Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




అధ్యక్షుడు రీగన్ తల్లి –
తల్లుల దినము ప్రసంగము

PRESIDENT REAGAN’S MOTHER –
A MOTHER’S DAY SERMON
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము ఉదయము, మే 10, 2015
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, May 10, 2015


దయచేసి మీ బైబిలులో నిర్గమ కాండము, రెండవ అధ్యయము, రెండవ వచనము తెరవండి. స్కోఫీల్ద్ స్టడీ బైబిలులో 72 వ పేజి. లేచి ఈ వచనము గట్టిగా చదువుదాం.

"ఆ స్త్రీ గర్భవతియై, కుమారుని కని: వాడు సుందరుడై యుండుట చూచి, మూడు దినములు వానిని దాచెను" (నిర్గమ కాండము 2:2).

కూర్చోండి.

ఇది మోషే జననమును గూర్చిన వివరణ. మోషే తల్లి హెబ్రీయురాలు పేరు మోచెచెదు. ఐగుప్తు ఫరో హెబ్రీ మగ బిడ్డలు నదిలో పార వేయబడాలని ఆజ్ఞాపించినప్పుడు, మోషే తల్లి మోచెచెదు మూడు నెలలు దాచింది. దాయలేనప్పుడు, ఆమె చిన్న జమ్మూ పెట్టెలో, బాలుని పెట్టి, నది వడ్డున దాని నుంచగా, ఫరో కుమార్తె స్నానము చేయుటకు వచ్చెను. మోచెచెదుకు ఒకే నిరీక్షణ ఫరో కుమార్తె అతని రక్షించే అవకాశము ఉందని. ఆమె గట్టిగా ప్రార్ధించి ఉంటుంది జమ్మూ పెట్టెలో ఉంచి నదిలో అది ఫరో కుమార్తె స్నానము చేసే స్థలానికి వెళ్ళడం చూస్తూ ఉంది. దేవుడు ఆమె ప్రార్ధనలకు జవాబిచ్చాడు ఫరో కుమార్తె ఆ బాలుని తీసుకొని "అతనిపై కనికరము చూపెను" (నిర్గమ కాండము 2:6).

దేవుని ఏర్పాటులో ఫరో కుమార్తె తన పని కత్తెలతో బాలుని చూసుకోవడానికి హెబ్రీ స్త్రీ గురించి వెతికించింది. నిజ తల్లియైన యోచెచెదునే, వారు అతని చూసుకోవడానికి, తెచ్చారు. పది పన్నెండు సంవత్సరాల వరకు యోచెచెదు మోషేను చూసుకుంది. తరువాత ఫరో కుమార్తె కొడుకుగా ఐగుప్తీయునిగా పెంచబడెను.

"మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించెను" (అపొస్తలుల కార్యములు 7:22).

ఫరో ఆ స్థానంలో మోషే పెంచబడ్డాడు. అతడు ఐగుప్తీయుల విగ్రహారాధనను గూర్చి అన్యమతాలను నేర్చుకున్నాడు. ప్రతి ఒక్కడు అతడు ఐగుప్తీయుడనుకున్నారు. కాని అతని హృదయములో మోషే దేవుని ఎరుగును, ఎందుకంటే తన అసలు తల్లి, యోచెచెదు, అతనికి దేవుని గూర్చి హెబ్రీయ స్వాస్థ్యమును గూర్చి బాలునిగా ఉన్నప్పుడు చెప్పింది.

యోచెచెదు ప్రభావము తన కుమారునిపై ఐగుప్తు ఫరో ప్రభావము కంటే ఎక్కువగా ఉంది. ఆమె ప్రభావము "ఐగుప్తీయుల సకల జ్ఞానము" కంటే ఎక్కువగా ఉంది (అపోస్తలుల కార్యములు 7:22). మోషే పెద్దవాడైనప్పుడు బైబిలు చెప్తుంది అతడు ఐగుప్త మతాలను తిరస్కరించి తన తల్లి యొక్క దేవుని వెంబడించాడు. బైబిలు చెప్తుంది,

"మోషే పెద్దవాడైనప్పుడు, ఫరో కుమార్తె కుమారుడనని, అనిపించు కొనుటకు తిరస్కరించి; అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యూచించెను...విశ్వాసమును బట్టి, అతడు అదృష్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి కలవాడై: రాజా గ్రహమునకు భయపడక, ఐగుప్తును విడిచిపోయెను" (హెబ్రీయులకు 11:24, 25, 27).

