Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




మార్గము సత్యము మరియు జీవము

THE WAY, THE TRUTH, AND THE LIFE
(Telugu)

డాక్టర్ ఆర్.ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

సంస్కరణ ఉదయము బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము, నవంబర్ 15, 2015
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord's Day Morning, November 15, 2015

"యేసు, నేను మార్గమును, సత్యమును, జీవమును: నా ద్వారానే తప్ప, ఎవడును తండ్రి వద్దకు రాడు" (యోహాను 14:6).


మనము యోహాను సువార్త 13 మరియు 14 అధ్యాయాలు చదివేటప్పుడు శిష్యులు ఎంత గుడ్డివారో మనము చూస్తాము. వారు యేసుతోపాటు మూడు సంవత్సరాలు ఉన్నప్పటికినీ వాడు గుడ్డివారుగా ఉన్నారు. వారు రోగులను స్వస్త పరిచారు దెయ్యాలను వెళ్ళగొట్టారు అయిననూ గుడ్డివారుగా ఉన్నారు. నాకు ఆశ్చర్యం కలుగ చేస్తుంది ప్రజలు నాలుగు సువార్తలు చదువుతారు ఇది చూడరు! యేసు వారికి మళ్ళీ మళ్ళీ చెప్పాడు ఆయన సిలువ వేయబడతాడని, చనిపోతాడని, మృతులలో నుండి తిరిగి లేస్తాడని.

"ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి, ఇదిగో, యేరూష లేమునకు వెళ్ళుచున్నాము, మనష్యు కుమారుని గూర్చి, ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నియు నెరవేర్చబడును. ఆయన అన్య జనుల కప్పగింప బడును, వారు ఆయనను అపహసించి, అవమాన పరిచి, ఆయన మీద ఉమ్మివేసిరి: ఆయనను కొరడాలతో కొట్టి, చంపెదరు: మూడవ దినము ఆయన మరల లేచునని చెప్పెను. ఈ మాటలలో వారు ఒకటైనను గ్రహింప లేరు: ఈ సంగతి వారికి మరుగు చేయబడెను, గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధ పడలేదు" (Luke 18:31-34; see also Matthew 12:38-42; 16:21-23; 17:22-23; 20:17-19; Mark 10:32-34).

ఆయన శిష్యులు ఈ ప్రాధమిక సత్యాన్ని గ్రహింప లేదు. "మాట్లాడబడిన విషయాలు కూడ వారికి తెలియదు." వారు సువార్తను అర్ధము చేసుకోలేదు! ఇక్కడ యేసు తన శిష్యులతో ఆఖరి బోజనము చేయడం మనం చూస్తాము. మరుసటి రోజే ఆయన సిలువ వేయబడతాడు. అయిననూ సువార్త సామాన్య సత్యాల విషయంలో ఆయన శిష్యులు గుడ్డి వారై ఉన్నారు!

భోజనము పిమ్మట యేసు వారి పాదాలు కడిగాడు. పేతురు ఆయనతో అంటాడు, "నీవు నా పాదములు కడుగనేరవు." యేసు అంటాడు, "నేను నీ పాదములు కడుగకుంటే, నాతో నీకు భాగము లేదు." పేతురు అంటాడు, "ప్రభువా, నా పాదములు మట్టుకే కాదు, నా చేతులు తల కూడా కడుగుము" (యోహాను 13: 8, 9). తగ్గింపు అవసరత వారికి అర్ధము కాలేదు (13:14-17). తరువాత యూదా యేసును అప్పగించడానికి ఇతర శిష్యుల నుండి వెళ్ళిపోతాడు (13:30). అప్పుడు పేతురు అంటాడు, "ప్రభువా, నీవు ఎక్కడికి వెళ్ళు చున్నావు?" (యోహాను 13:36). యేసు పేతురుతో అంటాడు నీవిప్పుడు, నా వెంట రాలేవు కాని తరువాత వచ్చెదవు (యోహాను 13:36). పేతురుకు తలంపులు లేవు యేసు పరలోక ఆరోహణను గూర్చి మాట్లాడుచున్నాడని. పేతురు పలుకుతాడు, "నీ కొరకు నా ప్రాణము పెట్టుదును" (యోహాను 13:37). యేసు అంటాడు, "ఎరుగనని నీవు ముమ్మారు చెప్పక ముందు, కోడి కూయదు" (యోహాను 13:38). తరువాత యేసు అన్నాడు, "నేను మీ కొరకు స్థలము సిద్ధ పరచి వెళ్ళుచున్నాను" (యోహాను 14:2). తిరిగి పరలోకానికి వెళ్లడాన్ని గూర్చి ఆయన మాట్లాడుచున్నాడని వారికి గ్రహింపు లేదు. తోమా అంటాడు, "ప్రభువా, ఎక్కడికి వెల్లుచున్నావో మాకు తెలియదు; ఆ మార్గము ఎలాగు తెలియును?" (యోహాను 14:5). నేను చెప్పినట్టు, ఈ సామాన్య సత్యాల విషయంలో యేసు శిష్యులు పూర్తిగా గుడ్డి వారుగా ఉన్నాడు. స్కోఫీల్ద్ గమనిక యోహాను 3:3 పై వారి గుడ్డి తనాన్ని గూర్చి ఇలా చెప్తుంది,

