Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
పునర్ణిర్మాణము-క్రైస్తవ ప్రేమకు లంకె

REGENERATION – THE LINK TO CHRISTIAN LOVE
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము ఉదయము, మార్చి 15, 2015
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, March 15, 2015

"యేసే క్రీస్తయి యున్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టియున్నాడు: పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును" (I యోహాను 5:1).


నేను గుడిలో పెంచబడలేదు. పదమూడు సంవత్సరాల వయసులో బాప్టిస్టు సంఘానికి హాజరు అవుతూ ఉండేవాడిని. నేను నేర్చుకున్న ఒక విషయము గుడిలో యవనస్థులు ఒకరినొకరు ప్రేమించుకోరు, నన్ను ప్రేమించలేదు, వారు పెద్దలను కాపరిని గూడ ప్రేమించలేదు. వారు చెడ్డ మాటలు చెప్పుకుంటూ ఒకరినొకరు వెన్నుపోటు పొడుచుకుంటూ ఉండేవారు. కాపరి బోధిస్తున్నప్పుడు వారు గుసగుసలాడుతూ చిట్టీలు పంపుకొనేవారు. నేనింకొకటి కనుగొన్నాను సంఘ పెద్దలు కూడా ఒకరినొకరు ప్రేమించు కొనేవారు కాదు. వాస్తవానికి, వారు ఒకరినొకరు అయిష్టపడుతూ, చాలా మంది ఒకరినొకరు తృణీకరించుకొనేవారు. అలవాటు బలవంతంతో కలిసి ఉండేవారు. కలిసి ఉండడానికి అందాటు పడవలసి వచ్చేది. ఆదివారము అలవాటుగా రెండు గంటలు కలిసి గడిపేవారు. గుడికి రావడం వారికి ఆనవాయితీ. కాని ఒకరి పట్ల ఒకరికి ప్రేమలేదు. అసలు కాపరి ఇంకొక గుడికి వెళ్ళినప్పుడు, గుడి హాజరు తారుమారు అయ్యేది. తక్కువ వ్యవధిలో మూడు గుంపులుగా మారి ఒకరితో ఒకరు పోట్లాట ప్రారంభించారు. చాలామంది గుడి పూర్తిగా మానేశారు. ఉన్నవారు అడవి జంతువుల్లా భయంకరంగా పోట్లాడుకున్నారు. ఆదివారం ఉదయము ఆరాధనలో పాటల పుస్తకాలు విసురుకున్నారు. దుర్భాషతో ఆరాధనలో ఒకరినొకరు శపించుకున్నారు.

చివరకు దక్షిణ బాప్టిస్టు గుంపు వదిలి వేరే గుడి ప్రారంభించింది. వారితో నేను వెళ్లాను. వేరే గుడి ప్రారంభించిన వెంటనే మళ్ళీ అదే జరిగింది! యవనస్థులు చాల మంది వెళ్ళిపోయారు. చివరకు నేను వదిలిపెట్టి చైనీ గుడికి వెళ్లాను, ఇరవై మూడు సంవత్సరాలు అక్కడ సభ్యునిగా ఉన్నాను. కాని చైనీయులు అంత భయంకరులు కానప్పటికిని, సభ్యులలో కొంత ప్రేమ మాత్రమే ఉండేది దేవుడు ఉజ్జీవము పంపే వరకు అప్పుడు పరిస్థితులు చక్కబడ్డాయి.

ఉజ్జీవము ప్రారంభమయ్యాక నేను సెమినరీకి వెళ్లాను. సెమినరీ దగ్గర ఒక గుడి ప్రారంభించాను. కొంతకాలము అంతా బాగుంది. మళ్ళీ అదే మొదలైంది. వాగ్వివాదాలు వచ్చి ప్రజలు వదిలేసారు. అస్తవ్యస్తమయింది. నేను వదిలిపెట్టి లాస్ ఎంజిలాస్ కు వచ్చేసాను.

