Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
ఆయన నిన్ను సిద్ధంగా పట్టుకుంటాడు!

HE WILL HOLD YOU FAST!
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము ఉదయము, జూన్ 28, 2015
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord's Day Morning, June 28, 2015

"నేను వారికి నిత్యజీవము నిచ్చుచున్నాను; గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు" (యోహాను 10:28).


ఈ వాగ్ధానము అవిశ్వాసులకు బోధింపకూడదని ఒక భోధకుడు చెప్పడం నాకు గుర్తుంది. నశించు వారు అతినమ్మకం కలిగి ఉంటారని అతనన్నాడు. ఇది వారిని పాపానికి నడిపిస్తుంది. అసౌకర్య స్థితిలో వారుంటారు, వారికి నిశ్చయిత ఉండదు అంతము వరకు వారు "పట్టబడతారో" లేదో. కొంచెము సేపు నేను ఇది నమ్ముతాను. చాల మంది నమ్మక క్రైస్తవులు ఈ అభిప్రాయాన్ని పట్టుకుంటారని నాకు తెలుసు. అది నమ్మే బోధకులు ఈ పాఠ్యభాగాన్ని గూర్చి తరుచు భయపడతారు.

కాని మొదటిలో క్రీస్తు బోధను విన్న ప్రజలను మనము చూడాలి. 31 వ వచనము ప్రకారము "ఆయనను కొట్టవలేనని మరల రాళ్ళు పట్టుకొనిరి" (యోహాను 10:31). ఇది చెప్పినందుకు వారు క్రీస్తును అసహ్యించు కున్నారు. క్రీస్తు అవిశ్వాసులకు ఈ వర్తమానము బోధించాడు. మన మధ్య కొంతమంది అవిశ్వాసులుండడం కచ్చితం. ప్రతి ఆరాధనలో, రక్షింపబడని వారు ఉండాలని కష్టపడి, ప్రార్ధన చేస్తాం. రక్షింపబడని ఆగ్రహంగా ఉన్నవారితో యేసు చెప్పిందే నేను మీకు చెప్తాను,

"నేను వారికి నిత్యజీవము నిచ్చుచున్నాను; గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు" (యోహాను 10:28).

"నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను." సందర్భము చెప్తుంది "వారు" క్రీస్తు గొర్రెలను సూచిస్తుంది. "నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును" (యోహాను 10:27). "నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను." క్రీస్తు గొర్రెలు అవునా కాదా చెప్పడానికి ప్రజల మనసులను మనం చదవలేం. కాని దేవుని ప్రజలను ఎలా తెలుసుకోవచ్చో మన పాఠ్యభాగములోని వచనము చెప్తుంది. "నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును." నిజ క్రైస్తవుని సూచనలు – వారు క్రీస్తుని గూర్చి వింటారు, వారికి ఆయన తెలుసు ఆయనకు వారు తెలుసు, వారు ఆయనకు లోబడి వెంబడిస్తారు. ఇవి నిజ క్రైస్తవుని సూచనలు. వారిని గూర్చి యేసు చెప్పాడు.

"నేను వారికి నిత్యజీవము నిచ్చుచున్నాను; గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు" (యోహాను 10:28).

"ప్రేమ వలన పని చేయు విశ్వాసము" (గలతీయులకు 5:6) క్రీస్తు నిజ గొర్రెలకు సూచన. వారికి యేసు చెప్తున్నాడు, "నేను వారికి నిత్య జీవము నిచ్చుచున్నాను; గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు." డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు, "క్రీస్తులో మనము తాత్కాలిక స్థితిలో ఉండము, కృప నుండి తప్పిపోయే అవకాశము ఉండదు" (Assurance (Romans 5), The Banner of Truth Trust, 1971, p. 236).

