Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
అడిగినది పొందుకునే వరకు – ‘ప్రార్ధిస్తూ ఉండుట! ‘

PRAYING THROUGH –TILL YOU GET WHAT YOU ASK FOR!
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము సాయంత్రము, ఆగష్టు 23, 2015
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord's Day Evening, August 23, 2015


లూకా సువార్తలో యేసు "ప్రార్ధిస్తూ ఉండుటను" ఉద్ఘాటించాడు – అంటే, అడిగిన దానిని పొందుకునేంత వరకు, జవాబు రాక మునుపు ఎక్కువ సేపు ప్రార్ధింపవలసివచ్చినప్పటికిని. "ప్రార్ధిస్తూఉండుట" అంటే అదే అర్ధము. డాక్టర్ జాన్ ఆర్. రైస్ అన్నాడు,

"ప్రార్ధిస్తూ ఉండుటను" గూర్చి మనం మాట్లాడేటప్పుడు ఒక క్రైస్తవుడు తన [సమస్యను] దేవుని దగ్గర పెట్టి అతని ప్రార్ధనలకు జవాబు వచ్చేంత వరకు దేవునిపై కనిపెట్టుట... దేవుని చిత్తాన్ని గూర్చిన నిశ్చయత మనకు రాకపోవచ్చు, దేవునిపై కనిపెట్టకపోతే, కొన్ని పొందుకోకపోవచ్చు...ఎడతెగక చేసే ప్రార్ధనకు కొన్ని బైబిలు ఉదాహరణలు గమనించండి... నెహెమ్యా శత్రువుల బంధీలో ఉన్న యేరూష లేము పట్టణము స్థితిని గూర్చి ఉపవసించి ప్రార్ధించాడు. అతడన్నాడు, "నేను కూర్చోండి ఏడ్చి, కొన్ని దినములు దుఃఖముతో, ఉపవాసముండి, ఆకాశ మందలి దేవుని ఎదుట విజ్ఞాపన చెసితిని" (నెహెమ్యా 1:4)...అతడు దేవునితో మోర పెట్టాడు...అతని ప్రార్ధనకు [చివరకు జవాబివ్వబడింది]. రాజు హృదయము కదిలింపబడింది, దేవుడు పట్టాన గోడలు కట్టడానికి నెహెమ్యాను తిరిగి పంపించాడు... ఎందుకంటే అతడు ప్రార్ధిస్తూ ఉన్నాడు కాబట్టి...
         యూదులు ఉపవసించి ప్రార్ధించారు దేవుడు వారిని కాపాడాడు [వారు నిర్మూలింప బడబోయే ముందు] పెర్షియా ఎస్తేరు రాణి కాలములో, వారు మూడు దినాలు రాత్రులు ప్రార్ధిస్తూ ఉన్నప్పుడు యూదులు రక్షింపబడి శత్రువులపై పగను ఉంచారు.
         నినేవే ప్రజలు ఉపవసించి ప్రార్శించారు, దేవుడు వారి పట్టణాన్ని [తప్పించి], [నాశనము చెయ్యలేదు, కానీ గొప్ప ఉజ్జీవాన్ని పంపించాడు].
         కొత్త నిబంధనలో [అలాగే] జరిగింది. పెంతేకోస్తూ [ముందు]...శిష్యులు ప్రార్ధిస్తూ ఉన్నారు [కలిసి ఒక గదిలో. దేవుడు వారి ప్రార్ధనలు విని, జవాబిచ్చాడు. చాల రోజుల ప్రార్ధన తరువాత దేవుడు వారికి గొప్ప పెంతే కోస్తూ ఉజ్జీవాన్ని పంపాడు, మూడు వేలమంది నశించు యూదులు అద్భుతంగా మార్చబడ్డారు, అపోస్తలుల కార్యములు 1 మరియు 2 లో వ్రాయబడింది, వారు అడిగిన దానిని పొందుకునేంత వరకు, ప్రార్ధిస్తూ ఉండడానికి చెప్పుకోదగిన ఉదాహరణ]...
         అపోస్తలుల కార్యములు పన్నెండవ అధ్యాయములో, 1 నుండి 17 వచనాలలో, మనం చూస్తాం ఏవిధంగా కొంతమంది క్రైస్తవుల గుంపు మరియు ఇంటిలో కూడుకొని... అపోస్తలుడైన పేతురు దేవదూతల ద్వారా జైలు నుండి విడుదల అయ్యేంత వరకు ఎలా ప్రార్ధిస్తూ ఉన్నారో చూస్తాము. [అధ్బుత రీతిగా పేతురు జైలు నుండి విడుదల అయ్యేంత వరకు వారు ప్రార్శిస్తూనే ఉన్నారు]. అది దీర్ఘకాల, హృదయాన్ని శోధించే, విరిగిన హృదయపు ప్రార్ధన. అది ప్రతి చోట నూతన నిభందన క్రైస్తవుల ఉదాహరణ (John R. Rice, D.D., Prayer – Asking and Receiving, Sword of the Lord Publishers, 1981 reprint, pp. 203, 206-209, Dr. Hymers’ comments in brackets).

