Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
ఎన్నిక

ELECTION
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము ఉదయము, ఫిబ్రవరి 1, 2015
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, February 1, 2015

"అన్యజనులు ఆ మాట విని, సంతోషించి, దేవుని వాక్యమును మహిమ పరచిరి: మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి" (అపోస్తలుల కార్యములు 13:48).


ప్రయాణంలో పౌలు అతని అనుచరులు పిసిదియలోని రోమా సామ్రాజ్యములోని అంతియొకయకు వచ్చిరి. వారు ఒక సమాజ మందిరానికి వెళ్ళారు. సమాజమందిరపు నాయకులు పౌలును మాట్లాడమని ఆహ్వానించారు. యూదా నాయకులు దూరము నుండి అంతియోకయకు వచ్చినప్పుడు, మాట్లాడమని ఆనవాయితీగా చెప్పారు. మత కేంద్రమైన యేరుషలేములో ఏమి జరుగుతుందో ఒక మాట వినాలనుకుంటారు. ఇది పౌలుకు బోధించడానికి గొప్ప అవకాశము ఇచ్చింది. పౌలు నిలబడి మాట్లాడ ఆరంభించాడు. ఇశ్రాయేలు చరిత్ర తిరిగి లెక్కించాడు. ఆయన యేసు రాకడను గూర్చి, సిలువపై ఆయన మరణమును గూర్చి, మృతులలో నుండి ఆయన పునరుత్ధానములను గూర్చి మాట్లాడాడు. పౌలు ముగించిన తరువాత, కొంతమంది యూదులు యూదా మతమునకు మారిన ఎక్కువ మంది అన్యులు సువార్తను ఎక్కువగా వినాలని చాల ఆసక్తి కలిగియున్నారు.

తరువాత సబ్బాతుకు పట్టణమంతా పౌలు బోధించే రక్షణ సువార్త వినడానికి వచ్చారు.

"అన్యజనులు ఆ మాట విని, సంతోషించి, దేవుని వాక్యమును మహిమ పరచిరి: మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి" (అపోస్తలుల కార్యములు 13:48).

వాస్తవంగా, "నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. " దేవుడు కొంతమందిని ముందుగానే ఎన్నిక చేసాడు. ఇప్పుడు దేవుడు విశ్వాసము ద్వారా క్రీస్తు నొద్దకు వారిని నడిపించాడు. లూకా నిష్క్రియ స్వరాన్ని ఉపయోగించాడు "నిర్ణయింపబడిన వారు" అని చెప్పేటప్పుడు – "ఏర్పరచబడిన వారు" చూపిస్తుంది దేవుడు ఆయన పనిని చేసుకుపోతాడు. దేవుడు మాత్రమే నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. ఇది పాపులను రక్షించే పనిలో దేవుని సౌబ్రాత్రుత్వాన్ని ఇది తేటగా తెలియచేస్తుంది. ఎవరు రక్షింపబడాలో దేవుడు ఎన్నిక చేస్తాడు. ఆయన వారిని పిలుస్తాడు. ఆయన వారిని ఆకర్షిస్తాడు. ఆయన వారిని మారుస్తాడు. "నిత్య జీవమునకు నిర్ణయింపబడిన [ఏర్పరచబడిన] వారందరూ విశ్వసించిరి." డాక్టర్ డబ్ల్యూ. ఏ. క్రీస్ వెల్ మన పాఠ్య భాగమును గూర్చి ఇలా అన్నాడు,

నిత్య జీవానికి ఏర్పరచబడని వారు నమ్మలేదు. ఎన్నిక చేయబడిన వారు నమ్మారు ("ఎన్నిక: దేవుని సౌబ్రాత్రుత్వ ఉద్దేశాన్ని నెరవేర్చింది").

ఇది అంత సామాన్యము! ఎన్నిక సిద్ధాంతము బైబిలు సిద్ధాంతము. బైబిలు అంతటిలో ఉంది.

అవినీతి హేయ పాపముతో నిండిన లోకములో జీవించిన, నోవహును గూర్చి మనం చదువుతాం. "కాని నోవహు ప్రభువు దృష్టిలో దయనొందిన వాడాయెను" (ఆదికాండము 6:8). నోవహు అతని కుటుంబ సభ్యులు గొప్ప జల ప్రళయము నుండి రక్షింపబడ్డారు ఎందుకంటే దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. కృప ద్వారా రక్షించాడు అది ఎన్నిక!

