Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
జ్ఞానుల బహుమతులు

THE GIFTS OF THE WISE MEN
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము ఉదయము, డిసెంబర్ 14, 2014
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord's Day Morning, December 14, 2014

"వారు ఇంటిలోనికి వచ్చి, తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగింపపడి, ఆయనను పూజించిరి: తమ పెట్టెలు విప్పి, కానుకలుగా ఆయనకు సమర్పించిరి; బంగారమును, సాంబ్రాణిని, చోదృమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి" (మత్తయి 2:11).


నేను ఐదవ తరగతిలో ఉన్నప్పుడు జ్ఞానులలో ఒకనిగా నటించాను, లాస్ ఎంజిలాస్ లో లౌకిక పాఠశాలలో క్రిస్మస్ నాటికలో. అది, 1950లో. అప్పటి నుండి ఎసిఎల్ యు మరియు ఇతర సాతాను సంస్థలు పాఠశాలలో క్రిస్మస్ కథల ప్రస్తావన నిషేదించారు. "క్రిస్మస్" పదాన్ని కూడా నిషేదించారు. వారు సాతాను వారు అని చెప్పవచ్చు ఎందుకంటే వారు "హాలోవీన్" ను ఎక్కువగా ప్రోత్సహిస్తారు, క్రిస్మస్ ఈస్టర్ సమయాల్లో క్రీస్తును గూర్చి మన పిల్లలు ఆలోచించకుండా సాయ శక్తులా ప్రయత్నిస్తారు. వారు దానిని "ఈస్టర్ సెలవులు" అని పిలిచేవారు – కాని ఇప్పుడు "స్ప్రింగ్ విరామము" అని పిలుస్తారు!

ఆ నాటికలో నేను జ్ఞానులలో ఒకడిని. ఇప్పుడే గ్రిఫిత్ గారు పాడిన పాట పాడాము, "మేము ముగ్గురము జ్ఞానులము." మాలో వేరొకడు, మేము ఒంటరిగా ఉన్నప్పుడు కొన్ని మాటలు కలిపాడు, "మేము ముగ్గురము జ్ఞానులము, పది సెంటీల సిగార్ కాల్చుతున్నాము." అతడు చెప్పింది గుర్తు చేసుకోకుండా, ఆ పాటను నేను ఎప్పుడు వినను! అతనిది భయంకర స్వరము. అంటే, అది అధ్వానము! అతడు మృదువుగా పాడేటట్టు చేసాను, కొంత మెరుగయింది. నాకు ఆశ్చర్యము ఈ ముగ్గురు రాజులు ఎవరు, బాలుడైన యేసును చూడడానికి అంత దూరము వారు ఎందుకు ప్రయాణించారో అనే విషయము.

ప్రుధొమ్ గారు ముగ్గురు జ్ఞానులు బాలుడైన యేసును గూర్చిన కధను మత్తయి రెండవ అధ్యాయము నుండి చదివి వినిపించారు. వివరణ సామాన్యము. జ్ఞానులు తూర్పు నుండి, నక్షత్రమును వెంబడించి వచ్చారు. ఎంత మంది జ్ఞానులలో చెప్పబడలేదు. క్రిస్మస్ కార్డుల మీద ముగ్గురుని చూస్తాం. బైబిలు ముగ్గురే అని చెప్పడం లేదు. ముగ్గురనే తలంపు యేసు కివ్వబడిన మూడు బహుమతులు, బంగారము, సాంబ్రాణి, బోళములను బట్టి ఉత్పన్నమయింది. కాని డాక్టర్ మెక్ గీ అన్నాడు ముగ్గురి కంటే ఎక్కువమంది అని. ఆయన అన్నాడు ముగ్గురు జ్ఞానులు "హేరోదును కలవార పెట్టలేరు లేక యేరూషలేమును ఉత్తేజ పర్చలేరు" (బైబిలు ద్వారా; గమనిక మత్తయి 2:1). డాక్టర్ మెక్ గీ అన్నారు వీరు చాల మంది ఉండి ఉండవచ్చు.

