Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
కలిసికట్టుగా మనము బలవంతులం! ఒంటరిగా మనం బలహీనులం!

TOGETHER WE ARE STRONG! ALONE WE ARE WEAK!
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము ఉదయము, జూన్ 21, 2015
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, June 21, 2015

"ఒకనినొకడు హెచ్చించుచు సమాజంగా కూడుట: మానక కొందరు మానుకొనుచున్నట్టుగా, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది; మరీ ఎక్కువగా ఆలాగు చేయుచు: ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును, ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము" (హెబ్రీయులకు 10:24-25).


నా చాలా ప్రసంగాల వలే, ఇది అస్పష్ట రీతిగా మొదలైంది. ఇద్దరు కొత్త అమ్మాయిలు మన యవనస్తులను ఇష్టపడినట్టు విన్నాను. "వారు స్నేహ పూర్వకంగా ఉన్నారు!" అని వారు చెప్పారు. కాని నేను వారికి నచ్చలేదు. నేను అది ఆలోచిస్తూ, మనసులో మదన పడుచున్నాను. నా ప్రసంగాలు విసిగిస్తాయని కాదు. అవి ఆసక్తికరంగా ఉండేలా నిజంగా కష్టపడతాను. యవనస్తులు సామాన్యంగా నోరులు కొద్దిగా తెరుచుకొని, కళ్ళు నాపై లగ్నము చేస్తారు నేను భోధించేటప్పుడు. నా వ్యక్తిత్వము కూడా కాదు. యవనస్తులతో ఉండడం నాకు ఇష్టం. అది వారు చెప్తారు. ప్రతి ప్రసంగము చివరలో నేను చెప్పేది ఆ ఇద్దరి అమ్మాయిలను బోధ పరిచిందని నేననుకుంటాను. చిన్న ప్రార్ధన ఇస్తాను. టివి కెమెరాకు సమీపంగా నడుస్తాను. యూట్యూబ్ మన వెబ్ సైట్ ప్రేక్షకులతో నేను మాట్లాడుతుంటాను. చూసే వారితో ఇలా చెప్తుంటాను – "మీరు చెయ్యల్సింది, బైబిలు బోధించే సంఘానికి వెళ్ళండి, ఆదివారం సాయంత్రము ఆరాధనకు. ద్వారము తెరచి ఉన్నప్పుడు అక్కడకు వెళ్ళండి." ఆఖరి మాటలు జెర్రి ఫాల్ వెల్ నుండి తీసుకున్నాను, అతడు టివి కార్యక్రమము ముగించేటప్పుడు. "ద్వారము తెరచినప్పుడు మీరు ఉండండి." తరుచుగా అంటాను, "ఒక గుడి నుండి ఇంకొక గుడికి పరుగెత్తవద్దు." ఈ మాటలు, నా ప్రసంగము చివరలోనివి, ఆ కొత్త ఇద్దరు అమ్మాయిలకు నచ్చలేదు. వాస్తవానికి, వారు గుడి వదిలి వెళ్ళిపోయారు.

అలా చెప్పకుండా ఆగుతానా? లేదు – చెప్తూనే ఉంటాను. ఎందుకు? ఎందుకంటే యవనస్తులు అలాగే చెయ్యాలి – అందుకే? మన సంఘము ఎదుగుతుంది యుక్త వయస్సులో మారిన వారితో. అది అరుదు. ఎక్కువ సంఘాలు 88% యవనస్తులను కోల్పోతాయి. ఇంకొక ప్రసంగము కొరకు. మనం ఎదుగుతున్నాం ఒకే వయస్సులో ఉన్న పటిష్ట యువకులు వేరే సంఘాల నుండి రావడం ద్వారా. సూటిగా మాట్లాడుదాం – "తియ్యని మాటలు" ద్వారా కాదు. ఆ వైఖరిని యిట్టె గమనించ గల పదును ఈనాటి పిల్లలకు ఉంది. నేరుగా మాట్లాడుతాను. నేనంటాను, "ఇది మీకు అవసరము – దీని అవసరతకు కారణం యిది." ఆటలు లేవు! సూటిగా బోధించడం! తీసుకోండి లేక వదిలేయండి! వారు వదిలేసినా వారికి తెలుసు నేను వారితో యదార్ధంగా ఉన్నానని! నా వలే నేను మిమ్ములను తయారు చేయ ప్రయత్నించలేదు! మీకు మార్పురావాలని ప్రయత్నిస్తున్నాను. నా గురి మీరు నిజ క్రైస్తవులవాలని గట్టి సంఘ సభ్యునిగా ఉండాలని!

