Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
నీరు మరియు రక్తము

THE WATER AND THE BLOOD
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము ఉదయము, సెప్టెంబరు 20, 2015
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord's Day Morning, September 20, 2015

"సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్ళును కారెను. ఇది చూచిన వాడు సాక్ష్య మిచ్చుచున్నాడు, అతని సాక్ష్యము సత్యమే: మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని, ఆయనను ఎరుగును" (యోహాను 19:34, 35).


అపోస్తలుడైన యోహాను పన్నెండు మందిలో చిన్నవాడు. యోహానుకు 18 సంవత్సరాల వయసు. అయిననూ సిలువ వరకు యేసును వెంబడించిన వాడు ఈ అపోస్తలుడొక్కడే. మిగిలిన వారు దాక్కున్నారు. దానిలో ఒక పాటముంది. అమెరికా సైన్యము 18 నుండి 22 మధ్య వారిని యుద్ధానికి తీసుకుంటారు. వృద్ధులు పట్టింపు కలిగి తక్కువ ధైర్యంగా ఉంటారు. నేననుకుంటాను చరిత్రలో ప్రతి పెద్ద ఉజ్జీవము యవనస్తులచే నడిపింప బడింది – ప్రతి ఒక్కటి! వృద్ధుల ఉజ్జీవాన్ని గూర్చి నేను ఎప్పుడు వినలేదు.

నేను జాగ్రత్తగా, ఉండాలి. గతవారము ఉజ్జీవము ఉద్ఘాటన ఆపేసాను, ఎందుకంటే ఎక్కువ తికమక తక్కువ మేల్కొలుపు నేను చూసాను. అలాంటి విషయాలపై నా సలహా మీకు అవసరము. నేను వృద్ధ సైనికున్ని. నేను చాలా పోరాటాల ద్వారా వెళ్ళాను – అందులో కొన్ని చాలా గొప్ప పోరాటాలు! వేదాంత కళాశాలలో బైబిలును గూర్చి పోరాటము. గర్భస్రావానికి వ్యతిరేకంగా యుద్ధము. చెడ్డ చిత్రము, "క్రీస్తు ఆఖరి శోధన" కు వ్యతిరేకంగా యుద్ధము. రుక్మనిజంకు వ్యతిరేకంగా యుద్ధము. నిర్ణయత్వతకు వ్యతిరేకంగా యుద్ధము. ఒలివాస్ చీలిక సమయంలో మన సంఘాన్ని విడిచిన వారి విషయంలో దీర్ఘ పోరాటము. మరియు, మూడు పూర్తిగా అసాధారణమైన దేవునిచే పంపబడిన ఉజ్జీవాలకు, నేను సజీవ సాక్షిని. కావున, ఈ వృద్ధ సైనికుడు చెప్తున్నాడు, "ఎదురు చూడండి! మనం ఇంకా సిద్ధంగా లేము!" వృద్ధ సైనికులకు అలాంటివి తెలుస్తాయి.

డగ్లస్ మెక్ ఆర్డరు అమెరికా గొప్ప జనరల్ లలో ఒకరు. II ప్రపంచ యుద్ధములో అధ్యక్షులు రూస్ వెల్ట్ ఫిలిప్పీయుల నుండి బయటికి లాగాడు. ఆయన వెళ్తున్నప్పుడు, జనరల్ మెక్ ఆర్డరు అన్నారు, "నేను మళ్ళీ వస్తాను." అలా చేసాడు! ఆయన గెలిచాడు! దేవునికి వందనాలు! యవనులారా, మనము తిరిగి వస్తాము – నేను నమ్ముతాను, ఇప్పుడో తరువాత, మన కాలములో మనము ఉజ్జీవము చూస్తాము!

ప్రభువా, ఉజ్జీవము పంపించండి,
ప్రభువా, ఉజ్జీవము పంపించండి,
ప్రభువా, ఉజ్జీవము పంపించండి –
మీ దగ్గర నుండి రానివ్వండి!