ఈ జ్ఞానులు బేబిలోనియా నుండి వచ్చారు. దానియేలు 2:27 "జ్ఞానులు [మరియు] జ్యోతిష్యులును" గూర్చి మాట్లాడుతుంది. యువకునిగా, దానియేలు బబులోనులో ఈ "జ్ఞానుల," మధ్య తర్పీదు పొందారు. వృద్ధాప్యములో దానియేలు ఈ జ్ఞానులకు అధిపతి అయ్యాడు. క్రీస్తు జన్మించినప్పుడు, జ్ఞానులు ఇంకా అక్కడ ఉన్నారు. దానియేలు రచించిన గ్రంధం వారి దగ్గర ఉండి ఉండేది. వారు దానియేలు 9:24-26 వరకు చదివినప్పుడు యూదుల మెస్సీయా రాకడను గూర్చి నేర్చుకొనేవారు. 69 వారాల ముగింపు వచ్చినప్పుడు, మెస్సీయాను గూర్చి ఆలోచించి ఉండేవారు. మునుపెన్నడూ చూడని, నక్షత్రాన్ని వారు చూసారు. అది అసాధారణ నక్షత్రము. యూదుల రాజైన మెస్సీయా వచ్చాడనడానికి, పరలోకములో సూచనగా, వారు నమ్మారు. వారు బహుమతులతో యేరూషలేముకు ప్రయాణమై, ఆయన దగ్గరకు వచ్చారు. యేరూష లేమునకు వచ్చినప్పుడు, శాస్త్రులు మికా 5:2 చదివారు, మెస్సీయా బెత్లెహేములో జన్మిస్తాడని, అది యేరూషలేమునకు సమీపంగా ఉంది. తిరిగి నక్షత్రము ప్రత్యక్షమై వారికి ముందుగా వెళ్ళింది "శిశువు ఉండిన చోటుకు మీదుగా వచ్చి నిలిచెను" (మత్తయి 2:9). కదిలింది కనుక అది అసాధారణ నక్షత్రమని మనకు తెలుసు, వారికి యేసు నొద్దకు నడిపించింది. బైబిలు తెరచి మత్తయి 2:11 చూడండి. స్కోఫీల్డ్ బైబిలులో 995 వ పేజిలో ఉంది. నేను చదువుచుండగా నిలబడండి,

"వారు ఇంటిలోనికి వచ్చి, తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగింపపడి, ఆయనను పూజించిరి: తమ పెట్టెలు విప్పి, కానుకలుగా ఆయనకు సమర్పించిరి; బంగారమును, సాంబ్రాణిని, చోదృమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి" (మత్తయి 2:11).

కూర్చోండి.

మత్తయి ఈ అధ్యాయము నుండి మనం చాల పాఠాలు నేర్చుకోవచ్చు. ఉదాహరణకు, దుష్టుడైన రాజైన హేరోదుకు జ్ఞానులకు వ్యత్యాసము చూడవచ్చు. హేరోదు అసూయపడి తన కిరీటం పోతుందని భయంతో ఉన్నాడు. హేరోదు యూదుడు కాదు. రోమా ప్రభుత్వము నుండి తన రాజరికాన్ని కొనుకోన్నాడు. అందుకే ఆ శిశువును కనుగొన దాల్చాడు, "యూదుల రాజు" అని జ్ఞానులు పిలిచారు (మత్తయి 2:2). కాని ఆయనను ఆరాదింప తలంచలేదు. తన సింహాసాన్ని తీసుకోకుండా, ఆయనను చంపాలనుకున్నాడు. జ్ఞానులు యేసును ఆరాదింప ఇష్టపడ్డారు, కాని రాజైన హేరోదు ఆయనను చంపదలిచాడు.

నేను ఒక ప్రసంగము చెప్పి చూపించగలను ఈనాడు, ఇలా ప్రపంచము యేసు పట్ల ప్రతి ఘటిస్తుంది. మంచి క్రైస్తవులు యేసును ఆరాదింప ఆశపడతారు. కాని దుష్టులు, ఏసీఎల్ యు లో వారివలే, ఆయనను తిరస్కరిస్తాడు. పాఠశాలలో క్రిస్మస్ కేరల్స్ నిషేదిస్తారు, బహిరంగ స్థలాల్లో కూడా. వారా నాటికలు బహిష్కరిస్తారు. పదము "క్రిస్మస్"నే బహిష్కరిస్తారు, ఎందుకంటే ఆ పదములో క్రీస్తు ఉన్నాడు. నేను ఒక ప్రసంగము బోధించగలను తారతమ్యాలు చూపిస్తూ హేరోదు వలే ఉన్నవారికి, జ్ఞానుల వలే ఉన్నవారికి, వారు యేసును ప్రేమించి ఆరాధింప ఇష్టపడ్డారు.

