Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
శిష్యులను తయారు చేయడం ఎలా!
వాస్తవంగా పనిచేసే ఒక ప్రణాళిక!

HOW TO MAKE DISCIPLES!
A PLAN THAT ACTUALLY WORKS!
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము సాయంత్రము, జూలై 5, 2015
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord's Day Evening, July 5, 2015

"కాబట్టి, మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు: నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నింటిని గైకొనవలెనని వారికి బోధించుడి: మరియు, ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు, సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఆమెన్" (మత్తయి 28:19-20).


చాలాకాలము క్రిందట స్థానిక సంఘ ప్రాధాన్యత ప్రాముఖ్యత నాకు బోధింప బడింది. నేనెప్పుడు విన్నానో సరిగ్గా గుర్తులేదు – అది చాలా ముందు అయి ఉంటుంది ఎందుకంటే ఆ సమయము నాకు గుర్తు రావడం లేదు. క్రొత్త నిభందనలోనిదంతా స్థానిక సంఘాలపై కేంద్రీకృతమై ఉంది. జమ్ జెంట్ అన్నాడు, "పదము ‘సంఘము’ అనే పదము క్రొత్త నిబంధనలో 100 సార్లు వాడబడింది...సంఘము దేవునికి తరువాత వచ్చిన తలంపు కాదు...ఆదిమ క్రైస్తవులకు, స్థానిక సంఘము దైవిక అభిషేక తెగ దాని ద్వారానే, దేవుడు పనిచేయ ఎన్నుకున్నాడు" (Jim Gent, The Local Church: God’s Plan for Planet Earth, Smyrna Publications, 1994, pp. 81, 83, 84).

గ్రీకు పదము "సంఘము" నకు "ఎక్లేసియా" అంటే – పిలువబడిన సమూహము అని అర్ధం – లోకములో నుండి సమకూర్చబడిన దేవుని గుంపు, ఆయన ఆత్మ ద్వారా క్రీస్తులో జమ చేయబడిన వారు. చెప్పాలంటే, మనం "గుడికి వెళ్ళము." రక్షింపబడిన మనము సంఘము! మత్తయి 16:17, 18 లో క్రీస్తు సంఘ పునాది గూర్చి చెప్పాడు. తరువాత మత్తయి 18:15-20 లో సంఘ క్రమ శిక్షణ అధికారమును గూర్చి చెప్పాడు. కాని ఆయన గొప్ప ఆజ్ఞలో క్రీస్తు సంఘము ఎలా ఉండాలో, దాని ఉద్దేశము పనిని గూర్చి చెప్పాడు. మార్కు 16:15 లో క్రీస్తు అన్నాడు,

"మీరు సర్వ లోకమునకు వెళ్ళి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి" (మార్కు 16:15).

సర్వలోకమునకు వెళ్ళాలనే ఈ ఆజ్ఞ చాలాసార్లు మళ్ళీ మళ్ళీ చెప్పబడింది. కాని అది ముఖ్య అంశము కాదు మత్తయి 28:19, 20 లలో ఇవ్వబడిన ఆజ్ఞలో. డాక్టర్ డబ్ల్యూ. ఎ. క్రీస్ వెల్ అన్నాడు, "యేసు ఆజ్ఞా...సంఘానికి ప్రతీతరములో. ఆజ్ఞలో ఇమిడి ఉన్న పదము ‘దేశాలకు బోధించండి,’ వాస్తవికంగా ‘శిష్యులనుగా చేయండి’" (The Criswell Study Bible, Thomas Nelson Publishers, 1979; note on Matthew 28:19-20).

