Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
స్వధర్మ కాలములో ఉపవాసము మరియు ప్రార్ధన

FASTING AND PRAYER IN A TIME OF APOSTASY
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము సాయంత్రము, జూలై 26, 2015
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord's Day Evening, July 26, 2015


మీరు లూకా, 4 వ అధ్యాయము, 18 నుండి 21 వచనాలు చూడండి. కొన్ని నిమిషాల క్రితం ఫ్రుదోమ్ గారు చదివినది నేను ఆ వచనాలు తిరిగి చదువుచున్నాను. లూకా 4:18-21 స్కోఫీల్డ్ స్టడీ బైబిలులో 1077 వ పేజీలో ఉంది.

"ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను; చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగినా వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును, ఆయన నన్ను పంపియున్నాడు. అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరకెను, ఆయన గ్రంథము చుట్టి పరిచారకుని కిచ్చి, కూర్చుండెను. సమాజ మందిరములో నున్న వారందరూ ఆయనను తేరిచూడగా. ఆయన నేడు మీ వినికిడిలో, ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను" (లూకా 4:18-21).

మీరు కూర్చోండి.

యేసు ఈ పాఠ్యభాగాన్ని యెషయా 61:1, 2 నుండి చదివాడు. ఆయన ఆ వచనాలు చదివి ఆయనలో అవి నెరవేరాయని చెప్పాడు. ఆయన సువార్త ప్రకటించడానికి అభిషేకింపబడ్డాడు. నలిగినా వారిని విడిపించుటకు దేవుడు ఆయనను పంపాడు. చెరలోనున్న వారికి విడుదల కొరకు వారికి బోధించడానికి దేవుడు ఆయనను పంపాడు, గ్రుడ్డి వారికి చూపును ఇవ్వడానికి. నలిగినా అణగగొట్టబడిన వారిని స్వతంత్రులుగా చెయ్యడానికి దేవునిచే ఆయన పంపబడ్డాడు.

ఆయనే అని చెప్పినందుకు వారు ఆయనను అసహ్యించుకున్నారు. వారు ఆయన ఊరు నజరేతులో, ఇరుగుపొరుగు వారు స్నేహితులు. వారన్నారు, "ఈయన యోసే కుమారుడు కాదా?" (లూకా 4:22). "సమాజ మందిరములో, ఉన్న వారందరూ, ఆ మాటలు విని" – ఆగ్రహముతో నిండుకొనిరి (లూకా 4: 28). వారు లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళ గొట్టిరి. ఆయనను తలక్రిందులుగా పడద్రోయవలెనని – తమ పట్టణము కట్టబడిన కొండపేట వరకు ఆయనను తీసికొని పోయిరి. "అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళి పోయెను" (లూకా 4:30). మేత్యూ హెన్రీ అన్నాడు ఆయన వారి కళ్ళకు గ్రుడ్డి తనము కలిగించాడు లేక తికమకలో పెట్టాడు, "ఆయన పని పూర్తి కాలేదు, ప్రారంభమయింది."

ఆయన నజరేతును విడిచి కపెర్న హూమునకు వెళ్ళాడు. సమాజ మందిరములో దయ్యము పట్టిన వ్యక్తి ఉన్నాడు. నా భార్య హేనా నేను అక్కడ ఉన్నాం. ఆ ప్రాచీన సమాజ మందిర శిధిలాలు చూసాం. దయ్యము పట్టిన వ్యక్తి గట్టి స్వరముతో ఇలా అరిచాడు,

"నజరేయుడైన యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపజేయ వచ్చితివా? నీ వెవడవో నేనెరుగుదును; నీవు దేవుని పరిశుద్దుడవని బిగ్గరగా కేకలు వేసెను" (లూకా 4:34).

యేసు అన్నాడు, "ఊరకుండుము. ఇతనిని వదిలిపోమ్ము!" దయ్యము వానిని వారి మధ్యను పడద్రోసి వానిని వదిలి పోయెను. చూసిన వారందరూ విస్మయ మొందారు. వారన్నారు, "ఇది ఎట్టిమాట? ఈయన అధికారముతోను బలముతోను అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవుచున్నవని ఒకనితో మరొకరు చెప్పుకొనిరి!" "అంతట ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రాంతము అంతటా వ్యాపించెను" (లూకా 4:37).

