Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




గెత్సమనేలో క్రీస్తు ప్రార్ధన

CHRIST’S PRAYER IN GETHSEMANE
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము సాయంకాలం, మార్చి 29, 2015
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, March 29, 2015


యేసు ఆఖరి భోజనము తన శిష్యులతో తీసుకున్నాడు. తరువాత ఆయన వారిని గెత్సమనే తోటకు నడిపించాడు. యేసు వారిని తోట దగ్గరలో ఉంచి కొంచెము దూరము చీకటిలోనికి వెళ్లి ప్రార్ధించాడు. ఆయన లోతైన నిస్ప్రహలో ఉన్నాడు. తనను రక్షించాలని దేవునికి మోర పెట్టాడు. వేదనతో ప్రార్ధన చేస్తుండగా, ఆయన చెమట "నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలే ఆయెను" (లూకా 12:44). అది మన పాఠ్యభాగమునకు నడిపిస్తుంది. పాఠ్యభాగము గెత్సమనే తోటలో క్రీస్తు ప్రార్ధనను గూర్చి ఎక్కువగా చెప్తుంది.

"శరీరధారియైయున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్ళతోనూ, తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్ధనలను యాచనలను సమర్పించి, భయభక్తులు కలిగియున్నందున ఆయన అంగీకరింపబడెను" (హెబ్రీయులకు 5:7).

ఈ వచనాన్ని గూర్చి చాల వ్యాఖ్యానాలు చేయబడడం ఆశ్చర్యం. చాల మంది చెప్తారు ఇది గెత్సమనేలో క్రీస్తు ప్రార్ధనను గూర్చినవని. కాని చాల మంది అనుకుంటారు మరునాడు సిలువ మరణాన్నుండి తమను రక్షించాలని దేవునికి ప్రార్దిస్తున్నాడని. డాక్టర్ లేనస్కి ఈ తికమక వివాదాస్పద విషయాలకు జవాబిచ్చాడు, హెబ్రీయులకు 5:7 లో ఇవ్వబడిన వాటికి (R. C. H. Lenski, Ph.D., The Interpretation of the Epistle to the Hebrews and the Epistle of James, Augsburg Publishing House, 1966 edition, p. 162-165; note on Hebrews 5:7).

పాఠ్యభాగాన్ని వచనముల వారిగా పరిశీలిద్దాము, ఎందుకంటే ఆయన సిలువవేయు బడుటకు ముందు రాత్రి, గెత్సమనే వనంలో క్రీస్తు ఏకాంత ప్రార్ధనను అది బయలు పరుస్తుంది.

"శరీరధారియైయున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్ళతోనూ, తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్ధనలను యాచనలను సమర్పించి, భయభక్తులు కలిగియున్నందున ఆయన అంగీకరింపబడెను" (హెబ్రీయులకు 5:7).

I. మొదటిది, క్రీస్తు "శరీరదారియైయున్న దినముల" గూర్చి పాఠ్యభాగము మాట్లాడుతుంది.

ఈ పదము చూపిస్తుంది ఈ పాఠ్యభాగము తెలియ పరచడం లేదు ఆయన పరలోకము నుండి దిగి వచ్చిన తరువాత, శరీరధారి కాకమునుపు యేసుకు ఏమైందో అనే విషయము గూర్చి. ఈ పదము చూపిస్తుంది పాఠ్య భాగము చెప్పడం లేదు క్రీస్తు అనుభవాన్ని గూర్చి ఆయన ఆరోహనుడై పరలోక రాజ్యమునకు చేర్చబడిన తరువాత విషయాన్ని గూర్చి. యేసు ప్రార్ధించిన సమయాన్ని పాఠ్యభాగము ఎత్తి చూపుతుంది "మహారోదన" "శరీరధారియైయుండగా" భూమిపై.

