Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
ఎప్పుడు మీరు ఉపవాసము చేతురు

WHEN YOU FAST
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము సాయంత్రము, ఆగష్టు 16, 2015
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, August 16, 2015

"ఎప్పుడు మీరు ఉపవాసము చేతురు" (మత్తయి 6:16)


యేసు భూమి మీద పరిచర్య ప్రారంభించక ముందు ఉపవాసము చేసారు. యేసు చెప్పాడు ఆయన పరలోకమునకు ఆరోహణమైన తరువాత ఆయన శిష్యులు కూడ ఉపవాసము చేస్తారని. ఆయన అన్నాడు,

"ఆపుడు వారు ఉపవాసము చేతురు" (మత్తయి 9:15).

డాక్టర్ జాన్ ఆర్. రైస్ అన్నాడు పెంతేకోస్తు ఉజ్జీవమునకు ముందు వారు ఉపవసించి ప్రార్ధించారని చూపిస్తుందని. ఇది సత్యమనుకుంటున్నాను! అపోస్తలుడైన పౌలు మారిన తరువాత మూడు రోజులు ఉపవసించి ప్రార్ధించాడు (అపోస్తలుడైన కార్యములు 9:9, 11). అంతి యొకయ సంఘస్తులు దేవుని చిత్తము తెలుసుకోడానికి ఉపవసించారు. (అపోస్తలుల కార్యములు 13:2). మళ్ళీ వారు పౌలు బర్ణబాలను మిస్సెనరీలుగా పంపేటప్పుడు "ఉపవసించి ప్రార్ధించారు" (అపోస్తలుల కార్యములు 13:3). అపోస్తలుడైన పౌలు తానూ "తరుచు ఉపవాసాలు" చేసేవాడని చెప్పాడు (II కొరిందీయులకు 11:27). ఈ పాఠ్యభాగములో మనము ఉపవసించాలని యేసు చెప్పాడు. ఆయన అన్నాడు, "ఎప్పుడు మీరు ఉపవాసము చేతురు" (మత్తయి 6:16). ఆయన చెప్పాడు, "అప్పుడు వారు ఉపవాసము చేతురు" (మత్తయి 9:15).

డాక్టర్ జె. వెర్నోన్ మెక్ గీ పై నాకు చాల గౌరవము ఉంది. 1960 లో రేడియోలో ఆయన ఇచ్చిన, వచనము వెంబడి వచనము వివరణ ద్వారా, బైబిలు అంతా చదివాను. మన పాఠ్యభాగము, "ఎప్పుడు మీరు ఉపవాసము చేతురు," ను గూర్చి డాక్టర్ మెక్ గీ అన్నాడు, "మన రోజులలో విశ్వాసుల విషయము ఉపవసమునకు ఒక విలువ ఉంది, దాని విషయంలో నేను ఒప్పింపబడ్డాడు" (J. Vernon McGee, Th.D., Thru the Bible, Thomas Nelson Publishers, 1983, volume IV, p. 38).

మత్తయి 6:16-18 లో ఉన్న పాఠ్యభాగములో యేసు ఉపవసానికి వ్యతిరేకంగా మాట్లాడాడని అనుకుంటారు. కాని వారిది తప్ప. స్కోఫీల్ద్ గమనిక బట్టి ఆయన "బాహ్యపరత్వత"కు వ్యతిరేకంగా బోధించాడు. ఇతరులకు కనబడేటట్టు వేషధారణతో కూడిన ఉపవాసానికి వ్యతిరేకంగా, ఆయన బోధించాడు. నిజ ఉపవాసానికి వ్యతిరేకంగా అయన బోధించలేదు. వ్యతిరేకంగా ఆయన – అన్నాడు, "ఎప్పుడు మీరు ఉపవాసము చేతురు," తరువాత ఎలా చెయ్యాలో చెప్పాడు, తప్పక చెయ్యాలని చెప్పాడు. "మీరు ఉపవసిస్తే" అని, యేసు అనలేరు. ఓ, లేదు! యేసు అన్నాడు, "ఎప్పుడు మీరు ఉపవాసము చేతురు."

