Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




అలెగ్జేమోనోస్ మరియు అతని దేవుడు

ALEXAMENOS AND HIS GOD
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము ఉదయము, జూన్ 7, 2015
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, June 7, 2015

"అతిశయించువాడు, ప్రభువు నందే అతిశయింపవలెను"
(I కొరిందీయులకు 1:31).


I కొరిందీయులకు మొదటి రెండు అధ్యాయాలలో మనము ఏమి నేర్చుకొనగలము? ఆసక్తి కరమైన విషయం ఆఅదిమ క్రైస్తవులను గూర్చి మనం నేర్చుకునేది. వారు ఎంతగా క్రీస్తులో కేంద్రీకృతమై ఉన్నారో చూడకుండా మీరు ఈ రెండు అధ్యాయాలు చదువలేరు. తెలివిగలవారు అనుకునే వారు క్రీస్తును తిరస్కరించారు, "సిలువను గూర్చి సువార్త నశించు చున్న వారికి వెర్రితనము; కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి" (1:18). "అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము" (1:23). "క్రీస్తు దేవుని శక్తి యందు, దేవుని జ్ఞానమునైయున్నాడు" (1:24). "క్రీస్తు యేసు దేవుని మూలముగా, ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయెను" (1:30). "నేను యేసు క్రీస్తును, అనగా సిలువ వేయబడిన యేసు క్రీస్తును తప్ప, మరిదేనిని మీ మధ్య నేరుగా కుండా యుందునని నిశ్చయించుకొంటిని" (2:2). డాక్టర్ జె. వెర్నోన్ మెక్ గీ అన్నాడు,

పౌలు వేదాంత పర చర్చల లోనికి వెళ్ళలేదు...అతడు క్రీస్తు సిలువను గూర్చి బోధిస్తూ ఉన్నాడు. అతడు సిలువ వేయబడిన రక్షకుని బోధించాడు. అలాంటి పరిచర్య ఈనాడు ఎంతగానో అవసరము (J. Vernon McGee, Th.D., Thru the Bible, volume 5, Thomas Nelson Publishers, 1983, p. 13; note on I Corinthians 2:2).

"అతిశయించువాడు, ప్రభువు నందే అతిశయింపవలెను" (I కొరిందీయులకు 1:31).

గ్రీకు పదము "మహిమ" కు అర్ధము "పొగుడుకొనుట" – హెచ్చించుకొనుట, గర్వపడుట. అపోస్తలుడు క్రీస్తును ఘన పరచాలని మనకు చెప్తున్నాడు – క్రీస్తును గూర్చి గర్వపడాలి – క్రీస్తును భట్టి అతిశయించాలి – "ప్రభువు నందు అతిశయించాలి." అది క్రైస్తవులు క్రీస్తును గూర్చి ఎంతో మాట్లాడారు అవిశ్వాసులు అన్నారు వారు చనిపోయిన యూదుని పూజిస్తున్నారని! డాక్టర్ మైకల్ గ్రీస్ అన్నాడు, "[క్రీస్తును గూర్చి మాట్లాడుట] కు కదిలించే ఉదాహరణ ఉంది రోమ్ లోని పేలపైన్ పర్వతముపై ఇంపీరియల్ పేజ్ అబ్బాయిల నివాసములోనిది. ఇక్కడ మూడవ శతాబ్దపు ఆరంభంలోని పటము ఉంది, [బాలుని] హస్తముచే గీయబడింది, ఒక బాలుడు ఆరాధించే వైఖరితో నిలబడి, ఒక చెయ్యి ఎత్తి ఉంచుట. అతని భక్తికి ఆధారము సిలువపై ఒక ఆకారము, ఒక వ్యక్తి గాడిద తలతో. క్రింద వ్రాయబడింది, ‘అలెగ్జే మోనోస్ అతని దేవుని అరాదిస్తున్నాడు.’ తేటగా ఒక పేజి క్రైస్తవుడు, దానిని గూర్చి సిగ్గు పడుట లేదు. అతని తోటి బాలురు అతని గూర్చి గేలి చేయుచున్నారు. కాని అతడు [సిగ్గు పడుట లేదు]... వేరే చేతిలో ఉన్న వ్రాత [అంటుంది] ‘అలెగ్జే మోనోస్ నమ్మకస్తుడు’. బహుశా ఆ క్రూర చిత్రానికి అతని స్వంత స్పందన. నేనను కుంటాను అదే అని" (Michael Green, D.D., Evangelism in the Early Church, William B. Eerdmans Publishing Company, 1970, pp. 174, 175).

