Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
పాపుల కొరకు రొట్టెనడుగుట

ASKING BREAD FOR SINNERS
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము సాయంత్రము, ఆగష్టు 2, 2015
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord's Day Evening, August 2, 2015

"కాబట్టి, మీరు చెడ్డవారై యుండియు, మీ పిల్లలకు మంచి యీవుల నియ్య నెరిగియుండగా: పరలోక మందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించుననెను?" (లూకా 11:13).


ఉపమానమనేది చిన్న కథ ఆత్మీయ సత్యాన్ని ఉదాహరిస్తుంది. ఈ ఉపమానము చాల సామాన్యమైన కథ. ఒక శిష్యుడు అన్నాడు, "ప్రభువా, ప్రార్ధించుట మాకు నేర్పుము" (లూకా 11:1). యేసు వారికి పరలోక ప్రార్ధన ఇచ్చాడు (పరలోక మందున్న మా తండ్రి). ఈ ప్రార్ధన నా జీవితమంతా రోజుకు ఒకసారైనా చేస్తాను. యేసు ఈ చిన్నకథ, సామాన్య ఉపమానము వారికి ఇచ్చాడు.

క్రీస్తు ఒక వ్యక్తిని గూర్చి చెప్పాడు అతని స్నేహితుడు అర్ధరాత్రి తన ఇంటికి వచ్చాడు, అతని దగ్గర రొట్టె లేదు. కనుక పొరుగు వాని ఇంటికి వెళ్లి మూడు రొట్టెలు అడిగాడు. పొరుగువానితో అన్నాడు తన స్నేహితుడు దూర ప్రయాణము చేసి వచ్చాడని. "తనకివ్వడానికి నా దగ్గర ఏమిలేదు." పొరుగువాడు పొమ్మన్నాడు. తన పిల్లలతో అతడు నిద్ర పోతున్నాడు. అయిననూ అతడు తలుపు కొడుతూనే ఉన్నాడు. చివరకు అతడు తలుపు తెరిచి అడిగిన రొట్టె ఇస్తాడు.

అప్పుడు యేసు ఈ ఉపమానానికి మూలము చెప్తాడు; ప్రజలు దానిని కథలోని "నీతి" అంటారు, అలా చెప్పడానికి కారణము:

"అటువలె, మీరును అడుగుడి, మీకియ్యబడును; వెదకుడి, మీకు దొరకును; తట్టుడి, మీకు తీయబడును అని మీతో చెప్పుచున్నాను" (లూకా 11:9).

మూల గ్రీకు భాషలో అడుగుట, వెదకుట, తట్టుట కొనసాగుతూ ఉంది. డాక్టర్ జాన్ ఆర్. రైస్ అన్నాడు ఆ వచనము ఇలా అనువదింపబడవచ్చు, "అడుగుతూ ఉండండి, మీకు ఇవ్వబడుతుంది; తలుపు కొడుతూ ఉండండి, అది మీకు తెరువ బడుతుంది" (Prayer: Asking and Receiving, Sword of the Lord Publishers, 1970 edition, p. 94).

రెండవ మూల విషయము ఈ ఉపమానంలో ఉంది. అతడు తలుపు తట్టుచున్నప్పుడు "రొట్టె" అడుగుతున్నాను. ఈ "రొట్టె" ఏమిటి? పదమూడవ వచనము జావాబిస్తుంది, "తన్ను అడుగు వారికి మరి నిశ్చయముగా పరలోకపు తండ్రి పరిశుద్ధాత్మను అనుగ్రహించును కదా?" నాకు తెలుసు వేరే విన్నపాలు ఉన్నాయని, కాని నేను ఒప్పింపబడ్డాను అసలు విషయము ఇది అని – మనం అడగాలి, వెదకాలి, తట్టాలి దేవుడు పాపులకు పరిశుద్ధాత్మ ఇచ్చేటట్టు, వారికి గ్రహింప కలిగేటట్టు, పాపపు ఒప్పుకోలు కలిగేటట్టు, క్రీస్తు నొద్దకు వారు చేర్చబడేటట్లు. అలా, నేను నమ్ముతాను ఈ ఉపమానంలో "రొట్టె" పరిశుద్ధాత్మను గూర్చి మాట్లాడుతుంది. ఆరవ వచనంలో రొట్టె అడుగు అతనంటాడు, "నా స్నేహితుడు ప్రయాణము నుండి నా దగ్గరకు వచ్చాడు, అతనికి ఇవ్వడానికి నా దగ్గర ఏమిలేదు." పరిశుద్ధాత్మ ప్రత్యక్షత లేకుండా, మన ఆరాధనలకు వచ్చే నశించు పాపులకు ఇవ్వడానికి మన దగ్గర ఏమి ఉండదు.