నూతన జన్మ అవసరత బయటికి వస్తుంది సహజ మానవుని అసమర్ధత నుండి "చూడడానికి" లేక దేవుని రాజ్యములోనికి "ప్రవేశింపడానికి." ఎంత తలంతు ఉన్న, నీటి ఉన్నా, మార్పు నొందినా , సహజ మానవుడు పూర్తిగా గుడ్డివారు ఆత్మీయ సత్యము విషయంలో, మరియు అసమర్ధుడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు; ఎందుకంటే అతడు విదేయుడవ లేదు, అర్ధము చేసుకోలేదు, లేక దేవుని సంతోష పెట్టలేదు.

నేను పూర్తిగా ఆ విషయంతో ఏకీభవిస్తాను. మారని మనిషి "అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వాడు" (ఎఫెస్సీయులకు 2:1). స్కోఫీల్ద్ గమనిక చెప్పినట్టు, "సహజ మానవుడు ఆత్మీయ సత్యము విషయములో పూర్తిగా గుడ్డివారు." ఇది ఇంకను శిష్యుల పరిస్థితి యేసు సిలువ వేయబడబోయే ముందు రాత్రి వరకు. వారు ఆయనను మూడు సంవత్సరాలు వెంబడించారు, అయిననూ వారు ఆత్మీయంగా చచ్చిన వారుగా ఉన్నారు! దాని కొరకు

"ప్రకృతి సంబందియైన మనష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపదు: అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి: అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును, గనుక అతడు వాటిని గ్రహింపజాలడు" (I కొరిందీయులకు 2:14).

శిష్యులు ఆత్మీయంగా మృతులుగా ఉన్నారు, మార్పులేని స్థితిలో, ఈస్టరు ఆదివారము రాత్రి ప్రభువు మృతులలో నుండి లేచి వారి దగ్గరకు వచ్చే వరకు! ఒకరన్నారు, "అది ఎక్కడ చెప్పబడింది?" ఈ భ్రష్టత్వపు రోజులలో మార్పు విషయము ఎంత గుడ్డిగా ఉన్నాము! అది చెప్తుంది నాలుగు సువార్తల ఆఖరిలో! (చూడండి యోహాను 20:19-22; లూకా 24:36-45; మొదలగునవి). చివరి దినాలలో చాలామంది బోధకులకు ఈ చిన్న విషయము కూడ తెలియక పోవడం నాకు దిగ్బ్రాంతి కలిగిస్తుంది! వారు సువార్త ప్రకటించడం లేదు ఆశ్చర్యం లేదు! సువార్త బోధిస్తున్న కాపరులను గూర్చి నేను అస్సలు వినడం లేదు! మునుపు వినేవారము. కాని ఇప్పుడు, వారిని గూర్చి వినడం లేదు అమెరికాలో! నాకనిపిస్తుంది చాల బోధకులు శిష్యులకు తోమా లాగే గుడ్డివారు, అతడన్నాడు, "నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి, నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి, నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని, నమ్మనే నమ్మననేను" (యోహాను 20:25). తోమా కూడ మిగిలిన వారిలా ఉన్నాడు. అతడు అవిశ్వాసి, రక్షింపబడని వ్యక్తీ, నశించిన మనిషి. ఈ నశించు వ్యక్తి, తోమా, యేసును అడిగాడు, "ప్రభువా, [ఎక్కడికి వెళ్ళుచున్నావో] మాకు తెలియదు ఆ మార్గము ఎలాగు తెలియును?" (యోహాను 14:5).