ఈనాడు ఉపవాసానికి విలువ ఉంది. ప్రముఖ బైబిలు వ్యాఖ్యాత మేత్యూ హెన్రీ విలాపించాడు "క్రైస్తవులు దానిని...నిర్లక్ష్యము చేస్తున్నారని" (గమనిక మత్తయి 16:16). మేత్యూ హెన్రీ మరణించిన 25 సంవత్సరాల తరువాత జాన్ వెస్లీ దానిని ఉజ్జీవింపచేసాడు, వారానికి రెండుసార్లు ఉపవసించాలని తన ప్రజలకు చెప్పాడు. అలా మొదటి గొప్ప మేల్కొలుపు ఉపవాసము ప్రార్ధనలో ఆసక్తి పునరుద్దరింపబడిన కాలములో జన్మించింది. క్రీస్తు చెప్పిన ఉద్ఘాటనలో ఉపవాసము ఉజ్జీవము మూలమని తెలుస్తుంది,

"ఎప్పుడు మీరు ఉపవాసము చేతురు" (మత్తయి 6:16)

మనం ప్రార్దిస్తున్నప్పుడు ఉపవాసము చేయడానికి చాల కారణాలున్నట్లు బైబిలు బోధిస్తుంది. ఈరాత్రి వాటిలో మూడు మీకు చూపిస్తాను.

I. మొదటిది, మనము దేవునికి ఉపవసించి ప్రార్ధించే అవసరత ఉంది.

సాతాను శక్తిని అధిగమించడానికి దయచేసి మార్కు 9:28-29 చూడండి. నిలబడి ఈ రెండు వచనాలు గట్టిగా చదవండి.

"ఆయన ఇంటిలోనికి వెళ్ళినప్పుడు, ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యాలను వెళ్ళగొట్ట లేకపోతిమని, ఏకాంతమున ఆయనను అడిగిరి? అందుకాయన, ప్రార్ధన వలననే గాని మరి దేని వలననైనను, ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను" (మార్కు 9:28-29).

కూర్చోండి. నా మునపటి ప్రసంగములో చెప్పినట్లు, చాల ఆధునిక తర్జుమాలో "మరియు ఉపవాసము" మార్కు 9:29 లోనివి తొలగింపబడడం తప్పని నేను నమ్ముతాను. పొరపాటు పాఠ్యభాగ విమర్శ ఆధారంగా, ఈ తప్పు జరిగిందనుకుంటాను. విచారంగా పదాలు "మరియు ఉపవాసము" ఈ ఆధునిక తర్జుమాల నుండి తొలగింపబడ్డాయి. ఈ పదాలు వదిలేసినా యోగా శాస్త్ర ప్రభావిత పూజారుల, రెండు పాత ప్రతులచే ప్రభావితము చెయ్యబడ్డాయి. అలా పడమరలో క్రైస్తవుల తలుపులలో నుండి ఈ పదాలు తొలగింపబడడానికి ప్రాముఖ్య కారణము, ఆ రెండు ప్రశ్నింపదగ్గ ప్రతులు. మన సంఘాలు సాతానుపై కొద్ది శక్తి కలిగి ఉంది అనడంలో ఆశ్చర్యం లేదు! డాక్టర్ జాన్ ఆర్. రైస్ అన్నాడు, "ఈబడ్డ వాస్తవికంగా దయ్యాన్ని [దురాత్మను] కలిగి సందేహింపవద్దు. దురాత్మలు మన గురించి ఉన్నాయి" (Commentary on the Gospel According to Matthew, Sword of the Lord Publishers, 1980 edition, p. 364; comment on Matthew 17:14-21). బైబిలు చెప్తుంది,

"మనము పోరాడునది శరీరులతో కాదు, కాని ప్రదానులతోను...అధికారులతోను ప్రస్తుత అంధకార సంబందులగు లోకనాదులతోను ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహాలతోనూ పోరాడుచున్నాము" (ఎఫెస్సీయులకు 6:12).