యోహాను దగ్గరకు వెళ్దాం! ఎలాంటి వ్యక్తీ! అతడు పేతురు కంటే ధైర్యవంతుడు! తోమా కంటే ఎక్కువ విశ్వాసము గలవాడు. సిలువ ప్రక్క ఉన్నాడు. మీకు తెలుసా, ఆయన జీవితాన్నే తెగించాడు! క్రీస్తు తల్లిని రక్షిస్తూ, అక్కడ నిలబడ్డాడు. అతడు యుక్త వయస్కుడు. కాని ఎలాంటి వ్యక్తీ! ఎలాంటి నాయకుడు! సిలువ వరకు రక్షకుని వెంబడించాడు! సిలువపై అతని ప్రభువు యజమానుడు, మరణించుట చూసాడు! అంతా అయిపోయిందనుకున్నాడు. కాని కాదు. అయిపోలేదు. క్రీస్తు అన్నాడు, "నేను తిరిగి వస్తాను." మన గొప్ప రక్షకుడు, మన గొప్ప జనరల్ తిరిగి వస్తాడు! ఆయన అన్నాడు, "నేను మళ్ళీ వస్తాను" (యోహాను 14:3). ఆయన చెప్పిందే చేస్తాడు!

ఇరాకులో వారు మనలను కొడుతున్నారు. ఇరానులో కొడుతున్నారు. సిరియాలో కొడుతున్నారు. ఉత్తర ఆఫ్రికాలో కొడుతున్నారు. శ్వేత సౌధములో కూడ కొడుతున్నారు! అతడు ఒక నియంత అవవచ్చు! అమెరికా సెనేటర్ ఆ అవకాశాన్నే వ్యక్త పరిచాడు. భయబ్రాంతుల పరిపాలలోనికి మనం వెళ్ళవచ్చు! మనం భూమి క్రింది భాగానికి వెళ్ళవచ్చు – చైనాలో కూడ అలానే బలవంతపెట్టారు. వారి ఏమి చేసినప్పటికినీ, మన గొప్ప ఆజ్ఞ నిచ్చువాడు చెప్పాడు, "నేను మళ్ళీ వస్తాను!" దేవునికి వందనాలు! మనకా వాగ్ధనముంది! "ఆయన తిరిగి వస్తాడు" – పాట పాడండి.

ఆయన తిరిగి వస్తున్నాడు, ఆయన తిరిగి వస్తున్నాడు,
ఆ యేసే, మనష్యులచే తిరస్కరింపబడినవాడు;
ఆయన తిరిగి వస్తున్నాడు, ఆయన తిరిగి వస్తున్నాడు,
శక్తితో గొప్ప మహిమతో,
ఆయన తిరిగి వస్తున్నాడు!
("ఆయన తిరిగి వస్తున్నాడు" మాచెల్ జాన్ స్టన్ కెంప్ చే, 1871-1937).
(“He is Coming Again” by Mabel Johnston Camp, 1871-1937).

తిరిగి యోహాను దగ్గరకు! ఎంత గొప్ప నాయకుడు! ఎలాంటి మనిషి! సిలువపై తన ప్రభులైన జమానుడు చనిపోవుట చూసాడు! అంతా అయిపోయిందనుకొన్నాడు. అలా అయి, ఉండవచ్చు...ఆయన మనస్సులో యేసు మాటలు తప్పక పరుగెత్తి ఉండాలి,

"మనష్యు కుమారుడు మనష్యుల చేతికి అప్పగింపబడబోవుచున్నాడు: వారాయనను చంపుదురు – మూడవ దినమున ఆయన లేచును" (మత్తయి 17:22, 23).