యేసు లూకా సువార్తలో ప్రార్ధిస్తూ ఉజ్జీవాన్ని గూర్చి రెండు ఉదాహరణలు ఇచ్చాడు. మొదటిది లూకా 11:5-8 లో వ్రాయబడింది. దయచేసి లేచి నిలబడి ఈ నాలుగు వచనాలు గట్టిగా చదవండి. స్కోఫీల్ద్ స్టడీ బైబిలులో ఇది 1090 పేజిలో ఉంది.

"మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవనికైన ఒక స్నేహితుడు ఉండగా, అతడు అర్ధరాత్రి వేళ, ఆ స్నేహితుని యొద్దకు వెళ్లి, స్నేహితుడా, నాకు మూడు రొట్టెలు బదులిమ్ము; నా స్నేహితుడు ప్రయాణము చేయుచూ మార్గములో నా యొద్దకు వచ్చియున్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమియు లేదు? అతనితో చెప్పిన యెడల, అతడు లోపలనే యుండి నన్ను తొందర పెట్టవద్దు: తలుపు వేసియున్నది, నా చిన్న పిల్లలు నాతో కూడ పండుకొనియున్నారు; నేను లేచి ఇవ్వలేనని చెప్పనా. అతడు, తన స్నేహితుడైనందున లేచి ఇయ్యాక పోయిననూ, అతడు సిగ్గుమాలి మాటిమాటికి అడుగుట వలన నైనను లేచి, అతనికి కావలసిన వన్నియు ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను" (లూకా 11:5-8).

కూర్చోండి. 8 వ వచనము గమనించండి. ఇది మూల వచనము,

"అతడు సిగ్గుమాలి మాటిమాటికి అడుగుట వలన నైనను లేచి అతనికి కావలసిన వన్నియు ఇచ్చును" (లూకా 11:8).

"సిగ్గుమాలి" పదమును ఆధునిక భాషలో అర్ధం చేసుకోలేము. దాని అర్ధము "ఒత్తిడి చేయుట." డాక్టర్ రైస్ అన్నాడు, "ఈ పాఠ్యభాగము ఒక [క్రైస్తవుని] చూపేస్తుంది అతడు అధికారము కోరుకుంటాడు [తద్వారా తన స్నేహితుడు మార్చబడతాడు]. ఒక క్రైస్తవుడు దేవుని దగ్గరకు వెళ్లి [ఇతరులకు] జీవాహారము అడిగే హక్కు ఉంది... ఎవరైతే ‘సిగ్గుమాలి’ రహస్యము నేర్చుకుంటారో వారికి పాపుల కొరకైన రొట్టె ఇవ్వబడుతుంది [నశించు స్నేహితునికి మారే కృప దేవునిచే ఇవ్వబడుతుంది]...క్రైస్తవుడైతే అసాధారణ, పరిశుద్ధాత్మ అద్భుత క్రియాశక్తి కావాలనుకుంటాడో [స్నేహితుని మార్చడానికి] దేవునికి కనిపెట్టే హక్కు ఉంది, [స్నేహితుడు రక్షింపబడే వరకు ప్రార్ధించడానికి]" (రైస్, ఐబిఐడి., పేజి 209).