లేక, జ్ఞానులకు శాస్త్రులకు బేధము చూపగలను. శాస్త్రులకు తెలుసు యేసు బెత్లెహేములో జన్మిస్తాడని, కాని ఆయనను చూడడానికి వెళ్ళలేదు. యేసును గూర్చి ఎరుగుదురు, కాని బెత్లెహేము వరకు ఆ తక్కువ దూరము నడిచి వచ్చి ఆయనను ఆరాదింపలేదు. జ్ఞానులైతే చాల దూరము ప్రయాణించి యేసు నొద్దకు వచ్చారు. జ్ఞాపకముంచుకోండి ఒంటెలపై కష్టతర, దూర ప్రయాణము చేసారు. ఒంటె ప్రయాణము సులభ సౌకర్యవంతము కాదు. నాకు తెలుసు. ఐగుప్తు వెళ్ళినప్పుడు నేను ఇలియానా ఒంటెపై ప్రయాణించాము. నేను ఒంటెపై, స్పింక్స్ దగ్గరనున్న, గొప్ప పిరమిడ్ చుట్టూ తిరిగాను. అది ఆహ్లాదము లేని అనుభవము! దానిపై బోధించ గలను – శాస్త్రులు, ఆయన ఎక్కవ ఉన్నాడో తెలిసీ, వెళ్ళలేదు, జ్ఞానులు యేసును కనుగొనడానికి దీర్ఘ, కష్టతర ప్రయాణము చేసారు. నేను శాస్త్రులను "గుడి పిల్లలతో" పోల్చవచ్చు, వారికి బైబిలు తెలుసు కాని యేసును నమ్మరు – యవనస్థులు ప్రపంచము నుండి, గొప్ప కష్టముతో, యేసు నొద్దకు వస్తారు.

లేక మూడవ ప్రసంగము నేను చెప్పవచ్చు – ఆయనను తిరస్కరించిన యూదులు, సత్రపు అధికారి శాస్త్రులు చేసినట్లు – బబులోను అన్యులు, గొప్ప కష్టముతో, ఆయనను కనుగొన్నారు. జ్ఞానులను నేను మూడవ ప్రపంచము (చైనాలో, ముస్లీము లోకములో, కంబోడియా వియత్నాం అరణ్యాలలో) – గొప్ప కష్టాలు పడి క్రీస్తును కనుగొని ఆరాధించారు. నేను బోధించగలను అమెరికన్లు, పాశ్చాత్యులు, ప్రతిమూల గుడులు ఉన్నప్పటికినీ, ముక్కులు మూసుకొని వెళ్లిపోతుంటారు. క్రిస్మస్ సమయంలో అది స్పష్టం.