తరువాత యేసు సమాజము మందిరమును వదిలి మార్గము దాటి పేతురు ఇంటికి వెళ్ళాడు. నేను హైనా అక్కడ ఉన్నప్పుడు సమాజ మందిరము పేతురు ఇంటికి సమీపంగా ఉండడం చూసి భయబడ్డాను – వీధి అవతల, కొన్ని అడుగుల దూరంలో. వారు పేతురు ఇంటిని త్రావ్వారు కాని మీరు పునాదిని ఇప్పుడు కూడా చూడవచ్చు. పేతురు అత్త జ్వరంతో ఉంది. యేసు గద్దింపగా జ్వరము ఆమెను వదిలిపోయింది. సాయంకాలము అగుచుండగా, ప్రజలు దయ్యములు పట్టిన వారిని రోగులను ఆయన వద్దకు తెచ్చారు. ఆయన వారి మీద చేతులు ఉంచాడు. ప్రతి ఒక్కరు స్వస్థత పొందారు. దెయ్యములు బయటకి వచ్చి అరిచాయి. "నీవు దేవుని, కుమారుడైన క్రీస్తువు!" ఆ అద్భుత వివరణ కొనసాగుతూ ఉంటుంది! అది చదవడం నాకు ఇష్టం!

యేసు కథ నాకు చెప్పు,
   ప్రతి మాట నా హృదయముపై వ్రాయి.
చాల ప్రశస్తమైన కథ నాకు చెప్పు,
   ఎప్పుడు విననంత మాదుర్యమైనది.
("యేసు కథ నాకు చెప్పు" ఫేన్నీ జే. క్రాస్స్ బీ చే, 1820-1915).
(“Tell Me the Story of Jesus” by Fanny J. Crosby, 1820-1915).

కథ కొనసాగుతుంది, క్రీస్తు పరలోకానికి వెళ్ళాడు. క్రీస్తు శక్తి, అదే దేవుని నుండి దిగి వచ్చుట చూస్తాము. ఇది సంఘాలలో, మొదటి, రెండవ, మూడవ శతాబ్దంలో జరిగింది – మరియు ఇది "మూడవ ప్రపంచంలో" చాలా దేశాలలో జరిగింది. నూతన క్రైస్తవులు "పూర్తిగా మారని" వారు చైనా, మరియు ప్రపంచంలో వివిధ దేశాలలో పది వేల మంది ఉన్నారు.

కాని అమెరికలోని మన సంఘములో, యూరోప్, మరియు పశ్చిమ దేశాలలో కూడా జరిగింది. పాశ్చాత్య దేశములో 19 వ శతాబ్దములో భయంకరమైనది ఆరంభమైనది. 1830 నుండి చాల సంగతులు మారిపోసాగాయి. డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు ఈనాటి సంఘములోని సమస్యలన్నీ 19 వ శతాబ్దము మధ్యలో ఉన్నాయి – బైబిలును విమర్శించుట, యోగా కలుషిత సినాయిటికస్ వాటికనస్ ప్రతులు కనుగొనబడుట, ఫిన్నీ "నిర్నయత్వత", మొర్మోనులు, యెహోవా సాక్ష్యులు, కెంప్ బెలైటూలు, ఏడవరోజు ఎడ్వంటిస్టులు, త్వరిత బాప్టిస్మాలు, డార్వినిజం – 50 సంవత్సరాల లోపు ఇవన్ని జరిగాయి! అది గుర్తింపదగే తికమక పెట్టె దయ్యపు కాలము. తరువాత I ప్రపంచ యుద్ధము జరిగింది, అది యూరపును నేలమట్టం చేసింది. సంఘాలు కూడ కూలిపోయాయి. తిరిగి పొందుకోలేదు. స్వతంత్రులు సంఘాలకు చెప్పారు మానవుడు స్వతహాగా మంచివాడని – మనిషి పైకి వెళ్తూ, అద్భుత ప్రపంచంలో ఉంటున్నాడని. మొదటి ప్రపంచ యుద్ధము నీటి నుండి తేట తెల్లము చేసింది! మనిషి చెడ్డవాడని బైబిలు చెప్తుందని ప్రజలకు తెలియదు. సామాన్యులకు తెలియదు స్వతంత్రులు వారిని తప్పుదారి పట్టించారని. క్రైస్తవ్యము అర్ధ రహితమని వారు అనుకున్నారు. అది కల్పిత కథ మాత్రమే. మనమెప్పుడూ అలా అనుకోలేదు. తరువాత II ప్రపంచ యుద్ధము వచ్చింది. ఆ తరములో ఎంతమంది దేవుని తిరస్కరించారో చూడండి. వారన్నారు, "ఆష్ విట్స్ ను బట్టి నేను దేవుని నమ్మలేను – లేక హిరోషిమాను బట్టి." మానవుని దుర్మార్గాతను గూర్చి బైబిలు ఏమి చెప్తుందో వారికి బోధింపబడలేదు. మన ముత్తాతలు తాతలు గుడుల నుండి వెళ్ళిపోయారు. వారు సందేహకులు నాస్తికుల తరముగా తయారయ్యారు. ఇప్పుడు మేము మిమ్ములను చూస్తున్నాము – వారి ఉత్పత్తి.

