Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




క్రిస్మస్ సెలవు వెర్రితనము!

CHRISTMAS HOLIDAY MADNESS!
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము ఉదయము, నవంబరు 30, 2014
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord's Day Morning, November 30, 2014

"నరుల హృదయం చెడుతనముతో నిండియున్నది, వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయ మందు వెర్రితనముండును, తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు" (ప్రసంగి 9:3).


రాజైన సోలోమోను ప్రసంగి వ్రాసాడు. అతని జీవిత అనుభవాలు అందు పొందుపరచబడ్డాయి. తన ప్రాణము తృప్తి కొరకు ప్రతి ప్రయత్నము చేసి చూసాడు. జ్ఞానాన్ని వెతక ప్రయత్నించాడు. సుఖం కొరకు ప్రయత్నించాడు. ఐశ్వర్య సంపాదనకు ప్రయత్నించాడు. మతము ప్రయత్నించాడు. పేరు కొరకు ప్రయత్నించాడు. నీతి కొరకు ప్రయత్నించాడు. చివరకు ఒక ముగింపు కొచ్చాడు "సమస్తము వ్యర్ధము మరియు వృధా ప్రయాస" (ప్రసంగి 1:14; 2:11, 17). ఆయన అంతా చూసాడు, సమస్తం ప్రయత్నించాడు, అంతా అర్ధము లేనిదిగా శూన్యంగా చూసాడు. ఇది అతనిని ఒక ముగింపుకు నడిపించింది, అపోస్తలుడైన యోహానుతో, "లోకమును దాని ఆశయు, గతించి పోవును" (I యోహాను 2:17).

ప్రసంగి 9:3 చాల నిరాశాభావపు పాఠ్యభాగము. మానవాళిని గూర్చిన వ్యతిరేక భావము ఇవ్వబడింది. అయిననూ నేను నమ్ముతాను రాజిన సోలోమోను సరియే అని. ఈ పాఠ్యభాగములో ఆయన మూడు విషయాలు చెప్పాడు అవి చాల వాస్తవం, మిగిలిన బైబిలు భాగముతో సమన్వయత కలిగియున్నవి.

"నరుల హృదయం చెడుతనముతో నిండియున్నది, వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయ మందు వెర్రితనముండును, తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు" (ప్రసంగి 9:3).

I. మొదటిది, రాజైన సోలోమోను అన్నాడు, “నరుల హృదయము చెడుతనముతో నిండియున్నది.”

ఇంకొక వచనములో ఇది తేట పరిచాడు, ఇలా చెప్పుతూ,

"పాపము చేయక మేలు చేయుచుండు, నీతిమంతుడు, భూమి మీద ఒకడైనను లేడు" (ప్రసంగి 7:20).

"నరుల హృదయం చెడుతనముతో నిండియున్నది." చాల మంది ఈ రోజుల్లో అది నమ్మడం లేదు. మళ్ళీ మళ్ళీ ప్రజలు అనడం మనం వింటున్నాం, "మనిషి సహజంగా మంచివాడు అని నేను నమ్ముతాను." కాని ఆ దృక్పథము కారణముతో కాని లేఖనాలతో గాని నిర్ధరింపబడలేదు! కారణం చూపిస్తుంది మానవుడు "చెడు తనముతో నిండి యున్నాడని"! వార్తా పత్రిక చదవండి. టెలివిజన్ లో వార్తలు చూడండి. ఎక్కువ చెడు చూస్తాం తక్కువ మంచి చూస్తాం. "మంచి" అనిపించేది స్వార్ధము నుండి గాని గర్వము నుండి గాని వస్తుంది, అలా నీతిపరంగా చెడు అవుతుంది! మళ్ళీ మళ్ళీ కారణము చూపిస్తుంది సోలోమోను మాటలలోని నిజత్వము, "నరుల హృదయము చెడు తనముతో నిండి యున్నది."

తరువాత లేఖనాలు చదవండి. బైబిలులో ఈ చివర నుండి ఆ చివర వరకు మానవుని పాపము స్వభావమును గూర్చి, అతని పూర్తీ దుర్మార్గతను గూర్చి చెప్పబడుతుంది. జల ప్రళయం ముందు,

"నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచెను" (ఆదికాండము 6:5).

