Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
స్వధర్మ కాలములో జీవించుట

LIVING IN A TIME OF APOSTASY
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము సాయంకాలము, ఏప్రిల్ 26, 2015
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, April 26, 2015

"[దేవుడు] ఆయన పూర్వ కాలమందున్న లోకమును విడిచి పెట్టక, నీతిని ప్రకటించిన నోవాహును మరి ఏడుగురిని కాపాడెను, భక్తిహీనుల సమూహము మీదికి, జల ప్రలయమును రప్పించినప్పుడు; మరియు ఆయన సొదొమొ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి, ముందుకు భక్తిహీనులగు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించాడు; దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత, బహుబాధపడిన నీతిమంతుడగు లోతును రప్పించెను: (ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి, తానూ చూచిన వాటిని బట్టియు వినిన వాటిని బట్టియు, వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము తన నీతిగల తన మనస్సును నొప్పించు కొనుచు వచ్చెను;)" (II పేతురు 2:5-8).


ఈ అధ్యాయంలో అపోస్తలుడైన పేతురు ప్రవక్త వలే మాట్లాడాడు. 1-3 వచనాలలో, అతడు చెప్తాడు అబద్ధపు బోధకులు వచ్చి భిన్నాభిప్రాయాలు తీసుకొని వస్తారని. ఆయన చెప్తాడు ప్రభువైన యేసు క్రీస్తును వారు కాదంటారని. వారిని అనేకులు వెంబడిస్తారు. తద్వారా బైబిలు క్రైస్తవ్యపు సత్యము చెడుగా చెప్పబడుతుంది. ఆయన అంటాడు ఈ అబద్ధపు బోధకులు దేవుని కొరకు కాదు, డబ్బు కొరకు పని చేస్తారు. అది మన రోజులకు చెందిన చిత్రము! ప్రస్తుతము మనము భయంకర స్వధర్మతలోను, తప్పుడు బోధలోను – దేవతల పెరుగుదల దినాలలో ఉన్నాము.

నాకు కార్ల్ హెచ్. హెన్రీ (1913-2003) ఇష్టము లేదని ఒప్పుకుంటున్నాను. అతడు కొత్త సువార్తిక వేదాంతి. నాకనిపిస్తుంది అతడు ఎంత "వేదాంతో" నిరూపింప ప్రయత్నిస్తుంటాడు. నా ఉద్దేశములో అతడు సత్యాన్ని గట్టిగా ప్రకటించడు. అయిననూ అతడు స్వధర్మతను గూర్చి తేటగా వ్రాసినట్టు ఎవరినీ చూడలేదు. డాక్టర్ హెన్రీ అన్నాడు,

         మన తరము దేవుని సత్యాన్ని కోల్పోయింది...దేవత తత్వముకు ఇది ఎక్కువగా దోహదపడుతుంది. క్రూరులు విజ్రంబిస్తారు; మన దినాలలో వారి విజ్రుంబణ కనిపిస్తుంది [మద్య తూర్పులో, ఉత్తర ఆఫ్రికాలో, యూరపు అంతటిలో – ముస్లీములు వస్తున్నారు. వైట్ హౌస్ నుండి మన నాయకుల వరకు అంతా తికమక, బలహీనులు దేవుడు లేనివారు]...
         క్రూరులు నాగరికతలో విజ్రంబించి నిర్జీవ సంఘ నీడలో కొట్టు మిట్టాడుచున్నారు (Carl F. H. Henry, Ph.D., Twilight of a Great Civilization: The Drift Toward Neo-Paganism, Crossway Books, 1988; my comments in brackets).