కొందరన్నారు ఈ ఆజ్ఞా అపోస్తలులకు మాత్రమే ఇవ్వబడిందని. అది తప్పుడు అభిప్రాయము. అపోస్తలుల కార్యముల గ్రంధాన్ని ఎలా చదవాలంటే క్రొత్త నిబంధన సంఘాన్ని నమ్మాయి ఈ ఆజ్ఞా వారందరికి ఇవ్వబడిందని – సంఘాలన్నిటికి. డాక్టర్ క్రీస్ వెల్ ఇంకా చూపించాడు "దేశాలన్నింటికి బోధించండి" అంతరంగిక భావన "శిష్యులనుగా చేయుడి" అని. నా దీర్ఘ కాల సంఘ కాపరి డాక్టర్ తిమోతి లిన్ కొత్త అమెరికన్ స్టాండర్డ్ బైబిలు అనువాదకులలో ఒకరు. ఆయన టాల్ బోట్ వేదాంత సెమినరీలో బోధించాడు చైనా సువార్తిక సెమినరీకి అధ్యక్షుడుగా ఉన్నాడు. డాక్టర్ లిన్ మత్తయి 28:19-20 ని గూర్చి ఈ వివరణ ఇచ్చాడు.

గొప్ప ఆజ్ఞలో నాలుగు క్రియలు ఉన్నాయి: "వెళ్ళుడి," "శిష్యులుగా చేయుడి," "బాప్తిస్మమియ్యుడి" మరియు "బోధించుడి." "శిష్యులుగా చేయుడి" క్రియ మాత్రము స్పష్టంగా ఉంది; మిగిలిన మూడు ప్రయోగాలగా క్రియ విశ్లేషణగా ఉన్నాయి. కాబట్టి, సంక్షిప్త అనువాదము ఇలా ఉండాలి:

మీరు వెళ్ళండి, సమస్త జనులను శిష్యులుగా తప్పక చెయ్యాలి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు, నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నింటిని గైకొన వలెనని వారికి బోధించుడి; ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని, వారితో చెప్పెను.

ఇంకొక మాటల్లో, "వెళ్ళుడి" ఒక ఆజ్ఞ కాదు [ఇక్కడ], కాని "శిష్యులుగా చేయుడి" అనేది, గొప్ప ఆజ్ఞాలో ప్రాముఖ్య విషయము (Timothy Lin, S.T.M., Ph.D., The Secret of Church Growth, FCBC, 1992, p. 59).

ఆల్ బెర్ట్ బార్నేస్ కూడ ఇదే చెప్పాడు, "పదము [బోధించుడి] అంటే అర్ధము ‘శిష్యుడు’ లేక ‘శిష్యులనుగా చేయుడి’" (Barnes’ Notes on the New Testament, Baker Book House, 1983 edition; note on Matthew 28:19). కొత్త అంతర్జాతీయ వెర్ సన్ "శిష్యులుగా చేయుడి" గా అనువదిస్తుంది (ఎన్ జెవి (NIV), మత్తయి 28:19). డాక్టర్ ఆర్. సి. హెచ్. లేన్స్కి, లూథరన్ వ్యాఖ్యాత, ఇలా అనువదించాడు, "వెళ్ళారు, కాబట్టి, దేశస్తులందరిని శిష్యులనుగా చేయుడి" (The Interpretation of St. Matthew’s Gospel, Augsburg Publishing House, 1961 edition, p. 1170). "శిష్యులనుగా చేయుడి" అనువాదాన్ని చార్లెస్ జాన్ ఎల్లికాట్ జాన్ పీటర్ లాంజ్ లు కూడ వారి వ్యాఖ్యానాల్లో ఇచ్చారు. విలియం హెండ్రిక్ సన్ అన్నాడు, "’వెళ్ళారు, కాబట్టి, శిష్యులనుగా చేయుడి’ అది బాహాటంగా ఉంది. అది ఒక ఆజ్ఞ, జారి" (The Gospel of Matthew, Baker Book House, 1981 edition, p. 999). కాబట్టి, గొప్ప ఆజ్ఞా సారాంశము స్థానిక సంఘము యొక్క పని ఉద్దేశము. స్థానిక సంఘములో మనం చేసేదంతా వెళ్లి శిష్యులనుగా చేయడానిపై దృష్టి సారించాలి, వారికి బాప్తిస్మము ఇవ్వడం క్రీస్తు ఆజ్ఞాపించిన దంతా చేయమని వారికి బోధించడం. స్థానిక సంఘము తర్బీదు కేంద్రముగా ఉండాలి "అన్ని దేశస్థులను శిష్యులనుగా చేయడానికి." నా ప్రసంగాలు శ్రద్ధగా జాగ్రత్తగా వినేవారికి తెలుసు నేను డాక్టర్ జాన్ ఆర్. రైస్ ను అభినందిస్తానని.

