Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
యెషయా యొక్క మార్పు మరియు పిలుపు

THE CONVERSION AND CALL OF ISAIAH
(Telugu)

డాక్టర్ ఆర్.ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

సంస్కరణ ఉదయము బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము, నవంబర్ 1, 2015
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord's Day Morning, November 1, 2015

"రాజైన ఉజ్జయా మృతినొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసన మందు ప్రభువు ఆశీనుడైయుండగా, నేను చూచితిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనేను" (యెషయా 6:1).


యెషయా గ్రంధము వాస్తవానికి ఈ అధ్యాయముతో ప్రారంభమవుతుంది. చాలా వ్యాఖ్యానాలు చెప్తాయి ఇది ప్రవక్తగా యెషయాకు పిలుపు అని – అవును అది అంతే. కాని దానికంటే ఎక్కువ. నేను ఒప్పింపబడ్డాను ఇది యెషయా మార్పు మరియు ప్రవచనానికి పిలుపు. గతంలో బోధకులకు తరుచు జరిగింది. వారికి మార్పు అనుభవము కలిగిన తరువాత, వారు గ్రహించారు దేవుని వారిని ఇతరులకు బోధించాలని కోరుతున్నాడని. నేననుకుంటాను అతి ప్రాముఖ్యమైన విషయము యెషయా ఎలా మార్పు నొందాడో ఈ వచనాలు చూపిస్తున్నాయి. మరియు, మీరు మార్పు పొందబోతుంటే, యెషయా వేటి ద్వారా వెళ్ళాడో మీరు కూడ వాటి ద్వారా వెళ్ళాలి.

I. మొదటిది, దేవుని గూర్చిన గ్రహింపు ఉండాలి.

సంవత్సరాలుగా మీరు గుడికి రావచ్చు దేవుని గ్రహింపు లేకపోవచ్చు. మీరు బైబిలు పఠింపవచ్చు సంవత్సరాలుగా ప్రార్ధనలు పలకవచ్చు దేవుని గూర్చిన గ్రహింపు లేకుండా. నా జీవితంలో చాలా సార్లు ఆ తలంపు నన్ను సంధించింది.

చైనీయ బాప్టిస్టు సంఘానికి వెళ్లకముందు నేను చాలా సంవత్సరాలు కాకసియన్ (తెల్ల) బాప్టిస్టు సంఘములో సభ్యునిగా ఉన్నాను. నేను యుక్త వయస్కుడనయినను, నాకు గుర్తుంది యవనస్తులు, అందరు, వారికి ఏమాత్రము దేవునితో సంబంధం లేదు. సబ్బాతు బడిలో వారి చేసినదంతా ప్రశ్నల పత్రము చూసి జవాబులివ్వడం. ప్రసంగముల సమయంలో జవాబులు ఒకరికొకరు అందించుకొనేవారు. వారికి జీవితమూ లేదు. వారికి అవగాహన లేదు. వారి దీనిని తీవ్రంగా పరిగణించలేదు. వారిలో ఒక్కరు కూడ ఏకాంత స్థలానికి వెళ్లి ప్రార్ధించడం నేను ఊహించలేదు. వారు "దేవుని వలన కలుగు జీవములోనుంది వేరు పరచబడ్డారు" (ఎఫెస్సీయులకు 4:18).

వారిలో తప్పు ఏంటి? ఖచ్చితంగా చెప్పాలంటే, వారికి దేవుడు లేడు. దేవుని గూర్చి కొన్నిసార్లు అయినా ఆలోచించారా? ఓ, వారు ఆలోచించారు. కాని దేవుని గూర్చి వారి అభిప్రాయము సిద్ధాంత శేషము, లేక అంతర్గత భావన.