మోషే తల్లి విశ్వాసముతో ఎంతగా ప్రభావితము చెందాడంటే, ఐశ్వర్యము అధికారము ఐగుప్తు విజ్ఞానము తన తల్లి దేవుని వెంబడించకుండా ఆపలేక పోయాయి.

భయభక్తులు గల తల్లులు చరిత్ర అంతటిలో వారి పిల్లలను గొప్పగా ప్రభావితము చేసారు. అధ్యక్షుడు తిమోడోర్ రోస్ వెళ్ళు అన్నాడు,

మంచి తల్లి, జ్ఞానవంతురాలు, సమర్దురాల కంటే సమాజానికి చాలా ప్రాముఖ్యము; ఆమె నడవడి గౌరవింపదగినది సమాజానికి ప్రయోజనకరము ఏ ఇతర వ్యక్తి నడవడికంటే, ఆ వ్యక్తి ఎంత విజయవంతులైనా.

అధ్యక్షుడు ధిమోడోర్ రోస్ వెల్ సరియేనా? అవుననుకుంటున్నాను. యోచెచెదు జీవితమూ అది చూపిస్తుంది. ఆమె కొడుకు మూషే చరిత్రలోనే గొప్ప దైవజనునిగా నిలిచిపోయాడు. ఐగుప్తు బానిసత్వమును అతడు హెబ్రీయులను నడిపించాడు. అన్య విగ్రహారాధన మధ్య కూడ, ఐగుప్తు స్థావరంలో, మోషే భక్తురాలైన తన తల్లి నుండి నేచుకున్నది మర్చిపోలేదు.

మన సమయంలో అది వాస్తవమేనా? అవును, సరియే. నెల్లీ రీగన్ కంటే గొప్ప దృష్టాంతము నేను ఆలోచించ లేను – ఆమె కుమారుడు, రోనాల్డ్ విల్సన్ రీగన్, సంయుక్త రాష్ట్రాల నలభైవ అధ్యక్షుడు.

రోనాల్డ్ రీగన్ 1911 లో ఇల్లినోయిస్ లో, టెంపికో చిన్న పట్టణంలో, జాక్ నెల్లీ రీగన్ లకు రెండవ కుమారునిగా జన్మించాడు. రోనాల్డ్ రీగన్ కు తన తండ్రి "డచ్" అనే ముద్దుపేరు పెట్టాడు. ఆ పేరు నిలిచింది, సన్నిహిత స్నేహితులు ఇప్పటికి కూడా తరుచు అధ్యక్షుని "డచ్" అని పిలుస్తారు. కాని డచ్ తండ్రి నామకార్ధ కేథలిక్ మరియు త్రాగుబోతు. అతని తల్లి, నెల్లీ, ప్రొటెస్టెంట్ విశ్వాసాన్ని గట్టిగా నమ్ముకుంది.

జాక్ రీగన్ మెరుగైన పనికోరకు తన కుటుంబాన్ని ఇటు అటు తిప్పేవాడు. చివరకు వారు చిన్న పట్టణము టెంపికో నుండి ఇల్లినాయిస్, డిక్సన్ కు, వెళ్ళారు అక్కడ అద్దె ఇళ్ళలో ఉన్నారు. ఒక పొరుగు వారు అన్నాడు, "వారు నిరుపేదలు."

చాల స్థలాలు తిరగడం వలన "డచ్" సిగ్గు, ఒంటరి తనమునకు లోనయ్యాడు. బాలునిగా, డచ్ అన్నాడు "స్నేహితులను చేసుకోవడంలో ఆలస్యము. కొన్నిసార్లు ప్రజలతో సన్నిహితంగా ఉండకపోవడం నన్ను వదిలిపెట్టలేదు." నా కుటుంబంలో తనను ఆఫీసులో కలిసినప్పుడు, అతనిలో బిడియము చూసాను. అధ్యక్షునిగా కనబడనియ్యలేదు. నా పిల్లల, భార్య ఫోటోలు, అధ్యక్షుడు రీగన్ తో రెండవ అతస్తులో, గుడి గోడపై ఉంటాయి.

ఇప్పుడు నేను నేరుగా దేవుడు రోనాల్డ్ రీగన్ నుండి చెప్పబోతున్నాను, డాక్టర్ పాల్ కెన్ గొర్ (హార్పర్ కోలిన్స్ పబ్లిషర్స్, 2004). చాలా పేరాలు చెప్పను.

