Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
లూథర్ యొక్క మార్పు

LUTHER’S CONVERSION
(Telugu)

డాక్టర్ ఆర్.ఎల్. హైమర్స్ జూనియర్ గారిచే
by Dr. R. L. Hymers, Jr.

సంస్కరణ ఆదివారము ఉదయము బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు ప్రభువు దినము, అక్టోబర్ 25, 2015
A sermon preached on Reformation Sunday Morning
at the Baptist Tabernacle of Los Angeles, October 25, 2015

" వ్రాయబడిన ప్రకారము, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును" (రోమా 1:17).


కొందరు అడగవచ్చు మార్టిన్ లూథర్ (1483-1546) పై ఎందుకు మాట్లాడుతున్నానని. నేను బాప్టిస్టును లూథరన్ ను కాదు అనే విషయాన్ని, తేటపరచనివ్వండి. సంఘము విషయంలో నేను బాప్టిస్టును, లూథరన్ ను కాదు. బాప్తిస్మము విషయంలో నేను బాప్టిస్టును, లూథరన్ ను కాదు. ప్రభు రాత్రి భోజన విషయంలో నేను బాప్టిస్టును, లూథరన్ కాదు. ఇశ్రాయేలు దేశము విషయంలోను యూదుల విషయంలోనూ నేను బాప్టిస్టును, లూథరన్ ను కాదు. కొన్ని విషయాలున్నాయి – వాటన్నింటితో నేను లూథర్ తో ఏకీభవించడం లేదు బాప్టిస్టులతో నిలబడతాను. అయినను లూథర్ యొక్క తేటయైన, బైబిలు పరబోధ విషయంలో క్రీస్తు నందలి విశ్వాసము ద్వారా నీతిముత్యము అనే విషయంలో నేను లోతుగా అతనిని అభినందిస్తాను. అందరి ఆధునిక లూథరునులను గూర్చి నేను మాట్లాడడం లేదు. లూథరును గూర్చి మాట్లాడుతున్నాను. అతడు తరాలలో ఒక గొప్ప క్రైస్తవుడు.

లూథర్ చరిత్రలో ఒక మానవతా వ్యక్తిగా, యుగ పురుషునిగా కొన్నిసార్లు మొరటివానిగా, నిలబడతాడు. విషయాలను అన్నిసార్లు తేటగా చూడలేదు. రోమను కేథలిక్ సిద్ధాంతము "మార్పిడి వేదాంతమును," సంఘము పూర్తిగా ఇశ్రాయేలును మార్పిడి చేసిన దానిని అతడు నమ్మడం కొనసాగించాడు. ఈ కేథలిక్ సిద్ధాంతము, తరువాత తన జీవితంలో, యూదులకు వ్యతిరేకంగా కఠిన వ్యాఖ్యలు చెయ్యడానికి నడిపించింది. కాని రిచర్డ్ వార్మ్ బ్రాండ్ నిష్టగల యూదుడు, తరువాత లూథరన్ కాపరి అయ్యాడు, అతడు ఒకసారి నాతో అన్నాడు, చాలా సామాన్యంగా, "నేనతని క్షమిస్తాను." కాపరి వార్మ్ బ్రాండ్ కు తెలుసు లూథర్ యుగ పురుషుడని, ఈనాడు మన అందరిలాగానే. తరువాత చరిత్ర చూపిస్తుంది ఈనాడు మనలో చాలా లోటుపాట్లు ఉన్నాయని – ప్రత్యేకించి ఆత్మలను కృంగ చేసే పొరపాట్లు "నిర్నయత్వత," అవి మెడివియాల్ కేథలిజంలో నరక భూఇష్టమైనవి మోస పూరితమైనవి.