ప్రాథమికులు స్వతంత్రతకు వ్యతిరేకంగా జీవితాల కొరకు పోరాడుతున్నారు. వారు మంచివారు. నేను వారిని ప్రశంశిస్తాను. కాని వారు గ్రహించడం లేదు "నిర్నయత్వత" వేలమంది మారని ప్రజలను సంఘాలలోనికి తీసికొని వస్తుందని. అది, తిరిగి, అసువార్తీకరణను ఉత్పత్తి చేస్తుంది, అది పుల్లర్ వేదాంత సెమినరీ నుండి రోబ్ బెల్ లాంటి వారిని తయారు చేస్తుంది (ప్రేమ జయిస్తుంది – సార్వత్రికము). అది కొత్తగా ప్రజలు నటిస్తారు. అది కొత్తది కానే కాదు. బెల్ లాంటివారు యూనిటేరియన్ పంట నుండి వచ్చిన వారు. బెల్ వాస్తవానికి యూనిటేరియన్ – పుల్లర్ సెమినరీ కూడ, పేరులో. ఈ కొత్త యూనిటేరియన్ అవిశ్వాసులు వారిని "సువార్తికులుగా" పిలుచు కుంటున్నారు. అది విషాదము! గత సంవత్సరము దక్షిణ బాప్టిస్టు కన్వెంక్షన్ పన్నెండు నెలలలో 200,000 మందిని పోగొట్టుకుంది! దీనిని గూర్చి ఆలోచించండి – సుమారుగా రెండున్నర లక్షల మంది 12 నెలలలో దక్షిణ బాప్టిస్టు సంఘాల నుండి వెళ్ళిపోయారు! ఇది నమ్మశక్యముగా లేదు! వారి ఐస్ఐస్ ను గూచి భయపడ్డారు; వార్తలలో క్రైస్తవులు శిరచ్చేదనము చేయబడినట్టుగా చూసారు, వారు భయపడ్డారు; లైంగిక విప్లవాన్ని గూర్చి భయపడ్డారు; వారు ఒబామాను గూర్చి భయపడ్డారు; ప్రతి దానిని గూర్చి భయపడ్డారు – కనుక దాక్కోవడానికి గుడి నుండి పారిపోయారు! ఇది అబ్బుర పరిచేది. కేవలము 12 నెలలలో 200,000 మంది సంఘాలను వదిలి వెళ్ళిపోయారు!

కనుక, అక్కడకు మనం వస్తున్నాము. ఇక్కడ మనం డౌన్ టౌన్ లాస్ ఎంజిలాస్, సివిక్ సెంటర్ లో ఉన్నాము, హాలీవుడ్ నుండి పదిహేను నిమిషాలు – పాశ్చాత్య దేశపు చంక. అవిశ్వాసులు లేని సంఘము మనం కలిగి ఉండాల్సి ఉంది! మీరనుకుంటారా కాలేజీ విధ్యార్ధులు క్రైస్తవేతర గృహాల నుండి వచ్చిన వారు సంఘమును కట్టగలరని? అది అసంభవం! కాని, దానికంటే ఎక్కువగా, మనము ఉజ్జీవము కొరకు ప్రార్దిస్తున్నాం! హా! హా! హా! అది అసంభవ స్వప్నము! కాదా? మానవ రీత్యా అది అసాధ్యము కాదు. కాని అక్కడ దేవుడు ప్రత్యక్ష మవుతాడు. యేసు అన్నాడు,

"ఇది మనష్యులకు అసాధ్యమే గాని, దేవునికి అసాధ్యము కాదు: దేవునికి సమస్తమును సాధ్యమే" (మార్కు 10:27).