"అతడు సిగ్గు మాలి [మాటిమాటికి అడుగుట, వలననైనను లేచి] అతనికి కావలసినవన్నియు ఇచ్చును" (లూకా 11:8).

మళ్ళీ, యేసు విసుగక ప్రార్ధించడం లూకా 18:1-8 లో నేర్పాడు. దయచేసి నిలబడి ఎనిమిదవ వచనాలు గట్టిగా చదవండి. స్కోఫీల్ద్ స్టడీ బైబిలులో 1100 వ పేజి లో ఉంది.

"వారు విసుగక నిత్యమూ, ప్రార్ధన చేయుచుండావలెననుటకు, ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను; దేవునికి, భయపడకయు, మనష్యులను లక్ష్య పెట్టకయునుండు, ఒక న్యాయాధిపది ఒక పట్టణంలో ఉండెను: ఆ పట్టణములో ఒక విధంగా ఉండెను; ఈమె అతని యొద్దకు తరుచుగా వచ్చి, నా ప్రతివాదికిని నాకును, న్యాయము తీర్చమని అడుగుచు వచ్చెను. గాని అతడు కొంతకాలము ఒప్పక పోయెను: ఆతరువాత అతడు నేను దేవునికి భయపడక, మనష్యులను లక్ష్యపెట్టక ఉండేనను, ఈ విధంగా నన్ను తొందరపెట్టుచున్నది; గనుక ఆమె మాటిమాటికి వచ్చి, గోజాడ కుండ ఉండునట్లు, ఆమెకు న్యాయము తీర్చునని తనలో తానూ అనుకొనెను. మరియు ప్రభువు ఇట్లా అనెను, తన్ను గూర్చి మోర పెట్టుకోనుచుండగా వారికి న్యాయము తీర్చడా. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘ శాంతము చూపుచున్నాడు, మోర పెట్టుకోనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును అని నేను చెప్పుచున్నాను. అయినను మనష్యు కుమారుడు వచ్చునప్పుడు, ఆయన భూమి మీద విశ్వాసము కనుగోనునా?" (లూకా 18:1-8).

కూర్చోండి.

ఈ ఉపమాన ప్రధాన విషయము ప్రార్ధిస్తూ ఉండుట. ఆ విషయము ఒకటవ వచనములో ఇవ్వబడింది,

"మీరు విసుగక నిత్యమూ, ప్రార్ధన చేయుచుండ వలెనని, ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను" (లూకా 18:1).

మనము "ఎప్పుడు ప్రార్ధించాలి, అలసిపోకూడదు." "అలయుట" అనగా "వదిలేయటం," "విడిచిపెట్టడం." మనము ఎప్పుడు ప్రార్ధించాలి అలసిపోకూడదు. దాని అర్ధము ఒక దానిని గూర్చి ప్రార్ధించుట ప్రారంభించి నప్పుడు, అది పొందుకునే వరకు ప్రార్దిస్తూనే ఉండాలి. వదలొద్దు, విడిచి పెట్టవద్దు, ప్రార్ధించేది పొందుకొనే వరకు.

ప్రతి సంవత్సరం యాభై సంవత్సరాల క్రితం నా సబ్భాతు బడి విద్యార్ధుల నుండి మొదటి చైనీయ బాప్టిస్టు సంఘము నుండి నాకు చాల క్రిస్మస్ కార్డులు వచ్చేవి. వారు మారే వరకు ప్రతి ఒక్కరిని గూర్చి ప్రార్ధించుట నాకు బాగా గుర్తుంది. యాభై సంవత్సరాల తరువాత వారు మంచి క్రైస్తవులుగా ఉండడం చూడడం నాకు చాలా సంతోషము. డాక్టర్ మర్ఫీలన్స్ భూస్థాపనలో కొన్ని వారాల క్రితం వారిని చూసాను. వారింకా మంచి క్రైస్తవులుగా ఉండడం నాకు సంతోషానిచ్చింది!