[రొనాల్డ్ రీగన్] ఒంటరి బాలునిగా దేవుని సంధించాడు...[తండ్రి] విఫలత డచ్ దేవుని వైపు తిరిగేలా చేయడానికి దోహద పడింది...రీగన్ పదకొండవ పుట్టిన రోజు తరువాత...కాళీ ఇంటికి వచ్చేటప్పుడు. దానికి బదులు, ఇంటి ముందు తలుపు, [తనతండ్రి] దృశ్యము ఇంటి ముందు, మంచులో పడి, వెల్లకిలా, కూరుకుపోయాడు. "అతడు త్రాగి ఉన్నాడు," కొడుకు గుర్తు చేసుకున్నాడు. "లోకానికి చనిపోయాడు."

డచ్ [తన తండ్రి] చేతి కోటును పట్టి తలుపు వైపు లాగాడు. ఇంటిలోనికి పడక గదిలోనికి లాగాడు... అది విషాద ఘడియ. డచ్ కు కోపము లేదు, భాద లేదు, కాని దుఃఖము...ఆయన లోకము అయోమయం – మళ్ళీ...అతడు 11 సంవత్సరాల వాడు.

ఆ సంఘటన యవ్వన రీగన్ ఆత్మీయ అభివృద్ధి క్లిష్ట సమయంలో జరిగింది. నాలుగు నెలల తరువాత బాప్మిస్మము పొంది, సంఘ సభ్యునిగా జీవితం ప్రారంభించాడు. మంచులో పడిన తన తండ్రిని గూర్చిన తలంపు ఆ రోజులానే, జీవితమంతా మెదులుతూ ఉంది.

[ఆసమయంలో, అతని తల్లి] రొనాల్డ్ రీగన్ క్రైస్తవుడు అవడంలో ప్రముఖ వ్యక్తి అయింది.

ఆత్మ కధానికులు సామాన్యంగా డిక్సన్ లో నెల్లె విశ్వాసమును గూర్చి మొదలెడతారు, కాని టెంపిక్ గుడిలో తన పాత్ర గమనింపదగినది. ఆఖరి నెలలో [అతని తండ్రి] కుటుంబాన్ని కదిల్చే ముందు, గుడిలో నెల్లె చాల చురుకుగా ఉండేవారు... 1910 ఉజ్జీవముతో దరిచేర్చబడి, ఒక మూలము చెప్తుంది నెల్లె ఒంటరిగా కాపరి రహిత సంఘాన్ని నడిపేవారని, కధానికలు వ్రాస్తూ, ఆదివారము కార్యక్రమాలు తయారు చెయ్యడం, కష్టపడుతున్న గుడిని బలపర్చమని సంఘాన్ని కోరడం, బోధించడం...డిక్సన్ కు వెళ్ళాక కూడా, నెల్లె టెంపిక్ కు తరుచు వెళ్లి పాత సంఘానికి సహాయ పడేవారు, డచ్ తో పాటు.

[తరువాత రీగన్ తల్లి డిక్సన్ గుడిలో చేరారు]. [సంఘము] మొదట వైయంసిఎ (YMCA) బేస్మెంట్ కలుసుకునే వారు భవన నిర్మాణానికి నిధులు సేకరించే వరకు. నూతన గుడి...జూన్ 18, 1922 న తెరువబడింది.

నెల్లె [రీగన్] నాయకురాలయ్యారు, ఒక స్తంభాముగా, స్థానిక సంఘములో. పరిచారకుని ప్రక్క, ఎక్కువ కనిపించే ముఖము ఆమె...నెల్లె [సబ్బాతు బడి] తరగతి అతి పెద్దది. 1922 డైరక్టరీలో ఆమె తరగతిలో ముప్పై ఒక్క మంది విద్యార్ధులు; పాస్టరు తరగతిలో కేవలం ఐదుగురు, ఆయన భార్య తరగతిలో తొమ్మిది.

నెల్లె మత పఠనాలు, గుడి బయట లోపల చేసేవారు – ఆమెకు దాని కొరకు గొప్ప గిరాకి ఉండేది. మంచి స్వరము కలిగి సహజ నమ్మకము కలిగి – ఆ లక్షణాలు తన కుమారునికి అందించారు – చాల నాటికలలో నటించారు...జూన్ 1926 న, బాప్టిస్టు సంఘములో ఇల్లు ఏర్పరుచు కున్నారు పేరు "విశ్వాసపు ఓడ."

