Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా దేవదూషణ

BLASPHEMY AGAINST THE HOLY SPIRIT
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము సాయంకాలం, జనవరి 18, 2015
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, January 18, 2015

"కాబట్టి నేను మీతో చెప్పేది ఏమనగా, మనష్యులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును: గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనష్య కుమారునికి విరోధంగా మాటలాడు వానికి, పాప క్షమాపణ కలదు: కాని పరిశుద్దాత్మకు విరోధముగా మాటలాడు వానికి, ఈ యుగమందైనను, రాబోవు యుగమందైనను, పాప క్షమాపణ లేదు" (మత్తయి 12:31-32).


ఈ ఉదయ సమయాన్న గట్టిగా చెప్పాను "బైబిలు ప్రవచనంలో అమెరికా ఎందుకు లేదో అని. " నా పాఠ్యభాగము ఆమోసు 8:2 నుండి, "నా జనులకు ఇశ్రయెలీయులకు అంతము వచ్చే యున్నది; నేనికను వారిని విచారణ చేయడం మానను." "నేనికను వారిని విచారణ చేయడం మానను." అది నా పాఠ్యభాగము. దేవుడు ఎప్పుడైతే కృపను కనుపరచాడో, తీర్పు వస్తుంది. అది మనష్యునికి రావచ్చు, దేశానికి రావచ్చు. "నేనికను వారిని విచారణ చేయక మానను." అది ఒక దేశానికి సంభవించినప్పుడు, అది భ్రష్టత్వమునకు ఇవ్వబడుతుంది. ఒక మనిషికి అది జరిగితే, భ్రష్ట మనసుకు అప్పగింపబడి, వారి మనసు దేవుని వాక్యము తీసికోదు, వారి హృదయము పరిశుద్దాత్మచే తాకబడదు – బైబిలు చెప్తుంది, "దేవుడు వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించెను" (రోమా 1:28), అడిగిమోస్ నోస్ (విలువలేని, తిరస్కరింపబడిన, చెడిపోయిన మనసు!). అది క్షమింపరాని పాపము! అది మరణకరమైన పాపము!

నేను డౌన్ టౌన్ లాస్ ఎంజిలాస్, ప్లవర్ స్ట్రీట్ లో ఉన్న, ట్రినిటి మెథడిష్టు సంఘములో నిలబడ్డాను. ఈ సంఘానికి "పోరాడే వ్యక్తి" షూలర్ సంఘ కాపరి, అతడు ఆసక్తితో విశ్వాసము కొరకు యోచించాడు, వేదిక నుండి క్రీస్తు సువార్త దశాబ్దాలుగా బోధింపబడింది, రేడియో ద్వారా కూడా. ఒకప్పుడు గొప్పదైన ఆ ఆవరణంలో నేను నిలబడ్డాను ఒక బంతి లాంటిది గోడలను తాకుతుంది, ఆ భవనం వాస్తవంగా నా చుట్టూ క్రిందకు దిగుతుంది. ఎవ్వరు లెక్కచెయ్యలేదు. ఒక్క కన్నీరు కార్చబడలేదు. బాబ్ షూలర్ కుమారుడు కొన్ని నిమిషాల దూరంలో ఉంటున్నాడు. అతని బాల్య కాలపు సంఘము. కాని అతడు అక్కడ లేదు భవనం పడుతున్నప్పుడు. అతడు లెక్క చెయ్యలేదు. వేరే వారు కూడా! "నేనికను వారిని విచారణ చేయక మానను."