యేసు తోమాపై ఇతర శిష్యులపై కోప పడలేదు. తోమా పరలోకాన్ని గూర్చి అక్కడికి ఎలా వెళ్ళాలో అడిగాడు. యేసు అతనికి ఇలా జవాబిచ్చాడు,

"నేనే మార్గమును, సత్యమును, జీవమును: నా ద్వారానే తప్ప, ఎవడును తండ్రి వద్దకు రాడు" (యోహాను 14:6).

నేను మిగిలినది రోబర్ట్ ముర్రే మెక్కెనీ (1813-1843) నుండి చెప్తాను, అతడు గొప్ప స్కాటిష్ బోధకుడు అతడు తన సంఘానికి దేవుడు ఉజ్జీవము పంపడం చూసాడు, 29 సంవత్సరాలకే చనిపోవక ముందు. రోబర్ట్ మెక్కెనీ అన్నాడు, "[యోహాను 14:6] ని గూర్చి సువార్త రక్షణ పూర్తి వివరణగా, దానిలోని వివిధ అంశాలను చూద్దాము."

I. మొదటిది, క్రీస్తు దేవునికి మార్గము.

యేసు పరలోకమునకు మార్గము. విశ్లేషణ పదజాలము ఉంది, "నేనే మార్గము." దేవునికి యేసు మార్గము చూపడం మాత్రమే కాకుండా – ఆయన మాత్రమే దేవునికి మార్గము. వేరే మార్గము లేదు! యేసు మాత్రమే నిన్ను దేవుని దగ్గరకు తీసుకొని వస్తాడు!

నా పన్నెండు సంవత్సరాల వయస్సులో నా తల్లి ఆరిజోనా, ఫోనిక్స్ నుండి కెనడా టొరంటోకు, తీసుకెళ్ళింది. చికాగో స్థలానికి వచ్చినప్పుడు ఏ ప్రధాన మార్గము తీసుకోవాలని పోలీసును అడిగింది. తిరుగు మలుపు తీసుకోవాలని చెప్పాడు. అది మార్గమని చెప్పాడు. గంట దూరము వచ్చాము, కొన్ని విషయాలు నేను గమనించాను, రహదారిపై, అవి ముందు చూచినట్టుగా ఉన్నాయి. నేనన్నాను, "అమ్మా, మనం వచ్చిన దారి వైపే వెళ్తున్నాము." రహదారిని మళ్ళించి ఒక నిలిచి ఉన్న కారుని చూసింది. తల్లి అడిగింది, "చికాగో తూర్పు వైపు నుండి టొరంటో వెళ్తున్నాము. మేము సరియైన దారిలో వెళ్తున్నమా?" ఆ టాక్సీ డ్రైవర్ నోటిలో సిగరెట్టూ ఒక వైపుకు వేలాడుతుంది. అతనన్నాడు, "అమ్మా, మీరు తప్పిపోయారు! ఆ మార్గము ద్వారా వెళ్ళాలి!" మేము ఎక్కడ నుండి వచ్చామో అక్కడికే వెళ్ళ మన్నారు. కనుక చుట్టూ తిరిగి వెనక్కు వెళ్లి, మొదట ఎక్కడ బయలుదేరామో అక్కడికే వెళ్ళాము! పోలీసు మాకు తప్పు దిశ చూపించాడు! యేసు మన దగ్గరకు వచ్చే వరకు మనమంతా తప్పుడు దారిలో వెళ్తూ ఉంటాము. ప్రాచీన లోకములో ఇలా చెప్పబడింది, "దారులన్నీ రోమ్ వైపే." ఈనాటి లోకములో మనం చెప్పవచ్చు, "మార్గాలన్నీ నరకానికి తీసుకెళ్తాయి." యేసు మాత్రమే " మార్గము" దేవుని దగ్గర!

