Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




శుద్ధి చేసే రక్తము

THE CLEANSING BLOOD
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము సాయంత్రము, అక్టోబర్ 4, 2015
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord's Day Evening, October 4, 2015

"యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును" (I యోహాను 1:7).


యేసు యోహానును శిష్యునిగా పిలిచినప్పుడు అతడు యుక్త వయస్కుడు. కాని అతడు అద్భుతమైన యవనస్తుడు. గెత్సమనే వనంలో యేసుతో అతని సన్నిహిత్వాన్ని చూడవచ్చు. యేసు అంధకారంలో ఉన్నప్పుడు తోటకు సమీపంలో మిగిలిన శిష్యులను వదిలి పెట్టాడు. ఆయన యోహానును ఇతర ఇద్దరు శిష్యులను తీసుకొని వెళ్ళాడు, "మిగులు వారు విబ్రాంతి నొందుటకును, దుఃఖాక్రాంతుడు అగుటకును ఆరంభించెను; నా ఆత్మ మరణ రోదనను చేసెను, ఇక్కడ చూడండి: అని, అతడు అన్నాడు" (మార్కు 14:33, 34).

సైనికులు యేసును బంధించడానికి వచ్చినప్పుడు, మిగిలిన శిష్యులు ఆయనను విడిచి పారిపోయారు. కాని యోహాను మరునాటి ఉదయము సిలువ వేయబడిన స్థలానికి సిలువను మోయుచున్న యేసును, కల్వరి దారిలో వెంబడించాడు. మిగిలిన వారు భయంతో దాక్కున్నప్పుడు, ఈ యవనస్థుడు ఒక్కడే యేసు తల్లిని సంరక్షిస్తున్నాడు, ఆమె తన కుమారుడు సిలువపై మరణించుట చూస్తుంది. అలా యోహాను శిష్యుడోక్కడే ఆరోజు యేసు మరణించుట చూసాడు. మిగిలిన వారు తలుపులు మూసుకొని, దాక్కున్నారు.

యేసు సిలువపై నుండి యోహానును తన తల్లిని చూసాడు. తన తల్లిని చూసుకోమని యోహానుకు చెప్పాడు. "నేను దప్పిగొనుచున్నాను" అని, యేసు చెప్పడం విన్నాడు. "సమాప్తమాయెను" అని సిలువపై యేసు చెప్పుట అతడు విన్నాడు. కాని అప్పుడు కూడ సిలువ వేయబడిన రక్షకుని నుండి యోహాను వెళ్ళిపోలేదు. క్రీస్తు ప్రక్కలో బల్లెము పొడిచిన సైనికున్ని యోహాను చూసాడు. "మరియు [వెంటనే] రక్తము నీళ్ళు వచ్చెను" (యోహాను 19:34). తరువాత అతడు ఇది జాగ్రత్తగా వ్రాసాడు, "మీరు ఇది నమ్మునట్లుగా" (యోహాను 19:35).

నా తల్లి చనిపోయాక ఇలియానాను కుమారులను తీసుకొని కారులో బయలుదేరి సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రికి వెళ్ళాను. గదిలో కొన్ని అడుగులు వేసి, ఒక్క క్షణం, ఆమె నిస్సహాయ, పాడైన శరీరము ప్లాస్టిక్ సంచిలో ఉంచబడింది. తల్లి బట్టలు లేకుండా ఉండడాన్ని చూస్తారని సిగ్గు పడుతూఉండేది. ఆమె పాదాలను చూసినప్పుడు ప్లాస్టిక్ సంచిలో అబ్బాయిలను హాలులోకి నెట్టాను. కాని ఆమె పాదాలు చూసిన ఆ క్షణం ఎన్నటికి నా బుర్రలో ముద్రింపబడింది. ఇది పద్దెనిమిది సంవత్సరాల క్రితం జరిగింది. ఇది నిన్ననే జరిగినట్టుగా నా మనసులో చూస్తున్నాను.

యోహాను విషయంలో కూడ అలాగే ఉంది. యేసు ప్రక్కలో బల్లెము పోటు చూసాడు. గాయాల నుండి రక్తము ప్రవహించుట చూసాడు. అది అతడు మర్చిపోలేదు. అరవై సంవత్సరాల తరువాత, ఒక వృద్ధునిగా, ఆఖరిగా జీవించిన శిష్యుడు, యోహాను ఇంకను ఆ రోజు చూసిన యేసు రక్తాన్ని గూర్చి ఆలోచిస్తున్నాడు. ఒక పెద్దగా వణుకు చేతులతో, ఒక పెద్ద చుట్టపై వ్రాసి ఉంచాడు, "యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును" (I యోహాను 1:7). ఎందుకు యేసు రక్తము యోహానుకు అంత ప్రాముఖ్యము?

