Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
యేసు క్రీస్తే

JESUS CHRIST HIMSELF
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము సాయంకాలం, ఏప్రిల్ 12, 2015
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, April 12, 2015


నా భార్య ఇలియానాకు నాకు ఇది ఒక గొప్ప దినము. మా ఇద్దరి జన్మదినాలు ఈరోజు జరుపుకుంటున్నాము. ఈరోజు, ఏప్రిల్ 12, నా డెబ్భై నాల్గవ జన్మదినం. ఈ రోజే 1958 లో సేవ పిలుపు వచ్చి యాభై ఏడవ వార్షికోత్సవం. కాని, అన్నింటి కంటే, మన సంఘానికి ఇది గొప్పదినము. సరిగ్గా నలభై సంవత్సరాల క్రితం నేను ఈ సంఘాన్ని ప్రారంభించాను ఆరు ఏడు మంది యవనస్తులతో నా అపార్ట్ మెంటులో, వెస్ట్ ఉడ్ మరియు విల్ షైర్ బోలె వాల్డ్ మూలలో, యుసిఎల్ప్ (UCLA) సమీపంలో, ఇది దక్షిణ లాస్ ఎంజిలాస్ లో గొప్ప విశ్వ విద్యాలయము. ఇంకా ఇద్దరే ఉన్నారు, జాన్ కుక్ గారు నేను. దేవుని కృప చేత, జాన్ నేను ఈ ఉదయాన ఇక్కడ ఉన్నాము – నలభై సంవత్సరాలు తరువాత. యేసు క్రీస్తుకే స్తుతి!

ఈ సంఘము నలభై సంవత్సరాల శ్రమల ద్వారా వచ్చింది. ఇశ్రాయేలీయులు అరణ్యంలో నలభై సంవత్సరాలు గడిపినట్టు, ఈ సంఘము చాల కష్టాల ద్వారా, చాల శ్రమల ద్వారా, ఉపద్రవముల ద్వారా వెళ్ళింది. దాని గూర్చి రాత్రి ఎక్కువ చెప్తాను. కాని ఎక్కడ మనము, ఒక గొప్ప సువార్త బోధించే సంఘము డౌన్ టౌన్ లాస్ ఎంజిలాస్ నడిబొడ్డున. మనకు తెలుసు, మన శ్రమలన్నిటిలో, దేవుడు మనతో ఉన్నాడు గొప్ప విజయాన్నిచ్చాడు ఈరోజు ఉత్సాహించడానికి, మన సంఘ నలభైవ వార్షికోత్సవంలో! యేసు క్రీస్తు స్తుతి నొందును గాక!

పాష్టర్ రోజర్ హాఫ్ మాన్ గత రాత్రి ప్రార్ధన కూడికలో మాట్లాడాడు. మళ్ళీ ఈ రాత్రి మన సాంవత్సరిక ఉత్సవంలో మాట్లాడతాడు. కాని పాష్టర్ హాఫ్ మాన్ ఈ ఉదయాన్న బోధించడానికి నిరాకరించాడు. ఆయన అన్నాడు, "డాక్టర్ హైమర్స్, ఈ ఆదివారం ఉదయము నీ బోధ నేను వింటాను." తరువాత, నేను ప్రార్దిస్తుండగా నాకు నడిపింపు వచ్చింది, ఇంకొక బాప్టిస్టు సంఘములో 2010 ఆగష్టులో నేను చెప్పిన ప్రసంగము, మరల చెప్పమని. దయచేసి ఎఫెస్సీయులకు, రెండవ అధ్యయము చూడండి. స్కోఫీల్ద్ స్టడీ బైబిలులో 1251 వ పేజిలో ఉంది. ఎఫెస్సీయులకు 2:19, 20 చదువుచుండగా నిలబడండి.

"కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్తులను, దేవుని ఇంటి వారునైయున్నారు; క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయియైయుండగా, అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడియున్నారు" (ఎఫెస్సీయులకు 2:19, 20).

కూర్చోండి.