తన ప్రసిద్ధి గాంచిన ప్రసంగము "మూలపాపము," గొప్ప సువార్తికుడు జాన్ వెస్లీ (1703-1791) అన్నాడు, ఇప్పటి నరులు జల ప్రళయము ముందరి నరులు ఒకటే. జాన్ వెస్లీ అన్నాడు,

[జల ప్రళయము] తరువాత వెయ్యి సంవత్సరాల తరువాత దేవుడు దావీదు ద్వారా ప్రకటించాడు, "[వారందరూ కలిసికట్టుగా అసహ్యాలు: ఒకడును, మంచి చేయువాడు, ఒకడును లేడు," కీర్తనలు 14:3; రోమా 3:10]. దీనికి ప్రవక్తలందరూ సాక్ష్యము...యెషయా కూడా [అన్నాడు,] "నడినెత్తి వ్యాధి కలిగియున్నది, ప్రతివాని గుండె బలహీనము. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచమైనను లేదు; ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు" [యెషయా 1:5-6]. అపోస్తలులందరూ ఆ విషయమే చెప్పారు. దీనినంతటి నుండి మనం నేర్చుకుంటాం, మానవుని సహజ స్థితి...అది "హృదయ తలంపులు ఊహ" చెడ్డది, "చెడ్డది మాత్రమే," అది "కొనసాగుతుంది" (John Wesley, M.A., “Original Sin,” The Works of John Wesley, Baker Book House, 1979 reprint, volume VI, pp. 57, 58).

ప్రవక్తయైన యిర్మియా అన్నాడు,

"హృదయము అన్నిటి కంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది: దాని గ్రహింప గలవాడేవాడు?" (యిర్మియా 17:9).

అలా, మనం చూస్తాం బైబిలులో, ఈ చివరి నుండి ఆ చివరి వరకు, సోలోమోను వాక్కును సమర్ధిస్తుంది, "నరుల హృదయము చెడుతనముతో నిండియున్నది." వార్తా పత్రికలలో టెలివిజన్ లో ప్రతి రోజు అది నిర్ధరింప బడుతుంది. "నరుల హృదయము చెడు తనముతో నిండియున్నది."

II. రెండవది, రాజైన సోలోమోను అన్నాడు, “వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయ మందు వెర్రి తనముండును.”

"నరుల హృదయం చెడుతనముతో నిండియున్నది, వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయ మందు వెర్రితనముండును, తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు" (ప్రసంగి 9:3).

హెబ్రీ పదము "వెర్రితనము" దాని మూలపదము అర్ధం "బుద్ధిహీనత" (స్ట్రాంగ్ # 1984). అసలు పదము "హౌలెలా" అంటే "వెర్రితనము" అని అర్ధం (స్ట్రాంగ్ # 1947). వెర్రితనము, దుస్థితి, మరుల్కొల్పు, పతనము, క్రూరత్వము – అది దాని పఠము! "బ్రతికుండగా వెర్రితనము వారి హృదయాలలో ఉంటుంది." స్ట్రాంగ్ నిఘంటువు చెప్తుంది హెబ్రీ పదము మూలము "ప్రదర్శించడం, అవివేకిగా ఉండడం, సందడి చెయ్యడం, పురి కొల్పడం." మేత్యూ హెన్రీ అన్నాడు ప్రజలు "…వెర్రివారు, వారు పొందే అనుభూతులన్నీ...మళ్ళింపబడిన [పిచ్చి] వారి కలలులా ఉన్నాయి" (Matthew Henry’s Commentary on the Whole Bible, Hendrickson Publishers, 1996 reprint, volume 3, p. 849; note on Ecclesiastes 9:3).

