Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




విత్తు వాని గూర్చిన ఉపమానము

THE PARABLE OF THE SOWER
(Telugu)

డాక్టర్ ఆర్.ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

సంస్కరణ సాయంత్రము బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము, నవంబర్ 8, 2015
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord's Day Evening, November 8, 2015


ఇప్పుడు నేను ఈ ప్రసంగాన్ని నేను సామాన్యంగా చేసేదానికి వేరే విధంగా బోధించభోతున్నాను. మీరు మీ బైబిలులో మార్కు 4వ అధ్యాయము తెరవండి. విత్తు వాని ఉపమానము వివరించబోతున్నాను. అది మత్తయి, మార్కు, లుకాలో ఉంది. ఈ రాత్రి మార్కులో ధ్యానము చేయబోతున్నాము. ఉపమానము ఒక కథ యేసు దానిని ఒక ఆత్మీయ సత్యాన్ని ఉదాహారించడానికి చెప్పాడు.

ఈ ఉపమానములో ఉన్న ముఖ్య సత్యము ఏమిటి? అది ఇది – సువార్త వింటున్న అధిక సంఖ్యాకులు రక్షింపబడరు! అలాగే, ఎలాగు రక్షింపబడాలో అనే విషయాన్ని వింటున్న అత్యధిక మంది కూడ రక్షింపబడరు. వారు నరకానికి పోతారు! గుంపులు నరకానికి పోతారు. కొంతమంది మాత్రమూ రక్షింపబడతారు. అది ఈరోజు చాలామందిని ఆశ్చర్యపరుస్తుంది. వారంటారు, "దేవుడు ఎవరినైనా నరకానికి పంపిస్తాడు అంటే నేను నమ్మను." వారు అంటారు, "దేవుడు ఎవరినైనా పరలోకానికి పంపిస్తాడు." వారు అంటారు, "అలాంటి దేవునిలో నాకు నమ్మకము లేదు. నా దేవుడు ఎప్పుడు అలా చెయ్యడు." వారి అర్ధము ఏమిటంటే వారి మనసులో అనుకున్న దేవుడు అలా చెయ్యడని. మీ మనసులో మీరు నిర్దేశించుకున్న దేవుని గూర్చి మనం మాట్లాడుకోవడం లేదు. "పన్నెండు అడుగులు" ప్రజలు మీరు "అర్ధము చేసుకునే దేవుని" గూర్చి మాట్లాడతారు. కాని నేను ఆ అబద్ధపు దేవుని గూర్చి మాట్లాడడం లేదు. నీ మనసులో "ఏర్పరచుకున్న" దేవుడు అబద్ధపు దేవుడు. "నీవు అర్ధం చేసుకుంటున్న దేవుడు" అబద్ధపు దేవుడు. మీరు అర్ధము చేసుకోలేని దేవుని గూర్చి నేను మాట్లాడుతాను! ఆ దేవుడు బైబిలు ద్వారా తన్ను ప్రత్యక్ష పరచుకొన్నాడు. ఆయన బైబిలు దేవుడు! వేరే వాడు లేదు! మీరు నమ్ముతున్న అబద్ధపు దేవుని గూర్చి నేను మాట్లాడడం లేదు. నిజమైన దేవుని గూర్చి నేను మాట్లాడుచున్నాను – బైబిలు ద్వారా బయలు పరచుకున్నాడు. మీ అబద్ధపు దేవుడు ప్రజలను నరకానికి పంపించడు. కాని నిజమైన దేవుడు పంపిస్తాడు. మత్తయి 7:13 లో వచనంలో ప్రభువైన యేసు క్రీస్తు అన్నాడు రక్షింపబడిన వారు "కొద్ది మంది" మాత్రమే. తరువాతి వచనంలో ప్రభువైన యేసు క్రీస్తు అన్నాడు రక్షింపబడిన వారు "కొద్ది మంది" మాత్రమే – చాలామంది నరకంలో నశించిపోతారు. నిజంగా చాల తక్కువమంది అది ఈ ఉపమానంలో ప్రాముఖ్యమైన విషయం.