నలభై సంవత్సరాల క్రితం ఒక గుడి ఇక్కడ ప్రారంభించాను, చివరకు ఆ గుడిలో మనము ఈ రోజు ఉన్నాము. కాని ఈ సంఘము కూడా కలవరములు, కొట్లాటలు భయంకర సంఘ విభేదాల ద్వారా వెళ్ళింది. ఇరవై ఐదు సంవత్సరాలు పట్టింది పరిస్థితులు చల్లబడడానికి ఈనాడు ఉన్నట్టు అవడానికి.

ఇప్పుడు, ఇది నా అనుభవం. దీని అంతటిని బట్టి మీరు ఆశ్చర్య పోవచ్చు. నా గురుండి నేనే ఆశ్చర్యపోతూ ఉంటాను. నేను ఒకటి చెప్పగలను, నాకు తెలుసు, దేవుడున్నాడని నాకు తెలుసు బైబిలు దేవుని వాక్యమని. వాటిని కేవలం నమ్మడం కాదు. నా హృదయ అంతరంగములో, అది నాకు తెలుసు. అది నాకు తెలుసు, "నీతి పరక్రియల ద్వారా కాదు...కానీ ఆయన కృప ప్రకారము" (తీతుకు 3:5).

నా అనుభవము అసాధారణము కాదు. చాల మంది, అందరు, యువ సువార్తికులు ఈలాంటి అనుభవము ద్వారానే వెళ్ళాడు. నా అనుభవాన్ని ఏది అసాధారణము చేస్తుంది అంటే నేను దాని ద్వారా వెళ్ళాను దాని నుండి బయటికి వచ్చాను దేవుని నమ్మి ముందు లేనంతగా బైబిలును నమ్మి!

కాని నేను ముందుకు వెళ్ళే ముందు నేను క్రిస్టన్ వెక్కర్ చెప్పింది చెప్తాను, రచయిత సువార్తిక దేశ పతనము: గుడిలో ఆశ్చర్య కర విపత్తు (హార్పర్ సన్, 2008). ఆమె అన్నారు,

సువార్తిక క్రైస్తవ్యము అమెరికాలో నశిస్తుంది. గొప్ప సువార్తిక ఉద్యమాలు ఈనాడు గొప్పగా లేవు [మొదటి స్థానములో లేవు]. అవి శేషముగా, ముగింపులో ఉన్నాయి. మీ కిష్టమున్నట్టు చూడండి: మార్పులు. బాప్మిస్మాలు. సభ్యత్వము...ఇచ్చుట...హాజరు...ఇవన్ని తగ్గి పోతున్నాయి (ఐబిఐడి., ఉపోద్ఘాతము, పేజి ix).

ఆమె సత్యాలతో గణాంకాలతో చెప్పారు కాదనడం అసంభవం. ఆ పుస్తకము చదువుతూ ఉండగా ఆమె ప్రాధమిక అంశముతో ఏకీభవించవలసిందే: మన సంఘాలు లోతైన శ్రమలో ఉన్నాయి.

కాని ఇది కొత్త కాదు. అరవై సంవత్సరాల క్రితం డాక్టర్ ఎ. డబ్ల్యూ. టోజర్ వ్రాసాడు, మళ్ళీ మళ్ళీ, మన సంఘాలలోని సమస్యలపై. ఉదాహరణకు, డాక్టర్ టోజర్ అన్నాడు,

మొత్తము సువార్తిక ప్రపంచము ఎక్కువ మట్టుకు ఆరోగ్య క్రైస్తవ్యానికి ప్రతికూలంగా ఉంది. నేను ఆధునికతను [స్వతంత్రను] గూర్చి ఆలోచించడం లేదు. నా ఉద్దేశము బైబిలు నమ్మే గుంపు చాదస్తతను గూర్చి వింటున్నాయి... మనము నీరసత్యానికి మారిన వారిని గురి చేస్తున్నాం [ఫలవంతము లేని, తరిగిపోయిన] ఒకరకమైన క్రైస్తవ్యత నూతన నిబంధన పోలికకు రానిది...తేటగా మనం తప్పక మంచి క్రైస్తవులను తయారు చెయ్యాలి (Of God and Men, Christian Publications, 1960, pp. 12, 13).