కొందరనవచ్చు, "నేను సువార్త రీతిగా ఉన్నాను. క్రీస్తు నొద్దకు రావాలని నాకు తెలుసు, అలాగే నేను రాలేనని నాకు తెలుసు. తప్పదు నేను కష్టం. నేనేమి చెయ్యాలి?" జవాబు సులభము, క్రీస్తుకు సమర్పించుకో. ఆయనకు మొరపెట్టు. ఆయన నీ ప్రశ్నలన్నింటికి జవాబిస్తాడు. ఆయన సువార్త రీతిని సుత్తితో బద్దలు కొట్టి నీ ఆత్మను రక్షిస్తాడు. నీవంటావు, "అది నాకు అర్ధం కాలేదు." బహుశా అవును. ఇది మర్మము. గ్రీకు పదము "మస్టీరియాన్." దాని అర్ధం మానవ తెలివితో అర్ధం చేసుకోలేం, కానీ బైబిలు బట్టి అది వాస్తవము. అపోస్తలుడైన పౌలు అన్నాడు, "మనం దేవుని జ్ఞానాన్ని మర్మంగా చెప్తాం, మరుగైన జ్ఞానము, దానిని దేవుడు జగత్తు పునాది ముందే ఏర్పరచాడు..." (I కొరిందీయులకు 2:7). క్రీస్తుకు క్రుమ్మరించుకో. ఆయనను నమ్ము. ఆయనలో నీ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. ఆయన రక్తం ద్వారా నీతి ద్వారా ఆయన నిన్ను రక్షిస్తాడు. అంతము వరకు నడిపిస్తాడు. మార్గమంతా తీసుకెళతాడు. నీవు క్రీస్తు గొర్రె వవుతావు!

"నేను వారికి నిత్యజీవము నిచ్చుచున్నాను; గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు" (యోహాను 10:28).

మన పాఠ్య భాగములోని మూడు అంశాలు క్రీస్తు గొర్రెల సంరక్షణను నమ్మడానికి మూడు కారణాలు ఇస్తున్నాయి.

I. మొదటిది, క్రీస్తు బహుమానము ఉంది.

మొదటిగా రక్షకుడు చెప్తున్నాడు, "నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను." నిత్యజీవము మన ప్రతి ఒక్కరికి బహుమానముగా వస్తుంది. మనం పుట్టినప్పుడు నిత్య జీవము పొందుకోలేదు. ఆదాము పిల్లలంగా పుట్టాం. చనిపోడానికి పుట్టాం. ఏదో చేసి దానిని పొందుకోలేదు. మంచి చేసి దానిని పొందుకోలేదు. బైబిలు వచనాలు నేర్చుకోవడం ద్వారా దానిని పొందుకోలేదు. ప్రార్ధన పలుకుల ద్వారా దానిని పొందుకోలేదు. అది బహుమానము. బహుమానము కనుక సంపాదింపలేము. ఒకడు తన ఆత్మలోనికి నిత్య జీవము పొందుకుంటే, అది ఉచిత బహుమానము. పరిహారంగా పొందాము. అది ఉచిత బహుమానం.

దేవునికి ఆది అంతము తెలుసు. ఆయన ఒక వ్యక్తికి నిత్య జీవము ఇచ్చేటప్పుడు, మానవుని అపరిపూర్ణత వ్హైపల్యము ఆయనకు తెలుసు. మనిషి ఎలా తప్పిపోతాడో ఆయనకు ముందుగానే తెలుసు. మనిషికి నిత్య జీవము ఇచ్చి ఏదో విఫలత ఉందని ఆయన తిరిగి తీసుకోడు – మనిషికి బహుమానము ఇచ్చేముందే ఆయనకు తెలుసు ఎలాంటి వ్యైఫల్యాలు కలిగి ఉంటాడో.

నీకు నిత్య జీవము నిచ్చి తరువాత మరణము ఇది ఎలా సాధ్యము? యేసు "నిత్యత్వము" అంటే ఆయన అర్ధము "నిత్యత్వము." స్పర్జన్ అన్నాడు, "పొందుకున్న ఆత్మీయ జీవితాన్ని పాపం చేయడం ద్వారా వదులుకోవడం నాకు సాధ్యము కాదు." అది "నిత్యజీవము."