ఇది యేసు క్రీస్తు చెప్పిన సామాన్య కథ. ఆయన అన్నాడు విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా, కొన్ని విత్తనములు త్రోవ పక్కను పడెను. పక్షులు వచ్చి వాటిని మింగి వేసెను. కొన్ని చాల మన్నులేని రాతినేలను పడెను. మన్ను లోతుగా లేనందున వెంటనే మొలిచెను, కాని సూర్యుడు ఉదయింపగానే, అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచి వేసెను, కనుక అవి ఫలించలేదు. చివరకు, కొన్ని మంచినేలను పడెను, అవి మొలచి పెరిగి ఫలించెను. అది ఉపమానము. ఇది సామాన్య చిన్న కథ – కాని ఇది మనకు చాల ప్రాముఖ్యమైన సత్యాన్ని చూపిస్తుంది – సువార్త విన్న బహు కొద్ది మంది మాత్రమే రక్షింపబడతారు!

ఈ ఉపమానంలో ఉన్న నాలుగు రకాల నేలలు సువార్త వింటున్న నాలుగు రకాల ప్రజలను చూపిస్తునాయి. విత్తనము దేవుని వాక్యము, బైబిలు, యేసు క్రీస్తు ద్వారా రక్షణ సువార్త. గుడికి వస్తున్నా ప్రతివ్యక్తి సువార్త వింటాడు. దాని గూర్చి వారు ఏమి చేస్తారనేది ఉపమానంలో ఉన్న నాలుగు రకాల నేలలు సూచిస్తున్నాయి.

I. మొదటిది, సువార్త విని వెంటనే మరచిపోవు వారు, నశించి పోతారు.

మార్కు 4:15 చూడండి,

"త్రోవ ప్రక్కనుండు వారెవరనగా, వాక్యము వారిలో విత్తబడును; గాని వినిన వెంటనే, సాతాను వచ్చి, వారిలో విత్తబడిన వాక్యము ఎత్తికొని పోవును" (మార్కు 4:15).

వీరు ఒకటి రెండు సార్లు మన గుడిని దర్శించే వారు. వారు దేవుని వాక్యము, రక్షణ సువార్త వింటారు. కాని "ఆకాశ పక్షులు వచ్చి వాటిని మింగి వేస్తాయి" (మార్కు 4:4). విత్తనాన్ని మింగి వేసిన పక్షులు సాతానును అతని దయ్యాలను సూచిస్తున్నాయి. "సాతాను వచ్చి, వారిలో విత్తబడిన వాక్యమును ఎత్తికొని పోవును" (మార్కు 4:15).

మేము వారికి చెప్తాం క్రీస్తు మన పాపముల నిమిత్తము సిలువపై మరణించాడని. దెయ్యము వారికి చెప్తుంది, "నీలో ఏ పాపమూ లేదు. నీవు మంచి వ్యక్తివి." కనుక వారి మనసులో పనిచేస్తున్న దెయ్యము త్వరితంగా వాక్యమును ఎత్తికొని పోతుంది. మేమంటాము, "మీకు నిత్య జీవము ఇవ్వడానికి క్రీస్తు మృతులలోనుండి లేచాడని." దెయ్యము చెప్తుంది, "అది నమ్మవద్దు! అది మర్మము, ఒక చక్కని కథ." కనుక వారి మనసులలో పనిచేస్తున్న దెయ్యము వెంటనే వాక్యమును ఎత్తికొని పోతుంది. యేసు అన్నాడు సాతాను "అబద్ధీకుడు" అని. (యోహాను 8:44). మీరు సువార్తను నమ్మకుండా రక్షింపబడకుండా వాడు మీకు అబద్ధము చెప్తాడు. నీవు వాడికి బానిసగా ఉండాలని కోరుకుంటాడు!

