Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




ఉజ్జీవము కొరకు ఒక ప్రార్ధన

(ఉజ్జీవముపై 13వ ప్రసంగము)
A PRAYER FOR REVIVAL
(SERMON NUMBER 13 ON REVIVAL)
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము ఉదయము, నవంబర్ 2, 2014
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord's Day Morning, November 2, 2014

"గగనము చీల్చుకొని, నీవు దిగి వచ్చేదవు గాక, నీ సన్నిదిని పర్వతములు తతరిల్లును గాక, నీ శత్రువులకు నీ నామము తెలియజేయుటకై, అగ్ని పచ్చ పొదలను కాల్చు రీతి గాను, అగ్ని నీళ్ళను పొంగ జేయురీతిగాను, నీవు దిగివచ్చేదవుగాక!" (యెషయా 64:1, 2).


డాక్టర్ హెచ్. జాన్ ఆర్మ్ స్ట్రాంగ్ పునరుద్దరణ మరియు ఉజీవ పరిచర్యలకు అద్యక్షుడు. ఆయన "రాబోవు సువార్తక సంక్షోబము" నకు రచయిత. డాక్టర్ ఆర్మ్ స్ట్రాంగ్ అన్నాడు,

పడమరలో సామాజిక పతనము తీవ్ర ప్రశ్నకు మించినది... మనకు తెలిసినట్టు నాగరికత పతనము ప్రస్తుతము మనము చూస్తున్నాము. మనము...అనుకుంటాము పరిస్థితులు ఉన్నట్టు గానే ఉంటాము. మనము... యిప్పటికే మర్చి పోయాం కొన్ని రోజులలో అజేయమైన "ఇనుప తెర" వచ్చింది (John H. Armstrong, Ph.D., True Revival, Harvest House Publishers, 2001, pp. 125, 126).

ఆయన ఉద్దేశము మన నాగరికత ముగుస్తుంది త్వరితముగా మాజీ సోవియట్ యునియన్ లో జరిగినట్టు – కొన్ని రోజులలో! జరుగునని నేను తలస్తున్నాను. డాక్టర్ ఆర్మ్ స్ట్రాంగ్ పదమూడు సవంత్సరాల క్రితం, 2001 లో అది వ్రాసాడు.

మొన్నటి రాత్రి నేను ప్రపంచ పత్రికలో ఒక కలత పెట్టె వ్యాసము చదివాను పడుకునే ముందు. నిద్రించే ముందు, నేననుకున్నాను, "మనం ఇప్పుడు అక్కడ ఉన్నాం. మన నాగరికత ఇప్పుడు పతనమవుతుంది. సోవియట్ యునియన్ వలే అది త్వరగా సంభవిస్తుంది."

నశించు ప్రపంచానికి అది తెలియదు, కానీ క్రైస్తవ్యము "జిగట" వలే మన నాగరికతను పట్టుకుంటుంది. కాని మన సంఘాలు బలహీనమై ఇక అలా చేయలేకపోతున్నాము. మన జీవిత విదానము మన కళ్ళముందే అంతరించిపోతుంది.

ఇక్కడ, చాల తక్కువ సంఘాలలో ఆదివారం సాయంకాలపు ఆరాధన లాస్ ఏంజలిస్ లో మాత్రమే జరుగుతుంది. చాల వాటిలో బుదవారం రాత్రి ప్రార్దన కూటాలు లేవు! దేవుడే మనకు సహాయము చేయాలి! మనం ఒంటరి వారం, మనకు అది తెలుసు. మనం ఒంటరిగా ఉన్నాం, మనం బలహీనులం. మన శత్రువులు చాల బలంగా ఉన్నారు. వారి గట్టి స్వరాలు ప్రతిరోజు వింటున్నాం. మన కాలములో క్రైస్తవ్యము ముగింపుకు ఇది ఆరంభమా? అలాంటి చీకటి తలంపులు ఆలోచించే క్రైస్తవులలో మనసులలో మొదలుతూ ఉన్నాయి. మనం ఏమి చేస్తాం అని ఆశ్చర్యపోతున్నాం. సాక్ష్యాలు సన్నగిల్లే సంఘాలు మనం చూస్తున్నాం. మనం సువార్తికుల బలహీనత లౌకికత చూస్తున్నాం. అది మనలను ఎంతగానో తొందర చేస్తుంది.