బావి వద్ద నున్న స్త్రీతో క్రీస్తు ఇలా మాట్లాడాడు,

"నేనిచ్చు నీళ్ళు త్రాగు వాడేప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్ళు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటిబుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను" (యోహాను 4:14).

సంస్కరణ ధ్యాన బైబిలు చెప్తుంది, "పాత నిబంధనలో జీవజలము ప్రవహించు నీటిని గూర్చి [చెప్పింది] – ఇది [దేవుని] క్రియాశీలతను సూచిస్తుంది." "ఉబుకుట" సమృద్ధిని చూపిస్తుంది; "నిత్యజీవము" అంతము లేనిది పుష్కలంగా నిత్యమూ ప్రవహించేది! అది దేవుని జీవము మానవుని ఆత్మలో ఉండేది! యేసు తన గొర్రెలకు దేవుని అనంత జీవితమూ వారి హృదయాలలో ఇస్తాడు – ఎప్పుడు ఉబికేది – అంతములేనిది – ఎప్పుడు ప్రవహించేది! అది బహుమానము. అది సంపాదించుకోలేము. అది క్రీస్తు నుండి వచ్చు బహుమానము. ఆయన ఇచ్చి తిరిగి తీసుకోడు!

ఒకరన్నారు, "దానిని కాపాడుకోలేకపోతే? వదిలేస్తే?" ఓ, స్నేహితుడా, నీవు ఇంకా మెడివియాల్ కాథలిక్ లా ఆలోచిస్తున్నావు! నీవు దానిని సంపాదించుకోలేరు! ఎలా వీలవుతుంది? నీవు "పాపములలో చచ్చిన వాడవు." మృతుడు ఎలా పట్టుకుంటాడు? మృతుడు రక్షణ పొందుకోడానికి ఏమి చేయగలడు? దేవునికి వందనాలు, బైబిలు చెప్తుంది,

"మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై యుండినప్పుడు సయితము [దేవుడు] మన యెడల చూపిన తన మహా ప్రేమచేత, [మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను] (కృప చేత మీరు రక్షింపబడి యున్నారు;)" (ఎఫెస్సీయులకు 2:5).

నిత్య జీవము చచ్చిన ఆత్మకు ఇవ్వబడింది. నిత్యజీవము బహుమానము, పాపములో చచ్చిన స్త్రీ పురుషులకు! అది సువార్త యొక్క మంచి వార్త! ప్రభువుకు స్తోత్రము! "నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను; గనుక అవి ఎన్నటికిని నశింపవు" (యోహాను 10:28).

ఆయన నా ఆత్మను నశింపనివ్వడు, గట్టిగా పట్టుకుంటాడు;
   గొప్ప వెల ఇచ్చి కొన్నాడు, ఆయన నన్ను గట్టిగా పట్టుకుంటాడు.
ఆయన నన్ను గట్టిగా పట్టుకుంటాడు, ఆయన నన్ను గట్టిగా పట్టుకుంటాడు;
   నా రక్షకుడు నన్ను అంతగా ప్రేమిస్తున్నాడు, ఆయన నన్ను గట్టిగా పట్టుకుంటాడు.
      ("ఆయన నన్ను గట్టిగా పట్టుకుంటాడు" ఆదా ఆర్. హబెర్ సన్ చే, 1861-1918).
      (“He Will Hold Me Fast” by Ada R. Habershon, 1861-1918).

స్పర్జన్ అన్నాడు, "మన ఆకాంక్ష విశ్వాసి అంతము వరకు పట్టుకొని ఉండాలి, ఎందుకంటే మనిషి స్వభావములో దేవుడి ఉంచిన జీవము ఉనికి కొనసాగాలి, కష్టాలు జయించాలి, ఫలించి...నిత్య మహిమలో ప్రవేశించాలి" (C. H. Spurgeon, “Perseverance Without Presumption,” MPT, Number 1,055). అది తప్పదు! అది తప్పదు! అది నిన్ను నిత్య మహిమలోనికి తీసుకెళ్ళాలి! అది బహుమానము! అది యేసు క్రీస్తు బహుమానము! ఆయన అన్నాడు, "నేను వారికి నిత్యజీవము నిచ్చుచున్నాను. " అతని పవిత్ర నామముపై ప్రార్ధించాలి! ఆయన మనకు నిత్యజీవము ఇస్తున్నాడు! మనం దానికోసం ఏమి చెల్లించం. సిలువపై మరణం ద్వారా యేసు చెల్లించాడు! మృతులలో నుండి లేచుట ద్వారా యేసు దానిని మన కొరకు కలిగియున్నాడు!