అయిననూ కొన్ని "గుడ్డి లోపాలు" ఉన్నప్పటికినీ లూథరుకు అసాధారణ తలాంతులు ఉన్నాయి. స్పర్జన్ అన్ని కాలాలలో అతిగొప్ప బాప్టిస్టు బోధకుడు. అతడు లూథరును పైకెత్తాడు తరుచు ప్రస్తావించాడు (లూథరుపై స్పర్జన్ రెండు ప్రసంగాలు చూడండి, ద మెట్రో పోలిటాన్ టేబర్ నేకల్ పుల్ పుత్, ప్రతి XXIX, పేజీలు 613-636). స్పర్జన్ అన్నాడు, "మన గొప్ప సంస్కర్తను గూర్చి ప్రధాన సాక్ష్యము, యేసు క్రీస్తు నందలి విశ్వాసము ద్వారా పాపి నీతిమంతుడుగా తీర్చబడుట." చాలా సార్లు లూథర్ వేదాంత ప్రశ్నల మూలాన్ని చూసాడు – అతని తలంపులను గొప్ప వాస్తవికతో బలంగా వ్యక్తం చేసాడు.

నీతిమత్వము రక్షణ సిద్ధాంతములో అతి ప్రాముఖ్యమైన విషయము. నీతిమంతుడుగా తీర్చబడకపోతే మానవుడు నరక పాత్రుడవుతాడు! ఒక వ్యక్తి సంఘము విషయములో సరిగా ఉండవచ్చు, బాప్మిస్మముపై సరిగా ఉండవచ్చు, ప్రభు రాత్రి భోజన విషయంలో సరిగా ఉండవచ్చు, ఇశ్రాయేలు విషయంలో సరిగా ఉండవచ్చు – అయిననూ నరకానికి పోవచ్చు అతడు నీతిమంతుడుగా తీర్చబడలేదు కాబట్టి. ఇంకొక వైపు, లూథర్ లాంటి వ్యక్తి, ఆ విషయంలో ఇతర విషయాలలో తప్పు అయినప్పటికినీ, రక్షింపబడవచ్చు క్రీస్తు ద్వారా నీతిమంతుడుగా తీర్చబడితే. అందుకే స్పర్జన్ నీతిమత్వమును "సంస్కరణలో కిరీట వజ్రము," ఎందుకంటే నీతిమత్వము అతి ప్రాముఖ్య సిద్ధాంతము. లూథర్ అన్నాడు విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట "ఈ సిద్ధాంతము ద్వారా సంఘము నిలబడవచ్చు లేక పడిపోవచ్చు." నీతిమత్వము లేకుండా ఎవ్వడును రక్షింపబడలేదు! అన్ని సిద్ధాంతాలలో ఈ అతి క్లిష్ట సిద్ధాంతము విషయంలో, గొప్ప సంస్కర్త వైపు నేను నిలబడతాను. యేసు క్రీస్తు ద్వారా మాత్రమే నీతిమంతుడుగా తీర్చబడుట అనే విషయంలో నేను లూథర్ వైపున నిలబడతాను! అది లూథర్ ముఖ్య శీర్షిక – పూర్తిగా ఈ విషయంలో అతనితో ఏకీభవిస్తాను!

"నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును" (రోమా 1:17).

ఈ పాఠ్యభాగాన్ని లూథరు ఎలా అర్ధం చేసుకున్నాడు? స్పర్జన్ లూథరు మార్పును బట్టి మనకు చెప్తున్నారు,

     లూథరు జీవితంలోని కొన్ని సంఘటనలను చెప్పడం ద్వారా నేను ఈ బోధను ఉదాహరిస్తాను సమగ్రంగా చెప్తాను. గొప్ప సంస్కరణ సువార్తపై వెలుగు తక్కువ పరిమాణంలో ప్రసరించింది. ఆ స్థితి స్తంభానికి కట్టబడిన, పాత బైబిలును తిరగేయడం ద్వారా, అతడు ఈ పాఠ్యభాగాన్ని కనుగొన్నాడు – "నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును." ఈపరలోకపు వాక్యము అతనిని తాకింది: దానిని పూర్తిగా అర్ధం చేసుకోలేక పోయాడు. అతని, మతపర ఉద్యోగములోను, అలవాటులోను అతడు శాంతిని కనుగొనలేక పోయాడు. ఎక్కువగా తెలియనందున, చాలా విషయాలు పరిశోధించాడు, ఎడతెగని కృషి చేసి, కొన్నిసార్లు అలసటతో కుప్పకూలి పోయేవాడు. మరణం ద్వారాము వరకు వచ్చాడు... భారముతో కొనసాగాడు, విశ్రాంతిని వెదుకుతూ, కాని కనుగొనలేక పోయాడు... [తరువాత] ప్రభువు తనకు మూడనమ్మకాల నుండి పూర్తీ విడుదల అనుగ్రహించాడు, అతడు చూసాడు యాజకుల ద్వారా కాదు, యాజకత్వము ద్వారా కాదు, ప్రయత్నాలు కాదు చేయగలిగింది ఏదీ కాదు, జీవించడానికి కాని, [క్రీస్తు నందలి] విశ్వాసము ద్వారా, మాత్రమే జీవించాలి. మన పాఠ్యభాగము [ఈ ఉదయము] [కేథలిక్] ఋషికి స్వతంత్రమిచ్చి, అతని ఆత్మను అగ్నిపై ఉంచింది.

