Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




నిజ మార్పిడి – 2015 ముద్రణ

REAL CONVERSION – 2015 EDITION
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము ఉదయము, జనవరి 4, 2015
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord's Day Morning, January 4, 2015

"మీరు మార్పు నొంది, బిడ్డల వంటి వారైతేనే గాని, పరలోక రాజ్యములో ప్రవేశింపరని, మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను" (మత్తయి 18:3).


యేసు తేటగా చెప్పాడు, "మీరు మార్పు నొందిన వారైతేనే గాని...పరలోక రాజ్యములో ప్రవేశింపరు." కనుక, ఆయన స్పష్ట పరిచాడు మీరు మార్పు అనుభవించాలి. ఆయన అన్నాడు మీరు మార్పు అనుభవించకపోతే "పరలోక రాజ్యములో ప్రవేశింపరు."

ఈ ఉదయము నేను మీకు చెప్తాను నిజ మార్పు అనుభవించిన వారికి ఏమి జరుగుతుందని. గమనించండి నేనన్నాను "నిజ" మార్పిడి. "పాపి ప్రార్ధన ద్వారా," మిగిలిన నిశ్చయత మార్గాలలో, లక్షలాది మంది తప్పుడు మార్పిడి అనుభవించారు.

మన సంఘములో కొందరున్నారు, నా భార్యతో సహా, తేటగా బోధింపబడిన సువార్త విని తొలిసారి మార్పు నొందిన వారు. కొందరు పెద్దలున్నారు సువార్త వినక మునుపే పరిస్థితుల బట్టి పూర్తిగా సిద్ధ పడినవారు. వారిలో చిన్న పిల్లలెవరు లేరు. చాల మార్పిడిలు, ఎక్కువగా, పెద్దల మధ్యే చాల నెలల తరువాత క్రీస్తు నొద్దకు వచ్చిన వారు (సంవత్సరాల కూడా) సువార్త ప్రసంగాలు విన్న తరువాత. స్పర్జన్ అన్నాడు, "మొదటి చూపులో విశ్వాస ముంటుంది, కాని క్రమేణా మనం విశ్వాసమును చేరుకుంటాము" (C. H. Spurgeon, Around the Wicket Gate, Pilgrim Publications, 1992 reprint, p. 57). చాల మంది వెళ్ళే "మెట్లు" ఇవి.

I. మొదటిది, మారడానికి కాకుండా వేరే కారణాన్ని బట్టి మీరు గుడికి రావడం.

చాల మట్టుకు ప్రతి ఒక్కరు మొదటి కొన్నిసార్లు నేను చేసినట్లు, "తప్పుడు" కారణానికి గుడికి వస్తారు. నేను యుక్త వయస్సు గల వారు గుడికి వచ్చాను మా ప్రక్కింటి వారు వారితో పాటు గుడికి రమ్మని ఆహ్వానించారు కాబట్టి. 1954 లో గుడికి రావడం ప్రారంభించాను ఎందుకంటే నేను ఒంటరిగా ఉన్నాను, ప్రక్కింటి వారు నాతో బాగున్నారు కనుక. అది "సరియైన" కారణము కాదు, కదా? నేను "ముందుకు" వెళ్లాను మొదటి ప్రసంగము తరువాత బాప్మిస్మము పొందాను కౌన్సిలింగ్ లేకుండా, ఎందుకు ముందుకు వచ్చానో అడగకుండా కూడా. అలా నేను బాప్టిస్టునయ్యాను. కాని నేను మార్పు చెందలేదు. పక్కింటి వారు నాతో భాగా ఉన్నారు కాబట్టి వచ్చాను, రక్షింపబడాలని కాదు. కాబట్టి, నేను దీర్ఘ సంఘర్షణ ద్వారా వెళ్ళాను ఏడేళ్ళ పాటు చివరకు సెప్టెంబరు 28, 1961 న, నేను మార్పు నొందాను బయోలా కళాశాల (ఇప్పుడు బయోలా విశ్వ విద్యాలయం) లో డాక్టర్ చార్లెస్ జే. ఉడ్ బ్రిడ్జిలో ప్రసంగిస్తున్నప్పుడు. ఆ రోజున నేను యేసును నమ్మాను, ఆయన నన్ను కడిగి పాపాన్నుండి రక్షించాడు.