ప్రసిద్ధ పోల్ స్టర్ జార్జి బర్నా చెప్పాడు, ప్రభావంతో, మన సంఘాలకు భవిష్యత్తు లేదని. 80% యవనస్తులు సంఘాలు విడిచి, "తిరిగిరారని" – ముఫై సంవత్సరాలు రాకముందే. మన సంఘాలకు లోకము నుండి నశించుచున్న యవనస్థులను మార్చడం తెలియదు! వారు ప్రయత్నించేదంతా వారి సంఘాలు వదిలి వారితో పాటు వెళ్ళాలని. బోధకులు టైలు తొలగించి ఆదివారపు ఆరాధనలలోనికి రాక్ సంగీతాన్ని తీసుకొస్తున్నారు "నెమ్మదిగా" "తగ్గట్టుగా" ఉండడానికి. అది పని చెయ్యడానికి ఈ పాటికి తెలిసి ఉంటుంది! నశించు లోకము వారిని చూచి నవ్వుతుంది! అది విషాదము! దేవునికి తెలుసు మన సంఘాల కోసం నేను ఎంతగా ఏడ్చుస్తానో!

మన బోధకులు పుల్లర్ సెమినరీ లాంటి స్వతంత్ర పాఠశాలల ద్వారా నశించి పోతున్నారు. చాల మంది మధ్యలో వారి శక్తి హీనులై పోతున్నారు నేర్పుతున్న పాఠశాలల ద్వారా గ్రీకు పదం పట్టుకుంటారు, బోధింప ప్రభావితులవరు. డాక్టర్ మైకల్ హర్తన్ రాసాడు ఈ విషాదాన్ని గూర్చి. అతని పుస్తకము పేరు, క్రీస్తు లేని క్రైస్తవ్యము: అమెరికా సంఘపు మరియొక సువార్త (బేకర్ బుక్స్, 2008). మూడి ప్రెస్ (1996)లో ఒక పుస్తకము ప్రచురించింది రాబోవు సువార్తిక క్రిస్టత. పంతొమ్మిది సంవత్సరాల క్రితం ఈ పుస్తకం రాయబడింది. క్లిష్టత ఇంకా, ఇక్కడే ఉంది! మన సంఘాలు గందర గోళంలో ఉన్నాయి, ప్రతి ఒక్కరికి తెలుసు! మన అన్ని సంఘాలలో ఆదివారం సాయంత్రపు ఆరాధనలు మూతపడ్డాయి. ఇది మరణానికి గుర్తు! చాల కాలం క్రితమే ప్రార్ధన కూటాలు ఆపబడ్డాయి. అది మరణానికి గుర్తు! ఈరోజు ఏ సంఘము కూడా ఆత్మల రక్షణ తృష్ట కలిగి లేదు. అది మరణానికి గుర్తు! "బోధ" అంతా వచనము వెంబడి వచనము బైబిలు పఠనము. ఇది మరణానికి గుర్తు! ఎవ్వరు ఫిర్యాదు చెయ్యరు – నేను చేస్తాను! ఎవ్వరు చెప్పుకున్న, నేను చెప్తాను. అది గట్టిగా, తేటగా చెప్పబడాలి! లోతైన స్వధర్మత దినాలలో మనం జీవిస్తున్నాం! II పేతురు 2:1-3 లో వివరింపబడ్డ దినాలలో మనం జీవిస్తున్నాం!

మీరడగవచ్చు, "దాని గూర్చి ఎందుకు మాట్లాడాలి? మన యవనస్థులను తికమక పెడ్తుంది!" మళ్ళీ తప్పు! నిజం చెబితే తికమక ఉండదు! నిజానికి, ఈ వాస్తవాలు చెప్పకపోతే నిజంగా తికమక పడతారు –తికమక అవుతారు – కొత్త సువార్తికులతో, బైబిలు పఠన గుంపులతో! నిజంగా తికమక పడతారు మనం అవిశ్వాసపు లోతైన స్వధర్మత దినాలలో ఉన్నామని తెలియకపోతే – ఇది భయంకర స్వధర్మత సంస్కరణము తరువాత! గత 500 సంవత్సరాలలో లోతైన స్వధర్మత! అది అంతే! అపోస్తలుడైన పేతురు, II పేతురు 2:1-3 దినాలలో మనం ఉన్నాము. కనుక, జవాబు ఏంటి? దయచేసి లేచి II పేతురు 2:5-8 చదవండి. 1318 వ పేజీలో ఉంది స్కోఫీల్ద్ స్టడీ బైబిలులో.