      ["నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును" (రోమా 1:17).]

చివరకు లూథర్ క్రీస్తును మాత్రమే నమ్మాలి అనే పాఠ్యాన్ని అర్ధం చేసుకున్నారు. తన తల్లికి వ్రాసాడు, "నేను తిరిగి జన్మించినట్టుగా భావన పొందాను పరదైసుకు తెరువబడిన ద్వారాల ద్వారా ప్రవేశించును." స్పర్జన్ అన్నాడు,

     ఇది నమ్మిన వెంటనే చురుకుగా ఉండే స్థితిలో జీవించడం ప్రారంభించాడు. ఒక [యాజకుడు] యాజకుడు, పేరు టెట్ జెల్, జర్మనీ అంతా తిరుగుతూ డబ్బుకు పాప క్షమాపణ అమ్ముతూ ఉన్నాడు. నీ నేరమే అయినప్పటికిని, [డబ్బు] పెట్టె అడుగుభాగాన్ని నీ డబ్బు తాకినప్పుడు నీ పాపాలు పోతాయి. లూథర్ ఇది విని, విజ్రుంబించి, అన్నాడు, "అతని డబ్బాకు ఒక రంద్రము చేస్తాను," అలానే చేసాడు, చాలా ఇతర డబ్బాలలో కూడ. అతని వ్యాఖ్యానము గుడి ద్వారముపై ఉంచడం తప్పనిసరిగా సంగీతాన్ని మౌన పరచు మార్గము. లూథర్ ప్రకటించాడు పాప క్షమాపణ క్రీస్తు నందలి విశ్వాసము ద్వారా వస్తుంది, డబ్బు వెల చెల్లించకుండా పోపు జోక్యతలు ఎగతాళికి దారితీసాయి. లూథర్ అతని విశ్వాసము ద్వారా జీవించాడు, కాబట్టి మౌనముగా ఉండే అతడు, గర్జించు సింహము వలే తప్పులను ఎత్తి చూపించాడు. అతనిలో ఉన్న విశ్వాసము తీవ్ర జీవితములో అతనిని నింపింది, శత్రువుతో యుద్ధానికి దిగాడు. కొంతకాలము తరువాత ఆగ్స్ బర్గ్ కు రప్పించారు, వెళ్ళాక అక్కడికి, అతని స్నేహితులు వద్దని సలహా ఇచ్చినప్పటికినీ. అతనిని నాస్తికునిగా నిలబెట్టింది, తనకు జవాబు చెప్పుకోడానికి [ఇంపీరియల్ కౌన్సిల్] ముందు, ప్రతి ఒక్కరు [అతనికి చెప్పారు] వైదొలగమని, ఎందుకంటే తప్పనిసరిగా అతడు కాల్చబడతాడు [మాటను బట్టి], కాని అతడు అనుకున్నాడు సాక్ష్యము కలిగి ఉండాలని; కనుక ఒక వాహనములో, గ్రామము నుండి గ్రామానికి పట్టణము నుండి పట్టణానికి తిరిగి బోధించాడు, పేద ప్రజలు వచ్చి అతనికి కరచాలనము చేసేవారు, ఆయన జీవితానికి తెగించి క్రీస్తు కొరకు సువార్త కొరకు నిలబడ్డాడు కాబట్టి. మీకు గుర్తుందా అసెంబ్లీ ముందు ఎలా నిలబడ్డాడో [వార్మ్స్ లో], అతనికి తెలుసు మానవ శక్తికి సంబంధించి, అతని సమర్ధన, తన జీవితాన్నే బలకోనవచ్చు, బహుశా [కాల్చివేయబడవచ్చు] జాన్ హాస్ వలే, అయిననూ అతడు [నిలదొక్కుకున్నాడు] ఆయన దేవుడైన ప్రభువు కొరకు మనిషిలా నిలబడ్డాడు. ఆరోజు జర్మను డైట్ లో [కోర్టులో] లూథర్ ఒక పని చేసాడు దాని నిమిత్తము పదివేలసార్లు పదివేల తల్లుల పిల్లలు అతని పేరును ఆశీర్వధించాయి, మరి ఎక్కువగా అతని దేవుడైన ప్రభువు నామాన్ని ఆశీర్వదించారు (C. H. Spurgeon, “A Luther Sermon at the Tabernacle,” The Metropolitan Tabernacle Pulpit, Pilgrim Publications, 1973 reprint, Volume XXIX, pp. 622-623).

"నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును" (రోమా 1:17).

1950 ఆరంభంలో ఒక బాప్టిస్టు సంఘములో తొలిసారిగా లూథరును ఎదుర్కొన్నాను. ఒక ఆదివారము రాత్రి అతని గూర్చి నలుపు తెలుపు చిత్రము చూపించారు. గతానికి చెందిన ఒక వింత వ్యక్తిలా నాకు అనిపించాడు, నాకు ఆసక్తి కలగలేదు. ఆ చిత్రము దీర్ఘంగా ఉండి విసుగు పుట్టించింది. నా కాపరి, డాక్టర్ వాల్టర్ ఎ. పెర్గ్ కు, ఎందుకు అది చూపించిందా అని నాకు ఆశ్చర్యము కలిగింది. నేను చెప్పాలి ఈనాడు ఆ గొప్ప చిత్రాన్ని గూర్చి నాకు పూర్తిగా వేరే దృక్పధము ఉంది. దానిని ఇప్పుడు చూడాలనిపిస్తుంది! ఇక్కడ క్లిక్ చెయ్యండి ఆ చిత్రములోని ఒక దృశ్యము చూడడానికి.

నాకు మార్పు వచ్చిన చాలాకాలము తరువాత, నా రెండవ ఎదుర్కోలు లూథరుతో జరిగింది. నేను జాన్ వెస్లీ మార్పు అనుభవాన్ని గూర్చి చదివాను, అందులో వెస్లీ అన్నాడు,

ఒక సాయంకాలము చాల అయిష్టంగా ఆల్ డేర్స్ గెట్ వీధిలో ఉన్న ఒక సమాజానికి వెళ్లాను, అక్కడ ఒకరు రోమీయులకు వ్రాసిన పత్రికపై లూథరు ముందు మాట చదువుతున్నారు. ఎనిమిది నలభై ఐదుకు, క్రీస్తు నందలి విశ్వాసము ద్వారా అతని హృదయంలో దేవుడు పనిచేసిన విధానాన్ని వివరిస్తుండగా, నా హృదయము వింతగా వేడెక్కినట్టు నాకనిపించింది. నేను క్రీస్తును విశ్వసించినట్టు నాకనిపించింది, రక్షణకు క్రీస్తు మాత్రమే నిశ్చయత నాకివ్వబడింది; నా పాపాలను ఆయన తీసివేసాడని, నా పాపాలు, నన్ను, పాపమూ మరణము ధర్మ శాస్త్రము నుండి నన్ను రక్షించాడు (John Wesley, The Works of John Wesley, third edition, Baker Book House, 1979 reprint, volume I, p. 103).

ఇది నాకు ఒక అభిప్రాయాన్ని ఇచ్చింది, ఎందుకంటే నాకు తెలుసు వెస్లీ మొదటి గొప్ప మేల్కొల్పులో అతిశక్తివంత బోధకునిగా నిలిచాడు. వెస్లీ మారాడు లూథరు మాటలు వింటుండగా క్రీస్తు నందలి విశ్వాసము మూలముగా నీతిమత్వము అనే మాటలు.

