Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
అంత్య దినములలో అపహాసకులు

(II పేతురుపై 6 వ ప్రసంగము)
SCOFFERS IN THE LAST DAYS
(SERMON #6 ON II PETER)
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము ఉదయము, జూన్ 14, 2015
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, June 14, 2015

"అంత్యదినములలో అపహాసకులు, తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు, ఆయన రాకడను గూర్చిన, వాగ్ధానము ఏమాయెను? అందురు" (II పేతురు 3:3-4).


క్రీస్తు మేఘారుడై వస్తాడని బైబిలు బోధిస్తుంది. ఇది క్రీస్తు రెండవ రాకడ. కాని అపహాసకులు అది నమ్మరు.

II పేతురు మూడవ అధ్యాయము నాకు చాలా ప్రాముఖ్యము. ఈ అధ్యాయం బోధింప బడినప్పుడు నేను మార్పు నొందాను. అది సెప్టెంబరు 28, 1961. బయోలా కళాశాల (ఇప్పుడు విశ్వ విద్యాలయము) లో అప్పుడు నేను విద్యార్ధిని. ఆ వారము వరుసగా సంఘ ఆరాధనలు జరిగాయి. విద్యార్ధులందరూ అక్కడున్నారు. ఆ రోజు డాక్టర్ మర్ఫీలమ్ ప్రక్క నేను కూర్చున్నాను. ఈ కళాశాలను ఆనుకొని ఉన్న టాల్ బోట్ సెమినరీలో, అతడు చదువుచున్నాను. డాక్టర్ చార్లెస్ ఉడ్ బ్రిడ్జి ప్రసంగీకుడు. కొన్ని నెలల ముందు అతడు పుల్లర్ సెమినరీ వదిలిపెట్టాడు. పుల్లర్ స్వతంత్రత వైపు వెళ్ళడం అతడు చూసాడు – బైబిలు అధికారాన్ని త్రోసి పుచ్చేది. సెమినరీ అతనిని మోజు గలవానిగా ముద్రవేసింది, కాని వారిది తప్పు. తరువాత కొన్ని సంవత్సరాల సంఘటలు అతడు సరి అని చూపించాయి. ఇతర అధ్యాపకులు అతని వెంబడించి పుల్లర్ వదిలి పెట్టారు. వారిలో డాక్టర్ గ్లీసన్ ఆర్చర్, డాక్టర్ విలిబర్ యమ్. స్మిత్ మరియు డాక్టర్ హెరొల్ద్ లిండ్ సెల్ అన్నారు. వారంత ప్రధమశ్రేణి వేత్తలు. వారు డాక్టర్ ఉడ్ బ్రిడ్జిని వెంబడించారు అతడు సరి అని తేట తెల్లమయింది. ఆ సెమినరీ బైబిలు వాస్తవికత నమ్మకము నుండి స్వతంత్రత అపనమ్మకమునకు చేరువయ్యారు.

ఈ అధ్యాయముపై డాక్టర్ ఉడ్ బ్రిడ్జి మాట్లాడ్డం వింటుంటే, అది వాస్తవ విషయంగా ఉండేది. స్వధర్మత వైపు సెమినరీ వెళ్లడాన్ని గూర్చి పుల్లర్ సెమినరీలో అందరు మాట్లాడుకునేవారు. దానిని గూర్చి అపోస్తలుడైన పేతురు తేటగా మాట్లాడాడు.

మొదటి వచనంలో అపోస్తలుడన్నాడు, తాను రెండవ పత్రిక వ్రాస్తున్నానని. రోమా సామ్రాజ్యములో "చెదిరిన" ఆది క్రైస్తవులకు ఆ పత్రిక వ్రాయబడింది (I పేతురు 1:1). అప్పటికే వారికి తెలిసిన విషయాలు గుర్తు చేయడానికి అతడు ఈ రెండవ పత్రిక (లేక ఉత్తరము) రాసాడు. అంత్య దినాలలో అపహాసకులును గూర్చి అతడు వారికి చెప్పాడు. క్రీస్తు రెండవ రాకడను గూర్చి నమ్మని వారికి అతడు చెప్పాడు. యుగ సమాప్తిని గూర్చి – రాబోవు నూతన లోకాన్ని గూర్చి అతడు చెప్పాడు.