ఈ భవనమునకు దగ్గర వీధిలో 550 సౌత్ హోప్ విధిలో, ఓపెన్ డోర్ కు చెందిన గొప్ప సంఘముండేది. ఆ సంఘ సంస్థాపకుడు డాక్టర్ ఆర్.ఎ. టోరీ. నా యనవ దశలో ప్రసిద్ధ రేడియో బోధకుడు, డాక్టర్ జె. వెర్నోన్ మెక్ గీ (1904-1988) ఆ సంఘ కాపరి. ఐదు వేల మంది కూర్చోవచ్చు. అది 27 మిలియన్ డాలర్లకు అమ్మబడింది. ఎక్కువనుకున్నారు. కాని పది సంవత్సరాల తరువాత 227 మిలియన్ డాలర్లకు అమ్మబడింది. పెద్దలు చిన్న మనసు గలవారు. వారి చేతులు ఒణికాయి. వారి ముఖాలు భయంతో రంగు మారాయి. వారనుకున్నారు, "మనం ఉంటే ఏదో కోల్పోతాం!" కనుక, భయంతో దేవునిలో విశ్వాసము లేక, వారు 200 మిలియన్ డాలర్లు కోల్పోయారు! వేరే సంఘము కొనుకోవాలనుకుంది. కాని పరిచారకులు చిన్న మనష్యులు భయస్తులు. కావున వారు కూడా ఆ భవనాన్ని కోల్పోయారు – వారు దానిని $27 మిలియను డాలర్లకు పొందుకొనేవారు. వారు కూడా $200 మిలియను డాలర్లు కోల్పోయారు. లాస్ ఎంజిలాస్ అంతర్గత నగరము నల్ల స్థలంగా మారింది, దేవునికి గాని క్రీస్తుకు గాని సాక్ష్యము లేకుండా! "నేనికను వారిని విచారణ చేయక మానను."

అప్పుడు దేవుడు హోప్ వీధిలో ఈ భవనంలో ఉంచాడు – బాబ్ షూలర్ గుడి నుండి మూడు బ్లాకులు, డాక్టర్ మెక్ గీ సంఘము నుండి ఎనిమిది బ్లాకుల దూరము – లాస్ ఏంజిల్స్ నది బొడ్డున. మనకు కూడా అవినీతి నాయకులున్నారు వారివి చిన్న తలంపులు, వారి హృదయాలు భయంతో నిండినవి. వారు మన 300 మందిని వారితో పాటు తీసుకెళ్ళి పోయారు. కాని విశాల హృదయులు నిర్భయులైన స్త్రీ పురుషులు ఈ భవనానికి చెల్లించి కాపాడారు. సువార్త ఈ సంఘ భవనము నుండి – ప్రపంచపు నలుమూలలకు 29, భాషలలో వెళ్తుంది.

యవనస్తులారా ఈ రాత్రి మీతో చెప్తున్నాను, మీరు గొప్పగా బలముగా ఆత్మీయంగా ఉంటారా ఇది ఇలా కొనసాగడానికి మేము వెళ్ళిపోయినప్పుడు? లేక దేవుడు చెప్తాడా, "నేనికను వారిని విచారణ చేయక మానను"? అది జరిగితే ఈ సంఘము కూడా మరణకరణ పాపము చేసినట్లే, దేవుడు పలుకుతాడు, "నేనికను వారిని విచారణ చేయక మానను." చిన్న విషయంగా తీసుకోకండి! అలా జరగదని అనుకోకండి! ప్రకటన గ్రంథములోని మొదటి మూడు అధ్యాయలలోని ఏడు సంఘాలు అలాగే పోయాయి. ఎలాంటి సూచన లేదు గమనిక లేదు, ఏ ఒక్కటి విడిచి పెట్టబడలేదు. ప్రకటన గ్రంథములోని మూడు అధ్యాయాలలో వాటి పేర్లు వివరాలు వ్రాయబడకపోతే వాటి ఉనికే మనకు తెలిసేది కాదు. ఏదైనా గమనిక, సూచన ఉందా యాభై సంవత్సరాల తరువాత మన సంఘము ఉనికిలో ఉంటుందో లేదో అనే విషయంలో? లేక దేవుడు పలుకుతాడా, "నేనికను వారిని విచారణ చేయక మానను"? అందుకే ఉజ్జీవము కొరకు ప్రార్ధించుట చాల తీవ్రంగా పరిగణించాలి! మన ఉనికి కోసం ఉజ్జీవము కావాలి, ఎందుకంటే ఉజ్జీవము లేకుండా మనము సంఘముగా గాని సాక్ష్యముగా గాని ఉండలేము. డౌన్ టౌన్ కు ఎందుకు వెళ్ళాలి బ్లాకు దూరములో సంఘముండగా? ఈ సంఘము జీవము కోల్పోతే (ఉజ్జీవము లేకుండా ఉంటే) దీనికి ప్రజలను ఆకర్షించడానికి ఏ ప్రత్యేకతను కలిగి యుండదు...చనిపోవడం ఆరంభమవుతుంది.