ఈనాడు సువార్తీకరణతో సంఘాలు కట్టడం చాల కష్టము. కొందమంది చెప్తున్నాను అమెరికాలో సువార్తీకరణ మృతమయిందని. మన కాలములో సాతాను శక్తి ఎక్కువ ఉందని నా కనిపిస్తుంది. "ఉన్నత స్థలాలలో ఆత్మీయ దుష్టత్వముపై" జయము పొందుకోడానికి దేవుని శక్తి మనకు అవసరమని నాకనిపిస్తుంది. సాతాను శక్తి స్థావరాలను తెంచడానికి దేవునికి మనము ఉపవసించి ప్రార్ధించాలి! ఈ స్వధర్మాత దినాలలో సంఘాలు చల్లబడిన స్థితిలో అది పరిపూర్ణంగా సమంజసమనిపిస్తుంది, మనం క్రీస్తు కొరకు సంపాదించాలనుకున్న వారిపై సాతాను శక్తి ఉపయోగిస్తుంది. 6 వపాట, "ప్రార్ధింపనేర్పుడి," రెండవ వచనము, "ప్రార్ధనలో శక్తి" పాడండి.

ప్రార్ధనలో శక్తి, ప్రభూ, ప్రార్ధనలో శక్తి,
   ఇచ్చట ‘భూ సంబంధ’ పాపమూ విచారము చింత;
మనష్యులు నశించి చనిపోతున్నారు, ఆత్మలు నిరాశలో;
   నాకు శక్తి నిమ్ము, ప్రార్ధనలో శక్తి!
("ప్రార్ధింప నేర్పుము" ఆల్ బెర్ట్ ఎస్. రీట్స్ చే, 1879-1966).
(“Teach Me to Pray” by Albert S. Reitz, 1879-1966).

యేసు చెప్పినట్టు, ప్రార్ధనా శక్తి నేరుగా ఉపవాసముతో సంబంధము కలిగి యున్నట్టు నాకనిపిస్తుంది,

"ఎప్పుడు మీరు ఉపవాసము చేతురు" (మత్తయి 6:16).

II. రెండవది, ఉజ్జీవము పంపడం ద్వారా దేవుడు జోక్యము చేసుకోనేటట్టు మనము ఉపవసించి ప్రార్ధించుట అవసరము.

లేదు, ప్రతీది ఉజ్జీవముపై ఆధారపడదు. కాని 1859 నుండి అమెరికాలో దేశాన్ని మార్చే ఉజ్జీవము లేదు – మరియు మన దేశాన్ని మార్చే ఉజ్జీవము లేదు, మరియు మన దేశంలో స్థానిక సంఘ ఉజ్జీవాలు అరుదై ఈనాడు చాల తక్కువ కనిపిస్తాయి. నాకు గుర్తుంది డాక్టర్ కెన్ కొన్నొల్లీ చెప్పింది, "ఉజ్జీవాన్ని గూర్చి తెలియని తరములో మనం జీవిస్తున్నాం." కాని ఉజ్జీవాన్ని గూర్చి అపోస్తలుడైన పౌలుకు తెలుసు! అపోస్తలుల కార్యముల గ్రంధము మొత్తమంతటిలో ఆయన పరిచర్యలన్నింటిని దేవుడు దీవించాడు. పౌలును గూర్చి చదువుచున్నప్పుడు, మనం ఆశ్చర్యపోకూడదు, తరువాత

"తరుచు ఉపవాసము" (II కొరిందీయులకు 11:27).