డాక్టర్ టోజర్ అతని జీవిత కాలంలో ప్రవక్తగా పిలువబడ్డాడు!

మనం ఎలా ప్రేమించే సంఘాన్ని కలిగి యుండగలం తికమక స్వ ధర్మాల మధ్య? బైబిలు ఎక్కడ ప్రారంభమయిందో మన అక్కడ మొదలెట్టాలి – మర్పిడితో. మారని ప్రజలతో ప్రేమించే సంఘాన్ని కలిగి యుండలేము! నిజ మార్పు విప్లవ సంఘటన. డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్-జోన్స్, గొప్ప బ్రిటిష్ బోధకుడు, అన్నాడు,

క్రైస్తవుడవడం సంక్షోభంతో, క్లిష్టతతో కూడిన ఘటన...కొత్త నిబంధనలో నూతన జన్మ, నూతన సృష్టి, నూతన ప్రారంభముగా వర్ణింపబడ్డాయి. దాని కంటే, అది దేవునిచే ఇవ్వబడిన అసాధారణ క్రియ, చనిపోయిన ఆత్మా జీవించడం... ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా (Martyn Lloyd-Jones, M.D., Evangelistic Sermons, The Banner of Truth Trust, 1990, p. 166).

అది మన పాఠ్యభాగానికి నడిపిస్తుంది.

"యేసే క్రీస్తయి యున్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టియున్నాడు: పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును" (I యోహాను 5:1).

I. మొదటిది, పాఠ్యభాగములో "నమ్ముట" అంటే అర్ధం ఏమిటి.

"యేసే క్రీస్తయియున్నాడని నమ్ము ప్రతి వాడును..."(I యోహాను 5:1).

"నమ్ముట" కు గ్రీకు పదము "పిస్టయుయోన్." డాక్టర్ ఎ. టి. రోబర్ట్ సన్ అన్నాడు "ఇది కేవలం విజ్ఞాన ఒప్పుకోలు కాదు, కాని యేసు క్రీస్తుకు పూర్తీ అప్పగింప...పిస్టయుమోన్ పూర్తి అర్ధములో" (A. T. Robertson, Litt.D., Word Pictures in the New Testament, volume VI, Broadman Press, 1953, p. 237; note on I John 5:1).

స్ట్రాంగ్ అన్నాడు "పిస్టయుమోన్" అర్ధము "ఒక వ్యక్తిలో, వ్యక్తి పైన... విశ్వాసముండడం" (#4100). స్పర్జన్ అన్నాడు, "ఏ గ్రీకు లెక్సికన్ అయినా చూడండి, మీరు కనుగొంటారు పదము పిస్టయుమోన్ అర్ధము నమ్మడం మాత్రమే కాదు, కాని విశ్వసించుట...విశ్వాసం అర్ధము నమ్మకం, యేసు క్రీస్తు పై, [కాదు]...నామ మాత్రమూ నమ్మకము కాదు...[అది] నీ ఆత్మను రక్షింపలేరు" (“Faith and Regeneration,” Metropolitan Tabernacle Pulpit, number 979, p. 138; note on I John 5:1).

దెయ్యాలకు యేసు క్రీస్తులో "నామ మాత్రపు" నమ్మకము ఉంది. కొత్త నిబంధన ఎక్కువగా చదవ నవసరం లేదు లూకా 4:41 కనుగొనడానికి,

"దయ్యములు [దురాత్మలు] నీవు దేవుని కుమారుడవని, కేకలు వేసి, అనేకులను వదిలి పోయెను, ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి యుండెను...కగుక వాటిని గద్దించి వాటిని మాటలాడ నీయలేదు" (లూకా 4:41).

