Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
బైబిలు ప్రవచనంలో అమెరికా ఎందుకు లేదు

(బోధింపబడిన ప్రసంగము "కుడి నుండి ఎడమకు" ఆదివారముపై)

WHY AMERICA IS NOT IN BIBLE PROPHECY
(A SERMON PREACHED ON “RIGHT TO LIFE” SUNDAY)
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము ఉదయము, జనవరి 18, 2015
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, January 18, 2015

"ప్రభువు నాతో ఈలాగు సెలవిచ్చెను, నా జనులగు ఇశ్రాయేలీయులకు అంతము వచ్చేయున్నది; నేనికను వారిని విచారణ చేయకమానను. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా మందిరములో వారు పాడు పాటలు, ఆ దినమున ప్రలాపములగును: శవములు లెక్కకు ఎక్కువగును; ప్రతి స్థలమందును అవి పారవేయుబడును ఊరకుండుడి" (ఆమోసు 8:2-3).


"నేనికను వారిని విచారణ చేయకమానను." డాక్టర్ సి. ఎఫ్. కీల్ దాని అర్ధము ఇలా అన్నాడు, "గమనిక లేకుండా విచారణ చేయడం, అతని నేరారోపణ చూడకుండా లేక శిక్ష విధింపకుండా; వదిలి పెట్టడానికి" (కీల్ మరియు డేలిషేక్). కాని డాక్టర్ జాన్ గిల్ ఎక్కువ తీర్పు పర అర్ధము తీసుకొచ్చాడు, "అకస్మాత్తు ముగింపు చేసాడు" (జాన్ గిల్). డాక్టర్ చార్లెస్ జాన్ ఎలికాట్ చెప్పాడు, "ప్రార్ధన నిరుపయోగమయ్యే సమయము వస్తుంది. విజ్ఞాపనలు, ఎంత ఆసక్తి ఆతృతతో కూడినవైనా, చాల ఆలస్యము. కృపా ద్వారము మూయబడింది" (ఎలికాట్స్ వ్యాఖ్యానము బైబిలుపై). మేత్యూ హెన్రీ పాఠ్యభాగము అన్వయింపు ఇలా ఇచ్చాడు, "దేవుని ఓర్పు, దానికి వ్యతిరేకంగా పాపము, ఉంది... పాపము చేయబడుతుంది; ఒక సమయము వస్తుంది తరుచు వదిలి వేయబడే వారు ఇక ఒదలబడరు. నా ఆత్మ ఎల్లప్పుడూ శ్రమించము. తరుచు ప్రయత్నాలు తరువాత, శిక్షపడే రోజు వస్తుంది" (మేత్యూ హెన్రీ వ్యాఖ్యానము).

ఆమోసు అన్నాడు రాజైన యరోబాము కత్తితో మరణిస్తాడు, ఇశ్రాయేలీయులు అస్సీరియాలో, బందీలవుతారు. ఆమోసు అన్నాడు దేవుడు ఆయనతో ఇలా చెప్పాడని, "నేనికను వారిని విచారణ చేయకమానను." అది అంతే! వారి పని అయిపోయింది! పశ్చాత్తాప పడడానికి చాల ఆలస్యమైపోయింది! ప్రార్ధించడానికి చాల ఆలస్యమైంది! ఇశ్రాయేలు రక్షింపబడడానికి చాల ఆలస్యమైంది! దేవుని తీర్పు ముగింపు –

"ప్రభువు నాతో ఈలాగు సెలవిచ్చెను, నా జనులకు అంతము వచ్చేయున్నది...నేనికను వారిని విచారణ చేయక మానను" (ఆమోసు 8:2).

పాఠ్యభాగమునకు రెండు అన్వయింపులు ఉన్నాయి. మొదటిది, అది ఒక దేశానికి వర్తిస్తుంది. ఇశ్రాయేలు దేశానికి, దేవుడు అన్నాడు,

"నేనికను వారిని విచారణ చేయక మానను."

రెండవది, అది ఒక వ్యక్తికి వర్తిస్తుంది. అమజయాకు, ఆమోసును వ్యతిరేకించిన అబద్ధపు యాజకుడు, దేవుడు అన్నాడు, "నీవు అపవిత్రమైన దేశమందు చత్తువు, అవస్యముగా ఇశ్రాయేలీయులు తమ దేశము విడిచి చెరగొనబడుదురు" (ఆమోసు 7:17) దేశానికి తీర్పు ఉంది – వ్యక్తికి కూడ తీర్పు ఉంది.

