Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
నా బోధకుల కంటే ఎక్కువ అవగాహన!

MORE UNDERSTANDING THAN MY TEACHERS!
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము ఉదయము, డిసెంబర్ 7, 2014
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord's Day Morning, December 7, 2014


పాఠ్యభాగము చదివే ముందు గతవారము నాకు వచ్చిన ఈ-మెయిల్ చదువుతాను మన అంతర్జాలము పరిచర్యకు ఆర్ధికంగా సహాయ పడే వ్యక్తి పంపాడు. ఆయన అన్నాడు,

"’దేవునిచే ఊదబడిన గ్రంధము’ మీ ఆదివారము ప్రసంగము నేను ప్రేమిస్తాను. లోతైన అవగాహన పొందుకున్నాను. మీకు వందనాలు... మీకు తెలుసు, చాల మంది గ్రహించడం లేదు మావి ‘కాలేజీ స్థాయి’! బోధలని... దేవుని రాజ్యములో, నా నమ్మకం ఆయన మిమ్మును ‘ప్రొఫెసర్ ఎమెరిటస్’ గా పరిగణిస్తాడు. నాకు తెలుసు."

వందనాలండి, అయ్యా, ఆ దయా మాటలను బట్టి! నన్నెప్పుడు వేత్తగా, తలంచలేదు. నా గురించి బోధకునిగా మిస్సెనరీగా తలంచాను, ఆలోచన వేత్తగా కాదు. ఇప్పుడు కీర్తనలు 119 చూడండి.

"నీ శాశనములను నేను ధ్యానించుచున్నాను: కావున నా బోధకు లందరి కంటే నాకు విశేష జ్ఞానము కలదు... నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు! అవి, నా నోటికి తేనే కంటే తీపిగా ఉన్నవి! నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను: తప్ప మార్గములన్నియు నాకసహ్యములాయెను" (కీర్తనలు 119:99, 103-104).

119 వ కీర్తన బైబిలులో అతిపెద్ద అధ్యయము. ఈ కీర్తన అంశము బైబిలు, దానిని కీర్తన కారుడు వివిధ పేర్లతో పిలిచాడు: "వాక్యము," "న్యాయ శాస్త్రము," "మీ సాక్ష్యములు," "నీ కట్టడాలు" మొదలగునవి. అది బైబిలును బలపరుస్తుంది. అది దాని మూలంశము.

డాక్టర్ డబ్య్లూ. ఎ. క్రీస్ వెల్ గొప్ప వేదాంతి లేఖనాలను భాగా సమర్ధిస్తాడు. డల్లాస్ మొదటి బాప్టిస్టు సంఘానికి ఆయన కాపరి, టెక్సాస్ లో అరవై సంవత్సరాలుగా. నేను డాక్టర్ క్రీస్ వెల్ ను ప్రేమిస్తాను! ఆయన గొప్ప స్వరము వినయ విశ్వాసము యాభై సంవత్సరాలుగా నన్ను ఉత్తేజింప చేసాయి! ఆయన పుస్తకము, బైబిలు వాస్తవికంగా నేనెందుకు బోధించాలి, నాకు గొప్ప ప్రేరణ సహాయము.

నేను లేఖనాలు ప్రేమిస్తాను. నేను క్రైస్తవ గృహములో పెరగలేదు. క్రైస్తవ కుటుంబంలో పెరిగే ఆధిక్యత నాకు లేదు. బైబిలు కొరకు కాకపొతే, ఈనాడు క్రైస్తవుడిని కాకపోయేవాడిని.

దక్షిణ బాప్టిస్టులన్నారు బోధకుని కావాలంటే కళాశాల డిగ్రీ ఉండాలని. దక్షిణ బాప్టిస్టులకు అది అవసరము. క్రైస్తవ కళాశాలకు వెళ్ళడానికి నాకు డబ్బులేదు. పగలంతా పనిచేసి రాత్రి కాలేజికి వెళ్ళేవాడిని. లౌకిక విశ్వ విద్యాలయానికి హాజరవ గలిగాను, రోజంతా ఎనిమిది గంటలు పనిచేసి.