యేసు క్రీస్తుని ఈ దయ్యాలు అర్ధం చేసుకున్నాయి. కాని అవి ఆయనను నమ్మలేదు. యోహాను నమ్మమని చెప్పడం లేదు, యేసు క్రీస్తునే వాస్తవాన్ని మేస్సీయాను. ఆయన చెప్తున్నాడు క్రీస్తును విశ్వసించమని – పిస్టయుమోన్ –"క్రీస్తులో ఆయనపై విశ్వసముంచుట, ఆయనను నమ్మడం."

ఇత్తడి సర్పమును గూర్చి స్పర్జన్ చెప్పాడు. పాములు ఇజ్రాయేలీయులను, కరుస్తుంటే వారు చనిపోతున్నారు. దేవుడు మోషేకు ఇత్తడి పామును చేసి ఒక స్థంభముపై ఉంచమన్నాడు. ఎవరైతే పాముకాటుకు గురి అవుతున్నారో ఆ ఇత్తడి సర్పమును చూచి స్వస్థత పొంది జీవిస్తారు. యోహాను 3:14, 15 లో యేసు ఎలా రక్షింపబడతామో కథ ద్వారా వివరించాడు. స్పర్జన్ అన్నాడు, "యేసును నమ్ముట అంటే [కేవలం] విశ్వాసపు చూపు ఆయనపై ఉంచడం, ఆత్మతో ఆయనను నమ్మడం" (ఐబిఐడి., పేజి 140). నీ విశ్వాసము ఎంత చిన్నదయినా, యేసు వైపు చూస్తే ఆయనలో విశ్వాసము ముంచితే, నీకు నమ్మక ముంటుంది నీవు తిరిగి జన్మించిన వాడవు తావు.

"నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టియున్నాడు..." (I యోహాను 5:1).

II. రెండవది, ఎవడైతే యేసును నమ్ముతాడో అతడు తిరిగి జన్మించిన వాడు, దేవుని మూలముగా పుట్టినవాడు.

ఇప్పుడు, యేసును నమ్మని వారు చెప్తుంటారు వారు తిరిగి జన్మించారని. వారు వేరే దానిని విశ్వసిస్తున్నారు. డాక్టర్ కాగన్ ఇలియానా నేను సాన్ డియాగో దగ్గర సమాధికి వెళ్ళాము. తిరిగి వస్తున్నప్పుడు కాలిఫోర్నియా లోని పెద్ద దక్షిణ బాప్టిస్టు సంఘము వద్ద ఆగాము. శనివారపు సాయంకాలము ఆరాధన ముగుస్తుంది. బయటికి వస్తున్నప్పుడు గార్డుగా ఉన్న యవనరాలను నేను చూసాను. క్రైస్తవులారా అని అడిగాను. ఆమె అన్నారు, "అవును, అని." నేనడిగాను, "ఎలా క్రైస్తవురాలవయ్యవు?" ఆమె అన్నారు, "నా జీవితమంతా ఈ సంఘములో సభ్యురాలను." నేనన్నాను, " నా ప్రశ్న నీకు అర్ధమయినట్టు లేదు. ‘నీవు ఎలా క్రైస్తవు రాలవయ్యావు?’" ఆమె అన్నారు, "నేను బాప్తిస్మము పొందాను." నేను మళ్ళీ, అడిగాను, "కాని నీవు ఎలా క్రైస్తవురాలవయ్యవు,?" ఆమె అన్నారు "ప్రతివారము గుడికి వస్తాను." విచారంగా వెళ్ళిపోయాను. ఆ యవనరాలు ఒక్క మాట కూడా యేసును గూర్చి చెప్పలేక పోయింది! ఆ పెద్ద దక్షిణ బాప్టిస్టు సంఘ కాపరి ప్రపంచమంతటికి తెలుసు. ఆ అమ్మాయి జీవితమంతా ఆ బోధ వింటుంది. కాని ఆమె నికోదేము వలే అజ్ఞానముతో ఉంది, అతడు యేసుతో అన్నాడు, "ఇవి ఎలా సాధ్యం?" (యోహాను 3:9).