నేను గ్రిఫిత్ దానిలోనిది అసలు దాని నుండి తీసుకున్నాను. ఆ చిత్ర పఠము ఇది గీయబడినది, గోడ నుండి తీసికోనబడినది పేజ్ బాయిస్ గదిలోనిది పెలెపైన్ పర్వతము లోనిది ఆదిమా రోమ్ లో రెండవ శతాబ్దపు ముగింపులో.

Alexamenos and his God

నేను ఆ పాత చిత్రాన్ని చూసినప్పుడు నాకళ్ళ నుండి కన్నీళ్లు వచ్చాయి. 10 లేక 12 ఏళ్ల చిన్న బాలుడు యేసు కొరకు నిలబడ్డాడు! ఒక చెడ్డ బాలుడు ఆ పటాన్ని గీసాడు యేసును ఆరాదిస్తున్నట్లు – గాడిద ముఖముతో! నేననుకున్నాను, "అలెగ్జే మోనోస్ లాంటి బాలుని బట్టి దేవునికి వందనాలు!" అలాంటి బాల బాలికలు క్రీస్తు సందేశాన్ని రోమా ప్రపంచమంతటా విస్తరింప చేసారు! పరలోకంలో నిన్ను కలవాలను కుంటున్నాను, అలెగ్జే మోనోస్! నా ప్రార్ధన అలాంటి యవనస్తులు మన సంఘములో ఉండాలని – యవ్వన పురుషులు స్త్రీలు క్రీస్తును గూర్చి అతిశయ పడేవారు – దేవుని త్యజించిన ఈ తరము వారు ఎంతగా వారిని గేలిచేసినా అపహాస్యము చేసినా!

డగ్గర్ కుటుంబము తీర్పు లేకుండా చీల్చబడింది హింసింపబడింది. వారికి పంతొమ్మిది మంది పిల్లలు. పన్నెండు సంవత్సరాల క్రితము వారిలో ఒక బాలుడు అతని ఇద్దరి సోదరీలను అకారణముగా ముట్టుకున్నాడు. అతని తల్లిదండ్రులు అతనిని పోలీస్ వద్దకు తెచ్చారు. అతనికి 15 సంవత్సరాలు, రికార్డు మూయబడింది. కొన్ని వారాల క్రితము బుర్రలేని చిన్న అర్ కన్ సాస్ పట్టణ పోలీస్ అధికారి మూయబడిన రికార్డు తెరిచి వార్తలకు ఇచ్చాడు. వారు ఆ కుటుంబాన్ని సిలువ వేసారు, వారి ఇంటిని "భయ కంపిత గృహము" అని పిలిచారు. వారు ఎందుకు అలా చేస్తున్నారు? ఎందుకంటే వారు బాప్టిస్టు సంఘ సభ్యులు – వారు క్రైస్తవులు కాబట్టి!!! ఆ ఇద్దరు సహోదరులు ఫాక్స్ వార్తలకు వెళ్ళారు ఎందుకంటే అక్కడ మాత్రమె వారికి న్యాయము జరుగుతుంది. ఈ యవన స్త్రీలు ఫాక్స్ వార్తలలో వారి తల్లిదండ్రులను సమర్ధించారు. అప్పుడు నేను చూసాను ఊపీ గోల్డ్ బెర్గ్ స్థావరాలు, దెయ్యము ముఖము వారిపై అరవడం. "దేవుని మధ్యలోనికి లాగకండి!" "క్రైస్తవులను తీసుకు రండి! వారిని తెండి! వారిని తెండి!" – ఏమి మారలేదు ఎందుకంటే వారు క్రైస్తవ అమ్మాయిలను సింహలచే చీల్చబడడానికి త్రోయబడ్డారు ఆదిమ రోమాలో! ఊపీ గోల్డ్ బెర్గ్ నీరోలా లేక కాలిగులాలా కనిపించాడు! "క్రైస్తవులను చంపండి! వారిని తెండి! వారిని తెండి! వారిని తెండి!" దేవుడు మనకు సహాయము చెయ్యాలి – మీడియాను అదుపు చేసే ప్రజల విషయంలో! ఈ క్రూర దుష్ట దినాలలో, ప్రతి యవనస్థుని విషయంలో ఈ ఉదయము ఇలా చెప్పబడాలి, "అలేగ్జే మోనోస్ నమ్మకస్థుడు."