"కావచ్చు!" "కాదు, అయి ఉండవచ్చు!" "కావచ్చు!" యోహాను మనసులో ఈ తలంపులు పరుగెత్తి ఉండాలి. ఆయన చూస్తున్నాడు. ప్రతి దానిని వివరంగా చూసాడు. చాల ప్రాముఖ్యమైన దానిని చూస్తున్నట్టు యోహానుకు తెలుసు. నిజానికి, అంత ప్రాముఖ్యమైన దానిని మునుపెన్నడూ చూడలేదు. యోహానుకది తెలుసు అనుకుంటాను. ఒకరోజు ఇవన్ని రాస్తానని కూడ ఆయనకు తెలుసు! వాస్తవంగా తెలియాలి. ప్రతీ వివరణ అతనికి గుర్తుండాలి. ఎర్నెస్ట్ హెమింగ్ వేవలే, పూర్తిగా "వాస్తవంగా – తారుమారు లేకుండా మోసము లేకుండా అతడు రాయాలి." కాబట్టి యోహాను అంతా చాలా జాగ్రత్తగా చూసాడు, మనసులో నమోదు చేసుకున్నాడు.

మనం ప్రేమించిన వారు చనిపోతే అలా చేస్తాము కదా? మనం ఏమిటో మనకు గుర్తుంటుంది. చిన్న వివరాలు గుర్తుంటాయి. మన మనసులో టేపులు మళ్ళీ మళ్ళీ వింటాం. మీరలా చేయరా?

నా వయస్సులో ఉన్న ప్రతి అమెరికనును అధ్యక్షుడు కెన్నెడీ కాల్చబడినప్పటి వివరాలు జ్ఞాపకం ఉంటాయి. ఎన్నటికీ అవి మన చరిత్రలో నమోదయి పోయాయి. నా మామ్మ చనిపోయిన రోజు నాటి ప్రతి చిన్న విషయము నాకు గుర్తుంది – అది 58 సంవత్సరాల క్రితం నావయస్సు అప్పుడు 15. నా మధుర తల్లి చనిపోయిన రోజు నాటి ప్రతి చిన్న విషయం నాకు గుర్తుంది. నేనెక్కడున్నానో తెలుసు. నేను చదువుతున్నది నాకు తెలుసు. ఆమె ఆసుపత్రి గది ఎలా ఉండేదో తెలుసు. గోడపై ఉన్న పటము తెలుసు. ఆమె ఎలా ఉండేవారో గుర్తుంది. నర్సు ఏమి చెప్పిందో గుర్తుంది. డాక్టర్ ఎలా ఉన్నాడో గుర్తుంది. ఆమె బట్టలు కూడ గుర్తున్నాయి. ఆసుపత్రి వాసన గుర్తుంది. ఎన్నటికి ఈ వివరాలు నా మనసులో ముద్రింపబడ్డాయి.

ఆ రోజు యోహాను విషయము కూడ అంతే. యేసు సిలువపై మరణించుట ఆయన ఎప్పుడు మర్చిపోలేదు.

"సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్ళును కారెను. ఇది చూచిన వాడు సాక్ష్య మిచ్చుచున్నాడు, అతని సాక్ష్యము సత్యమే: మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని, ఆయనను ఎరుగును" (యోహాను 19:34, 35).

డాక్టర్ ఆర్. సి. హెచ్. లేన్ స్కీ అన్నాడు, "ఈ సత్యము [the heretic Cerinthus and] ఆది యోగా శాస్త్రికులు తిరస్కరించారు. వారి ఆలోచనలో లోగోస్ [పదము] శరీర రూపము దాల్చలేదు; లోగోస్ ఆత్మ (‘క్రీస్తు ఇయోన్’ అలా పిలిచేవారు) యేసుపై దిగివచ్చినది; ‘క్రీస్తు’...శ్రమల ముందు విడిచి వెళ్ళిపోయింది, అది హిప్పీ సిద్ధాంతము. ఇది ఒక సహవాసము లేక సమావేశము ‘కుమారుడైన యేసు, (దేవుని) రక్త శుద్ధి త్యాగము లేకుండా.’ దీనిని ఈనాడు అందరు చెప్పుకుంటారు [తృణీకరింపబడిన] ‘పాతరక్త వేదాంతము.’ ‘రక్తము’ ఎక్కువ స్పష్టమైనది ‘మరణము’ కంటే, ఎందుకంటే ‘రక్తము’ త్యాగాన్ని చూచిస్తుంది. ఎప్పుడు కార్చబడేది రక్తము. దేవుని గొర్రె పిల్ల రక్తము కార్చాడు [నెరవేర్పు] కొరకు...అది ‘కుమారుడు, యేసు’ యొక్క రక్తము, యేసు మానవునిగా మానవ స్వభావంతో ‘ఆయన కుమారుడు,’ జీవితమునకు లోగో, త్రిత్వములో రెండవ వ్యక్తి, ఆయన శరీరదారి ఆయెను (యోహాను 1:14), ఆయన రక్తము కార్చబడింది, మన పాపములన్నింటి నుండి, శుద్ధి చేయగల శక్తి గలది" (R. C. H. Lenski, Th.D., The Interpretation of the Epistles of St. John, Augsburg Publishing House, 1966, p. 389; comments on I John 1:7).

