపు తన సహోదరులకు తన్ను తానూ తెలియ చేసికొనినప్పుడు, ఎవరును అతని యొద్ద నిలిచి యుండలేదు. అతడు ఎరుగెత్తి ఎడవగా: ఐగుప్తీయులను ఫరో ఇంటివారును వినిరి. అప్పుడు యోసేపు, నేను యోసేపును; నా తండ్రి ఇంకా బ్రతికి యున్నాడా? అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి; అతనికి ఉత్తరము ఇయ్యలేక పోయిరి. అంతటా యోసేపు, నా దగ్గరకు రండని, తన సహోదరులతో చెప్పెను. వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడతడు, ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన, మీ సహోదరుడైన యోసేపును నేనే. అయినను నేనిక్కడికి వచ్చునట్లు, మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖ పడకుడి, అది మీకు సంతాపము పుట్టింప నియ్యకుడి: ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను" (ఆదికాండము 45:1-5).

దయచేసి, చూడండి. డాక్టర్ మెక్ గీ వ్యాఖ్యానాలు వినండి,

[యోసేపు] ఎలుగెత్తి ఏడవ ప్రారంభించాడు. యోసేపుకు తప్ప ఎవరికీ తెలియదు. ఆ సమయంలో తన స్వంత సహోదరులకు కూడ తెలియదు...ప్రభువైన యేసు క్రీస్తు తన సహోదరులైన యూదులకు, తన్ను బయలు పరుచుకొనే దినము వస్తుంది. ఆయన మొదటిసారి వచ్చినప్పుడు, "ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను, తన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు" (యోహాను 1:11). వాస్తవానికి, వారు సిలువవేయడానికి అతనిని అప్పగించారు. కాని ఆయన రెండవసారి వచ్చేటప్పుడు, ఆయన తన స్వంత వారికి బయలు పరుచుకొంటాడు. "నీ చేతులకు గాయము లేదని, వారడుగగా? వాడు ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా, నాకు కలిగిన గాయములని చెప్పును" (జెకర్యా 13:6). క్రీస్తే తన సహోదరులకు బయలు పరచుకొంటాడు. "ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకు యోరూషలేము నివాసుల కొరకును ఊట యొకటి తియ్యబడెను" (జెకర్యా 13:1). యేసు ప్రభువుకు ఆయన సహోదరులకు మధ్య ఇది కుటుంబ వ్యవహారము. యోసేపు తన సహోదరులకు తన బయలు పరచుకొను వృత్తాంతము మనకు చిన్న [సూచన] ఇస్తుంది క్రీస్తు బయలు పరచుకొనే ఆ దినము ఎంత అద్భుతంగా ఉంటుదో (McGee, ibid., p. 179; note on Genesis 45:1, 2).

నేను యాభై సంవత్సరాలకు పైగా ప్రవచనత్మక లేఖనాలు చదువుతున్నాను. బైబిలు తేటగా బోధిస్తుంది లోకమంతటా ఉన్న యూదులు ఆ అద్భుతమైన రక్షణ పొందుతారని. దయచేసి రోమా 11:25, 26 చూడండి.

సహోదరులారా, మీ దృష్టికి, మీరే బుద్ధి మంతులమని అనుకొన కుండునట్లు, ఈ మర్మము మీరు తెలుసుకోవాలి; అదేమనగా అన్య జనుల ప్రవేశము సంపూర్ణ మగువరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను, వారు ప్రవేశించునప్పుడు విమోచకుడు సీయోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తీ హీనతను తొలగించును. ఇశ్రాయేలు జనులందరూను రక్షింపబడుదురు: నేను వారి పాపములను పరిహరించినప్పుడు, నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని, వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూను రక్షింపబడుదురు" (రోమా 11:25, 26).

ఇది ఒక మర్మము (మస్టేరియాన్), మనం అర్ధం చేసుకోలేనిది, "ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను – పూర్తిగా [పూర్తీ సంఖ్య] అన్యజనులు [యూదులు కాని క్రైస్తవులు] లోనికి వచ్చు వరకు. కనుక ఇశ్రాయేలు జనులందురు రక్షింపబడుదురు: వ్రాయబడినట్టుగా, [సీయోను] లోనుండి విమోచకుడు వచ్చును, యాకోబు నుండి భక్తీ హీనతను తొలగించును" (రోమా 11:25, 26).

"కనుక ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు" (రోమా 11:26). నేను ఈ మధ్య ఈ మాటలను ఒక స్వతంత్ర వేదాంత కళాశాలలో తర్పీదు పొందిన బాప్టిస్టు కాపరికి చదివి చెప్పను. అతనన్నాడు, "దాని అర్ధము అది కాదు!" నేనన్నాను, "దాని అర్ధము చెప్పలేదు. ఆ పదాలు నీ కోసం చదివాను." "కనుక ఇశ్రాయేలీయులు అందరు రక్షింపబడతారు." ఆ మాటలు వ్రాయబడినట్టుగానే ఉండనిద్దాం! యోసేపు వలే, యేసు ప్రభువు వస్తాడు, ప్రేమతో విచారముతో ఏడుస్తూ, లోతుగా ప్రేమించిన తన స్వజనులను కౌగిలించుకోడానికి, యూదులను. "కనుక ఇశ్రాయేలు జనులందరూ రక్షింప బడతారు." ఇది దేవుని వాక్యము! అది నిలువ నివ్వండి!

