Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
కొత్త "నిర్గమకాండము" సినిమాకు నా జవాబు మరియు బైబిలుపై దాని దాడి!

MY ANSWER TO THE NEW “EXODUS” MOVIE
AND ITS ATTACK ON THE BIBLE!
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము సాయంత్రము, డిసెంబర్ 28, 2014
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord's Day Evening, December 28, 2014

"అతడు నన్ను గూర్చి వ్రాసెను, గనుక మీరు మోషేను నమ్మినట్టయిన: నన్నును నమ్ముదురు. మీరతని లేఖనములను నమ్మని యెడల, నా మాటలు ఎలాగు నమ్ముదరనెను?" (యోహాను 5:46, 47).


పదిహేడు సంవత్సరాల ప్రాయములో సేవకు పిలువబడునట్లు ఖచ్చితంగా అనిపించింది. నేను రక్షింపబడలేదు, కాని నాకు తెలుసు దేవుడు నన్ను బోధకునిగా ఆశపడుచున్నాడని. వారు చెప్పారు నాకు కళాశాల డిగ్రీ ఉండాలని. దాని గూర్చి చాలాకాలం ఆలోచించాను. నేను ఉన్నత పాఠశాలలో తప్పాను కనుక ఏ కళాశాల నన్ను తీసుకోదు. తిరిగి ఉన్నత పాఠశాలకు వెళ్ళాను. క్రమ ఉన్నత పాఠశాలకు నేను పెద్ద వాడవవుతాను కనుక, నేను "చెడు బాలురు" ప్రత్యేక పాఠశాలకు వెళ్ళాను. నేను చెడ్డ వానిని కాదు, కాని ఈ పాఠశాల మాత్రమే నన్ను తీసుకుంది. సంవత్సరం తరువాత పట్ట భద్రుడనై కళాశాలను గూర్చి ఆలోచింప మొదలుపెట్టాను. ఈ సమయంలో నేను జేమ్స్ హాడ్ సన్ టేలర్ ను గూర్చి ఒక పుస్తకం చదివాను, అతడు గొప్ప ప్రముఖ మిసేనరీ చైనాకు. నేననుకున్నాను, "అదే నేను చెయ్యబోతున్నాను. చైనా వారికి మిసేనరీ నవుతాను."

పంతొమ్మిది సంవత్సరాలప్పుడు లాస్ ఎంజిలాస్ లో మొదటి చైనీయ బాప్టిస్టు సంఘములో చేరాను. డాక్టర్ తిమోతి లిన్ కాపరి అవకముందు సంవత్సరము ముందు. అదే సంవత్సరంలో, శీతాకాలంలో, బెయెలా కాలేజిలో (ఇప్పుడు విశ్వవిద్యాలయం) విద్యార్ధిగా చేరాను. డబ్బులేదు కుటుంబము నుండి సహాయము లేదు, కాబట్టి మధ్యాహ్నము పనిచేసి సాయంకాలాలు కళాశాలలకు వెళ్ళేవాడిని. నాకు కారు లేదు, కనుక లాస్ కళాశాల ఉన్న లా మిలాడాకు, బస్సులో వెళ్ళేవాడిని. బాగా చదవడం నాకు తెలిసేది కాదు. ప్రతి ఉదయము దీర్ఘ బస్సు ప్రయాణము మధ్యాహ్నము ఎక్కువ గంటల పని తట్టుకోవడం కష్టమయ్యేది. చాల తరగతులలో విఫలుడయ్యాను బయోలాలో సెమిస్టర్ తరువాత బయటకు వచ్చేసారు. ఒక సంఘటన బయోలాలో జరిగింది నా జీవితాన్ని నిత్యముగా మార్చేసింది.

ప్రతి సెమిస్టర్ లో బయోలా ప్రత్యేక ప్రసంగీకుని రప్పించేది చాపెల్ లో ప్రతి ఉదయ ధ్యానాల నిమిత్తము. ఆ సెమిస్టర్ లో ప్రసంగీకుడు డాక్టర్ చార్లెస్ జె. ఉడ్ బ్రిడ్జి (1902-1995). ఆయన ప్రముఖ అధ్యాపకులు పుల్లర్ వేదాంత సెమినరీ పాసాదేనా, కాలిఫోర్నియాలో. కాని డాక్టర్ ఉడ్ బ్రిడ్జి పుల్లర్ నుండి రాజీనామా చేసాడు ఎందుకంటే సెమినరీ స్వతంత్రత వైపు వెళ్ళడం ఆయన చూసాడు.