"మరియు ఆయన పూర్వ కాలమందున్న లోకమును విడిచి పెట్టక, నీతిని ప్రకటించిన నోవాహును మరి ఏడుగురిని కాపాడెను, భక్తిహీనుల సమూహము మీదికి, జల ప్రలయమును రప్పించినప్పుడు; మరియు ఆయన సొదొమొ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి, ముందుకు భక్తిహీనులగు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించాడు; దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత, బహుబాధపడిన నీతిమంతుడగు లోతును రప్పించెను: (ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి, తానూ చూచిన వాటిని బట్టియు వినిన వాటిని బట్టియు, వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము తన నీతిగల తన మనస్సును నొప్పించు కొనుచు వచ్చెను)" (II పేతురు 2:5-8).

కూర్చోండి.

మన పాఠ్యభాగము దేవునిచే ఇవ్వబడింది మనకు చూపించడానికి, స్వధర్మత పాపమూ, తికమకలో ఎలా జీవించాలో చెప్పడానికి. మన పాఠ్య భాగము విషయమిది. అపోస్తలుడైన పేతురు ఇద్దరు, నోవాహు లోతుల ఉదాహరణ ఇచ్చాడు. వీరిని గూర్చి చెప్పుచూ, క్రైస్తవులుగా ఆత్మీయ తికమకలో ఎలా జీవించాలో చూపించాడు. నోవాహు లోతుల నుండి గొప్ప పాఠము నేర్చుకోవాలి.

లోకాత్మలో ఎలాంటి స్వధర్మత కాలములో, క్రైస్తవుడు పరీక్షింప బడతాడు. మనం కొద్దిమందిమని మనం పరీక్షింపబడటం. ఇది కష్టతర శ్రమ. మనం 18 వ శతాబ్దంలో ఉంటే గొప్ప ఉజ్జీవంలో భాగమై ఉండే వారము, బ్రిటిష్ ఐల్స్ ఉత్తర అమెరికాలో వచ్చిన ఉజ్జీవము. మన చుట్టూ చాలామంది ఉండేవారు నిజ బోధలో నమ్మేవారు, నిజ మార్పిడిలో, నిజ ప్రార్ధనలో. 19 వ శతాబ్దములో కూడా అది వాస్తవమే – కొంత వరకు మొదటి 70 లేక 80 సంవత్సరాలలో 20 వ శతాబ్దంలో.

సమయం ఎంత త్వరగా వెళ్తుందో అది ఆశ్చర్యము. నా వయస్సులో 35 సవత్సరాలు తక్కువ. 35 సంవత్సరాల క్రితం పరిస్థితి వేరు. రోనార్డ్ రీగన్ అధ్యక్షుడు. బిల్లీ గ్రాహం 60 ప్రారంభంలో ఉన్నాడు, ఇంకా గొప్ప కూటాలు పెడుతున్నాడు. జెర్రీ పాల్ వెల్ ప్రతి ఆదివారం రాత్రి టివిలో వస్తాడు, మిలియనుల డాలర్లు వెచ్చించి, "నైతిక గుంపును" గర్భ నిరోధానికి వ్యతిరేకులుగా నడిపిస్తాడు. 1980 శీతాకాలంలో డాక్టర్ జాన్ ఆర్. రైస్ ఇంకా బోధిస్తున్నాడు. డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్ జోన్స్ బ్రతికే ఉన్నాడు. డాక్టర్ ప్రాన్సిస్ స్కోఫర్ కూడా. అది పరిపూర్ణ సమయము కాదు. 2015 తో పోలిస్తే అప్పటి క్రైస్తవులు మెరుగు. ఇప్పుడు మనము అసహ్య అల్ప సంఖ్యాకులం! అంటే – ప్రజలు మనలను అసహ్యించుకుంటారా! మనలను గూర్చి భయపడి అసహ్యించుకుంటారు! ప్రతి బాప్టిస్టు, ప్రతి సువార్తికుడు, ప్రతి పెంతే కోస్తూ వాడు, రోమన్ కేథలిక్ కూడ – క్రైస్తవ్యములో ఉండే ప్రతివాడు అలానే భావిస్తాడు. బయటి ప్రపంచం మనలను ద్వేషిస్తుంది. దేవుని పట్ల నమ్మకస్తులుగా ఉండడం కష్టం అనిపించేలా చేస్తుంది, కష్టతరము ఇతర శతాబ్దాలు సమయాలతో పోలిస్తే.