దేవుడు మనకు సహాయం చెయ్యాలి! క్రిస్టన్ విక్కేర్ అన్నాడు, "సువార్తిక క్రైస్తవ్యము అమెరికాలో చనిపోతుంది." డాక్టర్ టోజర్ అన్నాడు, "పూర్తి సువార్తిక ప్రపంచము ఎక్కువగా ఆరోగ్యకర క్రైస్తవ్యానికి ప్రతికూలంగా ఉంది." యేసును నమ్మకుంటే ఆ యవనురాలి వలె నశించి నట్టే, ఆమె పెద్ద దక్షిణ బాప్టిస్టు సంఘానికి జీవిత సభ్యురాలు. ఓ, సంఘ సభ్యత్వమును నమ్మవద్దు! బాప్తిస్మమును నమ్మవద్దు! నీ మంచితనాన్ని నమ్మవద్దు! నీవేమి చేసినా, భావోద్రేక భావనను నమ్మవద్దు! యేసు క్రీస్తును నమ్ము! సిలువపై కార్చబడిన క్రీస్తు రక్తములో నీ పాపాలు కడుగుకో! స్పర్జన్ తరుచు చెప్తునట్టు, "క్రీస్తుపై వాలిపో." క్రీస్తును చూడు. క్రీస్తును నమ్ము. క్రీస్తు వైపు చూడు! అది కష్టము కాదు! ఇత్తడి సర్పమును చూచి ఇశ్రాయేలీయులు స్వస్త పడినట్లు ఆయన వైపు చూడు!

చూడు జీవించు, నా సహోదరుడా, జీవించు!
   ఇప్పుడు యేసు వైపు చూచి జీవించు,
‘అది ఆయన గ్రంధములో లిఖితమయింది, హల్లెలూయ!
   అది చూచి నీవు జీవించాలి!
("చూచి జీవించు" విలియం ఏ. ఒగ్డేన్ చే, 1841-1897).
(“Look and Live” by William A. Ogden, 1841-1897).

III. మూడవది, నూతన జన్మ ద్వారా ఏమి ప్రవహిస్తుంది.

"యేసే క్రీస్తయి యున్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టియున్నాడు: పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును" (I యోహాను 5:1).

పాఠ్యభాగములో రెండవ భాగము గమనించండి, "...పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును" (I యోహాను 5:1). సంఘములో సహొదరీ సహోదరుల మద్య ప్రేమ కొత్త జన్మకు సూచన. నిజ మార్పుడు పరీక్ష, నిజంగా, మారిన ఇతరులను మనం ప్రేమిస్తాం. డాక్టర్ జె. వెర్నోన్ మెక్ గీ అన్నాడు, "ప్రభువైన యేసు క్రీస్తును నమ్మినప్పుడు నీవు తిరిగి జన్మించావు...దానికి రుజువు నీవు దేవుని ప్రేమిస్తావు. నీవు నీ తండ్రియైన [దేవుని] ప్రేమిస్తావు – ఆయన నిన్ను పుట్టించాడు – నీవు ఆయన ఇతర పిల్లలను ప్రేమిస్తావు ఎందుకంటే వారు నీ సహోదర సహోదరీలు కాబట్టి" (బైబిలు ద్వారా, ధామస్ నెల్సన్, 1983; గమనిక I యోహాను 5:1).