మీరనవచ్చు, "ఈ సంఘ అవసరత ఎందుకు?" నేను చెప్తాను ఎందుకో? ఎందుకంటే సంఘము లేకుండా నీకు నిలకడగా ఉండేది లేదు, అందుకే! ఆల్విన్ టోప్లల్ దాని గూర్చి ఫూచర్ ప్లాక్ పుస్తకంలో వ్రాసాడు. ఆయన "నిశ్చలత మరణము" గూర్చి మాట్లాడాను, "అశాశ్వత విషయము," "భవిష్యత్తులో స్నేహాలు," "వరుస వివాహాలు," మరియు "స్నేహితులను కోల్పోవుట ఎలా." మార్పు, మార్పు, మార్పు. కదలిక మార్పు మనకు శాశ్వత గృహాన్ని, శాశ్వత స్నేహితులను, శాశ్వత సంభందాలను ఇవ్వజాలవు! సమస్తము ప్రతి ఒక్కరు మనకు తెలిసిన వారు అశాశ్వతము! యవనస్తులకు భవిష్యత్తు దిగ్బ్రాంతి ఇస్తుంది! టఫ్లర్ 1970 లో పుస్తకము రాసాడు. గత లక్ష్మివారము చదివేటప్పుడు నాకనిపించింది ఆరు నెలల క్రితమే వ్రాయబడినట్టు! ప్రతి ఒక్కరు కదిలింపబడతారు, తరుచు మారతారు, యవనస్తులు వీధి ప్రజల్లా బయటకి వస్తారు, వారు మునుపు వేర్వేరు పెట్టెలలోను, వేరే వీధిలోను , ప్రతి రాత్రి ఉండేవారు. చాల మంది చిన్న పిల్లలు మందులపై ఉండడంలో ఆశ్చర్యము లేదు! లోకము వారిని వేగవంతం చేస్తుంది – ఎంత వేగమంటే వారనుకుంటారు జీవితాన్ని భరించడానికి మాత్రలు వేసుకోవాలని. గంట రెండు గంటల ముందు తెలిసిన వారిని "స్నేహితులు" అని పిల్లలు మాట్లాడుకోవడం నన్ను ఆశ్చర్య పరుస్తుంది. తప్పుపట్టడం లేదు. నేను గమనిస్తున్నాను. మనము లోపలి వస్త్రాలను మార్చుకున్నంత త్వరితంగా పిల్లలు "స్నేహితులను" మార్చేస్తున్నాను!

పాల్ మెక్ కార్ట్ నీ నాకంటే సంవత్సరం చిన్నవాడు. హిప్పిగా ఉండడానికి వయస్సు లేదు. చాలామంది హిప్పీల వలే, పాల్ మెక్ కార్ట్ నీ, ఒంటరితనంలో, ఉండేవారు. గ్రిఫిత్ గారు పాడిన వింతైన పాట అతడు వ్రాసాడు – అది గొప్పగా పేరు గాంచింది అతడు జాన్ లెన్నోన్ తో కలిసి పాడినప్పుడు. అది ఇద్దరినీ గూర్చి చెప్తుంది, ఎలీనోల్ రిటీ (పెళ్ళికాని మధ్య వయస్కురాలు) మరియు ఫాదర్ మెకెన్ జీ, ఒంటరిగా జీవించే పూజారి.