హల్లెలూయ, ‘ఇది జరిగింది! నేను కుమారుని విశ్వసించాను;
సిలువ వేయబడిన అతని రక్తము ద్వారా నేను రక్షింపబడ్డాను!
("హల్లెలూయ, ‘ఇది జరిగింది" ఫిలిప్ పి. బ్లిస్ చే, 1838-1976).
(“Hallelujah, ‘Tis Done” by Philip P. Bliss, 1838-1876).

"నేను వారికి నిత్యజీవము నిచ్చుచున్నాను; గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు" (యోహాను 10:28).

నిత్యజీవము క్రీస్తు బహుమానము.

II. రెండవది, క్రీస్తు వాగ్ధనముంది.

"నేను వారికి నిత్య జీవము నిచ్చుచున్నాను; గనుక అవి ఎన్నటికిని నశింపవు..." అతనన్నాడు, "నేను ఇది చేస్తాను." ఎంత అద్భుత వాగ్ధానము! "అవి ఎన్నటికిని నశింపవు." ఆయనలా చెప్పినందుకు నాకు ఆనందము. కొంతమంది అన్నారు వారి స్వంత నిర్ణయము ద్వారా బయటకు వెళ్తారు. ఆయన నుండి దూరముగా వెళ్ళడానికి వేరు నిర్ణయించుకోవచ్చు. ఈ మాట అభిప్రాయాన్ని తొలగిస్తుంది – "వారు ఎన్నటికిని నశింపరు." సమయమంతా ఇందులో కలిసి ఉంది. "అవి ఎన్నటికిని నశింపవు." వారు కొద్ది జ్ఞానమున్న యవ్వన విశ్వాసులా? వారు కొత్తగా మారిన వారు కనుక వారి విశ్వాసము తక్కువగా ఉందా? "అవి ఎన్నటికిని నశింపవు." వారు పెద్దవారైనప్పుడు జీవిత సమస్యలు వారి ప్రారంభ విశ్వాసాన్ని చుట్టూ ముట్టినప్పుడు, వారు లోకస్తులై విశ్వాసాన్ని కోల్పోతారా? "అవి ఎన్నటికిని నశింపవు." లోకము వారిని నాశనము చేసినప్పుడు వారు నశించి పోతారు. వారు నశిస్తారు చెడు వారిని బానిసలుగా చేసినప్పుడు, కాని అలా జరుగదు. "అవి ఎన్నటికిని నశింపవు." కాలమంతా మూయబడింది "ఎన్నటికిని" అనే పదముతో. ఒకవేళ గొప్పగా శోధింపబడితే ఏమిటి? "అవి ఎన్నటికిని నశింపవు." వారు చల్లబడి ప్రేమ ఉత్సాహము కోల్పోతే? "అవి ఎన్నటికిని నశింపవు." పాపమూ ఎన్నటికిని వారిని అదుపులో ఉంచుకొదు. "అవి ఎన్నటికిని నశింపవు."