డాక్టర్ లెన్ స్కీ ఒక లూథరన్. కానీ నేను (మరియు ఎవరికోసం ఐన) ఎవరినైనా పట్టించుకోను అని చెప్పాడు – అతడు సరియే – "పాతరక్తము వేదాంతము" తిరస్కరింపబడిన సమయము.

"రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును" (లేవీయు కాండము 17:11).

"మనలను ప్రేమించుచు తన రక్తము వలన, మన పాపముల నుండి మనలను విడిపించెను" (ప్రకటన 1:5).

భయపడకుండా పాడడం, నాకిష్టం. జాన్ మెక్ ఆర్డర్ సంఘములో పాడాలని నాకిష్టం! అతడు రక్తాన్ని కించ పరుస్తాడు. జాన్ మెక్ ఆర్డరు కొరకు పాడాలనుకుంటున్నాను!

కడిగే శక్తి కొరకు యేసు నొద్దకు ఎప్పుడైనా వచ్చావా?
   గొర్రె పిల్ల రక్తములో కడుగబడ్డావా?
ఈ ఘడియలో ఆయన కృప యందు పూర్తిగా విశ్వాసముంచుచున్నావా?
   గొర్రె పిల్ల రక్తములో కడుగబడ్డావా?
రక్తములో కడుగ బడ్డావా,
   ఆత్మలను శుద్ధి చేసే గొర్రె పిల్ల రక్తములో?
నీ వస్త్రాలు మచ్చలేనివిగా ఉన్నాయా? హిమము కంటే తెల్లగా ఉన్నాయా?
   గొర్రెపిల్ల రక్తములో కడుగబడ్డావా?
("రక్తములో కడుగబడ్డావా?" ఎలీషా ఎ. హాఫ్ మాన్ చే, 1839-1929).
(“Are You Washed in the Blood?” by Elisha A. Hoffman, 1839-1929).

అవునట్టు, "పాతరక్తము వేదాంతములో" ఏది సరిగ్గా తప్పు? డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు, ‘ప్రజలు ఈ ‘రక్తము వేదాంతాన్ని’ అసహ్యించుకుంటారు, కాని వేరే యోగ్యతా గల వేదాంతము లేదు క్రీస్తు కార్చిన రక్తము కాకుండా " (Martyn Lloyd-Jones, M.D., Assurance (Romans 5), Banner of Truth Trust, 1971, p. 148).