దేవుడు లేని ప్రజలు ఇప్పుడు ఇక్కడ మన మధ్య ఉన్నారు. మీకు తెలుసా, అది అసామాన్యము కాదు. ఆవిధంగా ఆఖరి దినాల్లో ప్రజలందరూ ఉన్నారు, ఈ ఆధునిక సంస్కృతిలో. మీరు ఒకవేళ ఉంటే, "దేవుడు నాకు వాస్తవము. నా జీవితంలో దేవుడు అతి ప్రాముఖ్యమైన వ్యక్తి," నీ పాఠశాల స్నేహితుడు ఏమనుకుంటాడు? నీ ఉద్యోగ స్థలములోని వారు ఏమనుకుంటారు? కళ్ళు భాగా తెరచి మిమ్ములను చూడరా? మీరు విచిత్రంగా ఉన్నారని వారు అనుకోరా? ఇప్పుడు, మనము వాస్తవానికి వస్తున్నాము! వారికి దేవుడు తెలియదు – మీకు కూడ తెలియదు! ఈ ఉదయము ఇక్కడ యవనస్తులు ఉన్నారు మీ పాఠశలలొ ఉద్యోగములో ఉన్నవారికి దేవుడు తెలిసినంతగా వీరికి దేవుని గూర్చిన అవగాహన లేదు.

దేవుడు మన లోపల లేడు. అది ప్రాముఖ్యమైన విషయము. మీరు ఆత్మీయులని మీ తరగతి వారికి చెప్పితే, అది వారిని తొందర పెట్టదు. ఆదివారము గుడిలో దేవుని గూర్చి వింటాం అని మీరు వారికి చెప్పితే, అది వారిని తొందర పెట్టదు. కాని మీరు వారి కళ్ళల్లో చూసి ఇలా ఉంటే, "లోకాన్ని సృష్టించిన దేవుడు నా జీవితంలో అతి ప్రాముఖ్యమైన వాస్తవమైన వ్యక్తి" అని చెప్తే, వారు మిమ్ములను చూసి మీరు పిచ్చివారు అనుకుంటారు. ఎందుకు? ఎందుకంటే బైబిలు చెప్తుంది,

"నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు, గ్రహించు వాడెవడును లేడు దేవుని వేడుకు వాడెవడును లేడు" (రోమా 3:11).

మళ్ళీ, బైబిలు చెప్తుంది,

"లోకము [తన] జ్ఞానము చేత దేవుని నెరుగదు" (I కొరిందీయులకు 1:21).

చాలామంది కొత్త సువార్తికులు నశించు లోకములో మిగిలిన వారికంటే శ్రేష్ఠులు కాదు. వారు కళాశాలలో బైబిలు పఠన గుంపుకు వెళ్ళవచ్చు, గాని వారు దేవుని గూర్చి తీవ్రంగా మాట్లాడడం మీరు వినరు. అమ్మాయిలూ సామాన్యంగా ఆయా విషయాలను గూర్చి మాట్లాడడానికి అక్కడికి వెళ్తారు. అక్కడ అబ్బాయిలు ఉంటే, వారు అమ్మాయిలను "గమనిస్తుంటారు." వారు దేవుని గూర్చి ఆలోచించరు – బైబిలు దేవుని గూర్చి కూడ! మీరు ముస్లీము, కేథలిక్, జ్యూ, లేక బాప్టిస్టు అని చెప్తే, వారికేమీ పట్టదు. వారు అన్నారు, "దేవుడు నాలో ఉన్నాడు, నీలో కూడ ఉన్నాడు అని చెప్తే," వారికి పట్టదు కూడ. అతి నూతన తరము తలంపు. కాని మీరు, "దేవుడు పైన ఉన్నాడు, క్రింద మనలను చూస్తున్నాడు. ఆయన మన పాపాలు చూసి తీర్పు తీరుస్తాడు" అని చెప్తే, ఏమి జరగుతుంది? వారనుకుంటారు మీరు పిచ్చివారని, అవునా కాదా?

ఇప్పుడు, ఒక అడుగు ముందుకెలదాం. మిమ్ములను గూర్చి మాట్లాడదాం. మీరిక్కడ ఉన్నారు మీరింకా మారలేదు. మీరు దేవుని గూర్చి ఏమి ఆలోచిస్తున్నారు? కొన్నిసార్లు ఆయనను గూర్చి ఆలోచిస్తారు, కదా? మీరు మారకపోతే తప్పక ఆయనను గూర్చి తప్పుడు తలంపులు కలిగి ఉంటారు.