జాగ్రత్తగా ప్రసంగానికి సిద్ధపడడం సందర్భాలు నాకు గుర్తుంది. నేను ప్రసంగ వేదికకు వెళ్ళినప్పుడు నా నోటి నుండి గాలి ఊదినట్టు నాకనిపించేది! ఆ ప్రసంగంలో మంచి విషయాలు ఉండేవి, నశించు పాపులకు సహాయ పడేవి. కాని అందులో శక్తి ఉండేది కాదు. ఎవరు దీవింప బడేవారు కాదు. ఆఖరి దినాలలో కొంతమంది బోధకులకు నేను మాట్లాడేది అర్ధం అయ్యేది కాదు. వారు బోధిస్తున్నప్పుడు ఎలాంటి తేడా వారు అనుభవించే వారు కాదు. ఇది విచారము, ఎందుకంటే వారికి పరిశుద్ధాత్మను గూర్చిన అవగాహన పూర్తిగా లేదు. వారు చెప్పలేదు కూడ వారు బోధిస్తున్నప్పుడు దేవుని ఆత్మ వారితో ఉందో లేదో.

ఒకసారి నేను నా నశించు తండ్రిని ఒక ప్రసిద్ధ బోధకుడు ప్రసంగము వినడానికి తీసుకెళ్ళాను అతడు స్యూ ఆర్ లీన్స్ లో బార్బాన్ వీధిలో ఉంటాడు. ప్రజలు నాతో చెప్పారు నా తండ్రిని అతడు సమీపింపగలడని ఎందుకంటే మధ్య వయస్కులు వినడానికి అతడు పరిహాసపు మాటలు చెప్తాడు – సువార్తకు స్పందించడానికి. ఆ ఒక్కసారే నా తండ్రితో ఒంటరిగా గుడికి వెళ్ళాను. బార్బాన్ వీధి నుండి వచ్చిన బోధకుడు నిలబడి నవ్వించే కబుర్లు చెప్పడం మొదలెట్టాడు. అందులో అతడు నేర్పరి. నిజంగా నేర్పరే! చివరిలో అన్నాడు రక్షింపబడడానికి ఒకటి రెండు మాటలు. అప్పుడు ఆహ్వానము ఇచ్చాడు – ముందుకు వచ్చి రక్షింపబడాలని. నా తండ్రి కదలలేదు. కొన్ని నిమిషాల తరువాత కారులో తను ఏమనుకున్నాడని అడిగాను. నా తండ్రి అన్నాడు, "అతడు బాబ్ హోప్ అంత గొప్ప కాదు." (యవనులైన మీకు – బాబ్ హోప్ ప్రసిద్ధ నవ్వించే హాస్యగాడు). తండ్రి అన్నాడు, "అతడు బాబ్ హోప్ అంత గొప్ప కాదు."

బార్బన్ వీధి బోధకుడు ప్రసంగమంతా ప్రజలు నవ్వుతూనే ఉన్నారు. గొప్ప విజయమని అతననుకొని ఉంటాడు. కాని పరిశుద్ధాత్మ అక్కడ లేదు! లేనే లేదు! నాకు అప్పుడు తెలుసు, ఇప్పుడు తెలుసు. నేను బతిమలాను కాబట్టి నా తండ్రి వచ్చాడు. అవును, తండ్రి వచ్చాడు – కాని పరిశుద్ధాత్మ రాలేదు! నా తండ్రి నశించు పాపి – కాని అతనికి ఆ గుడిలో "రొట్టె" లేదు, ఏది అవసరమో అది.

"నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చియున్నాడు, అతనికి పెట్టుటకు నా యెద్ద ఏమియు లేదు" (లూకా 11:6).