I. మొదటిది, అది దేవుని కుమారుడైన, యేసు క్రీస్తు రక్తము.

మీకు తెలుసా, ఎవరో వ్యక్తి రక్తము కాదది. డాక్టర్ డబ్ల్యూ. ఎ. క్రీస్ వెల్, డల్లాస్ టెక్సాస్ మొదటి బాప్టిస్టు సంఘానికి, అరవై సంవత్సరాలుగా కాపరిగా ఉన్నాడు, అతనన్నాడు,

ఆయన శరీరదారియైన దేవుడు. పౌలు ఎఫెస్సీ పెద్దలకు అపోస్తలుల కార్యములు 20:28లో వ్రాసిన మాటల కంటే ప్రాముఖ్యమైన వచనము వేరొకటి లేదు, "దేవుడు తన స్వరక్త మిచ్చి, సంపాదించిన...తన సంఘమును కాయుటకు, మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి." అక్కడ ఆ విషయము, ఎంతో కచ్చితంగా, తేటగా, నిర్మొహమాటంగా, చెప్పబడింది [జాన్ మెక్ ఆర్డర్ వలే], దేవుని రక్తము అక్కడ సిలువపై కార్చబడింది. వాస్తవంగా ఆయన శరీర ధారియైన దేవుడు ఆత్మచే నడిపించబడిన వాడు మన నిమిత్తము బలిగా అర్పింపబడినాడు... కనుక బలోపేతంగా, క్రీస్తు రక్తము...మృత క్రియల నుండి మనస్సాక్షిని ఒప్పంప చేసి సజీవ దేవుని సేవించేలా చేస్తుంది...క్రీస్తు రక్తము, నిత్యాత్మ ద్వారా దేవునికి అర్పింపబడి, శోధించి, కడిగి, శుద్ధి చేసి, పవిత్రులుగా చేస్తుంది. (W. A. Criswell, Ph.D., “The Blood of Jesus,” The Compassionate Christ, Crescendo Book Publications, 1976, p. 72).

మెక్ ఆర్డర్ అన్నాడు, అపోస్తలుల కార్యములు 20:28 ని గూర్చి, "తండ్రి ప్రభువైన యేసు క్రీస్తుల ఏకత్వాన్ని పౌలు గట్టిగా నమ్మాడు, ఆయన క్రీస్తు మరణాన్ని గూర్చి అన్నాడు దేవుడు రక్తము కార్చుట – ఆయనకు శరీరము లేదు కనుక రక్తము లేదు" (The MacArthur Study Bible; note on Acts 20:28). అలా, మెక్ ఆర్డరు అన్నాడు పౌలు పొరబడ్డాడు, దేవునికి "రక్తము లేదు" అనడంలో. అది ప్రమాదకర ప్రస్తావన, ఎందుకంటే అది త్రిత్వము సిద్ధాంతాన్ని తక్కువ అంచనా వేస్తుంది. మనము మెక్ ఆర్డర్ ప్రస్తావనను కొట్టివేస్తున్నాము. మనము పౌలు డాక్టర్ క్రీస్ వెల్ లతో, ఏకీభవిస్తున్నాను, "ఇది దేవుని రక్తము సిలువపై కార్చబడింది" (ఐబిఐడి.).

II. రెండవది, ఇది యేసు క్రీస్తు రక్తము మన పాపల నుండి కడుగుతుంది.

అపోస్తలుడైన యోహాను అన్నాడు,

"యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును" (I యోహాను 1:7).

డాక్టర్ మెక్ గీ అన్నాడు, "పదము కడుగుట వర్తమాన కాలములో ఉంది – క్రీస్తు రక్తము మన పాపములన్నిటి నుండి కడుగుతూ ఉంటుంది" (Thru the Bible; note on I John 1:7). దాని అర్ధము యేసు రక్తము ఈ రోజు కూడ ఉనికిలో ఉంది. వర్తమాన పదము "కడుగుట" చూపిస్తుంది ఇప్పుడు కూడ, ప్రస్తుతము, క్రీస్తు రక్తము కడగడానికి అందుబాటులో ఉంది. మెక్ ఆర్డర్ అది నమ్మడు. అతడన్నాడు, "క్రీస్తు స్వంత శారీరక రక్తము, అది, పాపముల నుండి కడుగదు" (The MacArthur New Testament Commentary on Hebrews, p. 237). అది ఒక అబద్ధం!