నీ సంగతేంటి? ఒంటరివని గుడికి వచ్చావా – పిల్లవానిగా నీ తల్లిదండ్రులు గుడికి తీసుకొచ్చారా? అలవాటుగా ఈ ఉదయమున నీవు ఇక్కడ ఉంటే, గుడిలో పెరిగిన పిల్లవానిగా, దాని అర్ధము నీవు మారావని కాదు. నీలా నీవు వచ్చావా, ఒంటరివని ఎవరో ఆహ్వానించారని, ప్రజలు నీతో మంచిగా ఉన్నారని? అలా అయితే, నీవు మారినట్టు కాదు. నన్ను తప్పుగా తీసుకోవద్దు. మీరిక్కడున్నందుకు నాకు ఆనందంగా ఉంది – పిల్లవాని వలే అలవాటుగా, ఒంటరితనాన్ని బట్టి, నాలా నా పదమూడు సంవత్సరాల ప్రాయంలో. అవి అర్ధం చేసుకోదగ్గ కారణాలు గుడికి రాడానికి – కాని అవి నన్ను రక్షింప జాలవు. రక్షింపబడడానికి నీకు నిజ మార్పు అవసరము. యేసు ద్వారా రక్షింపబడాలని నిజంగా నీకు అనిపించాలి. అది "సరియైన" కారణము – ఒకేఒక కారణము పాప జీవితం నుండి నిన్ను రక్షించేది.

అలవాటుగా ఒంటరితనాన్ని బట్టి ఇక్కడ ఉండడం తప్పుకాదు. అది సరియైన కారణం కాదు. నీకు ఇంకా ఎక్కువ కావాలి మారడానికి, గుడికి రావడం మంచిగా అనిపిస్తే సరిపోదు.

II. రెండవది, నిజంగా దేవుడున్నాడని తెలుసుకోవడం నీవు ప్రారంభిస్తావు.

నీవు గుడికి రాకముందే దేవుడు ఉనికిలో ఉన్నాడని నీవు గ్రహించి ఉంటావు. కాని చాల మందికి మసకగా, తేటగా లేని నమ్మకము దేవునిలో ఉంటుంది సువార్తను ఎదుర్కొనే ముందు. బహుశా నీవు అంతే నేమో, ఎవరైనా నిన్ను తీసుకొస్తే.

నీవు గుడిలో పెరిగితే, నీకు ఇప్పటికే లేఖనాల గూర్చి ఎక్కువగా తెలిసి ఉంటుంది. నీవు సులభంగా బైబిలులో సరియైన స్థలము కనుగోలవు. రక్షణ ప్రణాళిక నీకు తెలుసు. చాల బైబిలు వచనాలు పాటలు నీకు తెలుసు. అయినను దేవుడు ఇంకా అవాస్తవంగా తేట తనము లేని వానిగా ఉంటాడు.

అప్పుడు, నీవు కొత్త వానివైనా గుడిలో బాలుడవైనా, ఏదో సంభవించడం ప్రారంభమవుతుంది. నిజంగా దేవుడున్నాడని గ్రహించడం ఆరంభిస్తావు – దేవుని గూర్చి మాట్లాడడం కాకుండా. దేవుడు నీవు వాస్తవమైన వ్యక్తి అవుతాడు.

నాకు మసగ, తేటగా లేని నమ్మకం దేవునిలో ఉండేది నా చిన్ని నాటనుండి. నాకు తెలియలేదు "గొప్ప భయంకర దేవుని గూర్చి" (నెహేమ్యా 1:5) పదిహేను సంవత్సరాల వయసు వరకు – రెండేళ్లకు పైగా నేను బాప్టిస్టు సంఘానికి పక్కింటి వారితో హాజరవడం ఆరంభించినప్పటినుండి. నా మామ్మ పాతి పెట్టబడేటప్పుడు నేను సమాధి తోటలో చెట్ల క్రిందకు పరుగెత్తి చెమట్లతో నేలపై పడ్డాను. అకస్మాత్తుగా దేవుడు నాపై ఆవరించాడు – నాకు తెలుసు ఆయన వాస్తవమని, ఆయన అధిక శక్తి మంతుడని, భయంకరుడని, ఆయన పరిశుద్ధతలో. అయినను నేను ఇంకా మారలేదు.