ఈ వచనాలలో అపోస్తలుడైన పౌలు సంఘము దేవుని చేతి పని అని చెప్తున్నాడు. ఇంకా చెప్తున్నాడు సంఘము అపోస్తలుల ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడుచున్నది, కాని క్రీస్తు అను "మూలరాయిపై" సంఘము కట్టబడుచున్నది. డాక్టర్ జె. వెర్నోన్ మెక్ గీ అన్నాడు దీని అర్ధము "సంఘము కట్టబడుచున్నది క్రీస్తు అను బండపై" (Thru the Bible, Volume V, Thomas Nelson, p. 241; note on Ephesians 2:20). డాక్టర్ ఎ. టి. రాబర్ట్ సన్ అన్నాడు, "ఎక్రోగొనియాసిస్...మూల పునాదిరాయి" (Word Pictures, Broadman, 1931; note on Ephesians 2:20). యేసు క్రీస్తే మన పనికి పునాది, మన జీవితాలకు. "యేసు క్రీస్తే" మన సంఘానికి పునాది. ఈ పదాలు ఎత్తి చూపిస్తున్నాను ఎఫెస్సీయులకు 2:20 నుండి మన పాఠ్యభాగముగా ఈ ఉదయము.

"యేసు క్రీస్తే" (ఎఫెస్సీయులకు 2:20).

యేసు క్రీస్తే ఈ ప్రసంగానికి మూలము. యేసు క్రీస్తులా క్రైస్తవ విశ్వాసములో ఏదియు లేదు. యేసు క్రీస్తు లాంటి వారు లేరు ఉండబోరు. మానవ చరిత్రలో ఆయన పూర్తిగా విశిష్టుడు. యేసు క్రీస్తు దైవ-మానవుడు. యేసు క్రీస్తే పరలోకము నుండి దిగి వచ్చి మానవుల మద్య జీవించాడు. యేసు క్రీస్తే శ్రమపడి, రక్తము కార్చి మన పాపాల కొరకు చనిపోయాడు. యేసు క్రీస్తే మన న్యాయము కొరకు మృతులలో నుండి శరీరంలో లేచాడు. యేసు క్రీస్తే ఆరోహనమై దేవుని కుడి పార్శ్వమున మన కొరకు విజ్ఞాపన ప్రార్ధన చేయుచున్నాడు. యేసు క్రీస్తే తిరిగి వచ్చి భూమి మీద వెయ్యి సంవత్సరాలు భూమిపై తన రాజ్యము స్థాపించాడు. అది యేసు క్రీస్తే. లేచి ఈ పాట పాడండి!

యేసును మాత్రమే, చూస్తాను,
   యేసు మాత్రమే, రక్షిస్తాడు,
నా పాట నిత్యము ఇదే –
   యేసు! యేసు మాత్రమే!
("యేసును మాత్రమే, చూస్తాను" డాక్టర్ ఓస్వాల్ద్ జె. స్మిత్ చే, 1889-1986).
(“Jesus Only, Let Me See” by Dr. Oswald J. Smith, 1889-1986).

కూర్చోండి.

యేసు క్రీస్తే అనే అంశము లోతైనది, విశాలమైనది, ప్రాముఖ్యమైనది ఒక్క ప్రసంగములో వర్ణింపలేము. యేసు క్రీస్తును గూర్చి కొన్ని అంశాలు మాత్రమే మనము చూస్తాము.

I. మొదటిది, యేసు క్రీస్తే మానవ జాతిచే తృణీకరింపబడి తిరస్కరింప బడ్డాడు.

సువార్తిక ప్రవక్త యెషయా అది తేటగా చెప్పాడు,

"అతడు తృణీకరింపబడిన వాడును; ఆయెనల మనష్యుల వలన విసర్జింప బడి వాడును, వ్యసనాక్రాంతుడు గాను ఉండెను వ్యాధినను భావించిన వాడుగాను ఉండెను: మనష్యులు చూడ నొల్లని వానిగాను ఉండెను; అతడు తృణీకరింపబడిన వాడు, గనుక మనము అతనిని ఎన్నిక చేయక పోతిమి" (యెషయా 53:3).