ఆ లౌకిక పాఠశాలలో చదువుతున్నప్పుడు అధ్యాపకులు బైబిలును నిర్ధాక్షిణ్యంగా దాడి చేసేవారు. తరగతి తరువాత తరగతిలో లేఖనాలను అపహాస్యము చేసి, దేవుని వాక్యమును కించపరచి, నా విశ్వాసాన్ని కదిలించడానికి దేవుని గ్రంధముపై చేయగలిగిందంతా చేసారు. అప్పుడు, ఆ లౌకిక కళాశాలలో, మన పాఠ్యభాగపు మాటలతో ఆదరింపబడ్డాను,

"నీ శాశనములను నేను ధ్యానించుచున్నాను: కావున నా బోధకులందరి కంటే నాకు విశేష జ్ఞానము కలదు...నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు! అవి, నా నోటికి తేనే కంటే తీపిగా ఉన్నవి! నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను: తప్ప మార్గములన్నియు నాకసహ్యములాయెను" (కీర్తనలు 119:99, 103-104).

ఈ లోక లౌకిక కళాశాల నుండి, పట్టభద్రుడనయ్యాను. దక్షిణ బాప్టిస్టులన్నారు, "మీకు సెమినరీ నుండి మాస్టర్ డిగ్రీ కావాలి దక్షిణ బాప్టిస్టు కాపరి అవడానికి." బైబిలు నమ్మే సమగ్ర సెమినరీకి వెళ్ళడానికి, నా దగ్గర డబ్బు లేదు. నాలాంటి పేదవానికి చాల ఖర్చుతో కూడిన పని. నేను దక్షిణ బాప్టిస్టు సంఘ సభ్యున్ని కాబట్టి, వారి సెమినరీకె వెళ్లాను టెల్బట్ సెమినరీ, లేక ఇతర సమగ్ర వేదాంత పాఠశాల కన్నా అతి తక్కువ ఖర్చుతో. వేదాంతములో మాస్టర్ డిగ్రీకి మూడు సంవత్సరాలు పట్టింది. నా కాపరిని అడిగాను గోల్డెన్ గేటు బాప్టిస్టు వేదాంత సెమినరీ, స్వతంత్ర దక్షిణ బాప్టిస్టు పాఠశాలకు వెళ్ళాలా అని అడిగాను. ఆయన అన్నాడు, "వెళ్ళు, బాబ్. నీకు బైబిలు తెలుసు. నీకు హాని చేయదు." ఆయన సరిగానే చెప్పాడు. అది నన్ను "హాని" పరచ లేదు. కాని అది నన్ను చంపినంత పనిచేసింది! నిజంగా!

దేవుని కృప లేకపోతే నేను నేడు బ్రతికి ఉండేవాడిని కాదు – సేవలో తప్పక ఉండేవాడిని కాదు! నేను నిరుత్సాహపడినాను హృదయం పగిలింది వాని వలన కొద్ది రోజులు పరిచర్య మానేసాను. ఆ చల్లని, నిర్జీవ నమ్మలేని, నరక కూపంలో, మూడు భయంకర సంవత్సరాలు గడిపాను! బైబిలు కొరకు కాకుంటే నేను అది చేసి పట్ట భద్రుడనయ్యే వాడిని కాదు. నా చేతిలో తెరువబడిన బైబిలుతో నేను గదిలో పడుకునే వాడిని. ప్రతి రోజు మన పాఠ్యభాగములోని మాటలు చదువుతూ ఉండేవాడిని,

"నీ శాశనములను నేను ధ్యానించుచున్నాను: కావున నా బోధకులందరి కంటే నాకు విశేష జ్ఞానము కలదు...నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు! అవి, నా నోటికి తేనే కంటే తీపిగా ఉన్నవి! నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను: తప్ప మార్గములన్నియు నాకసహ్యములాయెను" (కీర్తనలు 119:99, 103-104).

నరకంలో పడినట్టు అనిపించింది. ఆ సెమినరీ నుండి బ్రతికి బయట పడను అనిపించింది. నా అర్ధము.

"యెహోవా హృదయ పూర్వకంగా నేను మోర పెట్టుచున్నాను; ఓ దేవా, నీ కట్టడాలను నేను గై కొనునట్లు: నాకు ఉత్తర మిమ్ము. నేను నీకు మోర పెట్టుచున్నాను; నీ శాశనముల చొప్పున నేను నడుచు కొనునట్టు, నన్ను రక్షింపుము" (కీర్తనలు 119:145-146).