ఆ చైనీయ సంఘములో, 1960 లో నేనుండే సంవత్సరాలు, ఉజ్జీవ అవసరతను గూర్చి నాకు తొందర ఉండేది. డాక్టర్ మర్ఫీ లన్స్ రెండు సంవత్సరాల క్రితం నాకు గుర్తు చేసాడు, నేను బహిరంగంగా ప్రార్ధించేటప్పుడు ఉజ్జీవము గూర్చి ప్రార్ధించే వాడినని. సంఘ భోజనము ముందు ప్రార్ధించేటప్పుడు, ఉజ్జీవము పంపమని దేవునికి ప్రార్ధించే వాడిని. నా వ్యక్తిగత ప్రార్ధనలలో కూడ తరుచు సంఘ ఉజ్జీవము కొరకు ప్రార్ధించే వాడిని. ఇతరులు కూడ దీని గూర్చి ప్రార్ధించారు, నేను నిజాయితీగా చెప్పగలను, నేను ఉత్సాహ భరితుడనయ్యే వాడిని, ఉజ్జీవ అవసరతను గూర్చి. అలా దేవుడు కదలాలని లోతుగా దేవునికి ప్రార్ధించే వాడిని. 1969 వేసవిలో, దేవుడు ఉజ్జీవం ఇవ్వడం ఆరభించాడు, కొన్ని సంవత్సరాలుగా. ఆ సంఘములో ఒక కూటములో, నలభై మంది యువకులు కన్నీళ్ళతో ముందు కొచ్చారు, ఆగష్టు 29, 1970 లో నేను సువార్త కూటములో ప్రార్ధించినప్పుడు (“To God Be the Glory,” 20th Anniversary booklet, FCBC, March 1972, p. 28).

150 మంది ఉండే గుడిలో 40 మంది స్పందించడం గొప్ప "సంఘటన" ఆ సంఘములో మొదటి ఇరవై సంవత్సరాలలో. సంఘ రికార్డులలో చూసాను, ఆ నలభై మంది రెండు గొప్ప బాప్టిస్టు ఆరాధనలో, బాప్తస్మము పొందారు ("దేవునికే మహిమ," పేజి 29). రికార్డులో వారి పేర్లు ఉన్నాయి. వారంతా క్రైస్తవులే. ఇప్పుడు ఈ నెల ఆరంభంలో డాక్టర్ మీ భూస్థాపనలో వారిలో చాలామందిని చూసాను. దేవుడు ఎడతెగని ప్రార్ధనలకు జవాబిచ్చాడు, మేము ప్రార్ధించి నప్పుడు 1960 మరియు 70 లలో మొదటి బాప్టిస్టు సంఘములో శక్తివంత ఉజ్జీవము వచ్చింది. అది అయ్యే ముందు, వందల మంది యువకులు సంఘములోనికి వచ్చారు.

1990 లో తూర్పు దిశలో కాసిదాన్ సంఘములో ఉజ్జీవ అవసరత లోతుగా నాకు అనిపించింది. రోజంతా ఉపవసించి ప్రార్ధించాను. ప్రసంగ వేదిక పైకి వణుకుతూ వెళ్లి సామాన్య రక్షణ ప్రసంగాన్ని ఇచ్చాను. ఆ సంఘ కాపరి కొడుకు, సహాయక సంఘ కాపరి, కన్నీళ్ళతో ముందు కొచ్చి అన్నాడు, తానూ నశించానని మారడం అవసరం అనిపించిందని. ఆహ్వానము రాత్రి 11:00 గంటల వరకు వెళ్ళింది. 75 మంది ఏడ్చుకుంటూ బలిపీఠము వద్దకు వచ్చారు. ఒక వృద్ధుడు చేతులుపై మొకాళ్ళుని, "నేను నశించాను! నేను నశించాను!" అని అరిచాడు యుక్త వయస్కులు, కన్నీళ్ళతో ముందుకు వచ్చారు. డాక్టర్ యాన్ పైస్ లీ, కొడుకు కైల్, నా భార్య పిల్లల దగ్గర నిలబడ్డాడు. చెవిలో నా భార్యతో అన్నాడు, "ఇలానే నెప్పుడు లేను!" తరువాత మూడు నెలలలో ఐదు వందల మంది ముందుకొచ్చారు, చాల తీవ్రంగా, చాలామంది ఏడుస్తూ, అరుస్తూ. తక్కువ వ్యవధిలో ఆ కాపరి వందల మందికి బాప్మిస్మమిచ్చాడు. అలాంటి ఉజ్జీవము ఎప్పుడు చూడలేదని ఈ మధ్య ప్రముఖ ప్రాధమిక బాప్టిస్టు నుండి విన్నాను. నేను రెండు సార్లు ఉజ్జీవము చూచినందుకు దేవునికి వందనస్థుడను – ఎడతెగని ప్రార్ధనకు జావాబుగా. పెద్ద ప్రార్ధనలు చేసి, "నిర్నయత్వత" అవివేకాన్ని విడిచితే, దేవుడు మళ్ళీ ఉజ్జీవము పంపుతాడని నమ్ముతాను – గతకాలంలో చేసినట్టు.