అబ్రహమును గూర్చి చదువుతాం, అతడు ప్రాచీన ప్రపంచంలో విగ్రహారాధనతో నిండిన, కల్దీయ దేశము నుండి పిలువబడ్డాడు. దేవుడు అబ్రహంను ఆ విగ్రహారాధన నుండి పిలిచి రక్షించి గొప్ప జనాంగముగా చేసాడు. అది ఎన్నిక!

పాప భూయిష్టమైన సోదొమ పట్టణంలో జీవించిన లోతును గూర్చి చదువుతాం. ఆ పట్టణం భయంకరం. లోతు ఆ పట్టణాన్ని వదలటానికి ఇష్ట పడలేదు,

"అతడు తడువు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన, ఆ మనష్యులు అతని చేతిని అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసికొని వచ్చిరి; అతని మీద యెహోవా కనికర పడెను: వారు అతనిని ముందుకు తెచ్చింది, ఆ ఊరి బయట నుంచిరి" (ఆదికాండము 19:16).

అది ఎన్నిక! "కాని అతని భార్య వెనుక నుండి తిరిగి చూచి, ఉప్పు స్తంభమాయెను" (ఆదికాండము 19:26). లోతు భార్యకు అలా ఎందుకు జరిగింది? ఆమె ఎన్నిక చెయ్యబడలేదు. అందుకే నశించిపోయింది!

ఐగుప్తులో బానిసత్వములో ఉన్న ఇశ్రాయేలీయులను గూర్చి, చదువుతాం. వారిని విడిపించడానికి దేవుడు మోషేను పంపాడు. అరణ్యంలో మండుచున్న పొదలో, దేవుడు మోషేతో ఇలా అన్నాడు,

"కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమునకు, వారిని నడిపించుటకు దిగి వచ్చియున్నాను" (నిర్గమ కాండము 3:8).

అది ఎన్నిక! అది పాత నిబంధన లేఖనాలలో మళ్ళీ మళ్ళీ బోధింపబడింది.

ప్రవక్త యెషయా దినాలలో ఇశ్రాయేలు దేశము విగ్రహారాధనతో దుష్టత్వముతో నిండుకొని ఉంది. ఆ సమయంలో, ప్రవక్త అన్నాడు,

"సైన్యముల కధిపతియగు యెహోవా బహు కొద్దిపాటి శేషము, మనకు నిలపని యెడల మనం సోదొము వలే నుందుము, గోమోర్రాతో సమానంగా ఉందుము" (యెషయా 1:9).

కొద్దిపాటి శేషము రక్షింపబడ్డారు. అది కూడా ఎన్నికే!

నూతన నిబంధనలో మనం తిరిగి దేవుని సౌబ్రాత్రుత్వాన్ని, ఎన్నుకునే కృపను గూర్చి చదువుతాం. రోమీయులకు వ్రాసిన పత్రికలో చదువుతాం,

"ఆలాగుననే అప్పటి కాలమందు సయితము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలియున్నది...అలాగైనా ఏమందుము? ఇశ్రాయేలు వెదకునది ఏదో అది వారికి దొరకలేదు; కాని ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను, తక్కిన వారు కఠిన చిత్తులైరి" (రోమా 11:5, 7).

ఎఫెస్సీయులకులో మనం చదువుతాం,

"ఎట్లనగా తన ప్రియుని యందు తానూ ఉచితంగా మనకు అనుగ్రహించిన, తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు... తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై జరగవలసిన ఏర్పాటును బట్టి: మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన యెడల విస్తరింపచేసెను, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని, భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తు నందు ఏకముగా సమకూర్చ వలెనని; తనలో తానూ నిర్ణయించుకొనెను: ఆయన తన దయా సంకల్పము చొప్పున, తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియచేసి తనలో తానూ నిర్ణయించుకొనెను" (ఎఫెస్సీయులకు 1:5, 9-11).

II దెస్సలోనీకయులకులో ఇలా చదువుతాం,

"ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధ పరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు, దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడును దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లింపబద్దులమై యున్నాము: మీరీలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మహిమను పొందవలెనని, ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను" (II దెస్సలోనీకయులకు 2:13-14).