ఈ పాఠ్యభాగముచే నేను ఉత్తేజితుడనయ్యాను. అది డాక్టర్ ఉడ్ బ్రిడ్జి చాలా బాగా బోధించాడు! అతడు గొప్పవేత్త, ప్రిన్సిటన్ వేదాంత సెమినరీ పట్టభద్రుడు. అతని కంటే భాగా చెప్పిన వారిని వినలేదు. 55 సంవత్సరాల క్రితం అతనిది వినినప్పటికి, నాకు గుర్తుంది ఆ వారము అతని ప్రసంగము నా హృదయాన్ని ఎలా తాకిందో. ఇంకొక బోధక స్నేహితుడున్నాడు. అతని పేరు డాక్టర్ రస్సల్ గార్డన్, రివర్ సైడ్, కాలిఫోర్నియాలో కాపరి. అతనితో ఈ విషయము ఈ మధ్య మాట్లాడాను. డాక్టర్ గార్డన్ డాక్టర్ ఉడ్ బ్రిడ్జి మాట్లాడిన కొన్ని విషయాలు చెప్పగలడు కూడా. అది అసాధారణ బోధించుట, జీవితాన్ని మార్చే బోధించడం. నా జీవితమంతా ఆ రోజు మారిపోయింది – అదే రోజు నేను మారాను కాబట్టి!

ఆది క్రైస్తవులకు పేతురు జ్ఞాపకము చేస్తున్నాడు వారికి అప్పటికే తెలిసిన విషయాలను గూర్చి. పాత నిబంధన మళ్ళీ, మళ్ళీ ఈ విషయాలు మనకు గుర్తు చేయబడాలి. అపోస్తలుడు చెప్పాడు ఈ విషయాలను గూర్చి పాత నిబంధనలోని ప్రవక్తలు మాట్లాడారని. అతడు అన్నాడు ఆ విషయాలను ఇతర అపోస్తలులు కూడా బోధించారని. అవి కొన్ని సిద్ధాంతాలు కాదు. అవి కొన్ని పాత సిద్ధాంతాలు తిరిగి గుర్తు చేయబడడానికి.

మొదట, పేతురు వారితో అన్నాడు, "అంత్యదినములలో తమ స్వకీయ దురాశాలతో, నడుచుకొను అపహాసకులు వస్తారు" (II పేతురు 3:3). వీరు "అబద్ధపు బోధకులు" అబద్ధపు క్రైస్తవులు రెండవ అధ్యాయములో ఆయన మాట్లాడిన వారు, అతడు అన్నాడు, "అబద్ధపు బోధకులు మీ మధ్య ఉంటారు" (II పేతురు 2:1). అది పొరపాటు అలా అనుకోవడం "అబద్ధపు బోధకులు" కళాశాలలో సెమినరీలలో అధ్యాపకులు, దానిలో వారు కలుపు బడ్డారు.

కాని గమనించారా మతముపై ప్రతి ఒక్కరు నిపుణుడు? అంతా తెలుసని ప్రతి ఒక్కరు అనుకుంటాడు. మీరు వారికి ఏమి చెప్పలేరు. మీరు వీధిలో కలవండి. గుడిలో కలవండి. వారు నిపుణులు! ఏమి చదవకుండా మతముపై నిపుణుడు కావచ్చు! మన పాఠ్యభాగము చెప్తుంది అలాంటి వారు "అంత్య దినాలలో" చాలా మంది ఉంటారని. వారు అపహాసకులు.

"అంత్యదినములలో అపహాసకులు, తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనురు" (II పేతురు 3:3).

"అంత్య దినములు" అంటే ఏమిటి? డాక్టర్ జె. వెర్నోన్ మెక్ గీ అన్నాడు,

‘అంత్య దినములు’ నూతన నిబంధనలో వాడబడిన ఒక వైవిధ్య పదము; అది సంఘము అంత్య దినాలను గూర్చి మాట్లాడుతుంది (J. Vernon McGee, Th.D., Thru the Bible, volume 5, Thomas Nelson Publishers, 1983, p. 469; note on II Peter 3:1).