డాక్టర్ స్టాఫ్, క్రైస్తవ చరిత్రకారుడు, అన్నాడు "ఆది క్రైస్తవులు బుధవారము ప్రత్యేకించి శుక్రవారమును" ఉపవాస దినాలుగా ఏర్పరుచు కున్నారు (Philip Schaff, Ph.D., History of the Christian Church, Eerdmans Publishing Company, 1976 edition, volume II, p. 379). జాన్ వెస్లీ మొదటి గొప్ప మేల్కొలుపులో ఈ ఆచారాన్ని ఉజ్జీవింపచేసాడు.

లేదు, ఉపవాసము ప్రార్ధన దానికదే ఉజ్జీవం తెస్తుందని నేననుకోను. ఉపవాసము ప్రార్ధనకు కొన్ని రోజులు నిర్ణయింపబడినట్టు నేననుకోను. బైబిలులో నేనది చూడలేదు. కొన్ని రోజులు ఉపవాసము ప్రార్ధనా లేకుండా మనం ఉజ్జీవాన్ని పొందుతామని నేను అనుకోను. డాక్టర్ జాన్ ఆర్. రైస్ అన్నాడు,

బైబిలు అంతటిలో గొప్ప దైవ జనులంతా తరుచు ఉపవసించారు. ఉపవసములో హృదయ పూర్వక ప్రార్ధన, మూలుగు, పశ్చాత్తాపం, శత్రువుల నుండి విడుదల పైనుండి వచ్చు జ్ఞానము మిళితమైయున్నాయి. మోషే ఉపవసించాడు... సీనాయి పర్వతముపై, మన రక్షకుడు ఉపవసించాడు... అరణ్యంలో. యొహోషువ, దావీదు, ఎజ్రా, నెహెమ్యా, దానియేలు, బాప్మిస్మమిచ్చు యోహాను శిష్యులు, అన్నా, అపోస్తలుడైన, పౌలు బర్నబా, ఇతరులు ఉపవసించి ప్రార్ధించారు. దేవుని పరిశుద్ధులు ఉపవాసములు ప్రార్ధనలో దేవుని నుండి వేచి ఉండడము ద్వారా ప్రార్ధనలకు జవాబు పొందారు. బైబిలు కాలము నుండి, గొప్ప ప్రార్ధనా పరులు తరుచు ఉపవాసము ఉండి ప్రార్ధించారు. క్రైస్తవుడు ఉపవసించి ప్రార్ధించినప్పుడు మంచి సహచర్యములో ఉంటాడు... రక్షకుడు ఉపవాసము ఉండడమే కాదు [ఆయన], శిష్యులకు కూడ ఉపవాసము ఉండమని నేర్పించాడు. వారు ఆయన [ఆరోహనుడైన తరువాత] కొనిపోబడిన తరువాత ఉపవాసము ఉన్నారు (John R. Rice, D.D., Prayer – Asking and Receiving, Sword of the Lord Publishers, 1970 edition, p. 215).

డాక్టర్ రైస్ "ప్రార్ధన ఉపవాసము ద్వారా వచ్చిన ఉజ్జీవాన్ని గూర్చి మాట్లాడాడు" (ఐబిఐడి. పేజి 227).

అయినను ఉపవాసము ప్రార్ధన ఉజ్జీవాన్ని "తెస్తుందని" అనుకోకూడదు. రెవరెండ్ లేయిన్ హెచ్.ముర్రే సరిగ్గా అన్నాడు,

దేవుడు ఆశీర్వాదానికి ప్రార్ధనను ఒక కారకంగా ఉంచాడు, ఆయన తన ఉద్దేశాల నేరవేర్పుకు మనపై ఆధారపడుతున్నాడని కాదు, గాని మనం ఆయనపై సంపూర్ణంగా ఆధార పడాలి అనే విషయాన్ని తెలుసుకోవడానికి... అలాంటి ప్రార్ధనను గూర్చిన అవగాహన, అదృష్టానికి ప్రాముఖ్యత నివ్వకుండా, దైవాత్మ గ్రహింపుకు ప్రాధాన్యతనిస్తుంది దానిని రచయితా "చైతన్య పూర్వక...ప్రార్ధన ఉపవాసము అని పిలిచాడు" (Rev. Iain H. Murray, Pentecost Today? The Biblical Basis for Understanding Revival, The Banner of Truth Trust, 1998, p. 69).