మనం ప్రార్ధిస్తూ ఉంటే దేవుడు జవాబిస్తాడని నాకు తెలుసు. నా తల్లి 80 సంవత్సరాలు ఇంకా రక్షింపబడలేదు. తన చంపగలిగే పోటు వచ్చింది. నరకానికి వెళ్ళిపోయి ఉండేది. ఆమె రక్షణ కొరకు ప్రతిరోజూ, నలభై సంవత్సరాలు ప్రార్ధించాను. చివరకు, ఒకరోజు, ఆమె కొరకు ప్రార్ధిస్తూ ఉన్నానని నాకు తెలిసింది. నేను న్యూయార్క్ లో బోధిస్తున్నాను. నేను డాక్టర్ కాగన్ కు, ఫోను చేసి ఆమెను క్రీస్తు నొద్దకు నడిపించమని చెప్పాను. అతడు భయపడ్డాడు ఎందుకంటే ఆమె తేటగా చెప్పింది "రక్షింపబడడాన్ని గూర్చి" మాట్లాడడమే ఇష్టము లేదని. కాని నేను డాక్టర్ కాగన్ చెప్పాను నేను ప్రార్ధిస్తూ ఉన్నానని, ఈరోజు ఆమె రక్షింపబడుతుందని నాకు హృదయంలో తెలుసనీ. డాక్టర్ కాగన్ ఆ మధ్యాహ్నము ఆమె గదికి వెళ్ళాడు – మరియు, చాలా సులభంగా! తల్లి వెంటనే మార్పు నొందింది. ఆ సంవత్సరము జూలై 4 న డాక్టర్ వాల్ డ్రిప్ సంఘములో, బాప్టిస్టు ఆరాధనలో ఆమెకు బాప్తిస్మము ఇచ్చాను. తల్లి క్రీస్తులో నూతన సృష్టి, అప్పటి నుండి 80 సంవత్సరాలప్పుడు.

నాకు తెలుసు వ్యక్తులు కొరకు మీరు ప్రార్ధిస్తూ ఉండాలి! ఉజ్జీవము కొరకు ప్రాదిస్తూ ఉండాలి అని తెలుసు, స్థానిక సంఘములో, అడిగేది పొందేవరకు. సంఘములో నశించే వారి కొరకు మీరు ప్రార్ధిస్తూ ఉండాలి సంఘములో నశించు స్నేహితుని కొరకు ప్రార్ధిస్తూ ఉండాలి అని తెలుసు. మీకు తెలుసు – నశించు ఆత్మ కొరకు ప్రార్దిస్తుంటే, అతని కొరకు ప్రార్ధిస్తూ ఉండండి, విసుగక, అడిగేది దేవుడిచ్చే వరకు! ఆమెన్!