నేను నమ్ముచున్నాను ఇది అసలు కారణము చాల సంఘాలలో గొడవలు, విబేధాలు, చాలామంది సంఘాలను వదిలేయడం, ముఖ్యంగా యవనులు. డాక్టర్ తిమోతి లిన్ చాల సంవత్సరాలు నా కాపరి. చాల సమస్యలు అనుభవించిన ఒక సంఘాన్ని గూర్చి ఆయన ఇలా వ్రాసాడు,

చాలామంది గుంపు[లో] చెపుకుంటారు క్రైస్తవులని కాని నిత్య జీవితమూ ఉండదు; ఆధిక్యతల కొరకు పోరాడతారు కాని బాధ్యతలు తప్పించు కుంటారు. అలాంటి సభ్యులు సంఘ పరిచర్యలను పాడు చేస్తారు... దురదుష్టవశాత్తూ, ప్రజలు కాన్సర్ కణాలు [మారని ప్రజలను] అనుమతిస్తారు క్రీస్తు శరీరము లోనికి. ఈ కారణముచే...ఈనాటి సంఘాలు జబ్బులతో బాదపడుచున్నాయి (Timothy Lin, Ph.D., The Secret of Church Growth, FCBC, 1992, pp. 38-40).

డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ కూడా ఈ సమస్య చూసాడు. ఆయన ఆన్నాడు,

ఈ అభిప్రాయము సంఘ సభ్యులు కాబట్టి గుడికి క్రమంగా వస్తున్నారు కాబట్టి వారు క్రైస్తవులు అనేది చాల తప్పుడు అభిప్రాయము, నేను సలహాలు ఇస్తాను అది ఈనాటి సంఘ [చెడ్డ] స్థితికి అది ముఖ్య కారణము (Martyn Lloyd-Jones, M.D., Preaching and Preachers, Zondervan Publishing House, 1981 edition, p. 149).

నశించు వారు అన్ని బాప్టిస్టు మరియు సువార్త సంఘాలలో ఎలాంటి ప్రశ్నలు లేకుండా సభ్యులు అయిపోవచ్చు. వారు వెంటనే అంగీకరింపబడతారు. వారిలో చాలామంది నిజ క్రైస్తవులు కాలేదు. డాక్టర్ లిన్ చెప్పినట్లు, వారు "క్రైస్తవులని చెప్పుకుంటారు అని నిత్య జీవము లేదు." ఆయన భావము వారికి జియో అటోనియో లేదు –దేవుని జీవము వారిలో లేరు. మారినప్పుడు మాత్రమే దేవుని జీవము ప్రజలలోనికి వస్తుంది. మన పాఠ్యభాగము చెప్తునట్టు, వారు "దేవుని మూలముగా పుట్టిన వారు," "దేవునిచే పుట్టిన వారు." గొప్ప బోధకుడు జార్జి వైట్ ఫీల్డ్ (1714-1770) రక్షింపబడ్డాడు హెన్రీ స్కౌగల్ రాసిన "మానవుని ఆత్మలో దేవుని జీవము" అనే పుస్తకాన్ని చదివాక. దేవుని జీవము ప్రజలను పునర్ణిర్మానిస్తుంది వారు యేసును నమ్మిన మరుక్షణమే. వారికి "భావన" లేకపోవచ్చు, కాని పరిపక్వ క్రైస్తవులు గుర్తిస్తారు నూతనంగా మారిన వారు వేరుగా ఉంటారని. ప్రాముఖ్య తేడా ఏమిటంటే వారు సంఘములో ఉన్న ఇతరులను లోతుగా ప్రేమిస్తారు "దేవుని మూలముగా జన్మించిన వారు," "దేవుని ద్వారా పుట్టిన వారు." దేవుని జీవాన్ని కలిగిన వారుని వీరు పసి గడతారు. క్రైస్తవ ప్రేమను వారిపట్ల కలిగియుంటారు, నశించు లోకాన్ని ప్రేమించు వారు, నశించు సంఘసభ్యులు, అది అర్ధము చేసుకోలేరు. డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు, "మనకు దైవిక స్వభావము కావాలి మనలో మనం ఒకరినొకరం నిజంగా ప్రేమించు కొనేముందు" (దేవుని ప్రేమ, క్రాస్ వే, 1994, పేజి 45). ఈ పత్రికలో అపోస్తలుడైన యోహాను ముందు చెప్పినట్లు,

"మనము సహోదరులను ప్రేమించు చున్నాము, కనుక మరణములో నుండి జీవములోనికి వాటి యున్నామని యెరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచియున్నాడు" (I యోహాను 3:14).