ఇది జరిగినప్పుడు యెషయా యవనస్తుడు. ఆయన బైబిలు పఠించాడు. దేవాలయంలో ఆరాధనలు హాజరవుచున్నాడు. కాని ఆయన దేవుని ఎరుగడు. తనకు దేవుని గూర్చిన విషయాలు తెలుసు, కాని దేవుని అనుభవ పూర్వకముగా ఎరుగడు. అతడు పితరుడు యెబు వలే ఉన్నాడు. యెబు దేవునితో అన్నాడు,

"వినికిడి చేత నిన్ను గూర్చిన వార్తా నేను వింటిని: అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహ్యించుకొని, దూలిలోను బూడిదలోనూ పడి పశ్చాత్తాప పడుచున్నాను" (యోబు 42:5, 6).

యోబు దేవుని గూర్చి విన్నాడు. కాని ఇప్పుడు దేవుడు "సుడిగాలి లోనుండి యోబుతో మాట్లాడెను" (యోబు 38:1; 40:6). "అప్పుడు ప్రభువు తుఫాను లోనుండి యోబుతో మాట్లాడెను" (ఎన్ ఐవి).

మానవ భాషలో ఇది ఎలా వివరించాలో నాకు తెలియదు. నిజమైన కథలు మీకివ్వడం మంచిది. డాక్టర్ కాగన్ ఒక నాస్తికుడు. అతడు దేవుని యందు నమ్మిక యుంచలేదు. ఒకరోజు అర్ధరాత్రి డాక్టర్ కాగన్ భయపడిపోయాడు. యూసిఎల్ఎ (UCLA) మరునాడి ఉదయము తనకు చాలా ప్రాముఖ్యమైన పరీక్ష ఉంది. అతనికి చదివింది ఏమి బోధపడలేదు. మరునాడు పరీక్షలో తప్పిపోతాడని తనకు తెలుసు. అకస్మాత్తుగా డాక్టర్ కాగన్ తన జీవితంలో తొలిసారిగా ప్రార్ధించాడు. అతడన్నాడు, "దేవా, నన్ను క్షమించు." తరువాత నిద్రపోయాడు. లేచాడు, పరీక్షలో తప్పుతాడని తెలుసు. తరగతిలోనికి వెళ్లి ప్రశ్నలు చూచి చాలా సులభంగా జవాబులు వ్రాసి తరగతిలో ఉత్తమ శ్రేణి తెచ్చుకున్నాడు. దేవుడు నిజమని అప్పుడు తెలుసుకున్నాడు. దేవుడు, వాస్తవంగా ఉన్నాడు.

పదిహేను సంవత్సరాలప్పుడు నా మామ్మ చావు వలన నేను లోతుగా కలవరపడ్డాను, ముందురాత్రి జరిగిన భయంకర సంఘటనలు, భూస్థాపనలో జరిగినవి. గ్లెన్ డెల్, ఫారెస్ట్ లాన్ పర్వతాలలోనికి, దూరముగా, పారిపోయాను. నేల మీదపడి చెమటతో, హరించుకుపోయాను. అప్పుడు దేవుడు నాపై దిగి వచ్చాడు. అక్కడ దేవుడున్నాడు నాకు తెలుసు. అది ఎప్పుడు నాకు యాకోబును గూర్చి ఆలోచింప చేస్తుంది, ఆ రాత్రి దేవుడు తన దగ్గరకు వచ్చినప్పుడు,

"యాకోబు నిద్ర తెలిసి, నిశ్చయంగా, యెహోవా ఈ స్థలమందున్నాడు; అది నాకు తెలియక పొయెనను. భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము అనెను, ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు పరలోకపుగ విని ఇదే అనుకొనెను!" (ఆదికాండము 28:16, 17).