వచ్చే శనివారం మళ్ళీ మనం ఉపవశించి ప్రార్దిస్తాం. ఉపవాసంలో మాతో కలవగలిగితే, శుక్రవారం రాత్రి తరువాత ఏమి తినవద్దు, శనివారం సాయంత్రము 5.30 కు గుడిలో తినే వరకు. ఇక్కడ, మరల, శనివారం ఉపవసించి ప్రార్ధించేటప్పుడు చేయవలసినవి క్రింద ఉన్నాయి. ప్రసంగం చివరిలో ఇవ్వబడ్డాయి. ఇంటికి తీసుకెళ్ళవచ్చు.

మీ గురుంచి నేను గర్విస్తున్నాను! మీరు గొప్ప ప్రజలు! మీరు ఉపవసించి ప్రార్ధిస్తే చాలామంది యువకులు మారతారు! డాక్టర్ కాగన్, దయచేసి ప్రార్ధనలో నడిపించండి.


1.    మీ ఉపవాసము రహస్యంగా (సాధ్యమైనంత వరకు) ఉండాలి. మీరు ఉపవాసమున్నట్టు అందరికి చెప్పుకోవద్దు.

2.    బైబిలు చదవడంలో సమయం గడపండి. అపోస్తలుల కార్యముల గ్రంథములో కొన్ని భాగాలు చదవండి (ముఖ్యంగా ఆరంభంలోనివి).

3.     శనివారపు ఉపవాసములో యెషయా 58:6 కంటస్తం చెయ్యండి.

4.    దేవునికి ప్రార్ధించండి 10 మంది కొత్తవారిని వచ్చేటట్టు వారు మనతో ఉండేటట్టు.

5.    మన మారని యవనస్తులు మార్పు నొందేటట్టు ప్రార్ధించండి. యెషయా 58:6 లో చెప్పినది దేవుడు వారికి చేసేటట్టు ప్రార్ధించండి.

6.     ఈ రోజు (ఆదివారము) తొలి సందర్శకులు వచ్చే ఆదివారము వచ్చేలా ప్రార్ధించండి. వీలుంటే పేరు పేరు వరుసన ప్రార్ధించండి.

7.    వచ్చే ఆదివారము ఏమి బోధించాలో దేవుడు నాకు చూపించే టట్టు ప్రార్ధించండి – ఉదయము సాయంత్రము కూడ.

8.    ఎక్కువ నీరు త్రాగండి. గంటకు ఒక గ్లాసు. మొదట్లో ఒక పెద్ద కప్పు కాఫీ త్రాగవచ్చు ప్రతి రోజు తాగే అలవాటు ఉంటే. శీతల పానీయాలు, శక్తి పానీయాలు లాంటివి, త్రాగవద్దు.

9.    ఏవైనా వైద్య పర ప్రశ్నలుంటే ఉపవాసముండే ముందు వైద్యుని కలవండి. (మీరు డాక్టర్ క్రైగ్ టన్ చాన్ లేక డాక్టర్ జుడిత్ కాగన్ మన గుడిలో కలువవచ్చు). ఒకవేళ తీవ్ర సమస్య ఉంటే ఉపవాసము చేయవద్దు, మధుమేహము కాని అధిక రక్తపోటు గాని ఉంటే. శనివారము ఈ మానవుల నిమిత్తము ప్రార్ధించండి.

10.  శుక్రవారము సాయంత్ర భోజన అనంతరము మీ ఉపవాసము ఆరంభించండి. శుక్రవారము భోజనము చేసిన తరువాత ఏమి తినవద్దు శనివారము సాయంకాలము 5:30 వరకు.

11.   గుర్తుంచుకొండి మీరు ప్రార్దించవలసిన ప్రాముఖ్య విషయము మన సంఘములో నశించుచున్న యవనస్తులు మార్పు నొందేటట్లు – ఈ సమయంలో కొత్తగా వచ్చే యవనస్తుల కొరకు, మనతో ఎన్నటికి ఉండేలాగున ప్రార్ధించండి.


ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి. దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రుదోం: లూకా 18:1-8.
ప్రసంగము ముందు పాట బెంజమిన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్:
"ప్రార్ధింపనేర్పుము" (ఆల్ బర్ట్ ఎస్. రిట్జ్ చే, 1879-1966).
“Teach Me To Pray” (by Albert S. Reitz, 1879-1966).