నిజానికి రెండే వేదాంతాలు ఉన్నాయి – మంచి క్రియల వేదాంతము, క్రీటు రక్తము వేదాంతము. ఫిన్నీ వేదాంతము లూథర్ వేదాంతము. నిర్నయత్వత వేదాంతము సంస్కరణ వేదాంతము – రెండే వేదాంతాలు, ఎన్నుకోండి. సరైనది ఎన్నుకుంటారనుకున్నాను, ఎందుకంటే "రక్తము చిందింపబడకుండా విమోచనము లేదు" (హెబ్రీయులకు 9:22). కయీను కూరగాయలు అర్పణతో వచ్చాడు (పనులు, ప్రార్ధనలు, నిర్ణయాలు). అతని సహోదరుడు హేబెలు రక్తపు అర్పణతో దేవుని యొద్దకు వచ్చాడు. కయీను తిరస్కరింప బడ్డాడు. హేబెలు రక్షింపబడ్డాడు. ఇది ఆ రెండు మార్గాలకు తగిన ఉదాహరణ – క్రియల ద్వారా రక్షణ రక్తము ద్వారా రక్షణ. అది బైబిలులో ఉంది, తేటగా సాదాగా! ప్రజలు అనుకుంటారు మంచిగా ఉండడం ద్వారా రక్షింపబడ్డారని – మంచిగా ఉండలేరని గ్రహించడం ద్వారా, కనుక క్రీస్తు రక్తము ద్వారా వారి పాపలు కడుగబడాలి. డాక్టర్ లెన్ స్కీ అన్నాడు, "క్రీస్తు పరిశుద్ధ ప్రశస్త రక్తము మాత్రమే మన నిర్భాగ్య పాపులను దేవుని సహవసములోనికి తెస్తుంది అక్కడ ఉంచుతుంది" (ఐబిఐడి., పేజి 390). లూథర్ అన్నాడు, "క్రీస్తు రక్తము దేవుని రక్తము. వ్యక్తి నిత్యుడు అంతము లేనివాడు, ఆయన ఒక్క రక్తపు బొట్టుకూడా సర్వలోకాన్ని రక్షించడానికి సరిపోతుంది" (యెషయా 53:5 పై వ్యాఖ్యానము). మళ్ళీ, లూథర్ అన్నాడు, "క్రీస్తు లోక పాపాలకు ఆయన ఒక్క రక్తపు బొట్టుతో సంతృప్తిని ఇవ్వగలదు" (గలతీయులకు 2:16 పై గమనిక). మూడవసారి గొప్ప సంస్కర్త లూథర్ అన్నాడు, "ఆయన మాత్రమే ఆయన రక్తము ద్వారా మనలను విమోచిస్తారు. ఆయన రక్తము దేవుని రక్తము, అద్వితీయ సృష్టి కర్త, మహిమ ప్రభువు రక్తము, దైవ కుమారుని రక్తము. కనుక అపోస్తలుల దాని గూర్చి మాట్లాడారు, దీనిని గూర్చి బలవంతంగా సాక్ష్యమిచ్చారు" (I యోహాను 1:7; ప్రకటన 1:5 పై వ్యాఖ్యానములు).

అపోస్తలుడైన యోహాను అన్నాడు,

"సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్ళును కారెను" (యోహాను 19:34).

సిలువపై క్రీస్తుకు ఏమి జరిగిందో దానిని గూర్చి సత్యాలు చెప్పడం లేదు. క్రీస్తు రక్తము యొక్క ప్రాముఖ్యత ఆయనకు తెలుసు. అతని మొదటి పత్రికలో యోహాను అన్నాడు, "ఆయన కుమారుడైన యేసు క్రీస్తు రక్తము రుణ పాపములను కడిగి శుద్ధి చేయును" (I యోహాను 1:7). మళ్ళీ, అతని మొదటి పత్రికలో యోహాను అన్నాడు, "భూమిపై మూడు సాక్ష్యాలు ఉన్నాయి, ఆత్మ, నీళ్ళు, మరియు రక్తము: ఈ మూడు ఒక దానిలో ఏకీభవిస్తున్నాయి" (I యోహాను 5:8).

"సైనికులలో ఒకడు ఈటెతో ఆయన అప్రక్కను పొడిచెను, వెంటనే రక్తము నీళ్ళును కారెను" (యోహాను 19:34).