ఉజ్జీవము ఎక్కువగా మీరు యవనస్తులు మరణకర పాపము చేసారా లేదా అనే దానిపై. ఈ సంఘ భవిష్యత్తు మీ చేతులలో ఉంది! మీలో ఎక్కువ మంది యవనస్తులు క్షమింపరాని పాపము చేస్తే, ఈ భవనానికి, ఈ పనికి, ఈ దేశ వ్యాప్త పరిచార్యకు భవిష్యత్తు ఉండదు! దేవుడు మనకు సహాయం చెయ్యాలి!

నేను నమ్ముతాను క్షమింపరాని పాపము చెయ్యడం సులభం. మీరు గుడిలో కూర్చొని కనిపెడితే చాలు. రక్షింపబడాలనే శ్రమ తీసుకోకండి. కూర్చొని కనిపెట్టండి. త్వరలో మీరు క్షమింపరాని పాపము చేస్తారు – మీరు తలంచె దానికంటే ముందే! అనుకున్న దానికంటే సులభంగా! తలంచె ముందే మరణపు సూచనలు వస్తాయి. కొంత జుట్టు రంగు మారుతుంది. జుట్టు ఊడడం మొదలవుతుంది. మునుపు లేని గీతాలు మీ ముఖాలలో ఏర్పడతాయి. అవి మరణపు సంకేతాలు. చల్లని, చావు శత్రువు నీ వెనుకనే ఉన్నాడు. బైబిలు చెప్తుంది, "మనష్యులోక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును" (హేబ్రీయులకు 9:27).

అరబ్ ప్రపంచంలో బస్రాలోని ఒక సేవకుని గూర్చిన కథ చెప్పబడింది. అతడు యజమాని దగ్గరకు వచ్చి అన్నాడు, "బస్రా వీధులలో మరణము చూసాను. మరణము నన్ను చూసింది. యజమానుడా, వేగంగా పరిగెత్తే గుర్రానివ్వండి తప్పించుకొని బాగ్దాద్ పారిపోతాను." యజమాని వేగంగా పరుగెత్తే గుర్రాన్ని ఇచ్చాడు – సేవకుడు అతివేగంగా బాగ్దాదు చేరుకున్నాడు. మరునాడు బస్రా వీధులలో యజమానుడు మరణాన్ని కలుసుకున్నాడు. అతని దగ్గరకు వెళ్లి అడిగాడు, "మరణమా, నా సేవకుని అంతగా ఎందుకు భయపెట్టావు?" మరణము చెప్పింది, "అయ్యా, నేను అతని భయపెట్టాలని కాదు. బస్రా వీధులలో ఆయనను చూడడం నన్ను ఆశ్చర్య పరచింది. చూడండి, రేపు బాగ్దాద్ లో అతనిని కలువబోతున్నాను!" మనిషికి ఒకసారి చనిపోవడానికి నియమింపబడింది. అదే సమయానికి, అదే స్థలములో, తప్పకుండా చనిపోతావు. దేవుడు చెప్తాడు నీ విషయంలో, "నేనికను వారిని విచారణ చేయక మానను." క్షమింపరాని పాపము చేసి ఉంటారు.

"కాబట్టి నేను మీతో చెప్పేది ఏమనగా, మనష్యులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును: గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు" (మత్తయి 12:31).

ఆ పాపమేంటి "క్షమింపబడనిది మానవులకు"? అది పరిశుద్ధాత్మ సాక్ష్యమునకు వ్యతిరేకంగా రక్షించు యేసు కృప విషయంలో. ఒక పురుషుడు కాని స్త్రీ కాని పదే పదే పరిశుద్ధాత్మ సాక్ష్యమును తిరస్కరిస్తున్నట్లయితే, ఆ వ్యక్తి క్షమింపరాని పాపము చేసినట్లు. క్షమింపబడనేరని పాపము ఏమిటంటే స్త్రీ గాని పురుషుడు గాని యేసును నమ్ము విషయంలో పరిశుద్ధాత్మ పిలుపును తిరస్కరించడం. హెబ్రీయులకు వ్రాసిన పత్రికలో, ఆరవ అధ్యాయములో అది చెప్పబడింది. దానిని ప్రుధోమ్ గారు చదివి వినిపించారు.