యేసు నశించు అన్య జనులను కూడ ప్రేమిస్తున్నాడు. యోసేపు ప్రపంచమంతటికి జీవము ఇచ్చే భోజనము సమకూర్చాడు, "అన్ని దేశముల వారును ఆహారము కొనుటకు ఐగుప్తులోని యోసేపు నొద్దకు వచ్చిరి" (ఆదికాండము 41:57). యేసు మన యోసేపు. ఆయన దగ్గరకు రండి. ఆయన ప్రశస్త రక్తములో నీ పాపాలన్నిటిని కడిగేస్తాడు. మృతులలో నుండి పునరుత్తనుడై మీకు నిత్య జీవము అనుగ్రహిస్తాడు. నేను మిమ్మును బతిమాలుతున్నాను, యేసు దగ్గరకు రండి. యేసును నమ్మండి. ఇప్పుడే ఆయనను నమ్మండి. మీ పాపముల నుండి ఆయన మిమ్ములను రక్షిస్తాడు. ఆమెన్. డాక్టర్ చాన్ గారు, ప్రార్ధనలో నడిపించండి.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రుదోమ్.
ప్రసంగము ముందు పాట బెంజమిన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్:
"యేసులో ఎంతమంచి స్నేహితుడు మనకున్నాడు" (జోసెఫ్ స్ర్కీవెన్ చే, 1819-1886).
“What a Friend We Have in Jesus” (by Joseph Scriven, 1819-1886).


ద అవుట్ లైన్ ఆఫ్

యోసేపు మరియు యేసు

(ఆదికాండముపై #86 వ ప్రసంగము)
JOSEPH AND JESUS
(SERMON #86 ON THE BOOK OF GENESIS)

డాక్టర్ ఆర్.ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

"అయితే దేవుడు, అతని సంతానము అన్యదేశమందు పరవాసుల గురురనియు; ఆ దేశస్థులు నాలుగు వందల సంవత్సరాల మట్టుకు వారని దాస్యమునకు లోపరుచుకొని, బాధ పెట్టుదురనియు చెప్పెను. మరియు దేవుడు ఏ జనమునకు వారు దాసులై యుందురో, ఆ జనమును నేను విమర్శ చేయుదుననియు: ఆ తరువాత వారు వచ్చి, ఈ చోట నన్ను సేవించురని చెప్పెను. మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతనికి అనుగ్రహించెను: అతడు ఇస్సాకును కని, ఆ నిబంధన చొప్పున ఎనిమిదవ దినమందు అతనికి సున్నతి చేసెను; ఇస్సాకు యోకోబును; యాకోబు పన్నిద్దరు గోత్ర కర్తలను కని వారికి సున్నతి చేసిరి. ఆగోత్ర కర్తలు, మత్సరపడి, యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మి వేసిరి: గాని దేవుడతనికి తోడైయుంది, అతని శ్రమలన్నిటిలోనుండి తప్పించి, దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో యెదుట అతనికి అనుగ్రహించినందున; ఫరో ఐగుప్తునకున తన ఇంటికి అంతటికిని అతనిని అధిపతిగా నియమించెను. తరువాత ఐగుప్తు దేశమంతటికిని, కరువును బహుశ్రమయు వచ్చెను: గనుక మన పితరులకు ఆహారము లేకపోయెను. ఐగుప్తులో ధ్యానము కలదని యాకోబు విని, మన పితరులను అక్కడికి మొదటిసారి పంపెను. వారు రెండవ సారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తన్ను తెలియ చేసికొనెను; అప్పుడు యాసేపు యొక్క వంశము ఫరోకు తెలియవచ్చును. యోసేపు, తన తండ్రియైన యాకోబును, తన స్వజనుల నందరిని పిలువనంపెను, వారు డెబ్బది ఐదుగురు" (అపోస్తలుల కార్యములు 7:6-14).

1    మొదటిది, యోసేపు పుట్టుక మరియు యేసు పుట్టుక రెండు అద్భుతాలే,
ఆదికాండము 30:1, 22-24; లూకా 1:35.

2    రెండవది, యోసేపు యేసు ఇద్దరు వారి తండ్రులు ప్రేమకు ప్రత్యేక నిదర్శనాలు, ఆదికాండము 37:3; మత్తయి 3:17.

3    మూడవది, యోసేపు యేసు ఇద్దరు వారి ఈ లోకపు పరిచర్యను ముప్ఫైవ సంవత్సరములో ప్రారంభించారు, ఆదికాండము 41:46; లూకా 3:23.

4    నాల్గవది, యోసేపు యేసు ఇద్దరు వారి సహోదరులచే అసహ్యింప బడ్డారు, ఆదికాండము 37:8, 4; లూకా 19:14; యోహాను 15:25.

5    ఐదవది, యోసేపు యేసు ఇద్దరు వారి సహోదరులచే కుట్ర పన్నబడ్డారు, ఆదికాండము 37:18; మత్తయి 26:3, 4.

6    ఆరవది, యోసేపు యేసు ఇద్దరు ఎక్కువ వెండి నాణెములకు అమ్మబడ్డారు, ఆదికాండము 37:28; మత్తయి 26:15.

7    ఏడవది, యోసేపు యేసు ఇద్దరు రక్తపు వస్త్రాలు కలిగియున్నారు, ఆదికాండము 37:31; యోహాను 19:23.

8    ఎనిమిదవది, యోసేపు యేసు ఇద్దరు చాలా కాలము వరకు వారి సహోదరుల నుండి వేరు చేయబడ్డారు.

9    తొమ్మిదవది, యోసేపు యేసు ఇద్దరు చీకటిలోనికి వెళ్లి పోయారు, కీర్తనలు 16:10; అపోస్తలుల కార్యములు 2:31.

10   పదవది, యోసేపు యేసు ఇద్దరు లోక రక్షకులయ్యారు, ఆదికాండము 41:29, 30, 38, 55-57; యోహాను 6:35; ఆదికాండము 45:1-5; యోహాను 1:11; జెకర్యా 13:6, 1;
రోమా 11:25, 26; ఆదికాండము 41:57.