1950 పాత క్రైస్తవులు మృతి చెందారు. అధ్యక్షుడు రీగన్ చనిపోయాడు. ప్రాన్సిస్ స్కాయెఫర్ చనిపోయాడు. జాన్ ఆర్. రైస్ చనిపోయాడు. హోరోల్ద్ లిండ్ సెల్, బిల్ బ్రైట్, డబ్ల్యూ. ఎ. క్రిస్ వెల్, జెర్రీ పాల్ వెల్ మరియు డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ చనిపోయాడు. బిల్లీ గ్రేహం, 96 సంవత్సరాలలో, ఒంటరిగా ఉత్తర కేరలీనో పర్వతాలలో, చక్రాల కుర్చీలో దూరంగా కూర్చున్నాడు. మనం ఒంటరిగా ఉన్నాం – బలవంతుడు లేదు మనలను సంరక్షించడానికి పాశ్చాత్త నాగరికతపై రాత్రి పడునప్పుడు.

ప్రవక్త యెషయాకు అలానే అనిపించింది. దేవుని కనుగొనడానికి నడిపించబడ్డాడు. ఆయన అన్నాడు,

"మాకు తండ్రివి నీవే, అబ్రహం మమ్ము నెరుగక పోయినను, ఇశ్రాయేలు మమ్మును అంగీకరింపక పోయిననూ: యోహావా, ఓ దేవా, నీవే మా తండ్రివి, అనాది కాలము నుండి; మా విమోచకుడివి నీకు పేరే గదా" (యెషయా 63:16).

డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు,

నీవు నేను దేవుని సన్నిధిలోనికి కేవలము సంప్రదాయము పేరుతో వెళ్ళలేము...మనకు ముందున్న వారి నామములో. వారెవరో నాకు అనవసరము, వారు మెథడిస్టు తండ్రుల కావచ్చు, పురిటన్లు కావచ్చు, సంస్కర్తలు కావచ్చు. లేదు, అబ్రహాము, యాకోబు వారి నామములో, మోర పెట్టలేము – కానే కాదు. "మాపరలోక మందున్న తండ్రి." సంస్కర్తలు మనలను రక్షింప లేరు, మెథడిస్టు తండ్రులు రక్షింప లేరు. [ఈనాడు] గొప్ప ప్రమాదముంది మన తండ్రులపై ఆధారపడితే. కాదు, దేవుడు. "పరలోక మందున్న మా తండ్రి," మరియు ఎవ్వరు కాదు...దేవుడే, "మీ పేరు నిత్యత్వము నుండి," నిత్యత్వములోనికి. దేవుడు మృతులకు దేవుడు కాదు, కాని సజీవులకు దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు (Martyn Lloyd-Jones, M.D., Revival, Crossway Books, 1987, pp. 301, 302).

చాల మంది బాప్టిస్టులు సంస్కర్తల దగ్గరకు వెళ్ళడం చూచి నేను చాల సంతోషిస్తున్నాను. కాని, నేను సంస్కర్తలను ప్రేమించే కొద్ది, నాకు తెలుసు, యెషయా, సంస్కర్తలు పురిటాన్లు మనలను రక్షింప లేరు! వారు మనకు సహాయము కూడా చెయ్యలేరు! మన నాగరికత అతీతమైంది, పాప భరితమైంది, వారి వేదాంతము బట్టి, కూడా రక్షింపబడలేము. దేవుని దగ్గరకే వెళ్ళాలి! సంస్కర్తలు ఎంత గొప్పవాడైనా, వారిపై ఆధార పడలేము. మనం దేవుని దగ్గరకే వెళ్ళాలి! దేవుడే మనకు సహాయము చేస్తాడు!

కాని మనం దేవుని దగ్గరకు వెళ్లి మన దేశాన్ని రక్షించమని అడగకూడదు. ఓ, కాదు! మన దేశపు ప్రజలు, దేవుని ప్రజలు కాదు. సజీవ దేవునితో వారికేమి పనిలేదు! యెషయా అన్నాడు,

"మేము నీ పరిపాలననెన్నడును: ఎరుగని వాని వలెనైతిని; మేము నీపెరెన్నడును పెట్టబడని వారి వలెనైతిని" (యెషయా 63:19).

దేవుని నామము స్తుతింపబడాలి! మనకొద్దు, వెదకం కూడా, "నైతిక మెజారిటీ," "అమెరికా మొదట," రిపబ్లికన్ పార్టీ, లేక ఏ విధమైన లోక ఆయుధం! అలాంటి వాటి కొరకు ప్రార్ధించి మన ప్రార్ధనలు వ్యర్ధము చేసుకోనకూడదు! దేవుని ఆయుధము గూర్చి నేర్చుకోడానికి రావాలి! "నీవే, ఓ దేవా, మాతండ్రివి, అనాది కాలము నుండి; మా విమోచకుడవి నీకు పేరే గదా" (యోషయా 63:16).