రోబర్ట్ మెక్కెనీ అన్నాడు, "యేసు దేవుని పరదైనుకు దారి కనుగొనడానికి కష్టపడుచున్న ఆదాము కుమారులపై జాలిపడి, ఆయన పరదైనును విడిచి భువికి వచ్చి పరలోకములో ఉన్న తండ్రిని చేరడానికి మార్గము తెరిచాడు. ఆయన అది ఎలా చేసాడు?...ఆయన మన స్థానములో మనిషి అయ్యాడు. ఆయన సిలువపై మన పాపములను భరించాడు. ఇప్పుడు దోషారోపణ కలిగిన పాపులు కూడ ఆయన రక్తము కారే శరీరము ద్వారా, దేవుని పరదైనులో ప్రవేశించి, నిరంతరమూ జీవింపవచ్చు. త్వరగా యేసు నొద్దకు రండి, సందేహము వద్దు; ఆయన చెప్తున్నాడు, ‘నేనే ఆ మార్గము.’"

"పాపి ప్రార్ధన" చెప్పడం ద్వారా మీరు తండ్రి నొద్దకు రానేరారు. మంచి జీవితం జీవించడం వలన కాదు. కొన్ని పాపాలు వదిలి వేయడం వలన కాదు. యేసు గూర్చి కొన్ని విషయాలు నమ్మడం వలన కూడా కాదు.

రోబర్ట్ మెక్కెనీ అన్నాడు, "ఇప్పుడు, నా స్నేహితులారా, తండ్రి దగ్గరకు రావడానికి ఇది మార్గము? క్రీస్తు అన్నాడు, ‘నేనే మార్గము... నాద్వారా తప్ప ఎవడును తండ్రు వద్దకు రాలేరు.’ తరువాత, మీ మార్గములో రావడానికి ప్రయత్నిస్తూ ఉంటే – అది స్వసంస్కరణ కావచ్చు, దేవుడు కఠినముగా ఉండదు అనుకోవడం – మీరు హెచ్చరింపబడకపోతే, తీర్పు దినాన కనుగొంటారు మీరు అగ్ని గుండములో వేయబడతారని."

క్రీస్తు నొద్దకు రావడం ద్వారా తండ్రి యొద్దకు రావాలి. రక్షింప బడడానికి వేరే మార్గము లేదు, ఎందుకంటే, "దేవునికి మనష్యునికి మధ్య వర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు" (I తిమోతి 2:5).

II. రెండవది, క్రీస్తు సత్యము.

"మారని వ్యక్తికీ సత్యము తెలుసు అని చెప్పజాలము. సందేహము లేదు చాలా సత్యాలు ఉన్నాయి అవి మారని వ్యక్తికి తెలియవు. అతనికి గణిత శాస్త్రము సత్యాలు తెలియవచ్చు – చాలా సామాన్య సత్యాలు ఎరుగావచ్చు; కాని మారని వ్యక్తికి సత్యము తెలుసు అని మాత్రమూ చెప్పలేము, ఎందుకంటే క్రీస్తే సత్యము" –ఇది రోబర్ట్ ముర్రే మెక్కెనీ చెప్పాడు.

నాకు గొప్ప చదువరులైన ఇద్దరు పినతండ్రులు కలరు. IIవ ప్రపంచ యుద్ధ సమయంలో, టెలివిజన్ ముందు, చాలామంది చాలా చదివారు. అప్పటిలో పుస్తకాలు చదవడం ప్రజలకు సర్వ సామాన్యము. కాని ఈ ఇద్దరు పినతండ్రులు ఇతరుల కంటే ఎక్కువగా చదివారు, ఇప్పటికంటే అప్పుడు పుస్తకాలు చదవడం పరిపాటి అయినప్పటికినీ.