బాగా చెప్పబడింది "దేవుడు ప్రజలను దీవింప ఉద్దేశించినప్పుడు, ఆయన వారిని ప్రార్ధించేటట్టు చేస్తాడు." జాన్ వెస్లీ చెప్పాడు,

దృష్టిని ప్రభువుపై కేంద్రీకరించి ఉపవాసము చేద్దాం... మన ఉద్దేశము ఇది. ఇది మాత్రమే, పరలోకములో ఉన్న మన తండ్రిని, మహిమ పరచడం (The New Encyclopedia of Christian Quotations, Baker Books, 2000, p. 360).

ఉపవాసము ప్రార్ధన ఉజ్జీవానికి "కారణము" కాదు. దేవుడు కారణము. ఉపవాసము ప్రార్ధనలో, మనం దేవునికి సమీపమవుతాం, ఆయన మంచిదిగా చూస్తే, ఉజ్జీవ క్రుమ్మరింపు పంపిస్తాడు. అదంతా దేవుని హస్తాల్ల్లో ఉంది. అయినను, ఇది కూడ వాస్తవమే, ఉజ్జీవ సమయంలో, ప్రజల ప్రార్ధనలు త్వరితమయి లోతుగా గొప్పగా ఉంటాయి. ప్రజలు ఉపవసించి ప్రార్ధించి నప్పుడు ఒక సమయంలో జాన్ వెస్లీ అడగక మునుపే దేవుడు ఉజ్జీవాన్ని పంపించాడు,

మీరెప్పుడైనా ఉపవాసము ప్రార్ధనా దినాలు ప్రకటించారా? కృపా సింహాసనాన్ని కదిలించండి, పట్టుదలతో, కృప క్రిందికి దిగి వస్తుడ్ని (జాన్ వెస్లీ ఉత్తరాలు, పేజి 340).

అయినను అనుభవము ద్వారా మనకు తెలుసు ఉజ్జీవ సమయము రాదు, జాన్ వెస్లీ అభివర్ణించినట్టు, దేవుడే మొదట మన ప్రార్ధన శక్తి అనుగ్రహించకపోతే. ప్రార్ధనకు దేవుడే కర్త అది "కృపా సింహాసనాన్ని కదిలిస్తుంది కృప క్రిందికి [దిగి] [వచ్చేంత] వరకు." దేవుడు తీవ్ర ఉజ్జీవ ఉపవాసానికి ప్రార్ధనకు కర్త. దేవుడే దానికి కర్తయు కొనసాగించు వాడు కనుక ఆయనను సంతోష పెట్టి ఉజ్జీవము పంపేటట్టు మనం ఉపవసించి ప్రార్ధంచాలి. లేనిచో మన ఉపవాసము ప్రార్ధన వృధా అవుతుంది. దేవుని ముఖమును వెదికి, మన ఆత్మలను ఆయనకు ఇచ్చి సంఘములో ఆయన మహిమ పరచబడేటట్టు, ఉపవసించి ప్రార్ధించాలి. అలాంటి దేవా కేంద్రీయ ప్రార్ధన ఉపవాసము మాత్రమే నిజ ఉజ్జీవముతో ఆశీర్వదిస్తుంది. దయచేసి నిలబడి "నాకు ప్రార్ధింప నేర్పుము" మళ్ళీ పాడండి! పాటల కాగితంలో 6వ పాట, రెండవ వచనము.