నీవు కూడా ఇలాంటిదే అనుభవిస్తున్నవా? బైబిలు దేవుడు నిజమైన వ్యక్తి యేనా నీకు? అది విశిష్టంగా ప్రాముఖ్యము. బైబిలు చెప్తుంది,

"విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై యుండుట అసాధ్యము: దేవుని యొద్దకు వచ్చువాడు [ఆయన యున్నాడనియు] తన్ను వెదకువారికి ఫలము దయచేయు వాడనియు నమ్మవలెను గదా" (హెబ్రీయులకు 11:6).

దేవుని విశ్వాసముంచడానికి కొంత నమ్మకం కావాలి – కాని అది రక్షించే విశ్వాసము కాదు. అది మార్పిడి కాదు. తరుచు మా అమ్మ చెప్పేది, "నేను ఎల్లప్పుడూ దేవుని యందు విశ్వాసముంచుతాను." ఆమె అలా చెయ్యడంలో నా మనసులో ఎలాంటి ప్రశ్న లేదు. చిన్న నాటి నుండి ఆమె దేవుని నమ్మింది. కాని 80 సంవత్సరాల వరకు ఆమె మార్పిడి పొందలేదు. ఆమె దేవుని యందు విస్వాసముంచడం ప్రాముఖ్యమే, కాని అంతకంటే ఎక్కువ సంభవించాలి నిజంగా ఒక వ్యక్తి మారడానికి.

కనుక, నేను చెప్తున్నాను, బహుశా నీవు ఈ ఉదయం గుడికి వచ్చి ఉంటావు దేవుని గూర్చిన వాస్తవికత తెలియకుండా. అప్పుడు, బహుశా నిదానంగా, బహుశా త్వరగా, నిజంగా దేవుడున్నాడని నీవు చూస్తావు. అది రెండవ మెట్టు, కాని అది ఇంకా మార్పిడి కాదు.

III. మూడవది, నీవు గ్రహిస్తావు నీవు నీ పాపము ద్వారా దేవునికి మనస్తాపము కోపము పుట్టించావని.

బైబిలు చెప్తుంది, "శారీర రిత్యా ఉన్నవారు [అంటే, ఇంకా మారనివారు] దేవుని సంతోష పెట్టలేరు" (రోమా 8:8). కనుక నీవు గ్రహించడం ప్రారంభిస్తావు, మారని వ్యక్తిగా నీవు చేసేది ఏదీ, దేవుని సంతోష పెట్టలేదని. నిజానికి, వీవు పాపివని గ్రహిస్తావు. ప్రతిరోజు "నీ కాఠిన్యమును మార్పు నొందని నీ హృదయమును బట్టి ఉగ్రత నీ మీదికి వచ్చుచున్నది" (రోమా 2:5). బైబిలు చెప్తుంది:

"దుష్టులపై దేవుడు ప్రతి దినము కోపపడును" (కీర్తనలు 7:11).

నిజంగా దేవుడున్నాడని నీవు కనుగొన్న తరువాత, నీవు పాపపు ద్వారా దేవునికి మనస్తాపం కలిగించినావని గ్రహిస్తావు. ఆయనను ప్రేమించకుండా కూడా నీవు ఆయనకు మనస్తాపం కలిగించావు. నీవు చేసిన పాపాలు దేవునికి ఆయన ఆజ్ఞలకు విరుద్ధము. అది వాస్తవమని తేటగా తెలుస్తుంది. దేవుని పట్ల నీకు ప్రేమ లేని స్థితి గొప్ప పాపంగా నీవు చూస్తావు. కాని, దానికంటే, నీవు పాపపు స్వభావం గలవాడవని చూస్తావు, నీలో ఏ మంచితనం లేదని, నీ హృదయం పాప భూఇష్టమైనదని గ్రహిస్తావు.