"ఒకసారి వెలిగింపబడి, పరలోక సంబంధమైన వరమును రుచి చూచి, పరిశుద్ధత్మలో పాలివారై, దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత, మరియు ప్రపంచ శక్తులు వచ్చిన తరువాత, దేవుని కుమారుని మరల సిలువ వేయుచు, బాహాటంగా ఆయనను అవమాన పరుచుచున్నారు; కనుక మారు మనస్సు పొందునట్లు అట్టి వారిని, మరల నూతన పరచుట అసాధ్యము" (హెబ్రీయులకు 6:4-6).

అది సంభవించినప్పుడు నీకు, "అసంభవం...[నిన్ను] నూతన పరచుట మారు మనస్సు పొందునట్లు" (హెబ్రీయులకు 6:4, 6). అసంభవం? దేవుడదే చెప్పాడు, "అసంభవం...మారు మనస్సు పొందునట్లు నూతన పరచుట." అసంభవము? అవును! అదే దేవుడు చెప్పాడు. అసంభవము. అది క్షమింప రాని పాపము. దేవుడు అన్నాడు, "నేను ఇక[వారిని] విచారణ చెయ్యక మానను." అది క్షమింపబడదు, ఈ యుగమందైనను, రాబోవు యుగ మందైనను" (మత్తయి 12:32).

క్షమింపరాని పాపం చేయడం సులభం. నా సహోదరుడు తన స్నేహితులతో పాటు ఒక వేశ్యను చూడడానికి కారులో టిజువానాకు వెళ్ళేవాడు. టిజువానా లో వేశ్యను చూచినందుకు అతడు నరకానికి పోలేదు. అతడు రెండు ఆరు పేకుల బీరు తీసుకొని తన స్నేహితులతో ఇంటి వెనుక భాగంలో తాగేవాడు. ఇంటి వెనుక భాగంలో తన స్నేహితులతో కలిసి బీరు తాగినందుకు తను నరకానికి పోలేదు. అతడు చేసిన ఇతర పనులు గుడిలో చెప్పాను. అవి చేసినందుకు అతడు నరకానికి పోలేదు. కాదు, అతడు నరకానికి వెళ్ళాడు క్షమింపరాని పాపము చేసాడు కాబట్టి. అదే యేసు అన్నాడు, "మనష్యులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింప బడును: గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు" (మత్తయి 12:31).

నా సోదరుడు నాతో అన్నాడు, తన కొడుకు పుట్టాక, మోకాళ్ళపై ప్రార్ధించాడట. అవును, అతడు బాప్టిస్టు అని చెప్పుకుంటాడు, ఎప్పుడు గుడికి వెల్లనప్పటికి కూడా. అతడు ప్రార్ధించాడని నాతో చెప్పినప్పుడు, యేసుని నమ్మి రక్షింపబడాలని చెప్పాను. అతడు చెప్పింది నేనెప్పుడు మర్చిపోలేదు. అతడు అన్నాడు, "ఎవరిదీ వారికే, రోబర్ట్. ఎవరి వారికే." దాని అర్ధము "అది నీకు మంచిది, నాకు కాదు." క్రీస్తును గూర్చి ఎప్పుడు చెప్పినా అలానే అనేవాడు. కాల ప్రవాహంలో అతడు క్షమింపరాని పాపము చేసాడు.

అప్పుడు అకస్మాత్తుగా నలభై ఏళ్ళకే అతడు చనిపోయాడు. అతని భూస్థాపన కూటము చెయ్యమన్నారు. అతని తల నేరవలేదు. ముఖము ముడతలు పడలేదు. నరకానికి వెళ్ళేటప్పుడు అతడు యవనస్థుడు. క్షమింపరాని పాపం చేసాడు కాబట్టి నరకానికి పోయాడు. దేవుడు అన్నాడు, "నేనికను [వారిని] విచారణ చేయక మానను." "అది క్షమింపబడరు, ఈ యుగమందైనను, రాబోవు యుగమందైనను"(మత్తయి 12:32).