...నెల్లె "ఆర్మీ స్తీస్ రోజు పాట" 1926 లో...ప్రచురించారు, దానిలో ఆమె గట్టిగా చెప్పారు "మనం మర్చిపోవడం దేవుడు తప్పించు గాక" [I ప్రపంచ యుద్ధములో] ప్రాణాలర్పించిన సైనికులు. ఆ ధైర్యశీలులు, నెల్లె వ్రాసారు, "ప్రజాస్వామ్యాన్ని లోకానికి జయించారు, క్రూర నియంతృత్వాన్ని ఎన్నటికి పడగొట్టారు"... 1927 లో, నెల్లె అమెరికా లెజియన్ లో దర్శనమిచ్చారు "చక్కనిమాట" గా వర్ణింపబడింది జార్జి వాషింగ్ టన్ బాల్యముపై – ఆ కథ [తన చిన్న కుమారునిపై] ముద్రవేసి ఉంటుంది.

ప్రార్ధనా శక్తిలో గట్టి విశ్వసిగా ఉండి, గుడిలో ప్రార్ధనా కూటము నడిపారు. సేవకుడు సెలవులో వెళ్ళినప్పుడు...వారపు మధ్య ప్రార్ధనలకు ఆమె బాధ్యురాలుగా ఉండేవారు, ప్రార్ధనపై చర్చలు నడిపారు...నెల్లె "నాయకురాలుగా" [కూడా] భాద్యత వచించారు, "ఇంటి ప్రార్ధనా సేవలు" అందిస్తూ.

[ఇది శ్రీమతి మిల్ ద్రేడ్ నీర్ సాక్ష్యము తన కుమార్తెను గూర్చి, నెల్లె రీగన్ ప్రార్ధనను గూర్చి. ఆ అమ్మాయి తినలేని నిద్రపోలేని అంత జబ్బు పడింది. తల్లి గుడికి వెళ్ళింది. ఆమె ఇలా అన్నారు]:

         ఆరాధన ముగిసాక, నా స్థలము విడిచి పెట్టలేక పోయాను. అందరు వెళ్ళిపోయారు శ్రీమతి రీగన్ తప్ప...
         నేననుకున్నాను, "శ్రీమతి రీగన్ తో మాట్లాడ గలిగితే," ఆమె దగ్గరకు వెళ్ళాను... మా కుమార్తెను గూర్చి ఆమెకు చెప్పాను, ఆమె అన్నారు, "వెనుక గదిలోనికి వెళ్ళాము." వెళ్ళాము. అప్పుడు శ్రీమతి రీగన్ అన్నాడు, "మోకాళ్ళపై ఆ విషయమై ప్రార్ధన చేద్దాం." ఆమె అద్భుత ప్రార్ధన చేసారు [మేము లేచాము] ప్రార్ధనకు జవాబు వచ్చినట్టు అనిపించింది. నేను ఇంటికి వెళ్ళాను. త్వరలో ఎవరో తలుపు తట్టారు. శ్రీమతి రీగన్ గారు. మధ్యాహ్నమంతా [ప్రార్ధనలో] మాతో గడిపారు. ఆరు గంటలకు వెళ్ళారు. కొన్ని క్షణాల తరువాత [కుమార్తె] పై ఉన్న బాధ తొలగిపోయింది. మరుసటి ఉదయము డాక్టర్ అన్నాడు, "నేను వైద్యము చేయనక్కర లేదు." దేవుడు నెల్లె రీగన్ ప్రార్ధన విని జవాబు ఇచ్చాడు.

ఇంకొక సభ్యుడు ఇలా గుర్తు చేసుకున్నాడు:

...ఆమె చేతులుంచడం లాంటి పనులు చెయ్యలేదు. ఆమె ప్రార్ధన విధానము, మోకాళ్ళపై, కళ్ళు ఎత్తి దేవుడు వ్యక్తిగతంగా తెలుసు అన్నట్టు మాట్లాడడం, మునుపు ఎన్నో వ్యవహారాలూ ఆయనతో ఉన్నట్టు. నిజంగా శ్రమ అనారోగ్యము ఉండే, నెల్లె వారింటికి వెళ్లి మొకాల్లని ప్రార్ధించే వారు...ఆమె వెళ్ళాక అందరికి మంచిగా అనిపించేది.

...అది ఆశ్చర్యము పెద్దవానిగా కూడా నెల్లె కుమారుడు ప్రార్ధనా శక్తిని ఎంతో బలంగా నమ్మేవాడు.