పర్వతాలు నిలువ బడకమునుపు,
   భూమి ఆకారము పొందక ముందు,
నీవు నిత్యుడవు దేవా,
   నిరంతరము ఏకరీతిగా ఉన్నావు.

వెయ్యి రాతములు, నీ దృష్టిలో,
   గడిచిన సాయంకాలం వలే నున్నవి;
రాత్రి గడిచిన తరువాత వేకువజాము,
   సూర్యుడు ఉదయించక ముందు.
("ఓ దేవా, తరతరాలకు మా సహాయము నీవే" ఐజాక్ వాట్సన్ చే, డి.డి., 1674-1748).
(“O God, Our Help in Ages Past” by Isaac Watts, D.D., 1674-1748).

ఇప్పుడు, మన పాఠ్యభాగానికి వద్దాం. ప్రవక్త దేవుని వైపు ముఖము తిప్పాడు. దేవునికి ఇలా మోర పెట్టి ప్రార్ధించాడు,

"గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక..." (యెషయా 64:1).

దేవుని ప్రజలు చాల అధ్వాన స్థితిలో ఉన్నారు ఆయన ఈ ప్రార్ధన చేసేటప్పుడు. వారు భయము విషాదముతో నిండుకున్నారు. ప్రవక్త వారి ఆర్ధిక అభివృద్ధి కొరకు ప్రార్ధించ లేదు. వారి మనశ్శాంతి కొరకు ప్రార్ధించ లేదు. వారి విజయము గూర్చి ప్రార్ధించ లేదు! ఆయన జోయల్ ఓ స్టీన్ లా కాదు! ఆయనకు తెలుసు వారికి అది అవసరము కాదని. యెషయాకు తెలుసు వారి మద్య, దేవుని సన్నిధి అతి ప్రాముఖ్యమని. కనుక ఆయన లేఖనాలో లిఖింపబడిన గొప్ప ప్రార్ధన చేసాడు,

"గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక..." (యెషయా 64:1).

నేను డాక్టర్ జె. వెర్నాన్ మెక్ గీతో ఎప్పుడు ఏకీభవిస్తాను. కాని ఈ వచన తర్జుమాతో ఆయనతో ఏకీభవించను. ఆయన అన్నాడు, "యెషయా గొప్ప శ్రమల దినము కాలములో ఇశ్రాయేలు ప్రార్ధన ఊహిస్తున్నాడని" (Thru the Bible, volume III, p. 342; note on Isaiah 64:1). కాదు, శ్రమల కాలములో క్రీస్తు రెండవ రాకడను గూర్చిన ఇశ్రాయేలు ప్రార్ధన కాదది. బహుశ వారు ప్రార్ధిస్తారు, కాని అది పాఠ్యభాగము ముఖ్య అన్వయింపు కాదు. ప్రవక్త ఇప్పుడే దేవుడు దిగి రావాలని ప్రార్దిస్తున్నాడు! స్పర్జన్ మరియు డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు పరిశుద్ధాత్మ దిగడానికి సంబంధించిన ప్రార్ధన ఇది అని.

"గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక..." (యెషయా 64:1).

డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు, "నేను [చెప్పడానికి] సంకోచించును ఇది ఉజ్జీవాన్ని గూర్చిన ప్రార్ధన అని...ప్రత్యేక, విడ్డూర, అత్యవసర ప్రార్ధన ఉజ్జీవంలో దేవుని ప్రత్యక్ష కొరకు. కౌపర్ పాటలోని పదాలను మించిన భావవ్యక్తీకరణ వేరొకటి లేదు,

ఆకాశములారా, త్వరగా దిగి రండి,
వేల హృదయాలను మీవిగా చేసుకోండి.

...ఉజ్జీవములో అదే జరుగుతుంది" (Martyn Lloyd-Jones, M.D., Revival, ibid., p. 305).