"నేనికను వారిని విచారణ చేయక మానను."

I. మొదటిది, పాఠ్య భాగము అమెరికాకు పాశ్చాత్య ప్రపంచానికి వర్తిస్తుంది.

"నేనికను వారిని విచారణ చేయక మానను" (ఆమోసు 8:2).

ఒకరు అన్నారు, "డాక్టర్ హైమర్స్, మీరు కచ్చితమా?" అవును, నేను కచ్చితమే! కృపా దినాన్ని దాటి మనం పాపం చేసాం, దేవుడు ఏ మాత్రమూ వదిలిపెట్టడు. అది అమెరికాకు సంభవించదని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను!

ఒక స్వతంత్ర బాప్టిస్టుచే వ్రాయబడిన విషయము చదువుతూ ఉన్నాను. అతడు తెలివైనవాడు. చాల విషయాల్లో అతడు సరియే. కొన్ని సార్లు ఆసక్తికర సహాయకర తలంపులు ఇచ్చాడు. కాని అతడు పూర్తిగా తప్పు మొదటి గొప్ప మేల్కొలుపు ముందు అమెరికాను పడమటి ఇంగ్లాండ్ ను పోల్చే విషయంలో. నేను అతనికి జవాబిస్తున్నాను ఎందుకంటే అతడు తప్పుడు నిరీక్షణ ఇస్తున్నాడు ఇతరులు కూడా అలాగే చేస్తున్నారు – కనుక జవాబు చెప్పాలి. తప్పుడు నిరీక్షణ ఇది – ఇంగ్లాండులోని పాపపు పరిస్థితులు మొదటి గొప్ప మేల్కొలుపును ఆపలేదు (వెస్లీ/ వైట్ ఫీల్డ్ ఉజ్జీవము). కనుక (అతని కారణము) అమెరికా పాశ్చాత్య దేశాల పాపము మన దేశానికి ఇతర ప్రాంతాలకు ఉజ్జీవము పంపకుండా దేవుని ఆపలేదు. బాప్టిస్టు రచయిత తన కధనాన్ని ఇలా వ్రాస్తూ ముగించాడు, " మనం ప్రార్ధించి పని చేద్దాం, దేవుడు [ఉజ్జీవము] పంపేటట్టు."

బుద్ధిలేని దొంగగా నాకు అనిపిస్తుంది. నా జీవితమంతా అది విన్నాను. అతడు పట్టించుకుంటున్నాడను కోవడం లేదు. ప్రార్ధించాలంటూన్నాడు. ఆది మెథడిస్టుల వలే, రాత్రంతా ప్రార్ధన కూటాలకు అతడు ఇష్టపడుతున్నాడా? తన సంఘము అలా చేయగలదా? అలా చేస్తే సంఘమైనా తనకు తెలుసా? వైట్ ఫీల్డ్ మరియు వెస్లీ ప్రజలు చేసినట్లు వారు ఉపవసించి ప్రార్దిస్తారా? తన సంఘము ఉపవాసానికి పిలుపు నివ్వగలదా? ఉపవాసముండే సంఘమైన, ఎక్కడైనా ఉందా, తనకు తెలుసా? "నిర్నయత్వతకు," వ్యతిరేకంగా బోధించగలడా చెప్పగలడా చాల మంది స్వతంత్ర బాప్టిస్టులు నశించారని, మారలేవని, తిరిగి జన్మించలేదని – వారి సంఘస్థులతో వైట్ ఫీల్డ్ మరియు వెస్లీ చేసినట్టు? అతని సంఘ కాపరి అలా చేస్తాడా? అతనికి ఎవరైనా సంఘ కాపరులు తెలుసా, లేదా దక్షిణ బాప్టిస్టు కాపరి తెలుసా, అది ఎవరు చేస్తారు? వెస్లీ మరియు వైట్ ఫీల్డ్ లు చేసినట్టు, సంఘాలలో నుండి బయటపడడానికి ఇష్ట పడేవారు దాని ద్వారా వెళ్ళే ఒక సంఘ కాపరైనా అతనికి తెలుసా? అతడు స్వయంగా దాని ద్వారా వెళ్ళే ఒక కాపరి ఐన తెలుసా? అతడు స్వయంగా దాని ద్వారా వెల్లగలడా? అలాంటి బోధ మాత్రమే ఈనాడు నిజ ఉజ్జీవానికి ఉపయోగ పడుతుంది. అలా చేసే బోధకులెవరైనా తనకు తెలుసా? పాల్ వాషర్ గూర్చి నాకు చెప్పవద్దు! అవసరమైన దానిలో సగము కూడా అతని బోధలో ఉండదు!