ప్రతి విషయంలో అతనితో ఏకీభవించాను, కాని ఆత్మల సంపాదన విషయంలో నేను గట్టిగా అతనితో ఏకీభవిస్తాను. మత్తయి 28:19, 20 పై డాక్టర్ రైస్ గొప్ప ఆజ్ఞపై ఇచ్చిన వివరణ ఇవ్వండి. డాక్టర్ రైస్ అన్నాడు,

ప్రతి ఒక్కరు ఏకీభవిస్తారు రక్షకుని గొప్ప ఆజ్ఞ ప్రణాళిక ఆత్మల రక్షణకు ప్రాధాన్యత ఇస్తుందని, ఆత్మల రక్షణ క్రైస్తవుల, సంఘ కాపరుల సంఘముల యొక్క ప్రాముఖ్య వ్యాపారము...["మీరు వెళ్లి, సర్వ లోకమునకు బోధించుడి"] గమనించుడి "బోధించుడి" అంటే క్రైస్తవులకు లేఖనాలను వివరించుట కాదు. దాని అర్ధము "శిష్యులనుగా చేయుట." గ్రీకు పదము "మాతేటియో," అంటే "శిష్యులనుగా చేయుట"...కనుక, గొప్ప ఆజ్ఞలో బోధింపబడిన ఆజ్ఞ శిష్యులనుగా చేయడం (John R. Rice, D.D., Litt.D., Why Our Churches Do Not Win Souls, Sword of the Lord Publishers, 1966, p. 22).

గ్రీకు పదము "శిష్యునికి" డబ్ల్యూ. యి. వైన్ చే పరిపూర్ణముగా వివరింప బడింది – "శిష్యుడు [విధ్యార్ధి ] మాత్రమే కాదు, పెద్దవాడు [కూడ]; కనుక వారు బోధకులను అనుకరించే వారు" (W. E. Vine, An Expository Dictionary of New Testament Words, Fleming H. Revell Publishers, 1966 edition, p. 316).

కాని ప్రశ్న వస్తుంది – మనం ఎలా కొత్త శిష్యులను నియమిస్తాం? నేననుకుంటాను అది ఈ రోజుల్లో ఒక క్లిష్ట ప్రశ్న. మనం కనుగొన్నాం పాతపద్ధతులు, గతంలో పనిచేసాయి, ఇవి ఈనాడు స్థానిక సంఘములోనికి కొత్తవారికి తీసుకు రావడం లేదు. అవి పని చెయ్యవు! కరపత్రాలు ఇవ్వడం గుడిలోనికి కొత్త శిష్యులను తేలేవు. ఆహ్వానాలను ద్వారములకు వేలాడదీయడం పని చెయ్యడు. ఇంటింటికి వెళ్లి "పాపి ప్రార్ధన" చెయ్యడం పనిచెయ్యదు. ఈ పాత పద్ధతులను అవలంబించే వారికి బాగా తెలుసు వారు సంఘములోనికి కొత్త శిష్యులను తీసుకొని రాలేరనే విషయం.