ప్రతి ఆదివారము చాలామంది నశించు వారిని సువార్త వినడానికని మేము తీసుకొని వస్తాము. చాలామంది తిరిగి రాదు. మేము వారికి రక్షణ సందేశము ఇస్తాము. మేము వారికి మధ్యాహ్న భోజనము (లేక రాత్రి భోజనము) పెద్ద పుట్టిన రోజు సంబరం చేస్తాం. గుడికి రావడం సులభతరం చేస్తాం. కాని వారిలో చాలామందికి నేను బోధించేది ఏదీ గుర్తు ఉండదు. ఎందుకు? ఎందుకంటే "సాతాను వెంటనే వచ్చి, వారి హృదయాల్లో విత్తబడిన వాక్యాన్ని ఎత్తికొని పోతాడు," అందుకే! కొంతమంది చాలాసార్లు వస్తారు బోధ వారిని ప్రభావితము చెయ్యదు. ఎందుకు? ఎందుకంటే ప్రతీసారి దెయ్యం చెప్పేది వింటారు, వారి హృదయాలలో నుండి వాక్యము ఎత్తికొని పోతాడు. మేము ప్రసంగపు పదానికి పదము ప్రతి ఇస్తాము ఇంటికి తీసుకెళ్ళి చదవమని. వారు నిజంగా చదివి దాని గూర్చి తీవ్రంగా ఆలోచిస్తారా? లేదు, అలా చెయ్యరు. నాకు తెలుసు చాలామంది ఇంటికి వెళ్ళాక ప్రసంగ ప్రతులను చెత్త బుట్టలలో పడేస్తారు. నాకు అది తెలుసు. కాని మేము అలా చేస్తూనే ఉంటాము. మేమెందుకు అలా చేస్తూ ఉంటాము? ఎందుకంటే యేసు అన్నాడు, "మీరు రాజ మార్గములలోనికి కంచెలలోనికి వెళ్లి లోపలికి వచ్చుటకు, వారిని బలవంతము చేయుము" (లూకా 14:23). ఎందుకంటే దేవుడు మనకు చెప్పాడు,

"వారు తిరిగుబాటు చేయువారు, గనుక వారు వినినను, వినుక పోయినను[లేకపోయిన]: నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియచేయుము" (యేహెజ్కేలు 2:7).

"ఆఖరి దినాలలోనికి" మనం లోతుగా వెళ్తుండగా ప్రజలు ఎక్కువగా దేవునిపై తిరుగుబాటు చేస్తారు. అలా సాతాను తన దెయ్యాలు ప్రజలు హృదయాల నుండి మనసుల నుండి ఎక్కువగా దేవుని వాక్యాన్ని ఎత్తికొనిపోతాయి. నలభై సంవత్సరాల క్రితం మేము ఒక పటము పెట్టేవారం, "బైబిలు పఠనము ఎక్కడ సాయంత్రము 7 గంటలకు." ఆ పాఠము చదివి, చాలామంది యవనస్తులు, వచ్చేవారు. నాకు తెలుసు. నేను హిప్పీలతో శాన్ ప్రాన్సిస్కో దగ్గర ఒక సంఘము ప్రారంభించాను. వారు పాపులు. తప్పనిసరిగా. కాని వారు చెడ్డవారయినప్పటికినీ, ఈనాటి యవనస్తుల కంటే, చాలామంచి వారు! ఈనాడు చాలామంది యవనస్తులకు కఠిన హృదయాలు ఉన్నాయి స్తుతితో కొట్టినా చొచ్చుకొని పరిస్థితి! అయినను కొనసాగుతున్నాం, "వారు విననప్పటికినీ వారు [వినక] పోయినప్పటికినీ" – ఎందుకంటే దేవుడు అలా చెయ్యమని మాకు చెప్పాడు! ఒక్కొక్కసారి ఎన్నుకోబడిన ఒకని కనుగొంటాం, అతడు సువార్త విని రక్షింపబడతాడు. కాని అది చాల అరుదుగా ఉంది, ఈయుగ అంతము చాలా సమీపిస్తున్నప్పుడు. నేను ఒప్పింపబడ్డాను, ఇక్కడ అమెరికాలో, దేవుడు మన ప్రజలకు తీర్పు తీరుస్తున్నాడు "అబద్ధమును నమ్మునట్లు, మోసము చేయు శక్తిని వారికి పంపుచున్నాడు" (II దేస్సలోనీకయులకు 2:11). అయినను మనకు తెలుసు, దేవుడు తన త్రోసి పుచ్చలేని కృపచే, ఎన్నిక చెయ్యబడిన వారిలో, ఈ చెడ్డ సాతాను పర దినాలలో ఏర్పరచు కుంటున్నాడు! మేము గొప్ప గుంపులు కొరకు చూడడం లేదు. మేము ఎక్కడ, అక్కడ చూస్తున్నాము, రక్షింపబడడానికి దేవునిచే ఏర్పరచబడిన కొద్దిమంది కొరకు. యేసు అన్నాడు, "మీరు నన్ను ఏర్పరచు కొనబడలేదు, నేను మిమ్మును ఏర్పరచుకొంటిని" (యోహాను 15:16). దేవుడు ఆయన ఏర్పరచుకొనని వారిని తన సౌబ్రాత్రుత్వ కృపచే లోనికి తీసుకొని వస్తాడు! హల్లెలూయా! కాని దేవునిచే ఎన్నుకొబడని వారు నుండి "సాతాను వెంటనే, [వచ్చి] వారి హృదయాలలో విత్తబడిన వాక్యాన్ని [ఎత్తి] కొనిపోయాడు" (మార్కు 4:15). నీ సంగతేంటి? నీవు దేవునిచే ఎన్నుకొనబడిన వాడవా – లేక సాతాను నీ హృదయములో నుండి వాక్యాన్ని ఎత్తికొని పోయేటట్టు చేస్తావా – తద్వారా జీవించి నీ పాపములోనే మరణిస్తావా? యేసు అందుకే అన్నాడు, "పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే" (మత్తయి 22:14).

