Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
లూథర్ యొక్క పాఠ్యము

LUTHER’S TEXT
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము సాయంకాలము, అక్టోబర్ 26, 2014
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord's Day Evening, October 26, 2014

"సువార్తను గూర్చి నేను సిగ్గు పడువాడనుకాను: ఏలయనగా నమ్ము ప్రతివానికి; మొదట యూదునికి, గ్రీసుదేశస్తునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియైయున్నది. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాసములముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము: విశ్వాస ములముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు, దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది" (రోమా 1:16, 17).


అపోస్తలుడైన పౌలు ఇక్కడ రోమాలోని క్రైస్తవులతో మాట్లాడుచున్నాడు. ఆ సమయంలో రోమా పట్టణం ప్రపంచానికి ముఖ్య పట్టణం. ఆ గొప్ప పట్టణంలో పాలరాతి ఆలయాలు, రోమా దేవుళ్ళ గొప్ప విగ్రహాలు ఉండేవి. సంఘ కట్టడాలు లేవు. రోమాలోని క్రైస్తవులు చిన్న, తృనీకరింపబడిన తెగ – గుర్తింపబడిన మతము కాదు. కాని పౌలు దైర్యముగా అన్నాడు, "క్రీస్తు సువార్తను గూర్చి నేను సిగ్గు పడువాడను కాను."

ఆయన ఎలా చెప్పగలిగాడు? అలా చెప్పడానికి దైర్యమెలా వచ్చింది? "నేను క్రీస్తు సువార్తను గూర్చి సిగ్గు పడువాడను కాను." క్రీస్తు సువార్త సిలువపై మన పాపాల నిమిత్తము ఆయన మరణము, మనకు జీవ మివ్వడానికి మృతులలో నుండి పునరుత్థానమును గూర్చి చెప్తుంది. పౌలు అన్నాడు, "దాని గూర్చి నేనెంత మాత్రమూ సిగ్గు పడడం లేదు." ఎందుకు కాదు? "అది రక్షణకు దేవుని శక్తియైయున్నది." "శక్తికి" గ్రీకు పదము "డునామిస్." ఆంగ్ల పదము "డైనమైట్" ఆ గ్రీకు పదము నుండి వచ్చింది. సువార్తలో శక్తి ఉంది! డాక్టర్ మార్విన్ ఆర్. విన్సెంట్ అన్నాడు "దైవిక శక్తి" అని. క్రీస్తు సువార్త శక్తితో నిండినది! సువార్త మృత ఆత్మలను పునరుద్ధరిస్తుంది. మృత ఆత్మలు సువార్త ద్వారా జీవములోనికి వస్తాయి!

మీరు గుడికి వస్తారు దేవుని క్రీస్తుని గూర్చిన విషయాలు మీకు అర్ధవంతంగా ఉండవు. కాని నేను మీకు సువార్త భోదిస్తాను. మీరంటారు, "ఈయనెందుకు ఇదే చెప్తుంటాడు అని? కాని ఆయన అదే చెప్తాడు, సిలువపై క్రీస్తును గూర్చి మృతులలో నుండి లేచిన క్రీస్తును గూర్చి. వేరేది ఎందుకు ఆయన చెప్పడు?" మంచిది, నా స్నేహితుడా, నాకు తెలుసు ఏది కూడా పాపిని నిజ క్రైస్తవునిగా మార్చలేదు! క్రైస్తవుడవాలని బోధించలేదు! కాని సువార్త బోధించగలను. నీవు ఎన్నిక చేయబడిన వాడవైతే, దేవుడు క్రీస్తు సువార్తతో నిన్ను ఒక డైనమైట్ వలే వాడతాడు – నీ అబద్ధపు అభిప్రాయాలు తీసివేసి – క్రీస్తు వైపు నీ హృదయాన్ని తెరచి – నీ ఆత్మను జీవము వైపు నడిపించడానికి! ఎప్పుడు సువార్త నిన్ను ఆధీనము లోనికి తీసుకుంటుందో, ఆత్మలో జీవంలోకి వస్తావు – క్రీస్తును నమ్మి తిరిగి జన్మిస్తావు! క్రీస్తు సువార్తకే ఆ శక్తి ఉంది! చార్లెస్ వెస్లీ కంటే ఎవరో బాగా చెప్పలేదు,

ఆయన పాపపు శక్తిని విరుగ గొడతాడు,
ఆయన బందీని విడిపిస్తాడు;
ఆయన రక్తము అపరాధిని శుద్ధి చేస్తుంది;
ఆయన రక్తం నాకై ఉంది.
   ("ఓ పదివేల నాలుకలు" చార్లెస్ వెస్లీచే, 1707-1788).