తరువాత, నేను నేర్చుకున్నాను జాన్ బన్యన్, మన బాప్టిస్టు పూర్వికుడు, లూథరును గూర్చి చదివి హర్శనీయంగా మారాడు, "మార్టిన్ లూథరు రచనలలో లేఖనాల పఠనాన్ని విస్తరింప చేసాడు" (Pilgrim's Progress, Thomas Nelson, 1999 reprint, publisher's introduction, p. xii). బన్యన్ అన్ని కాలాలలో ఎక్కువగా చదవబడిన బాప్టిస్టు రచయిత అయ్యాడు!

జాన్ వెస్లీ, మెథడిష్టు, లూథరు మాటలు విని మారాడు. జాన బన్యన్, బాప్టిస్టు, లూథరు వ్రాసింది చదవడం ద్వారా మార్పు నొందాడు. నేననుకున్నాను లూథరులో చాల మంచితనము ఉందని. నేను కనుగొన్నాను రోమా పత్రిక లూథరు ప్రసంగములో హృదయము లాంటిది. లూథరు అన్నాడు,

ఈ పత్రిక కొత్త నిబంధన గ్రంధములో ప్రముఖ భాగము అతి పవిత్ర సువార్త, అది ఆమోదయోగ్యము ప్రతి క్రైస్తవుడు దానిని మాట వెంబడి మాట ద్వారా తెలుసుకోవాలి, కంఠత చెయ్యాలి, ప్రతి రోజు దానితో నిండిపోవాలి, ఆత్మకు అనుదిన ఆహారము వలే. ఎక్కువ అది చదువబడకూడదు, దాని చుట్టూ తిరుగకూడదు, దానిని గూర్చి ఎక్కువ ఆలోచిస్తే అది అతి ప్రశస్త మవుతుంది, రుచి కరముగా మారుతుంది (Martin Luther, “Preface to the Epistle to the Romans,” Works of Martin Luther, Baker Book House, 1982 reprint, volume VI, page 447).

ఈనాడు లూథరు ప్రాముఖ్యమని నేనెందుకు అనుకుంటున్నాను? ప్రాముఖ్యంగా ఎందుకంటే అతడు మనలను రోమా గ్రంధానికి తీసుకొని వెళ్తాడు, చాల తేటగా చూపిస్తాడు రోమా పత్రిక "నిజంగా కొత్త నిబంధన గ్రంధములో ప్రముఖ భాగమని చాలా పవిత్ర సువార్త అని." అదే మనం మళ్ళీ వినాలి "నిర్నయత్వత" ఉండే ఈ చెడు దినాలలో. అంతటి కంటే ఎక్కువగా, రోమా పత్రికకు మనము తిరిగి రావాలి! లూథరు రోజులలోని కెథలిక్కులు రోమా పత్రికలోని కీలక ప్రసంగాన్ని మర్చిపోయాడు. మన రోజులలోని "నిర్ణయకారులు" అదే పనిచేసారు. వారు రోమా పత్రిక చదవవచ్చు, కాని దాని నుండి ప్రయోజనము పొందుకోవడం లేదు. అందుకే "నిర్నయత్వత," చాల విధాలుగా, కెథలిజమ్ ను పోలి ఉంది. కేథలిక్కులు అన్నారు, "ఇది చేసి జీవించండి." "నిర్ణయకారులు" అన్నాడు, "ఇది చేసి జీవించండి." కాని రోమా 1:17 చెప్తుంది,

"నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును" (రోమా 1:17).

రోమా 3:20 గమనించండి.

"ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా [పాపి ప్రార్ధన చెప్పడం, చేతులేత్తడం, ముందుకు వెళ్ళడం, క్షమింపబడడానికి అడగడం] ఏ మనష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్పు తీర్చబడడు: ధర్మశాస్త్రము వలన పాపమూ అనగా ఎట్టిదో తెలియ చేయబడుచున్నది" (రోమా 3:20).