కొత్త నిబంధన యేసు కన్నీరు కార్చిన మూడు సందర్భాలను గూర్చి చెప్తుంది. ఒకటి లాజరు సమాధి దగ్గర. బైబిలు చెప్తుంది, "యేసు కన్నీళ్లు విడిచెను" (యోహాను 11:35). రెండవసారి ఆయన యేరూష లేమును గూర్చి దుఃఖపడ్డాడు,

"ఆయన పట్టణము సమీపించినప్పుడు, దానిని చూచి, దాని విషయమై ఏడ్చి" (లూకా 19:41).

డాక్టర్ జె. వెర్నోన్ మెక్ గీ అన్నాడు, "మూడవసారి ఆయన గెత్సమనే తోటలో ఏడ్చాడు" (J. Vernon McGee, Th.D., Thru the Bible, Thomas Nelson Publishers, 1983, volume V, p. 540; note on Hebrews 5:7). లాజరు సమాధి వద్ద ఆయన ఏడ్చుటను గూర్చి మన పాఠ్యభాగము చెప్పడం లేదు అనేది స్పష్టము. యేరూషలేము పట్టణమును గూర్చి ఆయన ఏడ్చుటను గూర్చి చెప్పడం లేదు. ఈ పాఠ్య భాగములో ఆయన సిలువ వేయబడక మునుపు, గెత్సమనే తోటలో ఆయన వేదనను గూర్చి తెలియ చేస్తుంది.

‘అది అర్ధరాత్రి, ఒలీవ నుదుటిపై
   నక్షత్రము ప్రకాశించి వెలుగు తగ్గింది;
‘వనములో అది అర్ధరాత్రి ఇప్పుడు,
   శ్రమపడు రక్షకుడు ఒంటరిగా ప్రార్దిస్తున్నాడు.

‘అది అర్ధరాత్రి; ఇతరుల నేరాలకు
   విషాద వ్యక్తి రక్తములో ఏడ్చుచున్నాడు;
రోదనలో మోకాల్లనిన ఆయనను
   దేవుడు విడిచిపెట్టలేదు.
("’అది అర్ధరాత్రి; ఒలీవ నుదుటిపై" విలియం బి. టప్పన్ చే, 1794-1849).
(“‘Tis Midnight; and on Olive’s Brow” by William B. Tappan, 1794-1849).

"శరీరధారియైయున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్ళతోనూ, తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్ధనలను యాచనలను సమర్పించి, భయభక్తులు కలిగియున్నందున ఆయన అంగీకరింపబడెను" (హెబ్రీయులకు 5:7).

II. రెండవది, పాఠ్య భాగము మనకు చెప్తుంది క్రీస్తు దేవునికి ప్రార్ధించాడని, ఆయన గెత్సమనేలో తనను మరణము నుండి రక్షింప గల సమర్ధుడు.

జాగ్రత్తగా వినండి మత్తయి 26:36-38.

"అంతట యేసు వారితో కూడా గెత్సమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడకు వెళ్లి, ప్రార్ధన చేసి వచ్చు వరకు, మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పెను. పేతురు బెదయి ఇద్దరు కుమారులను వెంట బెట్టుకొని పోయి, దుఃఖ పడుటకును చింతా క్రాంతుడగుట మొదలు పెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతగా, నా ప్రాణము బహు దుఃఖములో మునిగియున్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పెను..." ["మరణం పాయింట్" ఎన్ఐవి] (మత్తయి 26:36-38).

డాక్టర్ జాన్ మెక్ ఆర్డరు హెబ్రీయులకు 5:7 ను గూర్చి కొన్ని మంచి విషయాలు చెప్పాడు, కాని ఈ వచనముపై ఆఖరిలో తప్పు చెప్పాడు. అతడు అన్నాడు, "యేసు మరణంలో నిలిచి యుండకుండా రక్షించమని అడిగాడు, అంటే [అది] పునరుత్థానము కొరకు" (John MacArthur, D.D., The MacArthur Study Bible, Word Bibles, 1997, p. 1904; note on Hebrews 5:7).