"యేసు క్రీస్తు రక్తము కడుగుతుంది [వర్తమాన కాలములో] మన పాపలన్నిటి నుండి" (I యోహాను 1:7).

డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు,

మన సువార్త రక్తపు సువార్త; రక్తము పునాది; అది లేకుండా ఏమియు లేదు (The Way of Reconciliation, Ephesians 2, Banner of Truth Trust, p. 240).

మళ్ళీ, డాక్టర్ ల్లాయిడ్ అన్నాడు,

ఒక వ్యక్తి నిజంగా సువార్త ప్రకటించు చున్నాడా అనేదానికి అంతిమ పరీక్ష, ‘రక్తము’ ను గూర్చి అతడు ఎంత ఒక్కానించి చెప్తున్నాడో గమనించాలి. సిలువను గూర్చి మరణమును గూర్చి మాట్లాడితే సరిపోదు; పరీక్ష ‘రక్తము’ (ఐబిఐడి., పేజీ 331).

డాక్టర్ సి. ఎల్. కాగన్ మన సంఘ సహాయక కాపరి. డాక్టర్ కాగన్ మారకముందు ఒక సంవత్సరం పాటు, జాన్ మెక్ ఆర్డర్ గుడికి హాజరయ్యాడు. డాక్టర్ కాగన్ అన్నాడు, "నేను మారక మునుపు ఆయన బోధ కింద ఉన్నాను. ఆయన నా కాపరి. బైబిలు నాకు బోధించాడు... నాకింకా గుర్తుంది చాల వివరంగా ఇప్పటికి కూడ. అయినను, ఆయన బోధలో నేను మారలేదు... డాక్టర్ మెక్ ఆర్డర్ ఆధిపత్యపు నిర్నయత్వత నాకు క్రియల మూలముగా రక్షణగా నాకు వచ్చింది... నేను నమ్ముతాను క్రీస్తు రక్తమును గూర్చి మన సువార్తలో ప్రబోధములో స్పష్టత ఉండాలి... గొప్ప సువార్త ప్రసంగాలు మనము బోధించాలి దేవుడు తద్వారా చాలా ఆత్మలు రక్షిస్తాడు" (Preaching to a Dying Nation, The Baptist Tabernacle of Los Angeles, 1999, pp. 183, 184).

నేను పూర్తిగా డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ తో ఏకీభవిస్తున్నాను "క్రీస్తును గూర్చి మాట్లాడితే చాలదు [క్రీస్తు] మరణాన్ని గూర్చి... ఒకవ్యక్తి నిజంగా సువార్త బోధిస్తున్నాడా, అనే దానికి పరీక్ష ‘రక్తముపై’ అతడు ఒక్కనింపు లేదా గమనించుట." ఆమెన్! డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ అలా అన్నందుకు నాకు ఆనందంగా ఉంది! 58 సంవత్సరాలుగా నేను సువార్త ప్రకటిస్తూ ఉన్నాను. అనుభవ పూర్వకంగా నాకు తెలుసు నశించు పాపులు ఆయన రక్తముతో వారి పాపాలు కడుగుతాడని గ్రహించుకోవాలి. ఒక నియమావలిగా గాని, నరకముపై ప్రసంగము, బైబిలు ప్రవచనముపై ప్రసంగముచే గాని, వారు రక్షింపబడరు – ఆరంభంలో ఇవి సరియే కావచ్చు, కాని మనం "అసలు విషయానికి" వచ్చినప్పుడు – మార్పిడి విషయము – మనం రక్షకుని రక్తముపై ప్రసంగాలు చెయ్యాలి.

రక్తముపై ప్రసంగాలు నశించు వారికి మాత్రమే కాదు. కొన్నిసార్లు నేననుకుంటాను, "ఓ దేవా! నీ కుమారుని రక్తము లేకుండా ఒక్కరోజైనా ఎలా జీవిస్తాను!" విచారములో, యేసు క్రీస్తు రక్తము మాత్రమే, నన్ను ఉత్సాహ పరుస్తుంది! విచారము నిరుత్సహములో అవే ఆహారము పానియము.