"అతిశయించువాడు, ప్రభువు నందే అతిశయింపవలెను" (I కొరిందీయులకు 1:31).

ఏ మానవుడు ఆయనతో పోల్చబడలేదు,
   మనష్యుల కుమారులలో;
ఆయన సుందరులలో అతి సుందరుడు,
   పరలోక రైలు నింపబడుతుంది,
పరలోక రైలు నింపబడుతుంది.

ఆయనకు నా జీవితమూ, నా ఊపిరి ఇవ్వరుణస్థుడను,
   నాకున్న సంతోషాలన్నీ;
ఆయన నాకు మరణముపై విజయమిస్తాడు,
   సమాధి నుండి నన్ను రక్షిస్తాడు,
సమాధి నుండి నన్ను రక్షిస్తాడు!
("అద్భుత మాధుర్యం ఆశీనమై ఉంది" సామ్యుల్ స్టెన్నెట్ చే, 1727-1795).
(“Majestic Sweetness Sits Enthroned” by Samuel Stennett, 1727-1795).

మీరు లెఫ్ట్ - వింగ్ మీడియా కలిగి ఉంచవచ్చు! మీకు ఊపీ గోల్డ్ బర్గ్, పూర్తీ స్వతంత్ర, దేవుని అసహ్యించుకొనే, హాలీవుడ్ గుంపు ఉండవచ్చు! వారిని కలిగి ఉండొచ్చు! ఇవ్వడానికి వారికి ఏమి లేదు! ఏమీ లేదు! ఏమి లేదు! ఏమి లేదు! – "అలేగ్జే మోనోస్ నమ్మకస్థుడు!" "అలేగ్జే మోనోస్ నమ్మకస్థుడు!" "అలేగ్జే మోనోస్ నమ్మకస్థుడు!" ప్రియదేవా, అలా ఉండాలి! అలా ఉండాలి!

"అతిశయించువాడు, ప్రభువు నందే అతిశయింపవలెను" (I కొరిందీయులకు 1:31).

వినోదానికి గుడికి రాము. "ఆరాధించు జట్టులను చూడడానికి" రాము లాస్ వేగాస్ రాత్రి క్లబ్బులో పాడి వారిలా. జోకులు వినడానికి, కథలు వినడానికి రాము స్వంత మెరుగుకు. జిమ్మీ ఫాలీన్ నుండి మంచి జోకులు వినవచ్చు. రీడర్స్ డైజస్ట్ లో స్వంత మెరుగుకు కావలసినవి చదవచ్చు. "క్రైస్తవ" రాక్ సంగీతముతో ముగ్దులవడానికి గుడికి రాము. అది కాలి. అది మన ఆత్మలను తాకదు. మన నోట్లో మట్టి రుచిని నిలుపుతుంది. అది కాలీ, వ్యర్ధము, సమయ వ్యర్ధత!

నా భార్య నేను శనివారము రాత్రి ఆరాధనకు సాన్ డిగ్ దగ్గర, ఆరెంజ్ కౌంటీల ఉన్న పెద్ద గుడికి వెళ్ళాము. సంగీతము చెవిటిగా ఉంది. మంత్రంగా ఉంది. అది పరిపూర్ణ రాక్ సంగీతము. పతన ముగింపుతో ముగిసింది. నేను ఎక్కడా ఎప్పుడు విన్న దానినంతటిని, అధిగమించింది.