మన రచయిత స్నేహితుడు అంటున్నాడు, "ప్రార్ధించి పనిచేద్దాం చివర కొరకు" [ఉజ్జీవము]. అతని మనసులో ఏ పని ఉంది? జెర్రీ ఫాల్ వెల్ చెప్పిన ఒక విషయము పూర్తిగా నిజము. జెర్రీ ఫాల్ వెల్ అన్నాడు, "గర్భ స్రావము అమెరికా జాతీయ పాపము." ఓ, అవును, జెర్రీ ఫాల్ వెల్ ఈ విషయములో పూర్తిగా సరియే! నిజంగా, రచయిత గారు, "ఆ దిశగా పని చెయ్యాలి" అందులో గర్భములో ఉన్న శిశువులను చంపడం కలిసి ఉంది ఆ పని! నీవు "ఆ దిశగా ఏమైనా చేసావా," రచయిత గారు? బాప్టిస్టు సంఘ కాపరులు "ఆ దిశగా పని చేసేవారు" నీకు తెలుసా? గర్భస్రావ ఆసుపత్రులను మూయించే బాప్టిస్టు సంఘాలు నీకు తెలుసా? "ఆ దిశగా పని చేసేవారు" నీకు తెలుసా? నాకు తెలియదు. మా సంఘము లాస్ ఎంజిలాస్ లో రెండు గర్భస్రావ ఆసుపత్రులను మూయించింది. పూర్తిగా వాటిని మూయించాం న్యాయబద్ధంగా! సగం బాప్టిస్టు సంఘాలు రెండేసి చొప్పున గర్భ స్రావ ఆసుపత్రులను మూయించి ఉంటే, గర్భ స్రావాలు ఎప్పుడో ఆగిపోయి ఉండేవి. మా సహాయక కాపరి, డాక్టర్ కాగన్, నేను వందల కొద్ది కేధలిక్కులతో కూర్చున్నాము, గుర్రాలపై పోలీసులు వచ్చి మమ్ములను బెదిరించారు, లాఠీలతో గుర్రాలపై వచ్చి మమ్మును చుట్టుముట్టారు మేము గర్భము తీసుకోడాన్ని వ్యతిరేకించినందుకు. బాప్టిస్టు ఎక్కడున్నారు, రచయిత గారు? నాకు ఎవరు కనబడడం లేదు! కొంతమంది పెద్ద సహోదరీలు కేథలిక్ పాఠశాలల నుండి యవనస్తులు కనిపిస్తున్నారు. బాప్టిస్టు బోధకులు ఎక్కడ ఉన్నారు? సబ్బాతు బడిలో బోధించే బాప్టిస్టు స్త్రీలు ఎక్కడున్నారు? మొదట, సంఘాలను నడిపించే బోధకులపై పెత్తనం చేసే మధ్య వయస్సు బాప్టిస్టు స్త్రీలు, ఎక్కడున్నారు? వారెవరు నాకు కనబడడం లేదు! వారికి లెక్క లేదా? లేదు, వారికి పట్టింపు లేదు! వారు వెస్లీ స్త్రీ లాంటి వారు కాదు, రచయిత మాట్లాడిన గొప్ప ఉజ్జీవము దినాలలో.

అమెరికా ప్రతి సంవత్సరం పది లక్షల పిల్లలను చంపేస్తుంది! రో మరియు వేద్ జనవరి 1973 నుండి మనము 57 మిలియన్ పిల్లలను వధించాం. ఇప్పటికి, ప్రతి అమెరికాను సువార్తిక "క్రైస్తవుని" చేతినుండి రక్తము కారుతుంది. 57 మిలియనుల పిల్లలను చంపి మనము చల్లగా ఉన్న గుడులలో కూర్చొని కబుర్లు వింటున్నాం! 57 మిలియన్ల పిల్లలు చంపబడినప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? మనం అంధత్వంలో ఉన్నాం మనం అనుకున్నాం జోయిల్ ఓస్టీన్ పరిహాస ప్రోత్సాహకర పలుకులు ప్రజలను "రక్షిస్తున్నాయని" – ఎందుకంటే అతడు మధురమైన చిన్న "పాపి ప్రార్ధన" చెప్పిస్తాడు కొన్ని కథలు చెప్పి జోకులతో ప్రజలను నవ్వించిన తరువాత. కాని జోకు మన పైన! ఎవ్వరు రక్షింపబడలేదు! ఒక్కడు కూడా! ఒక్కడు కూడా! ఒక్కడు కూడా! ఒక్కడు కూడా! ఒక్కడు కూడా! ఒక్కడు కూడా! అలాంటి బోధ మన దేశాన్ని గాని మన ప్రజలను గాని మార్చ నేరరు! వారిని ఇప్పుడు మార్చదు! డాక్టర్ ఎ. డబ్ల్యూ. టోజర్ అన్నాడు, "క్రైస్తవ్యానికి చెందిన అలాంటి ప్రబలిన ఉజ్జీవం ఈనాడు అమెరికాలో నైతిక విషాదంగా రుజువగుతుంది దాని నుండి వంద సంవత్సరాలలో కోలుకోలేము" (A.W. Tozer, D.D., Keys to the Deeper Life, Zondervan Publishing House, 1957, p. 12).