ఆవ్యక్తి ఆత్మీయ మరణంలో ఉంటాడు. మీరు మరణము నుండి జీవములోనికి దాటాలని మా ప్రార్ధన ఈ ఉదయం. యేసును నమ్ము. యేసును విశ్వసించు. యేసుపై పూర్తిగా అనుకో. ఆయన రక్తము నీ పాపాలను కడుగుతుంది. ఆయన మరణ పునరుత్తానము నీకు జీవాన్ని యిస్తుంది. నీవు యేసు వైపు తిరిగి ఆయనను నమ్మినప్పుడు మాత్రమే – నీవు మరణము నుండి జీవములోనికి దాటుతావు. నీవు ఆత్మీయంగా ఐక్యమవుతావు పరిశుద్ధా ప్రేమ ద్వారా యేసును విశ్వసించిన ఇతరులతో.

"వారు తెలుసుకుంటారు మనం క్రైస్తవులమని మన ప్రేమ ద్వారా, మన ప్రేమ ద్వారా, అవును, వారు తెలుసుకుంటారు మనం క్రైస్తవులమని మన ప్రేమ ద్వారా."
(కోరస్ పీటర్ ఆర్. స్కోల్టర్స్ చే, 1938-2009).

త్వరలో అది నీ అనుభవము కావాలని నా ప్రార్ధన! యేసును నమ్ము. సిలువపై ఆయన కార్చిన రక్తముతో నీ పాపాలు కడిగేస్తారు. నీ పాపాల నుండి రక్షించి నీకు నిత్య జీవము ఇస్తాడు – దేవుని జీవాన్ని! నీవు తిరిగి జన్మిస్తావు, పైనుండి జన్మిస్తావు!

ఈ ప్రసంగము ముగిస్తాను "ఆలివర్ ట్విస్ట్" లోని ఒక దృశ్యము గుర్తు చేసి. ఆలీవర్ ఒక 9 లేక 10 సంవత్సర లోకములో ఒంటరి. అతని తల్లి తనకు జన్మనిస్తూ చనిపోయింది. అతడు ఒక అనాధ – ఈ ప్రపంచం మొత్తంలో. ఇంగ్లాండ్ లో 19వ శతాబ్దంలో అనాధ శరణాలయంలో ఉన్నాడు. అతడు అర ఆకలితో ఉండేవాడు. ప్రతి రాత్రి చిన్న పాత్రలో నీళ్ళతో నిండిన ఆహారము ఇచ్చేవారు. బల్లపైయున్న ఇతర అబ్బాయిలు, "వెళ్లి ఇంకా కావాలని అడుగు" అని నెమ్మదిగా చెప్పేవారు. చివరకు, ఆకలితో అలమటిస్తూ, చిన్న బాలుడు అతని పల్లెము తీసుకొని పెద్ద లావైన అధికారి, దగ్గరకు వెళ్ళాడు. ఆ లావు అతడు బాలుని చూచి, "ఏమి కావాలి అన్నాడు?" భయ పూరిత స్వరముతో, ఆలీవర్ అన్నాడు, "దయచేసి, అయ్యా, నాకు ఇంకా కావాలి." లావు అతడు అన్నాడు, "ఏమిటి?" బాలుడు అన్నాడు, "అయ్యా దయచేసి, నాకు ఇంకా కావాలి." లావు ఆయన అరిచాడు, "ఏమిటి? ఏమి ఎక్కువకావాలి? ఎక్కువ! ఏమి ఎక్కువ కావాలి?" ఆలీవర్ గదిలో ఉంచబడ్డాడు. అబ్బాయిని వదిలించుకున్నారు. రెండు రోజులలో ఒకతని దగ్గర పని చేయడానికి పంపబడ్డాడు, అతడు బాలుని చీకటి గదిలో, పెట్టె కింద పడుకోబెట్టాడు.