తరువాత అపోస్తలుడు అన్నాడు, "నమ్ము ప్రతి వానికి రక్షణ నిమిత్తము అది దేవుని శక్తియైయున్నది." క్రీస్తు సువార్త శక్తి జీవాన్నిస్తుంది నమ్ము ప్రతి వానికి రక్షణ యిస్తుంది. సువార్త ప్రతి ఒక్కరిని రక్షింపదు. చాల మంది నవ్వుతారు. చాల మంది వేరే మార్గము ద్వారా రక్షింపబడవచ్చు అనుకుంటారు. సువార్తను నమ్మి ఆయనను నమ్మిన వారిని మాత్రమే క్రీస్తు రక్షిస్తాడు. వారే అనుభవిస్తారు "రక్షణను గూర్చిన దేవుని శక్తి."

తరువాత అపోస్తలుడన్నాడు, "తద్వారా దేవుని నీతి బయలు పరచ బడుచున్నది." "తద్వారా" అంటే సువార్త. క్రీస్తు సువార్త యందు దేవుని నీతి బయలు పరచ బడుచున్నది. దేవుడు ఆయన కుమారుడైన, యేసు క్రీస్తును, సిలువపై మన పాప పరిహారార్ధం పంపాడు. మన పాపాన్ని చూడక పోతే దేవుడు నీతిమంతుడు కాకపోవును. ఆయన క్రీస్తును మనకు బదులుగా సిలువపై మరణించడానికి, మన పాపపు శిక్ష భరించడానికి పంపాడు. మీరు క్రీస్తును నమ్మినప్పుడు, "విదేశీ నీతిలో" కప్పు బడతారు. మీ స్వనీతిలో కప్పబడరు, మీ "మంచి" తనము ద్వారా వచ్చినది. మీరు యేసును నమ్మినప్పుడు, ఆయన నీతితో కప్పబడతారు. అది "విదేశీ నీతి" అది మీది కాదు కాబట్టి – అది క్రీస్తు నీతి నిన్ను రక్షించేది. ఆయన ఆయన నీతితో నిన్ను కప్పుతాడు.

తరువాత అపోస్తలుడు అన్నాడు, "వ్రాయబడినట్టు, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును" (రోమా 1:17). "వ్రాయబడినట్టు." పాత నిబంధన హబక్కుకు నుండి ఆయన చెప్తున్నాడు. అక్కడ ప్రవక్త హబక్కుకు అన్నాడు, "నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును" (హబక్కుకు 2:4). పౌలు హబక్కుకు వచనాన్ని ముమ్మారు కొత్త నిబంధనలో ప్రస్తావించాడు – రోమా 1:17, గలతీయులకు 3:11, హేబ్రీయులకు 10:38. మూడు చోట్ల, "నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును" అని చెప్పబడింది. ఆ పాఠ్య భాగాన్ని మార్టిన్ లూథర్ కళ్ళు తెరవడానికి దేవుడు ఉపయోగించాడు. ఆ పాఠ్యభాగము ప్రపంచాన్ని మార్చింది "సంస్కరణము" అనే గొప్ప ఉజ్జీవాన్ని తెచ్చింది. డాక్టర్ మెక్ గీ ఇలా అన్నాడు, "నీతి మంతుడు విశ్వాస మూలముగా జీవించును,"

విశ్వాస మూలముగా నీతిమంతుడు అవటమంటే క్రీస్తును నమ్మిన పాపి క్రీస్తు మరణము ద్వారా క్షమింపబడడమే కాకుండా, క్రీస్తులో సంపూర్ణుడుగా దేవుని ఎదుట నిలుస్తాడు. అంటే పాప విముక్తుడై, నీతికి జత చెయ్యబడతాడు. క్రీస్తు "ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి, మనము నీతి మంతులముగా తీర్చబడుటకై లేపబడెను" (రోమా 4:25) – క్రీస్తులో సంపూర్ణులుగా దేవుని ఎదుట నిలుచునట్లు (J. Vernon McGee, Th.D., Thru the Bible, volume IV, p. 651; note on Romans 1:17).

మీరనవచ్చు, "జ్ఞాపక ముంచుకోవడం కష్టమని!" అవును, కాని మార్టిన్ లూథర్ జీవితంలో అది తేట తెల్లమయింది. ఆయన 1483 నుండి 1546 వరకు జీవించాడు. లూథర్ చాల కొద్ది మంది జాబితాలో ఉన్నాడు. ఆయన పౌలు, కొలంబస్, మాగెల్లాన్, లేక ఎడిసన్, లేక ఐన్ స్టీన్ లాంటి వాడు – ఆయన మనవ చరిత్రలో ప్రపంచాన్ని మార్చాడు. ఆయన రక్షణ అవసరత మీలాంటిదే.