డాక్టర్ టోరీ అన్నాడు, "యేసు క్రీస్తు నందు నమ్మిక [కలిగి యుండుట] లో విఫలమగుట దురదృష్టము కాదు, అది పాపము, భయంకర పాపము, దారుణ పాపము, ఘోర పాపము" (R. A. Torrey, D.D., How to Work for Christ, Fleming H. Revell Company, n.d., p. 431). ప్రవక్త యెషయా క్రీస్తును తృణీకరింపబడడం తిరస్కరించడంను గూర్చి వివరించాడు, అది అంతరంగిక దౌర్భాగ్యము నశించు వారు క్రీస్తును ఎదుర్కోకుండా చేస్తుంది. పూర్తి దౌర్భాగ్యానికి గొప్ప రుజువు వారు యేసు క్రీస్తు గూర్చి చాలా తక్కువ ఆలోచించడం. గొప్ప రుజువు నశించు మానవాళి నిత్య శిక్షకు పాత్రులై అగ్ని గుండములో పడవేయబడడానికి కారణము వారు బుద్ధి పూర్వకంగా అలవాటుగా ఆయన నుండి వారి ముఖాలు దాచుకోవడం.

మారని స్థితిలో మానవులు యేసు క్రీస్తునే తృణీకరిస్తారు. వారి పూర్తి దౌర్భాగ్యంలో, యేసు క్రీస్తునే ఎన్నిక చెయ్యరు. మీ మనస్సాక్షిలో నొప్పింప బడితే తప్ప, పాపపు ఒప్పుకోలు అనుభవిస్తే తప్ప, దేవుని పట్ల నీ హృదయము చనిపోయిందని అనిపిస్తే తప్ప, నీవు యేసు క్రీస్తునే తృణీకరించి తిరస్కరిస్తూ ఉంటావు.

మన సంఘంలో ప్రసంగము తరువాత విచారణ గదిలో, అది జరుగుతూ ఉంటుంది. చాల విషయాలు ప్రజలు చెప్తుంటారు. బైబిలు వచనాలు మాట్లాడుతూ ఉంటారు. ఈ విషయము ఆ విషయము "గ్రహింపును" గూర్చి మాట్లాడుతుంటారు. ఏమి అనిపించిందో ఏమి చేసారో చెప్తుంటారు. సామాన్యంగా ఇలా ముగిస్తారు, "అప్పుడు నేను యేసు నొద్దకు వచ్చాను." అంతే! యేసును గూర్చి ఒక్క మాట కూడా ఎక్కువ చేయలేరు! యేసు క్రీస్తును గూర్చి వారి దగ్గర చెప్పడానికి ఏమి ఉండదు! ఎలా వారు రక్షింపబడతారు?

గొప్ప స్పర్జన్ అన్నాడు, "మనష్యులలో దౌర్భాగ్యపు స్థితి ఉంది సువార్త నుండి క్రీస్తును తొలగించుటలో" (C. H. Spurgeon, Around the Wicket Gate, Pilgrim Publications, 1992 reprint, p. 24).

రక్షణ ప్రణాళిక తెలుసుకోవడం నిన్ను రక్షింపదు! బైబిలు ఎక్కువగా నేర్చుకోవడం నిన్ను సేవింపదు! ఎక్కువ ప్రసంగాలు వినడం నిన్ను రక్షింపదు! పాపాలను గూర్చి భాద పడడం నిన్ను రక్షింపదు! యూదాను అది రక్షింపలేదు, కదా? జీవితాన్ని సమర్పించుకోవడం నిన్ను రక్షింపదు! నీ కన్నీళ్లు నిన్ను రక్షింపవు! ఏదీ నీకు సహాయము చెయ్యదు యేసు క్రీస్తును తృణీకరించడం తిరస్కరించడం ఆపకపోతే – యేసు నుండి నీ తల దాచుకోవడం ఆపకపోతే – యేసు క్రీస్తు నొద్దకు చేర్చబడకపోతే! మళ్ళీ పాడండి!

యేసును మాత్రమే, చూస్తాను,
   యేసు మాత్రమే, రక్షిస్తాడు,
నా పాట నిత్యము ఇదే –
   యేసు! యేసు మాత్రమే!

కూర్చోండి.