ప్రార్ధనలో శక్తి, ప్రభూ, ప్రార్ధనలో శక్తి,
   ఇచ్చట ‘భూ సంబంధ’ పాపమూ విచారము చింత;
మనష్యులు నశించి చనిపోతున్నారు, ఆత్మలు నిరాశలో;
   నాకు శక్తి నిమ్ము, ప్రార్ధనలో శక్తి!
("ప్రార్ధింప నేర్పుము" ఆల్ బెర్ట్ ఎస్. రీట్స్ చే, 1879-1966).
(“Teach Me to Pray” by Albert S. Reitz, 1879-1966).

III. మూడవది, వ్యక్తులు మార్చబడేటట్లు మనము ఉపవసించి ప్రార్ధించే అవసరత ఉంది.

యేసు అన్నాడు,

"ఎప్పుడు మీరు ఉపవాసము చేతురు" (మత్తయి 6:16).

దేవుడు ప్రవక్తయైన యెషయాతో ఇలా అన్నాడు,

"దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు? కాడిమాను మేకులు తీయుటయు, భాదింపబడిన వారిని విడిపించుట, ప్రతికాడిని విరుగగొట్టుట, నేను ఏర్పరచు కొనిన ఉపవాసము గదా?" (యెషయా 58:6).

శిష్యులు వెళ్ళగొట్టలేని ఆ బాలుడు "దుష్ట శక్తి బంధకాలలో ఉన్నాడు." శిష్యులు అతనికి సహాయ పడలేక పోయారు ఎందుకంటే,

"ఈ విధమైనది ప్రార్ధన మరియు ఉపవాసము ద్వారా, మాత్రమే వదిలిపోవును" (మార్కు 9:29).

గుడికి వచ్చే కొందరు ఆ స్థితిలోనే ఉన్నారని మీరనుకోవడం లేదు? "నమ్మని వారికి అంధత్వము కలుగ చేస్తుంది...సాతాను కదా ఈ లోక అధికారి"? (II కొరిందీయులకు 4:4). దేవుడు మనతో మాట్లాడుచున్నాడని అనుకోవడం లేదా ఇలా అంటున్నప్పుడు,

"దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు? కాడిమాను మేకులు తీయుటయు, భాదింపబడిన వారిని విడిపించుట, ప్రతికాడిని విరుగగొట్టుట, నేను ఏర్పరచు కొనిన ఉపవాసము గదా?" (యెషయా 58:6).

యెషయా చెప్పిన ఈ వచనము మనసులో ఉంది చార్లెస్ వెస్లీ ఈ పాట రాసేటప్పుడు,

ఆయన కొట్టివేయబడిన పాపపు శక్తిని విరుగగొట్టాడు,
   ఆయన ఖైదీని విడుదల చేసాడు;
ఆయన రక్తము అపవిత్రున్ని శుద్ధి చేస్తుంది;
   ఆయన రక్తము నాకు అందుబాటులో ఉంది.
("ఓ వేయి నాలుకలకు" చేర్లేస్ వెస్లీ, 1707-1788).
(“O For a Thousand Tongues” by Charles Wesley, 1707-1788).

దయచేసి లేచి పాడండి "ఓ నాకు తెరువబడుము" అను రాగములో.

ఆయన కొట్టివేయబడిన పాపపు శక్తిని విరుగగొట్టాడు,
   ఆయన ఖైదీని విడుదల చేసాడు;
ఆయన రక్తము అపవిత్రున్ని శుద్ధి చేస్తుంది;
   ఆయన రక్తము నాకు అందుబాటులో ఉంది.

కూర్చోండి.

ఓ, మనం ఎంతగా ఉపవసించి ప్రార్ధించాలి క్రీస్తు అది జరిగించేటట్టు అక్కడ ఇంకా మారని వారి జీవితాలలో! ఓ, క్రీస్తుకు మనం ప్రార్ధించాలి పాపపు శక్తిని విరుగగొట్టమని అది వారిని సాతాను ఈ లోకము గుప్పెట్లో పెట్టుకుంది! ఓ, ఎంతగా మనం క్రీస్తుకు ఉపవసించి ప్రార్ధించాలి

"దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, భాదింపబడిన వారిని విడిపించుట..."! (యెషయా 58:6).