ఈ మెట్టు తరుచు పురిటనులచే "మేల్కొలుపు" మెట్టుగా పిలుస్తారు. పాపపు గ్రహింపు లోతైన ఖండింపు లేకుండా మేల్కొలుపు ఉండదు. జాన్ న్యూటన్ రాసినట్టు నీకు అనిపిస్తుంది:

ఓ ప్రభువా, నేను ఎంత అధముడని, అపరిశుద్ధుడను అపవిత్రుడను!
అంత పాప భారముతో ఎలా సాహసించగలను?

ఈ కల్మష హృదయము నీకు నివాస స్థలమా?
సమూహము, అయ్యో! ప్రతి భాగములో, ఎంత చెడు నేను చూస్తున్నాను!
   ("ఓ ప్రభువా, నేను ఎంత అధముడిని" జాన్ న్యూటన్ చే, 1725-1807).
   (“O Lord, How Vile Am I” by John Newton, 1725-1807).

లోతుగా ఆలోచించడం ప్రారంభిస్తావు, తరువాత, నీ మనసు హృదయము యొక్క అంతరంగిక పాపపు స్థితిని గూర్చి. నీవు తలస్తావు, "నా హృదయం చాల పాపపూరితమైనది, దేవుని నుండి చాలా దూరంగా ఉంది." ఆ తలంపు నిన్ను కలవర పెడుతుంది. నీవు చాల కలత చెందుతావు తొందర చెందుతావు నీ స్వంత పాపపు తలంపులను బట్టి దేవుని పట్ల నీకు ప్రేమ లేని తనాన్ని బట్టి. దేవుని పట్ల నీ హృదయ నిర్జీవత లోతుగా ఈ స్థితిలో తొందర పెడుతుంది. నీవు గ్రహిస్తావు పాప హృదయము కలిగిన నీలాంటి వ్యక్తికి నిరీక్షణ లేదని. నీవు చూస్తావు దేవుడు నిన్ను నరకానికి పంపడం అవసరమని సరియేనని – ఎందుకంటే నీవు నరక పాత్రుడవు. ఇది నీవు తలస్తావు నీవు నిజంగా మేల్కొల్పబడినప్పుడు మరియు నీవు గ్రహిస్తావు నీవు నీ పాపము ద్వారా దేవునికి మనస్తాపము కలిగించావని ఆయనకు కోపము రప్పించావని. ఈ మేల్కొలుపు మెట్టు ప్రాముఖ్యము, కాని అది ఇంకా మార్పిడి కాదు. తానూ ఎంత పాపియో చూసినప్పుడు అతడు మేల్కొల్పబడతాడు – కాని అతడు ఇంకా మారలేదు. పాపపు ఒప్పుకోలును మించినది మార్పిడి.

నీవు అకస్మాత్తుగా నీవు దేవుని సంతోష పెట్టలేదని, ఆ గ్రహింపు సిద్ధాంతము నుండి దేవుని పట్ల పూర్తి అవగాహనకు నడిపిస్తుంది మరియు దేవుడు మనస్తాపం నొందాడని నీతో చాల అసంతృప్తిగా ఉన్నాడని తెలియ చేస్తుంది. నీవు పూర్తిగా మేల్కొలుపు పొందినప్పుడు నీవు పాపివని అపరిశుద్దుడవని అప్పుడు నీవు నాలుగు ఐదు "మెట్లకు" మార్పులో సిద్ధంగా ఉన్నావు.

చార్లెస్ స్పర్జన్ 15 సంవత్సరాల ప్రాయంలో తన పాపాన్ని గ్రహించాడు. అతని తండ్రి తాతలు బోధకులు. ఆధునిక "నిర్నయత్వత" నిజ మార్పిడి అస్పష్టంగా ఉన్న రోజుల్లో జీవించారు. కనుక, అతని తండ్రి తాతలు తనను "బలవంత" పెట్టలేదు మిడిమిడి "క్రీస్తు కొరకు నిర్ణయము" తీసుకోవడానికి. దానికి బదులు, దేవుడు ఆయనలో గట్టి మార్పిడి పని చెయ్యాలని కనిపెట్టారు. వారు సరియే అని నేననుకుంటున్నారు.