ప్రజలు బయటికొచ్చారు. వారు మైకంతో, వెర్రితనంతో, జీవచ్చవంలా ఉన్నారు "బ్రతికి మృతుల యొక్క రాత్రి" లో వలే. ఎవ్వరు నవ్వలేదు. మాట్లాడలేదు. పలకరించుకోలేదు. ఒంటరిగా వచ్చారు – వినోదానికి. ఒంటరిగా వెళ్ళిపోయారు. డాక్టర్ డేవిడ్ వేల్స్ అన్నాడు, "ఒంటరి తనము ఆధునిక ప్లేగ్ జబ్బు. సంబంధాలు లేకుండా వేరు పారకుండా, ఎక్కడా పొత్తులేకుండా, సామాన్యంగా ఉండే ప్లేగు జబ్బు. ఒంటరి తనపు శ్రమ, గుర్తింపు లేకుండా ఉండడం, వేరే విశ్వముతో కొట్టుకొని పోవడం" (David F. Wells, Ph.D., The Courage to be Protestant, Eerdmans, 2008, p. 33).

డాక్టర్ వేల్స్ గొప్ప వేదాంతి, సరియైనవాడు. "ఒంటరి తనము ఆధునిక ప్లేగు జబ్బు." ఆ గొప్ప సంఘానికి ఒంటరితనానికి జవాబు లేదు. రాక్ సంగీతముంది – ప్రతివాడు ఒంటరిగా జారిపడుతున్నాడు – డాక్టర్ స్టేడియంలో ఆటలాడిన తర్వాత చేసినట్టు! జవాబు ఏమిటి? జవాబు యేసు క్రీస్తును కేంద్రంగా ఉన్న సంఘము. క్రీస్తు జవాబు – రాక్ సంగీతము కాదు. క్రీస్తు సమాధానము – పెద్ద, ఒంటరి గుంపు కాదు! ఈ ఆధునిక పెద్ద సంఘాలు ఏమి ఇవ్వలేవు! ఏమి! ఏమి! ఏమి! కేవలం క్రీస్తు-కేంద్రీకృత, క్రీస్తును-ప్రకటించే, క్రీస్తును- గౌరవించే సంఘమే జవాబు! జవాబు ఎప్పుడు యేసు క్రీస్తులోనే ఉంటుంది. ఆ యవనస్థుడు రెండవ శతాబ్దపు చివరలో జీవించిన వానికి ఇది తెలుసు. అందుకే "అలెగ్జేమోనోస్ అతని దేవుని ఆరాధిస్తాడు!" అందుకే "అలేగ్జే మోనోస్ నమ్మకస్థుడు!"

"అతిశయించు వాడు, ప్రభువు నందే అతిశయింప వలెను" (I కొరిందీయులకు 1:31).

రక్షణ సంగతేంటి? "పెద్ద" ప్రసంగీకులు ఎలా రక్షింపబడాలో చెప్పడం విన్నారా? ఓ దేవా, వారు వినడంతో మాట్లాడుతారు! పరిశుద్ధాత్మను గూర్చి మాట్లాడతారు. మంచిగా ఎలా ఉండొచ్చో మాట్లాడతారు. ఎలా జయం పొందుకోవాలో చెప్తారు. జోసెఫ్ ప్రిన్స్ అనే వ్యక్తి కృపను గూర్చి మాట్లాడాడు. కాని ఎలా రక్షింపబడాలో అనే విషయం పై ఎవరు మాట్లాడతారు? నేను వినడం లేదు! సిలువను గూర్చి ఎవరు మాట్లాడతారు? నేను అది వినడం లేదు! రక్తాన్ని గూర్చి ఎవరు మాట్లాడతారు? నేను అది వినడం లేదు! యేసుపై పూర్తీ ప్రసంగము ఎవరు చేస్తారు? నేను అది వినడం లేదు!