నేను నిలబడి ప్రసంగించినప్పుడు పరిశుద్ధాత్మలేనిచో, ఎవరికీ ఉపయోగముండదు, ఎవరు రక్షింపబడదు, ఎవ్వరు క్రీస్తు శిష్యులు కానేరరు. అందుకే ఈ ప్రసంగం వ్రాసేటప్పుడు ప్రతి వాక్యము గురుండి, పేరా గురుండి, ప్రార్ధిస్తాను. అందుకే మన మూడు ప్రార్ధనా కూటాల్లోని ప్రసంగాల నిమిత్తము ప్రార్ధించమని అడుగుతాను. అందుకే ఇద్దరు ప్రార్ధనా యోధులను నేను బోధిస్తున్నప్పుడు వేరే గదిలో ప్రార్ధించమని అడుగుతాం. లేకపోతే ప్రసంగ వేదిక నుండి ఏమి ఇవ్వలేము – "[వారి కొరకు] నా దగ్గర ఏమి ఉండదు." ఆఖరి దినాల్లో చాల సంఘాలలో ఇది చాల విషాద పరిస్థితి! అది మనకు జరగకూడదని ప్రార్ధించండి!

పాపుల కొరకు "రొట్టెను" పంపమని మనం దేవునికి ఎలా ప్రార్ధించాలి? పరిశుద్ధాత్మ కొరకు మనం ఎలా ప్రార్ధించాలి? 9 వ వచనము చూడండి,

"అటువలె, మీరును అడుగుడి, మీకియ్యబడును; వెదకుడి, మీకు దొరకును; తట్టుడి, మీకు తీయబడును అని మీతో చెప్పుచున్నాను" (లూకా 11:9).

అడుగుతూ ఉండండి! అడుగుతూ ఉండండి! అడుగుతూ ఉండండి! వదిలి పెట్టవద్దు. మానేయవద్దు. అగ్నితో మీ ఆత్మను వెలిగించేటట్లు దేవునికి పౌరుషంగా ప్రార్ధన చెయ్యండి – పరిశుద్ధాత్మ కొరకు ప్రార్ధింపవచ్చు – ఆకలిగొన్న పాపులకు రొట్టె కొరకు!

ఇంకా, పాపులకు సహవనము రొట్టె ఇచ్చేలా దేవునికి ప్రార్ధించాలి. మనకు అద్భుత భోజనము ఉంది, శ్రీమతి కుక్, శ్రీమతి లీ, రోబర్ట్ లూయిస్, డిక్సన్ లచే తయారు చేయబడినది. కాని పరిశుద్ధాత్మ హాజరు కాకపొతే, మన భోజనాలు ఉదయ సాయంకాల ఆరాధనల తరువాత ఇచ్చేయి ప్రజలకు సహాయబడవు. ఆరాధన తరువాత భోజనాలు పెట్టె సంఘము ఒకటి నాకు తెలుసు. కాపరి భార్య ఉత్సాహంగా ఆ విషయం నాకు చెప్పింది. ఆమె చెప్పింది ఈ భోజనాల వలన చాలామంది గుడికి వచ్చారని. నేనడిగాను, "ఇంకా భోజనము పెడుతున్నారా?" ఆమె చెప్పింది, "లేదు. అయి సహాయ పడడం లేదు, అందుకే మానేసాం." నేనేమి అనలేదు, నాకు కారణము మానేశారు. ఈ భోజనం ప్రజలకు సహాయపడుతుంది. పరిశుద్ధాత్మ హాజరుకానప్పుడు నశించు వారు భోజనము కొరకు ఎందుకు వస్తారా! పరిశుద్ధాత్మ హాజరు కాకపోతే, కేవలము భోజనము మాత్రమే? పవిత్రాత్మ లేకపోతే అది కేవలం మరొక భోజనం! ఎందుకు బాధపడాలి? పెద్ద భోజనము ఎందుకు చెయ్యకూడదు? ఇంటిలో ఎందుకు భోం చెయ్యకూడదు?

"నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చియున్నాడు, అతనికి పెట్టుటకు నా యెద్ద ఏమియు లేదు" (లూకా 11:6).