అతడు చాల మంచి వాడు కాబట్టి చాల మంది వచ్చారు. అందరికి అతడు ఇష్టం. నాకు కూడా ఇష్టమే. అతడు నా స్నేహితుడు. ఆయన పాశ్చాత్యులను ప్రేమించాడు. పాశ్చాత్యులను ప్రతి రాత్రి, టివిలో చూసేవాడు. ప్రాచీన పాశ్చాత్య వేటగాళ్ళను గూర్చి అతడు చెప్పగలడు. భయంకర బిల్ హికాక్ గూర్చి, బిల్లి ద కిడ్ గూర్చి, డాక్ హేలిడే, జాన్ వెస్లీ హర్డిన్ – వాళ్ళంతా ప్రముఖ వేటగాళ్ళు వారిని గూర్చి చెప్పగలడు. నాకు కొడుకులు పుట్టినప్పుడు అతడిని చూడడానికి తీసుకెళ్ళాను. వారి పేర్లు అడిగాడు. నేనన్నాను, "ఒకని పేరు జాన్ వెస్లీ హైమర్స్ అని చెప్పాను." ప్రక్క గదిలోనికి వెళ్లి తన స్నేహితునికి ఫోన్ చేసాడు. అతడు చెప్పడం విన్నాను, "యదార్ధం చెప్తున్నాడు, రోబర్ట్ తన కొడుకుకి వేటగాడైన – జాన్ వెస్లీ హర్డిన్ పేరు పెట్టాడు!" జాన్ వెస్లీ అనే గొప్ప బోధకుడు న్నాడని అతనికి తెలియదు! నా సోదరుడంటే అందరికి ఇష్టం, నాకు కూడా. అతడు మంచివాడు, కాని నరకానికి వెళ్ళాడు. అతని భూస్థాపన సమయంలో మాట్లాడుచున్నప్పుడు, అతని కుటుంభానికి గాని స్నేహితులకు గాని నిరీక్షణ మాట చెప్పలేక పోయాను! ఒక్క మాట కూడా నిరీక్షణ గూర్చి! ఎందుకంటే అతడు నిరీక్షణ లేని స్థలానికి వెళ్ళిపోయాడు. డాంటే అలీఘిరీ (1265-1321), అతని ప్రసిద్ధ పుస్తకము ద ఇన్ పెర్నో లో అన్నాడు, నరకపు ద్వారముపై ఇలా ఉంటుంది, "ఇక్కడ ప్రవేశించు వారికి, నిరీక్షణ లేదు." నా సోదరుడు క్షమింపరాని పాపము చేసాడు. పరిశుద్ధాత్మ తన హృదయముతో మాట్లాడేటప్పుడు యేసును గూర్చి, అతడు "వద్దు" అన్నాడు. దేవుడన్నాడు, "నేనికను [వారిని] విచారణ చేయక మానను. "అది క్షమింపబడదు, ఈ యుగమందైనను, రాబోవు యుగమందైనను" (మత్తయి 12:31-32).

నరకంలో "రెండవ అవకాశము" ఉండదు. ప్రసంగి 11:3 లో చెప్పబడింది, "మ్రాను అది పడిన చోటనే, ఉండును." మానవుని గుణశీలత నిలకడగా నిర్ణయత వైపు వెళ్తుంది, కష్టతర నిశ్చల తలంపు యొక్క అలవాట్ల వైపు కదులుతుంది. మనిషి ఈ సంవత్సరం ఎలా ఉన్నాడో, వచ్చే సంవత్సరం కూడా అలానే ఉంటాడు. సంవత్సరాలు గడిచే కొద్ది అతని గుణ శీలత నిలకడ అవుతుంది. అది దృడమవుతుంది. చివరకు, సిమెంటంత దృఢమవుతుంది.