నెల్లె రీగన్ "పేద నిశ్శహాయులకు" తన జీవితాన్ని అంకితము చేసారు. తన తల్లితో మరణశయ్యపై ఒక వాగ్దానము చేసారు...కటకటాల వెనకున్న వారికి ప్రత్యేక శ్రద్ధ ఇచ్చారు...ఆమె [తరుచు] జైలుకు నమ్మకంగా వెళ్లి బైబిలు చదివేవారు...కథనాలు ఉన్నాయి నేరస్థులు ఆమె పరిచర్య కారణంగా నడవడిలో మార్పు వచ్చింది – నేర చట్ట సమక్షంలో.

[ఒక యవనస్థుడు నెల్లెతో చెరసాలలో మాట్లాడాడు. తరువాత, అతడు బయటికి వచ్చాక, తుపాకి గురి పెట్టి డ్రైవరును దోచుకొన పథకము వేసాడు. కారు నుండి బయటికి వచ్చాక, అతడు అన్నాడు] "వస్తాను, స్వారీకి ధన్యవాదాలు" ... "వెనుక సీటులో తుపాకి కనుగొంటారు. నేను వాడతాను, కాని చెరసాలలో స్త్రీతో మాట్లాడుతున్నాను..." నెల్లె రీగన్ నేర భరిత జీవితాన్ని వదలాలని ప్రాదేయపడ్డారు.

1924 వేసవిలో, న్యూయార్క్ పట్టణంలో రష్యన్ గుడి నిర్మాణానికి నిధులు సమకూర్చ సహాయపడ్డారు, రష్యా క్రైస్తవులతో [కమ్యునిజం క్రింద] మద్దతు ప్రకటించే క్రియ.

1927 ఏప్రిల్ లో...ఆమె జపాన్ పై చర్చించి అచ్చటి క్రైస్తవ స్థితిని గూర్చి మాట్లాడారు.

నెల్లె రీగన్ దేవుని కొరకు హృదయము కలిగిన వారు, ఆ విశ్వాసాన్ని తన కుమారుడు రొనాల్డ్ కు ఇవ్వడానికి శ్రేష్టమైనదంతా చేసారు. ఆమె ప్రార్ధన ఒకరోజు ఆ విశ్వాసము లోకానికి చూపించబడింది.

జూలై 21, 1992 లో, గుడి ప్రారంభమైన మూడు రోజులకు...డచ్, తన సహోదరుడు నీల్, మిగిలిన ఇరవై ముగ్గురు కొత్త గుడిలో మొదటిగా బాప్మిస్మము పొందారు. బాప్మిస్మము పొందాలన్నది రోనాల్డ్ రీగన్ స్వంత అభిప్రాయము. అతడు అన్నాడు "క్రీస్తుతో తనకు వ్యక్తిగత అనుభవము ఉందని."

పెద్దవనిగా, [అధ్యక్షుడు] రీగన్ బైబిలు తన అభిమాన పుస్తకమని చెప్పేవాడు, మరియు "ఎన్నడు వ్రాయబడని గొప్ప సందేశము." అందులోని మాటలు దైవిక మూలము కలిగి ప్రేరణ ఇస్తాయి "తనకు ఎలాంటి సందేహము లేదు."

బాప్మిస్మము పొందిన తరువాత [రొనాల్డ్] రీగన్ [సంఘములో] చురుకైన సభ్యునిగా మారాడు. [రీగన్, అతని తల్లి, తన సహోదరుడు ప్రతి ఆదివారము అదే పని చేసేవారు. అతని సహోదరుడు ఆరాధన జరిగించే వారు]. "సబ్బాతు బడి ఆదివారము ఉదయము, ఉదయపు ఆదివారపు గుడి, క్రైస్తవ యత్నము ఆదివారము సాయంకాలము, క్రైస్తవ యత్నము తరువాత, గుడి మరియు బుధవారములు ప్రార్ధనా కూటములు"... పదిహేనవ ఏట, డచ్ సబ్బాతు బడి తరగతిలో బోధింప ఆరంభించాడు... "ఆ బాలుర మధ్య నాయకుడయ్యాడు," చిన్న నాటి స్నేహితుడు సావిలా పామర అన్నాడు. "వారు అతని వైపు చూసే వారు."

రొనాల్డ్ రీగన్ క్రైస్తవ కళాశాల హాజరయ్యేవాడు. 1981 లో అమెరికా సంయుక్త రాష్ట్రాలకు అద్యక్షుడయ్యాడు. అధ్యక్ష పదవికి ప్రమాణము చేసాడు అతని తల్లి బైబిలుపై చేతులుంచి, అన్నాడు, "కనుక నాకు సహాయము చెయ్యండి దేవా."