మళ్ళీ చార్లెస్ వెస్లీ పాట పాడండి!

ఆయన కొట్టివేయబడిన పాపపు శక్తిని విరుగగొట్టాడు,
   ఆయన ఖైదీని విడుదల చేసాడు;
ఆయన రక్తము అపవిత్రున్ని శుద్ధి చేస్తుంది;
   ఆయన రక్తము నాకు అందుబాటులో ఉంది.

చార్లెస్ సహోదరుడు జాన్ వెస్లీ ఉజ్జీవ సమయంలో, ఇలా అన్నాడు,

మీరు ఉపవాసము ప్రార్ధనా దినాలు నిర్ణయించు కున్నారా? కృపా సింహాసనాన్ని కదిలించండి, పట్టుదల కలిగి, అప్పుడు కృప క్రిందికి దిగి వస్తుంది (ఐబిఐడి.).

వచ్చే శనివారము సరిగ్గా అదే చేద్దామా! చేయగలిగిన మనం ఇంటిలో ఉండి, మనలో నశించుచున్న వారి కొరకు ఉపవాసము ఉండి ప్రార్దిద్ధామా! మీరందరూ బహుశా, ఉపవాసము ఉండలేకపోవచ్చు. కాని సమయము, ఆరోగ్యము పరిస్థితులు అనుకూలిస్తే, చేయగలిగిన వారు, ఉపవసించి ప్రార్ధించండి. తరువాత తిరిగి వచ్చే శనివారము రాత్రి 5:30 కు గుడికి వచ్చి, వారి కొరకు తిరిగి ప్రార్ధిద్దాం, తరువాత ఉపవాసము ముగిద్దాం భోజనంతో, అప్పుడు దేవునిలో ఆనందిస్తూ ఇంటికి వెళదాం! నిజంగా, చార్లెస్ వెస్లీ పాట నిజము! మళ్ళీ పాడండి!

ఆయన కొట్టివేయబడిన పాపపు శక్తిని విరుగగొట్టాడు,
   ఆయన ఖైదీని విడుదల చేసాడు;
ఆయన రక్తము అపవిత్రున్ని శుద్ధి చేస్తుంది;
   ఆయన రక్తము నాకు అందుబాటులో ఉంది.

నశించు వారెవరైనా ఈ రాత్రి ఇక్కడ ఉన్నావా? మీ కొరకు ప్రార్ధించాం. మీకు యేసు క్రీస్తు అవసరం సాతాను గుప్పెట నుండి విడిపించడానికి ఆయన ప్రశస్త రక్తము ద్వారా మీ పాపాలు కడగడానికి. మీరు క్రీస్తును విశ్వసించి రక్షింపబడాలని మేము ప్రార్దిస్తున్నాం.

మనం నశించుచున్న వారి కొరకు ఉపవసించి ప్రార్దిస్తున్నప్పుడు వచ్చే శనివారము మీరు చేయవలసిన పనులు క్రింద పేర్కొనబడ్డాయి.


1.     మీ ఉపవాసము రహస్యంగా (సాధ్యమైనంత వరకు) ఉండాలి. మీరు ఉపవాసమున్నట్టు అందరికి చెప్పుకోవద్దు.

2.     బైబిలు చదవడంలో సమయం గడపండి. అపోస్తలుల కార్యముల గ్రంథములో కొన్ని భాగాలు చదవండి (ముఖ్యంగా ఆరంభంలోనివి).

3.     శనివారపు ఉపవాసములో యెషయా 58:6 కంటస్తం చెయ్యండి.

4.     దేవునికి ప్రార్ధించండి 10 మంది కొత్తవారిని వచ్చేటట్టు వారు మనతో ఉండేటట్టు.