డిక్కిన్స్ పుస్తకము ఎప్పుడు చదవకపోతే, 1948 సినిమా చూడకపోతే, ఆ దృశ్యము మర్చిపోలేవు – పెద్ద లావు, "మనిషి" ఆకలితో అలమటిస్తున్న చిన్న బాలునికి ఇంకొక గరిటె నీళ్ళ అన్నం ఇవ్వటానికి నిరాకరించడం.

క్రీస్తును గూర్చి మీలో కొందరు ఇలా అనుకుంటున్నారేమో. నీవను కుంటున్నావా ఆయన సంకుచితుడు కఠినుడు అని. నీవను కుంటున్నావా నీకు రక్షణ నివ్వడం ఆయనకు ఇష్టము లేదని. నీవు ఎంత తప్పులో ఉన్నావు! క్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు! నీకు కావలసినదంతా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు – ఇంకా ఎక్కువగా! యేసు అన్నాడు, "నా యొద్దకు రమ్ము...నేను నీకు విశ్రాంతి ఇచ్చెదను" (మత్తయి 11:28). యేసు అన్నాడు, "నేను వారికి నిత్య జీవము ఇస్తాను" (యోహాను 10:28). యేసు అన్నాడు, "దప్పి గొనువారికి జీవ జలముల బుగ్గలోని జలమును నేను ఉచితంగా అనుగ్రహింతును" (ప్రకటన 21:6).

యేసు రక్షణ నీకు ఉచితంగా ఇస్తాడు. ఆయన నీకు జీవితమూ సమాధానము ఇస్తాడు. ఆయన నీకు పాపమూ నుండి రక్షణ ఇస్తాడు. ఆయన నీకు నిత్య జీవము ఇస్తాడు. నీవు చేయవలసిందల్లా ఆయనను నమ్మడం, ఆయన వైపు చూడడం రక్షింపబడడం.

చూడు జీవించు, నా సహోదరుడా, జీవించు!
   ఇప్పుడు యేసు వైపు చూచి జీవించు,
‘అది ఆయన గ్రంధములో లిఖితమయింది, హల్లెలూయ!
   అది చూచి నీవు జీవించాలి!

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ఫ్రుథోమ్: I యోహాను 4:7-11; 3:11-14.
ప్రసంగము ముందు పాట బెంజిమిన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్:
"బ్లెస్ట్ బి ద టై" (జాన్ ఫాసెట్ చే, 1740-1817)/
"వారు తెలుసుకుంటారు మనం క్రైస్తవులమని మన ప్రేమ ద్వారా" (పీటర్ ఆర్. స్కోల్ట్స్ చే, 1938-2009).
“Blest Be the Tie” (by John Fawcett, 1740-1817)/
“They’ll Know we are Christians by our Love” (by Peter R. Scholtes, 1938-2009).


ద అవుట్ లైన్ ఆఫ్

పునర్ణిర్మాణము-క్రైస్తవ ప్రేమకు లంకె

REGENERATION – THE LINK TO CHRISTIAN LOVE

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

"యేసే క్రీస్తయి యున్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టియున్నాడు: పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును" (I యోహాను 5:1).

(తీతుకు 3:5)

I.   మొదటిది, పాఠ్యభాగములో "నమ్ముట" అంటే అర్ధం ఏమిటి, I యోహాను 5:1ఎ; లూకా 4:41.

II.  రెండవది, ఎవడైతే యేసును నమ్ముతాడో అతడు తిరిగి జన్మించిన వాడు,
దేవుని మూలముగా పుట్టినవాడు, యోహాను 3:9.

III. మూడవది, నూతన జన్మ ద్వారా ఏమి ప్రవహిస్తుంది, I యోహాను 5:1బి; 3:14;
మత్తయి 11:28; యోహాను 10:28; ప్రకటన 21:6.