మనకు వ్యతిరేకంగా పోరాడే ప్రజలు ఉన్నారు, మనకు వ్యతిరేకంగా భయంకర విషయాలు చెప్తారు, యవనస్థులను క్రిస్మస్ నూతన సంవత్సర సమయంలో గుడిలో ఉండమని చెప్పినందుకు! ఒక స్త్రీ గుడి నుండి తన కుమారుని లాగడానికి చేయగలిగినదంతా చేసింది. గుడిని విడిచాక అతడు ఒక గుంపులో చేరి హత్య చేయబడ్డాడు. ఆ స్త్రీయే, గుడి నుండి లాగిన ఆమె ఏడ్చుకుంటూ, నది దగ్గరకు వచ్చి సమాధి చేయ్యమంది – ఆయనను రక్షించడం అప్పటికే చాల ఆలస్యం అయిపోయింది! బహుశా, నేను ఆ సమాధి చేసాననుకోండి, కాని ఆమె కొడుకును రక్షించడానికి చాల ఆలస్యమయి పోయింది! వారు ఎంత అవివేకులు! దేవుడు లేని పార్టీలలో వాళ్ళ పిల్లలు ఉండాలనుకుంటారు గుడిలో బదులు క్రిస్మస్ నూతన సంవత్సరము సమయంలో. "మిడ్ సమ్మర్ నైట్ డ్రీమ్" లో సేక్పియర్ "వ్యంగ్యంగా" అన్నాడు, "జీవించు వీరు ఎంత అవివేకులు!" ఎంత వాస్తవము! శాస్త్రుల వలే వారు గుడ్డివారు – కొందరు రాజైన హేరోదు వలే దుష్టులు! క్రిస్మస్ నూతన సంవత్సర సమయాల్లో గుడిలో ఉండకుండా ఎవరినైనా మీరు అడ్డుకోనిస్తారా! మిమ్ములను గుడి నుండి లాగి త్రాగుడు పార్టీకి గాని, లోక కార్యక్రమానికి కాని లాగ నివ్వకండి! వారిని అలా చెయ్యనివ్వకండి! వారిని అలా చెయ్యనివ్వకండి! జ్ఞానుల కంటే నిలకడగా ఉండండి! నమ్మని శాస్త్రుల వలే గుడిని మానకండి పాపపు హేరోదు వలే! బైబిలు చెప్తుంది,

"కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి, ప్రత్యేకంగా ఉండుడి, ప్రభువు చెప్పుచున్నాడు... నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినైయుందును, మీరు నాకు కుమారులును కుమార్తెలునైయుందురని, సరశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు" (II కొరిందీయులకు 6:17, 18).

"వారి మధ్య నుండి బయలు వెడలుడి" క్రిస్మస్ నూతన సంవత్సర సమయాల్లో దేవుని ప్రజలతో ఉండండి! క్రైస్తవులతో ఉండండి, క్రీస్తును ఆరాదిస్తూ – అన్యులతో కాదు లోకపు సమూహముతో, బీరు తాగే వారితో, లేక క్రీస్తు లేని వాటిని వదిలెయ్యండి! వాటిని వదిలెయ్యండి! నూతన సంవత్సర క్రిస్మస్ సందర్భాలలో వచ్చి క్రీస్తును ఆరాదించండి! రండి, జ్ఞానుల వలే, క్రీస్తును మాత్రమే ఆరాదించండి!

వచ్చి, ఆయనను పూజించుదాం,
   వచ్చి, ఆయనను పూజించుదాం,
వచ్చి, ఆయనను పూజించుదాం,
   క్రీస్తు ప్రభువు.

లేచినాతో పాడండి!

వచ్చి, ఆయనను పూజించుదాం,
   వచ్చి, ఆయనను పూజించుదాం,
వచ్చి, ఆయనను పూజించుదాం,
   క్రీస్తు ప్రభువు.
      ("రండి, విశ్వాసులంతా," ఫ్రెడరిక్ ఒకేలీచే అనువదించబడినది, 1802-1880).
(“O Come, All Ye Faithful,” translated by Frederick Oakeley, 1802-1880).

ఆమెన్! కూర్చోండి.

ఈ విషయాలపై బోధించే బదులు, మన పాఠ్యభాగము మత్తయి 2:11 పై నేను మాట్లాడుతాను,

"వారు ఇంటిలోనికి వచ్చి, తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగింపపడి, ఆయనను పూజించిరి: తమ పెట్టెలు విప్పి, కానుకలుగా ఆయనకు సమర్పించిరి; బంగారమును, సాంబ్రాణిని, చోదృమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి" (మత్తయి 2:11).

I. మొదటిది, వారు ఇంటిలోనికి వచ్చారు.

పాఠ్యభాగము చెప్తుంది, "వారు ఇంటిలోనికి వచ్చినప్పుడు." "కాని," మీరనవచ్చు, "క్రీస్తు పశువుల పాకలో పుట్టి పశువుల తొట్టెలో పరుండ లేదా?" అవును, అలానే అయింది. లూకా సువార్త చెప్తుంది,

"తన తొలి చూలు కుమారుని కానీ, వారికి స్థలము లేనందున [గుడ్డలో చుట్టి], పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వదిలెను; ఆయనను పశువుల తొట్టిలో పరుండ బెట్టెను" (లూకా 2:7).