దేవుడు ఎన్నుకుంటాడు, దేవుడు పిలుస్తాడు, దేవుడు ప్రజలను ఎన్నిక చేసుకుంటాడు. రాజకీయ నాయకుడు ఏమి చెప్పినా, దేశపు న్యాయ స్థానము ఏమి చెప్పినా, ముస్లీము ఉగ్రవాది ఏమి చెప్పినా, దేవుడు ఇశ్రాయేలు దేశమును అబ్రహాము అతని సంతానమునకు వాగ్ధానము చేసెను. ఆ దేశము వారిది. ఎందుచేత నంటే అది దేవుని ఎన్నిక ఉద్దేశము ఇశ్రాయేలు విడిచి పెట్టబడి దేవుడు వారికిచ్చిన భూభాగానికి వచ్చింది. వారి నుండి ఏ దేశము ఏ ఉగ్రవాది దానిని తీసుకోలేదు. అది ఎన్నిక!

కొంతమంది అంటారు ఎన్నికను నమ్మికవే నీవు ఆత్మలను సంపాదించ లేవని. నేననుకుంటాను వారు కొంతమంది ఆధునిక కేల్వినులను ఆత్మలను సంపాదింపని వారిని చూసి ఉంటారు. కాని డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు వారు నిజ కేల్వినులు కారని, వారు నమ్మకాన్ని "వేదాంతము"గా భావిస్తారు. ఎవరైతే నిజంగా ఎన్నికను నమ్ముతారో అనాదిగా వారే ఎక్కువ ఆత్మలను సంపాదించిన వారు – వైట్ ఫీల్డ్, గొప్ప సువార్తికుడు; విలియం కేరీ, గొప్ప మిస్సెనరీ; ఆదోని రామ్ జడ్సన్, మొట్ట మొదటి అమెరికా మిస్సెనరీ; డాక్టర్ డేవిడ్ లివింగ్ స్టన్, ఆఫ్రికాకు వెళ్ళిన అపోస్తలుడు; సి. హెచ్. స్పర్జన్, అది గొప్ప బాప్టిస్టు బోధకుడు – వీరంతా ఎన్నికను నమ్మారు!

నేను ఈ సంఘాన్ని నలభై సంవత్సరాల క్రితం ఏప్రిల్ లో ప్రారంభించాను. నేను ఎన్నికను నమ్మేవాడను కాదు. అంతా నాపై ఆధారపడి ఉంటుందనుకొనేవాడిని. ఆ భారాన్ని మోసేవాడిని! ఈ గోప్ప సత్యాన్ని చూడడం ప్రారంభించాకా, దేవుని కృపా ఎన్నిక, సువార్త పని నాకు ఆనందాన్నిచ్చేది, మీకు కూడా అంతే అనుకుంటారు! మీరు ఓడిపోలేరు! ఈ గొప్ప దుష్ట పట్టణంలోని వ్యాపార భవనాలు చూస్తే – మానవ జ్ఞానం చెప్తుంది, "మీరు అది చెయ్యలేరు. అది జరగదు! మీరు గుడికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కడు పడిపోతాడు!" కాని అది సాతాను స్వరము! దేవుని వాక్యము ఇలా చెప్తుంది,

"నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి" (అపోస్తలుల కార్యములు 13:48).

మనం ఓడిపోము! ఎన్నిక చేయబడిన వారు వస్తారు నిలుస్తారు! ఎన్నికయిన వారు రక్షింపబడతారు! వెళ్లి వారిని తీసుకొని రండి! అలా చెయ్యండి! చెయ్యండి! చెయ్యండి! క్రీస్తు వారిలో మహిమ పర్చబడతాడు! నిర్ణయింపబడినవారు రక్షింపబడతారు! "లోనికివారినితెండి." ఇలా పాడండి!

వారిని లోనికి తెండి, వారిని లోనికి తెండి,
   పాపము మైదానముల నుండి వారినిలోనికి తెండి;
వారిని లోనికి తెండి, వారిని లోనికి తెండి,
   సంచారము చేయువారిని యేసు నొద్దకు తెండి.
("వారిని లోనికి తెండి" ఎలేక్సేనా ధామస్, 19 వ శతాబ్దము).
(“Bring Them In” by Alexcenah Thomas, 19th century).