కడుగు రక్తముకై నేను ఆయనను స్తుతిస్తున్నాను,
   ఎంత అద్భుత రక్షకుడు!
దేవునితో నా ఆత్మను సమాధాన పర్చాడు;
   ఎంత అద్భుతము రక్షకుడు!
ఎంత అద్భుతము రక్షకుడు యేసు, నా యేసు!
   ఎంత అద్భుతము రక్షకుడు, యేసు నా ప్రభువు!

ఆ పాత పాట చాలా సంవత్సరాలు పాడలేదు, నాకు రాత్రి అది వచ్చింది! నేను పాడాను మరియు పాడాను, నా హృదయము ఆనందంతో నింపబడే వరకు! నాతో పాడండి! పాటల కాగితంలో 7 వ పాట.

కడుగు రక్తముకై నేను ఆయనను స్తుతిస్తున్నాను,
   ఎంత అద్భుత రక్షకుడు!
దేవునితో నా ఆత్మను సమాధాన పర్చాడు;
   ఎంత అద్భుతము రక్షకుడు!
ఎంత అద్భుతము రక్షకుడు యేసు, నా యేసు!
   ఎంత అద్భుతము రక్షకుడు, యేసు నా ప్రభువు!
("ఎంత అద్భుత రక్షకుడు!" ఎలీషా ఎ. హాఫ్ మాన్ చే, 1839-1929).
(“What a Wonderful Saviour!” by Elisha A. Hoffman, 1839-1929).

నా పాటల పుస్తకములో చూసాను కాని నాకు దొరకలేదు. 50 సంవత్సరాల క్రిందటి బాప్టిస్టు పాటల పుస్తకము వెదికాను, ఆపాట మొదటి చైనీయ బాప్టిస్టు సంఘములో పాడేవారము. అక్కడ దొరకింది! పాత స్నేహితుడు చాల సంవత్సరాల తరువాత చూసినట్టుగా అనిపించింది. నా కళ్ళల్లో కన్నీళ్లు కారాయి అది పాడుచుండగా. నెమ్మదిగా పాడండి!

కడుగు రక్తముకై నేను ఆయనను స్తుతిస్తున్నాను,
   ఎంత అద్భుత రక్షకుడు!
దేవునితో నా ఆత్మను సమాధాన పర్చాడు;
   ఎంత అద్భుతము రక్షకుడు!
ఎంత అద్భుతము రక్షకుడు యేసు, నా యేసు!
   ఎంత అద్భుతము రక్షకుడు, యేసు నా ప్రభువు!

"నిపుణులు" నాతో అన్నారు నేను "వివరణాత్మక" ప్రసంగాలు బైబిలు వచనాల నుండి చెప్పాలని! నేను "నిపుణుల" మాట వినలేను! వినలేమో, వినలేను! ఒక వచనము మూలుగు పీల్చాలి – ఒక వచనము – పూర్వీకుల వలే, వారిని అనుసరించిన పురిటాన్ల వలే – వైట్ ఫీల్డ్, వెస్లీ, జాన్ సెన్నిక్, డేనియల్ రాడ్ లేండ్, హోవేల్ హేరిస్ ల వలే – దేవుడు వారిని దీవించు గాక! – జోసెఫ్ పార్కర్, స్పర్జన్, బోధకుల భోధకుడు. వారి వలే, ఒకటి రెండు వచనాలపై బోధించాలి – లేక వచనంలో ఒక భాగాముపై బోధించాలి. ఒక విషయము నుండి వేరే విషయానికి నా బాధలో నేను వెళ్ళలేను. నాకు ఎముకలలోని మాంసము కావాలి, మూలుగ కావాలి! అదే నా ఆత్మను పోషిస్తుంది – మీ ఆత్మను కూడ! ఎముకలలోని మూలుగ!

"యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులను చేస్తుంది" (I యోహాను 1:7).

దెయ్యము వచ్చి గుసగునలాడుతుంది, "నువ్వలా చేస్తే నీవు గొప్ప ప్రసంగీకుడవని వారు అనుకోరు." నేను తనతో అన్నాను – "నేను ‘గొప్ప బోధకుడనని’ వారను కుంటున్నారా లేదా నేను పట్టించుకోను? దానిని నేను ఏమాత్రము లెక్క చెయ్యను." నా గురి నా ఆశ, నా మహిమ నా ఆనందము, ఒక నశించు పాపి ప్రవాహము దగ్గరకు రావడం, యేసు క్రీస్తు ప్రశస్త రక్తము ద్వారా వారి పాపములు కడుగబడడం.