కొన్నిసార్లు పూర్తి క్రైస్తవ మినహాయింపును అది సూచిస్తుంది. సందర్భాన్ని బట్టి చదవాలి. II పేతురు మూడవ అధ్యాయములోని విషయము తప్పనిసరిగా రెండవ రాకడ యుగ సమాప్తి. కనుక "అంత్య దినములు" ఈ యుగాంత సమయము, క్రీస్తు రెండవ రాకడ ముందు సంవత్సరాలు.

పేతురు అన్నాడు, "అంత్యదినములలో అపహాసకులు." "అపహాసకులు" అంటే "అపహాస్యము చేయువారు." వారు క్రీస్తు రెండవ రాకడను నిరాకరించి దానిని గూర్చి పరిహసిస్తారు. "హా, హా! క్రీస్తు మళ్ళీ వస్తాడని మీరనుకుంటున్నారు! ఎంత పరిహాసము!" అది అభిప్రాయము. అపోస్తలుడు మనకు చెప్తున్నారు వారు ఎందుకు పరిహసిస్తారో. ఈ అపహాసకులు "తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకుంటారు." అంటే "వారి పాపపు కోరికలు అనుసరిస్తారు." వారు క్రీస్తు రెండవ రాకడను ఎందుకు గేలి చేస్తారంటే వారు స్వార్ధ పాపపు కోరికలలో జీవిస్తారు. పేతురు వారి అపహస్యాన్ని "అంత్యదినాలు సమీపిస్తున్నాయి అనడానికి రుజువు" (The Reformation Study Bible; note on II Peter 3:4).

ఈ అపహాసకులు విషయము ఏమిటి? మొదటిది, వారు భౌతికులు. లోక విషయాలతో తృప్తి చెందుతారు. తీర్పు తీర్చడానికి క్రీస్తు వస్తున్నాడు అనేది వారు నమ్మరు. పేతురు వారిని నోవహు దినముల ప్రజలతో పోల్చాడు (II పేతురు 2:5). "దేవుడు లోకాన్ని వదలలేదు, కాని నోవహును రక్షించాడు...అతడు నీతిని గూర్చి బోధించాడు, అదైవిక లోకముపై ప్రళయము వచ్చింది." నోవహు రాబోవు తీర్పును గూర్చి బోధించాడు. కాని ప్రజలు వినలేదు! క్రీస్తు వారిని భౌతికులు అన్నాడు – వారు తినడం, త్రాగడం పార్టీలకు వెళ్ళడంలో ఆసక్తి కలిగియున్నారు, "నోవహు ఓడలోనికి వెళ్ళిన తరువాత, ప్రళయము వచ్చి, వారినందరిని నాశనము చేసింది" (లూకా 17:27). సొదొమొ గొమొర్రె తీర్పును గూర్చి కూడా పేతురు మాట్లాడాడు – "సొదొమొ గొమొర్రె పట్టణాలను బూడిదగా చేసి శపించాడు" (II పేతురు 2:6). తరువాత, వారి ప్రధాన పాపమూ భౌతికత. క్రీస్తు అన్నాడు, "లోతు దినములలో; జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, వారు ఇండ్లు కట్టుచు, ఉండిరి; అయితే లోతు సొదొమొ విడిచి పోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి, వారందరిని నాశనము చేసెను" (లూకా 17:28-29). తరువాత క్రీస్తు అన్నాడు,

"ఆ ప్రకారమే మనష్యు కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును" (లూకా 17:30).

వారు చేసిన పాపాలు గమనించండి. రెండు విషయాలలో కూడా – నోవహు దినములలో లోతు దినములలో – క్రీస్తు లైంగిక పాపాలను గూర్చి చెప్పలేదు. లైంగిక పాపాలను గూర్చి ప్రస్తావించలేదు! ఎందుకు? ఎందుకంటే వారి పాపాలకు మూలము భౌతికతతో ముడి పడి ఉంది – ఈలోకం కొరకు జీవించడం – వినోదం కొరకు జీవించడమ – కేవలం తినడానికి జీవించడం! భౌతిక భోగాల కోసం జీవించడం. చాలామంది చైనీయులు అలా ఉన్నారు. డాక్టర్ చార్లెస్ సి.రైరీ అన్నాడు చెప్పబడినవి పాప భూయిష్టమైనవి కావు. కాని "రాజాలు సిద్ధంగా లేరు." "క్రీస్తు తిరిగి వచ్చునప్పుడు...చాలామంది భద్రతా కలిగి సిద్ధంగా ఉండరు (నోవహు లోతు దినముల వలే)" (రైరీ పఠన బైబిలు; గమనిక లూకా 17:26-30).