మొదటి శతాబ్దము నుండి ప్రాముఖ్యంగా ఏమి మారలేదు. యెషయాను గూర్చి ప్రస్తావిస్తూ యేసు అన్నాడు, "నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది" (లూకా 4:21). ఆయన పిచ్చివాడని వారనుకున్నారు. ఆయనను అక్కడే చంపుదామనుకున్నారు. "అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్లి పోయెను" (లూకా 4:30).

ఒక అద్భుతము వెంబడి ఇంకొక అధ్భుతము చెయ్యడానికి ఆయన సమాజ మందిరము నుండి వెళ్ళాడు. కొన్ని సంవత్సరాలలో ఆయన అనుచరులు రోమా సామ్రాజ్యమంతా ఉన్నారు. దెస్సలోనీక పట్టణానికి వచ్చినప్పుడు పరిపాలకులు అరిచారు, "లోకమును తలక్రియలు చేయువారు [ఇక్కడకు వచ్చియున్నారు]" (అపోస్తలుల కార్యములు 17:6).

ప్రాముఖ్యంగా మార్పు ఏమి లేదు. మనిషి అలాగే ఉన్నాడా – తిరుగుబాటుతో అవిశ్వాసముతో. దేవుడు అలాగే ఉన్నాడు, సింహాసనా సీనుడై, అతి శక్తిమంతుడుగా, అంతా ఆయన ఆధీనంలో. క్రీస్తు అలాగే ఉన్నాడు. ఆయన మృతులలో నుండి లేచాడు ఆయన ప్రభువు!

ఆయన ప్రభువు, ఆయన ప్రభువు,
   ఆయన మృతులలో నుండి లేచాడు,
ఆయన ప్రభువు.
   ప్రతి మోకాలు వంగును,
ప్రతి నాలుక ఒప్పుకొనును
   యేసు క్రీస్తు ప్రభువని!
("ఆయన ప్రభువు" మార్విన్ వి. ప్రే చే, 1918-1992).
(“He is Lord” by Marvin V. Frey, 1918-1992).

"మీరు ప్రభువు." పాడండి!

మీరు ప్రభువు, మీరు ప్రభువు,
   ఆయన మృతులలో నుండి లేచాడు,
మీరు ప్రభువు.
   ప్రతి మోకాలు వంగును,
ప్రతి నాలుక ఒప్పుకొనును
   యేసు క్రీస్తు ప్రభువని!

దేవుడు క్రీస్తు పరిశుద్ధాత్మ విశ్వములో గొప్ప శక్తిగా ఆవిర్భవించారు! నేను ఒప్పింపబడ్డాను దేవుడు ఈరోజు తన పరిశుద్ధాత్మ శక్తిని క్రుమ్మరిస్తాడని – గతంలో ఆయన ఇచ్చినంతగా! మనం అది చెయ్యలేము. మనకు శక్తి లేదు. కాని బైబిలు చెప్తుంది, "శక్తి దేవునికి చెందినది" (కీర్తనలు 62:11). దేవుని ఆయన ఆత్మను క్రుమ్మరించి నప్పుడు గొప్ప కార్యాలు జరుగును. జాన్ నాక్స్, స్కాటిష్ సంస్కర్త, అన్నాడు స్కాట్ ల్యాండ్ మేరీ ఖడ్గము నుండి రక్షింపబడింది ఎందుకంటే "దేవుడు సామాన్యులకు తన పరిశుద్ధాత్మను సమృద్ధిగా ఇచ్చాడు" (The Works of John Knox, volume 1, 1946 edition, p. 101).