II. రెండవది, సువార్తను విని సంతోషంగా అంగీకరించి, శోధింప బడినప్పుడు, పడిపోయి నశించు వారు.

మార్కు 4:16-17 చూడండి.

"అటు వలే రాతినేలను విత్తబడిన వారెవరును వాక్యము విని సంతోషంగా అంగీకరించు వారు; అయితే, వారిలో వేరు లేనందున, కొంతకాలము వారు నిలుతురు; కాని వాక్యము నిమిత్తము శ్రమయైనను, హింసయైనను కలుగును: తరువాత, వారు వెంటనే, అభ్యంతర పడుదురు" (మార్కు 4:16-17).

ఈ రాతినేల ప్రజలు మొదటి గుంపుకు వ్యతిరేకమైన వారు. వారు సువార్తను సంతోషంగా ఆనందంగా స్వీకరిస్తారు. వారు గుడికి వస్తారు దానిని ప్రేమిస్తారు. వారు పాటలు చక్కగా పాడతారు. ప్రార్ధనా కూటానికి వస్తారు. సువర్తీకరణకు వెళతారు. అది గొప్ప! దానిని ప్రేమిస్తారు! వారు ప్రసంగ ప్రతులను ఇంటికి తీసుకెళ్ళి జాగ్రత్తగా చదువుతారు.

కాని ఏదో తప్పుతుంది. వారికి "వేరే లేదు." వారు క్రీస్తులో వేరు పారలేదు, "వేరు పారి కట్టబడలేదు" (కొలస్సీయులకు 2:7). మరియు "కొంతకాలము సహింతురు." డాక్టర్ జె. వెర్నోన్ మెక్ గీ అన్నాడు, "వారు నిజంగా ఉత్సాహబరితులుగా ఉంటారు, కాని వారికి క్రీస్తుతో నిజమైన సంబంధము లేదు. అది కేవలము భావోద్రేకము" (బైబిలు ద్వారా, గమనిక మత్తయి 13:20, 21).