బయోలా చాపల్ ఆరాధనలలో, డాక్టర్ ఉడ్ బ్రిడ్జి II పేతురు నుండి వచనము వెంబడి వచనము బోధించాడు. ఆయన చైనాలో పుట్టారు ఎందుకంటే తన తల్లిదండ్రులు మిసేనరీ కాబట్టి. అందుకు అతనిని ప్రముఖ వ్యక్తిగా చూసాను. అతని బోధను ఎంతో ఆసక్తితో వినేవాడిని అంతలా నా జీవితంలో ఏ ప్రసంగీకుని బోధలేదు. అతడు II పేతురు 2:1-3 కు వచ్చినప్పుడు, అతడు పుల్లర్ లోని స్వతంత్రతకు వ్యతిరేకంగా విరుచుకుపడ్డాడు, వేరే సెమినరీలలోని స్వతంత్రత పట్ల కూడా. అతడు అవివేకి కాదు. అతడు పిహెచ్.డి. పట్టభద్రుడు చరిత్రలో ప్రిన్సిటన్ కళాశాల నుండి డలాకు కాలాశాలలో ఇంకా చదివాడు. డాక్టర్ జె. గ్రేషమ్ మాచెన్ తనను ప్రెస్బిటేరియన్ పారిన్ మిస్సన్స్ కు స్వతంత్ర అధికారిగా నియమించాడు. ఒక వారం ఆయన దివిని నేను మార్చబడ్డాను. నేను రక్షింపబడడం మాత్రమే కాక, బైబిలులోని ప్రతిమాట ప్రేరణను నేను నమ్మను, బైబిలు కచ్చితమైన హెబ్రీ పాత నిబంధన గ్రీకు కొత్త నిబంధన. బయోలాలో ఒక సెమిస్టర్ మాత్రమే హాజరయ్యాను. అక్కడ యేసు నన్ను రక్షించాడు, పరిశుద్ధ లేఖనాల మాటలు నమ్మడం అక్కడే నేర్చుకున్నాను. మొదటి శతాబ్దంలో పరిశయ్యాలు పాత నిబంధననే నమ్మారు, కాని వారు క్రీస్తును గూర్చిన ప్రవచనాలను తిరస్కరించారు. ఆయన వారితో అన్నాడు,

"అతడు నన్ను గూర్చి వ్రాసెను, గనుక మీరు మోషేను నమ్మినట్టయిన: నన్నును నమ్ముదురు. మీరతని లేఖనములను నమ్మని యెడల, నా మాటలు ఎలాగు నమ్ముదరనెను?" (యోహాను 5:46, 47).

డాక్టర్ డబ్ల్యూ. ఎ. క్రీస్ వెల్ అన్నాడు "యేసు [మాట] లో మోషేను’ గూర్చి తక్కువగా చెప్పబడింది ఆయన ఎవని గూర్చి చెప్తున్నాడో యూదులకు తెలుసు" (The Criswell Study Bible; note on John 5:45-47). డాక్టర్ ఆర్. సి. హెచ్ లెన్ స్కి అన్నాడు, "...మోషే చెప్పేది యూదులు నమ్మలేరు యేసు చెప్పేది కూడా నమ్మడం లేదు" (యోహాను సువార్త అనువాదము; గమనిక యోహాను 5:46). మరియు డాక్టర్ చార్లెస్ జాన్ ఎలికాట్ అన్నాడు, "వారు మోషేను నమ్మలేరు, కాబట్టి ఆయనను నమ్మలేరు" (Ellicott’s Commentary on the Whole Bible; note on John 5:46).

"అతడు నన్ను గూర్చి వ్రాసెను, గనుక మీరు మోషేను నమ్మినట్టయిన: నన్నును నమ్ముదురు. మీరతని లేఖనములను నమ్మని యెడల, నా మాటలు ఎలాగు నమ్ముదరనెను?" (యోహాను 5:46, 47).

డాక్టర్ లెన్సికి అన్నాడు యేసు మాటలు "...ఎంతో యోగ్యమైనవి ‘పరిశోధన’ ను మించినది విమర్శకులకు [వ్యతిరేకంగా] నిలుచునవి" (లెన్సికి, ఐబిఐడి.). "అతడు నన్ను గూర్చి వ్రాసెను, గనుక మీరు మోషేను నమ్మినట్టయిన: నన్నును నమ్ముదురు" (యోహాను 5:46).