"ప్రభువు నాతో ఈలాగు సెలవిచ్చెను, నా జనులకు అంతము వచ్చేయున్నది...నేనికను వారిని విచారణ చేయకమానను" (ఆమోసు 8:2).

అప్పుడు, కూడ, 18 వ శతాబ్ద ఆరంభంలో మన దేశము ఇంగ్లాండులా లేదు – కానేకాదు! గ్రేట్ బ్రిటన్ లో రక్షింపబడని ప్రజలు మనకంటే విపరీతంగా ఉన్నారు! గనులు తవ్వేవారు వ్యవసాయకులు మన కంటే ఎక్కువ చదువుకున్న వారు. చదవలేని వారు వైట్ ఫీల్డ్ వేస్లీల కష్టతర ప్రసంగాలు విని అర్ధం చేసుకునే వారు! మన వారు వారం చేసినట్టు పూర్తి బహిష్కరణపై కష్టతర ప్రసంగము కూర్చొని చదువుతారా? వారు ప్రతి ఉదయము 5:00 గంటలకు మంచులో నిలబడి బోధించేది వినేవారు! మనవారు అలా చెయ్యగలరా? లేదు, చెయ్యలేదు! మన ప్రజలు భావోద్రేకంతో భయంకర విడియో ఆటలు, అశ్లీల చిత్రాలు, బహు చెడ్డ మరియు టివి కార్యక్రమాలు, మత్తు పదార్ధాలు, నిరంతర చెడ్డ సాతాను సినిమాలలో మునిగిపోతారు. వేస్లీస్ ఇంగ్లాండు లోనిది ఏది వారికి లేదు! వెస్లీస్ ఇంగ్లాండులో సామాన్యులలో విడాకులు అనేవి లేవు. గృహాలు గట్టిగా స్థిరంగా ఉన్నాయి, ఈ దినాలలో మన గృహాలు మాదిరి విరగలేదు. వారితో మన ప్రభుత్వము పోల్చండి. వారి దేశము పవిత్ర విజ్ఞులచే పార్లమెంటులో పరిపాలింపబడింది, వారు క్రైస్తవులు కాకున్నా, క్రైస్తవ నీతితో ప్రభావితం చెందిన వారు. మన దేశము పిరికి వారితో నడిపించబడుతుంది, వారు బలహీనులు క్రైస్తవ నైతిక ప్రమాణాలు లేనివారు. వెస్లీస్ ఇంగ్లాండులో శృంగార విపరీతతకు అనుమతించలేదు. ఇంకా చెప్పాలా? వారి మతము సంగతేంటి? అవును, ఎక్కువగా వెస్లీ ఇంగ్లాండులో పతన మతము ఉండేది. అవును, కాపరులందరూ మరనివారు. కాని – ఇది పెద్ద "కాని" – వారు "నిర్నయత్వతచే" ప్రభావితం కాలేదు. వారు మారినట్టు తలంచలేదు, కనీసం 75% మనం అలా చేస్తాం వారు తలంచ లేదు. "పాపి ప్రార్ధన" చెప్పడం ద్వారా వారు రక్షింపబడతారని. పాపులకు తెలుసు వారు క్రైస్తవులు కాదని, మనం చేస్తునట్లు, రక్షింపబడినట్లు నశించ లేరని. అది కూడా, మార్పిడిని గూర్చి వారి తలంచేటప్పుడు, జాన్ బునియన్ చేసినట్టు తలంచే వారు – తన ప్రసిద్ధ పుస్తకాలలో, "ప్రధాన పాపులకు కృప లభ్యత" మరియు "యాత్రికుని ప్రయాణము." మార్పిడిని గూర్చి పురిటనుల అభిప్రాయలు వారికుండేవి – నొచ్చుకొనుట మరియు శుభ్రత – "అలసత్వత విశాలత" కాదు!