మానవ హృదయం వెర్రితనము విగ్రహారాధనకు వ్యాపించింది. ప్రవక్తయైన యిర్మియా అన్నాడు, "విగ్రహాల పట్ల పిచ్చి కలిగి ఉంటారు" (యిర్మియా 50:38) – "వారి జీవించి యుండగా వారి హృదయం వెర్రి తనముతో నిండుకొని యుండును" (ప్రసంగి 9:3). మన రోజుల్లో ప్రజలు కూడా "విగ్రహాల పట్ల పిచ్చి కలిగి యున్నారు" – అశ్లీలత విగ్రహము, సంపద, పాపపు సుఖం, "అపహాస్యము" విగ్రహము.

"సెలవులు" సంవత్సరంలో ఒక సమయంలో మనవ హృదయపు వెర్రితనము బహిరంగంగా ప్రదర్శింప బడుతుంది. క్రిస్మస్ నూతన వత్సర సమయాల్లో మనవ హృదయపు వెర్రితనము మేల్కొనే ప్రస్పుటము వలే వెలువడుతుంది! డాక్టర్ ఎ. డబ్ల్యూ. టోజర్ (1897-1963) అన్నాడు,

ఒక రకమైన వెర్రితనము అలమరిస్తుంది, అప్పుడు ఆరంభమవుతుంది...ప్రతి ఒక్కరిలో ఒక ప్రయత్నము ఉన్న చోటు నుండి కదలడానికి. ఇది ఏంటి అని ఎవరు ఆగి అడగరు, కాని ఆసుపత్రిలో జైలులో లేని ప్రతి ఒక్కరు అన్ని చోట్ల నుండి కలుస్తారు తిరిగి వెళ్తారు. మనలో చాలామందిని కాదనలేని కోరిక పట్టుకుంటుంది గాలిలో పట్టుబడిన ఇసుక రేణువుల వలే, మనలను తిప్పి భయంకరంగా చెరగేస్తుంది..." (A. W. Tozer, D.D., “Midsummer Madness,” in God Tells the Man Who Cares, Christian Publications, 1970 edition, p. 127). డాక్టర్ టోజర్ ను గూర్చి చదవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

డాక్టర్ టోజర్ "మధ్య వేసవి వెర్రితనము" ను గూర్చి చెప్పినప్పుడు, యాభై సంవత్సరాల క్రితం, ఇప్పుడు అదే వర్తిస్తుంది, శీతాకాలానికి కూడా "సెలవు" వెర్రితనము! ప్రజలు విజ్రుంబిస్తారు "విపరీత ప్రయత్నము" చేసి "వినోదము" కోసం "ఉన్న చోట నుండి ఎక్కడికో వెళ్ళడానికి" కృతజ్ఞత, క్రిస్మస్ నూతన సంవత్సర సమయాలలో. కృతజ్ఞత దినాన వేలమంది విమానాశ్రయాల్లో చిక్కుకుపోతారు, తూర్పుకో, పడమరకో వెళ్తూ, "వినోదం" లో కొన్ని గంటలుంటారు. వారిలో ఎవ్వరికి కూడా గుడికి వెళ్లి దేవునికి వందనాలు చెల్లించాలనిపించదు!

"సెలవు వెర్రితనము" హెలోవీన్ తో ప్రారంభమవుతుంది. ఒక యువతి కొన్నిసార్లు ఈ గుడికి వచ్చిన ఆమె అన్నారు గుడి మానడం తప్పలేదు హాలోవీన్ బట్టలతో "వస్త్రధారణ"కు. ఆదివారము ఉదయం 10.30 AM ఆరాధనకు రాలేకపోయేది ఎందుకంటే హెలోవీన్ వస్త్రధారణ నిమిత్తము! ఆతరువాత, పార్టీ మధ్యాహ్నము 2:00 గంటలకు ప్రారంభమవుతుంది, ఆమెకు చాల గంటలు పట్టేది ఒక మంత్రకత్తెలు – వయ్యరిలా – అలా సిద్ధపడడానికి! ఇది వెర్రితనము – సెలవు వెర్రితనము? "వారు విగ్రహాల పట్ల పిచ్చి కలిగి యున్నారు" (యిర్మియా 50:38). "జీవించినప్పుడు వారి హృదయము వెర్రితనముతో నిండికొనియున్నది" (ప్రసంగి 9:3).