లూథరు అన్నాడు ఏమి చెయ్యాలా ఏమి చెయ్యకూడదో అనేది ధర్మశాస్త్రము బోధిస్తుంది అని మీరు అనుకోకూడదు. మానవ శాస్త్రాలు అలాగే పనిచేస్తాయి. మానవ శాస్త్రాలు సత్ర్కియాల ద్వారా నెరవేరతాయి, మీ హృదయము వాటితో ఎకీభవించనప్పటికిని. నీ హృదయంత రంగములో ఉన్న దానిని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు, దేవుని న్యాయ శాస్త్రము మానవుని అంతరంగిక హృదయమునకు విలువ ఇస్తుంది, సత్ర్కియలతో తృప్తి చెందదు, వేరేలా చేసిన పనులను ఖండిస్తుంది, హృదయంత రంగములో నుండి కానివి, అవి వేషధారణ అబద్ధాలు. అందుకే మనష్యులందరూ అబద్దీకులున్నారు, కీర్తనలు 116:11 లో, ఏ ఒక్కడు దేవుని ధర్మశాస్త్రాన్ని హృదయ పూర్వకంగా అవలంబించరు, ఎందుకంటే ప్రతి ఒక్కరు మంచిని అయిష్ట పడతారు చెడులో సంతోషము కోరుకుంటారు. ఒకవేళ, అక్కడ, మంచిలో ఇష్ట పూర్వక ఆనందము లేకపోతే, నీ హృదయంత రంగము మంచి చేయాలని కోరుకోవడం లేదు. అది దేవుని ధర్మశాస్త్రాన్ని అఇష్టపడి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తుంది. అప్పుడు తప్పక పాపముంది, దేవుని ఉగ్రత శిక్ష ఉంటాయి, బాహ్యంగా, సత్ర్కియలు, కనిపించినప్పటికినీ. వాస్తవానికి మీరు దేవుని ధర్మశాస్త్రముచే ఖండింపబడ్డారు, ఎందుకంటే నీ హృదయంత రంగము ఆయన ధర్మశాస్త్రము నాకు వ్యతిరేకంగా బలంగా తిరుగుబాటు చేస్తుంది.

కాని దేవుని కట్టడాలు నిన్ను సమర్ధించడానికి కాదు, రక్షించడానికి కాదు. రోమా 3:20 మళ్ళీ, గట్టిగా చదవండి.

"ధర్మశాస్త్ర సంబంధయైన క్రియల మూలముగా [లేక పనుల వలన] ఏ మనష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్పు తీర్చబడడు: ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది" (రోమా 3:20).

సాధ్యమైనంత మంచిగా ఉండాలని మీరు ప్రయత్నించవచ్చు. కాని దేవుడు బాహ్యంగా మిమ్ములను చూడడు. ఆయన మీ హృదయాన్ని చూస్తాడు. అక్కడ ఆయన పాములు విషపూరిత పురుగులు, తిరుగుబాటు పాపమూ చూస్తారు.

"ధర్మ శాస్త్ర సంబంధయైన క్రియల మూలముగా ఏమనష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్పుతీర్చబడట..." (రోమా 3:20).

రక్షింపబడడానికి ధర్మశాస్త్రానికి లోబడడానికి ఎంత ఎక్కువగా ప్రయత్నిస్తారో, అంత దారుణమైపోతారు. ఇది లూథరు మార్పు అనుభవములోను, వెస్లీ బనియన్ మార్పుల విషయంలోనూ వాస్తవము, వారు "మంచిగా ఉండడం" ద్వారా నీతిమంతులుగా తీర్చబడడానికి చాలా ప్రయత్నించారు. కాని ధర్మ శాస్త్రము ఇంకా ముందుకు వెళ్తుంది. అది మీ హృదయంలో చొచ్చుకొని భయంకర వాస్తవాన్ని చూస్తుంది నీవు పరిశుద్ధ దేవునికి వ్యతిరేకంగా హృదయంలోను మనసులోనూ పాపమూ చేసావని. రోమా 3:20 ఆఖరి మాటలు గమనించండి,

"ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియ బడుచున్నది" (రోమా 3:20).

మీరు మిమ్ములను బట్టి "విసిగిపోవాలి" – మీ హృదయపు పాపమూ విషయంలో!