కొంతకాలము తరువాత గుడికి ఏదో తొందర వస్తుంది. ఏదో వస్తుంది వారికి రావాలనిపించదు. వారికి శ్రమ హింస కలిగినప్పుడు గుడిలో ఉన్ననందుకు "వెంటనే వారు అభ్యంతర పడతారు." దాని అర్ధము, నిజంగా, "వెంటనే పడిపోతారు" (ఎన్ఐవి చూడండి). అది తరుచు క్రిస్మస్ నూతన సంవత్సరము "సెలవుల్లో" జరుగుతుంది. వారికి తెలుసు, మేము వారిని క్రిస్మస్ కు క్రిస్మస్ సందర్భ ఆరాధనకు, నూతన సంవత్సర వేచి చూసే ఆరాధనకు రమ్మంటామని. రావాలని ప్రణాళిక వేసుకుంటారు. కాని ఏదో వస్తుంది, అవిశ్వసులలో వేరే సబందానికి ఆహ్వానింపబడతారు, లేక ఏదో జరుగుతుంది. లోకానికి ఇచ్చుకుంటారు – వెళ్తారు, మొదటగా చిన్న "కష్టము" తొందర వస్తుంది. మీరు "పడిపోతారా" "సెలవుల వనాల" మీరు శోధింపబడినప్పుడు? మీరు నశించు స్నేహితులతో ఈ లోకపు సందడికి, లేక నాట్యానికి వెళ్ళిపోతారా? లాస్ వేగాస్ కు పరిగెడతార, ఇంకా ఎక్కడికో, నశించు స్నేహితులతో? ప్రతి సంవత్సరము మేము చూస్తాము కొంతమంది క్రీస్తులో నిజమైన వేరు లేక, సెలవులలో త్వరగా పడి పోతూ ఉంటారు.

డాక్టర్ డేవిడ్ ఎఫ్. వేల్స్ ఒక ప్రసిద్ధ సంస్కరణ వేదాంతి. అతనన్నాడు, "ఈ ప్రజలకు [ప్రజలకు] వెల చెల్లించే ఉద్దేశము లేదు స్వసమర్పణ విషయంలో ఒకవేళ సందేశము నమ్మవలసి వస్తే...ఈ [పిలువబడే] ‘మారిన వారు’ తలక్రిందులుగా వారి జీవితాలు అవడాన్ని నిరాకరిస్తారు. వీరు, తేటగా, ఈనాడు అమెరికాలో ఉన్న చాలామంది లాంటివారు" (David F. Wells, Ph.D., The Courage to be Protestant, Eerdmans Publishing Company, 2008, p. 89).

డాక్టర్ జె. వెర్నోన్ మెక్ గీ వీరిని, "అల్కా సెల్ డ్జర్ క్రైస్తవులన్నాడు. వారిలో చాలా గందరగోళము ఉంది... వారికి క్రీస్తుతో నిజమైన సంబంధము లేదు. అది కేవలము భావోద్రేకము. వారు రాతి నేలను విత్తబడిన గుంపు" (ఐబిఐడి.).

III. మూడవది, సువార్త విని, ఐహిక విచారములు ధన మోసములు మరి ఇతరమైన అపేక్షల వలన వాక్యము అణచి వేయబడి, నశించు వారు.

మార్కు 4:18, 19 చూడండి,

"ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడినవారు; వీరు వాక్యము విని గాని, ఐహిక విచారములును, ధన మోసమును, మరి ఇతరమైన అపేక్షలును లోపల చొచ్చి, వాక్యమును అణచి వేయుట వలన, అది నిష్పలమగును" (మార్కు 4:18, 19).

డాక్టర్ మెక్ గీ అన్నాడు, "సాతాను దారి ప్రక్క పడిన విత్తనాన్ని ఎత్తుకుపోతుంది, శరీరము రాతి నేలను విత్తబడిన వాక్యము సంగతి చూసుకుంటుంది, కాని లోకము విత్తబడిన వాక్యాన్ని అణచి వేస్తుంది. ఐహిక విచారములు వస్తాయి...నేను కనుగొన్నాను ఎక్కువ మందిలో ఐహిక విచారములు వాక్యాన్ని ఎత్తుకొని పోతున్నాయి" (ఐబిఐడి.).

ఇది మళ్ళీ మళ్ళీ జరగడం మేము చూసాము. కొంతమంది యవనస్తులు గుడికి వస్తారు మారినట్టు అనిపిస్తారు. కొంతకాలము, తరువాత, పట్టభద్రులై డబ్బు సంపాదించడం ప్రారంభిస్తారు. బిడ్డ పుడుతుంది. ఇతర విషయాలను ఆశింప మొదలు పెడతారు. నేను ఎన్ఐవి ఉపయోగిస్తాను దేనిని వివరించడానికి. అది చెప్తుంది, "వాక్యం వింటారు, కాని జీవిత విచారములు, ధనమోసము ఇతర విషయాల పట్ల కోరిక వాక్యాన్ని అణచి వేస్తుంది."