మీరు మన సంఘాన్ని గూర్చి ప్రార్ధించేటప్పుడు, మన మధ్యలో దేవుని ఆత్మ క్రుమ్మరింపు ఉండేలా ప్రార్ధించండి. మీరు సువార్త నిమిత్తము వెళ్ళేటప్పుడు మన పనిలో దేవుని ఆత్మ క్రుమ్మరింపు ఉండేటట్టు ప్రార్దించండి. మీరు కారులో ప్రయాణించేటప్పుడు, దేవుని ఆత్మ క్రుమ్మరింపు ఉండేటట్టు ప్రార్దించండి! గొప్ప బోధకుడు చార్లెస్ సిమో యోను అన్నాడు, "మార్పిడి కార్యము క్రమేణా మీ మధ్య జరుగాలి, దేవుడు అసాధారణ కొలతలో ఆత్మను మీపై క్రుమ్మరింపకపోతే తప్ప" (W. Carus, Memoirs of Charles Simeon, 2nd edition, 1847, p. 373).

గుర్తుంచుకోండి, దేవుడు ఆత్మను క్రుమ్మరించేలా మనము చెయ్యలేము. ఈ సంఘముపై దేవుడు తన ఆత్మను క్రుమ్మరించాలని నలభై సంవత్సరాలుగా ప్రార్ధిస్తున్నాను. ఆయన ఇంకా చెయ్యలేదు. ఇప్పుడు, వెనక్కి చూస్తే, నేను చూడగలను, నేను అనుకున్నాను, కారణాలకు ఆయన జవాబు ఇవ్వలేదు. ఇప్పుడు మనకు మెరుగైన సంఘము ఉంది. నాయకత్వము మార్పిడి నొందింది. చాలామంది మన యవనులు మార్పు నొందారు. బహుశా ఇప్పుడు దేవుడు మన ప్రార్ధనలకు జవాబు ఇస్తాడు – కనీసం ఆయన ఆత్మను పంపించి పది పన్నెండు మంది నూతన యవనస్తులను ఈ వేసవిలో మన సంఘములోనికి తీసుకొని వస్తాడు. ఉపవసముపై మన కంఠత వచనాన్ని చూడండి. అది యెషయా 58:6. అది స్కోఫీల్డ్ బైబిలులో 763 పేజీలో ఉంది. లేచి గట్టిగా చదవండి.

"నేను ఎన్నుకున్నది ఇది కాదు కదా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుట, ప్రతికాడిని విరుగ గొట్టుట నేనేర్పరచు కొనిన ఉపవాసము కదా?" (యెషయా 58:6).

కూర్చోండి. దయచేసి ఈ వచనము కంఠత పెట్టండి. దయచేసి తెరచి వచ్చే శనివారము ఉపవసించి ప్రార్ధించేటప్పుడు చదవండి. గమనించండి యెషయా 58:6 యెషయా 61:1-2 కు ఎంత దగ్గరగా ఉందో పోలిస్తే.

"ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది; బీదలకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను; నలిగిన హృదయము గలవారిని దృఢ పరచుటకును, చెరలో నన్ను వారినికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును; యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతి దండన దినమును ప్రకటించుటకును; దుఃఖ క్రాంతులను ఓదార్చు టకును" (యెషయా 61:1-2).

ఈ రెండు భాగాలు పోల్చుట ద్వారా మనం చూడవచ్చు క్రీస్తు పని భూమిపై ఇప్పుడు కొనసాగుతుంది, మన ప్రార్ధనలకు ఉపవాసానికి దేవుడు జవాబు దయచేయుట ద్వారా.

డాక్టర్ జాన్ ఆర్. రైస్ (1895-1980) అన్నాడు, "నాకు తెలుసు నిజ ఉపవాసము మనసులో దీనత్వము దేవునిపై ఎదురు చూచుట ద్వారా దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలను మనకు అంద చేస్తుంది!...ఉపవసించి ప్రార్ధించండి ఆశీర్వదముతో దేవుడు మిమ్మును కలిసే వరకు" (Prayer: Asking and Receiving, Sword of the Lord, 1997 edition, pp. 230, 231).