ఫాదర్ మెకెన్ జీ ప్రసంగపు మాటలు వ్రాస్తున్నాడు వాటిని ఎవరు వినరు. ఎవరు సమీపించరు.
ఆయనను చూడండి, రాత్రి సాక్సు రంద్రాల్ని సరిచేస్తున్నాడు. అక్కడ ఎవ్వరు లేనప్పుడు అతని చింత ఏమి?

ఒక వృద్ధ పూజారి, ఎవ్వరు శ్రద్ధ చూపని ప్రసంగము రాసాడు. సాక్సు రంద్రాలను సరిచేసుకుంటూ "అక్కడ ఎవ్వరు లేనప్పుడు." "అతని చింత ఏమి?" ఒంటరి తనానికి అలవాటు అయిపోయాడు దాని గూర్చి ఏమి చింతలేదు.

ఎలీనోల్ రిటీ గుడిలో చనిపోయాడు ఆమె పేరుతో పాతిపెట్టబడింది. ఎవరు రాలేదు.

ఆమె పేరున్న పిల్లలు లేకుండా ఆమె చనిపోయింది. ఆమె భూస్తాపనకు ఎవరు రాలేదు.

ఫాదర్ మెక్ కెన్ జీ చేతులు తుడుచుకొని సమాధి నుండి నడుస్తాడు. ఎవరు రక్షింపబడలేదు.

ఆమె భూస్థాపనకు ఎవరు రాలేదు. అతని ప్రసంగము ఎవరు వినలేదు. ఎవరు రక్షింపబడలేదు. పాట ఇలా ఉంది,

ఒంటరివారంతా,
వారంతా ఎక్కడ నుండి వచ్చారు?
ఒంటరి వారంతా,
దేనికి చెందినవారు?

అలాంటి తలంపులు హిప్పీలను చింతింప చేసాయి. వేలలో వచ్చారు – బెర్కిలీకి, శాన్ ప్రాన్సిస్కో హాయిట్ ఆస్ బరీలో, హాలివుడ్ బిల్ వడ పై., వెనైస్ సముద్రపు ఒడ్డున. కొంతమందికి పాత ఇల్లు దొరికింది. వారంతా అక్కడ జీవించారు. ఇతరులు ఒక రాత్రి లేక రెండు రాత్రులు అక్కడ "గడిపే వారు." కలిసి ఉండాలని వారికుండేది. సామాజిక భావన వారికి కావాలి. వారిని గుడికి తీసుకు రావడం సులభం, నేలపై కూర్చోనేటట్టు చేస్తే. వారు "యేసు విచిత్ర వ్యక్తులు" లేక "యేసు ప్రజలులా" పిలువబడతారు.

బాప్టిస్టులు నిజంగా కోల్పోతున్నారు. అలాంటి పిల్లలను వేలమందిని సులభంగా పొందుకొని ఉండేవారు. కాని వారికి భయపడేవారు. ఇప్పటికి చాల ఆలస్యమైంది – నిత్యత్వములో చాల ఆలస్యమైంది. ఆకర్షితులు పెంతేకోస్తులు వారందరినీ పొందుకున్నారు. ఈనాడు ఓరియంటల్ స్పేనిష్ పిల్లలను గూర్చి బాప్టిస్టులు భయపడతారు. వారు వేలమందిని పొందవచ్చు. వారిని గూర్చి కూడ భయపడతారు. త్వరలో అది చాల ఆలస్యము అయిపోతుంది – నిత్యత్వంలో చాల ఆలస్యము – మళ్ళీ.