సాతాను చెప్పవచ్చు, "ఉజ్జీవము ఎన్నటికి ఉండబోదు! మునుపు ప్రయత్నించారు! అది ఎప్పుడు జరగదు!" కాని దేవుడు ఎన్నుకునే ఉద్దేశంలో అది జరుగుతుంది! నేను నమ్ముతాను అది జరుగుతుందని! మనం చెయ్యలేనిది దేవుడు చేస్తాడు! ప్రభువా, ఉజ్జీవము పంపించు! పాడండి!

ప్రభూ, ఉజ్జీవము పంపు,
   ప్రభూ,ఉజ్జీవము పంపు,
ప్రభూ, ఉజ్జీవము పంపు
   నాతో అది ప్రారంభం కాని!

కాని బైబిలులో ఒక భయంకర హెచ్చరిక ఉంది ఈనాడు. మనకు వర్తిస్తుంది అది,

"ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను, తక్కిన వారు కఠిన చిత్తులైరి" (రోమా 11:7).

"అది" రక్షణను సూచిస్తుంది, ఆ వచనం మన సంఘంలో ఉన్న మనకు వర్తిస్తుంది.

ఎందుకు ఎన్నుకొనబడిన వారు అది పొందుకుంటారు? మంచిది, ఎందుకంటే దేవుడు వినడానికి చెవులిచ్చాడు, చూడ్డానికి కళ్లిచ్చాడు. ఈ ప్రసంగము జాగ్రత్తగా వింటాడు. వారి పాపాన్ని చూస్తారు. క్రీస్తును వారు నమ్ముతారు. ఇది చాలా సామాన్యము. "మిగిలిన వారు అందులిరి." అది నీలో నిజం కాకూడదని నా నిరీక్షణ, కాని నాకు భయంగా ఉంది. "ఎన్నుకొనబడిన వారు పొందుకున్నారు, మిగిలిన వారు అంధులైరి."

చూడండి, "మిగిలిన వారు" ముందుగానే విన్నారు, మరియు, అందుకే, వారి మనసులు మూసుకుపోయాయి. వారు ఇప్పటికే పాస్టరు వర్మ్ బ్రాండ్ మచ్చల విడియో చూసేసారు, క్రీస్తు కొరకు హింసింపబడేవారి నుండి వచ్చాయి, ముందుగానే చూసారు. అప్పటి నుండి ఇప్పటికే చూసారు. వారు ముందుగా చూడడం వలన, వారి మనసులు మూసుకున్నాయి. వారికి వినబడదు, పాష్టర్ వర్మ్ బ్రాండ్ చెప్పేది వారు ఆలోచింపరు! డాక్టర్ చాన్ మాట్లాడింది ఇప్పటికే విన్నారు – చాల సార్లు. మరియు, కనుక, అతని హృదయ సాధారణత, అతని ప్రసంగాల యధార్ధత తృష్ణ వారిని తాకదు. ఆయన భోదించడం ప్రార్ధించడం ఇప్పటికే విన్నారు, కనుక వారు మనసులు మూసుకున్నాయి ఆయన చెప్పేదానికి. నేను బోధించడం వినియున్నారు – చాల, చాల సార్లు. కనుక, నా గర్జించు స్వరము వారి వ్యతిరేకత నుండి దూసుకుపోదు. వారు ఇప్పటికే నా బ్రతిమాలడడం విన్నారు. మరియు, కనుక, నా ప్రసంగాలు వారిని తాకవు. నేను బోధించే దానికి వారి మనసులు మూసుకుపోతాయి.

కాని ఎన్నుకొనబడిన వారు అలా కాదు. పాష్టర్ వర్మ్ బ్రాండ్ విడియో విన్నప్పుడు, వారు ఆశ్చర్యచకితులవుతారు. రోమా చెరసాల నుండి బంధకాల నుండి చీకటి నుండి అప్పుడే వచ్చిన, అపోస్తలుడైన పౌలు వలే భావించి వింటారు. డాక్టర్ చాన్ చెప్పేది కూడా దేవునితో బేటియై, వచ్చిన వైద్యుడైన లూకా వలే భావించి వింటారు. నా ఉరి మేడి బోధను నన్ను లూధర్ లా భావించి వింటారు, దేవుని న్యాయ శాసనాలను ప్రకటిస్తున్నప్పుడు, క్రీస్తు గాయాల నుండి కారుచున్న రక్తములో ఉన్న ఉపశమనమును గూర్చి చెప్పేటప్పుడు.

"ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను, తక్కిన వారు కఠిన చిత్తులైరి" (రోమా 11:7).

పాష్టర్ వర్మ్ బ్రాండ్ ఒంటరి నిర్భంధములో ఉండక ముందు కమ్యూనిష్టు ఏకాగ్రత స్థావరంలో ఇతర ఖైదీలతో మాట్లాడ గలిగాడు. ఒకడు, స్టానియు, అతనితో ఇలా అన్నాడు,

[జార్జి] బెర్ నార్డ్ షా ఒకసారి సలహా ఇచ్చాడు ప్రజలు క్రైస్తవ్యత చిన్న మోతాదుకు భాగా అలవాటుపడి అరుదుగా అసలు విషయం తీసుకుంటారు (Richard Wurmbrand, In God’s Underground, Living Sacrifice Book Co., 2004 reprint, page 120).

అది నీకు జరిగిందా? నీవు అలవాటు పడిపోయావా? క్రైస్తవ్యత చిన్న మోతాదులు ఎక్కువగా తీసుకొని వాస్తవ విషయాన్ని తీసుకోలేకుండా ఉన్నావా?

నిజ మార్పిడి అనుభవించడానికి అంతా కొత్త కళ్ళతో చూడాలి కొత్త చెవులతో వినాలి. బైబిలును గూర్చి నీవు చదువు నిజాలు నీకు విలువైనవి కావాలి. నీ ఆత్మ విలువ, నీ హృదయ పాపాలు, క్రీస్తు లేని భయంకర నిత్యత్వము – ఈ విషయాలు కొత్త మార్గములో నీ ఆత్మను పట్టుకోవాలి, లేనిచో రక్షణ ఉండదు.

డాక్టర్ కాగన్ నేను కొంతమందిని చూసాం, వారు రక్షించబడతారని అనుకోలేదు పాపాలను వారి దుష్ట హృదయాలను మార్చుకొని. వారి పాపాలను గూర్చి ఏడవడం చూసారు. వారు క్రీస్తును నమ్మడం చూసాం. వారు ప్రపంచ హద్దును దాటి విశ్వాసము ద్వారా ఆత్మీయ విభాగంలో క్రీస్తును ఎదుర్కోవడం చూసాం. దీనిని మేము హేతుబద్ధంగా వివరించలేం, అకస్మాత్తు విశ్వాసము. దైవిక మానవ ఎదుర్కోలు. మేము చెప్పిన చేసిన దాని బట్టి జరగలేదు. చాల సార్లు మునుపు చిన్న విషయాలే వారికి చెప్పాము. కాని అకస్మాత్తుగా దేవుడు వారి హృదయాలతో మాట్లాడాడు. పాపపు స్వభావాన్ని వారు గమనించారు. విశ్వాసము ద్వారా వారు క్రీస్తు దగ్గరకు వేగముగా వచ్చారు. ఆయన రక్తము ద్వారా వారు పాపాల నుండి కడుగబడ్డారు. దేవుని ద్వారా జన్మించారు. యేసు క్రీస్తు నందు ఉన్నారు. ఇది మార్పిడి అద్భుతము. ఇది రక్షణ ఆశ్చర్యము. ఈ కారణాన క్రీస్తు సిలువపై మరణించడానికి భూమిపైకి వచ్చాడు. అందుకే ఆయన రక్తము కార్చాడు – నీ పాపాలు నిత్యత్వములో కడుగబడడానికి! అందుకే మృతులలో నుండి ఆయన భౌతికంగా లేచాడు – నీవు జీవము నివ్వడానికి.

"ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను, తక్కిన వారు కఠిన చిత్తులైరి" (రోమా 11:7).