ఒక అనామకుడు క్యూబా నుండి కొన్ని రోజుల క్రితం ఒక ఈమెయిల్ వ్రాసాడు. ప్రపంచమంతా ఈ ప్రసంగాలు వెళ్తాయి – 200 దేశాలకు, 32 భాషలలో. ఈ యవన క్యూబా అతను రాసాడు. అతడన్నాడు క్రీస్తుకు సమర్పించుకొని బాప్తిస్మము పొందాడని. ఒక స్నేహితుడు ఎన్నికను గూర్చి చెప్పాడట. అది అతని తొందర పెట్టింది. ఎన్నికను గూర్చి విన్నాక తన రక్షణను సందేశించాడు. నాకది అర్ధం కాలేదు! నాకనిపిస్తుంది ఎన్నికనేది ఇంకా ఎక్కువగా రక్షణ నిశ్చయత ఇవ్వాలి. అది నీపై ఆధారపడదు. క్రీస్తు పైనే అది ఆధారపడుతుంది! ఆమెన్! అతడు పాల్ వాషర్ కార్యక్రమాలు చూసి జాన్ మెక్ అర్ధర్ వి చదవడం ఆరంభించాడు. రే కంఫర్ట్స్ ప్రసంగము, "నరకము రహస్య స్థలము" చదివాడు. తరువాత కేల్వినిజంపై విడియోలు, " అద్భుత కృప" చూసాడు. ఇదంతా అతని తికమక చేసింది. కనుక మాకు వ్రాసి అన్నాడు, "నేను నమ్ముతాను కొన్ని పుస్తకాలు సిఫారసు చెయ్యండి న్యాయ శాస్త్రమును గూర్చి, పాపపు ఒప్పుకోలు సిద్ధ పాటును గూర్చి." అతనన్నాడు, "ధర్మశాస్త్రము లోతును నేను అర్ధం చేసుకోవాలి." అలా అతనికి జవాబిచ్చాను,

గమనించు నీవు క్రీస్తు నామాన్ని ఒక్కసారి ఉచ్చరింప లేదు! ఒప్పుకోలును గూర్చి పెద్ద ఈమెయిల్ రాసావు ధర్మ శాస్త్రమును గూర్చి యేసు నామాన్ని ఒక్కసారి కూడా చెప్పలేదు, సిలువపై ఆయన పని, లేక పాపాలు కడిగే ఆయన రక్తాన్ని గూర్చి! ఇది ఆధునిక కాల్వినిజం ఉచ్చు. గమనించు గంటల తరబడి పాల్ వాషర్ వి జాన్ మెక్ ఆర్డర్ వి చదవవచ్చు ధర్మ శాస్త్రాన్ని గూర్చి ఆలోచిస్తూ, యేసు క్రీస్తును గూర్చి ఆలోచించే బదులు! అది నా ఫిర్యాదు వాషర్, మెక్ ఆర్ధర్ మరియు రే కంఫర్ట్స్ గూర్చి. వారు సువార్త కంటే ధర్మ శాస్త్రాన్ని గూర్చి బాగా బోధిస్తారు! నా ప్రసంగము చదవడానికి క్లిక్ చెయ్యండి, "ఇంకా ఎక్కువగా ఆశ్చర్య పరిచే యువకులకు ప్రసంగము! – పాల్ వాషర్ కు నా జబాబు!").

అతనికి నా రెండు ప్రసంగాలు పంపాను: "యేసు క్రీస్తు మాత్రమే" మరియు "క్రీస్తును గూర్చి నీవేమి తలుస్తున్నావు?" అది అతనికి కావాలి – యేసు క్రీస్తు మాత్రమే! నీకు కూడా అదే కావాలి –"యేసు క్రీస్తు మాత్రమే!

"అతిశయించు వాడు, ప్రభువు నందే అతిశయింప వలెను" (I కొరిందీయులకు 1:31).

ఏ మానవుడు ఆయనతో పోల్చబడలేదు,
   మనష్యుల కుమారులలో;
ఆయన సుందరులలో అతి సుందరుడు,
   పరలోక రైలు నింపబడుతుంది,
పరలోక రైలు నింపబడుతుంది.

నేను లోతైన నిశ్ర్పుహలో ఉండడం అయన చూసాడు,
   నా విడుదల కొరకు వచ్చాడు;
నా కొరకై ఆయన అవమానపు సిలువను భరించాడు,
   నా దుఃఖాన్నంతటిని మోసాడు,
నా దుఃఖాన్నంతటిని మోసాడు.

ఆయన నుండి నేను పొందుకుంటాను
   దైవిక ప్రేమ నిదర్శనాలు,
ఇవ్వడానికి నాకు వేల హృదయలుంటే,
   ప్రభు, అవన్నీ మీకే.
ప్రభు, అవన్నీ మీకే.