5.     మన మారని యవనస్తులు మార్పు నొందేటట్టు ప్రార్ధించండి. యెషయా 58:6 లో చెప్పినది దేవుడు వారికి చేసేటట్టు ప్రార్ధించండి.

6.     ఈ రోజు (ఆదివారము) తొలి సందర్శకులు వచ్చే ఆదివారము వచ్చేలా ప్రార్ధించండి. వీలుంటే పేరు పేరు వరుసన ప్రార్ధించండి.

7.     వచ్చే ఆదివారము ఏమి బోధించాలో దేవుడు నాకు చూపించే టట్టు ప్రార్ధించండి – ఉదయము సాయంత్రము కూడ.

8.     ఎక్కువ నీరు త్రాగండి. గంటకు ఒక గ్లాసు. మొదట్లో ఒక పెద్ద కప్పు కాఫీ త్రాగవచ్చు ప్రతి రోజు తాగే అలవాటు ఉంటే. శీతల పానీయాలు, శక్తి పానీయాలు లాంటివి, త్రాగవద్దు.

9.     ఏవైనా వైద్య పర ప్రశ్నలుంటే ఉపవాసముండే ముందు వైద్యుని కలవండి. (మీరు డాక్టర్ క్రైగ్ టన్ చాన్ లేక డాక్టర్ జుడిత్ కాగన్ మన గుడిలో కలువవచ్చు). ఒకవేళ తీవ్ర సమస్య ఉంటే ఉపవాసము చేయవద్దు, మధుమేహము కాని అధిక రక్తపోటు గాని ఉంటే. శనివారము ఈ మానవుల నిమిత్తము ప్రార్ధించండి.

10.  శుక్రవారము సాయంత్ర భోజన అనంతరము మీ ఉపవాసము ఆరంభించండి. శుక్రవారము భోజనము చేసిన తరువాత ఏమి తినవద్దు శనివారము సాయంకాలము 5:30 వరకు.

11.  గుర్తుంచుకొండి మీరు ప్రార్దించవలసిన ప్రాముఖ్య విషయము మన సంఘములో నశించుచున్న యవనస్తులు మార్పు నొందేటట్లు – ఈ సమయంలో కొత్తగా వచ్చే యవనస్తుల కొరకు, మనతో ఎన్నటికి ఉండేలాగున ప్రార్ధించండి.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి. దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రుదోం: మత్తయి 6:16-18.
ప్రసంగము ముందు పాట బెంజమిన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్:
"నేను నీ కొరకు ప్రార్ధిస్తున్నాను" (ఎస్. ఓ’మల్లే క్లౌ చే, 1837-1910).
“I Am Praying For You” (by S. O’Malley Clough, 1837-1910).


ద అవుట్ లైన్ ఆఫ్

ఎప్పుడు మీరు ఉపవాసము చేతురు

WHEN YOU FAST

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

"ఎప్పుడు మీరు ఉపవాసము చేతురు" (మత్తయి 6:16)

(మత్తయి 9:15; అపోస్తలుల కార్యములు 9:9, 11; 13:2, 3;
II కొరిందీయులకు 11:27; మత్తయి 9:15)

I.         మొదటిది, మనము దేవునికి ఉపవసించి ప్రార్ధించే అవసరత ఉంది, మార్కు 9:28-29; ఎఫెస్సీయులకు 6:12.

II.        రెండవది, ఉజ్జీవము పంపడం ద్వారా దేవుడు జోక్యము చేసుకోనేటట్టు మనము ఉపవసించి ప్రార్ధించుట అవసరము, II కొరిందీయులకు 11:27.

III.       మూడవది, వ్యక్తులు మార్చబడేటట్లు మనము ఉపవసించి ప్రార్ధించే అవసరత ఉంది, యెషయా 58:6; మార్కు 9:29; II కొరిందీయులకు 4:4.