యేసు ప్రార్ధించుట లేదు "మరణము నుండి రక్షింపమని" పునరుత్థానము ద్వారా! కాదు, మత్తయి 26:38 తేటగా చెప్తుంది యేసు "మరణమగునంతగా, బహు దుఃఖము మరణమగువరకు" – మరణం వరకు – గెత్సమనే తోటలో – యేసు చనిపోబోతున్నాడు! మరణము నుండి రక్షింప బడడానికి గెత్సమనే ఆయన ప్రార్దిస్తున్నాడు! లూకా సువార్త చెప్తుంది, "ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువు వలే ఆయెను" (లూకా 22:44). యేసు భయంకర శ్రమలో ఉన్నాడు ఆయన చెమట రక్త మాయెను, ఆయన సిలువ వేయబడక మునుపు, గెత్సమనేలో, మరణపు అంచులో ఉన్నాడు. జోషఫ్ హార్ట్ అన్నాడు,

శ్రమపడు దైవ కుమారుని చూడు,
దుఃఖిస్తూ, మూలుగుచూ, రక్తము చెమటగా!
దైవిక సమాధి లోతులలో!
యేసు, ఎలాంటి ప్రేమ నీది!
("నీ తెలియని శ్రమ" జోసెఫ్ హార్ట్ చే, 1712-1768; స్వరము "‘అది అర్ధరాత్రి, ఒలీవ నుదుటిపై").
(“Thine Unknown Sufferings” by Joseph Hart, 1712-1768;
      to the tune of “‘Tis Midnight, and on Olive’s Brow”).

మత్తయి 26:38-39 వినండి.

"అప్పుడు యేసు మరణమగునంతగా, నా ప్రాణము బహు దుఃఖములో, మునిగియున్నది: మీరు ఇక్కడ నిలిచి, నాతో కూడా మెలకువగా ఉండునని వారితో చెప్పిరి. కొంత దూరము వెళ్లి, సాగిలపడి, ప్రార్ధించాడు, నా తండ్రి, సాధ్యమైతే, ఈ గిన్నె నా యొద్ద నుండి, తొలగి పోనిమ్ము: అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్ర ప్రకారమే, కానిమ్మని ప్రార్ధించెను" (మత్తయి 26:38-39).

ఈ ప్రార్ధన అనువాదము క్రీస్తు సిలువకు వెళ్ళకుండా తనను రక్షింపని దేవుని అడుగుచున్నాడు. అది బైబిలు బోధించడం లేదు అది కచ్చితము. డాక్టర్ జె. వెర్నోన్ మెక్ గీ, అమెరికా ప్రసిద్ధ బైబిలు ఉపదేశకుడు, అన్నాడు,

సిలువను మన ప్రభువు తప్పించు కోవడం సరికాదు అలా చెప్పడం...నిజం. ఆయన మానవత్వములో ప్రపంచ పాపాలు మూయడం ఆయనకు భయంకరం అనిపించింది...(J. Vernon McGee, Th.D., Thru the Bible, 1983, Thomas Nelson Publishers, volume IV, p. 141; note on Matthew 26:36-39).

డాక్టర్ జె. ఆలివర్ బస్ వెల్, ప్రసిద్ధ వేదాంతి, అన్నాడు,

లూకా వర్ణించిన అతి భయంకర పరిస్థితి హటాత్తుగా సంభావానికి గురి చేస్తుంది అందులో శ్రమ పడు వ్యక్తి సోమ్మసిల్లడానికి మరణానికి కూడా గురి అయ్యే ప్రమాదముంది...మన ప్రభువైన యేసు క్రీస్తు, ఈలాంటి భయంకర శారీరక స్థితిలో ఉండి, తోటలో మరణము నుండి విడుదలకు ప్రార్ధించాడు, సిలువపై తన ఉద్దేశ నెరవేర్పు కొరకు [మరునాడు] (J. Oliver Buswell, Ph.D., A Systematic Theology of the Christian Religion, Zondervan Publishing House, 1962, part III, p. 62).

"పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి, దుఃఖ పడుటకు చింతాక్రాంతుడగుట మొదలు పెట్టెను. అప్పుడు యేసు మరణ మగునంతగా, నా ప్రాణము బహు దుఃఖములో మునిగి యున్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పెను..." ["మరణం పాయింట్" ఎన్ఐవి] (మత్తయి 26:37-38).

ఆ రెండు వచనాలు జాగ్రత్తగా చదివి, డాక్టర్ జాన్ ఆర్. రైస్ డాక్టర్ జె. వెర్నోన్ మెక్ గీ మరియు డాక్టర్ జె. ఆలివర్ బస్ వెల్ చెప్పింది వివరించి చెప్పాడు. డాక్టర్ రైస్ అన్నాడు,

     వచనాలు 37 మరియు 38 గమనిస్తే [మత్తయి 26], గెత్సమనే ప్రార్ధన అర్ధము తప్పిపోయింది. యేసు విచారంగా భారంగా ఉన్నాడు ఆయన ఆత్మ "మరణమగునంతగా," అంటే [ఆయన] మరణ వేదనలో ఉన్నాడు...తోటలో చనిపోబోతున్నాడు 39 మరియు 42 వచనాలలో చెప్పబడినది మరణ గిన్నె, ఆరాత్రి గెత్సమెనె వనంలోని మరణము. హెబ్రీయులకు 5:7 లో ఇది తేట తెల్లమైంది అక్కడ చెప్పబడింది యేసు "ప్రార్ధనలు విజ్ఞాపనలు గట్టిగా మోర పెట్టుచు చేసాడు కన్నీరు కార్చాడు మరణము నుండి తప్పింప బడడానికి, మరియు అది వినడానికి భయంకరం." చింతాక్రాంతుడై "గెత్సమనే వనంలో చనిపోవడానికి సిద్ధంగా ఉండి, యేసు ప్రార్ధించాడు మరణ పాత్ర ఆయన నుండి తప్పింప బడుతుందని ఆరాత్రి మరుసటి రోజు సిలువపై మరణించే విధంగా. లేఖనాలు చెప్తున్నాయి "ఆయన మోర వినబడింది"! దేవుడు ఆయన ప్రార్ధనకు జవాబిచ్చాడు... ఒకవేళ యేసు గెత్సమనే వనంలో చనిపోయి ఉంటే, మనకు రక్షణ సువార్త ఉండేది కాదు, ఆ సువార్త ఏమనగా "లేఖనాల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయెను" [కాటా టాస్ గ్రాఫ్రాస్], I కొరిందీయులకు 15:3. మామూలు మరణము కాదు; క్రీస్తు మరణము లేఖనముల ప్రకారము సంభవించాలి...ఆయన చెంప అప్పగింప బడియున్నది (యెషయా 50:6). ఆయన చాల దెబ్బలు తినవలెను (యెషయా 53:5)...ఇద్దరు దొంగల మద్య సిలువపై చనిపోవాలి [యెషయా 53:12; జెకర్యా 12:10; జెకర్యా 13:6]. వారు ఆయన కాళ్ళు చేతులను గుచ్చాలి (కీర్తనలు 22:16)...[ఆయన] కేక [సిలువ నుండి], "నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివి?"...లేఖనాల్లో ముందుగానే చెప్పబడింది (కీర్తనలు 22:1). ప్రధాన యాజకులు ప్రజలు [ఆయన సిలువపై ఉండగా] ఆయనను అపహసించడం నేరవేరాలి ముందుగా చెప్పబడినట్టు (కీర్తనలు 22:7-8). [సైనికులు] ఆయన [పై వస్త్రము] కొరకు చీట్లు వెయ్యాలి (కీర్తనలు 22:18).
         యేసు వాస్తవంగా చనిపోకపోతే "లేఖనముల ప్రకారము," ఆయన మన రక్షకుడు కానేరడు. దేవునికి వందనాలు, గెత్సమనే వనంలో ఆయన ప్రార్ధనలకు జవాబు ఇవ్వబడింది! మరణ పాత్ర...ఆయన నుండి ఆరాత్రి తొలగింపబడింది [ఆయన వెళ్ళగలిగాడు] సిలువకు తద్వారా మనం రక్షింప బడగలుగుతున్నాం... లూకా 22:43 చెప్తుంది "ఆకాశము నుండి ఒక దూత వచ్చి, ఆయనను బలపరచెను." ఆయన శరీరములో ఈ అసాధారణ శక్తి లేకుండా, ఆరాత్రి క్రీస్తు వనంలోనే చనిపోయి ఉండేవాడు (John R. Rice, D.D., The Gospel According to Matthew, Sword of the Lord Publishers, 1980 edition, pp. 441-442; notes on Matthew 26:36-46).