యేసు నొద్దకు రావడం చాల సులువు. ప్రాచీన రోమ్ లోని ఆ యవన బాలుడు ఆయన దగ్గరకు వచ్చాడు – నీవు కూడా రావచ్చు!

అలేగ్జే మోనోస్ తన దేవుని ఆరాధించాడు! అతని దేవుడు సిలువకు మేకులతో కొట్టబడి, అలేగ్జే మోనోస్ పాప ప్రాయశ్చిత్తము కొరకు శ్రమ పడ్డాడు.

రోబర్ట్ హైమర్స్ అతని దేవుని ఆరాధిస్తారు! అతని దేవుడు సిలువ మేకులతో కొట్టబడి, రోబర్ట్ హైమర్స్ పాప ప్రాయశ్చిత్తము కొరకు శ్రమపడ్డాడు.

అలేగ్జే మోనోస్ అతని దేవుని ఆరాధిస్తాడు! అతని దేవుడు నజరేయుడైన యేసు. అతని దేవుడు పరలోకము నుండి దిగివచ్చి, సిలువపై మరణించి, అలేగ్జే మోనోస్ మరియు నీ పాపాలకు వెల చెల్లించాడు. అతని దేవుడు యేసు, ఆయన శారీరకంగా లేచి, బౌతికంగా మృతులలో నుండి లేచి, ఇప్పుడు పరలోకములో – తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు.

అలేగ్జే మోనోస్ అతని దేవుని ఆరాధిస్తాడు. ప్రపంచము అంటుంది అతని దేవునికి గాడిద ముఖము ఉందని! ప్రపంచము అలెగ్జేమోనోస్ ను గేలిచేసి అపహసించింది యేసును ఆరాధించి నందుకు. కాని అతడు ఇంకొక గోడపై వ్రాసాడు, "అలెగ్జేమోనోస్ నమ్మకస్తుడు" అని. ఎందుకతడు నమ్మకస్తుడు? ఎందుకంటే, అతని దేవుడు యేసు, చెప్పాడు, "నా ద్వారానే తప్ప, ఎవడును తండ్రి యొద్దకు రానేరడు" (యోహాను 14:6).

అలెగ్జే మోనోస్ అతని దేవుని ఆరాధించాడు. మరియు రోమా ప్రపంచమంతయు కూలి పడిపోతుంది. విగ్రహాలన్నీ విఫలమయ్యాయి. వైభవమంతా కరిగిపోతుంది. మరియు క్రీస్తు కొలోస్సియం పార్తేనాన్ పతనానికి పైగా నిలిచాడు.

"అతిశయించు వాడు, ప్రభువు నందే అతిశయింపవలెను" (I కొరిందీయులకు 1:31).

అలెగ్జే మోనోస్ అతని దేవుడు ఆరాధించాడు. మరియు బైబిలు ప్రవచనంలో కెరటాలు గర్జిస్తాయి, భూమి కంపిస్తుంది, చంద్రుడు రక్తంగా మారును, భవనాలు గుట్టలు పర్వతాలు విరిగి పడిపోతాయి. ఈలోక రాజ్యాలు కరిగి పోతాయి. మనష్యులు భయంతో కొండ చరియలలో దాక్కొంటారు. అవన్నీ తప్పు. ఆ బాలుడు సరి. "అలెగ్జే మోనోస్ నమ్మకస్తుడు." అతని దేవుని నీవు నమ్ముతావా? యేసును నమ్ముతావా, ఆయన ప్రశస్త రక్తము ద్వారా నీ పాపాలన్నీ కడుగుకుంటావా? నీవలా చేస్తావని నా ప్రార్ధన. ఆయన నామంలో ప్రార్శిస్తున్నాము, ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి – rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రుదోం: I కొరిందీయులకు 1:26-31.
ప్రసంగము ముందు పాట బెంజిమిన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్:
"అద్భుత మాధుర్యత ఆశీనమై ఉంది" (సామ్యుల్ స్టెన్నెట్ చే, 1727-1795).
“Majestic Sweetness Sits Enthroned” (by Samuel Stennett, 1727-1795).