ఇరవై సంవత్సరాల క్రితం చాలామంది మన సంఘాన్ని వదిలేసాయి. ఒలివాస్ అనే వ్యక్తి వదిలిపెట్టి వేరే గుడి ప్రారంభించాడు. అతడు మన వాళ్ళతో అన్నాడు నేను చాలా కఠినంగా ఉంటాడని. వారు ఆదివారము సాయంకాలపు ఆరాధనకు వెళ్ళనక్కరలేదు. వారికి కావలసిందల్లా ఉదయపు ఆరాధన, తరువాత భోజనము. నశించు వారిని గుడికి తీసుకొచ్చే అవసరం వారికి లేదు. వాళ్ళ మట్టుకు వారే రావడం – వీలున్నప్పుడు మాత్రమే. అది గొప్ప! ఈ కచ్చిత వృద్ధ బోధకుని నుండి వారు విడిపింప బడ్డారు! కాని త్వరలో చాలామంది ఆ గుడిని వదిలి పెట్టారు. వారిలో ఒకరు ప్రుధొమ్ గారికి చెప్పాడు, "ఈ సంఘము మార్గము, లోకములోనికి వెళ్ళిపోడానికి." అదే జరిగింది "ఒలివాస్ గుడి విభజనలో." అది మళ్ళీ జరుగుతుందా? అవును, జరుగుతుంది – ఐహిక విచారము, ధన మోసములు, ఇతరమైన ఆపేక్షలు నీ జీవితంలో వాక్యాన్ని అణచి వేస్తాయి! అవును, అది ముండ్ల పొదల సంఘస్తులకు జరుగుతుంది! అవును, అలా జరుగుతుంది!

ఇప్పుడు, మళ్ళీ డాక్టర్ జె. వెర్నోన్ మెక్ గీ చెప్పింది వినండి,

ఈ మూడు రకాల నేలలు మూడు రకాల విశ్వాసమును చూపించడం లేదు – వారు విశ్వాసులు కానే కారు! వారు వాక్యము విన్నారు దాని స్వీకరింప తలంచిన వారు... వేరే మాటల్లో చెప్పాలంటే వారు రక్షింప బడలేదు... కేవలము నాలుగులో ఒకవంతు మాత్రమే నిజంగా రక్షింప బడ్డారు. వాస్తవంగా, నా స్వంత పరిచర్యలో శాతము దానికంటే తక్కువగా ఉంది (మెక్ గీ, ఐబిఐడి., పేజీలు 73, 75).

వారు వెళ్లి రక్షింపబడినట్టు మీకు చెప్తారు. కాని వారు రక్షింపబడిన వారు కానే కాదు! నేను పూర్తిగా డాక్టర్ మెక్ గీ తో ఏకీభవిస్తున్నాను. ఈ నశించు వారిని గూర్చి ఆయన అన్నాడు, "వారిని నేను దక్షిణ కాలిఫోర్నియా రకంగా విభాగిస్తారు" నశించు సువర్తికులు (ఐబిఐడి., పేజి 73). డాక్టర్ డేవిడ్ ఎఫ్. వేల్స్ అన్నాడు, "వారు ‘క్రైస్తవ్య వెలుగుకు’ [ఉదాహరణలు] చాల సువార్తిక సంఘాలు ప్రచారం చేస్తున్నాయి... పదిలో ఒకటి అభిప్రాయాన్ని కలిగి ఉంది బైబిలు పరంగా క్రీస్తు శిష్యులుగా ఉండే విషయంలో" (వేల్స్, ఐబిఐడి., పేజి 91). దానికి ఆమెన్, సహోదరుడా!

IV. నాల్గవది, సువార్త విని, దానిని అంగీకరించి, ఫలించి, రక్షింప బడినవారు.

20 వ వచనము చూడండి,

"మంచి నేలను విత్తబడిన వారెవరనగా; వాక్యము విని, దానిని అంగీకరించి, ముప్పదంతులు గాను, అరువ దంతులుగాను, నూరంతలు గాను, ఫలించు వారు అని చెప్పెను" (మార్కు 4:20).