కాని జ్ఞానులు పశువుల పాకలోనికి వచ్చి పశువుల తొట్టెలో బాల యేసును కనుగొనలేదు. లేదు, వారు "ఇంటిలోనికి వచ్చిరి" (మత్తయి 2:11). జ్ఞానులు గొల్లలు వచ్చిన సమయానికి రాలేదు. గొర్రెల కాపరులు బాల యేసును, పశువులశాలలో తొట్టిలో కనుగొన్నారు, పశువులు తిండి తినే తొట్టెలో. యేసు పుట్టిన కొద్దిసేపటికే గొర్రెల కాపరులు వచ్చారు. కాని జ్ఞానులు తరువాత వచ్చారు. మరియ యెసపు బాల యేసు చిన్న ఇంటిలోనికి వచ్చిన తరువాత జ్ఞానులు వచ్చారు, అప్పటిలో చిన్న ఇల్లులు ఉండేవి. ఇప్పుడైతే వారు ఒక ఇంటిలో ఉన్నారు.

డాక్టర్ మెక్ గీ అన్నాడు ఆయన జననము తరువాత చాల నెలలు తరువాత జ్ఞానులు వచ్చి బహుమతులు ఇచ్చారు. చూసారా, బహుశా క్రీస్తు జననము సమయంలో వారు నక్షత్రము చూసారు. ఆయన దగ్గరకు రావాలని నిర్ణయించుకున్నారు, కాని అక్కడికి రావడానికి చాల నెలలు పట్టింది. ఇది ఇలా నిర్ధరింపబడింది యేసు అప్పటికే సున్నతి పొంది, జత గువ్వలు దేవాలయంలో అర్పింపబడ్డాయి (లూకా 2:24). వారు గొర్రె పిల్లను అర్పించ లేదు కనుక వారు నిరు పేదలు. జ్ఞానులు ఖరీదైన బహుమానములతో, అప్పటికే వచ్చి ఉంటే, వారు గొర్రె పిల్ల అర్పించి ఉండేవారు. యేసు జననము తరువాత చాల నెలలు తరువాత జ్ఞానులు వచ్చినట్టు ఈ సంఘటనలు తెలియచేస్తున్నాయి.

నేను మీకు చెప్పాలి నక్షత్రము అసాధారణ "అస్త్రము," నిఘంటువు చెప్తుంది "నక్షత్రము వెలుగును ప్రజ్వరిల్లింప చేస్తుంది మరియు కొన్ని నెలలలో వెలుగు అంతరిస్తుంది" (మెర్రియమ్ వెబ్ స్టర్ డిక్షనరీ). తూర్పున ఈ నక్షత్రము చూసారు. అది అంతరించి పోయింది. జ్ఞానులు యేరూష లేముకు వచ్చినప్పుడు, నక్షత్రము మళ్ళీ దర్శనమయింది. వారు ఆ నక్షత్రమును చూచినప్పుడు "వారు అత్యానంద భరితులై" (మత్తయి 2:10). ఇది మామూలు నక్షత్రము కాదు. అది కదిలింది "శిశువు జన్మించిన చోటుకు వచ్చి నిలిచింది" (మత్తయి 2:9). కొన్ని వ్యాఖ్యానాలు దీనిని "శాఖీనాకు" పోలుస్తారు పాత నిబంధన వెలుగు, అగ్ని స్థంభము అరణ్యంలో రాత్రులలో ఇశ్రాయెలీయులకు దారి చూపించింది, "వారి ముందు వెళ్ళింది... నడిపించడానికి... రాత్రులు అగ్ని స్థంభము వలే" (నిర్గమ కాండము 13:21).

జ్ఞానులు చాల దూరము వచ్చారు. చాల త్యాగము చేసి చాల శ్రమలు కష్టాలు గుండా పయనించి బెత్లెహేములోని ఆ చిన్న ఇంటికి వచ్చారు. మన ప్రతి ఒక్కరం ఈ ఉదాహరణ వెంబడించి క్రిస్మస్ కు గుడిలో ఉందాం – ఈలోక పార్టీ కార్యక్రమానికి పరిగెత్తకుండా! ఆ పాట మళ్ళీ పాడండి! నిలబడి పాడండి.