డాక్టర్ కాగన్ కాని నేనుగాని ఆ అనుభవాలలో మార్పు చెందలేదు, కాని యోబుతో పాటు చెప్పగలము, "వినికిడి చేతనిన్ను గూర్చిన వార్తా నేను వింటిని: అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను" (యోబు 42:5). వాస్తవానికి అతడు దేవుని చూచినట్టు అర్ధము కాదు. అది వర్ణణాతీతంగా చెప్పబడింది అతడు దేవుని గూర్చి విన్నాడని, కాని ఇప్పుడు అతనికి తెలుసు దేవుడు నిజమని తానూ పాపినని, అందుకు అతడన్నాడు, "కనుక నన్ను నేను తగ్గించుకొని, పశ్చాత్తాపపడతాను" (ఐబిఐడి.). యెషయా అనుభవము యాకోబు యెబుల అనుభవము లాంటిదే – డాక్టర్ కాగన్ మరియు నాలాంటి వారివే – పదిహేను సంవత్సరాలప్పుడు, నా మామ్మ భయంకర స్థాపన తరువాత. యెషయా అన్నాడు,

"రాజైన ఉజ్జయా మృతినొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసన మందు ప్రభువు ఆశీనుడైయుండగా, నేను చూచితిని, ఆయన చొక్కా [వస్త్రాన్ని] అంచులు దేవాలయమును నిండుకొనేను" (యెషయా 6:1).

డాక్టర్ జె. వెర్నోన్ మెక్ గీ అన్నాడు,

రాజైన ఉజ్జియా మరణించిన సంవత్సరంలో, యెషయా అనుకుంటున్నాడు, "మంచిరాజు ఉజ్జీయా చనిపోయాడు, పరిస్థితులు [చెడ్డగా] మారుతున్నాయి. ఇశ్రాయేలు బందీగా పట్టుబడుతుంది. అభివృద్ధి ఆగిపోతుంది. మాంద్యము వస్తుంది, కరువు వెంట వస్తుంది." ఆ మానసిక స్థితిలో యెషయా ప్రతీ వ్యక్తీ చేసిందే చేసాడు – దేవాలయానికి వెళ్ళాడు... దేవుని ఆలయములో యెషయా కనుగొన్నాడు దేశపు నిజమైన రాజు చనిపోలేదని. "సింహాసనాసీనుడైన ప్రభువును చూసాను, అత్యున్నత స్థలములో, ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిండుకున్నాయి" –దేవుడు సింహాసనముపై ఉన్నాడు... దేవుడు ఉన్నత స్థలంలో ఉన్నాడు, ఆయన పాపముతో రాజీ పడడు (J. Vernon McGee, Th.D., Thru the Bible, vol. III, Thomas Nelson Publishers, 1982; note on Isaiah 6:1).

ఇప్పుడు యెషయా 6:3 చూడండి, సెరాపులు దూతలు ఉన్నాయి,

"వారు సైన్యమునకు అధిపతియగు యెహోవా, అన్నాడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి యున్నది అని: గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు చేయుచుండిరి" (యెషయా 6:3).

వారు కేకలు వేస్తున్నారు, "సైన్యములకదిపతియగు యెహోవా, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు." డాక్టర్ డబ్ల్యూ. ఎ. క్రీస్ వెల్, అరవై సంవత్సరాలు, టెక్సాస్ లోని, డల్లాస్ సంఘ గొప్ప కాపరి అన్నాడు, "నేను అనుకుంటాను అవి త్ర్విత్వములోని ముగ్గురుని చూపిస్తున్నాయి," త్రిత్వము (W. A. Criswell, Ph.D., Isaiah: An Exposition, Zondervan Publishing House, 1977, p. 53).

పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు!
   శక్తిగల ప్రభువైన దేవుడు!
ప్రాతఃకాల సమయాన
   మీకే మా పాట అంకితం;
పరిశుద్ధుడు,పరిశుద్ధుడు,పరిశుద్ధుడు!
   కృపామయుడు గొప్పవాడు!
దేవుడు ముగ్గురు వ్యక్తులతో,
   ఆశీర్వాదపు త్రిత్వము!

పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు,
   అంధకారము నీకు అడ్డు వచ్చినను,
పాపి యొక్క కన్ను
   మహిమను చూడనప్పటికినీ,
మీరు మాత్రమే పరిశుద్ధులు;
   మీ ప్రక్కకు ఎవరు సాటిరారు
శక్తిలో పరిపూర్ణులు,
   ప్రేమలో, పవిత్రతలో.
("పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు" రేజినాల్డ్ హేబెర్ చే, 1783-1826).
(“Holy, Holy, Holy” by Reginald Heber, 1783-1826).

దేవుని గూర్చిన అవగాహన మీకు లేకపోతే – లేఖనాల పరిశుద్ధ దేవుని గూర్చి – ఆయన పరిశుద్ధత, న్యాయము, కృపను గూర్చి మీకు అవగాహన లేకపోతే – నిజ క్రైస్తవుడవాలనే నిరీక్షణ నీకు ఎలా ఉంటుంది?

II. రెండవది, పాపపు ఒప్పుకోలు ఉండాలి.

యెషయా 6:5 చూడండి,

"నేను, అయ్యో నేను! నేను పునరావృత్తం చేస్తున్నాను; అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పదవులు గల జనుల మధ్యను నివసించు వాడను: నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియైన యెహోవా ను నేను కన్నులార చూచితిని అనుకుంటిని" (యెషయా 6:5).

పరిశుద్ధ దేవుని త్రిత్వము అవగాహన ప్రవక్త తన పాపాన్ని చూసేటట్టు చేసింది, "అపవిత్రములైన పెదవులు గల వాడను." మీరు "సర్వ భూమికి తీర్పరిగా" బయలు పరిస్తే తప్ప మీరు అలాంటి ఒప్పుకోలు పొందుకోలేరు. డాక్టర్ డేవిడ్ వేల్స్ ఒక సంస్కరణాత్మక వేదాంతి. అతనన్నాడు,

ప్రవక్త దేవుడు ప్రజలనుంచిన స్థానము యొక్క [ప్రమాదము] ను ప్రవక్త బాగా గ్రహించుకున్నాడు. ఆయన వెలుగులో ఎవరు నిలబడలేదు. ప్రతి ఒక్కరు ద్వాని ద్వారా నశిస్తాడు ఎందుకంటే ఆ వెలుగు నిర్దారించుకుంటుంది తప్పుకు, దృష్టి మల్లడం, స్వార్ధం, అపనమ్మిక, కృతజ్ఞత లేకపోవడం, అవిదేయతలకు వ్యతిరేకంగా... యెషయా తన దర్శనంలో చూసాడు వెంటనే ప్రకటించాడు, దేవుడు ఎవరు అనే వెలుగులో, 'నేను ఏ పాటివాడిని! నేను నశించితిని; అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించు వాడను; రాజును, సైన్యములకు అధిపతియైన యెహోవాను కన్నులార చూచితిని!' (యెషయా 6:5). ఇది అనేక పాఠ్య భాగములలో ఒకటి ఇది దేవుని సంపూర్ణ పవిత్రతను గూర్చిన నొప్పించే భయంకర సత్యాన్ని గూర్చి మాట్లాడుతుంది (David F. Wells, Ph.D., The Courage to Be Protestant, Eerdmans Publishing Company, 2008, p. 125).

డాక్టర్ డబ్ల్యూ. ఎ. క్రీస్ వెల్ అన్నాడు,

ఆత్మ నేత్రములతో దేవుని చూస్తాము, హృదయపు చెవులతో దేవుని మాట వింటాము. గ్రుడ్డి వారికి, ఆయన ఉనికి తెలియదు. చెవిటి వారితో, ఆయన మాట్లాడాడు. చూసే కళ్ళున్న వారితో, వినగలిగే చెవులున్న వారితో, భావించే హృదయము గల వారికి, ఎన్నటికి దేవుడు మహిమలో ప్రత్యక్ష మవుతాడు. యెషయా దర్శనములో, ఆయన కనిపించింది తానూ పాపినని అయోగ్యుడనని. దేవుని సన్నిధిలో నిలుచున్నా ఏ వ్యక్తికైనా అయినా కనుకుంటాడు అయోగ్యతా ప్రవాహంలో ఉన్నాడని అపవిత్ర అతనిని అధిగమిస్తుందని గ్రహిస్తాడు (క్రీస్ వెల్, ఐబిఐడి., పేజి 54).