నశించిన ఇద్దరు బాప్టిస్టు బోధకులు నాకు తెలుసు. వారి జీవితాలు చూపిస్తున్నాయి వారు ఎన్నడు పునరుద్దరింపబడలేదని, మారలేదని, రక్షింపబడలేదని. మొదటివాడు నా చాలా ప్రసంగాలు చదువుతున్నాడు. రెండవ నశించు బోధకుడు సంవత్సరాలుగా నా స్నేహితుడయిన, చైనీయ కాపరి శరీరాన్ని "చూస్తుండే వాడు." అతని శరీరాన్ని చూసాక గదిలోనుండి బయటకు వచ్చాను. ఈ నశించు బోధకుని ముఖాముఖిగా ఎదుర్కొన్నాను. చాలా సంవత్సరాలుగా అతడు నాకు తెలుసు. అతని సాదు చేయలేని ఉద్రేకాల వలన అంతా పోగొట్టుకున్నాడు. నేను అతని చేతులు ఊపాను. అతని ఆరోగ్యము గూర్చి అడిగాను. తరువాత అన్నాను, "అంతర్జాలములో నా ప్రసంగాలు చదవండి." నవ్వి అన్నాడు, "పరిహాసమా" అని? వెబ్ సైట్ లో ప్రతివారము చదువుతున్నాను!" నా హృదయము ఆనందంతో నిండుకుంది! అర్ధ శతాబ్దముగా అతడు నా స్నేహితుడు! నేను తనని విఫలుని చెయ్యకూడదు! విఫలుని చెయ్యకూడదు! "గొప్ప ప్రసంగీకునిగా" తలంచ కూడదు. "నేను తప్పక అతని విఫల పరచకూడదు! విఫల తప్పక పరచకూడదు! అన్ని చోట్ల ఉన్న నశించు పాపులకు నేను చెప్పాలి,

"యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులను చేస్తుంది" (I యోహాను 1:7).

కడుగు రక్తముకై నేను ఆయనను స్తుతిస్తున్నాను,
   ఎంత అద్భుత రక్షకుడు!
దేవునితో నా ఆత్మను సమాధాన పర్చాడు;
   ఎంత అద్భుతము రక్షకుడు!
ఎంత అద్భుతము రక్షకుడు యేసు, నా యేసు!
   ఎంత అద్భుతము రక్షకుడు, యేసు నా ప్రభువు!

నశించుట అంటే నాకు తెలుసు! నశించు బోధకుని భావన నాకు తెలుసు – ఎందుకంటే నేను మూడు సంవత్సరాలు నశించు ప్రసంగీకునిగా ఉన్నాను, 17 వ సంవత్సరంలో "ప్రసంగించడానికి సమర్పించుకున్నప్పటి నుండి" 20 వ సంవత్సరంలో రక్షింపబడే వరకు. అలా నశించుట భయంకర భావన. నశించుట అనేది భూమిపై నరకము లాంటిది, దేవుని సహవాసపు గుమ్మముల నుండి తొలగుట, కచ్చితము లేదు, ఎల్లప్పుడూ భాదలు, ఎప్పుడు భయము, ఎప్పుడు ఖండించుకోవడం! ఓ, ప్రియ స్నేహితుడా, నాకు ఒక ఫోన్ చెయ్యండి. నేను నీ ఆత్మను తిరస్కరించను – నీ నుండి తొలగిపోను. పిలిస్తే ఒక మార్గము చూపడానికి సర్వదా ప్రయత్నిస్తాను, సమాధాన పరచడానికి – నూతన జీవితపు కడుగు మార్గము – దైవ కుమారుడైన యేసు క్రీస్తు, రక్త మార్గము! ఆ మార్గము నుండి మూడు సంవత్సరాలు తొలగిపోయాను. దాని కన్నా ఎక్కువగా మీరు తొలగి ఉంటారు. ఎందుకు వేచి ఉండాలి? క్రీస్తు రక్తము మీకు లేదని తెలుసు. ఇప్పుడు, వచ్చి అందులో స్నానము చేయండి. కుష్టు రోగియైన నయమానుతో ప్రవక్త అన్నాడు, "యోర్దాను నదిలో ఏడుసార్లు మునుగు నీవు శుద్దుడవు అవుతావు" (సిఎఫ్. II రాజులు 5:10, 14). ఈ రాత్రి మీతో చెప్తున్నాను, "యేసు రక్తములో ఒకసారి మునుగు, నీవు ఎన్నటికిని శుద్దుడవుగా ఉంటావు!

"యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులను చేస్తుంది" (I యోహాను 1:7).

కడుగు రక్తముకై నేను ఆయనను స్తుతిస్తున్నాను,
   ఎంత అద్భుత రక్షకుడు!
దేవునితో నా ఆత్మను సమాధాన పర్చాడు;
   ఎంత అద్భుతము రక్షకుడు!
ఎంత అద్భుతము రక్షకుడు యేసు, నా యేసు!
   ఎంత అద్భుతము రక్షకుడు, యేసు నా ప్రభువు!

జాన్ సంగ్ తెలివైన చైనీయ యవనస్థుడు చదువు కోసం అమెరికా వచ్చాడు. విఫలుదయ్యాడని అనుకున్నాడు. అతని తండ్రి కోరిన విషయంలో విఫలుడయ్యాడు. సెమినరీలో కలిసిన అమ్మాయి వలన విఫలుడయ్యాడు. శాంతి కనుక్కోవడంలో విఫలుడయ్యాడు. నేరారోపణ మనస్సాక్షితో వేధింపబడ్డాడు. ఆత్మీయ పోరాటములో ఉన్నాను. తరువాత, ఫిబ్రవరిలో, ఒక సాయంకాలము ఆయన ముందున్న అతని జీవిత పాపాలు చూసాడు. మొదట అనిపించింది తప్పించుకునే మార్గము లేదని నరకానికి పోవలిసిందేనని. తన పాపాలు మరచి పోవాలనుకుంటున్నాడు, కాని వీలు కావడం లేదు. అతని హృదయాన్ని తొలిచేసాయి. ఇంటికి వెళ్లి బైబిలు వెదికాడు. లూకా 23 అధ్యాయము, యేసు సిలువ మరణము చదివాడు. తన పాపాల కొరకు యేసు సిలువపై మరణించే దృశ్యము ఉదృతమనిపించి సిలువ చెంత ఉండి, ప్రశస్త రక్తము ద్వారా పాపాలు కడగబడాలని బ్రతిమాలాడు. అర్ధరాత్రి వరకు ఏడుస్తూ ప్రార్ధించాడు. తన హృదయంలో ఒక స్వరము విన్నాడు, "కుమారుడా, నీ పాపములు క్షమింపబడినవి." అతని భుజాల నుండి ఒక్కసారిగా పాప భారము క్రింద పడిపోయింది. గొప్ప ఉపశమనము పొందాడు మోకాళ్ళని "హల్లెలూయా" అని అరిచాడు! తన గదిలోనికి వెళ్లి విడుదలకై అరుస్తూ దేవుని స్తుతించాడు (adapted from A Biography of John Sung by Leslie T. Lyall, China Inland Mission Overseas Missionary Fellowship, 1965 reprint, pp. 33, 34). అతడు చైనాలో అంత్యంత గొప్ప సువార్త బోధకుడయ్యాడు!

"యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులను చేస్తుంది" (I యోహాను 1:7).

మీరు యేసు నొద్దకు రావాలని బ్రతిమాలుచున్నాను. మీ అనుమానాలు భయాలు ప్రక్కన పెట్టండి. రక్షకుని నొద్దకు రండి. ఆయన ప్రశస్త రక్తము ద్వారా కడుగబడండి. ఆమెన్. డాక్టర్ చాన్, ప్రార్ధనలో నడిపించండి.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రుదోం: లూకా 23:39-47.
ప్రసంగము ముందు పాట బెంజమిన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్:
"ఎంత అద్భుత రక్షకుడు!" (ఎలీషా ఎ. హాఫ్ మాన్ చే, 1839-1929).
“What a Wonderful Saviour!” (by Elisha A. Hoffman, 1839-1929).


ద అవుట్ లైన్ ఆఫ్

శుద్ధి చేసే రక్తము

THE CLEANSING BLOOD

by Dr. R. L. Hymers, Jr.

"యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును" (I యోహాను 1:7).

(మార్కు 14:33, 34; యోహాను 19:34, 35)

I. మొదటిది, అది దేవుని కుమారుడైన, యేసు క్రీస్తు రక్తము,
అపోస్తలుల కార్యములు 20:28.

II. రెండవది, ఇది యేసు క్రీస్తు రక్తము మన పాపల నుండి కడుగుతుంది,
I యోహాను 1:7.