వచ్చి, ఆయనను పూజించుదాం,
   వచ్చి, ఆయనను పూజించుదాం,
వచ్చి, ఆయనను పూజించుదాం,
   క్రీస్తు ప్రభువు.

II. రెండవది, వారు సాగిలపడి ఆయనను పూజించారు.

"వారు ఇంటిలోనికి వచ్చి, తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించిరి... " (మత్తయి 2: 11).

కొందరు నమ్మని "వేత్తలు" తెగలు అన్నారు యేసును ఆరాధించడం తప్పు అని. మనం దేవునినే ఆరాధించాలి. అది చెప్తుంది వారికి బైబిలు తెలియరని, ఎందుకంటే యేసు దేవుని ప్రతి రూపం – దేవుడు శరీరదారీ! అపోస్తలుడైన యోహాను అన్నాడు యేసు "వాక్యము" యోహాను మొదటి అధ్యాయములో. అపోస్తలుడన్నాడు,

"ఆ వాక్యము శరీరధారియై, కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను, (తండ్రి వలన కలిగిన, అద్వితీయ కుమారుని మహిమ వలే మనము,) ఆయన మహిమను కనుగొంటిమి" (యోహాను 1:14).

చార్లెస్ వెస్లీ, ఆయన గొప్ప క్రైస్తవ పాటలో, ఇలా అన్నాడు,

శరీరదారిలో దైవత్వము చూస్తాం,
   శరీరధారికి ఘనత,
మానవుల మధ్య నివసింప ఇష్టపడ్డాడు,
   యేసు, మన ఇమ్మాను యేలు.
శ్రద్ధతో విను! దూతల సమూహము పాడుచుండ,
   "కొత్తగా జన్మించిన రాజుకు మహిమ."
("శ్రద్ధతో విను, దూతల సమూహము పాడుచుండ" చార్లెస్ వేస్లీచే, 1707-1788).
   (“Hark, the Herald Angels Sing” by Charles Wesley, 1707-1788).

గమనించండి, ఈ జ్ఞానులు "శిశువును తల్లియైన మరియను చూచి, సాగిలపడి, ఆయనను పూజించిరి" (మత్తయి 2:11). డాక్టర్ జె. వెర్నోన్ మెక్ గీ అన్నాడు, "ఒకవేళ మరియ ఆరాధింపబడి యుంటే, ఇదే. కాని ఆమెను ఆరాదించ లేదు – వారు జ్ఞానులు! వారు ఆయనను పూజించిరి..." (ఐబిఐడి.; గమనిక మత్తయి 2:11). బైబిలు కన్య మరియను పూజింపమని ఎప్పుడు చెప్పలేదు, ప్రార్ధన చెయ్యమని కూడా చెప్పలేదు! మరియ తల్లిగానే గౌరవించాలి, మనం ఎప్పుడు ఆమెను ఆరాధింపకూడదు, ప్రార్దింపకూడదు.

వచ్చి, ఆయనను పూజించుదాం,
   వచ్చి, ఆయనను పూజించుదాం,
వచ్చి, ఆయనను పూజించుదాం,
   క్రీస్తు ప్రభువు.

శిష్యులు గలిలయలో పునరుత్థానుడైన క్రీస్తును చూచినప్పుడు చెప్పబడింది,

"వారు ఆయనను చూచి, ఆయనకు మ్రొక్కిరి…" (మత్తయి 28:17; లూకా 24:52).

ఆమెన్! మన అందరం క్రిస్మస్ నాడు ఆయనను గుడిలో ఆరాదిద్దాం, ఎందుకంటే క్రిస్మస్ దినాన పూజార్హుడు, సంవత్సరమంతా కూడా!

III. మూడవది, వారు ఆయనకు కానుకలు సమర్పించిరి.

"వారు ఇంటిలోనికి వచ్చి, తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగింపపడి, ఆయనను పూజించిరి: తమ పెట్టెలు విప్పి, కానుకలుగా ఆయనకు సమర్పించిరి; బంగారమును, సాంబ్రాణిని, చోదృమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి" (మత్తయి 2:11).