కాని అక్కడ, అగ్ని శ్రమలో, ఏకాంతంలో, చల్లని ఒంటరి స్థలంలో అవిశ్వాస పర, జీవితం కంటే బైబిలును ఎక్కువగా ప్రేమించడం నేర్చుకొన్నాను.

బోధించే బోధకుడు నాతో చెప్పాడు బైబిలును సమర్దిస్తున్నందుకు నాకు తరగతిలో చెడ్డ పేరు వస్తుంది. ఆయన నాతో అన్నాడు నేను మంచి బోధకుడనని, కాని తరగతిలో బైబిలును సమర్దిస్తున్నందుకు చెడుపేరు వస్తుంది. ఆయన అన్నాడు, "నీకు సంఘము ఇవ్వబడదు." కాలేజి అధ్యక్షుడు తన ఆఫీసుకు నన్ను పిలిచి అదే చెప్పాడు – "నీకు గుడి ఇవ్వబడదు. ఇక్కడ తొందర చేసే వానిగా వారు నిన్ను గుర్తించారు." గొప్ప లూథర్ మాటలు చదివినప్పుడు, అవి నా స్వంత మాటలయ్యాయి,

నేను ఇక్కడ నిలబడ్డాను, ఏమి చెయ్యను. పరిశుద్ధ లేఖనాల ద్వారా నాకు తప్ప చూపించబడితే తప్ప, నేను ఏమి చెయ్య తెగింపలేను; దేవుని వాక్యముతో నా మనస్సాక్షి బంధింపబడింది.

ఆ వాక్యము భూలోక శక్తులను మించినది, నిలిచియున్నా వాటికి, వందనాలు వద్దు;
ఆత్మవరాలు మనవి, ఆయన ద్వారా మనం వేర్పాటవుతాం.
వస్తువులు సమస్తం పోనివ్వండి, ఈ జీవితం కూడా;
వారు ఈ శరీరాన్ని చంపవచ్చు, దేవుని సత్యము ఇంకా నిలిచి ఉంటుంది:
ఆయన రాజ్యము నిరంతరముండును.
   ("దేవుడు మన ఆశ్రయ దుర్గము" మార్టిన్ లూథర్ చే, 1483-1546).
      (“A Mighty Fortress Is Our God” by Martin Luther, 1483-1546).

"నీ శాశనములను నేను ధ్యానించుచున్నాను: కావున నా బోధకులందరి కంటే నాకు విశేష జ్ఞానము కలదు" (కీర్తనలు 119:99).

బైబిలు సామాన్య పుస్తకము కాదు. పధ్ధతి వేదంతంపై కూడా పుస్తకము కాదు. కాని, వేదాంత అంశముపై మాట్లాడుచున్నప్పుడు, బైబిలు సత్యము చెప్తుంది. సామాన్య శాస్త్ర విషయంలో కూడా బైబిలు సత్యమే చెప్పను.

సెమినరీలో నా మూడవ ఆఖరి సంవత్సరంలో, నా స్నేహితులచే బలపరచువారిచే స్టూడెంట్ పేపరు ఎడిటర్ గా స్టూడెంట్ బాడీలో ఎన్నుకోబడ్డాను, దాని పేరు ద కరెంటు. అప్పుడు నేను బైబిలు వ్యతిరేకించే స్వతంత్ర అధ్యాపకులపై వ్యతిరేకంగా ఎదురు తిరిగాను. ఆ పేపర్ లో, పేరాలో, తరగతులలో బైబిలుపై దాడులపై జవాబులిచ్చాను. విద్యార్ధులు పరిగెత్తి ద కరెంటు తీసుకునే వారు. ఒక విద్యార్ధి అనడం విన్నాను, "హైమర్స్ ఎడిటర్ అయ్యే వరకు అది ఎవరు చదవలేదు." నేను వ్రాసే వాటిలో ఒకటి బైబిలు శాస్త్రీయ కచ్చితత్వము. సామాన్య శాస్త్రముపై బైబిలు ఎప్పుడు కచ్చిత నిజ సమాధానము ఇచ్చేది. బైబిలు ఇవ్వబడిన శాస్త్రీయ వాస్తవాలు ఇవి, బైబిలు వ్రాయబడినప్పుడు ఎవరికీ తెలియవు.