అది ఇంకా భయంకరమైంది! ఆ పిచ్చితనముతో "సెలవులలో," ప్రజలు పరుగులిడుతారు, డాక్టర్ టోజర్ చెప్పినట్టు, "సామాన్య తోపులాట"... "[వారున్న చోటు నుండి] వేరే చోటుకి." చాల మంది ఇంటిలో ఉంది క్రిస్మస్ నూతన సంవత్సరం రోజున గుడికి రావాలనిపించదు! "ఒక కాదనలేని శక్తి [వారిని] గాలిలో ఎగిరే ఇసుక రేసుల వలే వారిని చెదర గొడుతుంది" – ఎక్కడికో లాక్కెళ్తుంది పిచ్చిగా అమెరికన్ విగ్రహం వైపు – దాని పేరు "అపహాస్యము."

నా చిన్నప్పుడు 1940 లో ప్రజలు ఇంటిలో ఉంది"సెలవులలో" గుడికి వెళ్ళేవారు. కాని ఈ రోజు వారు "పిచ్చోల్లవుతున్నారు" కృతజ్ఞత, క్రిస్మస్ నూతన సంవత్సర దినాలలో. వారి "హృదయములోని… వెర్రితనము" ఇంటి నుండి వారిని లాక్కెళ్ళి గుడి నుండి కూడా "వినోదం" అనే విగ్రహాన్ని దగ్గరకు తీసుకెళ్తుంది. ఒక విపరీత పిచ్చి మనిషి క్రిస్మస్ నూతన సంవత్సర దినాలలో గుడిలో ఉండడం మనం ఊహించము, కదా? ఆ తలంపే ఆధునిక అపహాస్యము ప్రేమించే మనసున్న వ్యక్తికి నేరంలా కనిపిస్తుంది.

నేను ఒక "న్యాయపర" నియంతగా ఎదుర్కోబడ్డాను – ఇంకా దారుణంగా – "సెలవులలో" యవనస్థులను గుడిలో ఉండమన్నందుకు. నేను వెనుదిరగడం లేదు! క్రీస్తు అన్నాడు,

"మనష్యు కుమారుని, నిమిత్తము మనష్యులు, మిమ్మును ద్వేషించి, వెలివేసి నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేయునప్పుడు, మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయండి, ఇదిగో మీ ఫలము: పరలోకమందు, గొప్ప, దైయుండును: వారి పితరులు ప్రవక్తలకు అదే విధంగా చేసిరి" (లూకా 6:22-23).

ప్రతి బోధకుడు డాక్టర్ ఎ. డబ్ల్యూ. టోజర్ చేసినట్టు "సెలవు వెర్రితనానికి" వ్యతిరేకంగా బోధింప దైర్యము కలిగియుండాలి! ఇది బోధకులకు సమయము కాదా వస్తు సంపద, త్రాగుబోతుతనము వ్యభిచారము "సెలవులకు" సంబందించిన వాటికి వ్యతిరేకంగా మాట్లాడడానికి? డాక్టర్ టోజర్ వలే ప్రవచానాత్మపు స్వరాలున్న వారు కావాలి? మన ప్రజలను "చావు నృత్యము" నుండి రక్షించడానికి – మన ఆర్ధిక వ్యవస్థ పడిపోతున్నప్పుడు, మన సంస్కృతి దిగజారుతున్నప్పుడు – మన ప్రజలు గోల పెడుతున్నప్పుడు ఎక్కువ వినోదాలకు, విహార యాత్రలకు, "అపహాస్యమునకు," ఆటలకు, మత్తుపదార్ధాలకు – ప్రాచీన రోమా సామ్రాజ్యము వలే అమెరికా పడిపోతున్నప్పుడు!

లాస్ వేగాస్ కు ప్రయాణాలు! శాన్ ప్రాన్సిస్కోకు ప్రయాణాలు – సాన్ డియాగోకు! సోదోమో గోమోర్రా, "వాటిని గూర్చిన పట్టణాలు" (యుదా 7), క్రిస్మస్ కు గాని, నూతన సంవత్సరానికి గాని రాడానికి అవకాశమే ఉండదు! "సెలవు" వెర్రితనాన్ని వదిలించుకోండి! గుడిలో ఉండుడి, దేవుని ప్రజలతో, క్రీస్తును ఆరాధిస్తూ, "అపహాస్యము" అనే విగ్రహము దగ్గర ఉండే బదులు. బైబిలు చెప్తుంది,

"కావున మీరు వారి మధ్య నుండి, బయలు వెడలి, ప్రత్యేకముగా ఉండుడి" (II కొరిందీయులకు 6:17).