"వారు ఆయనకు కానుకలు సమర్పించిరి..." డాక్టర్ జాన్ ఆర్. రైస్ అన్నాడు,

వారు సాగిలపడి ఆయనను పూజించిరి! తరువాత ఆనంద బాష్పాలతో, వణుకుచున్న పెదవులతో, అత్యానందముతో, వణుకుచున్న చేతులు వారి పెట్టెలు విప్పి, లేక వారి నిధులను తెరచి, విప్పి, శ్రేష్టమైన వాటిని ప్రభువైన యేసు క్రీస్తుకు అర్పించారు! (John R. Rice, D.D., “Gifts of the Wise Men,” I Love Christmas, Sword of the Lord Publishers, 1955, p. 47).

తరువాత డాక్టర్ రైస్ అన్నాడు,

వారు తమ పెట్టెలు విప్పి కానుకలు ప్రభువైన యేసుకు అర్పించారు. ఇప్పుడు నేను మిమ్మును బతిమాలుచున్నాను... హృదయంతరంగము లోనికి యేసు క్రీస్తును తీసుకోండి, మీ పెట్టెలు విప్పి, అతి శ్రేష్టమైనవి ఆయనకు సమర్పించండి, ఔను, సమస్తం ఆయనకు ఇచ్చి, ఆనందించండి ఆయన [స్వీకరించడానికి] అర్హుడని (ఐబిఐడి., పేజి 48).

నాకు ఆ పాటంటే ఎంతో ఇష్టం ప్రాన్సిస్ హవేర్ గాళ్, "నా జీవితం తీసుకో, నీదిగా ఉండనీ,"

నా జీవితం, తీసుకో, ప్రభువా, నీకు సమర్పణగా, ఉండనీ;
నా హస్తాలు తీసుకో, వాటిని కదలనీ
నీ ప్రేమ ప్రోత్బలముతో, నీ ప్రేమ ప్రోత్బలముతో.

నా పెదవులు తీసుకో వాటిని నీ కొరకు సందేశాలతో నింపు,
నా వెండి బంగారములు తీసుకో,
ఏమి ఉంచుకోను, ఏమీ ఉంచుకోను.

నా ప్రేమను తీసుకో, దేవా, నీ పాదాల దగ్గర క్రుమ్మరిస్తున్నాను,
నన్ను తీసుకో నేను
ఎన్నటికి, కేవలం, నీ కొరకే ఉంటాను, ఎన్నటికి, కేవలం, నీ కొరకే ఉంటాను.
("నా జీవితం తీసుకో, ఉండనీ" ప్రాన్సిస్ ఆర్. హవేర్ గారిచే, 1836-1879).
   (“Take My Life, and Let it Be” by Frances R. Havergal, 1836-1879).

అంతా యేసుకే! అంతా యేసుకే!
   నా క్రయధన శక్తులు;
అంతా యేసుకే, అంతా యేసుకే!
   నా రోజులన్నీ నా గంటలన్నీ.
("అంతా యేసుకే" మేరీ డి. జేమ్స్ చే, 1810-1883).
   (“All For Jesus” by Mary D. James, 1810-1883).

ఆ పాటలు అర్ధవంతమైతే, తప్పక గుడిలో ఉండ నేర్పిస్తాయి, క్రిస్మస్ సందర్భంగా క్రీస్తును పూజిస్తూ – ఈ లోకపు పార్టీకి వెళ్ళే కంటే!

జ్ఞానులు ప్రభు యేసును పూజించినప్పుడు, వారు ఆయనకు బంగారము, సాంబ్రాణి, బోళము ఇచ్చారు. ఇవి చాల ఖరీదైనవి, వారికున్న శ్రేష్టమైనవి. బంగారము రాజుకు సమర్పనీయం. సాంబ్రాణి ఖరీదైన వస్తువు. సంఘ తండ్రి ఓరిగెన్ (185-254) అన్నాడు అది పవిత్రతా సూచిక. ఓరిగెన్ కొన్ని విషయాలలో తప్ప, కాని ఈ విషయంలో సరియే. సాంబ్రాణి ఆయనను దైవ అవతారిగా చూపిస్తుంది. బోళము యూదులు చనిపోయిన వారిని పాతి పెట్టేటప్పుడు వాడతారు. యోహాను 19:39 లో చెప్పబడింది నికోదేము బోళము తెచ్చి యేసు మృత దేహముపై ఉంచాడు, "సమాధికి యూదుల ఆచారము." బంగారము రాజుకు. సాంబ్రాణి దైవ అవతారికి. బోళము మన పాప పరిహారార్ధం శ్రమ సిలువపై మరణించిన ఆయన కొరకు. దయచేసి నిలబడి పాటల కాగితములో ఐదవ పాట పాడండి,