కౌంట్ నికొలాస్ వాన్ జింజెండార్ఫ్ (1700-1760) చరిత్రలో గొప్ప క్రైస్తవుడు. యేసు సిలువపై కార్చు రక్తమును గూర్చి ఆలోచిస్తూ ఆయన మార్పు చెందాడు. సిలువ వేయబడిన క్రీస్తు మంటలు, చిత్ర పటముపై చూసినది, ఆయన హృదయాన్ని పట్టుకుంది, "ఇది నీ కొరకు చేసాను; నీవు దాని కొరకు ఏమి చేస్తావు?" ఈ యవనస్తుడు పాపపు ఒప్పుకోలుతో నింపబడ్డాడు; యేసు రక్తములో అతని పాపాలు కడుగబడ్డాయని తెలుసుకున్నాడు. ఆయన ఒక పని ప్రారంభించాడు అది మొరావియన్ మిస్సెనెరీలను భూమి గంతుములకు పంపించింది. అతడు నిజానికి ఆధునిక మిసెనరీ ఉద్యమము ప్రారంభించాడు. ఒక మిసెనరీ జాన్ వేస్లీని క్రీస్తు నొద్దకు నడిపించాడు, అలా అతడు మొదటి గొప్ప మేల్కొలుపుపై పూర్తీ మెథడిస్టూ ఉద్యమముపై ప్రభావము చూపాడు. అతడు విలియం కేరీని (1761-1834) ఇండియాకు మొదటి బాప్టిస్టు మిసెనరీగా పంపడానికి ప్రభావితం చేసాడు. తరువాత వందల కొలది బాప్టిస్టు మిస్సెనరీలు ఆయనను వెంబడించారు.

జింజెండార్ఫ్ బోధ అతని వేదాంతము పూర్తిగా క్రీస్తు-కేంద్రీకృతము. జింజెండార్ఫ్ అన్నాడు, "క్రీస్తు రక్తము పాపానికి సౌబ్రాత్రుత్వ మార్గమే కాకుండా: అది క్రైస్తవ జీవితానికి [ప్రాముఖ్య] కారకము." క్రీస్తు గాయాలపై, మరియు క్రీస్తు రక్తముపై తరుచుగా బోధిస్తున్నాను. అతడు అన్నాడు, "సంపూర్ణ రక్షణకు రక్తము ద్వారా ఆత్మ మనపై వస్తుంది." అతనన్నాడు, "నేను దప్పిగొన్నాను, గాయపరచిన దేవుని గొర్రె పిల్ల, శుద్ధి చేసే నీ రక్తములో నన్ను కడుగు." ఈ పాట అతడు జర్మనులో రాసాడు, జాన్ వెస్లీ ఆంగ్లములోనికి అనువదించాడు,

యేసు, మీ రక్తము మరియు నీతి,
   నా సౌందర్యము, నా మహిమ వస్త్రము;
అగ్ని ఆహుతి లోకాల మధ్య, ఈ వేదనలలో,
   ఆనందంలో నా తల ఎత్తుకున్నాను.

ప్రభువా, మా ప్రశస్త రక్తాన్ని నేను నమ్ముతాను,
   దేవుని కృపా సింహాసనం వద్దు,
పాపుల కొరకు నిరంతరమూ వేడు కుంటావు,
   నా కొరకై, నా ఆత్మకై, అది కార్చబడింది.

ఆగష్టసు టాప్ లేడి (1740-1778) అవివేకి కాదు. అతడు వెస్ట్ మినిస్టర్ పాఠశాలలోను డబ్లిన్ ట్రినిటీ కళాశాలలోను, ఐలాండ్ లో చదివారు. 15వ ఏట మారు మనసు పొందాడు. 24వ ఏట ఇంగ్లాండ్ సంఘములో అభిషేకింప బడ్డాడు. ఎల్జిన్ ఎస్. మోయర్ అన్నాడు, "ఇంగ్లాండ్ సంఘములో కాల్వినిజములో గొప్ప చాంపియన్, వాదించాడు గొప్ప ఆసక్తితో వ్రాసాడు" (క్రైస్తవ చరిత్రలో ఎవరు ఎవరు, మూడి ప్రెస్, 1968, పేజి 408). ఈ గొప్ప వేదాంత వ్యక్తీ ప్రసంగము ముందు పాడిన పాటను వ్రాసాను. పాటలో టాప్ లేడి యేసును తరాల పునాది అన్నాడు. పదిహేను సంవత్సరాలప్పుడు, నా మార్పు భూస్థాపనలో మొట్టమొదటిగా ఈ పాట విన్నాను. అది నా బుర్రపై ముద్రవేసింది పాటల పుస్తకము రప్పించుకొని పదాలు పదే పదే చదివాను. మీ పాటల కాగితంలో ఒకటవ పాట. పాడండి.