మనకు ఈ సినిమా ఉంది "నిర్గమ కాండము: దేవుళ్ళు రాజులు" – నిర్మాత దర్శకుడు రిడ్లీ స్కాట్. వికిపీడీయా ప్రకారము, "2013 లో రిడ్లీ అన్నాడు తాను నాస్తికుడనని." అందుకే మనం ఆశ్చర్య పడకూడదు డాక్టర్ ఆల్ బెర్ట్ మొహ్ లెర్ అన్నాడు, "మనం సినిమాలో చూసేది శక్తి లేని మోషే" (www.albertmohler.com). ఆశ్చర్యము లేదు! తోటి దర్శక నిర్మాత నాస్తికుడు! ఎలా ఒక వ్యక్తి దేవుని నమ్మని వాడు నిర్గమ కాండము పై సినిమా తీస్తాడు అది లేఖనాల ప్రకారము ప్రభువైన యేసు క్రీస్తు సాక్ష్యము ప్రకారము అది వాస్తవము? ఆశ్చర్యము లేదు రిడ్లీ స్కాట్ దేవుని పదకొండేళ్ళ బాలునిగా చూపిస్తాడు! ఆశ్చర్యము లేదు "అతడు తెగుళ్లను అద్భుతాలను శక్తి హీనమైనవిగా చూపించి సహజ వివరణ ఇస్తాడు" (మొహ్లర్, ఐబిఐడి.). కాని డాక్టర్ మొహ్లర్ అన్నాడు, "బైబిలు తేటగా చూపిస్తుంది నిర్గమ కాండము చరిత్ర అని, క్రైస్తవ్య చరిత్ర ఆ చారిత్రాత్మక పునాదిపై కట్టబడింది" (ఐబిఐడి.).

కాని రిడ్లీ స్కాట్ "...తేటగా చూపించారు తాను నమ్మడని మోషే జీవించినట్లు – చారిత్రాత్మక సత్యముగా నిర్గమ కాండము తీసుకోనవసరము లేదని. అతడు చెప్పడు మత వార్తల సేవగా [తన] సినిమాలో కనుపర్చాడు సామాన్య శాస్త్ర ఘటనగా, ‘అది నమ్మలేదు కనుక..." (మొహ్లర్, ఐబిఐడి.). కనుక స్కాట్ గారు తన తీర్పును ప్రభువైన యేసు క్రీస్తు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఇస్తున్నాడు,

"అతడు నన్ను గూర్చి వ్రాసెను, గనుక మీరు మోషేను నమ్మినట్టయిన: నన్నును నమ్ముదురు. మీరతని లేఖనములను నమ్మని యెడల, నా మాటలు ఎలాగు నమ్ముదరనెను?" (యోహాను 5:46, 47).

ఏప్రిల్ 13, 2001 న (పి. A-1) లాస్ ఎంజిలాస్ టైమ్స్ మొదటి పేజీలో ఈ శీర్షిక ఉంది, "నిర్గమకాండము కథను శంకించుట" టెరెసా వాటానబీచే, టైమ్స్ మత రచయిత. ఆ సమీక్ష నిర్గమ కాండము, పై దాడి ఈ సినిమాలానే, "నిర్గమ కాండము: దేవుళ్ళు రాజులు." టైమ్స్ సమీక్షలోని ముఖ్య విషయాలు ముందు చదివి తరువాత వాటికి సమాధానము చెప్తాను.

నిర్గమకాండము కథను శంకించుట

చాలామంది తత్వవేత్తలు ముగించారు మోషే వ్రాస్తారని జరగలేదని, యూదా ప్రవీణులు కూడా ప్రశ్నలు వేస్తున్నారు...