ఓ రండి, విశ్వాసులారా, ఆనంద ఉత్సాహాలతో,
   ఓ రండి, రండి బెత్లెహేముకు!
వచ్చి ఆయనను ఆనుకోండి, దూతల రాజుగా పుట్టినవానిని;
   ఓ రండి, ఆయనను పూజిద్దాం, ఓ రండి, ఆయనను పూజిద్దాం,
ఓ రండి, ఆయనను పూజిద్దాం, క్రీస్తు ప్రభువు.

దూతల గానములు, పాడి, హెచ్చించుట ద్వారా!
   ఓ పాడండి, పరలోక తేజోమయ సమూహమా;
దేవునికి మహిమ, ఉన్నత స్థలములలో మహిమ;
   ఓ రండి, ఆయనను పూజిద్దాం, ఓ రండి, ఆయనను పూజిద్దాం,
ఓ రండి, ఆయనను పూజిద్దాం, క్రీస్తు ప్రభువు.

ఔను, ప్రభు, మేము మిమ్మును సంభోదిస్తున్నాం, ఈ ఆనంద ప్రాతఃకాలమున పుట్టిన నిన్ను,
   యేసు, మీకు మహిమ అంతా చెల్లును;
తండ్రి వాక్యము, శరీరదారిగా ఇప్పుడు,
   ఓ రండి, ఆయనను పూజిద్దాం, ఓ రండి, ఆయనను పూజిద్దాం,
ఓ రండి, ఆయనను పూజిద్దాం, క్రీస్తు ప్రభువు.
     ("ఓ రండి, విశ్వాసులారా," ఫ్రెడరిక్ ఒకేలేచే అనువదింపబడినది, 1802-1880).
       (“O Come, All Ye Faithful,” translated by Frederick Oakeley, 1802-1880).

మీరు ఇంకా రక్షింపబడకపోతే, ఆయన దగ్గరకు రండి! ఆయనను విశ్వసించండి ఆయన మీ పాపాలను క్షమించి, నిన్ను కడుగుతాడు ఆయన ప్రశస్త రకముతో! ఆమెన్. డాక్టర్ చాన్, దయచేసి ప్రార్ధనలో నడిపించండి.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ఫ్రుథోమ్: మత్తయి 2:1-10.
ప్రసంగము ముందు పాట బెంజిమిన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్:
"మా ముగ్గురు జ్ఞానులం" (జాన్ హెచ్. హాప్ కిన్స్, జూనియర్ చే., 1820-1891).
“We Three Kings” (by John H. Hopkins, Jr., 1820-1891).


ద అవుట్ లైన్ ఆఫ్

జ్ఞానుల బహుమతులు

THE GIFTS OF THE WISE MEN

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

"వారు ఇంటిలోనికి వచ్చి, తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగింపపడి, ఆయనను పూజించిరి: తమ పెట్టెలు విప్పి, కానుకలుగా ఆయనకు సమర్పించిరి; బంగారమును, సాంబ్రాణిని, చోదృమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి" (మత్తయి 2:11).

(దానియేలు 2:27; మత్తయి 2:9, 2; II కొరిందీయులకు 6:17, 18)

I.   మొదటిది, వారు ఇంటిలోనికి వచ్చారు, లూకా 2:7, 24;
మత్తయి 2:10, 9; నిర్గమ కాండము 13:21.

II.  రెండవది, వారు సాగిలపడి ఆయనను పూజించారు,
యోహాను 1:14; మత్తయి 28:17; లూకా 24:52.

III. మూడవది, వారు ఆయనకు కానుకలు సమర్పించిరి,
యోహాను 19:39.