నేను యాభై నాలుగు సంవత్సరాల నుండి క్రైస్తవుడను. కొన్నిసార్లు దేవుడు దూరమైనట్లు అనిపించింది. నా స్వంత రక్షణను సందేహించే సమయాలు కూడా ఉన్నాయి. కొన్ని సమయాలలో నేననుకున్నాను నాకాలు జారి నేను నిత్యములో నశించి పోతానని. కాని యేసు ఎల్లప్పుడూ నన్ను నడిపించాడు. యేసు ఎల్లప్పుడూ నన్ను నిరాశ అంచు నుండి తిరిగి తీసుకొచ్చాడు. క్రైస్తవ గృహంలో పెరగలేదు. మంచి ఉదాహరణలు గైకొనలేదు. భయకంపిత గాలులు నా చుట్టూ వీచాయి. నేను దాదాపు పోయాను. చాలామంది పడిపోవడం చూసాను. నేను కూడా వారితో తుడిచి పెట్టబడతాను అనుకున్నాను. నేను బలహీనుడనై ముందుకు వెళ్ళలేక పోయాను. బహిష్కరింపబడిన వానిలా అనిపించింది. దావీదులా అనుకున్నాను, రాజైన పౌలు నుండి తన శత్రువు నుండి తప్పించుకొని, గుహలో దాచుకున్నప్పుడు.

"నా కుడి పక్కన నివాసించి, చూడుము, నన్నెరిగిన వాడు ఒకడును లేకపోయెను: ఆశ్రయ మేమియు నాకు దొరకలేదు; నా యెడల జాలి పడిన వాడు ఒకడును లేదు" (కీర్తనలు 142:4).

"నాకాలు జారెనని, నేననుకోనగా; యెహోవా, నీ కృప, నన్ను బలపరచు చున్నది" (కీర్తనలు 94:18).

అనుభవము ద్వారా నాకు తెలుసు. "నేనన్నప్పుడు, నాకాలు జారెనని; యెహోవా, నీ కృప, నన్ను బలపరచుచున్నది." అనుభవము ద్వారా తెలుసు యేసు సత్యము చెప్పాడని. "గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు." ఇది నాకు సిద్ధాంతము కాదు. ఇది జీవించు సత్యము – ప్రభువైన యేసు క్రీస్తు నోటి నుండి. "నేను వారికి నిత్య జీవము నిచ్చుచున్నాను; గనుక అవి ఎన్నటికిని నశింపవు."

నేను పట్టు కలిగి యుండలేను, ఆయన నన్ను గట్టిగా పట్టుకుంటాడు;
   తరుచు నా ప్రేమ చల్లారుతుంది, ఆయన నన్ను గట్టిగా పట్టుకోవాలి.
ఆయన నన్ను గట్టిగా పట్టుకుంటాడు, ఆయన నన్ను గట్టిగా పట్టుకుంటాడు;
   నా రక్షకుడు నన్ను అంతగా ప్రేమిస్తున్నాడు, ఆయన నన్ను గట్టిగా పట్టుకుంటాడు.

యవనులారా, ఒకప్పుడు యువకుడిని ఇప్పుడు ముసలివాడను. యేసు వాగ్ధానము నిజమని నాకు తెలుసు. నా ఎముకల మూలుగలో అది నిజమని నాకు తెలుసు! "నాకాలు జారెనని, నేననుకొనగా, యెహోవా, నీ కృప, నన్ను బలపరచుచున్నది." యేసు సత్యము చెప్పాడని నాకు తెలుసు,

"నేను వారికి నిత్య జీవము నిచ్చుచున్నాను; గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు."

ఆయన నన్ను పట్టుకున్నాడు. గట్టిగా పట్టుకున్నాడు. నాకు తెలుసు ఆయన నీకు కూడా అదే చేస్తాడని! అందుకే నీకు ధైర్యముగా చెప్పగలను నీవు రక్షకుడైన, యేసును నమ్మాలని. చాల ఏళ్ళ క్రిందట ఆయనను నమ్మాను, నేను ఎన్నడు నశించ లేదు. నీవు ఆయనను నమ్మితే, నిన్ను నశింపనివ్వడు! అది క్రీస్తే ఇచ్చిన వాగ్ధానము!