II. రెండవది, బైబిలు అంతటిలో యేసు క్రీస్తే కేంద్ర అంశము.

ఇది అసంజసము మేము మీతో చెప్పడం యేసు క్రీస్తే మీ ఆలోచనలో కేంద్రమని? కాదు, అది అసంజసము కాదు. ఎందుకు, ఆలోచించండి, యేసు క్రీస్తే బైబిలు అంతటిలో గొప్ప అంశము – ఆదికాండము నుండి ప్రకటన గ్రంధము వరకు! మృతులలో నుండి క్రీస్తు లేచాక ఏమ్మాయి వైపు వెళ్తున్న ఇద్దరు శిష్యులను ఆయన కలిసాడు. ఆయన వారికి చెప్పింది ఈనాడు మనకు వర్తిస్తుంది.

"అందుకాయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మతులారా: క్రీస్తు ఈలాగు శ్రమపడి మన మహిమలో ప్రవేశించుట, అగత్యము కాదా అని? వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను, మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను" (లూకా 24:25-27).

మోషే ఐదు గ్రంథాల నుండి, మిగిలిన బైబిలు అంతటి నుండి, క్రీస్తు వారికి వివరించాడు "ఆయనను గూర్చిన లేఖన విషయాలు." ఏది అంగీకారము? బైబిలు అంతటిలో యేసు క్రీస్తే ప్రధాన అంశము! యేసు క్రీస్తే బైబిలులో ప్రాముఖ్య అంశము కనుక, అది సమంజసము కాదా యేసు క్రీస్తునే నీ తలంపులలోను నీ జీవితములోను ప్రధాన అంశముగా చేసుకోవడం? నేను మీకు చెప్తున్నాను, యేసు క్రీస్తును గూర్చే ఈ ఉదయము లోతుగా ఆలోచించండి! పాడండి!

యేసును మాత్రమే, చూస్తాను,
   యేసు మాత్రమే, రక్షిస్తాడు,
నా పాట నిత్యము ఇదే –
   యేసు! యేసు మాత్రమే!

నేను నమ్ముతాను యేసు క్రీస్తునే తెలుసుకోవడం, నిజ మార్పిడిలో, అతి ప్రాముఖ్య విషయము నీ జీవితంలో ఎన్నడు సంభవించనిది. యేసు క్రీస్తునే నిజంగా నమ్మితే నీకు కొంచము కౌన్సెలింగ్ సరిపోతుంది. నేను నమ్ముతాను యేసు క్రీస్తును గూర్చిన నిజ జ్ఞానము మొత్తము క్రైస్తవ కౌన్సెలింగ్ లో 90% అవసరతను తీరుస్తుంది! ఒక వ్యక్తి క్రీస్తును ఎరిగితే, నిజ మార్పిడిలో, ఆ క్రీస్తును కనుగొంటాడు,

"...ఆయన మనకు [ఆయన] జ్ఞానమును, నీతియు, పరిశుద్దతయు, విమోచనము నాయెను" (I కొరిందీయులకు 1:30).

మన సంఘాలలో "నిర్ణయత్వతను" విడిచిపెడితే, క్రీస్తు వైపు ప్రజలు నిజంగా మార్పిడి చెందితే, ఈనాడు మన సంఘాలలో 90% కౌన్సెలింగ్ జరిగినట్టే! యేసు క్రీస్తే మన కౌన్సిలర్ గా ఉండనివ్వండి! పాడండి!

యేసును మాత్రమే, చూస్తాను,
   యేసు మాత్రమే, రక్షిస్తాడు,
నా పాట నిత్యము ఇదే –
   యేసు! యేసు మాత్రమే!

III. మూడవది, యేసు క్రీస్తే సారంశము, కేంద్ర విషయము, సువార్తలో హృదయము లాంటివాడు.

ప్రవక్తయైన యెషయా యేసు క్రీస్తును గూర్చి సువార్తలో హృద్యముగా మాట్లాడాడు,

"మనమందరము గొర్రెల వలే త్రోవ తప్పిపోతిమి; మనలో ప్రతివాడును తన కిష్టమైన త్రోవకు తొలిగెను; యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపెను" (యెషయా 53:6).

"యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపెను." భయంకర, క్రీస్తు నెరవేర్పు మరణము, నీ స్థానములో వెల చెల్లిస్తుంది, దేవుని ఉగ్రత నీ స్థానంలో భరిస్తుంది – అది సువార్తలోని హృదయము! అది యేసు క్రీస్తే నీ పాపాలు ఆయనపై వేసికొన్నాడు గెత్సమనే అంధకారములో. ఆ తోటలో యేసు క్రీస్తే, ఇలా అన్నాడు,

"నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి యున్నది" (మార్కు 14:34).

యేసు క్రీస్తే ఇలా అన్నాడు,

"ఆయన వేదన పడి మరింత...ఆతురంగా... ప్రార్ధన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలే ఆయెను" (లూకా 22:44).

యేసు క్రీస్తే గెత్సమనే వనంలో బంధింపబడ్డాడు. యేసు క్రీస్తే సన్ హెడ్రిన్ ముందుకు ఈడ్వబడి, ముఖముపై కొట్టబడి, వెక్కిరింపబడి అవమానింప బడ్డాడు. యేసు క్రీస్తు ముఖముపైననే వారు ఉమ్మి వేసారు! యేసు క్రీస్తు గెడ్డముపై ఉన్న వెంట్రుకలు లాగారు. యేసు క్రీస్తే పొంతు పిలాతు ముందుకు తేబడ్డాడు, రోమా కొరడాతో వీపుపై కొట్టబడ్డాడు, ముళ్ళ కిరీటము ధరించాడు, యేసు క్రీస్తు ముఖము నుండి ఆయన నొసటి నుండి రక్తము కారింది, గుర్తు పట్టని విధంగా ఆయన ముఖము కొట్టబడింది,

"నిన్ను చూచి...ఏ మనిషి రూపము కంటే నరరూపము కంటే, అతని రూపము చాల వికారమాయెను" (యెషయా 52:4).

"అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది" (యెషయా 53:5).

యేసు క్రీస్తే పిలాతు తీర్పు నుండి తీసుకోబడి, సిలువ మరణానికి ఈడ్చుకొని వెల్లబడ్డాడు. యేసు క్రీస్తే శపింపబడిన మ్రానుపై మేకులతో కొట్టబడ్డాడు. యేసు క్రీస్తే తన కాళ్ళలో చేతులలో మేకులు కొట్టబడి శ్రమ పడుట మాత్రమే కాక – ఆయన ఇంకా ఎక్కువ నొప్పిని అనుభవించాడు దేవుడు "మన అతిక్రమములను ఆయనపై మోపినప్పుడు" (యెషయా 53:6). యేసు క్రీస్తే "సిలువ మ్రానుపై మన పాపములను ఆయన శరీరంలో భరించాడు" (I పేతురు 2:24). డాక్టర్ వాట్స్ అన్నాడు,

చూడు, ఆయన తల, చేతులు, కాళ్ళు,
   విచారము ప్రేమ కలిసి ప్రవహిస్తున్నాయి:
ఎప్పుడైనా ప్రేమ విచారము అలా కలుసుకున్నాయా,
   లేక ముళ్ళతో అంత గొప్ప కిరీటము చేయబడిందా?
("అద్భుత సిలువను నేను సమీక్షిస్తున్నప్పుడు "ఐజాక్ వాట్స్ చే, డి.డి., 1674-1748).
(“When I Survey the Wondrous Cross” by Isaac Watts, D.D., 1674-1748).

లేచి పాడండి! ఇప్పుడు మన పాట పాడండి!

యేసును మాత్రమే, చూస్తాను,
   యేసు మాత్రమే, రక్షిస్తాడు,
నా పాట నిత్యము ఇదే –
   యేసు! యేసు మాత్రమే!

కూర్చోండి.

IV. నాల్గవది, యేసు క్రీస్తు మాత్రమే నిత్య ఆనందానికి ఒకే ఒక మూలము.

వారు యేసు క్రీస్తు’ మృత దేహమును సిలువ నుండి దించి మూయబడిన సమాధిలో ఉంచారు. కాని మూడవ దినాన, శారీరకంగా మృతులలో నుండి లేచాడు! తరువాత శిష్యుల యొద్దకు వచ్చి ఆయన అన్నాడు, "మీకు సమాధానము కలుగును గాక" (యోహాను 20:19).

"ఆయన ఈలాగు చెప్పి, వారికి తన చేతులను ప్రక్కను చూపగా. శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి" (యోహాను 20:20).