ఈ వేత్తలు, పేర్లు ఇవ్వబడలేదు. ఒక యూదా "మతపెద్ద" పేరు చెప్పబడింది, లాస్ ఎంజిలాస్ లోని, వెస్ట్ ఉడ్ లో సమాజము మందిరంలోని రబ్బయి. ఆ సంచికలో చెప్పబడలేదు అది చాందస సమాజ మందిరమని. ఆ సంచిక చెప్పలేదు ఆ రబ్బీ స్వతంత్రుడని, చాందస రాబ్బీలా పాత నిబంధనను తీవ్రంగా తీసుకోలేదని. ఆ సంచిక చెప్పలేదు చాల మంది పాత నిబంధన తత్వవేత్తలున్నారని డాక్టర్ గ్లీసన్ ఆర్చర్ ట్రినిటి ఎవిజేకర్ డివినిటీ స్కూలు, డాక్టర్ చార్లెస్, ఐ. ఫీన్ బర్గ్ టాల్ బోటు స్కూల్ ఆప్ తియోలజీ, డాక్టర్ తిమోతి లిన్ తైవాన్ లో చైనా ఎవాంజలికల్ సెమినరీ అధ్యక్షుడు లాంటివారు. వీరు నిర్గమ కాండము వాస్తవమని బోధించారు. వీరు పేర్లు టైమ్స్ సంచికలో ప్రస్తావింపబడలేదు. కేవలము వేదాంతపర స్వతంత్ర వేత్తలు పేర్లు చెప్పబడ్డాయి, సమగ్రవేత్తలు ఉనికిలో లేరు అనే అభిప్రాయము వ్యక్తమవునట్లు. సంచిక ఇలా చెప్పింది,

ఖగోళ శాస్త్రజ్ఞులు చెప్తారు ఐగుప్తులో ఇజ్రయెలీయులున్నారు అనే దానికి సమగ్ర రుజువు లేదు, వారు బానిసలుగా లేరు, 40 సంవత్సరాలు సీనాయి అరణ్యంలో సంచారము చెయ్యలేదు కనాను దేశమును స్వాధీన పరచుకోనలేదు (ఐబిఐడి.).

ఇది నా కొడుకు లెస్లీకి చదివి వినిపించాను. ఆ వార్తా పత్రిక వచ్చేసరికి, అతడు 17 సంవత్సరాలవాడు. అది చదివిన తరువాత నాకుమారుడు అన్నాడు, "ఈ [నిర్గమ కాండము] లోనివి ప్రపంచ దేశాలైన చైనా, ఇంగ్లాండ్ లలో జరిగి ఉంటే, రుజువు ఎప్పుడో కనుగొని ఉండేవారు. కాని ఇది ‘సామాన్యము’ కాదు మిడిల్ ఈస్ట్ లో. అక్కడ యుద్ధాలు విభేదాలు ఉన్నాయి. నిర్గమ కాండము వ్రాయబడేసరికి, ప్రపంచమంతటా యూదులు రెండు సార్లు చెల్లాచెదురయ్యారు. [నిర్గమ కాండము] లోని బైబిలు ప్రాంతాలు వేల సంవత్సరాల నుండి వినాశనమమవుతున్నాయి. పరిపూర్ణ రుజువు కొరకు చూడకూడదు." అతడలా చెప్పినప్పుడు, నా మట్టుకు నేను అనుకున్నాను, "ఈ పదిహేడేళ్ళు అబ్బాయికి స్వతంత్ర బైబిలు విమర్శకుల కంటే ఎక్కువ బుర్ర ఉంటుంది."

రబ్బీ డేవిడ్ ఎలీజ్రీ, రబ్బానికర్ కౌన్సిల్ ఆప్ ఆరంజ్ కౌంటీ, అధ్యక్షుని మాటలు, సంచికలో చెప్పబడ్డాయి,

కొన్ని సంవత్సరాల క్రితం, నిర్గమ కాండాన్ని సందేహించిన ఖగోళ శాస్త్రజ్నులే రాజైన దావీదు లేదని చెప్పారు. ఈ సిద్ధాంతము [ఓడిపోయింది] ఇశ్రాయేలులో రాజైన దావీదు వివరణ వెలుగులోనికి వచ్చినప్పుడు (Quoted in the Jewish Journal, 4/20/01, p. 11).

ఇజ్రాయేలు నుండి నా స్నేహితుడొకడు రాసాడు, టైమ్స్ ఆర్టికల్ కు కొన్ని సంవత్సరాల ముందు, ఖగోళ శాస్త్రజ్ఞులు ఒక పెంకు కనుగొన్నారు, దావీదు జీవిత కాలానిది, దానిపై "రాజైన దావీదు" అని తేటగా వ్రాయబడి ఉంది.