నాకు డాక్టర్ డబ్ల్యూ. ఏ. క్రీస్ వెల్ చెప్పేది వినడం ఎంతో ప్రీతి. అతడు యాభై సంవత్సరాలు, డల్లాస్ పస్ట్ బాప్టిస్టు సంఘానికి కాపరి. మధ్య వయస్కునిగా ఎర్రని జుట్టుతో బోధిస్తున్నప్పుడు నుండి నేను వినే వాడిని. వృద్ధునిగా కూడా అతడు చెప్పేది విన్నాను, పూర్తి తెల్లని జుట్టుతో. ఆయన నా ఆదర్శ బోధకుడు. డాక్టర్ క్రీస్ వెల్ చెప్పిన కథ మీకు చెప్తాను.

ఆయన అన్నాడు, అతడు యవన కాపరిగా ఉన్నప్పుడు, సంఘ పరిచారకుడు పక్ష వాతంతో భాద పడుచున్న సంఘ సభ్యుని దర్శించమని అడిగాడు. డాక్టర్ క్రీస్ వెల్ అన్నాడు,

ఆ గృహంలో ప్రవేశించినప్పుడు, అతని భార్య చెప్పింది, "అతడు పడక గదిలో ఉన్నాడు." నేను నిలబడి మంచముపై ఉన్న అతని చూసాను. నేనన్నాను, "నేను కొత్త సంఘ కాపరిని...నిన్ను చూడడానికి వచ్చాను." అతడు అన్నాడు, " గోయిడేంగ్!" నేనన్నాడు, "క్షమించుడి పక్షవాతం వచ్చి మంచముపై నుండి లేవలేక పోతున్నారు." అతడు అన్నాడు, "గోయిడేంగ్!" నేనన్నాను, "బయట అందంగా ఉంది. మీరు బయటికి వెళ్ళాలని నా ఆశ." అతడన్నాడు, "గోయిడేంగ్!" నేనంతా చెప్పక, అతడు అరిచాడు, "గోయిడేంగ్!" నేను నిరుత్సాహ పడ్డాను ఏమి చెప్పాలో తెలియలేదు. నిలబడి ప్రార్ధన చెయ్యవచ్చా అని అడగబోయాను, అతడనుకున్నాడు నేను వెళ్లి పోతున్నాడని. అతడు చూపిస్తూ అన్నాడు, "గోయిడేంగ్! గోయిడేంగ్! గోయిడేంగ్! గోయిడేంగ్! గోయిడేంగ్! గోయిడేంగ్!" అతని భార్య నాతో అన్నారు, "పాష్టరు గారు, అతడు ప్రార్ధించాలని కోరుచున్నాడు." నాకు ఆనందమని చెప్పాను. మొకాళ్ళుని ప్రార్ధించ మొదలుపెట్టాను, "పరలోకపు తండ్రి, ఈ అనారోగ్యస్తునితో మంచిగా ఉండండి." అతడు అరిచాడు, "గోయిడేంగ్!" నేనన్నాను, "దయచేసి, ప్రియ తండ్రి, అతని లేవనేత్తండి." అతడు అరిచాడు, "గోయిడేంగ్!" ప్రార్ధన అయిపోయాక అతను అన్నాడు, "గోయిడేంగ్!" ప్రార్ధన అయ్యాక, "ఆమెన్" అన్నాను. అతడు అన్నాడు, "గోయిడేంగ్." నిలబడి అన్నాను, "దేవుడు నిన్ను దీవించు గాక," అతడు అన్నాడు, "గోయిడేంగ్!" తలుపు దగ్గరకు వెళ్లి, తిరిగి చూచి, "సెలవు" అన్నాను – అతడు అన్నాడు "గోయిడేంగ్!"
         పట్టణము తిరిగి వచ్చాక, ఆ పరిచారకునితో అన్నాను రోగిని చూశానని. అతడు నాతో అన్నాడు, "ఓ, చెప్పడం మర్చిపోయాను. ఒక వక్రపు మాట పలకడం అతని అలవాటు. జీవితమంతా అదే చెప్తున్నాడు. పక్షవాతము వచ్చినప్పుడు భాష పోయి ఆ ఒక్కమాటే మిగిలింది." నేనన్నాను, "నువ్వు నాకు చెప్పనక్కర లేదు అదేంటో. అది ‘గోయిడేంగ్!’" నాకు తెలిసిన వాస్తవ జీవిత సత్యపు లక్షణము ఇదే: నీవు చేసేది నీవు చెప్పేది చివరకు అదే అవుతావు. అది నీ గుణ శీలతలో, నీ ఆత్మలో తేట తెల్లమవుతుంది (“What a Saviour” by W. A. Criswell, Ph.D., Broadman Press, 1978, pages 41, 42).