నేను మార్చబడినప్పుడు జాన్ వెస్లీ సంచిక చదువుచున్నాను. బయటకు వెళ్ళి మైదానంలో బోధించుట జాన్ వెస్లీ పద్ధతి. కొంతమంది ఆయన దగ్గరకు వచ్చినప్పుడు వారిని చిన్న గుంపులుగా చేసేవాడు. సువార్తీకరణ అలా చెయ్యాలనుకున్నాను. కనుక ప్రతిరోజూ పని తరువాత డౌన్ టౌన్ లాస్ ఎంజలాస్ లోని వీధులలోనికి వెళ్లి బోధించే వాడిని. కాని ఫలితాలు చాల తక్కువగా వచ్చాయి. ఒక జంటను వారి ఇంటి నుండి క్రీస్తు నొద్దకు నడిపించగలిగాను, నేను వీధులలో బోధించేటప్పుడు భర్త విన్నాడు. రెండు సంవత్సరాలు వీధులలో బోధించినదానికి ఫలితము వారిద్దరూ!

తరువాత కరపత్రాలు పంచాను. ఈ సంఘము ప్రారంభించినప్పుడు నిలకడగా కరపత్రాలు పంచాము. నా లెక్క సుమారుగా అర మిలియను రక్షణ కరపత్రాలు ఇచ్చి ఉంటాము. మనం సంఘము పేరు, ఫోను నంబరు వాటిపై ఉండేవి. కాని, చాల సంవత్సరాల తరువాత, వేలకొలది కరపత్రాలు ఇచ్చాక, ఒక వ్యక్తి కూడ మన గుడిలో నికి రాలేరు! ఒకరు కూడ!

తరువాత ఇంటింటికి వెళ్లి రక్షణ ప్రణాళిక బోధించాము. చివరకు ఎలా రక్షింప బడాలో వివరించే, టేపు తయారు చేసాను. నశించు వందల మంది ప్రజల మధ్య మావారు ఆటేపు వినిపించారు. చాల తక్కువమంది, ఒక్కరు కూడ, గుడికి రాలేదు! వారిలో యవనస్తులు ఒకరు లేరు. మాతో ఒక్కడు కూడ లేడు!

చివరకు చిన్న ఆహ్వానము ప్రయత్నించాము. మేము బైబిలు కాని, కరపత్రము కాని, సాహిత్యము కాని తీసుకోలేదు. మా వారిని వ్యాపార స్థలాలకు, కళాశాలలకు, ఎన్నిక చేయబడిన వీధి మూలాలకు పంపడం ప్రారంభించాము. వారు ప్రజలను సమీపించి వారితో సామాన్య సంభాషణ చేసేవారు. మన బాప్టిస్టు సంఘములో పార్టీకి వారిని ఆహ్వానించే వారు. వారి పేరు ఫోన్ నంబరు అడిగేవారు. యవనస్తులపై దృష్టి పెట్టాం. డాక్టర్ తిమోతి లిన్ అన్నాడు, "లెక్కల ప్రకారం, 40 సంవత్సరాలు పైబడిన వారు క్రీస్తును స్వీకరించడం చాలా తక్కువ, ముఖ్యంగా చైనీయుల మధ్య" (ఐబిఐడి., పేజి 73). వాస్తవానికి, చైనీయేతరుల, మధ్య ఇంకా తక్కువ! ఇతర లెక్కలు చెప్తున్నాయి అన్ని మార్పిడిలు (90% పైగా) 30 సంవత్సరాలలోపు వారిలో జరుగుతున్నాయి. నాకు ఆశ్చర్యము అనిపిస్తుంది చాలామంది బోధకులు ఆఖరి దినాలలో ఆత్మల సంపాదన ప్రయత్నాలన్నీ పెద్దవారిపై చేస్తారు, విశ్లేషణ చూపిస్తుంది వారు ఎక్కువగా తిరస్కరించే వయో గుంపు! డాక్టర్ లిన్ అన్నారు యవనులను శిష్యులను చెయ్యడానికి ఎక్కువగా ప్రయత్నించాలి. కనుక 16 నుండి 25 లోపు వారిపై దృష్టి పెడతాం. ఆఖరి రోజులలో చాలామంది బోధకులకు వెనువెంట ఫలితాలు కావాలి. కాబట్టి అన్ని విధాల, ఇతర సంఘాల నుండి, "సిద్ధంగా ఉన్న" క్రైస్తవులను వెదుకుతారు. పాత సంఘాన్ని విడిచి వీరి దగ్గరకు వచ్చేలా చేస్తారు. డాక్టర్ జేమ్స్ డాబ్ సన్ అన్నారు మన సంఘాలలో వృద్ధి బదిలీల ద్వారా. ఏది విషాద పరిస్థితి. బోధకులు బలవంతంగా ఇలా చేస్తున్నారు ఎందుకంటే నశించు లోకము నుండి కొత్త శిష్యులను ఎలా తేవాలో వారికి తెలియడం లేదు. చాలామంది బోధకులకు తలంపు లేదు నశించు వారిని ఎలా ఆకర్షించాలో శిష్యులుగా తీర్చిదిడ్డాలో ఎలా మార్చాలో. ఏమి చెయ్యాలో వారికి తెలియదు! వారు ఇతర సంఘాల నుండి "గొర్రెలను దొంగిలించడం" మాత్రము చేయగలరు! ఉజ్జీవము లేకపోవడంలో ఆశ్చర్యము లేదు!