ఒక వ్యక్తి ఆదివారము లాస్ వేగాస్ చూడ్డానికి వెళ్ళాడు. అక్కడ వెలుతురు చూడడానికి గుడి మానేస్తాడు. ఆదివారము శాన్ ప్రాన్సిస్కోకు వెళ్తాడు. ఇంకొక వ్యక్తి గంటల తరబడి విడియో ఆటలు ఆడతాడు, కాని బైబిలు చదవడానికి సమయం ఉండదు. ఇతరులు అశ్లీల చిత్రాలు చూస్తారు, ప్రార్ధనకు సమయం ఉండదు. ఇతరులు డబ్బుపై దృష్టి పెడతారు, పరలోకములో నిధులు సమకూర్చు కోరు. భౌతికత మీ ఆత్మీయ జీవితాన్ని నాశనము చేస్తుంది. మీకు దేవుడు తెలియదు. క్రీస్తును కలిగి ఉండరు. ఈలోక నిధులు కలిగి ఉంటారు. అపోస్తలుడైన యోహాను అన్నాడు,

"లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశాయు, నేత్రాశము, జీవపు డంబమును, తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశాయు, గురించి పోవుచున్నవి: కాని దేవుని చిత్తమును జరిగించు వాడు నిరంతరమూ నిలుచును" (I యోహాను 2:16-17).

నేను యుక్త వయసులో ఉన్నప్పుడు నా పిన తల్లిదండ్రులతో ఎలిజబెత్ వీధిలో ఉండేవాడిని. ఆ వీధిలో చాలామంది యవనస్తులు ఉండేవారు. కొంతమంది బీరు తెచ్చుకొని గుడారాలలో తాగారు. కొంతమంది గంటల తరబడి పరికరాలతో ఆడేవారు, కార్ల ఆటలు ఉండేవి. కొంతమంది వ్యభిచారానికి తెజువానకు వెళ్ళేవారు. వారంతా నాకంటే తెలివైనవారు అనుకునేవారు. నాతో పరిహాసమాడి గేలి చేసేవారు. వారన్నారు, "రోబర్ట్ మతపరుడు" – దేవుని గూర్చి తీవ్ర శ్రద్ధ కలిగి ఉండేవాడు. తరువాత నేను కాపరినయ్యాను. ఒకరి తరువాత ఒకరు వారు చనిపోయారు. వారి బంధువులు నాకు ఫోన్ చేసి వారి భూస్థాపన చేయమన్నారు. కాని ఆ భూస్థాపన సమయంలో వారిని గూర్చిన ఒక నిరీక్షణ పదము కూడా లేదు. ఒక్క నిరీక్షణ మాట కూడా! నేను చేయగలిగే వాడిని బ్రతికి ఉన్నవారికి సువార్త వివరించడం. ప్రతి ఒక్కరికి తెలుసు నిరీక్షణ ఉండదని త్రాగే వారికి కార్లతో ఆడేవారికి వ్యభిచారులను చూసేవారికి. వారికి ఎలాంటి నిరీక్షణ లేదని ప్రతి ఒక్కరికి తెలుసు! దేవుని కృపను బట్టి నేను వేరుగా జీవించాను. దేవుని కృపను బట్టి నా జీవితంలో నాకు ఎక్కువ ఆనందము ఉంది, ఎంతో కాలంగా తెలిసిన ఆ పేద నశించిన అబ్బాయిల కంటే.

"లోకమును దాని ఆశయు, గతించి పోవుచున్నవి గాని: దేవుని చిత్తమును జరిగించు వాడు నిరంతరమూ నిలుచును" (I యోహాను 2:17).

ఈ లోకం కొరకే జీవిస్తున్నవా? నిత్య రాజ్యమును గూర్చి ఎప్పుడైనా ఆలోచించావా? తీర్పు కొరకు సిద్ధంగా ఉన్నావా?