"ఓ కాపరి," ఒకరనవచ్చు, "నేను అంధుడను కాకూడదు. నేను ఎన్నుకొనబడిన వారిలో ఉండాలి." అప్పుడు "నీ పిలుపు ఎన్నిక కచ్చితము చేసుకోవాలి!" (II పేతురు 1:10). దేవుని ఆత్మను తిరస్కరింపకూడదు, అది నీకు కల్మష మోసపూరిత హృదయ స్థితిని బయలు పరుస్తుంది. దేవుని ఆత్మను వద్దనవద్దు క్రీస్తు నొద్దకు తెచ్చేటప్పుడు. ఆయన రక్త ప్రోక్షణ క్రిందకు రావాలి.

నా తల్లి తన జీవిత కాలమంతా చాల సార్లు సంఘము బయట లోపల ఉండేవారు. అయినను సువార్తను గూర్చి ఆమె మనసులో స్పష్టత లేదు. ఆమె గ్రహించలేదు. తన మనసుకు వింతగా ఆశ్చర్యంగా ఉండేది. ఆమె తప్పిపోయింది. ఇంటి దగ్గర వెనుక భాగంలో నా కుమారులు పాడడం ఆమె విన్నారు. వారు ఏడు సంవత్సరాల వయస్సు ఉంటుంది. ఆమె వారు పాడడం విన్నది,

గొర్రె పిల్ల రక్తములో నీవు కడుగబడ్డావా?
నీ వస్త్రాలు మచ్చలేనివిగా ఉన్నాయా? మంచు వలే తెల్లగా ఉన్నాయా?
గొర్రె పిల్ల రక్తములో నీవు కడుగబడ్డావా?
   ("నీవు రక్తములో కడుగబడ్డావా?" ఎలీషా ఏ. హాఫ్ మాన్ చే, 1839-1929).
      (“Are You Washed in the Blood?” by Elisha A. Hoffman, 1839-1929).

ఆరోజు తరువాత ఆమె దానిపై వ్యాఖ్యానించింది. ఆమె అన్నారు, "చిన్న పిల్లలు పాడే వింత పాట, ‘నీవు రక్తములో కడుగబడ్డావా?’ ఎంత వింత పాట!"

అయినను, తరువాత, వింతగా ఏ మాత్రమూ తనకు అనిపించలేదు. ఆమె క్రీస్తు నొద్దకు వచ్చి మార్పు నొందారు. ఆమె నాతో అన్నారు, "యేసు వాస్తవం, రోబర్ట్. ఆయన నా దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన నుండి శుభ్ర పరిశుభ్ర వాసన నాకు వచ్చింది." ఆయనలా చెప్పడం మునుపెన్నడూ నేను వినలేదు. నేను ఎక్కడా చదవలేదు. నాకెవ్వరు తెలియదు సరిగ్గా అలాంటి మార్పు అనుభవము పొందినవారు ఆమె తప్ప. అయినను అది నా తల్లి అనుభవం, విశ్వాసము ద్వారా ఆమె యేసు క్రీస్తు నొద్దకు వచ్చినప్పుడు. ఆమె "గొర్రె పిల్ల రక్తములో కడుగబడింది!"

అలాంటి అనుభవమే నీకు జరగాలని నీవు ఆశించకూడదు – కాని నీవు ఎప్పుడైనా సామాన్య విశ్వాసము ద్వారా క్రీస్తు నొద్దకు వస్తావో, నీవు, కూడా, దేవుని గొర్రె పిల్ల రక్తములో కడుగబడతావు, అది లోక పాపాన్ని తీసేస్తుంది. అలాంటి అనుభవమే నీకు లేకున్నప్పటికీ, ఆమెకు యేసు వాగ్ధనముంది, "మీరు నన్ను వెదికిన యెడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన యెడల, మీరు నన్ను కనుగొందురు" (యిర్మియా 29:13). నీవు యేసును నమ్మినప్పుడు, నీవు, కూడా, ఎన్నుకొనబడిన వారిలో ఒకడవ వుతావు! డాక్టర్ చాన్, ఈ రోజు యేసును నమ్ము వారి కొరకు ప్రార్ధించండి.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ఫ్రుథోమ్: అపోస్తలుల కార్యములు 13:44-48.
ప్రసంగము ముందు పాట బెంజిమిన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్:
"నేను స్నేహితుని కనుగొన్నాను" (జేమ్స్ జి. స్మాల్ చే, 1817-1888).
“I’ve Found a Friend” (by James G. Small, 1817-1888).