తరాల పునాది, నాకొరకై, అందులో నేను దాగుకుంటాను;
నీరు మరియు రక్తము, నీ గాయపరచబడిన ప్రక్క నుండి ప్రవహిస్తుంది,
పాపానికి రెండింతలు విరుగుడు, నేరారోపణ నుండి శక్తి నుండి నన్ను శుద్ధి చెయ్యి.
("తరాల పునాది, నా కొరకై" ఆగష్టసు యం. టాప్ లేడి చే, 1740-1778)
(“Rock of Ages, Cleft for Me” by Augustus M. Toplady, 1740-1778).

యేసుకు ప్రార్ధన, ఎవరైతే (చీల్చబడ్డాడో) సిలువపై. యేసుకు ప్రార్ధన, గాయపడిన ఆయన ప్రక్క నుండి వచ్చిన నీళ్ళు రక్తము ద్వారా మన పాపాలను కడగమని ఆయనకు ప్రార్ధించాలి. యేసు ప్రక్క నుండి రక్తము నీళ్ళు వచ్చుట యోహాను చూసారు. దాని అర్ధము సైనికుని ఈటె యేసుని హృదయముపై గుచ్చబడింది – నీళ్ళు రక్తము వచ్చాయి. ఆ నీళ్ళతో కూడిన రక్తము ఇంకా స్వచ్చంగా ఉంది, మీ పాపాలన్నీ కడగడానికి అందుబాటులో ఉంది నిత్యత్వములో నీ పాపాలు కడిగి నీ ఆత్మను రక్షించడానికి. విశ్వాసము ద్వారా నీవు యేసు నొద్దకు వచ్చినప్పుడు వెంటనే నీవు దేవుని దృష్టిలో నీ పాపాలన్నీ ఆయన రక్తములొ కడుగబడతాయి. ఒక ఉద్రేకము కొరకు భావన కొరకు చూడవద్దు. యేసు వైపు చూడు. నీ హృదయములో ఆయనను విశ్వసించు. ఆరోజు నీవు మర్చిపోలేవు దేవుని దృష్టిలో యేసు పరిశుద్ధ ప్రశస్త రక్తములో నీవు కడగబడే ఆరోజు.

యోహాను మన పాఠ్య భాగాన్ని మూడవ వ్యక్తిగా వ్రాసాడు, కాని నేను ఆ పాఠ్యభాగాన్ని ఉద్ఘాటన కొరకు మొదటి వ్యక్తిగా పెట్టి రాస్తాను.

"సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే [అకస్మాత్తుగా] రక్తమును నీళ్ళును కారెను. మరియు [నేను] చూసాను [మరియు] సాక్ష్య మిచ్చుచున్నాను, [నా] సాక్ష్యము సత్యమే. [నాకు తెలుసు] మీరు నమ్మునట్లు [నేను] సత్యము చెప్పుచున్నాడని, మరియు [నేను] మీరు నమ్మునట్లు సాక్ష్యమిచ్చుచున్నాను" (యోహాను 19:34, 35).

యోహాను వ్రాసాడు నీవు నమ్మునట్లు పాపము నుండి తీర్పునుండి రక్షింప బడడానికి దేవుని కుమారుడైన యేసు, ప్రక్క నుండి కారిన రక్తము నీళ్ళ ద్వారా. అర్ధం చేసుకోడానికి ప్రయత్నించవద్దు. పూర్తిగా అర్ధం చేసుకోవడం చాల లోతైనది. నీ హృదయంలో అర్ధం చేసుకోడానికి యోహాను నీ కొరకు వ్రాసాడు. యేసు ప్రభును నమ్మినప్పుడు, శుద్ధి చేయబడతావు, రక్షింప బడతావు. ఆమెన్. డాక్టర్ చాన్, ప్రార్ధనలో నడిపించండి.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రుదోం: యోహాను 19:31-37.
ప్రసంగము ముందు పాట బెంజమిన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్:
"ముళ్ళ కిరీటము" (ఇరా ఎఫ్. స్టాన్ ఫిల్ చే, 1914-1993).
“A Crown of Thorns” (by Ira F. Stanphill, 1914-1993).