పదిహేనేళ్ళ ప్పుడు స్పర్జన్ చివరకు లోతైన పాపపు ఒప్పుకోలుకు వచ్చాడు. స్పర్జన్ తన పాపపు మేల్కొల్పును గూర్చి ఈ మాటలలో వివరించాడు:

అకస్మాత్తుగా, నేను మోషేను కలిసాను, తన చేతులలో ధర్మ శాస్త్రమును మోస్తున్నాడు, అతడు నా వైపు చూసాడు, అగ్ని నేత్రములతో నన్ను తీవ్రంగా పరిశోదిస్తూ ఉన్నాడు. ఆయన [చదవమని నాతో చెప్పాడు] ‘దేవుని పది మాటలు’ – పది ఆజ్ఞలు – నేను చదువుతూ ఉండగా అవన్నీ కలిసి నన్ను పరిశుద్ధ దేవుని దృష్టిలో నన్ను నేరారోపణ చేస్తూ ఖండిస్తున్నట్టు అనిపించింది.

ఆయన చూసాడు, ఆ అనుభవంలో, దేవుని దృష్టిలో తానూ పాపినని, "మతము" కాని "మంచితనము" కాని అతని రక్షింపలేవని. యవన స్పర్జన్ గొప్ప నిస్ప్రహ ద్వారా వెళ్ళాడు. తన స్వంత ప్రయత్నాలతో దేవునితో సమాధానపడడానికి చాల విధాలుగా ప్రయత్నించాడు, కాని ఆయన ప్రయత్నాలన్నీ దేవునితో సమాధానపడడానికి విఫలమయ్యాయి. అది మార్పిడిలో నాల్గవ మెట్టుకు తీసుకెళ్తుంది.

IV. నాల్గవది, నీ రక్షణను పొందుకోడానికి ప్రయత్నిస్తావు, లేక ఎలా రక్షింప బడాలో నేర్చుకుంటావు.

మేల్కొల్పబడిన వ్యక్తి పాపిగా భావిస్తాడు, కాని యేసు వైపు ఇంకా తిరగడు. ప్రవక్తయైన యెషయా వివరించాడు ఈ స్థితిలో ఉన్న ప్రజలను, "ఆయన నుండి మన ముఖములను దాచుకొంటిమి...ఆయనను ఎన్నిక చేయకపోతిమి" (యెషయా 53:3). మనము ఆదాము వలే ఉన్నాము, తానూ పాపినని తెలిసినప్పటికీ, రక్షకుని నుండి దాక్కున్నాడు, అంజూరపు ఆకులతో తన పాపాన్ని కప్పుకుంటూ (ఆదికాండము 3:7, 8).

ఆదాము వలే, మేల్కొనిన పాపి పాపము నుండి తనను రక్షించు కోడానికి ఏదో ఒకటి చేయ ప్రయత్నిస్తారు. అతడు ఎలా రక్షింపబడాలో "నేర్చుకుంటాడు." కాని తానూ కనుగొంటాడు "నేర్చుకొనుట"తనకు మంచి చేయదని, "నేర్చుకుంటూ, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానములోనికి రాలేడని" (II తిమోతి 3:7). లేక ఒక "భావన" కొరకు చూస్తాడు యేసుకు బదులుగా. ఒక "భావన" కొరకు చూసేవారు నెలల తరబడి ప్రయత్నిస్తారు, ఎందుకంటే "భావన" తో ఎవరు రక్షింపబడడు. స్పర్జన్ తన పాప విషయంలో మేల్కొన్నాడు. కాని అతడు నమ్మలేదు కేవలం యేసును నమ్మడం ద్వారా రక్షింపబడటాడని. అతడు అన్నాడు,

నేను క్రీస్తు నొద్దకు రాకముందు, నాతో నేను చెప్పుకున్నాను, "తప్పకుండా అది కాదు, యేసును నమ్మితే, ఉన్నపాటున, నేను రక్షింపబడతాను? కొంత భావన పొందాలి; ఏదో చెయ్యాలి" (ఐబిఐడి.).

అది ఐదవ మెట్టుకు నిన్ను తీసుకెళ్తుంది.