I.  మొదటిది, మానవ రక్తమును గూర్చి బైబిలు చెప్పేది లేఖనాలు వ్రాయబడేటప్పుడు అది తెలియదు.

లేవియా కాండము 17:11 చూడండి. "స్కోఫీల్డ్ బైబిలులో 150 పేజీలో ఉంది. దయచేసి లేచి 10 మాటలు చదవండి,

"రక్తము దేహమునకు ప్రాణము" (లేవియా కాండము 17:11).

కూర్చోండి. డాక్టర్ హెన్రీ యమ్. మోరిస్ అన్నాడు,

మిగిలిన వాటితో పాటు ప్రాముఖ్య వచనము (ఆదికాండము 9:3-6) సూచిస్తుంది భౌతిక జీవితంలో రక్త ప్రసరణ ప్రధానము (1616 లో విలియం హర్వే కనుగొన్నాడు)... ఈ ఆధునిక శాస్త్రీయ విషయము వేల సంవత్సరాల క్రితం దేవుడు చెప్పిన దానిని నిర్ధారిస్తుంది (Henry M. Morris, Ph.D., The Defender’s Study Bible, World Publishing, 1995, p. 154; note on Leviticus 17:11).

1616లో విలియం హర్వే ఆర్టరేలు గాలికి బదులు రక్తం కలిగియుంటారనే విషయం కనుగొన్నప్పటికినీ, "ఆధునిక సమయాల వరకు జీవితాన్ని సిరిపై రక్తము పనిని గూర్చి ఏమి తెలియదు" (John R. Rice, D.D., Our God-Breathed Book – The Bible, Sword of the Lord Publishers, 1969, p. 319). మన మొదటి అధ్యక్షుడు, జార్జి వాషింగ్టన్ రోగి అయినప్పుడు, మూడు సార్లు వైద్యుడు రక్తము తీసాడు. మూడవ సారి ఎక్కువ రక్తం వాషింగ్టన్ నుండి తీసాడు. అధ్యక్షుడు చనిపోయాడు ఎందుకంటే వైద్యునికి తెలియదు శతాబ్దాల ముందు బైబిలు ఏమి బయలు పరిచిందో, "రక్తము దేహమునకు ప్రాణము." "అవివేకంగా తను అనుకున్నాడు చాల జబ్బులు ఎక్కువ రక్తం ఉండడం ద్వారా వస్తాయని" (రైస్, ఐబిఐడి.).

II.  రెండవది, భూమిని గూర్చి బైబిలు చెప్పేది లేఖనాలు వ్రాయబడేటప్పుడు అది తెలియదు.

యోబు 26:7 చూడండి. స్కోఫీల్డ్ బైబిలులో అది 585 వ పేజి. లేచి గట్టిగా చదవండి,

"సూర్యమండలము పైన ఉత్తర దిక్కున ఉన్న ఆకాశ విశాలమును ఆయన పరచెను, శూన్యము పైన భూమిని వ్రేలాడ చేసెను" (యోబు 26:7).

ఇది క్రీస్తు పూర్వము 1,500 సంవత్సరాల క్రితం వ్రాయబడింది. ఆధునిక తర్జుమా ఇలా ఉంటుంది, "ఆయన శూన్యములో ఉత్తర ఆకాశములను పరిచెను; శూన్యముపై భూమిని రద్దు చేసెను" (ఎన్ఐవి). ప్రముఖ తత్వవేత్త డాక్టర్ చార్లెస్ జాన్ ఎలికాట్ అన్నాడు యోబు 26:7 పై,

...ప్రాముఖ్య [ఊహించే] సన్నివేశము సామాన్య శాస్త్రము కనుగొనడం. ఇక్కడ చూస్తాం, మూడు వేల సంవత్సరాలకు పైగా, శాస్త్రీయ కచ్చితత్వ భాషలో వివరించారు విశ్వము స్థితి, దైవిక శక్తితో అది పట్టుకోనబడుట (Charles John Ellicott, Ph.D., Ellicott’s Commentary on the Whole Bible, Zondervan Publishing House, n.d., volume IV, p. 46; note on Job 26:7).