"సెలవు"వెర్రితనాన్ని వదిలెయ్యండి! వదిలెయ్యండి! వదిలెయ్యండి! మాతో ఉండండి గుడిలో క్రిస్మస్ నూతన సంవత్సరము రోజులలో! మన పాఠ్య భాగములో ఆఖరి విషయము ఉంది.

III. మూడవది, రాజైన సోలోమోను అన్నాడు, “తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు.”

దయచేసి లేచి ప్రసంగి 9:3 గట్టిగా చదవండి.

"నరుల హృదయం చెడుతనముతో నిండియున్నది, వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయ మందు వెర్రితనముండును, తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు" (ప్రసంగి 9:3).

కూర్చోండి. "తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు."

మరణము! జీవిత వెర్రితనం తరువాత అదే వస్తుంది. మరణము! కచ్చిత, చల్లని మరణము వాస్తవికతను తప్పించుకోలేము సాతాను విగ్రహమయిన "అపహాస్యము" వెంట పిచ్చిగా పరిగెట్టడం ద్వారా. కాదు, సమాధిలో "అపహాస్యము" ఉండదు! నరకంలో "అపహాస్యము" ఉండదు! బైబిలు చెప్తుంది,

"ధనవంతుడు…చనిపోయి, పాతి పెట్టబడెను; అప్పుడు అతడు నరకములో యాతన పడుచు, కన్నులెత్తి చూస్తాడు" (లూకా 16:22-23).

యేసు అన్నాడు, "వారు నిత్య శిక్షకు పోవుదురు" (మత్తయి 25:46).

"నరుల హృదయం చెడుతనముతో నిండియున్నది, వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయ మందు వెర్రితనముండును, తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు" (ప్రసంగి 9:3).

డాక్టర్ జాన్ గిల్ ఈ వచనాన్ని గూర్చి ఇలా చెప్పాడు,

వారి జీవితాలలో ఈ వెర్రితనము తరువాత, వారు చనిపోయి మృతులుగా ఉండి... నరకములోనికి పోవుదురు (John Gill, D.D., An Exposition of the Old Testament, The Baptist Standard Bearer, 1989 reprint, volume IV, p. 607; comment on Ecclesiastes 9:3).

అతి ప్రాముఖ్యమైన విషయము జీవితంలో సుఖ అన్వేషణ కాదు. "అపహాస్యము చెయ్యడం" నిత్యత్వంలో దానికి అర్ధం ఉండదు, నీవు సిద్ధ పాటు లేకుండా తుది తీర్పులో దేవుని ఎదుర్కొన వెళ్ళితే. మీ పాపము నిమిత్తము నోచ్చుకోవాలి. పాపము నుండి క్రీస్తు వైపు తిరగాలి కృప ద్వారా. క్రీస్తు నొద్దకు రావాలి, ఆయన నిత్యత్వపు రక్తములో నీ పాపాలు కడగబడాలి! యేసు అన్నాడు, "నీవు తిరిగి జన్మించాలి" (యోహాను 3:7).