"అంత్య దినములలో, అపహాసకులు తమ స్వకీయ దురాశల చొప్పున, నడుచు కొనుచు వచ్చెదరు" (II పేతురు 3:3).

వారి పరిస్థితి ఏమిటి? మొదటిది, వారు భౌతికులు. రెండవది, వారు ఆత్మీయంగా అంధులు. రెండవ అధ్యాయములో అపోస్తలుడైన పేతురు ఇలా మాట్లాడాడు. అతడు అన్నాడు,

"వారు, పట్టుబడి స్వభావ సిద్ధంగా మృగముల వలే ఉంది... తమకు తెలియని విషయములను గూర్చి దూశించుచు; తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురు" (II పేతురు 2:12).

వారు మృగముల వలే ఆత్మీయంగా గ్రుడ్డివారు – "వారు స్వభావ సిద్ధంగా మృగముల వంటివారు." వారు క్రీస్తుకు విరోధంగా మాట్లాడుతారు, ఆయన రాకడను గూర్చి, సిలువపై ఆయన మరణము గూర్చి. ఆయన మృతుల పునరుత్థానమును గూర్చి వారు నవ్వుతారు.

చూడండి యవనస్తులు ఎప్పుడు అలాగే ఉంటారు. యేసు నామాన్ని ఊతపదంగా వాడతారు – "యేసు క్రీస్తు!" గుడికి తీసుకురావాలనుకుంటే, నిర్లక్షంగా ఉంటారు. ఈ గుడికి మీరు వచ్చినందుకు వారు నవ్వుతారు పరిహసిస్తారు. తన తల్లికి సోదరికి అద్దె చెల్లిస్తున్న ఒక యవస్తుడు నాకు తెలుసు. అయినను వారు అతనిపై అరుస్తారు, "ఎందుకు గుడికి వెళ్తున్నావు?" సత్యమేమిటంటే, అతడు ఇక్కడకు రాకపోతే ఉండడానికి వారికి ఇల్లు ఉండేవి కాదు. అతడు ఎక్కడికో పరిగేట్టేవాడు, వారు రోడ్లపై ఉండేవారు! "అర్ధం కాని విషయాలపై చెడ్డగా మాట్లాడుతారు." వారు ఆత్మీయంగా అంధులు.

బైబిలు బోధిస్తుంది మనం పాపంలో పుట్టామని. మన ఆదిమ తల్లిదండ్రులు పాపం చేసారు – మనకు పాపపు స్వభావం వచ్చింది. వారి నుండి మనం సహజంగా పాపులమయ్యాం. మనం మారేంత వరకు మనము "సహజ" పురుషులము "సహజ" స్త్రీలము. బైబిలు చెప్తుంది,

"ప్రకృతి సంబందియైన మనష్యుడు దేవుడి ఆత్మ విషయంలను అంగీకరింపడు: అవి అతనికి వెర్రితనంగా ఉన్నవి: అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును, గనుక అతడు వారిని గ్రహింప జాలడు" (I కొరిందీయులకు 2:14).

నీవు చాల తెలివైన వాడవు కావచ్చు, కాని మార్పు నొందకపోతే నీవు "సహజ" స్త్రీవి పురుషుడవు. స్కోఫీల్ద్ గమనిక I కొరిందీయులకు 2:13-14 చెప్తుంది: "చూడలేని దేవుని విషయాలు సహజ మానవుడు కనుగొనలేదు." వారు చీకటిలో సంచరిస్తారు దేవుని కనుగొనకుండా.

లార్డ్ బెర్ ట్రాండ్ రస్సల్ ప్రఖ్యాత బ్రిటిష్ గణిత వేత్త ఇరవై శతాబ్దపు వేదాంతి. నేను యవనునిగా ఉన్నప్పుడు అతడు భయపెట్టే నాస్తికుడు, తెలివైన వాడు. అతనికి వచ్చిన ఇవ్వబడిన గౌరవార్ధాలను బట్టి, మీరనుకుంటారు అతడు ఆనంద వ్యక్తి అని. బదులుగా నిరీక్షణ లేని వైఖరి జీవితమూ పట్ల అతనికి ఉండేది. అతని మరణము ముందు, బెర్ ట్రాండ్ రస్సల్ వ్రాసాడు,

అగ్ని, నాయక లక్షణము, తలంపు భావనల తీవ్రత, ఒక వ్యక్తిని సంరక్షింప లేవు సమాధి తరువాత జీవితంలో...[అందురు] అంతరిక్ష వ్యవస్థలో మరణానికి నిర్దేశింపబడియున్నారు, మరియు మానవి విజయాల దేవాలయము విశ్వ శిధిలాల క్రింద పాతి పెట్టబదవలసిందే (Lord Bertrand Russell, A Free Man’s Worship).