జోనాతాన్ ఎడ్వర్డ్స్ (1703-1758) మూడు రోజులు ఉపవసించి ప్రార్ధించాడు ఆగ్రహ దేవుని చేతిలో పాపులపై బోధించడానికి... మొదటి గొప్ప మేల్కొలుపు ఆ ప్రసంగము ద్వారా మొదలైంది (Elmer Towns, D.Min., The Beginner’s Guide to Fasting, Regal Publications, 2001, pp. 123, 124).

డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్-జోన్స్ (1899-1981) అన్నాడు, "ఉపవాసపు ప్రశ్న మన మనసులో వచ్చిందా అని నేను ఆశ్చర్యపడుతున్నాను? వాస్తవము, లేదు, ఈ అంశమే పూర్తిగా క్రైస్తవ తలంపు నుండి...వదిలి వేయబడింది" (Studies in the Sermon on the Mount, part 2, Eerdmans, p. 34).

ప్రాచీన రెండవ శతాబ్దపు కాపరి, పోలికార్ఫ్ (సి. 80-167) అన్నాడు, "ఆది నుండి విడిచి పెట్టబడిన; ‘కనిపెట్టి ప్రార్ధించుటకు’ తిరిగి వద్దాం ‘పట్టుదలతో కూడిన ఉపవాసము’" (Epistle to the Philippians).

స్పర్జన్ (1834-1892) అన్నాడు, "మనము...క్రైస్తవ సంఘములో గొప్ప ఆశీర్వాదము కోల్పోయాము ఉపవాసాన్ని వదిలేసినందుకు" (C. H. Spurgeon, “A Desperate Case – How to Meet It,” January 10, 1864).

డాక్టర్ ఆర్. ఎ. టోరీ (1856-1928) అన్నాడు, "మీరు శక్తితో ప్రార్ధిస్తే, ఉపవాసముతో కూడ ప్రార్ధించాలి" (How to Pray, 2007 edition, p. 37).

గొప్ప జాన్ వెస్లీ (1703-1791) అన్నాడు, "ఉపవాస ప్రార్ధన ఏరోజైనా చేసారా? కృపా సింహాసనాన్ని కదపండి, కృప దిగి వస్తుంది" (The Works of John Wesley, volume 10, 1827 edition, p. 340).

గొప్ప చైనీయ సువార్తికుడు డాక్టర్ జాన్ సంగ్ (1901-1944) అన్నాడు, "చాలామంది [యవనస్తులు] ఉపవాస ప్రార్ధనలు చేసారు. ప్రభువు పట్ట విద్యార్ధుల ప్రేమ కదిలించేదిగా ఉంది" (The Diary of John Sung, compiled by Levi, Genesis Books, 2012, p. 298).

ప్రముఖ చైనా మిస్సెనరీ డాక్టర్ జేమ్స్ హిడ్సన్ టేలర్ (1832-1905) అన్నాడు, "ఫాన్సీలో చైనీయ క్రైస్తవులను కనుగొన్నాను వారు ఉపవాస ప్రార్ధనలో సమయము గడపడానికి అలవాటు పడ్డారు...కృపకు దైవిక మార్గము. బహుశా మన పనికి గొప్ప అడ్డంకు ఊహించే మన శక్తి; ఉపవసములో మనం నేర్చుకుంటాం, మనం ఎంత పేద బలహీన సృష్టియో – చిన్న శక్తికి మాంసాహారం పై ఆధార పడతాం మనం దానికి తగిన వారము" (The New Encyclopedia of Christian Quotations, Baker Books, 2000, p. 360).

డాక్టర్ తిమోతి లిన్ (1911-2009) అన్నాడు, "మనం ఉపవాస ప్రార్ధన ప్రారంభించిన వెంటనే మన ఆత్మీయ అవగాహన బయలు పరచ బడుతుంది...ఇది నా వ్యక్తిగత అనుభవము ద్వారా చెప్తున్నాను" (The Secret of Church Growth, First Chinese Baptist Church, 1992, p. 23).

వచ్చే శనివారము మన సంఘములో ఉపవాస దినము కలిగి యుందాం. ఎలా చెయ్యాలో కొన్ని సూచనలు మీకు ఇవ్వాలను కుంటున్నాను.


1.   మీ ఉపవాసము రహస్యంగా (సాధ్యమైనంత వరకు) ఉండాలి. మీరు ఉపవాసమున్నట్టు అందరికి చెప్పుకోవద్దు.