ఇంకా, అందరికి ఒక బైబిలు ఉండేది. కింగ్ జేమ్స్ ఒకటే వారికుండేది. కాబట్టి వారు వివిధ తర్జుమాలు, పదుల కొలది, కలుషిత గ్రీకు పాఠ్యములు, విభిన్న తలంపులు, ప్రభావితములచే వారు తికమక కాలేరు. నేటి మన బైబిల్ల వలే పాఠశాలల్లో కళాశాలలో కింగ్ జేమ్స్ బైబిలుపై నిషేధము లేదు. వారు మారనప్పటికి, బైబిలు వాక్యమని నమ్మారు. కింగ్ జార్జి II కూడ (1727-1760) మీకు చెప్పి ఉండేవాడు బైబిలు దేవుని వాక్యమని! పాఠశాలలో బైబిలుపై నిషేదము లేదు. ప్రతి యువనస్తునికి బైబిలు కథలు తెలుసు. విశ్వ విద్యాలయాల్లో, కోర్టులలో, సివిల్ ప్రభుత్వంలో, బైబిలు నిషేదింపబడలేదు మన దేశములోవలే. బైబిలు నిషేదించే బదులు, వారు దానిని ధ్రువపరిచి మరియు అనుమతించారు, వారు తిరిగి జన్మించిన క్రైస్తవులు కానప్పటికీ. ఇంకా, ప్రభుత్వ పత్రాలు లేవు. ప్రతివాడు పనిచేసి, బైబిలులో బోధించినట్టు ప్రతివారు పని నీతిని నమ్మారు. ఇప్పుడు, కష్టపడే పని చిన్నబోయి వ్యంగ్యంగా "పురిటాన్ పని నీతి" అంటున్నారు, చెడుడయినప్పటికినీ. వారు పనిచేసినా పస్తున్నా, వారికి ఎగతాళికి సమయం లేదు మన వలే వైపరీత్యాలను గూర్చి వారు కలలు కనలేదు. ధ్యానానికి, జెన్ బుద్ధి సంకు, తూర్పు మర్మత్వతకు సమయం లేదు. అందుకే చాల తక్కువ మందికి దెయ్యాలు పట్టాయి – చాల తేటమైనది వేల మంది (లక్షలు కాకపోయినా) మన వారు దురాత్మల అదుపులో ఉన్నారు.

కాదు, రచయిత మన ప్రజలను ఇంగ్లాండు వారితో పోల్చడం తప్పు, గొప్ప మేల్కొలుపు ముందు వైట్ ఫీల్డ్ మరియు వెస్లీ క్రింద. సత్యానికి చాల దూరం అమెరికా ప్రజలను నోవాహు రోజుల వారితో పోల్చడం! ఈ తరములను గూర్చి క్రీస్తు సరిగ్గా అదే చెప్ప లేదా? క్రీస్తు అన్నాడు,

"నోవహు దినము ఎలాగుండెనో, మనష్యు కుమారుని [నోవహు] రాకడయును అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు, వారు తినుచు, త్రాగుచు పెండ్లి చేసికొనుచు, పెండ్లికిచ్చుచు నుండి [నోవహు] జల ప్రళయము వచ్చి, అందరిని కొట్టుకొని పోవు వరకు ఎరుగక పోయిరి; అలాగుననే మనష్యు కుమారుని రాకడ ఉండును" (మత్తయి 24:37-39).

క్రీస్తు మన తరాన్ని ఇంగ్లాండు ప్రజలతో పోల్చలేదు 18 వ శతాబ్దంలో! ఆయన మన తరాన్ని నోవహు దినములు ప్రజలతో పోల్చాడు,

"నరుల చెడుతనము భూమి మీద గోప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతానము నొంది, తన హృదయంలో నొచ్చుకొనెను" (ఆదికాండము 6:5-6).

"దేవుడు నోవహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండియున్నది; గనుక నా సన్నిధిని వారి అంతయు వచ్చియున్నది; మరియు, ఇదిగో, వారిని భూమితో కూడా నాశనము చేయుదును" (ఆదికాండము 6:13).