మా ప్రజలు "సువర్తీకరణ" నుండి వచ్చినప్పుడు పేర్లు ఫోను నంబరు ఫోన్లు చేసే వారికి అందచేసే వారు. ఫోను చేసేవారు వారిని ఎలా పిలవాలో ఆహ్వానించాలో నేర్చుకున్నారు. వారు ఎందుకు రావాలో సరిగ్గా చెప్పే వాళ్ళం – నేను మాట్లాడతాను, పుట్టిన రోజు పార్టీ ఉంటుంది తరువాత కలిసి భోజనం చేస్తాము. కొన్ని రోజుల్లో పుట్టిన రోజు ఉండేవారు ఎవరోఒకరు ఉండేవారు! కొత్తవారు వచ్చినప్పుడు కొన్ని వారాలలో సువార్తీకరణకు వారిని ఆహ్వానించే వారము. వారు మారాలని కనిపెట్టే వారము కాదు. యేసు మాదిరి వెంబడించే వారము. ఆయన సీయోను పేతురును, సందేహించే తోమాను, ఇతరులను శిష్యులనుగా వెంబడించాలని ఆహ్వానించాడు వారు సువార్తను అర్ధం చేసుకొని మారేముందు. యూదా మూడు సంవత్సరాలు శిష్యునిగా ఉండి ఎన్నటికి మారలేదు. అలా, వారు రక్షింపబడక మునుపు శిష్యులయ్యారు! ఆ పద్దతి యేసు ఉపయోగించాడు. ఆ పధ్ధతి ఒక్కటే నేను ప్రయత్నించాను అది పని చేసింది!