ఒక బోధకుడు అనుకున్నాడు మన భోజనాలు గొప్పగా ఉన్నాయని! అతడనుకున్నాడు కొంచెము మార్పు చేద్దామని – ఎందుకంటే మనం చేసే భారీ భోజనం వంటకం వేరే వారికి చాల కష్టము. కనుక అతడు "కొంచెము మార్చాడు." భోజనానికి బదులు సంఘ స్త్రీలతో ఆకలి పుట్టించేవి వడ్డింప చేసాడు. ఆల్ ఫ్రడ్ హిచ్ కాక్ తన భయంకర సినిమా "షైకో" విడుదల చేసేముందు సినీ ప్రముఖులందరినీ స్టూడియోకు ఆహ్వానించాడు. వారికి అతడు "వెళ్ళే భోజనము" – "నిజ వేళ్ళతో చేసినది" – వారితో చెప్పాడా! ఒక స్త్రీ అరచి నేలమీద జారవిడిచింది!

వేడుకలో ఆకలి పుట్టించేవి సరే, కాని అవి ఆకలిగొన్న యవనస్తులకు సహాయపడవు వారు సుదీర్ఘ సంఘ ఆరాధనలో కూర్చుంటారు. నేను నమ్ముతాను కాపరి ఈ పొరపాటు గమనించి ఉండేవారు దాని గూర్చి అతడు అతని ప్రజలు తీవ్రంగా ప్రార్ధించే ఉంటే. చూడండి, మనం ఒడ్డించే భోజనం ప్రజలకు ఆశీర్వాదం కాదు పరిశుద్ధాత్మ మనతో లేకపోతే. దేవుని ఆత్మ మనతో లేకపోతే – వారికివ్వడానికి మన దగ్గర ఏమి ఉండదు!

"నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చియున్నాడు, అతనికి పెట్టుటకు నా యెద్ద ఏమియు లేదు" (లూకా 11:6).

ఒక బోధకుడు నాతో చెప్పాడు అతని గుడిలో ఉదయ ఆరాధన తరువాత భోజనము పెడతారు. తరువాత అందరు చిన్న బైబిలు ధ్యానము కొరకు ఆవరనంలోనికి వెళ్తారు. అలా, అతనన్నాడు, వారికి ఆదివారము సాయంకాలపు ఆరాధన అవసరము లేదని. అతనన్నాడు భోజనము తరువాత, బైబిలు ధ్యానము సాయంకాలపు ఆరాధన కలిగి యుండినట్లే. అతనన్నాడు, "ఎక్కువగా బైబిలు వారు పొందుకుంటారు!"

నేననుకున్నాను, "పాపపు! అతడు విజయవంత కాపరి కాలేకపోవడంలో ఆశ్చర్యం లేదు!" సాయంకాలపు ఆరాధన ఉద్దేశము ఎక్కువ బైబిలు వచనాలను తిరుగుబాటు చేసే "సంఘపు పిల్లలు" బుర్రలలోనికి ఎక్కించడం కాదు! అతడు చూడలేదా? సాయంకాలపు ఆరాధన ఆపేయడం వలన, నశించు వారిని సువార్తిక ఆరాధనకు ప్రజలు తీసుకొని వచ్చే ఆవకాశము కోల్పోయాడు! దేవుడు మనకు సహాయం చెయ్యాలి! సంఘ కాపరి అతని ప్రజలు దీని గూర్చి తీవ్రంగా ప్రార్ధిస్తే, అది కచ్చితము వారి అవివేకాన్ని దేవుడు వారికి చూపించి ఉండేవాడు. నశించు ప్రజలు వచ్చి రక్షింపబడరు ఎందుకంటే పరిశుధాత్మ సంఘ కాపరిని, ప్రజలను నడిపించడానికి అక్కడ లేడు! ఈ చెడ్డ దినాలలో దేవుడు మనకు సహాయం చెయ్యాలి!

"నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చియున్నాడు, అతనికి పెట్టుటకు నా యెద్ద ఏమియు లేదు" (లూకా 11:6).