నిజంగా నోవాహు ఆపరీక్ష అనుభవించాడు – ఒంటరిగా నిలబడడం. మన పాఠ్యభాగము చెప్పబడింది దేవుడు "నోవాహును ఎనిమిదవ వ్యక్తిని రక్షించాడు" (II పేతురు 2:5). నోవహు భయంకర అవినీతి దినాలలో స్వధర్మతలో జీవించాడు గొప్ప జల ప్రళయం ముందు. అది బహు క్రూరత్వం గొప్ప దెయ్యపు కార్యకలాపాల దినములు. అది బహు చెడ్డది "మానవాళి దుష్టత్వములోనే ఉన్నాడు" (ఆదికాండము 6:5). దేవుడు అన్నాడు,

"నా ఆత్మ ఎల్లప్పుడూ నరులతో వాదించదు" (ఆదికాండము 6:3).

లోకములో ఆదినాలు బహు భయంకరము ఒక్కడు రక్షింపబడలేదు. గుర్తుంచుకొండి దేవుడు "ఎనిమిదవ వ్యక్తి నోవహును రక్షించాడు." అంటే నోవహు, అతని భార్య – అతని ముగ్గురు కుమారులు కోడళ్ళు రక్షింప బడ్డారు. మొత్తం ప్రపంచంలో ఎనిమిది మందే రక్షింపబడ్డారు! అలాంటి దుష్ట కాలంలో నోవహు ఎలా జీవించాడు జల ప్రలయపు తీర్పు దినాలలో.

తరువాత, లోతు ఉన్నాడు. మీరు ఆదికాండములో లోతును గూర్చి చదివేటప్పుడు పేతురు అతనిని "నీతిమంతుడైన లోతు" అని పిలుస్తాడు మన పాఠ్యభాగములో (II పేతురు 2:7). కాని పేతురు సొదొమెకు లోతువేల్లుటలో తప్పు పట్టడం లేదు. అపోస్తలుడు చెప్తున్నాడు లోతు ఎలా భావించాడో సొదొమొకు వెళ్ళిన తరువాత ఏమి చేసాడో. మన పాఠ్యభాగము చెప్తుంది. "దుష్టుల సంభాషణతో విసిగిపోయారు" (2:7బి). ఆదికాండము 19 లో చదివితే ఏ పట్టణము ఎలా ఉందో చూస్తారు – ఘోరత, అశ్లీలత, సిగ్గుమాలినది. ఈ దుష్ట పట్టణంలో లోతు అతని భార్య జీవించాడు.

నోవహు అతని కుటుంబము పరిస్థితిలోనే వీరు కూడా ఉన్నారు. ఆదికాండము 18 వ అధ్యాయములో మనం చదువుతాం దేవుడు సొదెమొను నాశనం చెయ్యడు పదిమంది నీతిమంతులు ఉంటే. కాని పదిమంది నీతిమంతులు కూడలేరు – లోతు అతని పిల్లలు. వారు మాత్రమే భక్తి జీవితాలు జీవిస్తున్నారు. ఆ పట్టణములో ప్రతి ఒక్కరు దేవుడు లేకుండా పాపానికి అప్పగింపబడ్డారు.

మనం చూస్తాం, నోవహు లోతుల నుండి, బహు కొద్దిమంది క్రైస్తవులలో మనం ఉండడం గొప్ప కష్టతర పరీక్ష. ఒక కుటుంబంలో ఒకడు క్రైస్తవునిగా జీవించడం చాల కష్టం. నాకు బాగా గుర్తుంది ఎంతమంది బంధువులు నన్ను అపహసించారో, అవమానించారో, క్రైస్తవునిగా జీవిస్తున్నందుకు పరిహసించారో. నీ పాఠశాలలో, నీ ఆఫీసులో, నీ కళాశాలలో, నీ ఇంటిలో, నీ ఒక్కడివే క్రైస్తవుడవయితే నీవు అదే పనిగా నిందింపబడతావు. నీవు మంచి క్రైస్తవునిగా ఉంటే అవివేకిగా పరిగణింప బడతావు. ఎంత మంచి క్రైస్తవుడవైతే, అంతగా నశించు లోకము నీకు వ్యతిరేకమవుతుంది. ఇది చాల కష్టతర పరీక్ష. చాల మంది యవనస్థులు విఫలమవుతారు. వారనుకుంటారు పాఠశాలలో కాని పనిలో గాని "స్నేహితులకు" బలి అయిపోవాలని. రెండు విషయాలు సంభవిస్తాయి నశించు లోకానికి "లొంగి పోయే వరకు."