2.   బైబిలు చదవడంలో సమయం గడపండి. అపోస్తలుల కార్యముల గ్రంథములో కొన్ని భాగాలు చదవండి (ముఖ్యంగా ఆరంభంలోనివి).

3.    శనివారపు ఉపవాసములో యెషయా 58:6 కంటస్తం చెయ్యండి.

4.    దేవునికి ప్రార్ధించండి 10 మంది కొత్తవారిని వచ్చేటట్టు వారు మనతో ఉండేటట్టు.

5.  మన మారని యవనస్తులు మార్పు నొందేటట్టు ప్రార్ధించండి. యెషయా 58:6 లో చెప్పినది దేవుడు వారికి చేసేటట్టు ప్రార్ధించండి.

6.  ఈ రోజు (ఆదివారము) తొలి సందర్శకులు వచ్చే ఆదివారము వచ్చేలా ప్రార్ధించండి. వీలుంటే పేరు పేరు వరుసన ప్రార్ధించండి.

7.   వచ్చే ఆదివారము ఏమి బోధించాలో దేవుడు నాకు చూపించే టట్టు ప్రార్ధించండి – ఉదయము సాయంత్రము కూడ.

8.   ఎక్కువ నీరు త్రాగండి. గంటకు ఒక గ్లాసు. మొదట్లో ఒక పెద్ద కప్పు కాఫీ త్రాగవచ్చు ప్రతి రోజు తాగే అలవాటు ఉంటే. శీతల పానీయాలు, శక్తి పానీయాలు లాంటివి, త్రాగవద్దు.

9.  ఏవైనా వైద్య పర ప్రశ్నలుంటే ఉపవాసముండే ముందు వైద్యుని కలవండి. (మీరు డాక్టర్ క్రైగ్ టన్ చాన్ లేక డాక్టర్ జుడిత్ కాగన్ మన గుడిలో కలువవచ్చు). ఒకవేళ మధుమేహము కాని అధిక రక్తపోటు గాని సమస్య ఉంటే, ఉపవాసము చేయవద్దు. శనివారము ఈ మానవుల నిమిత్తము ప్రార్ధించండి.

10. శుక్రవారము సాయంత్ర భోజన అనంతరము మీ ఉపవాసము ఆరంభించండి. శుక్రవారము భోజనము చేసిన తరువాత ఏమి తినవద్దు శనివారము సాయంకాలము 5:30 వరకు.

11. గుర్తుంచుకొండి మీరు ప్రార్దించవలసిన ప్రాముఖ్య విషయము మన సంఘములో నశించుచున్న యవనస్తులు మార్పు నొందేటట్లు – ఈ సమయంలో కొత్తగా వచ్చే యవనస్తుల కొరకు, మనతో ఎన్నటికి ఉండేలాగున ప్రార్ధించండి.


ఇప్పుడు, నేను ఇంకా మారని వారి కొరకు కొన్ని మాటలు ఇస్తాను. యేసు నీ పాప ప్రాయశ్చిత్తము చెల్లించడానికి సిలువపై మరణించాడు, నీ పాపమూ కొరకు తీర్పు తీర్చబడకుండా ఉండడానికి. యేసు భౌతికంగా లేచాడు, ఆయన పునరుత్థాన శరీరంతో మాంసముతో. నీకు నిత్య జీవము ఇవ్వడానికి ఆయన అలా చేసాడు. యేసు ఆరోహనుడై మూడవ ఆకాశంలో తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు. విశ్వాసము ద్వారా నీవు ఆయన దగ్గరకు రావచ్చు, నీ పాపాల నుండి ఆయన నిన్ను రక్షిస్తాడు తీర్పు నుండి కూడ! దేవుడు మిమ్మును దీవించు గాక. ఆమెన్. డాక్టర్ చాన్, దయచేసి ప్రార్ధనలో నడిపించండి.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి. దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రుదోం: లూకా 4:16-21.
ప్రసంగము ముందు పాట బెంజమిన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్ గారిచే:
"రమ్ము, నా ఆత్మా, నీ సిద్ధపాటుకు" (జాన్ న్యూటన్ చే, 1725-1807).
“Come, My Soul, Thy Suit Prepare” (by John Newton, 1725-1807).