నేను యేసును నమ్మమని నా సహోదరునితో చెప్పినప్పుడు, అతడు అన్నాడు, "ఎవరిదీ వారికే, రోబర్ట్." చాలా సార్లు అడిగాను ప్రతిసారి అదే చెప్పాడు, "ఎవరిదీ వారికే, రోబర్ట్." అది అతని మాట, అతని సాకు. నేను యేసును నమ్మడం అతడు తప్పు పట్టలేదు. అతనికి ఇష్టంలేదు. క్రీస్తును గూర్చి ఎప్పుడు చెప్పినా "కాదు" అనేవాడు. ఒకనికి నువ్వు చెప్పవచ్చు, "యేసును నమ్ముతావా?" అతడు "లేదు" అనవచ్చు. నువ్వనవచ్చు, "యేసు నొద్దకు వస్తావా అని?" అతడు అనవచ్చు, "లేదు." నువ్వనవచ్చు, "రక్షకుని ఇప్పుడు విశ్వసింపవా?" అతడు అనవచ్చు, "లేదు." చివరకు "లేదు" అనేమాట అతని గుణ శీలతతో తేట తెల్లమవుతుంది. అతని హృదయాలు తిరస్కారముతో స్థిరపడింది – లేదు, లేదు, లేదు, లేదు, లేదు! అతడు జీవితంలో ఒక స్థానానికి వస్తాడు అనుకోకుండానే చెప్తూ ఉంటాడు. ఆలోచింపకు కూడా. అతడే "లేదు"గా అయిపోయాడు. పదము "లేదు" అతని మనసు, హృదయము, తన స్వభావాన్ని కనుపరుస్తుంది. అదంతా పెద్ద "లేదు." అతడు క్షమింపరాని పాపము చేసాడు, ఇక యేసుకు "లేదు" అని చెప్పజాలడు. "మ్రాను ఎక్కవ పడునో, అక్కడే ఉండును." "నేనికను [వారిని] విచారణ చేయక మానను." "అది క్షమింపబడదు, ఈ యుగములో కాని, రాబోవు యుగములో కాని." అది క్షమింపరాని పాపము! అది ఎన్నటికి క్షమింపరాని పాపము!

మన ఆత్మలు కుంటుపడక పోతే మనము ఎన్నుకుంటాము మనము రక్షణ పొందే రోజు. ఘడియ దినాలు గడుస్తున్న కొద్ది, మన చిత్తము మన ఆత్మలు మన హృదయాలు సిమెంటులా దృఢ మైపోతాయి. చివరకు, మనష్యునితో, దేవునితో కూడా కదిలింపబడరు. గుణశీలత, జీవితం, నిత్యత్వ గమ్యము, మూయబడి ముద్రింపబడ్డాయి! అది క్షమింపరాని పాపము! పాపము ఎన్నటికి క్షమింపబడదు!

అదే విషయము ఒక భావన, అంతరంగిక రక్షణ రుజువు కోరుకునే వారి విషయం కూడా. యేసును చూడమని వివరిస్తావు, కాని భావన వైపు చూస్తాడు. వెళ్తూనే ఉంటాడు – ఏమి చెప్పినా. ప్రతిసారి ఒక అనుభూతి, రక్షింపబడాననే రుజువు కొరకు చూస్తాడు. చివరకు తన స్వభావములో గుణశీలతలో భాగమైపోతాయి. క్రీస్తును నమ్మమని చెప్తావు – వెంటనే అనుభూతి కొరకు చూస్తాడు. యేసును నమ్మవా అని అడిగితే, అతడు అన్నాడు, "లేదు." నేను ప్రజలను చూసాను దాని ద్వారా మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ వెళ్ళే వారిని – చివరకు అలవాటయిపోయి ఎంత కష్టపడి ప్రయత్నించినా తప్పించుకోలేరు! వారి స్వభావములో భాగమైపోయింది. వారు యేసును నమ్మరు, మనం ఏమి వారి చెప్పినా .