III. మూడవది, క్రీస్తు శక్తి ఉంది.

"ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు" (యోహాను 10:28బి). గమనించండి"మానవుడు" అనే పదాన్ని కింగ్ జేమ్స్ తర్జుమాలో ప్రత్యేకంగా ఇవ్వబడింది. దాని అర్ధము కెజెవి (KJV) అనువాదకులు "మానవుడు" అనే పదాన్ని పెట్టారు – ఎందుకంటే అది గ్రీకు పాఠ్యములో లేదు. గ్రీకు పదము "టిస్." దాని అర్ధము "ఎవరైనా" (జార్జి రిక్కర్ బెర్రీ) లేక "ఏ వ్యక్తి అయినా వస్తువు అయినా" (స్ట్రాంగ్). అలా గొప్ప గ్రీకు వేత్త అన్నాడు ఎ. టి. రోబర్ట్ సన్ ఈ వచనాన్ని గూర్చి, "గొర్రెలు సంరక్షణలో ఉంటాయి...ఎలుగుబంటి లేదు, దొంగలేడు, బందీ లేడు, భయపెట్టే వాడులేడు, దెయ్యము లేదు, దెయ్యము కూడా నా చేతిలో నుండి గొర్రెలను [అపహరింప లేడు]" (పద పటములో; గమనిక యోహాను 10:28). డాక్టర్ రోబర్ట్ సన్ ఒక వచనము ఇస్తున్నాడు యోహాను 6:39 కు,

"ఆయన నాకు అనుగ్రహించిన దానియంతటిలో నేనేమియు పోగొట్టు కొనక, అంత్యదినము వాని లేపుటయే, నన్ను పంపిన వాని చిత్తమై యున్నది" (యోహాను 6:39).

మళ్ళీ, డాక్టర్ రోబర్ట్ సన్ ఒక వచనము ఇచ్చాడు యోహాను 17:12 కు, "నీవు నాకు అనుగ్రహించిన...వారిని నీ నామమందు కాపాడితిని, వారిలో ఎవడును నశింపలేడు..." మళ్ళీ కొలిస్సయులకు 3:3 ను సూచించాడు, "మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడియున్నది." నూతన కింగ్ జేమ్స్ లో ఇలా ఉంది, "ఏ ఒక్కడు వారిని నా చేతులలో నుండి అపహరింప లేడు."

స్పర్జన్ అన్నాడు, "మనముందున్న పాఠ్యభాగములో ‘మనిషి,’ పదము మనము చదవనక్కర లేదు ఎందుకంటే అది మూల [గ్రీకులో] లేదు కాబట్టి...కనుక ఇలా చదవవచ్చు – ‘ఏ ఒక్కరు నా చేతులలో నుండి అపహరింప లేదు.’ కేవలం – ‘మనిషే,’ కాదు దెయ్యము కూడా... మనష్యులే కలపబడలేదు, వారు మన చెడ్డ [శత్రువులు] కావచ్చు...పడ ద్రోయబడిన ఆత్మలు కూడా; ఏ ఒక్కరు ఆయన చేతులలో నుండి మనలను అపహరింప లేదు. ఏ విధంగా కూడ, ఏ పధకం ద్వారా కూడా మనలను తప్పించలేరు, ఆయన స్వాస్థ్యముగా...ప్రియ కుమారులుగా, సంరక్షణలో ఉన్న, పిల్లలుగా ఉండకుండా. ఓ ఎంత ఆశీర్వాదపు వాగ్ధానము!" (ఐబిఐడి.).