"దేవుడు దిగి వచ్చెను" అంటే, అర్ధము ఏంటి? దాని అర్ధము చెప్తాను. ఉత్తర శాన్ ప్రాన్సిస్కోలో మెల్ వేలీలో, సంఘము ప్రారంభింపక నేను తిరిగి లాస్ ఎంజిలాస్ వచ్చాను. వారు నన్ను "కుమారుని గూర్చిన పండుగ" పై మాట్లాడమన్నారు. శాన్ ప్రాన్సిస్కోకు గాలిలో ప్రయాణించి ఉత్తరానికి, మార్గ ప్రయాణం చేసాను. ఒక రంగంలో సమావేశం జరిగింది. నేను దేవుని ఉనికిని గ్రహించి, మేము చేరువవుతున్నాం. నేను కారు నుండి క్రిందికి దిగి నేను అనేక వందల యువకులు చూసి ఆశ్చర్యపడ్డాడు. కొన్ని పాటలు తరువాత, నేను పరిచయం చేయబడ్డాను. గొప్ప సమూహము ముందు నిలబడి మైకులో పాఠ్యభాగము ప్రకటించాను. అప్పుడు రాత్రి అయింది. కను చీకటి లేదు, కాని చాల చీకటిగా ఉంది. మైకులు మరియు లైట్లు జనరేటర్ మీద పనిచేస్తున్నాయి. నేను పాఠ్యభాగము చదివాక, కరెంట్ పోయింది. మైకు పని చెయ్యలేదు. లైట్లు ఆరిపోయాయి. నా చేతిని కూడా చూడలేనంత చీకటిగా ఉంది. నేననుకున్నాను, "నేనేమి చెయ్యగలను?" వదల కొలది యవనస్థులు నేలపై కూర్చున్నారు. వారిలో చాల మంది గుడి భవనంలోనికి కూడా ఎప్పుడు రాలేదు. నేనేమి చెప్పాలి? పూర్తీ చీకటిలో నేనేమి చెయ్యాలి? అప్పుడు దేవుడు దిగి వచ్చాడు!

"గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక..."

నేను చెప్పగలను దేవుడు గొప్ప శక్తితో దిగాడు ఆయన సన్నిధి అనుభవించవచ్చు. గట్టిగా అరచి బోదించాను. లైటులు లేవు. మైకు లేదు. ఏమి అవసరము లేదు! రాత్రి చీకటిలో దేవుడు తన పని చేసాడు. బోదిస్తున్నప్పుడు ఆలోచించే పని కూడ లేదు. ప్రవాహంలా నా నోటి నుండి మాటలు వచ్చాయి! యవనస్థులు చాల నిశ్శబ్దంగా ఉన్నారు. నా స్వరము తప్పా ఏమి వినబడలేదు. నా బోద ముగించాను, ఒకటి రెండు సెకనులు, నేను ఆశ్చర్యపడ్డాను తరువాత ఏమి చెయ్యాలి అని. అప్పుడు, ఒక స్వరము విన్నాను. జనరేటర్ వచ్చింది. లైట్లు అన్ని అకస్మాతుగా వెలిగాయి – మైకు కూడ వచ్చింది. ఒక సామాన్య ఆహ్వానము ఇచ్చాను. నేను దిబ్రాంతి చెందాను నశించిన వందల మంది హిప్పిలు నా దగ్గరకు వచ్చారు, చాల మంది కన్నీళ్ళతో. సంగీతము లేదు. స్వరము లేదు, వారి పాదముల చప్పుడు తప్ప వచ్చి నేలపై మోకరిల్లినారు. వారితో మాట్లాడుచూ, చాల సేపు ఉన్నాం. నా స్నేహితుడు, రెవరెండ్ మార్కు బక్లీ, మరువలేని రాత్రి గుర్తు చేసుకున్నాడు – లైట్లు పోయాయి దేవుడు దిగి వచ్చాడు – చాలామంది హిప్పీలు మరియు మత్తు బానిసలు క్రీస్తు రక్తము ద్వారా దేవునితో సమాదానపడ్డారు! అలాంటి ఉజ్జీవాల ద్వారా నలబై సంఘాలు వ్యాపించాయి – అమెరికా, యూరప్, ఆసియా మరియు ఆఫ్రికా! దేవుడు అప్పుడు అది చేసాడా దేవుడు మళ్లీ చేయగలడు! స్పర్జన్ ఇలా అన్నాడు, "దేవుని పనిని దేవుడే చేస్తాడు."

"గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక..."

1969, మొదటి చైనీయ బాపిస్టు సంఘములో, గుడిలోనికి వెళ్లక ముందే దేవుని సన్నిదిని అనుభవించే వాడివి. దానిని గూర్చి వైపరీత్యము లేదు. దేవుడు అక్కడ ఉన్నాడు. గదిలో విద్యుత్తుల దానిని కొంత వరకు వర్ణించగలను! బైబిలు దానిని దేవుని "మహిమ" అని పిలుస్తుంది. హెబ్రీ పదం నుండి తర్జుమా చెయ్యబడింది అంటే "పరువు." మీరు మహిమను గమనించవచ్చు – దేవుని బరువు, గాలిలో!