డాక్టర్ డబ్ల్యూ. ఎ. క్రీస్ వెల్ తెలివైన తత్వవేత్త. ఆయనకు కేంటేక్కి లూయిస్ వేల్లీలోని, దక్షిణ బాప్టిస్టు వేదాంత సెమినరీ నుండి బైబిలు భాషలలో పిహెచ్.డి. ఉంది. చాల పుస్తకాలకు రచయిత, బైబిలులోని చాల పుస్తకాలపై ఆయన వ్యాఖ్యానాలు ఉన్నాయి. 50 సంవత్సరాలకు పైగా టెక్సాస్, మొదటి బాప్టిస్టు చర్చి ఆప్ డాలస్ కు ఆయన సంఘ కాపరి. రెండు సార్లు ఆయన అమెరికాలో అతిపెద్ద "ప్రోటేస్టంట్" తెగ అయిన, సదరన్ బాప్టిస్టు కన్వెంక్షన్ కు అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. వేదాంత సెమినరీకి సులభంగా అధ్యక్షుడు కాగలడు! ఆయన ప్రసిద్ధ పుస్తకంలో, బైబిలు వాస్తవమని నేనెందుకు బోధిస్తాను (బ్రాడ్ మాన్ ప్రెస్, 1969) డాక్టర్ క్రీస్ వెల్ అన్నాడు,

     మొదటిగా అనుకోనబడింది మోషే [బైబిలులోని మొదటి ఐదు గ్రంధాలు] వ్రాసి ఉంటాడని వ్రాయడం కనిపెట్ట బడకముందే ఆయన జీవించాడు కాబట్టి. ఇది ఆధునిక [స్వతంత్ర] విమర్శకుడు కచ్చిత ఫలితము. ఇప్పుడు మనకు తెలుసు, క్రీస్తుకు, 2,000 సంవత్సరాల ముందు వ్రాయడం తూర్పున నిర్ధారింపబడిన కళ. మోషే దినాలలో తెలియకుండా నిగూడమైనది, మనం కనుగొన్నాం మోషే దినాలకు శతాబ్దాలకు ముందే వ్రాయడమనేది పూర్తిగా అభివృద్ధి చెందిన కళ, మోషే కాలానికి [ముందే]...
     ఇంకొక ఖగోలపు సాక్ష్యము బైబిలు వాస్తవికతను గూర్చి కనుగొనబడింది పైతామ్ నిధి నగరములో అది హెబ్రీయులచే రామ్ సెస్ II కొరకు ఐగుప్తు కఠిన బంధక సమయంలోనిది. ఈ నగరము ఇటీవలే వెలుగులోనికి వచ్చింది, ఇళ్ళ గోడలు ఇటుకలతో ఉన్నాయి, కొన్ని గడ్డితో కొన్ని గడ్డి లేకుండా, సరిగ్గా నిర్గమ కాండము 5:7 ప్రకారము...ఇంకొక సారి బైబిలు చరిత్ర ఖచ్చితమని రుజువు చేయబడింది, [స్వతంత్ర] విమర్శకుల పరిహాసాలు విపరీతమని పిచ్చివని రుజువైంది.

ముందుకు వెళ్తాను. స్వతంత్ర విమర్శకులు, గోల్డెన్ గేటు బాప్టిస్టు వేదాంత సెమినరీ అధ్యాపకులు, నేను అక్కడ హాజరై పట్ట భద్రుడనైనప్పుడు, విధ్యర్దులైన మాతో చెప్పారు ఐగుప్తులో హేబ్రీయులు ఉన్నారనడానికి లిఖిత పూర్వకత లేదు. నేను ఒక ఫోటో వారికి చూపించాను, గెడ్డాలతో ఇటుకలు చేస్తున్న వారిది, నిర్గమ కాండము ఐదవ అధ్యాయములో చెప్పబడినది. నేను అధ్యాపకులకు ఆ పటాలు చూపించాను, ఫిరమిడ్ గోడ నుండి తీసినవి. అయినా వారు గేలి చేసి నవ్వారు, వారన్నారు నేను పిచ్చివాడనని ఎందుకంటే నేను లేఖనాలను నమ్ముతాను కాబట్టి. ఈ గెడ్దపు మనష్యుల ఫోటో హిస్టోరికల్ అట్లాస్ ఆఫ్ ద జాయిస్ పీపుల్ లో చూడవచ్చు (cf. The Jewish Journal, 4/20/01, p. 11). ఐగుప్తీయులందరూ గెడ్డం చేసుకున్న వారు, గనుక గెడ్డాలతో ఇటుకలు చేసేవారు, తేటగా హెబ్రీయులే నిర్గమ కాండములోని ఐగుప్తు దేశములో! చాదస్థ రబ్బీ, డేవిడ్ ఎలీజ్రీ అన్నాడు టైమ్స్ ఆర్టికల్, స్వతంత్ర నిర్గమ కాండము విమర్శకులను గూర్చి ఇలా,