"శూన్యముపై భూమిని వ్రేలాడదీసెను" (ఎన్ఐవి) (NIV). "శూన్యములో భూమిని ఉంచెను" (కెజెవి) (KJV). క్రీస్తుకు ముందు బైబిలులో ఈ మాటలు వ్రాయబడ్డాయి, రోమీయులు నమ్మేవారు అట్లాస్ అనే గొప్ప దేవునిపై అనుకొని ఉందని, హైందవులు అన్నారు భూమి బల్ల పరుపుగా ఉండి ఏనుగు వెనుక ఉందని, గొప్ప తాబేలు వెనుక నిలబడిందని, అది సముద్రంలోనికి వెళ్లిందని! డాక్టర్ జె. వెర్నాన్ మెక్ గీ అన్నారు, "గుర్తించుకొండి ఈ మనష్యుడు యోబు పితరుల కాలంలో జీవించాడు, శూన్యంలో ఆకాశం వేలాడుతుందని తనకు తెలుసు. ఎలాంటి ఆధారము లేకుండా బంతి లాంటి భూమిని శూన్యంలో ఉంచాడు...ప్రాచీన ఖగోళ శాస్త్రజ్ఞులకు అది తెలియదు" (J. Vernon McGee, Th.D., Thru the Bible, Thomas Nelson Publishers, 1982, volume II, p. 632; note on Job 26:7). మూడు వేల సంవత్సరాల క్రితం, యోబు గ్రంధము చెప్తుంది, దేవుడు "శూన్యములో భూమిని వ్రేలాడ దీసెను," "నిరాకారములో ఉంచబడింది," డాక్టర్ ఎ. ఆర్. ఫాసెట్ అన్నాడు (Jamieson, Fausset and Brown’s Commentary, William B. Eerdmans Publishing Company, 1976 edition, volume II, p. 62; note on Job 26:7).

ఇప్పుడు యెషయా 40:22 చూడండి. స్కోఫీల్డ్ బైబిలులో 748 పేజి. దయచేసి నిలబడి గట్టిగా మొదటి పదకొండు మాటలు చదవండి, "భూమి" పదంతో ముగుస్తుంది.

"ఆయన భూమండలము మీద ఆశీనుడై యున్నాడు…" (యెషయా 40:22).

కూర్చోండి.

మధ్యపదము "జి" స్కోఫీల్డ్ స్టడీ బైబిలు చెప్తుంది, "గమనింపదగ్గ భూమి [గుండ్రత] ను గూర్చినది." డాక్టర్ డబ్ల్యూ. ఎ. క్రిస్ వెల్ అన్నాడు, "యెషయా, క్రీస్తు పూర్వము ఏడు వందల సంవత్సరాల ముందు వ్రాసాడు, భూమి ఆకారమును గూర్చి అప్పుడే తెలుసు. ఇది గొప్ప విషయము, దైవ ప్రేరితము" (The Criswell Study Bible, Thomas Nelson Publishers; note on Isaiah 40:22). డాక్టర్ హెన్రీ యమ్. మోరిస్ అన్నాడు హెబ్రీ పదము "కుగ్" "గుండ్రముగా" అనువదింపబడింది, ఇది "భూమి [గుండ్రతకు] స్పష్టత" (The Defender’s Study Bible, ibid.; note on Isaiah 40:22).

కనుక, బైబిలు చెప్తుంది భూమి గుండ్రముగా ఉండి శూన్యములో వేలాడుతుంది! డాక్టర్ జాన్ ఆర్. రైస్ అన్నాడు, "…ఇది వేల సంవత్సరాల ముందే వ్రాయబడింది గెలీలియో, కొలంబస్ మరియు మాగెల్లాన్ భూమి గుండ్రంగా ఉందని కనుగొనక ముందే" (రైస్, ఐబిఐడి., పేజి 320).