అతడు ఇరవై శతాబ్దంలో అతి తెలివైన వాడు – కాని అతడు చూడగలిగేది "పతనమయ్యే విశ్వము." అక్కడ "సహజ మానవుడు" తన జీవితాన్ని ముగిస్తాడు – నిరీక్షణ, శాంతి, భవిష్యత్తు, దేవుడు లేకుండా. వీరు అపహాసకులు, తమ స్వకీయ దురాశల చొప్పున నడుస్తారు, వారు అన్నారు, "ఆయన రాకడను గూర్చిన వాగ్ధానము ఎ మాయెను?"

ఇరవై శతాబ్దపు ఇంకొక ప్రసిద్ధ వ్యక్తి హెచ్. జి. వేల్స్. అతడు ద టైం మెషిన్, ప్రపంచ యుద్ధాలు, చరిత్ర సమీకరణము వ్రాసాడు. వేల్స్ గారు వేదాంతి, చరిత్రీయుడు, సామాన్య శాస్త్రం వైవిధ్య రచయితా. క్రైస్తవ్యాన్ని ఎదిరిస్తూ తన జీవితాన్ని గడిపాడు. ముసలివాడయ్యాక అన్నాడు, "నాకు అరవై ఐదు సంవత్సరాలు ఇంకా శాంతి కొరకు అన్వేషిస్తున్నాను. శాంతి నిరీక్షణ లేని స్వప్నము." జీవితాంతములో వెల్స్ గారు అన్నారు మానవాళి "నిర్ధాక్షిణ్యతకు, శ్రమకు మరణానికి" ఏర్పాటు చేయబడింది.

వెక్కిరించే వారిని అపహసకులను వెంబడించే నీవు క్రీస్తును కనుగొన లేవు. ఎలా రక్షింపబడాలో "కనుక్కోడానికి" ప్రయత్నిస్తే నీవు క్రీస్తును ఎన్నడు కనుగోనలేవు. నిన్ను నీవు నమ్ముకోకూడదు, ఎందుకంటే

"హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది" (ఇర్మియా 17:9).

"నశించుచున్న విశ్వము నుండి" నీవు రక్షింపబడాలనుకుంటే చిన్న పిల్లల విశ్వాసముతో యేసును నీవు విశ్వసించాలి. గ్రఫిత్ గారు పాడిన పాటలోని మాటలు, నీ హృదయంలో చెప్పుకోవాలి,

యేసు ప్రభు, ఆకాశంలో మీ సింహాసనం నుండి క్రిందికి చూడండి,
   సంపూర్ణ యాగము చేయడానికి నాకు సహాయము చెయ్యండి;
నన్ను అప్పగించుకుంటాను నాకు తెలిసిందంతా;
   నన్ను కడగండి హిమము కంటే తెల్లగా ఉండునట్లు.
హిమము కంటే తెల్లగా ఉండునట్లు, అవును, హిమము కంటే తెల్లగా;
   నన్ను కడగండి, హిమము కంటే తెల్లగా ఉండునట్లు.
("హిమము కంటే తెల్లగా" జేమ్స్ నికోల్ సన్ చే, 1828-1876).
   (“Whiter Than Snow” by James Nicholson, 1828-1876).

అప్పుడు యేసును గూర్చి మాట్లాడగలుగుతావు, ఆయన "తన స్వరక్తముతో మన పాపాల నుండి కడిగాడు." నా ప్రార్ధన నీవు త్వరలో యేసును నమ్ముతావని. ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి – rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రుదోం: II పేతురు 3:1-4.
ప్రసంగము ముందు పాట బెంజిమిన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్:
"హిమము కంటే తెల్లగా" (జేమ్స్ నికోల్సన్ చే, 1828-1876).
“Whiter Than Snow” (by James Nicholson, 1828-1876).