పాస్టర్ వర్మ్ బ్రాండ్ ను గుర్తుంచుకొండి. ఆయన పుస్తకము, క్రీస్తు కొరకు హింసింపబడుట, పదే పదే ఎందుకు చదువుతానా అని మీరు ఆశ్చర్యపడవచ్చు. మీరు ఆశ్చర్యపోవచ్చు అంత భయంకర పుస్తకం చదవడానికి నేను ఎందుకు ఇష్టపడతానో అని. ఇది కారణము. నాకు పిచ్చి ఆసక్తి ఉంది, రక్తం పట్ల శ్రమల పట్ల ప్రేమ ఉండికాదు. అతని పుస్తకాలు చదువుతాను ఎందుకంటే ఆయన వాగ్ధానము నేరవేర్పులో యేసు శక్తిని ఆ పుస్తకాలలో ఆసక్తికరంగా చూపబడ్డాయి కనుగ. కమ్యునిస్టువాదులు పాస్టరు వర్మ్ బ్రాండ్ ను సువార్త ప్రకటించినందుకు హింసించారు. ఆయన పాదాలను చిదగబాదారు నిలబడి బోధింపకుండా. మన సంఘములో ఆయన బోధించినప్పుడు బూట్లు తీసేసి కుర్చీలో కూర్చున్నారు పాదాలలో లోతైన గాయాలున్నాయి కాబట్టి. వారు అతని శరీరంలో కాల్చిన ఇనుప కడ్డీలతో పద్దెనిమిది లోతైన రంధ్రాలు చేసారు. గంటల తరబడి అతనిని నిలబెట్టారు. పస్తు ఉంచారు. ఎలకల బోనులో బంధించారు. వారు అతనిని నెలల తరబడి మానవ స్వరము వినకుండా ఏకాంత ప్రదేశంలో ఉంచారు. అయిననూ ఇవన్ని తట్టుకున్నాడు – చాలాసార్లు మన సంఘములో మాట్లాడారు. మీరనవచ్చు, "అతనికి ఇనుములాంటి స్థైర్యము ఉందని." లేదు, చాల బలహీనుడనని మీతో చెప్తాడు. ఆ శ్రమలన్ని భరించాడు ఎందుకంటే క్రీస్తు వాగ్ధానము వాస్తవము కాబట్టి!

"నేను వారికి నిత్యజీవము నిచ్చుచున్నాను; గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు" (యోహాను 10:28).

అది వాస్తవమని నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడ ఆసత్యాన్ని అనుభవించాను నా జీవితంలోని చిన్న చిన్న కష్టాల ద్వారా. యేసు నందు విశ్రమించు నిత్యజీవము పొందుకుంటావు. యేసు అబద్ధమాడలేదు.

గొప్ప స్పర్జన్ చెప్పింది చెప్పి ముగిస్తాను, "నేను [యవనునిగా] ఉన్నప్పుడు చాలామంది బాలురు జీవితాలు బద్ధలయిపోయి [పాపాలలో] పడిపోవడం చూసాను. వారు చేసిన పాపాల పట్ల [అసహ్యత] నా మనసులో పుట్టింది. [నా తల్లిదండ్రులను] బట్టి వాటికి దూరంగా ఉన్నాను. నాకింకా భయముంది ఈ యవనులు చేసిన పాపాలు నన్ను చుట్టుకుంటాయని. నా హృదయ దుష్టత్వము నా మీద నాకు నమ్మకం లేకుండా చేసింది. నేను నిర్ధారణకు వచ్చాను నేను మారకపోతే, తిరిగి జన్మించకపోతే, కొత్త జీవితాన్ని పొందుకోలేను, నాకు భద్రత లేదు. లేకపోతే దెయ్యము పొట్టు తింటాను. కొంతమంది అబ్బాయిలు చేసినట్టు నైతిక దుస్థితికి వస్తాయని, భయపడేవాడిని. ఆ తలంపు నన్ను భయపెట్టింది. కాని పడిపోకుండా యేసు నన్ను పట్టుకుంటాడని విన్నప్పుడు సిద్ధాంతము నన్ను ప్రోత్సహించి రక్షిస్తాడనే నిరీక్షణ పుట్టించింది. నేననుకున్నాను, ‘నేను యేసు నొద్దకు వెళ్లి ఆయన నుండి కొత్త హృదయము సరైన ఆత్మ పొందుకుంటే, ఇతరులు పడిన పాపములో నేను పడను; ఆయనచే భద్ర పరచబడతాను.’ ఆ తలంపు నన్ను ఆకర్షించి క్రీస్తును నమ్మేలా చేసింది. ఆయనకు సమర్పించుకున్న వారి పట్ల ఆయన నమ్మకస్తుడని యేసును గూర్చి విని సంతోషించాను; ఒక యవనస్థుని తీసుకొని ఆయనను కడిగి అంతము వరకు అతనిని కాపాడడానికి యేసు సమర్ధుడు అలా చేయడానికి ఇష్ట పడుతున్నాడు. ఓ యువకులారా, యేసు క్రీస్తును నమ్మడాన్ని మించిన జీవిత నిశ్చయత వేరొకటి లేదు" (C. H. Spurgeon, ibid., somewhat simplified by Dr. Hymers for modern hearers).