ఒక పిన తండ్రి పేరు పోర్టర్ – రోబర్ట్ పోర్టర్ ఇల్లియట్. అందరు మధ్య పేరు పోర్టర్ అని, పిలుస్తారు. పిన తండ్రి పోర్టర్ చేతుల్లో ఎప్పుడు ఒక పుస్తకము ఉండేది. అతడు సైన్యములో ఉన్నాడు, ఇప్పుడు మరమ్మత్తు చేయువారు, శాంతా మొనికా ఒక కొట్టులో పని చేస్తున్నాడు. ఎప్పుడు చదువుతూ ఉండేవాడు. భోజన సమయంలో, పని తరువాత, టివి చూసేటపుడు కూడ, పుస్తకము చదువుతూ ఉండేవాడు. పైకి టివి వైపు చూస్తూ క్రిందకి చదివే పుస్తకము వైపు చూసేవాడు. అతడు హత్య మర్మాలు, అగాత క్రిస్టి, అలాంటివి చదివాడు. కాని అతని అభిమాన పుస్తకాలు సామాన్య శాస్త్రము శాస్త్రములో మిధ్యము. సామాన్య శాస్త్రము, సామాన్య మిధ్యముపై వందల పుస్తకాలు అతని దగ్గర ఉన్నాయి. వాస్తవ శాస్త్రమును గూర్చి సామాన్య మిధ్యమును గూర్చి, చాల ఎక్కువ ఆయనకు తెలుసు. డార్విన్ ఉత్పన్నతలో అతడు గొప్ప నమ్మకము కలిగిన వాడు. గంటల కొద్ది దాని గూర్చి మాట్లాడగలడు.

ఒక ఆదివారము ఉదయము అతడు మన గుడిలోనికి రావడం చూసి నేను చాలా ఆశ్చర్య పోయాను. గది వెనుక భాగము చాల మౌనముగా కూర్చొని నా భోధ విన్నాడు. తర్వాత వచ్చినందుకు వందనాలు చెప్పను. నా ప్రసంగము చాల ఆసక్తికరంగా ఉందని అన్నాడు. తరువాత ప్రతి ఆదివారము వచ్చాడు. చివరకు, చాల వారాల తరువాత, క్రైస్తవుడు అవడం విషయం అతనితో మాట్లాడాను. చాలా జాగ్రత్తగా విన్నాడు, అతడు యేసును విశ్వసించేటట్టుగా నడిపించగలిగాను. నేను అది నమ్మలేకపోయాను! అతడు ఎప్పుడు చల్లని, తెలివైన వ్యక్తిగా ఉండేవాడు చిన్నవానిగా అతనితో మాట్లాడడానికి భయపడేవాడిని. అతడు లావు కళ్ళద్దాలు ధరించే హాయ్ పెరీ బోగార్ట్ లా ఉండేవాడు. కాని మారిన తరువాత నవ్వుతూ పూర్తిగా మారిపోయిన వ్యక్తిగా మన యవనస్తులతో మాట్లాడేవాడు. తరువాత క్రైస్తవ పుస్తకాలను గురించి నన్ను అడగడం ప్రారంభించాడు. లావు, దళసరి, పెద్ద పుస్తకము ఉత్పన్నముకు వ్యతిరేకమైనది అతనికి ఇచ్చాను. అతడు దానిని పఠించాడు. తరువాత ఆదివారము ఇంకా పుస్తకాలు కావాలని అడిగాడు. నలభై యాభై పుస్తకాలు అతనికి ఇచ్చాను. అన్నింటిని చదివాడు, కొన్నింటిని రెండు మూడు సార్లు చదివాడు. ఇంకెప్పుడు హత్య మర్మము కాని సామాన్య మిధ్యము పుస్తకము కాని చదవలేదు. నేను అతనికి బాప్తిస్మ మిచ్చాను మన సంఘములో నమ్మకస్తుడైన సభ్యుడయ్యాడు. పినతండ్రి పోర్టర్ అంటే శ్రీమతి సాల్లీ కుక్ కు భాగా గుర్తింది. తరువాత అకస్మాత్తుగా అతడు గుండె పోటుతో మరణించాడు.

రోబర్ట్ పోర్టర్ ఇలియట్ కు ఏమి జరిగింది? ఎందుకు అతడు సామాజిక శాస్త్రము నుండి మిధ్యము నుండి ఉత్పన్నత నుండి ఎందుకు మరలాడు? అది సామాన్యము – అతడు ప్రభువైన యేసు క్రీస్తును కనుగొన్నాడు! అతనికి మిధ్యము ఇక అవసరము లేదు. అతడు సత్యాన్ని కనుగొన్నాడు – యేసు, ఆయన అన్నాడు, "నేనే మార్గము, సత్యము, జీవమును." నేను పరలోకానికి వెళ్ళినప్పుడు పినతండ్రి పోర్టర్ గురించి నేను చూస్తాను! సత్యానికి మూలమైన యేసుచే, అతడు రక్షింపబడ్డాడు!