మనం పాపాల నుండి రక్షింపబడకపోయే వారము సిలువకు వెళ్ళకుండా యేసు గేత్సమనే వనంలోనే చనిపోయి ఉండి ఉంటే. ఎందుకు? ఎందుకంటే క్రీస్తు చనిపోయేవాడు కాదు "కటాటాస్ గ్రాఫ్రాస్." ఆయన చనిపోలేదు కనుక మనలను రక్షింప జాలడు "లేఖనముల ప్రకారము."

"శరీరధారియైయున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్ళతోనూ, తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్ధనలను యాచనలను సమర్పించి, భయభక్తులు కలిగియున్నందున ఆయన అంగీకరింపబడెను" (హెబ్రీయులకు 5: 7).

III. మూడవది, పాఠ్యభాగము మనకు చెప్తుంది దేవుడు క్రీస్తుకు జవాబిచ్చాడని.

సిలువను తప్పించుకోడానికి ఆయన ప్రార్ధన చేసి ఉంటే, దేవుడు వినేవాడు కాదు రక్షించే వాడు కాదు! లేదు, దేవుడు ఆయన మోర విని ప్రార్ధనకు జవాబిచ్చాడు. గెత్సమనే తోటలో ఆయన చనిపోలేదు! దేవుడు ఆయనను రక్షించాడా కనుక మన పాపాల నిమిత్తము సిలువపై చనిపోవడానికి "కాటాటాన్ గ్రాఫ్రాస్" – "లేఖనముల ప్రకారము"! యేసు "జవాబు పొందాడు" (హెబ్రీయులకు 5:7). నేననుకుంటాను దీని అర్ధము ఆయనకు దైవ భయము ఉంది, అవిధేయత చూపడానికి భయపడ్డాడు సిలువకు వెళ్లక ముందు చనిపోవడం ద్వారా. బైబిలు చెప్తుంది, యేసు "ఆయన తన ఎదుట ఉన్న ఆనందము కొరకై సిలువను సహించేను" (హెబ్రీయులకు 12:2). యేసు అనుకోకుండా చనిపోలేదు. కాదు, ఆయన బుద్ధి పూర్వకంగా ఇష్ట పూర్వకంగా సిలువకు వెళ్ళారా మన పాపాలకు పూర్తి ప్రాయశ్చిత్తము చెల్లించడానికి.

మరి, ఏమి, ఆయన గొప్ప వేదనకు "మరణము పొందునంతగా" శ్రమ పడడానికి కారణము ఏమిటి ["మరణము పొందునంతగా" ఎన్ఐవి] గెత్సమనే వనంలో (మత్తయి 26:38)? ఎందుకు ఆయన "విచారంగా" మరియు "చాల భారంగా" ఉన్నారు? ఎందుకాయన "విభ్రాంతి నొందాడు" (మార్కు 14:33)? ఎందుకాయన "వేదనలో ఉన్నాడు" (లూకా 22:44)? ఎందుకాయన చెమట "రక్తము వలే మారింది" గెత్సమనేలో (లూకా 22:44)?