III.  మూడవది, భూమి గుండ్రత తిరుగుటను గూర్చి యేసు ఎరుగును లేఖనాలు వ్రాయబడేటప్పుడు అది ప్రపంచానికి తెలియదు.

గ్రీకులు అన్నారు భూమి గుండ్రమని, కాని అది తిరుగుతుందని వారికి తెలియదు. సామాన్య మానవుడు అనుకున్నాడు భూమి బల్ల పరుపని ఇప్పటికి. ఒక గుంపు ఉండి "బల్ల పరుపు భూమి సమాజము." కాని ప్రభువైన యేసు క్రీస్తుకు తెలుసు భూమి గుండ్రమని, తిరుగుతూనే ఉందని. 1,400 సంవత్సరాల ముందే ఆయనకు తెలుసు మాగెల్లాన్ ప్రపంచాన్ని చుట్టూ ముట్టే ముందు. లూకా 17:34-36 చూడండి. స్కోఫీల్డ్ బైబిలులో 1100 వ పేజి. దయచేసి నిలబడి లూకా 17:34 నుండి 36 వరకు చదవండి.

"నేను నీకు చెబుతున్నాను, ఆ రాత్రి యిద్దరోక్క మంచము మీద ఉందురు; వారిలో ఒకరు కొనిపోబడును, ఒకడు విడిచి పెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగుతూ విసురుచుందురు; ఒకతే కొనిపోబడును, ఒకతే విడిచి పెట్టబడును. ఇద్దరు పొలములో ఉందురు; ఒకరు కొనిపోబడును, ఒకడు విడిచి పెట్టబడును" (లూకా 17:34-36).

కూర్చోండి. యేసు చెప్పాడు, ఆయన వచ్చునప్పుడు, ఇద్దరు మంచముపై ఉందురు, ఇద్దరు తిరుగలి విసురుదురు, ఇద్దరు పొలములో ఉందురు. డాక్టర్ హెన్రీ యమ్. మోరిస్ అన్నాడు,

ప్రభువు వచ్చునప్పుడు, అది రాత్రి మనష్యులు మంచముపై ఉంటారు. అది తెల్లవారు జాము కూడ స్త్రీలు తిరిగలి విసురు సమయము, మధ్యాహ్నం కూడ మనష్యులు పొలములో ఉంటారు. అది సాధ్యము ఎందుకంటే ప్రపంచము గుండ్రముగా ఉండి రోజు తిరుగుతూ ఉండి (Henry M. Morris, Ph.D., ibid., p. 1116; note on Luke 17:34).

క్రీస్తు "క్షణములో, కనురెప్పపాటులో వస్తాడు" (I కోరిందీయులకు 15:52). ఒకేసారి భూమిపై ఒక చోట రాత్రి, వేరే చోట ఉదయం, ఇంకోచోట మిట్ట మధ్యాహ్నం. డాక్టర్ జాన్ ఆర్. రైస్ అన్నాడు, "ప్రభువైన యేసు క్రీస్తుకు తెలుసు...ఈ శాస్త్రీయ సత్యము భూమి తిరుగుటను గూర్చి ఒకేసారి ఒక దగ్గర రాత్రి ఒక దగ్గర పగలు" (రైస్, ఐబిఐడి., పేజి 321).

ఈ నాలుగు భాగాలు చూపిస్తున్నాయి, బైబిలు శాస్త్రీయ విషయంపై మాట్లాడుతుంది, అది ఎప్పుడు సత్యమే. భూమిపై మనిషికి వాస్తవాలు తెలియక ముందు, బైబిలు ఎప్పుడు సత్యమే సామాన్య శాస్త్ర విషయంలో. ఇంకొక మూడు వచ్చే ఆదివారం చూద్దాం.

ఇలాంటి సామాన్య సత్యాలు స్టూడెంట్ పేపర్ లో పెట్టాను, నేను ఎడిటర్ గా ఉన్నప్పుడు, ఆ బైబిలు తిరస్కరించే దక్షిణ బాప్టిస్టు సెమినరీలో. కొందరు నాపై అరిచారు. కొందరు నవ్వారు. సెమినరీ అధ్యక్షుడు నన్ను బహిష్కరిస్తానని భయపెట్టాడు, కాని చెయ్యలేక పోయాడు రెండేళ్లకు పైగా అక్కడ విద్యార్ధిగా ఉన్నాను కాబట్టి. వారన్నారు నాకు దక్షిణ బాప్టిస్టు గుడి రాదనీ. నాకు గుడి "రానవసరం లేదు"! ఆ సెమినరీకి రెండు మైళ్ళ దూరములో ఒకటి ప్రారంభించాను. అది ఇంకా అక్కడ ఉండి! అది దక్షిణ బాప్టిస్టు సంఘము. నలభై సంఘాలు, ప్రపంచమంతా, ఆ గుడి నుండి పుట్టాయి. వింతగా, రెండేళ్ళ క్రితం నేను గోల్డెన్ గేటు బాప్టిస్టు వేదాంత సెమినరీలో నేను బోధించాను, సంఘ నలభైవ వార్షికోత్సవాన్ని నేను మిల్ వేలీ, కాలిఫోర్నియాలో ప్రారంభించింది! ప్రతి స్వతంత్ర, బైబిలు తిరస్కరించే అధ్యాపకులు పోయారు – నేను అక్కడ బోధిస్తున్నాను! యేసు నామమునకు స్తోత్రము! నేను ఇంకా చెప్పగలను, విధేయతతో, అది కేవలము దేవుని కృపతో మాత్రమే,