1. వారు రక్షింపబడితే, వారి ఆనందము పోతుంది. నీవు లోకానికి స్నేహితునిగా ఉంటూ క్రీస్తు ఆనందాన్ని కలిగి యుండలేవు, వారు క్రీస్తు రాజ్యములో బహుమానాలు కోల్పోతారు.

2. నశించు లోకములో వారికి దగ్గర స్నేహితులుంటే, వారు అసలు మారనే లేదు. బైబిలు చెప్తుంది, "ఎవరు లోకానికి స్నేహితుడో వారు దేవునికి విరోధి" (యాకోబు 4:4).


డాక్టర్ జాన్ ఆర్. రైస్ అన్నాడు, "నీవు ఎప్పుడైనా వదులుకున్నావా...దేవుని కొరకు ఒక స్నేహితుని వదులుకున్నవా? నీ క్రైస్తవ్యము ఎన్నడు విలువైనది కాదు...ఒక స్నేహితుని...నీవు ప్రభువును నిజంగా ప్రేమిస్తున్నావని చెప్పగలవా? నిజ క్రైస్తవుడుగా ఉండాలంటే స్నేహితులను వదులుకోవాలి" (John R. Rice, D.D., What It Costs to Be a Good Christian, Sword of the Lord Publishers, 1952, p. 28). బైబిలు చెప్తుంది,

"దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక" (కీర్తనలు 1:1).

క్రైస్తవ చరిత్ర చూస్తేమీరు చూస్తారు గొప్ప క్రైస్తవ స్త్రీ పురుషులు లోకస్థుల నుండి వేరై పోయారు. ఉదాహరణకు, టర్ టుల్లియన్ తీసుకుందాం. అతడు ఏ.డి. 160 నుండి 220 మధ్య జీవించాడు. రోమీయులచే క్రైస్తవులు చంపబడడం అతడు చూసాడు. అతడు చూసాడు క్రైస్తవులు హింసింపబడి, తల తెగ గొట్టబడి ముక్కలుగా చీల్చి వేయబడడానికి సింహపు బోనులలో వేయబడడం. వారి ధైర్యము అతనికి నచ్చింది. అతడు అన్నాడు, "క్రైస్తవ్యములో ఒకటి ఉండాలి ప్రజలు అది చెయ్యాలి. జీవితాన్ని కూడా, ఇవ్వడానికి సిద్ధపడ్డారు." వారికి ఒకరి పట్ల ఒకరికున్న ప్రేమ అతనికి నచ్చింది. 35 సంవత్సరాల సమయంలో అతనికి అకస్మాత్తు, నిర్ణయింపబడ్డ, విప్లవాత్మక మార్పు క్రీస్తులో వచ్చింది. అతడు తృణీకరింపబడ్డ హింసింపబడ్డ క్రైస్తవులను సమర్ధించాడు. ఆదిమ సంఘములో ఉన్న తెగలపై పుస్తకాలు రాసాడు. చివరకు కేథలిక్ సంఘాన్ని విడిచి పెట్టాడు లోకమయిపోతుందని. మొదటిగా అతడు మేంటోనిష్టులతో వెళ్ళాడు, వారు ఆధునిక పెంతేకోస్తుల లాంటి వారు. చివరకు వారిని విడిచి స్వంత సంఘానికి కాపరిగా ఉన్నాడు. అలా అతడు మొదటి ప్రొటేస్టెంట్ అయ్యాడు. ఒక యవ్వన కొరియను తెలుసు అతడు టెర్ టుల్లియన్ శక్తి వంత ప్రసంగాలు చదివి మారాడు. యవనస్థులారా, టెర్ టుల్లియన్ లా ఉండండి! అతడు నోవహు లోతులా ఉన్నట్టు!