కాని మీకు సామాజిక గృహము "ఉండనక్కర" లేదు. అలాంటి సమాజం ఉండాలనే భావన కూడ అక్కరలేదు. "యేసు ప్రజలతో" పని చేస్తున్న ఒక వ్యక్తిని ఈ మధ్యే కలిసాను. నేనతని నడిగాను ఎందుకు ఈనాడు యవనస్తులు హిప్పోల వలే ఒక సమాజము ఉండాలని కోరుకోరు అని. అతడు అన్నాడు, "నేనది ఆలోచించలేదు. నాకు తెలియదు." అతడలా అన్నప్పుడు నాకు జవాబు దొరికింది – "వారికి సామాజిక స్థలము అవసరం లేదు ఎందుకంటే వారికి ఐఫోనులు స్మార్ట్ ఫోనులు ఉన్నాయి." పాత హిప్పీలు కలిగి వంటి వారు ఒక జనావాసం అవసరం లేదు. వారికి ఐఫోనులు స్మార్ట్ ఫోనులు ఉన్నాయి. వాటి మీద వ్రాయవచ్చు మాట్లాడవచ్చు – చాల మంది స్నేహితులు ఉన్నట్టు నటించవచ్చు. నిజ స్నేహితుల స్థానాన్ని ఈ యంత్రాలు తీసుకుంటున్నాయి. నిజ స్నేహితులను చేసుకోడానికి ఎందుకంత శ్రమ తీసుకోవాలి – ఎలక్ట్రాన్ స్నేహితులను సంపాదించుకోవడం చాల సులభమైనప్పుడు? ఎలీనోల్ రిటీ మరియు ఫాదర్ మెకెన్ జీ ఒంటరిగా ఉండక పోయేవారు వారికి మీరు వాడే ఎలక్ట్రాన్ పరికరాలు కలిగి ఉంటే. మీకున్నట్టు వారికి "నిశిత" స్నేహితులు ఉండేవారు. కాని "నిశిత" స్నేహితుడు నిజ స్నేహితుడు ఒకటి కాదు! కానే కాదు! సౌత్ కేరీలోనాలో ఒక యవనుని గూర్చి మీరు విన్నారా? గతవారం తొమ్మిది మందిని చంపాడు. అతని తప్పేమిటి? అవును, అతడు అంతర్జాలముపై జీవించాడు! అతి అతని బుర్ర తినేసింది. కొంత సమయమైన, యంత్రాలు వదిలేయండి. యంత్రాలు వదిలేసి కొంత నిజ జీవితం జీవించండి! గుడిలో ఉండండి! ఆ దిమున పాఠ్యభాగానికి మనలను తీసుకు వస్తుంది,

"ఒకనినొకడు హెచ్చించుచు సమాజంగా కూడుట: మానక కొందరు మానుకొనుచున్నట్టుగా, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది; మరీ ఎక్కువగా ఆలాగు చేయుచు: ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును, ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము" (హెబ్రీయులకు 10:24-25).

ఈ పాఠ్యభాగముపై పదికి పైగా వ్యాఖ్యానాలు చదివాను. అవన్నీ చెప్తున్నాయి ఈ లేఖన భాగము స్థానిక సంఘములో సహవాసము అవసరతను గూర్చి తెలియచేస్తున్నాయి. డాక్టర్ డబ్ల్యూ. ఎ. క్రీస్ వెల్ అన్నాడు, "ఈ పాఠ్యభాగము సూచిస్తుంది ఒక బలమైన నిర్ధారణము బైబిలులో స్థానిక సంఘము...[సంఘానికి] నమ్మకత్వతగా ఉండాలి" (The Criswell Study Bible, Thomas Nelson Publishers, 1979 edition, p. 1438; note on Hebrews 10:25).

ఆధునిక అనువాదము ఇవ్వనివ్వండి. నేను కెజేవి నుండే బోధిస్తాను. వేరే అనువాదాలు సిఫారసు చెయ్యను. కొన్నిసార్లు ఆధునిక తర్జుమా చదవడం పాఠ్యభాగపు ప్రాధాన్యత "అనుభూతి" కలిగిస్తుంది. ఇక్కడ ఎన్ఎఎస్ వి (NASV) మరియు ఎన్ఐవి (NIV) అనువాదాలు కలిపి ఇవ్వబడ్డాయి,

ప్రేమ సత్క్రియల వైపు ఒకరినొకరం ఎలా పురికొల్పు కోవాలో ఆలోచిద్దాం. సమాజముగా కూడుట మానవద్దు, కొంతమంది అలవాటుగా చేస్తున్నారు, ఒకరినొకరం ప్రోత్సహించు కుందాం – ఆ దినము సమీపించుచున్నది కాబట్టి (Hebrews 10:24 NASV; 10:25 NIV).