ఇంకొక పిన తండ్రి మా అమ్మ పెద్ద అన్నయ్య, ల్లాయిడ్ వి. ఫ్లవర్స్, జూనియర్. IIవ ప్రపంచ యుద్ధ సమయం అమెరికా నేవిలో ఉన్నాడు. పోర్టర్ వలే, పినతండ్రి ల్లాయిడ్ కూడ గొప్ప చదవరి. ప్రత్యేకంగా బౌతిక శాస్త్రము తూర్పు మతము పుస్తకాలంటే ఆయనకు ఆసక్తి. ఎక్కడికి వెళ్లి నా ఇలాంటి పుస్తకము అతని దగ్గర ఉండేది. అతడు భూగర్భ తోటమాలి, కాని ఎప్పుడు పిరమిడ్లు ప్రాచీన బౌతిక శాస్త్రము, గరిష్ట మతములకు సంబంధించిన పుస్తకము ఉండేది. అతడు నా స్నేహితుడు, గంటల కొద్ది ఫిరమిద్స్ తూర్పు మతముల గురించి ఆయన చెప్పేది వినేవాడిని. బైబిలు చదివేటట్టు చెయ్యడానికి ప్రయత్నించినా, అతడు ఎప్పుడు ఆసక్తి చూపలేదు. అతడు, కూడ, అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోయాడు. కాని పోర్టర్ లా కాకుండా, పినతండ్రి ల్లాయిడ్ క్రీసు లేకుండా చనిపోయాడు. తరుచు నాతో చెప్తూ ఉండేవాడు సత్య అన్వేషణ చేస్తున్నాడని. ఎన్నటికి కనుగొన లేదు. యేసును ఎన్నడు కనుగొనలేదు, ఆయనే సర్వ సత్య సంపూర్ణుడు! విచారంగా, నేను పరలోకానికి వెళ్ళినప్పుడు పినతండ్రి ల్లాయిడ్ గూర్చి చూడను – ఎందుకంటే నాకు తెలుసు అతడు అక్కడ ఉండడని, యేసు అన్నాడు, "నేనే సత్యము... నాద్వారా తప్ప, ఎవడును తండ్రి వద్దకు రాడు" (యోహాను 14:6). పినతండ్రి ల్లాయిడ్ నరకంలో ఉన్నాడు.

ఏ పినతండ్రి మీలా ఉన్నాడు? మీరు పోర్టర్ లా ఉన్నారా, అతడు యేసు నందు సత్యాన్ని కనుగొన్నాడు? లేక ల్లాయిడ్ లా ఉన్నారా, అతడు రక్షకుని కనుగొనే లేదా?

III. మూడవది, యేసు జీవము.

రోబర్ట్ మెక్కెనీ అన్నాడు, "లేఖనము మరియు అనుభవము సాక్ష్యమిస్తున్నాయి మనము స్వాభావికంగా అత్రిక్రమము చేతను పాపముల చేతను చచ్చిన వారమని... నిజము, పాపములో చనిపోయిన వాటికి వారు చనిపోయినట్టుగా తెలియదు. అయినను పరిశుద్ధాత్మ మీ పాప భూఇష్ట, చచ్చిన స్వభావము గూర్చి, మీకు ఒప్పుకోలు కలుగ చేస్తే...దేవుని ఆజ్ఞాలన్నియు గైకొని ప్రయత్నించినట్లయితే, పాపపు తలంపులను గూర్చి ఆలోచింపకూడదని ప్రయత్నించినట్లయితే, దురాశ మరియు పాపముల నుండి మీ హృదయాన్ని మళ్ళించడానికి ప్రయత్నించినట్లయితే – ఇది ఇప్పుడైనా ప్రయత్నించినట్లయితే, అది అసాధ్యము అని మీకు అనిపించిందా? అది చనిపోయిన వ్యక్తిని లేప ప్రయత్నించినట్టుంది! ఓ, ఎంత తేటగా ఉంది నీవు మృతుడవుగా ఉన్నావు – తిరిగి జన్మించలేదని! నీవు తిరిగి జన్మించాలి. క్రీస్తుతో నీవు కలుపబడాలి, ఎందుకంటే క్రీస్తు జీవము."