వారి జీవన శైలి విద్య ఒక నిర్దిష్టతను చూపిస్తుంది అది నిర్గమ కాండ రుజువుకు వ్యతిరేకత సృష్టిస్తుంది. వేరే నిర్దిష్ట మార్గము లేనప్పుడు వారు [ఒప్పుకుంటారు] టోరా [పాత నిబంధనలో] ఉన్నది సత్యమని (The Jewish Journal, 4/20/01, p. 11).

మళ్ళీ, టైమ్స్ సంచిక హాస్యాస్పదముగా, అవివేకంగా, తప్పు అది చెప్పునప్పుడు, "నిర్గమ కాండమునకు వ్యతిరేక వాదన 13 సంవత్సరాల క్రితం ప్రారంభమైనది...పది సంవత్సరాలకు మించి అది తత్వవేత్తలకు తెలుసు." అది కేవలము అబద్ధము. బైబిలు విమర్శకులు అలాంటి విషయాలు 200 సంవత్సరాలకు పైగా చెప్తూ ఉన్నారు! జోహన్ సెమ్ లెల్ (1725-1791) బైబిలు విమర్శను 18 వ శతాబ్దంలో జెర్మనీలో ప్రారంభించాడు. డాక్టర్ హారొల్ద్ లిండ్ సెల్ అన్నాడు,

1757 లో అతడు హల్లెలోని [అయ్యాడు] వేదాంత విభాగానికి అధికారి అయ్యాడు. అతడు బైబిలు వాక్యపర విమర్శ సూత్రమును పెంపొందించాడు. అతడు తన తండ్రి చాందసత్వాన్నుండి వేరై లేఖనాల ప్రేరేపిత అభిప్రాయాన్ని సవాలు చేసాడు (Harold Lindsell, Ph.D., The Bible in the Balance, Zondervan Publishing House, 1979, p. 280).

టైమ్స్ సంచిక చెప్పింది స్వతంత్ర తత్వవేత్తలకు నిర్గమకాండములోని "పొరపాట్లు" కొన్ని సంవత్సరాలుగా మాత్రమే తెలుసు – 10 నుండి 13 సంవత్సరాలుగా ఆ సంచిక 2001 లో వ్రాయబడింది. దీని అర్ధము విమర్శకుల నిర్గమ కాండమును వ్యతిరేకించుట 1988 లేక 1991 వరకు ప్రారంభించలేదు. నేనెందుకు వింటున్నాను దీనిని గూర్చి గోల్డెన్ గేటు సెమినరీలో 1972 మరియు 1973 – 15 సంవత్సరాల ముందుగా? ఎందుకు డాక్టర్ హెన్రీ యమ్. మోరిస్ ఈ క్రింది ప్రశ్నలు 1951 లో అడిగాడు, టైమ్స్ ఆర్టికల్ వచ్చిన 50 సంవత్సరాల తరువాత? 1951 లో డాక్టర్ మోరిస్ అన్నాడు,

ఎలా సాధ్యము శతాబ్దాలుగా ఏ ఒక్కరికి కూడా, చిన్న అనుమానము కూడా రాకపోవడం, రాయబడినవి అసలైనవి కావని మోషే విషయాలు ఆధునిక విమర్శకులు వాటిపై పని కొనసాగించే వరకు? (Henry M. Morris, Ph.D., The Bible and Modern Science, Chicago: Moody Press, 1951, p. 102).

ఒకవేళ నిర్గమకాండముపై దాడులు కొన్ని ఏళ్ళు క్రితం ఆరంభం అయి ఉంటే, ఎందుకు విన్ స్టన్ చర్చిల్ వాటిని గూర్చి 1932 లో ఎందుకు వ్రాసాడు? 82 ఏళ్ళ క్రితం చర్చిల్ మోషేను నిర్గమకాండమును సమర్ధించాడు బైబిలు స్వతంత్ర విమర్శకులకు వ్యతిరేకంగా. చర్చిల్ అన్నాడు,