నాకు గుర్తుంది, 1940 లో, పాత రికార్డు ప్లేయర్ రికార్డులు ఉండేవి. ఒక రికార్డు ఊడి ఉడ్ పెక్కర్ పాట, "హా, హా, హా, హా, హా. హా, హా, హా, హా, హా. అది ఊడీ ఊడ్ పెక్కర్ పాట." చాలాసార్లు వినడం వలన రికార్డు అరిగి పోయింది. పాట వేసినప్పుడు, అరిగిపోయి అదే మళ్ళీ మళ్ళీ వచ్చేది – "హా, హా, హా, హా, హా! హా, హా, హా, హా, హా! హా, హా, హా, హా, హా! హా, హా, హా, హా, హా! హా, హా, హా, హా, హా!" అది పిచ్చి ఎక్కిస్తుంది! అదే నేను విచారణ గదిలో, కొంతమంది నుండి, వింటాను. నేనంటాను, "యేసును నమ్ముతావా?" నీవంటావు, "ఔను." నేనంటాను, "మొకాల్లని ఆయనను నమ్ము కనిపెడతాను." కొన్ని నిమిషాల తరువాత. కుర్చీలో కూర్చోమంటాను. నేనంటాను, "యేసును నమ్మవా?" నీవంటావు, "లేదు." నేను కొనసాగుతూనే ఉంటాను. హా, హా, హా, హా, హా! హా, హా, హా, హా, హా! హా, హా, హా, హా, హా! హా, హా, హా, హా, హా! హా, హా, హా, హా, హా!" నీ తల అందులో గుచ్చుకుపోతుంది. నా స్నేహితుడా, నీవు క్షమింపరాని పాపముచేసే ప్రమాదంలో ఉన్నావు. అప్పుడు దేవుడంటాడు, "నేనికను [వారిని] విచారణ చేయక మానను." క్షమింపబడదు, ఈ యుగమున ఐన, రాబోవు యుగమున ఐన." అది క్షమింపరాని పాపము! అది ఎన్నటికినీ క్షమింపబడని పాపము!

యేసుకు "కాదు" అని చెప్పేవానికి ఏమి కావాలి? ఇంకొక ప్రసంగము కావాలా? లేదు. ఇంకొక వివరణ కావాలా? లేదు. ఏమి కావాలి? ఒకటి అతనికి కావాలి – కదలుట, స్పందించుట, రక్షకుని నమ్ముట, వదిలి వేయుట – రక్షకుని వదిలి వేయుట! యేసు అన్నాడు, "నా యొద్దకు వచ్చు వాని నేనెంత మాత్రమూ త్రోసి వేయను" (యోహాను 6:37). ఆమెన్. ఆయన యొద్దకు రండి. ఆయనను నమ్మండి. అక్కడ వదిలెయ్యండి. యేసుకు వదిలేయండి. మిమ్మును త్రోసి వేయడు! అంతా నీ కొరకు చేస్తాడు. పాపాన్ని కడిగేస్తాడు. నీతిమంతునిగా తీరుస్తాడు. శుద్ధి చేస్తాడు. "అనుభూతి" ఉండదు, అవసరము కూడలేదు, ఆయన నీ కొరకు చేస్తాడు. యేసును నమ్మి సిలువపై ప్రశస్త రక్తములో కడుగబడు! డాక్టర్ చాన్, ప్రార్ధనలో నడిపించండి. ఆమెన్.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ఫ్రుథోమ్: హెబ్రీయులకు 6:4-6.
ప్రసంగము ముందు పాట బెంజిమిన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్:
"ఎక్కువకాలం ఊగిసలాడితే" (డాక్టర్ జాన్ ఆర్. రైస్ చే, 1895-1980).
“If You Linger Too Long” (by Dr. John R. Rice, 1895-1980).