నాకు తెలుసు ర్యాస్ చెవాన్ జోన్స్ ఉజ్జీవాన్ని గూర్చి వేల్సులో ఏమి చెప్పాడో,

స్థలమంతా దేవుని మహిమతో నింపబడి ఉంది భయంకరంగా – ఒకరు "భయంకరము" అనే పదాన్ని కావాలని ఉపయోగించాడు; దేవుని పరిశుద్ద సన్నిది ప్రత్యక్షమయింది బోధించు వాడు పూర్తిగా నింపబడ్డాడు; అతడు నిలువబడ్డ ప్రసంగ వేదిక దేవుని వెలుగుతో నింపబడు అతడు దూరము జరిగాడు! అది; అక్కడ వదిలేద్దాం. పదాలు అలాంటి అనుభవాన్ని ఎగతాళి చేస్తాయి (Brian H. Edwards, Revival! A People Saturated with God, Evangelical Press, 1991 edition, p. 134).

1907 జనవరిలో, ఉత్తర కొరియాలో దేవుడు తన ప్రజల మధ్యకు దిగినప్పుడు, ఒక మిస్సెనరీ అన్నాడు, "గుడిలో ప్రవేశిస్తున్న ప్రతి ఒక్కడు, దేవుని సన్నిధితో గది నింప బడుచున్నట్లు భావించారు... ఆ రాత్రి ప్యొంగియాంగ్ లో [ఉంది] దేవుని సమీపత వివరణ అసాధ్యము" (ఎడ్వార్డ్స్, ఐబిఐడి., పేజీలు 135, 136). బ్రియాన్ ఎడ్వర్డు అన్నాడు, "తరుచుగా దేవుని భయంకర సన్నిధి సభ్యులలో లోతైన పాపపు ఒప్పుకోలు తీసికొని వచ్చింది. దేవుని సన్నిధి తప్పించుకోలేని వాస్తవము అయినప్పుడు, మనం ఉజ్జీవంలో ఉన్నట్టు లెక్క" (ఎడ్వార్డ్స్, ఐబిఐడి.). డాక్టర్ ఆర్మ్ స్ట్రాంగ్ అన్నాడు, "విశ్వాసులు అవిశ్వాసులు శక్తివంతంగా దేవుడు హాజరు అయినట్లు తేటగా గమనించారు" అప్పుడు ఉజ్జీవం వస్తుంది (ఆర్మ్ స్ట్రాంగ్, ఐబిఐడి., పేజి 53).

"గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక..."

నా నిరీక్షణ మనలో కొంతమంది కూడుకొని యెషయా 64:1 లోని మాటలు ఉపయోగించి ప్రార్దిస్తారని నా నిరీక్షణ. నా నిరీక్షణ మీలో కొందరు బైబిలు తెరిచి ఆ వచనము చూస్తారని, ఒంటరిగా ఉన్నప్పుడు, ప్రవక్త మాటలను మీ మాటలుగా ప్రార్ధనలో వాడతారని. దేవుని ప్రార్ధించండి దేవుడు గొప్ప ఉజ్జీవ శక్తితో మన సంఘములోనికి దిగి రావాలని! దేవుడు మిమ్ములను అనుగ్రహిస్తాడు!

ఎవరు ప్రార్ధిస్తారు? మీలో ఇంకా మారని వారి కొరకు. మీరు ప్రార్ధిస్తారా దేవుడు లోతుగా మీకు పాపపు ఒప్పుకోలు కలిగించునట్టు. యేసు కొరకు మీ అగత్యత మీరు గమనించరు, మీ స్వంత హృదయ మనస్సులోని లోతైన పాపపు ఒప్పుకోలు లేకుండా. పరిశుద్ధాత్మ కొరకు ప్రార్దిస్తాం మీరు పాపులుగా నశించువారిగా గుర్తించేటట్టు. తరువాత, కూడ, మీ కొరకు ప్రార్దిస్తాం మీరు యేసుని నమ్మి మీ పాపాలన్నీ ఆయన ప్రశస్త రక్తములో కడుగబడునట్లు. మీ జీవితాలలో అవి చెయ్యాలని మేము దేవుని ప్రార్దిస్తాం. డాక్టర్ చాన్, మనలను ప్రార్ధనలో నడిపించండి. ఆమెన్.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ఫ్రుథోమ్: యెషయా 64:1-4.
ప్రసంగము ముందు పాట బెంజిమిన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్:
"యేసు, మీ ప్రజలు ఎక్కడ కూడుకున్న" (విలియం కౌపర్, 1731-1800; స్వరములో "ద డాక్షాలజి").
“Jesus, Where’er Thy People Meet” (by William Cowper, 1731-1800; to the tune of “The Doxology”).