మన రచయిత స్నేహితుడు అన్నాడు, "ఈ నిరీక్షణ ఉంది...దేవుడు ఇంగ్లాండును పూర్తి ఆత్మీయ నైతిక పతనాన్నుండి తప్పించినట్లు...జార్జి వైట్ ఫీల్డ్, జాన్ మరియు చార్లెస్ వెస్లీల, ఆత్మీయ ఉజ్జీవాల ద్వారా దేవుడు అదే పనిని మన రోజుల్లో చెయ్యగలడు." దేవుడు మళ్ళీ చేయగలడు అనడంలో అతడు సరియే. కాని అది ప్రశ్న కాదు. ప్రశ్న అది కాదు దేవుడు ఒక జాతీయ ఉజ్జీవాన్ని పంపగలడా లేదా అని. ప్రశ్న ఏమిటంటే దేవుడు జాతీయ ఉజ్జీవాన్ని పంపుతాడా? నేను నమ్ముతాను జవాబు గింగురుమనే "కాదు!" పాఠ్య భాగములో ఉంది,

"ప్రభువు నాతో ఈలాగు సెలవిచ్చెను, నా జనులకు అంతయు వచ్చేయున్నది...నేనికను వారిని విచారణ చేయక మానను. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా, మందిరములో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును: శవము లెక్కకు ఎక్కువగును; ప్రతి స్థలమందును అవి పార వేయబడును" (ఆమోసు 8:2-3).

నేననుకుంటాను నిరీక్షణ లేదని, లేనే లేదు, అమెరికాకు పాశ్చాత్య ప్రపంచానికి. లేనే లేదు. గతవారంలో ఐఎస్ఐఎస్ (ISIS) వారు అంతర్జాలములో పెట్టిన మాటలు వినండి. పారిస్ లో 17 మందిని వధించిన తరువాత, ముస్లీము ఉగ్రవాదులు ఈ మెయిల్స్ అమెరికాకు పంపాడు. ఈ రెండు ఈ మెయిల్స్ ఇలా చెప్తున్నాయి,

"మేము మీ కోసం వస్తున్నాం. మీ వెనుక భాగాలు చూసుకోండి."

"మేము ఆగం. మీ గురుండి, మీ భార్యల గురుండి పిల్లల గురుండి మాకు అంతా తెలుసు."

వారు లోపర్చుకోడానికి భయపెడతారా? "ఇస్లాము" అంటే అదే అర్ధము! అంటే "అప్పగింత." మనం వారికి అప్పగించుకుంటామా! వారు మన అమెరికాను పశ్చిమాన్ని తీసుకుంటారా? దేవునికే తెలుసు తప్పకుండా, అది మంచిగా కనిపించదు! ఇది మట్టుకు తద్యం. దేవుడు అన్నాడు,

"నేనికను వారిని విచారణ చేయక మానను" (ఆమోసు 8:2).

అమెరికాలో యూరపులో జాతీయ ఉజ్జీవము ఉండదు. అది జరగదు. చాల ఆలస్యమైంది. డాక్టర్ డబ్ల్యూ. ఎ. క్రీస్ వెల్, 20 వ శతాబ్దపు గొప్ప అమెరికా బోధకుడు, అన్నాడు, "మన ప్రజలు భయంలో జీవిస్తారు రేపటికి చెడు ఊహిస్తారు ఎందుకంటే మనం దుష్టులు కాబట్టి...అన్ని విధాలుగా అమెరికా దేవునికి వ్యతిరేకమవుతుంది లౌకికానికి సానుకూలమవుతుంది. తీర్పు దినం వస్తుంది అది మనం భావిస్తాం." డాక్టర్ క్రీస్ వెల్ యాభై సంవత్సరాలుగా డల్లాస్ మొదటి బాప్టిస్టు సంఘానికి కాపరి. ఆయన బిల్లీ గ్రేహం కాపరి. (W. A. Criswell, Ph.D., Great Doctrines of the Bible – Bibliology, Zondervan Publishing House, 1982, p. 43).

మనం దేశముగా ప్రజలుగా తీర్పును ఎదుర్కొంటున్నాం. అందుకే అమెరికా బైబిలు ప్రవచనంలో లేదు. మనం గొప్ప దేశంగా ఇక ఉండలేము. లేఖనాల అంత్యకాల ప్రవచనాలలో వ్యాఖ్యానింపబడే అర్హత మనకు లేదు! కాని నేను మీకు చెప్పాను పాఠ్యము రెండవ అన్వయింపు ఉంది.

II. రెండవది, మరణ కరణ పాపము చేసిన ప్రతి వ్యక్తికి పాఠ్యభాగము వర్తిస్తుంది.

ఒక సమయ మోస్తుంది, ఇంకా రానిచో, మీ గురుండి దేవుడు ఇది చెప్తాడు,

"నేనికను వారిని విచారణ చేయక మానను" (ఆమోసు 8:2).