నీ ఆత్మ ఒక ఫలించని కొమ్మ – ఎండిన, ఫలము లేని చనిపోయినదైన? యేసు నొద్దకు రమ్ము! ఆయనను నమ్ము. ఆయన రక్తము ద్వారా శుద్దుడవు కమ్ము. ఆయన పునరుత్థానము ద్వారా జీవించు. అప్పుడు క్రీస్తుతో జీవము ఉన్నట్లు కనుగొంటావు! అపోస్తలుడైన పౌలుతో పాటు చెప్పగలుగుతావు, "నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తానూ అప్పగించు కొనిన, దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను" (గలతీయులకు 2:20 ఎన్ కెజెవి). యేసు అన్నాడు,

"యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును: నా ద్వారానే తప్ప, ఎవడును తండ్రి యొద్దకు రాడు" (యోహాను 14:6).

అతడు ఎలా చెప్పగలిగాడు? ఎందుకంటే అది సత్యము కాబట్టి. క్రీస్తు దేవుని ఏకైక అద్వితీయ కుమారుడు. ఆయన ఒక్కడే సిలువపై మరణించాడు మన పాపాల ప్రాయశ్చిత్తము నిమిత్తము. ఆయన ఒక్కడే మృతులలో నుండి భౌతికంగా లేచాడు. కాబట్టి "[నా]ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు." ఈ ఉదయ సమయాన మీరు ఆయన ప్రశస్త రక్తము ద్వారా మీ పాపాలన్నీ కడుగబడాలనేది నా ప్రార్ధన!

"విచారాల వ్యక్తి," ఏమి నామము
   దిగి వచ్చిన దైవ కుమారునికి
నశించు పాపులు తిరిగి పొందుకోవడానికి!
   హల్లెలూయా! ఎంత గొప్ప రక్షకుడు!

అవమానమును భయంకర అపహస్యమును భరించి,
   నా స్థానంలో ఖండింపబడి ఆయన నిలబడ్డాడు;
ఆయన రక్తములో నా క్షమాపణ ముద్రించాడు;
   హల్లెలూయా! ఎంత గొప్ప రక్షకుడు!
("హల్లెలూయా, ఎంత గొప్ప రక్షకుడు!" ఫిలిఫ్ పి. బ్లిస్ చే, 1838-1876).
(“Hallelujah, What a Saviour!” by Philip P. Bliss, 1838-1876).

డాక్టర్ చాన్ గారు, దయచేసి ప్రార్ధనలో నడిపించండి.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రుదోం: లూకా 14:1-6.
ప్రసంగము ముందు పాట బెంజమిన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్:
"నా పాపమంతటి కొరకు" (నార్మన్ క్లేటన్ చే, 1943).
“For All My Sin” (by Norman Clayton, 1943).


ద అవుట్ లైన్ ఆఫ్

మార్గము సత్యము మరియు జీవము

THE WAY, THE TRUTH, AND THE LIFE

డాక్టర్ ఆర్.ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

"యేసు, నేను మార్గమును, సత్యమును, జీవమును: నా ద్వారానే తప్ప, ఎవడును తండ్రి వద్దకు రాడు" (యోహాను 14:6).

(లూకా 18:31-34; యోహాను 13:8, 9, 14-17, 30, 36, 37, 38; యోహాను 14:2, 5; ఎఫెస్సీయులకు 2:1;
I కొరిందీయులకు 2:14; యోహాను 20:19-22; Luke 24:36-45; యోహాను 20:25; 14:5)

I. మొదటిది, క్రీస్తు దేవునికి మార్గము, యోహాను 14:6ఎ; I తిమోతి 2:5.

II. రెండవది, క్రీస్తు సత్యము, యోహాను 14:6బి.

III. మూడవది, యేసు జీవము, యోహాను 14:6సి; గలతీయులకు 2:20.