V. ఐదవది, చివరకు నీవు యేసు నొద్దకు వస్తావు, ఆయననే నమ్ముకుంటావు.

యవ్వన స్పర్జన్ చివరకు ఒక బోధకుడు ఇలా చెప్పడం విన్నాడు, "క్రీస్తు వైపు చూడు...నీ వైపు చూసుకుంటే ఉపయోగము లేదు...క్రీస్తు వైపు చూడు." తన అంతరంగిక నలిగినా స్థితి నొప్పి తరువాత – స్పర్జన్ చివరకు యేసు వైపు చూచి ఆయనను నమ్ముకున్నాడు. స్పర్జన్ అన్నాడు, "నేను [యేసు’] రక్తముచే రక్షింపబడ్డాను! ఇంటికి గంతులు వేసుకుంటూ వెళ్ళేవాడిని."

ఆ సంఘర్షణ అనుమానము తరువాత, అతడు భావన కొరకు చూడడం ఆపేసాడు, ఆయనలో ఏదీ చూసుకోలేదు. ఆయన కేవలం యేసును నమ్మాడు – మరియు యేసు అప్పుడే తనను రక్షించాడు. కనురెప్ప పాటులో యేసు క్రీస్తు రక్తము ద్వారా తను కడుగబడ్డాడు! ఇది సామాన్యం, మరియు ఇది ఒక మానవుడు పొందదగిన ప్రగాఢ అనుభవము. అది, నా స్నేహితుడా, నిజ మార్పిడి! బైబిలు చెప్తుంది, "ప్రభువైన యేసు క్రీస్తు నందు విశ్వాసముంచుము, అప్పుడు నీవు రక్షింపబడుదువు" (అపోస్తలుల కార్యములు 16:31). జోషఫ్ హార్ట్ అన్నాడు,

పాపి నమ్మిన క్షణమే,
   సిలువ వేయబడిన దేవుని నమ్మినప్పుడు,
క్షమాపణ వెనువెంటనే అతడు పొందుకుంటాడు,
   ఆయన రక్తము ద్వారా పూర్తి విమోచన.
("పాపి నమ్మిన క్షణమే" జోషఫ్ హార్ట్ చే, 1712-1768).
(“The Moment a Sinner Believes” by Joseph Hart, 1712-1768).

ముగింపు

యేసు అన్నాడు,

"మీరు మార్పు నొంది, బిడ్డల వంటి వారైతేనే గాని, పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను" (మత్తయి 18:3).

యాత్రికుని ప్రయాణంలోని ప్రాముఖ్య పాత్రవలే, మిడిమిడి "క్రీస్తు కొరకు నిర్ణయము" దగ్గర స్థిరపడిపోవద్దు. వద్దు! వద్దు! నీ మార్పు వాస్తవమని నిర్ధారించుకో, ఎందుకంటే నీవు నిజంగా మారకపోతే, "పరలోక రాజ్యములో ప్రవేశింపనేరవు" (మత్తయి 18:3).

నిజ మార్పిడి కొరకు

1. నీవు ఒక స్థలము దగ్గరకు రావాలి నిజంగా నమ్మాలి దేవుడున్నాడని – నిజ దేవుడు పాపులను నరకంలో పడవేస్తాడు, రక్షింపబడిన వారిని చనిపోయిన తరువాత పరలోకానికి తీసుకెళతాడు.

2. నీవు తెలుసుకోవాలి, నీ అంతరంగములో, నీవు పాపివని దేవునికి మనస్తాపం కలిగించావని. చాల కాలంగా ఇలా చెయ్యవచ్చు (కొంతమందికి తక్కువ వ్యవధి). డాక్టర్ కాగన్, మన సహాయక సంఘ కాపరి, అన్నాడు, "నేను చాల నిద్రలేని రాత్రులు పోరాడాను దేవుడు నాకు వాస్తవము అయిన తరువాత. ఈ వ్యవధిని రెండు సంవత్సరాల మానసిక వేదనగా వివరిస్తాను" (C. L. Cagan, Ph.D., From Darwin to Design, Whitaker House, 2006, p. 41).

3. నీవు తెలుసుకోవాలి నీవు మంచి ఏమీ చెయ్యలేవు నిన్ను మనస్తాపంతో కోపంగా ఉన్న దేవునితో సమాధాన పరచుకోడానికి. నీవు చెప్పేది, నేర్చుకోనేదీ, చేసేది, భావన నీకు సహాయ పడలేవు. అది నీ మనసులో హృదయంలో స్పష్టం కావాలి.