దేవుడు అది మీతో చెప్తున్నప్పుడు, దాని అర్ధం మీరు నిత్యత్వ పతనంలో ఉన్నారు. మీరు చాల సంవత్సరాలు జీవించవచ్చు. కాని ఇప్పటికే మీరు మండు నిత్య నరకానికి బలి అయి పోయారు దేవుడు ఇలా చెప్తున్నప్పుడు, "నేనికను వారిని విచారణ చేయక మానను." ఎందుకిలా జరుగుతుంది? ఎందుకంటే మీరు క్షమింపరాని పాపం చేసారు! చాల మంది గొప్ప బోధకులు గతంలో క్షమింపరాని పాపాన్ని గూర్చి మాట్లాడారు. డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్-జోన్స్ చెప్పాడు "పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపము" (దైవ కుమారులు, పేజీ 230). జోనాతాన్ ఎడ్వర్డు, ఆషాహెల్ నెటెల్ టన్, మూడీ, టోరీ, జార్జి డబ్ల్యూ. ట్రూట్ట్, ఇంకా పాతకాలపు బోధకులంతా చెప్పారు "క్షమింపరాని పాపమును గూర్చి." డాక్టర్ జాన్ ఆర్. రైస్ అన్నాడు,

ఒక పాపము కలదు "అది క్షమింప బడలేనిది." ఆ పాపము, మానవుడు అది గీస్తే, "అతడు క్షమింపబడడు, ఈ లోకంలో, రాబోవు లోకంలో కూడా." క్షమింప రాని పాపము కలదు...క్షమింప రాని పాపము [ఏదనగా] ఒకటి బ్రతికి ఉండగానే గీత దాటవచ్చు, బ్రతికి ఉండగానే పతన స్థితిలో పడవచ్చు, బ్రతికి ఉండగానే పతన స్థితిలోనికి పోవచ్చు, నిత్యత్వంలో కృపను మించి ఈ లోకంలో ఇంకా జీవిస్తూ ఉండగానే!...అవును, క్షమింప రాని పాపము ఇప్పుడు చెయ్యవచ్చు. సువార్త వినిన ఏ పాపి అయినా, లోతుగా నొచ్చుకొని, పాప గ్రహింపు కలిగి రక్షకుని అవసరత తెలుసుకొని, అతడు భయంకర అపాయంతో ఉండవచ్చు క్షమింపరాని పాపము చేయడం ద్వారా (Dr. John R. Rice, Crossing the Deadline, Sword of the Lord, 1953, pp. 3-4).

దేవుడు దేశాన్ని దాటితే, నిన్ను కూడా దాటవచ్చు! దేశము మరణ కర పాపము చేస్తే, నీవు కూడా చెయ్యవచ్చు! యోహాను 5:16 చెప్తుంది, "మరణకరమైన పాపము కలదు" (I యోహాను 5:16). కయీను ఆ పాపము చేసాడు, దేవుడు తనను నిత్యత్వంలో విడిచి పెట్టాడు. అతడు సంవత్సరాలుగా జీవించినా, రక్షింపబడలేదు. ఫరో, మోషే కాలములో, ఆ పాపము చేసాడు, దేవుడు తనను విడిచి పెట్టాడు. సంవత్సరాలు బ్రతికినా, అతడు రక్షింప బడలేదు. యూదా ఆ పాపము చేసాడు దేవుడు విడిచి పెట్టాడు – కొన్ని గంటలు బ్రతికాడు, కాని రక్షింప బడడానికి చాల ఆలస్యము అయిపొయింది! నీవు పరిశుద్ధాత్మను కాదని యేసును నమ్ముట తిరస్కరిస్తే, ఒకరోజు వస్తుంది ఒక ఘడియ వస్తుంది దేవుడు నిన్ను విడిచి పెడతాడు! ప్రభువు చెప్తాడు,

"నేనికను వారిని విచారణ చేయక మానను" (ఆమోసు 8:2).