ఒకరోజు మీరు దేవుని ముఖాముఖిగా కలుస్తారు. మరణ సమయంలో ఆయన తీర్పును ఎదుర్కొంటావు, నీవు ఈ జీవితంలో రక్షింపబడకపోతే. నీవు కలువబోవు దేవుడు నీ మనసులో ఊహించుకున్న దేవుడు లాంటివాడు కాదు. ఆయన ప్రపంచపు మతాల దేవుడు లాంటివాడు కాదు. బైబిలు దేవుని నీకు ముఖాముఖిగా చోస్తావు. నీ పాపాలు బట్టి ఆయన నిన్ను తీర్పు తీరుస్తాడు, ప్రత్యేకించి నీ హృదయము మనసు పాపమును బట్టి. నీ పాపమూ క్షమింపబడడానికి ఒకే మార్గము ఉంది, అది నీ స్థానంలో క్రీస్తు మరణము ద్వారా – సిలువపై. నీ పాపమూ కడగబడడానికి ఒకే మార్గము ఉంది అది సిలువపై క్రీస్తు కార్చిన రక్తము. డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్ జోన్స్ అన్నాడు, "మన సువార్త రక్తంపు సువార్త; రక్తము ప్రవాహము; అది లేకుండా ఏమి లేదు" (God’s Way of Reconciliation, Ephesians 2, The Banner of Truth Trust, 1981, p. 240).

ఇప్పుడు 8 వ వచనము చూడండి.

"అప్పుడు నేను ఎవని పంపెదను, అన్నాడు, మా నిమిత్తము ఎవడు పోవునని, ప్రభువు సెలవియ్యగా? వాటివి అంతటా, నేను చిత్తగించుము; నేనున్నాను నన్ను పంపు మనెను" (యెషయా 6:8).

ఇప్పుడు యెషయా బోధించడానికి పిలవబడ్డాడు. "నేనున్నాను. నన్ను పంపుము." అతడు వెళ్లి అతడు అనుభవించినది ఇతరులకు బోధిస్తాడు.

నీవు యేసును నమ్మి ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా కడుగబడితేనే నీవు రక్షింప బడగలవు. యేసు రక్తము ద్వారా, నీ పాపమూ కడుగబడితేనే నీవు దేవుని ఎదుర్కొనగలవు. పరలోకములో ఒక కొత్త పాట పాడతాము, "నీవు వధింపబడిన వాడవై, మీ రక్తము ద్వారా విమోచించితివి" (ప్రకటన 5:9). ఈ ఉదయ కాల సమయాన నేను నిన్ను బ్రతిమాలుచున్నాను యేసును నమ్మాలని ఆయన రక్తము ద్వారా కడుగబడాలని! ఆమెన్. డాక్టర్ చాన్, ప్రార్ధనలో దయచేసి నడిపించండి.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రుదోం: రోమా 6:1-8.
ప్రసంగము ముందు పాట బెంజమిన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్:
"అబ్రహాము దేవునికి స్తుతి" (డానియెల్ బెన్ జూడాచే, 14 వ శతాబ్ధము).
“The God of Abraham Praise” (by Daniel ben Judah, 14th century).


ద అవుట్ లైన్ ఆఫ్

యెషయా యొక్క మార్పు మరియు పిలుపు

THE CONVERSION AND CALL OF ISAIAH

డాక్టర్ ఆర్.ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

"రాజైన ఉజ్జయా మృతినొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసన మందు ప్రభువు ఆశీనుడైయుండగా, నేను చూచితిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనేను" (యెషయా 6:1).

I. మొదటిది, దేవుని గూర్చిన గ్రహింపు ఉండాలి, ఎఫెస్సీయులకు 4:18; రోమా 3:11;
I కొరిందీయులకు 1:21; యోబు 42:5, 6; 38:1; 40:6; ఆదికాండము 28:16, 17; యెషయా 6:3.

II. రెండవది, పాపపు ఒప్పుకోలు ఉండాలి, యెషయా 6:5, 8; ప్రకటన 5:9.