అంత్య దినాలలో, బోధకులు సంఘ సభ్యులు అంధకారములో ఉందురు! సంఘములో మనం చేసే దంతా ప్రార్ధన పూర్వకమై ఉండాలి. లేకపోతే మనలను గూర్చి చెప్పబడుతుంది, "జీవించుచున్నానన్న పేరు మాత్రము నీకున్నది, కాని నీవు మృతుడవే" (ప్రకటన 3:1). "జీవించుచున్నా నన్న పేరు మాత్రము నీకున్నది – కాని నీవు మృతుడవే." అది ఏ సంఘానికైనా జరగవచ్చు – ప్రత్యేకంగా ఈ దుష్ట కాలములో – అంత్య దినాలలో! మనము పరిశుద్ధాత్మ ప్రత్యక్షత కొరకు పోరాడకపోతే, మనం చేసే అంతటిలో త్వరలో సార్డీస్ సంఘము వలే మనము కూడ మృతులమై పోతాము!

"నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చియున్నాడు, అతనికి పెట్టుటకు నా యెద్ద ఏమియు లేదు" (లూకా 11:6).

ఈనాటి చాలా సంఘాలలో అది వాస్తవమని నా భయము. మన ప్రజలు సెలవు మీద వెళ్లి తిరిగి వచ్చి, నాతో అంటారు వారు హాజరు అయిన సంఘాలలో నిరుత్సాహ పడ్డారని. "పాటల పాడడం మృతము." "బోధకుడు విసుగు పుట్టించే వాడు." "ప్రజలు స్నేహంగా లేకపోవడం." "వారికి ఆదివారము సాయంకాలపు ఆరాధాన లేదు." "మేము ప్రార్ధనా కూటానికి వెళ్ళాం, కాని అక్కడ నిజ ప్రార్ధన లేదు – ఇంకొక బైబిలు పఠనము." మన ప్రజలు అలా అనుకుంటే, నశించు వారు కూడ అంతే! అంత్య దినాలలోని సంఘాలు బలహీనమవడంలో ఆశ్చర్యం లేదు!

"నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చియున్నాడు, అతనికి పెట్టుటకు నా యెద్ద ఏమియు లేదు" (లూకా 11:6).

ఇప్పుడు, మనం గర్విష్టులం కాకూడదు. దయచేసి గుర్తుంచుకొండి మనం అంత మంచిగా లేము! మన బలహీనతలు ఒప్పుకోవాలి లేనిచో దేవుని శక్తి మనలో ఉండదు. ఉపవసించి ప్రార్ధించుట నేర్చుకున్నాం – ఎందుకంటే ఉపవాసము సాతాను దెయ్యలపై బలమైన శక్తిని పొందుకోడానికి ఒక మార్గము! (మార్కు 9:29). మనం ఉపవసించి, ప్రార్ధించి కొన్ని ఆశీర్వాదాలు పొందుకున్నాం. వచ్చే శనివారము కూడ మనం ఉపవాసము కొనసాగించాలి శనివారము సాయంత్రము 5:30 కు మనం భోజనం చేసేవరకు.

ఈ రాత్రి మన కార్యకలాపాలన్నింటిలో పరిశుద్ధాత్మ ప్రత్యక్షత ఉండేలా ప్రార్ధించాలని నేను మిమ్మును అడుగుతున్నాను. దేవుని ఆత్మలేకుండా, "మన దగ్గర ఏమి ఉండదు" నశించు పాపుల కొరకు! కాబట్టి వివరంగా ప్రార్ధించాలి మనం చేసే అంతటిలో పరిశుద్ధాత్మ దిగి వచ్చేటట్లు. పరిశుద్ధాత్మ అనేది" రొట్టె" లేనిచో, పాపుల ఆకలిలో మన గుడి నుండి వెళ్ళిపోతారు – వారు రక్షింపబడరు.

అవును, దేవుని ఉగ్రత నుండి పాపులను రక్షించడానికి యేసు సిలువపై మరణించాడు. అవును, పాపులకు నూతన జన్మ ఇవ్వడానికి యేసు మృతులలో నుండి లేచాడు, వారిలో నిత్య జీవము ఇవ్వడానికి! కాని దేవుని ఆత్మ కార్యము లేకుండా ఇవి జరుగవు. కాబట్టి, వారమంతా, మనం ప్రార్ధించేటప్పుడు, పాపుల కొరకు రొట్టె నిమిత్తం ప్రార్ధిద్దాం. దేవుడు పరిశుద్ధాత్మను పంపి మన ఆరాధనలో మనసులో అంధకారము తొలగించేటట్టు, పాపపు నేరారోపణ పొందేటట్టు, ప్రభువైన యేసు క్రీస్తు అవసరత తెలుసుకోనేటట్టు ప్రార్ధిద్దాం! ఇప్పుడు లూకా 11:13 చూడండి. స్కోఫీల్డ్ పఠన బైబిలులో 1090 పేజీలో ఉంది. దయచేసి నిలబడి చదువుదాం.