డాక్టర్ జాన్ ఆర్.రైస్ పాటలోని మాటలు జాగ్రత్తగా వినండి,

నీవు కనిపెట్టి ఇటుఅటు ఊగి రక్షకుని తిరస్కరించావు;
ఆయన హెచ్చరికలు ఓర్పుతో కూడినవి, ఆయన మోర దయానీయము;
అలా నిషిద్ధ ఫలము తిన్నావు, నీవు సాతాను వాగ్దానము నమ్మవు;
అలా నీ హృదయం కఠిన పర్చబడింది; పాపము నీ మనసును చీకటి మయం చేసింది.
తీర్పును ఎదుర్కోవడం ఎంత విషాదం నీవు గుర్తు చేసుకుంటావు కృప లేకుండా
నీవు అటుఇటు ఊగిసలాడావని ఆత్మపోయే వరకు;
ఏమి అపవాదము ఎంత అంగలార్పు, మరణము నిన్ను నిరీక్షణ లేనివానిగా కనుగొన్నప్పుడు,
నీవు ఇటుఅటు ఊగిసలాడి దీర్ఘకాలము వేచియున్నావు!
("దీర్ఘ కాలం నీవు ఊగిసలాడితే" డాక్టర్ జానీ ఆర్. రైస్, 1895-1980).
(“If You Linger Too Long” by Dr. John R. Rice, 1895-1980).

ఈ ఉదయ కాలాన్న మిమ్ములను బ్రతిమాలుచున్నాను – పాపము నుండి వెనుదిరిగి ఇప్పుడే యేసును విశ్వసించండి, సమయము ఉండగానే. యేసు క్రీస్తును ఇప్పుడే నమ్మండి – దేవుడు మిమ్ములను వదిలేసే ముందు – ఇశ్రాయేలును వదిలిపెట్టినట్టు! ఆమోసు దినాలలో ఆయన అమోజయాను వదిలిపెట్టినట్టు! ఆయన కయినను కూడా విడిచి పెట్టేస్తాడా! ఆయన ఫరోను విడిచి పెట్టేస్తాడా! ఆయన యూదులను విడిచి పెట్టేస్తాడా! ఆయన మిమ్మలను కూడా విడిచి పెట్టేస్తాడా!!! క్రీస్తు నొద్దకు రండి. ఇప్పుడే క్రీస్తును నమ్మండి, బాగా ఆలస్యము అవకముందే! బైబిలు చెప్తుంది,

"నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక; నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మక ముంచుము" (సామెతలు 3:5).

యేసును నమ్మండి. ఆయన రక్తము మీ పాపలన్నింటిని కప్పుతుంది, వాటిని కదిగేస్తుంది. సిలువపై ఆయన మరణము మీ పాపాలను పరిహరించి, నిత్య ఉగ్రత నుండి మిమ్ములను రక్షిస్తుంది. మృతుల నుండి ఆయన పునరుత్ధానము మీకు జీవాన్ని నిరీక్షణను ఇస్తుంది! ఇప్పుడే యేసును నమ్మండి ఆయన ఎన్నటికి మీ పాపాలను క్షమిస్తాడు! డాక్టర్ చాన్, ప్రార్ధనలో దయచేసి నడిపించండి. ఆమెన్.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ఫ్రుథోమ్: ఆమోసు 7:14-8:3.
ప్రసంగము ముందు పాట బెంజిమిన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్:
"దీర్ఘ కాలం నీవు ఊగిసలాడితే" (డాక్టర్ జాన్ ఆర్. రైస్, 1895-1980).
“If You Linger Too Long” (by Dr. John R. Rice, 1895-1980).


ద అవుట్ లైన్ ఆఫ్

బైబిలు ప్రవచనంలో అమెరికా ఎందుకు లేదు

(బోధింపబడిన ప్రసంగము "కుడి నుండి ఎడమకు" ఆదివారముపై)

WHY AMERICA IS NOT IN BIBLE PROPHECY
(A SERMON PREACHED ON “RIGHT TO LIFE” SUNDAY)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

"ప్రభువు నాతో ఈలాగు సెలవిచ్చెను, నా జనులగు ఇశ్రాయేలీయులకు అంతము వచ్చేయున్నది; నేనికను వారిని విచారణ చేయకమానను. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా మందిరములో వారు పాడు పాటలు, ఆ దినమున ప్రలాపములగును: శవములు లెక్కకు ఎక్కువగును; ప్రతి స్థలమందును అవి పారవేయుబడును ఊరకుండుడి" (ఆమోసు 8:2-3).

(ఆమోసు 7:17)

I. మొదటిది, పాఠ్య భాగము అమెరికాకు పాశ్చాత్య ప్రపంచానికి వర్తిస్తుంది, మత్తయి 24:37-39; ఆదికాండము 6:5-6, 13; ఆమోసు 8:2-3.

II. రెండవది, మరణ కరణ పాపము చేసిన ప్రతి వ్యక్తికి పాఠ్యభాగము వర్తిస్తుంది, I యోహాను 5:16; సామెతలు 3:5.