ఎవరు ఈ ప్రజలు? కొన్ని పేరులు చెప్పడం చాల సులభం. వీరిని మీరు వెంబడించాలి. వీరు మీ జీవితాలకు మార్గదర్శకులుగా ఉండాలి. వారు డాక్టర్ శ్రీమతి కాగన్, డాక్టర్ శ్రీమతి చాన్, శ్రీ శ్రీమతి గ్రిఫిత్, శ్రీ శ్రీమతి సాంగ్, శ్రీ శ్రీమతి మెస్సియా, శ్రీమతి సాలాజార్ (ప్రత్యేకంగా ఈమె!), శ్రీ శ్రీమతి సాండర్స్, శ్రీ శ్రీమతి ఒలివెక్కి , శ్రీ శ్రీమతి ప్రుధొమ్, శ్రీ శ్రీమతి లీ, శ్రీమతి హైమర్స్, శ్రీ జబలగా, సర్జియో మేలో, ఏమీ జబలగా, లారా ఎస్క్బార్, జాన్ శామ్యూల్ కాగన్ – ఇలాంటి ప్రజలు! కొంతమంది పేర్లు మాత్రమే చెప్పగలను! వారి మాదిరి వెంబడించండి మీరు తప్పు చేయరు! ఆమెన్! హల్లెలూయా! యేసు నామనునకు స్తుతి!

క్రీస్తును విశ్వసించడం ద్వారా ఇది ప్రారంభమవుతుంది. క్రీస్తును నమ్మడం ద్వారా అది పెరుగుతుంది. క్రీస్తును నమ్మకం ద్వారా శిష్యత్వము ప్రవహిస్తుంది. పాత పాటలో ఉన్నట్టు, "ఆయనను విశ్వసించడం ఎప్పుడు పడిపోయినా, యేసును నమ్మి, అంతే చాలు!" మొదటి మూడు గుంపులలో ఒకరు కూడ యేసును కనీసము నమ్మలేదు! వారిని వారే నమ్ముకున్నారు. అందుకే వారు "బయటికి పోయి" మన సంఘాన్ని వదిలేసారు. వారు యేసును నమ్మలేదు. వారి స్వంత ఆలోచనను వారి భావాలను వారు నమ్ముకున్నారు. మిమ్ములను మీరు నమ్ముకోవడం ఆపండి – క్రీస్తును విశ్వసించడం ప్రారంభించండి. ఇప్పుడే ఆయనను నమ్మండి, ఆయన ప్రసస్త రక్తములో మీ పాపాలన్నిటిని ఆయన కడిగేస్తారు! ఇప్పుడే ఆయనను నమ్మండి, వెంటనే మీరు నిత్య జీవము పొందుకుంటారు! ఆమెన్! హల్లెలూయా! యేసు నామమునకు స్తోత్రం! డాక్టర్ చాన్, దయచేసి ప్రార్ధనలో నడిపించండి.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రుదోం: లూకా 8:11-15.
ప్రసంగము ముందు పాట బెంజమిన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్:
"నేను లోకమును సంపాదించుకుంటే" (అన్నా ఒలాండర్ చే, 1861-1939).
“If I Gained the World” (by Anna Olander, 1861-1939).


ద అవుట్ లైన్ ఆఫ్

విత్తు వాని గూర్చిన ఉపమానము

THE PARABLE OF THE SOWER

డాక్టర్ ఆర్.ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

I. మొదటిది, సువార్త విని వెంటనే మరచిపోవు వారు, నశించి పోతారు, మార్కు 4:15, 4; యోహాను 8:44; లూకా 14:23; యేహెజ్కేలు 2:7; II దేస్సలోనీయులకు 2:11; యోహాను 15:16; మత్తయి 22:14.

II. రెండవది, సువార్తను విని సంతోషంగా అంగీకరించి, శోధింప బడినప్పుడు, పడిపోయి నశించు వారు, మార్కు 4:16, 17; కొలోస్సీయులకు 2:7.

III. మూడవది, సువార్త విని, ఐహిక విచారములు ధన మోసములు మరి ఇతరమైన అపేక్షల వలన వాక్యము అణచి వేయబడి, నశించు వారు, మార్కు 4:18, 19.

IV. నాల్గవది, సువార్త విని, దానిని అంగీకరించి, ఫలించి, రక్షింప బడినవారు, మార్కు 4:20.