నేను నమ్ముతాను గెత్సమనే వనంలో ఆరాత్రి దేవుడు దేవుని గొర్రె పిల్ల అయిన, యేసుపై ఆయన ప్రజల పాపాలు ఉంచాడు. బైబిలు చెప్తుంది, "మన అతి క్రమములను బట్టి ఆయనపై మోపెను" (యెషయా 53:6). అది గెత్సమనేలో జరిగిందని నమ్ముతాను. "ఆయన శరీరముపై" నీ పాపాలు ఉంచబడ్డాయి ఆరాత్రి, సిలువకు మోసుకెళ్ళాడు, మరునాడు నీ పాప ప్రాయశ్చిత్తానికి. ఈయన యేసు, "ఆయన తానే తన శరీర మందు మన పాపములను మ్రాను మీద మోసికొనేను" – సిలువపై (I పేతురు 2:24). ఆయనను చూడు గొప్ప వేదనలో, చెమట రక్తము, గెత్సమనేలో దేవుడు, "మన అతి క్రమములను ఆయనపై మోపినప్పుడు." గెత్సమనే నుండి సిలువకు నీ పాపాలు మోసుకెళ్ళడం "ఆయన శరీరంలో మ్రానుపై చూడు." అంత గొప్ప రక్షకుని తిరస్కరిస్తావా? లేక ఆయన దగ్గరకు వస్తావా, శ్రమపడి నీ స్థానంలో మరణించాడు, నీవు క్షమింపబడి పాప శిక్ష నుండి రక్షించడానికి?

గొప్ప పాటల రచయితా జోషఫ్ హార్ట్ (1717-1768) గెత్సమనే వనంలో యేసు కేమయిందో చూసాడు.

శ్రమపడు దైవకుమారుని చూడు,
దుఃఖిస్తూ, మూలుగుచూ, రక్తము చెమటగా!
దైవిక సమాధి లోతులలో!
యేసు, ఎలాంటి ప్రేమ నీది!
("నీ తెలియని శ్రమ" జోషఫ్ హార్ట్ చే, 1712-1768;
   స్వరము "‘అది అర్ధరాత్రి, ఒలీవ నుదటిపై").

దయచేసి లేచి జోషఫ్ హార్ట్ మరియొక పాట పాడండి. పాటల కాగితంలోని 5 వ పాట.

చాల మాటలు ఆయన సహించాడు, శోధనలు వచించాడు,
ఓరిమి, భాధలు భరించాడు: కాని తీవ్ర తీర్పు ఉంది
నీలో ఉంచబడాలి, మసక, విషాద గెత్సమనే!
నీలో ఉంచబడాలి, మసక, విషాద గెత్సమనే!

చివరకు భయంకర రాత్రి వచ్చింది; ఇనుప కర్రతో పగ తీర్చుకోవడం
సామూహిక, శక్తి హాని చేయని దేవుని గొర్రె పిల్ల నలుగ గొట్టబడింది.
చూడు, నా ఆత్మా, రక్షకుని చూడు, గెత్సమనేలో సాగిల పడ్డాడు!
చూడు, నా ఆత్మా, రక్షకుని చూడు, గెత్సమనేలో సాగిల పడ్డాడు!

అచట దైవ కుమారుడు నా నేరారోపణ భరించాడు; కృప ద్వారా దీనిని నమ్మవచ్చు;
ఆయన భరించిన భయంకర శ్రమలు దాచాలేనంత ఎక్కువ.
నీ ద్వారా ఎవరు, చొచ్చుకోలేరు, చీకటి గెత్సమనే!
నీ ద్వారా ఎవరు, చొచ్చుకోలేరు, చీకటి గెత్సమనే!

పరిశుద్ద్ధ దేవునికి వ్యతిరేకంగా పాపమూ; ఆయన న్యాయ విధులకు వ్యతిరేకంగా పాపాలు;
ఆయన ప్రేమకు, ఆయన రక్తానికి వ్యతిరేకంగా పాపాలు;
ఆయన నామము కారణములకు వ్యతిరేకంగా పాపమూ;
సముద్రము వలే విస్తార పాపాలు – దాచు, ఓ గెత్సమనే!
సముద్రము వలే విస్తార పాపాలు – దాచు, ఓ గెత్సమనే!