తరువాత, యేసు వారిని శిష్యత్వములోనికి "సులువుగా" తేలేదు. లేదు! దానిలోనికి ఆయన వారిని లాగాడు! మొదటి శిష్యులను ఆయన ఎలా పిలిచాడో గమనించండి. మనకు చెప్పబడింది యేసు సీయోను పేతరును ఆంద్రేయను చేపలు పడుతుండగా చూసాడని. యేసు వారితో అన్నాడు, "నన్ను వెంబడించండి" వెంటనే వారు తమ వలలు విడిచి పెట్టి ఆయనను వెంబడించారు (మత్తయి 4:19, 20 చూడండి). తరువాత యేసు యాకోబును యోహానును చిన్న దోనేలో చూసాడు. ఆయన వారిని పిలిచాడు. "వెంటనే వారు తమ దోనెను విడిచి...ఆయనను వెంబడించిరి" (మత్తయి 4:21, 22). ఆయన ఎవరో వారికి తెలియదు. వారన్నారు, "ఈయన ఎలాంటి వాడో?" (మత్తయి 8:27). ఈపాటికి ఆయనకు పన్నెండు మంది శిష్యులున్నారు. ఆయన ఎవరో వారికి ఇంకా తెలియదు. యేసు ఏమి చేసాడు? యేసు వారిని సువార్త నిమిత్తము ఇద్దరు ఇద్దరుగా పంపించాడు! తరువాత వారిని పరిశయ్యాలు వేరేవారి సంఘర్షణ ద్వారా పోనిచ్చాడు. వారు ధనిక యవన నాయకుని కలిసారు. అతడు యేసును నిత్యజీవము కొరకు ఏమి చెయ్యాలి అని అడిగాడు. యేసు అన్నాడు, "నీకు కలిగిన దానిని అమ్మి, పేదలకిమ్ము, వచ్చి నన్ను వెంబడించు" (సిఎఫ్. మత్తయి 19:21). ఆయన ధనిక యవకుడు విచారంగా వెళ్ళిపోయాడు. అతడు శిష్యుడు కాలేకపోయాడు.

తరువాత యేసు శిష్యులతో అన్నాడు సిలువ వేయబడడానికి యేరూష లేము వెళ్తున్నాడని. ఆయన ఉద్దేశము వారికి అర్ధము కాలేదు. మూడేళ్ళు గడిచాయి అయిననూ వారికి సువార్త అర్ధము కాలేదు! వారు తిరిగి జన్మించాక ముందు శిష్యులుగా ఉండడం నేర్చుకున్నారు! యేసు బంధింపబడి సిలువ వేయబడడానికి కొనిపోబడేటప్పుడు, వారందరూ పారిపోయి, చివరకు మేడ గదిలో దాక్కున్నారు. ఈస్టరు ఆదివారము సాయంకాలం యేసు వారి యొద్దకు వచ్చాడు. ఆయనను సజీవునిగా చూచి అత్యానంద భరితులయ్యారు! ఆయన వారిపై ఊది, అన్నాడు, "పరిశుద్ధాత్మను పొందుడి" (యోహాను 20:22). డాక్టర్ జే. వెర్నోన్ మెక్ గీ అన్నాడు, "నేను వ్యక్తిగతంగా నమ్ముతాను ఆ సమయంలో మన ప్రభువు వారిపై ఊది అన్నాడు, ‘పరిశుద్ధాత్మను పొందుడి," ఈ మనష్యులు పునరుద్దరింపబడ్డారు [తిరిగి జన్మించారు]. దానికి మునుపు దేవుని ఆత్మ వారిలో నివసింపలేదు" (J. Vernon McGee, Th.D., Thru the Bible, volume IV, p. 498; note on John 20:22).

నేననుకుంటాను డాక్టర్ మెక్ గీ సరియే అని. మీరు పూర్తిగా ఆఖరి విషయంలో అంగీకరించనప్పటికి, క్రీస్తు అపోస్తలులను పూర్తిగా వేరే మార్గములో శిష్యులనుగా తీర్చాడు ఈనాడు మన సంఘాలు చేస్తున్న దానికి భిన్నంగా అనే విషయము స్పష్టము. అన్నింటి కంటే ముందు ఆయన వారిని శిష్యులనుగా చేసాడు.