మనం సంఘాలలో ఉండాలి ప్రేమ సత్క్రియల విషయంలో "పురికోల్పడానికి" మనం సంఘంలో ఉండాలి. "ఒకరినొకరం ప్రోత్సహించుకోడానికి." జాన్ మెక్ ఆర్డర్ దానిని "యుగ సమాప్తి అత్యవసరత" అన్నాడు – అది చూపిస్తుంది గుడిలో ఉండడం అనేది చాల ప్రాముఖ్యమైన విషయమని, "దినము సమీపించుచున్నది గనుక." అది "దినము" క్రీస్తు రెండవ రాకడను సూచిస్తుంది. ఇది ప్రాముఖ్య ప్రవచనము. ప్రపంచపు ఆఖరి దినాలలో ప్రవేశిస్తుండగా స్థానిక సంఘానికి అంకిత మవడం చాలా చాలా ప్రాముఖ్యము. ఎందుకు? ఎందుకంటే చాల సామాజిక ఒత్తిడి ఆఖరి దినాలలో ఉంటుంది విశ్వాసము విడిచి పెట్టమని. ప్రాచీన దినాలలో ప్రజలు వారానికి ఒకసారి గుడికి హాజరు అయ్యేవారు. కాని ఇప్పుడు సామాజిక మార్పు గాలి (భవిష్యత్తు దిగ్బ్రాంతి!) ప్రముఖంగా చూపిస్తుంది స్థానిక సంఘములో ఇతర క్రైస్తవుల సహవసములో మనం ఉండాలని. థామస్ హెల్ తన వ్యాఖ్యానంలో ఏమన్నాడో వినండి, "ఎవరి విశ్వాసమైన ఊగిసలాడుతుంటే త్వరితంగా అతనిని ప్రోత్సహించి బలపరచాలి. ప్రేమ సత్క్రియాలలో ఒకరినొకరు [పురికొల్పు కొందము]. ఏ ఒక్కరు కూడ [పాపములో లోకములో] పడిపోకుండా మనం చూసుకోవాలి. కలిసి ఉంటే బలవంతులము, ఒంటరిగా బలహీనులము" (Thomas Hale, The Applied New Testament Commentary, Kingsway Publications, 1997, pp. 913, 914; comment on Hebrews 10:24; Dr. Hymers’ notes in brackets).

స్థానిక సంఘము ఒక స్థలము కాదు మీరు వచ్చి బైబిలు ధ్యానించడానికి, అది చాల ప్రాముఖ్యమైనప్పటికినీ. మన సహవాసము ఆరాధన అనంతరము భోజనాలపై కట్టబడలేదు, అది ఎంతో ప్రాముఖ్యమైనప్పటికి. మన సహవాసము సంఘ ఉద్దేశముపై కట్టబడింది – అంటే ఇంకా క్రైస్తవులు కాని యవనస్తులను తీసుకొని రావడం. థామస్ హేల్ వ్యాఖ్యానము అంటుంది, "సువర్తీకరణ సంఘము మూల ఉద్దేశము...స్త్రీ పురుషులను యేసు క్రీస్తు నొద్దకు రక్షణకు నడిపించుట" (ఐబిఐడి., పేజి 125).

కనుక మనం కొత్త వాళ్ళకు చెప్తాం, "మాతో రండి! మాతో భోజనం చెయ్యండి! మాతో స్నేహం చేయండి! మాతో ఆరాధించండి! మాతో సువార్తకు బయటకు రండి! సంఘములోనికి రండి! సాయంత్రపు ఆరాధనకు రండి! ప్రార్ధనా కూటానికి రండి! దేవుని కుటుంబంలో చేరండి!" "కలిసికట్టుగా మనం బలవంతులం. ఒంటరిగా మనం బలహీనులం."