తరువాత గొప్ప పీటర్ వాల్డోను గూర్చి ఆలోచించండి. అతడు ప్రాన్స్ లో 1140 నుండి 1205 ఏ.డి. లో జీవించాడు. అతడు సంపన్న వ్యాపారి. ఒకరాత్రి అతని భోజనపు బల్లపై తన స్నేహితుడు చనిపోయాడు. అది పీటర్ వాల్డోను కదిలించింది, అతడు నిజ క్రైస్తవుడయ్యాడు. బోధింప నారంభించాడు, చాలామంది వెంబడించారు. అతడు బైబిలు పఠనము ఆత్మల రక్షణను నొక్కివక్కాణించాడు. అతని వెంబడించిన వారు వెల్దోనియన్లుగా పిలువబడ్డారు. కేథలిక్ సంఘముచే వెలివేయబడ్డాడు, కాని, అద్భుతంగా, చనిపోయే వరకు సువార్త ప్రకటించాడు. 300 సంవత్సరాల తరువాత వాల్డో అనుచరులు స్విజర్లాండ్, జెనేవాలో ప్రొటెస్టెంట్ లలో కలిసారు. యవనులారా, పీటర్ వాల్డోలా ఉండండి! అతడు నోవహు లోతులా ఉన్నట్టు!

తరువాత గొప్ప మిస్ లొట్టి మూన్ గూర్చి ఆలోచించండి. ఆమె 1840 నుండి 1912 వరకు జీవించాడు. 1873 లో చైనాకు బాప్టిస్టు మిసెనరీగా వెళ్లారు. అప్పటిలో చైనాలో భయంకర పరిస్థితి. ఆమె క్రాఫోర్డ్ టామ్ అనే పాత నిభందన అధ్యాపకునితో ప్రేమలో పడ్డారు. పెళ్ళికి నిశ్చితార్ధమైంది. కాని లొట్టి మూన్ గ్రహించింది అతడు బైబిలు ఎక్కువ నమ్మడని. ఆమె హృదయము పగిలింది, కాని నిశ్చితార్ధము రద్దు చేసుకుంది అతడు స్వతంత్ర అవిశ్వాసి అని. లొట్టి మూన్ చైనాలో ఉన్నారు. వివాహము చేసుకోలేదు. 1912 లో ఆమె అస్వస్థురాలయ్యారు ఆమె భోజనము ఇతర మిస్సనరీలకు చైనీయులకు ఇచ్చినందుకు. 50 పౌండ్లు బరువుకు తగ్గారు, తిరిగి అమెరికా వచ్చారు. దారిలోనే చనిపోయారు. ఇప్పుడు వరకు ఆమె సదరన్ బాప్టిస్టు కన్వెంక్షన్ లో గొప్ప మిసనరీగా పరిగణింపబడ్డారు. వారు ఇంకా ఆమెను గూర్చి ప్రతి ఏటా క్రిస్మస్ సమయంలో మాట్లాడుకుంటారు – వారు విదేశీ మిసెనరీలకు "లొట్టి మూన్ అర్పణ" తీసుకునేటప్పుడు. వారు చెప్పరు ఆమె అవిశ్వాసి అని నిశ్చితార్ధమైన వ్యక్తిని వదిలి పెట్టేసిందని. కాని దేవుడు గుర్తుంచుకుంటాడు! యవనస్థులారా, లొట్టి మూన్ లా ఉండండి! ఆమె నోవహు లోతులా ఉన్నట్టు!

"[దేవుడు] ఆయన పూర్వ కాలమందున్న లోకమును విడిచి పెట్టక, నీతిని ప్రకటించిన నోవాహును మరి ఏడుగురిని కాపాడెను, భక్తిహీనుల సమూహము మీదికి, జల ప్రలయమును రప్పించినప్పుడు; మరియు ఆయన సొదొమొ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి, ముందుకు భక్తిహీనులగు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించాడు; దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత, బహుబాధపడిన నీతిమంతుడగు లోతును రప్పించెను" (II పేతురు 2:5-7).

డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్-జోన్స్, గొప్ప బోధకుడు ఇరవై శతాబ్దంలో, అతడు ఒక ప్రసంగము చెప్పాడు ఈ పాఠ్యభగముపై II పేతురు లోనిది. డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ ప్రసంగాన్ని ఇలా ముగించాడు,

ఒక ప్రశ్నతో ముగిస్తాను. మనం నోవహు లోతులలో ఉన్నాము? ప్రపంచము ఆశ్చర్య రీతిగానే [ఆదినములలా] ఉంది. క్రైస్తవులమని చెప్పుకోవడం సులభం కాదా? మనం వేరుగా ఉన్నాము, వేరుగా నిలుస్తున్నమా?... నశించు వారి కొరకు మనకు దుఃఖము ఉందా? దాని గూర్చి ప్రార్ధించి నిజ ఉజ్జీవము త్వరగా రావాలని కోరుకుంటున్నామా? అది నోవహు లోతుల సవాలు ఆధునిక క్రైస్తవులకు (Martyn Lloyd-Jones, M.D., “The Example of Noah and Lot,” Expository Sermons on 2 Peter, The Banner of Truth Trust, 1983, p. 154).

దయచేసి నిలువబడి పాటల కాగితంలో 6 వ పాట పాడండి. పాడండి!

నా జీవితం, నా ప్రేమ నీకిస్తాను, నాకై మరణించిన దేవుని గొర్రె పిల్ల;
   నిత్యము నమ్మకంగా ఉండనిమ్ము, నా రక్షకా నా దేవా!
నాకై మరణించిన వానికి జీవిస్తాను, ఎంత తృప్తి నా జీవితానికి!
   నాకై మరణించిన వానికి జీవిస్తాను, నా రక్షకా నాదేవా!

నన్ను స్వీకరిస్తావని నేను ఇప్పుడు నమ్ముతున్నాను, నేను బ్రతుకునట్లు నీవు చనిపోయావు;
   ఇక మీదట నిన్ను విశ్వసిస్తాను, నా రక్షకా నా దేవా!
నాకై మరణించిన వానికి జీవిస్తాను, ఎంత తృప్తి నా జీవితానికి!
   నాకై మరణించిన వానికి జీవిస్తాను, నా రక్షకా నాదేవా!

కల్వరిపై నాకై మరణించావు, నా ఆత్మను రక్షించి నన్ను స్వతంత్రున్ని చెయ్యడానికి,
   నీకు నా జీవితాన్ని సమర్పిస్తాను, నా రక్షకా నాదేవా!
నాకై మరణించిన వానికి జీవిస్తాను, ఎంత తృప్తి నా జీవితానికి!
   నాకై మరణించిన వానికి జీవిస్తాను, నా రక్షకా నాదేవా!
("నేను ఆయన కొరకు జీవిస్తాను" రాల్ఫ్ యి. హాడ్ సన్, 1843-1901;
కాపరిచే మార్చబడినది).
      (“I’ll Live for Him” by Ralph E. Hudson, 1843-1901; altered by the Pastor).

పరలోకపు తండ్రీ, నీ కుమారుడైన యేసును కొందరు నమ్మాలని ఈ సాయంకాలము ప్రార్ధిస్తున్నాను, దేవుని కుమారుడు – సిలువపై ఆయన కార్చిన ప్రశస్త రక్తము ద్వారా వారి పాపాలన్నీ కడుగబడాలని. ఆయన నామములో ప్రార్ధిస్తున్నాము, ఆమెన్.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము డాక్టర్ క్రేగ్ టాన్ ఎల్. చాన్: II పేతురు 2:4-9.
ప్రసంగము ముందు పాట బెంజిమిన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్:
"ఈలాంటి సమయాలలో" (రూత్ కయే జోన్స్ చే, 1902-1972).
“In Times Like These” (by Ruth Caye Jones, 1902-1972).