గత వంద సంవత్సరాలుగా మనము ప్రజలను మొదట క్రీస్తు నొద్దకు "నడిపించు" ప్రయత్నిస్తున్నాము. తరువాత మాత్రమే వారిని "ప్రోత్సహిస్తూ" ఉన్నాము. క్రీస్తు దానికి భిన్నంగా చేసాడు. నా నిరీక్షణ కొందరు ఆ విఫల పద్దతి నుండి మరలాలని – యేసు శిష్యులను చేసిన పద్ధతికి వెళ్ళాలని. మరియు, మీరు మాతో ఉంటే, యేసు క్రీస్తు శిష్యులు కావాలని అడుగుతున్నాం. మా సంఘములోనికి రండి! సిలువను ఎత్తుకొని క్రీస్తును వెంబడించండి! ఆదివారము ఉదయము మరియు ఆదివారము రాత్రి రండి! శనివారము సాయంకాలము ప్రార్ధాన కూటానికి రండి! కచ్చిత క్రైస్తవ జీవితమూ జీవింప నేర్చుకోండి. అప్పుడు యేసును నమ్మి తిరిగి జన్మించండి – ఆయన రక్తము ద్వారా మీ పాపాలన్నిటి నుండి కడుగబడండి. ఆమెన్.

మీతో రావాలని మిమ్ములను అడుగుచున్నాను. క్రీస్తు శిష్యులు కావాలని అడుగుచున్నాను – ఆయన నుండి నేర్చుకొని ఆయనను వెంబడించడం. మా సంఘాలలోనికి రావాలని అడుగుచున్నాను, ఆదివారము ఉదయము, ఆదివారం సాయంత్రము – శనివారం రాత్రి, ప్రార్ధన సువార్త నిమిత్తము. మాతో రండి క్రీస్తు మిమ్ములను "మనష్యులను పట్టు జాలరులుగా చేస్తాడు!" ఆయన మిమ్మును ఆత్మలు సంపాదించేదానిగా చెప్తాడు – మనష్యులను పట్టు జలరులుగా! యేసు అన్నాడు, "నన్ను వెంబడించుడి, నేను మిమ్మును మనష్యులను పట్టు జాలరులుగా చేస్తాను" (మత్తయి 4:19). ఆ పాటనాతో పాడండి!

నేను మిమ్మును మనష్యులను పట్టు జాలరులుగా చేస్తాను,
   మనష్యులను పట్టు జాలరులు, మనష్యులను పట్టు జాలరులు,
నేను మిమ్మును మనష్యులను పట్టు జాలరులుగా చేస్తాను
   మీరు నన్ను వెంబడిస్తే.
మీరు నన్ను వెంబడిస్తే, మీరు నన్ను వెంబడిస్తే,
   నేను మిమ్మును మనష్యులను పట్టు జాలరులుగా చేస్తాను
మీరు నన్ను వెంబడిస్తే!
("నేను మిమ్మును మనష్యులను పట్టు జాలరులుగా చేస్తాను" హేరీ డి. క్లార్క్ చే, 1888-1957).
(“I Will Make You Fishers of Men” by Harry D. Clarke, 1888-1957).

వారినిలోనికి తెండి, వారినిలోనికి తెండి,
   వారినిలోనికి తెండి పాపమై దానముల నుండి;
వారినిలోనికి తెండి, వారిని లోనికి తెండి,
   తిరుగులాడు వారిని’ యేసు నొద్దకు తెండి.
("వారినిలోనికి తెండి" అలెక్స్ సెనా థామస్, 19 వ శతాబ్దము).
(“Bring Them In” by Alexcenah Thomas, 19th century).

క్రీస్తు నీ పాప ప్రాయశ్చితార్ధము సిలువపై మరణించాడు. నీ పాపాలన్నీ కడగడానికి ఆయన తన ప్రశస్త రక్తాన్ని కార్చాడు. నిత్యజీవము ఇవ్వడానికి మృతులలో నుండి లేచాడు. యేసును నమ్మితే ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆత్మలను సంపాదించడానికి మాతో రండి. ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి. దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రుదోం: మత్తయి 28:16-20.
ప్రసంగము ముందు పాట బెంజమిన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్ గారిచే:
"వారిని లోనికి తెండి" (అలెక్సినాహ్ థామస్ చే, 19 వ శతాబ్ధము).
“Bring Them In” (by Alexcenah Thomas, 19th century).