ప్రసంగి వ్రాసేటప్పుడు సోలోమోను వృద్ధుడు. పిల్లలతో తండ్రి మాట్లాడుచున్నట్లు చెప్తున్నాడు. 74 సంవత్సరాలుగా నేను ఈ లోకములో జీవిస్తున్నాను. ఈ ఉదయాన్న ఒక వృద్ధ వ్యక్తి వలే మీతో మాట్లాడుచున్నాను. క్రైస్తవ జీవితంలో విజయం పొందాలి, మీరు నా మాట వింటారని నిరీక్షిస్తున్నాను. ప్రసంగి చివరిలో సోలోమోను అన్నాడు, "నీ బాల్య దినములయందే నీ సృష్టి కర్తను స్మరణకు తెచ్చుకొనుము" (ప్రసంగి 12:1). యవ్వన సమయంలో నిత్యత్వమును గూర్చి తీవ్రంగా ఆలోచించాలి. నేను నిరీక్షిస్తున్నాను యవనులు నామాట వింటారని ఎందుకంటే, సోలోమోను వలే, నా జీవితంలో నేను 74 సంవత్సరాలు చూసాను. నాకు తెలుసు ఎంత ప్రాముఖ్యమో మీరు క్రీస్తును వెదకడం, నిత్యత్వమును గూర్చి ఇప్పుడు ఆలోచించడం, మీరు ఇంకా యవనులుగా ఉన్నప్పుడే. ఈ ప్రసంగము ముందు గ్రిఫిత్ గారు పాడిన పాటలోని మాటలు వినండి.

నీవు నిత్యత్వము ఎక్కడ గడుపుతావు? ఈ ప్రశ్న నీకు నాకు వస్తుంది;
ఆఖరి జవాబు ఏంటి? నీవు నిత్యత్వము ఎక్కడ గడపుతావు?
నిత్యత్వము! నిత్యత్వము! నీవు నిత్యత్వము ఎక్కడ గడుపుతావు?
("నీవు నిత్యత్వము ఎక్కడ గడుపుతావు?" ఎలీషా ఎ. హాఫ్ మాన్, 1839-1929).
(“Where Will You Spend Eternity?” by Elisha A. Hoffman, 1839-1929).

నిత్యత్వాన్ని గూర్చిన తీవ్ర ఆలోచన నిన్ను "సెలవు వెర్రితనము" తికమక స్థితి నుండి నిన్ను కాపాడుతుంది. ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన తీవ్ర ఆలోచన పాపాన్నుండి నిన్ను మేల్కొలిపి, ఆయనలోని రక్షణలోనికి నిన్ను నడిపిస్తుంది. నీ పాప ప్రాయశ్చిత నిమిత్తం ఆయన సిలువపై మరణించాడు. నీకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడు. క్రీస్తును గూర్చి తీవ్రత కలిగి యుండండి! ఇప్పుడే నిర్ణయించుకోండి గుడిలో ఉండడానికి క్రిస్మస్ సందర్భాన, క్రిస్మస్ ఈవ్ దినాన, మరియు నూతన సంవత్సర దినాన కూడా! దేవుడు మిమ్మును దీవించును గాక! ఆమెన్. డాక్టర్ చాన్, మనలను ప్రార్ధనలో నడిపించండి.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ఫ్రుథోమ్: లూకా 16:19-26.
ప్రసంగము ముందు పాట బెంజిమిన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్:
"నీవు నిత్యత్వము ఎక్కడ గడుపుతావు?" (ఎలీషా ఎ. హాఫ్ మాన్, 1839-1929).
“Where Will You Spend Eternity?” (by Elisha A. Hoffman, 1839-1929).


ద అవుట్ లైన్ ఆఫ్

క్రిస్మస్ సెలవు వెర్రితనము!

CHRISTMAS HOLIDAY MADNESS!

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

"నరుల హృదయం చెడుతనముతో నిండియున్నది, వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయ మందు వెర్రితనముండును, తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు" (ప్రసంగి 9:3).

(ప్రసంగి 1:14; 2:11, 17; I యోహాను 2:17)

I. మొదటిది, రాజైన సోలోమోను అన్నాడు, "నరుల హృదయము చెడుతనముతో నిండియున్నది," ప్రసంగి 7:20; ఆదికాండము 6:5; కీర్తనలు 14:3; రోమా 3:10; యెషయా 1:5-6; ఇర్మియా 17:9.

II. రెండవది, రాజైన సోలోమోను అన్నాడు, "వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయ మందు వెర్రి తనముండును," యిర్మియా 50:38; లూకా 6:22-23; యూదా 7; II కొరిందీయులకు 6:17.

III. మూడవది, రాజైన సోలోమోను అన్నాడు, "తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు," లూకా 16:22-23; మత్తయి 25:46; యోహాను 3:7; ప్రసంగి 12:1.