ప్రతి ఒక్కడు అలా చెయ్యడు. మీ కొరకు వేచి ఉంటాం. ఎందుకు అవసరమో వివరిస్తాం. మీకు సహాయ పడడానికి చేయగలిగినదంతా చేస్తాం. ఆదిమ సంఘాలు ఇలాగే చేసాయి. డాక్టర్ మైకల్ గ్రీన్ అద్భుత పుస్తకము వ్రాసాడు, ఆదిమ సంఘములో సువర్తీకరణ (Eerdmans Publishing Company, 2003 edition). డాక్టర్ గ్రీన్ అన్నాడు, "...సహవాసము సంఘము ఎదుగుదలకు అత్యవసరము. మనష్యులు ఆకర్షింపబడాలి [సంఘాలలోనికి] గొప్పగా ప్రతి ఫలమిచ్చేదిగా ఉన్న వేరే సహవాసాల ద్వారా... [వారు చూసారు] క్రైస్తవులు ఎలా ఒకరినొకరు ప్రేమించుకున్నారో" (పేజి 256). "సంఘ సహవాసము, జాతి, లింగ, తరగతి చదువులాంటి, అడ్డంకులు లేకుండా ఆకర్షించింది" (పేజి 253). డాక్టర్ గ్రీన్ చెప్పాడు రహస్యంగా ఏమి జరగలేదు. అవిశ్వాసులు లోనికి రప్పింపబడి అందరిలానే చూడబడ్డారు. ప్రాచీన క్రైస్తవ రచయిత టేర్ టుల్లియాన్ (160-220 ఎ.డి.) క్రైస్తవ ప్రేమ సహవాసము గూర్చి సంఘములో మాట్లాడాడు. అతడన్నాడు ఇది గొప్ప కారకము ఎక్కువ సంఖ్యలో అన్యులను ఆకర్షించి ఆది సంవత్సరాలలో క్రైస్తవులుగా మార్చడానికి (ఐబిఐడి.). టేర్ టుల్లియాన్ అన్నాడు వేలమంది ఉత్తర ఆఫ్రికాలో సంఘములో చేరారు వారి ప్రేమ సహవాసములను బట్టి.

నేను ఒంటరి బాలుడను. నా తల్లిదండ్రులు విడిపోయారు. నేను బంధువులతో ఉన్నాను వారింటిలో ఉండడం వారికి కష్టము లేదు. వీధులలో ఒంటరిగా తిరిగాను. జాన్ లెనిన్ పాడిన వారిలో ఒకడిగా ఉన్నాను,

"ఒంటరులంతా,
దేనికి చెందిన వారా?"

వారు దేనికి చెందిన వారో చెప్తాను. ఇలాంటి సంఘానికి చెందినవారు! నీవు కూడ చెందినవాడివే! ఎంత విచారము పాపము జాన్ లెనిన్ యేసును నమ్మలేదు స్థానిక సంఘానికి రాలేదు! చివరలో మారక ద్రవ్యాలు తీసుకొని మంచముపై రోజంతా ఉండేవాడు.

బలమైన సంఘములోనికి రాకుంటే, ఈ ఉదయము నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. జాన్ లెనిన్ వలే ఏనాడో చనిపోయి ఉండేవాడిని. నా స్నేహితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నేను అలా చేసేవాడినా? నాకు తెలియదు. కాని నాకు తెలుసు చీకటి ఒంటరి లోకము నుండి స్థానిక సంఘ సహవాసము ఊరట ద్వారా రక్షింపబడ్డాను. నా యుక్త వయస్సులో సంఘము నాకు రెండవ గృహమయింది.