"నీ శాశనములను నేను ధ్యానించుచున్నాను: కావున నా బోధకు లందరి కంటే నాకు విశేష జ్ఞానము కలదు... నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు! అవి, నా నోటికి తేనే కంటే తీపిగా ఉన్నవి! నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను: తప్ప మార్గములన్నియు నాకసహ్యములాయెను" (కీర్తనలు 119:99, 103-104).

బైబిలు నమ్మడానికి మీరు సిగ్గుపడరని నేను నిరీక్షిస్తున్నాను. యేసు అన్నాడు,

"నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గు పడువాడేవడో, వాని గూర్చి మనష్యు కుమారుడు తనకును, తన తండ్రికిని, పరిశుద్ధ దూతలకును కలిగియున్న మహిమతో, వచ్చునప్పుడు సిగ్గుపడును" (లూకా 9:26).

విశ్వాసము ద్వారా యేసు నొద్దకు రండి. ఆయనను నమ్మి ఆయన రక్తము ద్వారా మీ పాపాలను కడుగుకోండి! ఆయన మృతులలో నుండి లేచాడు! ఆకాశము వైపు కన్నులెత్తి ఆయనను విశ్వసించండి!

యేసు వైపు మీ దృష్టి పెట్టండి,
   ఆయన అద్భుత ముఖాన్ని పూర్తిగా చూడండి;
ఈ లోక విషయాలు ఆశ్చర్య రీతిగా కాంతివిహీనమవుతాయి
   ఆయన మహిమ కృప వెలుగులో.
("యేసు వైపు మీ దృష్టి పెట్టండి" హెలెన్ హెచ్. లెమెల్, 1863-1961).
(“Turn Your Eyes Upon Jesus” by Helen H. Lemmel, 1863-1961).

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ఫ్రుథోమ్: కీర్తనలు 119:97-104.
      ప్రసంగము ముందు పాట బెంజిమిన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్: కీర్తనలు 19:7-10.ద అవుట్ లైన్ ఆఫ్

నా బోధకుల కంటే ఎక్కువ అవగాహన!

MORE UNDERSTANDING THAN MY TEACHERS!

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

"నీ శాశనములను నేను ధ్యానించుచున్నాను: కావున నా బోధకు లందరి కంటే నాకు విశేష జ్ఞానము కలదు... నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు! అవి, నా నోటికి తేనే కంటే తీపిగా ఉన్నవి! నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను: తప్ప మార్గములన్నియు నాకసహ్యములాయెను" (కీర్తనలు 119:99, 103-104).

(కీర్తనలు 119:145-146)

I.    మొదటిది, మానవ రక్తమును గూర్చి బైబిలు చెప్పేది లేఖనాలు వ్రాయబడేటప్పుడు అది తెలియదు, లేవియా కాండము 17:11;

II.   రెండవది, భూమిని గూర్చి బైబిలు చెప్పేది లేఖనాలు వ్రాయబడేటప్పుడు అది తెలియదు, యోబు 26:7; యెషయా 40:22.

III.  మూడవది, భూమి గుండ్రత తిరుగుటను గూర్చి యేసు ఎరుగును లేఖనాలు వ్రాయబడేటప్పుడు అది ప్రపంచానికి తెలియదు, లూకా 17:34-36; I కొరిందీయులకు 15:52; లూకా 9:26.