"కాబట్టి, మీరు చెడ్డవారై యుండియు, మీ పిల్లలకు మంచి యీవుల నియ్య నెరిగియుండగా: పరలోక మందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించుననెను?" (లూకా 11:13).

కొన్ని విషయాల వివరాలు ఈ వారం ప్రార్ధించడానికి, ప్రత్యేకంగా శనివారము రోజు.


1.   మీ ఉపవాసము రహస్యంగా (సాధ్యమైనంత వరకు) ఉండాలి. మీరు ఉపవాసమున్నట్టు అందరికి చెప్పుకోవద్దు.

2.   బైబిలు చదవడంలో సమయం గడపండి. అపోస్తలుల కార్యముల గ్రంథములో కొన్ని భాగాలు చదవండి (ముఖ్యంగా ఆరంభంలోనివి).

3.    శనివారపు ఉపవాసములో యెషయా 58:6 కంటస్తం చెయ్యండి.

4.    దేవునికి ప్రార్ధించండి 10 మంది కొత్తవారిని వచ్చేటట్టు వారు మనతో ఉండేటట్టు.

5.   మన మారని యవనస్తులు మార్పు నొందేటట్టు ప్రార్ధించండి. యెషయా 58:6 లో చెప్పినది దేవుడు వారికి చేసేటట్టు ప్రార్ధించండి.

6.   ఈ రోజు (ఆదివారము) తొలి సందర్శకులు వచ్చే ఆదివారము వచ్చేలా ప్రార్ధించండి. వీలుంటే పేరు పేరు వరుసన ప్రార్ధించండి.

7.   వచ్చే ఆదివారము ఏమి బోధించాలో దేవుడు నాకు చూపించే టట్టు ప్రార్ధించండి – ఉదయము సాయంత్రము కూడ.

8.   ఎక్కువ నీరు త్రాగండి. గంటకు ఒక గ్లాసు. మొదట్లో ఒక పెద్ద కప్పు కాఫీ త్రాగవచ్చు ప్రతి రోజు తాగే అలవాటు ఉంటే. శీతల పానీయాలు, శక్తి పానీయాలు లాంటివి, త్రాగవద్దు.

9.   ఏవైనా వైద్య పర ప్రశ్నలుంటే ఉపవాసముండే ముందు వైద్యుని కలవండి. (మీరు డాక్టర్ క్రైగ్ టన్ చాన్ లేక డాక్టర్ జుడిత్ కాగన్ మన గుడిలో కలువవచ్చు). ఒకవేళ తీవ్ర సమస్య ఉంటే ఉపవాసము చేయవద్దు, మధుమేహము కాని అధిక రక్తపోటు గాని ఉంటే. శనివారము ఈ మానవుల నిమిత్తము ప్రార్ధించండి.

10. శుక్రవారము సాయంత్ర భోజన అనంతరము మీ ఉపవాసము ఆరంభించండి. శుక్రవారము భోజనము చేసిన తరువాత ఏమి తినవద్దు శనివారము సాయంకాలము 5:30 వరకు.

11. గుర్తుంచుకొండి మీరు ప్రార్దించవలసిన ప్రాముఖ్య విషయము మన సంఘములో నశించుచున్న యవనస్తులు మార్పు నొందేటట్లు – ఈ సమయంలో కొత్తగా వచ్చే యవనస్తుల కొరకు, మనతో ఎన్నటికి ఉండేలాగున ప్రార్ధించండి.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి. దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రుదోం: లూకా 11:5-13.
ప్రసంగము ముందు పాట బెంజమిన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్:
"నేను నీ కొరకు ప్రార్ధిస్తున్నాను" (ఎస్ ఓ’మాలి క్లౌవ్ చే, 1837-1910)
 “I Am Praying For You” (by S. O’Malley Clough, 1837-1910).