కాని దేవుడు ఆత్మలకు ఒక నివారణ ఇచ్చాడు రక్షింపబడ ప్రయత్నించే వారికి. పాపాన్ని అధిగమించడానికి ఎంత ఎక్కువగా కష్టపడితే, అంత లోతుగా వారు పాపములోనికి ఈడ్వబడుచున్నారు. నీది అలాంటి పరిస్తితి కాదా? పాపమూ చెయ్యకుండా నీవు ఎంతగా కష్టపడుతున్నా, అంతరంగములో భయంకర పాపివి అయిపోతున్నావు – పాప విరుగుడుకు క్రీస్తు అద్భుత నివారణను ప్రక్కకు నెత్తి, నీ మంచితనాన్ని స్థిర పరచుకోడానికి ప్రయత్నిస్తున్నావు మీ జీవితాన్ని "తిరిగి సమర్పించు కోవడం ద్వారా," "ముందుకు వెళ్ళడం ద్వారా," "పాపి ప్రార్ధన" చెయ్యడం ద్వారా, రక్షణను గూర్చి ఎక్కువ నేర్చుకోవడం ద్వారా, అలా ధర్మశాస్త్రానికి సంబంధించి చాలా పనులు చెయ్యడం ద్వారా. కాని నీవు నేర్చుకున్నది, చెప్పేది, చేసేది, భావించేది దేవునితో నిన్ను సమాధాన పరచలేవు, ఆయనకు నీ హృదయపు మనస్సు యొక్క పాప భూ ఇష్టత తెలుసు.

నీకు ధర్మశాస్త్రము చెయ్యలేనిది, కృప, క్రీస్తు రక్తము నందలి "నీ విశ్వాసము" నీకు చెయ్యగలడు. క్రీస్తు రక్తములో మాత్రమే నీ పాపముల నుండి విమోచన దేవుని ఉగ్రత నుండి విడుదల నీకు కనుగొనగలవు. ఆయన నీ స్థానంలో చనిపోయాడు, నీ పాప ప్రాయశ్చిత్తము చెల్లించడానికి, ఆయన రక్తము సమస్త పాపముల నుండి నిన్ను కడుగగలదు! సిలువపై యేసు మీ అందరి పాపాల నిమిత్తం పూర్తీ వెల చెల్లించాడు.

నీకు చెయ్యడానికి ఇక ఏమి మిగిలింది? జవాబు రోమా 3:26 లో ఇవ్వబడింది,

"[తానూ] నీతిమంతుడును యేసు నందు విశ్వాసము గలవానిని, నీతిమంతునిగా తీర్చువాడనై యుండుటకు ఆయన ఆలాగు చేసెను" (రోమా 3:26).

యేసు నందు నమ్ముట. అది పూర్తీ జవాబు నశించు వ్యక్తి కష్టానికి, మంచి జీవితమూ జీవించడానికి "ధర్మశాస్త్రము" ను గైకొనడం, వేర్వేరు "నిర్ణయాలు" తీసుకోవడం ద్వారా. మీ సత్ర్కియలను "నిర్ణయాలను" పారేయండి, మనస్తత్వపర లెక్కను, ఇతరుల కంటే మంచివానినని గొప్పలు చెప్పుకోడాన్ని బయట పారేయండి. అలా నీవు రక్షింపబడనేరవు.

"[తానూ] నీతిమంతుడును యేసు నందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడనై యుండుటకు ఆయన ఆలాగు చేసెను" (రోమా 3:26).

క్రీస్తు రక్తము నందు విశ్వాసముంచుము, సిలువపై కార్చబడింది, పరలోకానికి మార్చబడింది, అక్కడ ఎన్నడు స్వచ్చంగా ఉంటుంది, అన్ని పాపాలు కడగగల సమర్ధత గలది. రక్తములో విశ్వాసముంచు, క్రీస్తు రక్తములో, నీవు అప్పుడు రక్షింపబడతావు! డాక్టర్ చాన్, ప్రార్ధనలో నడిపించండి.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రుదోం: రోమా 3:20-26.
ప్రసంగము ముందు పాట బెంజమిన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్:
"నా పాపలన్నింటి కొరకు"(నార్మన్ క్లేటన్ గారిచే, 1943).
“For All My Sin” (by Norman Clayton, 1943).