4. దేవుని కుమారుడైన, యేసు క్రీస్తు నొద్దకు నీవు రావాలి, ఆయన రక్తము ద్వారా నీ పాపాలు కడుగబడాలి. డాక్టర్ కాగన్ అన్నాడు, "నాకు గుర్తింది, సరిగ్గా రెండు సెకనులు, నేను [యేసును] నమ్మినప్పుడు... అనిపించింది నేను వెనువెంటనే [యేసును] ఎదుర్కొన్నట్లు...నేను కచ్చితంగా యేసు క్రీస్తు సన్నిధిలో ఉన్నాను ఆయన తప్పక నాకు అందుబాటులో ఉన్నాడు. చాల సంవత్సరాలు ఆయన నుండి తొలగిపోయాను, ఎల్లప్పుడూ ఆయన నా కొరకు ఉన్నప్పటికీనీ, ప్రేమతో నాకు రక్షణ ఇస్తున్నప్పటికినీ. కాని ఆ రాత్రి ఆయనను నమ్మే సమయం వచ్చిందని నేను ఎరుగుదును. నాకు తెలుసు నేను ఆయన దగ్గర కన్నా రావాలి లేక వెళ్లిపోవాలి. ఆ క్షణంలో, కొన్ని క్షణాలలో, నేను యేసు నొద్దకు వచ్చాను. నేను ఇక ఏమాత్రము నన్ను నేనే నమ్ముకునే అవిశ్వాసిగా ఉండలేను. నేను యేసు క్రీస్తును నమ్ముకున్నాను. ఆయన యందు విశ్వసముంచాను. అది ఎంతో సామాన్యము...నా జీవితమంతా పరిగెడుతూనే ఉన్నాను, కాని ఆ రాత్రి నేను వెనుతిరిగి నేను నేరుగా వెనువెంటనే యేసు క్రీస్తు నొద్దకు వచ్చాను" (సి. ఎల్. కాగన్, ఐబిఐడి., పేజీ 19). అది నిజ మార్పిడి. అది నీ వనుభావించాలి యేసు క్రీస్తు నందు మార్పు పొందడం! యేసు నొద్దకు వచ్చి ఆయనను నమ్మండి! ఆయన నిన్ను రక్షించి సిలువపై కార్చిన తన రక్తముతో నీ పాపములన్నిటినుండి నిన్ను కడుగుతాడు! ఆమెన్.


(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ఫ్రుథోమ్.
ప్రసంగము ముందు పాట బెంజిమిన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్:
"అద్భుత కృప" (జాన్ న్యూటన్ చే, 1725-1807).
“Amazing Grace” (by John Newton, 1725-1807).


ద అవుట్ లైన్ ఆఫ్

నిజ మార్పిడి – 2015 ముద్రణ

REAL CONVERSION – 2015 EDITION

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

"మీరు మార్పు నొంది, బిడ్డల వంటి వారైతేనే గాని, పరలోక రాజ్యములో ప్రవేశింపరని, మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను" (మత్తయి 18:3).

I.     మొదటిది, మారడానికి కాకుండా వేరే కారణాన్ని బట్టి మీరు గుడికి రావడం.

II.    రెండవది, నిజంగా దేవుడున్నాడని తెలుసుకోవడం నీవు ప్రారంభిస్తావు, నెహెమ్యా 1:5; హెబ్రీయులకు 11:6.

III.   మూడవది, నీవు గ్రహిస్తావు నీవు నీ పాపము ద్వారా దేవునికి మనస్తాపము కోపము పుట్టించావని, రోమా 8:8; 2:5; కీర్తనలు 7:11.

IV.   నాల్గవది, నీ రక్షణను పొందుకోడానికి ప్రయత్నిస్తావు, లేక ఎలా రక్షింప బడాలో నేర్చుకుంటావు, యెషయా 53:3; ఆదికాండము 3:7, 8; II తిమోతి 3:7.

V.    ఐదవది, చివరకు నీవు యేసు నొద్దకు వస్తావు, ఆయననే నమ్ముకుంటావు, అపోస్తలుల కార్యములు 16:31.