అధ్యక్షునిగా, రొనాల్డ్ రీగన్ బైబిలు ఆధారంగా గర్భ స్రావాలు వ్యతిరేకించాడు. అతడు అన్నాడు,

నేను నమ్ముతాను అమెరికా గుణ శీలతకు ఏ సవాలు అంత ప్రాముఖ్యము కాదు మానవులందరికీ జీవించే హక్కు పునరుద్ధరించడమును మించి. ఆ హక్కు లేకుండా, వేరే హక్కులకు అర్ధము ఉండదు. "చిన్న పిల్లలను నా యొద్దకు రాకుండా, ఆటంక పరచవద్దు, అలాంటి వారిదే పరలోక రాజ్యము."

1986 లో ఐక్య రాజ్య కూడలిలో, అతడు అన్నాడు,

ఈ రోజు మన జాతీయ మనస్సాక్షిలో ఒక గాయము ఉంది. అమెరికా పరిపూర్ణము కాదు దేవునిచే పుట్టబోయే వారికి జీవించే హక్కు ప్రాప్తించనంతకాలము.

గర్భస్రావము ఒక నైతిక సమస్య అధ్యక్షునిగా రాజీ పడడానికి నిరాకరించాడు.

అధ్యక్షుడు రీగన్ పదవిలో ఉన్నంత కాలము దేవుడు లేని కమ్యునిజంను వ్యతిరేకించాడు. అతడు సోవియట్ యూనియన్ ను "దుష్ట సామ్రాజ్యము" అని పిలిచాడు. అతడు అన్నాడు, బెడ్ లిన్ వాల్ లో తన గొప్ప ప్రసంగములో, "గోర్బో చౌద్, ఈ గోడను పడగొట్టు." అతడు నమ్మాడు కమ్యునిజం నాస్తికత్వము పూర్తిగా దుష్టమైనదని. అతడు సైన్యాన్ని గొప్పగా చేసాడు సోవియట్ యూనియన్ సరిసమానము కావాలి, తద్వారా అది కూలిపోతుంది. అలానే కూలింది, అతడు అనుకున్నట్లుగా. వేరే వ్యక్తుల కంటే, రొనాల్డ్ రీగన్ "దుష్ట సామ్రాజ్యము" ముగింపుకు భాధ్యుడు, కమ్యునిజం ప్రపంచమంతా వ్యాపించే దాని అంతానికి కూడా. అతని ఆత్మ కథ రచయితా ఎడ్మండ్ మోరిస్ అన్నాడు, "మాస్కోలో అతడు క్రైస్తవ్యము కావాలనుకున్నాడు, అది అంత స్వల్ప విషయము." అతని ప్రార్ధన నిజమవడానికి అది చూడడానికి రొనాల్డ్ రీగన్ జీవించాడు.

ఈ తల్లుల దినాన, తల్లులారా ఈ గుడి నుండి, మోషే తల్లి యోచేబెదును స్పూర్తిగా తీసుకొని – నలభైవ అధ్యక్షుడు తల్లి నెల్లె రీగన్, కూడా వెళ్ళాలి. మీరు తెలుసుకోవాలి క్రీస్తు మీ స్థానంలో చనిపోయాడు, నీ పాపాల నిమిత్తము, సిలువపై. మీరు తెలుసుకోవాలి యేసు రక్తము మీ పాపలన్నిటిని కడుగును. మీరు తెలుసుకోవాలి యేసు మృతులలో నుండి శరీరుడిగా లేచి దేవుని కుడి పార్శ్వమున ఆశీనుడైయున్నాడు. మీరు యేసు నొద్దకు వచ్చి పూర్తిగా ఆయనను నమ్మాలి. ప్రతి ఆదివారము గుడిలో ఉండేటట్టు చూసుకోండి. కచ్చితత్వము కలిగి యుండిడి మీరు మీ పిల్లలపై ఆత్మీయ ముద్ర వేయాలి యేసు క్రీస్తు కొరకు జీవించునట్లు. దేవుడు మిమ్ములను దీవించును గాక. ఆమెన్.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రుదోం: హెబ్రీయులకు11:23-27.
ప్రసంగము ముందు పాట బెంజిమిన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్:
"నేను ఆయనను స్తుతిస్తాను" (మార్గరెట్ జె.హేరిస్ చే, 1865-1919)
“I Will Praise Him” (by Margaret J. Harris, 1865-1919).