నాకు తెలుసు మీలో చాలామంది నా మాటలు వినరు. మార్గమంతా మాతో నడవరు. కాని ఎప్పుడు గుర్తుంచుకొండి మేము మిమ్మలను ఆహ్వానిస్తున్నాం! మీరు మాతో ఉండాలని కోరుకుంటున్నాం. తప్పకుండా, వెల ఉంటుంది! బహుశా! కట్టుబడుటకు కొంతవెల ఉంటుంది. కట్టుబడుట లేకుండా మీకు దీర్ఘకాల వివాహ జీవితం ఉండదు. నేను మీకు కట్టుబడి ఉన్నాను. మీరు కూడా నాకు కట్టుబడి ఉండండి. ఆయన వ్యాఖ్యానంలో థామస్ హేల్ చెప్పినట్టు, "కలిసికట్టుగా మనం బలవంతులం, ఒంటరిగా మనం బలహీనులం" (ఐబిఐడి., పేజి 914). కొందరనవచ్చు, "నేను అలా చెయ్యలేను." యదార్ధంగా ఉండండి. మీరు చేయగలరు, కాని ఇష్టము లేదు. మీరు "స్వతంత్రులుగా" ఉండాలని కోరిక. ఏమి బాగోలేదు. అంటే ఒంటరిగానే ఉంటారు. కలిసికట్టుగా మనం బలవంతులం. ఒంటరిగా మనం బలహీనులం!

కలిసికట్టుగా మనం బలవంతులం! ఒంటరిగా మనం బలహీనులం! ఈ ఉదయాన ఇది మీకు నా ప్రసంగము! యేసు ఇప్పుడు అందుబాటులో ఉన్నాడు. ఆయన దగ్గరకు రండి! తీర్పు నుండి మిమ్ములను రక్షించడానికి ఆయన సిలువపై మరణించాడు. నూతన జీవితమివ్వడానికి మృతులలో నుండి లేచాడు. ఇప్పుడు జీవించియున్నాడు – పరదైనులో, మూడవ ఆకాశంలో. ద్వారము అవతల నించోకండి తప్పిపోయిన కుమారునిలో పెద్ద అన్నలా. బైబిలు చెప్తుంది "లోనికి రానోల్లకుండెను" (లూకా 15:28). ఇతరులు లోపల పెద్ద పార్టీలతో, సంతోషంగా ఉన్నారు. కాని పెద్ద కుమారుడు అన్నాడు, "లోనికి రాను." మీలో కొందరు అలాగే చేస్తున్నారు. మేమంటాము, "యేసులోనికి రండి! లోనికి వచ్చి విందులో కలవండి!" కాని మీరంటారు, "నేను లోనికి రాను." మేమింకా మీ కొరకు వేచి ఉన్నాం! యేసులోనికి వచ్చి విందులో చేరండి!

ఇంటికి రండి, ఇంటికి రండి,
   అలసిన వారంతా, ఇంటికి రండి,
ఆసక్తితో, మృదువుగా, యేసు పిలుచుచున్నాడు,
   పిలుచుచున్నాడు, ఓ పాపి, ఇంటికి రమ్ము.
("మెల్లగా మృదువుగా యేసు పిలుచుచున్నాడు" విల్ ఎల్. థామ్సన్ చే, 1847-1909).
("Softly and Tenderly Jesus is Calling" by Will L. Thompson, 1847-1909).

తండ్రి, కొందరు వాస్తవంగా యేసు నొద్దకు రావాలని ప్రార్ధిస్తున్నాను – మా సంఘ కుటుంబంలోనికి కూడ. ఆయన నామములో అడుగుచున్నాము, ఆమెన్. "కలిసికట్టుగా మనం బలవంతులం! ఒంటరిగా మనం బలహీనులం!" నేను చెప్పినదంతా మర్చిపోయినా, దయచేసి గుర్తుంచు కొండి! కలిసికట్టుగా మనం బలవంతులం. ఒంటరిగా మనం బలహీనులం. ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి – rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రుదోం: హెబ్రీయులకు 10:19-25.
ప్రసంగము ముందు పాట బెంజిమిన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్:
"ఎలీనోర్ రిగ్ బీ" (పాల్ మెక్ కార్టినీ చే, 1942-).
“Eleanor Rigby” (by Paul McCartney, 1942-).