"అప్పుడు శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి" (యోహాను 20:20). యేసు క్రీస్తే వారికి సంతోషాన్ని ఇచ్చాడు "వారు ప్రభువును చూచినప్పుడు." నీవు ఎన్నడు లోతైన సమాధానాన్ని ఎరుగలేవు, ప్రభువు ఆనందాన్ని, నీవు యేసు క్రీస్తును ఎరుగకుండా!

ఓ, ఈ ఉదయము నీతో చెప్తున్నాను – నాకు జ్ఞాపకముంది నేను యేసు క్రీస్తూనే నమ్మిన క్షణము! ఎంత పరిశుద్ధ అనుభవము! నేను త్వరగా ఆయన దగ్గరకు వెళ్ళాను! లేక, అనిపించింది, ఆయన నా దగ్గరకు త్వరగా వచ్చాడు. ఆయన ప్రశస్త రక్తము ద్వారా నేను కడుగబడ్డాను! దేవుని కుమారుని ద్వారా నేను జీవింపబడ్డాను! ఆ పాట పాడండి!

యేసును మాత్రమే, చూస్తాను,
   యేసు మాత్రమే, రక్షిస్తాడు,
నా పాట నిత్యము ఇదే –
   యేసు! యేసు మాత్రమే!

కూర్చోండి.

యేసు క్రీస్తు నొద్దకే రండి! నీ జీవితము నుండి రక్షకుని వదులు కోవద్దు. నీ సాక్ష్యము నుండి ఆయనను వదులు కోవద్దు. స్పర్జన్ చెప్పినది చెయ్యవద్దు "దౌర్భాగ్య వైఖరి...సువార్త నుండి క్రీస్తునే తొలగించుట వద్దు." లేదు! లేదు! ఇప్పుడే యేసు నొద్దకే రండి. నేను పాడుచుండగా జాగ్రత్తగా ఈ మాటలు వినండి.

ఉన్నట్టు నేను వచ్చేదన్, ఏమి చెప్పకుండా,
   నీ రక్తము నా కొరకై కార్చబడింది,
నేను నీ దగ్గరకు వచ్చేలా చేసుకున్నావు,
   ఓ దేవుని గొర్రె పిల్లా, నేను వస్తున్నాను! నేను వస్తున్నాను!
("ఉన్నట్టు నేను వచ్చేదన్" చార్లెట్ ఇల్లియట్ చే, 1789-1871).
(“Just As I Am” by Charlotte Elliott, 1789-1871).

యేసు నీ పాప పరిహారార్ధము సిలువపై మరణించాడు. యేసు తన పరిశుద్ధ రక్తాన్ని నీ పాపాలు కడగడానికి కార్చాడు. యేసు నొద్దకు రమ్ము. ఆయనను నమ్ముకో నీ పాపాలన్నిటి నుండి ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆమెన్.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ఫ్రుథోమ్: యెషయా 53:1-6.
ప్రసంగము ముందు పాట బెంజిమిన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్:
"ప్రాతఃకాలము ఆకాశంలో సంభవించినప్పుడు"
(జర్మను నుండి ఎడ్వర్డ్ కాస్వల్ చే అనువదింపబడింది, 1814-1878).
“When Morning Gilds the Skies” (translated from the German by Edward Caswall, 1814-1878).


ద అవుట్ లైన్ ఆఫ్

యేసు క్రీస్తే

JESUS CHRIST HIMSELF

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

"యేసు క్రీస్తే" (ఎఫెస్సీయులకు 2:20).

I.   రెండవది, బైబిలు అంతటిలో యేసు క్రీస్తే కేంద్ర అంశము, లూకా 24:25-27; I కొరిందీయులకు 1:30.

II.  మూడవది, యేసు క్రీస్తే సారంశము, కేంద్ర విషయము, సువార్తలో హృదయము లాంటివాడు, యెషయా 53:6; మార్కు 14:34; లూకా 22:44; యెషయా 52:14; 53:5; I పేతురు 2:24.

III. నాల్గవది, యేసు క్రీస్తు మాత్రమే నిత్య ఆనందానికి ఒకే ఒక మూలము, యోహాను 20:19, 20.