మేము తిరస్కరిస్తున్నాం, ఆ జ్ఞానపర శ్రమతో, కూడిన మర్మాలను గూర్చి మోషే ఒక ప్రముఖ వ్యక్తి అతనిపై యాజకత్వముంది మరియు ప్రజలు వారి సామాజిక, నైతిక మతపర తీర్మానాలు. మనం నమ్ముతాం శాస్త్రీయ దృక్పధం, ఆధునిక సమంజసత్వత, కనుగొంటాయి పూర్తి సంతృప్తి బైబిలు కథ [నిర్గమ కాండము] వాస్తవికము, గొప్ప వ్యక్తి [మోషే] మానవ కథలో అతిప్రాముఖ్య మెట్టు. మనం కదల్చబడలేదు [వ్రాతలచే] ప్రొఫెసర్ గ్రాడ్ గిండ్ మరియు డాక్టర్ డ్రాస్ దత్ [బైబిలు స్వతంత్ర విమర్శకులు]. మనం కచ్చితం ఆ విషయాలన్నీ [నిర్గమ కాండము] లోనివి సంభవించినవి పరిశుద్ధ ప్రతి ప్రకారము...మనం వాటిపై ఆధారపడతాం ‘ద కదల్చబడని పరిశుద్ధ లేఖన బండ’ (Winston S. Churchill, “Moses,” in Amid These Storms, New York, Scribners, 1932, p. 293).

చర్చిల్ బైబిలు వేత్త కాదు. కాని నోబెల్ బహుమతి గెలుచుకున్న చరిత్రకారుడు (1953). చరిత్ర కారునిగా ఆయనకు తెలుసు నిర్గమ కాండము వాస్తవాలపై ఆధారపడి ఉందని. అతని చరిత్ర కారుని గుణము ఎక్కువ అవగాహననిచ్చింది "డాక్టర్ డ్రాస్ డస్ట్" లేక ఇతర బైబిలు విమర్శకుల కంటే. ఆ దృక్పథంతోనే అతడు హిట్లర్ ను ప్రమాదకర పిచ్చివానిగా చూసాడు, కాని ఇంగ్లాండ్ అమెరికా నాయకులు, జాన్ ఎఫ్. కెన్నెడి తండ్రి కూడా, హిట్లర్ ను గొప్ప "వక్త"గా 1930 లో చూసారు.

నిజ కారణము విమర్శకులు, మరియు రిడ్లీ స్కాట్ లాంటి వారు నిర్గమకాండము అనే తన సినిమాలో, బైబిలును నమ్మరు ఎందుకంటే వారు ఆత్మీయంగా గుడ్డివారు. బైబిలు చెప్తుంది,

"ప్రకృతీ సంబందీయైన మనష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు: అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి: అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును, గనుక అతడు వాటిని గ్రహింపజాలడు" (I కొరిందీయులకు 2:14).

దేవుని విషయాలు "శరీరునికి" గుప్తమై యున్నవి. మానవుడు తగ్గించుకోకుండా, క్రీస్తును నమ్మకుండా, అతని నేత్రములు తెరువబడవు లేఖన సత్యాలు చూడడానికి.

"అతడు నన్ను గూర్చి వ్రాసెను, గనుక మీరు మోషేను నమ్మినట్టయిన: నన్నును నమ్ముదురు. మీరతని లేఖనములను నమ్మని యెడల, నా మాటలు ఎలాగు నమ్ముదరనెను?" (యోహాను 5:46, 47).

యేసు క్రీస్తు సిలువపై మరణించాడు మన పాప ప్రాయశ్చిత్తము చెల్లించడానికి. ఆయన శారీరకంగా మృతుల నుండి లేచాడు మీకు జీవాన్నివ్వడానికి. క్రీస్తు అన్నాడు, "నీవు తిరిగి జన్మించవలెను" (యోహాను 3:7). మీరు తిరిగి జన్మించినప్పుడు మాత్రమే, దేవుని శక్తి ద్వారా, మీరు నిర్గమకాండములోని, మరియు బైబిలులోని గొప్ప సత్యాలను అర్ధం చేసుకోగలరు. ఆమెన్. డాక్టర్ చాన్, దయచేసి ప్రార్ధనలో నడిపించండి.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ఫ్రుథోమ్: యోహాను 5:39-47.
ప్రసంగము ముందు పాట బెంజిమిన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్:
"నాకు తెలుసు బైబిలు సత్యమని" (డాక్టర్ బి.బి. మెక్ కిన్నీ గారు, 1886-1952).
“I Know the Bible is True” (by Dr. B. B. McKinney, 1886-1952).