"నేను వారికి నిత్యజీవము నిచ్చుచున్నాను; గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు" (యోహాను 10:28).

ఇంకొక తలంపు మీకు రావచ్చు. నేనన్నాను మానవ శత్రువు గాని దెయ్యము గాని రక్షకుని చేతిలో నుండి మిమ్ములను అపహరింపలేరని. "కాని," మీరనవచ్చు , "నేనే యేసు నుండి వైదొలగితే? నేనే గుడి వదిలి పెట్టి లోకములోనికి వెళ్ళిపోతే?" ప్రియ స్నేహితుడా, "నేనే" అనే పదము "ఎవరైనాలో" కలిసి ఉంది. నాకు తెలుసు తప్పుడు మార్పులు పొందిన చాలామంది లోకరిత్యా వెళ్ళిపోయారు. నాకు భాగా తెలుసు క్రీస్తు స్వంత గొర్రెల లక్షణాలు వారిలో లేవు. వారు ఆయన స్వరము ఎప్పుడు వినలేదు. ఆయన వారిని ఎరుగలేదు. వారు ఆయనను ఎన్నడు వెంబడించ లేదు. వారు నామకార్ధ నిర్ణయము తీసుకొని, వెనుదిరిగారు. మీరలా చెయ్యాలని చెప్పడం లేదు. దేవుని కుమారుడైన నజరేయుడైన, యేసు నొద్దకు మీరు రావాలని అడుగుచున్నాను. ఆయనను నమ్మి ఆయనలో విశ్రమించాలని అడుగుచున్నాను. స్పర్జన్ అన్నాడు, "ఓ! పాపీ, యేసు నొద్దకు నడిపించండి యేసులోనే విశ్రమించాలి, తరువాత పాఠ్యభాగము చూడండి. దాని గూర్చి భయపడకండి – ‘నేను నా గొర్రెలకు నిత్యజీవము నిచ్చాను; అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహరింపడు’" (ఐబిఐడి.).

ఆయన నన్ను గట్టిగా పట్టుకుంటాడు, ఆయన నన్ను గట్టిగా పట్టుకుంటాడు;
నా రక్షకుడు నన్ను అంతగా ప్రేమిస్తున్నాడు, ఆయన నన్ను గట్టిగా పట్టుకుంటాడు.

తండ్రి, ఈ ప్రసంగము వినుచున్న చదువుతున్న వారు యేసును నమ్ముట ద్వారా విశ్రమించాలని, ఆయనలో నిత్యజీవము పొందుకోవాలని ప్రార్ధిస్తున్నాను. ఆయన నామములో, ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి – rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రుదోం: యోహాను 10:22-29.
ప్రసంగము ముందు పాట జాక్ నగాన్ చారిచే: "ఆయన నన్ను గట్టిగా పట్టుకుంటాడు"
(ఆదా ఆర్. హబార్ సన్ చే, 1861-1918).
“He Will Hold Me Fast” (by Ada R. Habershon, 1861-1918).


ద అవుట్ లైన్ ఆఫ్

ఆయన నిన్ను సిద్ధంగా పట్టుకుంటాడు!

HE WILL HOLD YOU FAST!

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

"నేను వారికి నిత్యజీవము నిచ్చుచున్నాను; గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు" (యోహాను 10:28).

(యోహాను 10:31, 27; గలతీయులకు 5:6; I కొరిందీయులకు 2:7).

I.   మొదటిది, క్రీస్తు బహుమానము ఉంది, యోహాను 10:28ఎ; 4:14; ఎఫెస్సీయులకు 2:5.

II.  రెండవది, క్రీస్తు వాగ్ధనముంది, యోహాను 10:28ఎ; కీర్తనలు 142:4; కీర్తనలు 94:18.

III. మూడవది, క్రీస్తు శక్తి ఉంది, యోహాను 10:28బి; 6:39; 17:12; కొలోస్సయులకు 3:3.