ఇది నా ఒరవడి, ఇది మాత్రమే; రక్షకుని మించిన వారు నాకు ఎవరు లేరు;
నీతి క్రియలు ఒకటి నాకు లేదు; లేదు, ఒక మంచి పని లేదు:
నిరీక్షణ ఆశ నాకు లేదు, గెత్సమనేలో మాత్రమే!
నిరీక్షణ ఆశ నాకు లేదు, గెత్సమనేలో మాత్రమే!
("చాల మాటలు ఆయన సహించాడు" జోషఫ్ హార్ట్ చే, 1712-1768;
కాపరిచే మార్చబడినది, స్వరానికి "రండి, ఓ పాపులారా").
(“Many Woes He Had Endured” by Joseph Hart, 1712-1768;
   altered by the Pastor; to the tune of “Come, Ye Sinners”).

యేసు మీ పాపాయి సిలువపై భరించాడు ఆయన మిమ్ములను ప్రేమిస్తున్నాడు కాబట్టి. యేసు రక్తము కార్చాడు నీ పాపాలన్నీ కడిగేయడానికి ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక. నా ప్రార్ధన నిత్యత్వ ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్న రక్షకుని నమ్మాలని నా ప్రార్ధన!

యేసు ప్రేమించినట్టు ఎవ్వరు నిన్ను ప్రేమించరు;
      ఆయన పట్టించుకొనేటట్లు ఎవరు నిన్ను పట్టించుకోరు;
నిజ స్నేహితుడు ఎవరు నీకు ఉండరు,
      కనుక ఆయనను నమ్ము తిరిగి నీకు జీవితం ఉంటుంది.
నీ స్వంత వానిగా యేసును చేసుకో!

డాక్టర్ చాన్, దయచేసి ప్రార్ధనలో నడిపించుడి. ఆమెన్.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ఫ్రుథోమ్: మత్తయి 26:36-39.
ప్రసంగము ముందు పాట బెంజిమిన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్:
"గెత్సమనే, ద ఆలివ్-ప్రెస్!" (జోషఫ్ హార్ట్ చే, 1712-1768).
“Gethsemane, the Olive-Press!” (by Joseph Hart, 1712-1768).


ద అవుట్ లైన్ ఆఫ్

గెత్సమనేలో క్రీస్తు ప్రార్ధన

CHRIST’S PRAYER IN GETHSEMANE

by Dr. R. L. Hymers, Jr.

"శరీరధారియైయున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్ళతోనూ, తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్ధనలను యాచనలను సమర్పించి, భయభక్తులు కలిగియున్నందున ఆయన అంగీకరింపబడెను" (హెబ్రీయులకు 5:7).

(లూకా 22:44)

I. మొదటిది, క్రీస్తు "శరీరదారియైయున్న దినముల" గూర్చి పాఠ్యభాగము మాట్లాడుతుంది,
యోహాను 11:35; లూకా 19:41.

II. రెండవది, పాఠ్య భాగము మనకు చెప్తుంది క్రీస్తు దేవునికి ప్రార్ధించాడని, ఆయన గెత్సమనేలో
తనను మరణము నుండి రక్షింప గల సమర్ధుడు, మత్తయి 26:36-39; లూకా 22:44;
I కొరిందీయులకు 15:3; యెషయా 50:6; 53:5, 12; జేకర్యా 12:10; 13:6;
కీర్తనలు 22:16, 1, 7-8, 18; లూకా 22:43.

III. మూడవది, పాఠ్యభాగము మనకు చెప్తుంది దేవుడు క్రీస్తుకు జవాబిచ్చాడని, హెబ్రీయులకు 12:2; మత్తయి 26:38; మార్కు 14:33; లూకా 22:44; యెషయా 53:6; I పేతురు 2:24.