ఆధునిక రచయితలంటారు లూథర్ "మధ్యయుగపు" మనిషి అని. వారు దూతలు, దెయ్యాలు, సాతాను పట్ట తన నమ్మకాన్ని బట్టి వాపోతారు. వాల్లనుకుంటారు దేవునికి దెయ్యానికి మద్య పోరాటము మనవ జాతిని స్తంబింపచేసిందని చెప్పడం అతిశయోక్తి అంటారు. వారు ప్రత్యేకించి స్పందించారు తన పాపం పై దేవుని ఉగ్రత గూర్చి. నా మట్టుకు, ఇది బయలుపరుస్తుంది లూథర్ కంటే వారినే ఆధునిక రచయితలూ ఎత్తి చూపుతున్నారని. ఇది చూపిస్తుంది "కొత్త-సువార్తికులు" రచయితలూ దూతలు, దెయ్యాలు సాతానును నమ్మరు! అంటే మంచి చెడు మద్య ఉన్న పోరాటాన్ని బైబిలు బోధించే వాణ్ని వారు నమ్మరు! మరియు, మరి ముఖ్యంగా, ఇది చూపిస్తుంది ఈ "కొత్త-సువార్తికులు" కు దేవుని భయం లేదు పాపపు ఒప్పుకోలు లేదు! లూథర్ సామాన్య క్రైస్తవునిగా చూపింప బడ్డాడు! ఆధునిక కొత్త-సువర్తికులు ఆయనను విమర్శించే వారు లౌకిక నశించు ప్రజలుగా ఉన్నారు – క్రైస్తవులు కానే కాదు! దేవుడే వారికి సహాయం చెయ్యాలి!

నేను కనుగొన్నాను లూథర్ వ్యాఖ్యానాలు రోమా గ్రంధముపై, తేటగా, సరిగా ఉన్నాయి. యూదుల విషయం కూడా ఆయన సరియే. ఆయన అన్నాడు, "ఈ పాఠ్యభాగమును బట్టి యుగంతమున యూదులు క్రీస్తునందలి విశ్వాసము ద్వారా మారతారు...ఇప్పుడు పడిపోయిన యూదులు, మారి రక్షింపబడతారు, ఎన్నుకోబడిన అన్యుల తరువాత. వారు నిత్యమూ బయట ఉండిపోరు, వారి సమయంతో మారతారు" (Luther’s Commentary on Romans, Kregel Publications, 1976 edition, pp. 161, 162; note on Romans 11:25-36).

బైబిలు బోధించే దానికి అది సమీపంగా ఉంది. నాకు తెలుసు తరువాత ఆయన, ముసలి వాడై రోగి అయినప్పుడు, కొన్ని కఠిన విషయాలు చెప్పాడు కాని మనం ఆయనను క్షమించాలి. ఆయన అభిప్రాయలు కేథలిక్ "మార్పిడి సిద్ధాంతము" పై వచ్చాయి, నమ్మకము సంఘము ఇశ్రాయేలు బదులు వచ్చిందని – అబద్ధపు సిద్ధాంతము ఇప్పటికి కూడా చాల మంది కాల్వినిష్టులు ఇతరులు నమ్ముతారు. దేవుడు మనపై దయ చూపించును గాక! దేవుడు ఇంకా ఇశ్రాయేలు యూదా ప్రజలతో ఈలోక నిబంధన కలిగి యున్నాడు, అది తేటగా రోమా 11:25-27 లో చెప్పబడింది.

లూథర్ తండ్రి గణికుడు, అతడు అటార్నీ కావాలనుకున్నాడు. దాని కొరకు చదవ ప్రారంభించాడు. ఒకరోజు ఉరుముల తుఫానులో నడుస్తున్నాడు. మెరుపు తనకు దగ్గరగా వచ్చింది. నేలపై పడి అరిచాడు, "పరిశుద్ధయానే నాకు సహాయము చెయ్యి. నేను సన్యాసినవుతాను!" దాని అర్ధము అతడు మోనాస్టేరీలో చేరి ప్రపంచము నుండి వేరవుతాడు. కాని తన లోతైన ప్రమేయం మత సాధనలో దేవునితో సమాధానము వెతకడంలో సహాయ పడలేదు. ఆధునిక "కొత్త-సువర్తికులు" రచయితలూ అనేవారు అతని దైవ భక్తీ తప్పని "మద్య వర్తమని." ఎంత తప్పు! ఎంత ఘోరమైన తప్పు! లూథర్ దైవ భక్తి పరిపూర్ణంగా సరియైనది. బైబిలు రక్షింపబడని వారిని గూర్చి చెప్తుంది, "వారి కనుల ముందు దేవుని భయము లేదు" (రోమా 3:18). లూథర్ అన్నాడు, "సహజంగా మనం అనీతిమంతులం దైవ భయం లేని వారం. కనుక, మనం లోతుగా తగ్గించుకొని మన నిర్లక్షత దేవుని ముందు ఒప్పుకోవాలి" (Luther, ibid., p. 74; note on Romans 3:18). దేవుని కృప తన తప్పుని స్థితి నుండి పాపిని మేల్కొలుపుతుంది. జాన్ న్యూటన్ (1725-1807) చెప్పినట్టు, ‘"కృప నా హృదయానికి భయం నేర్పించింది" ("అద్భుత కృప"). భయం లేని స్థితి నాస్థికత్వానికి సూచన.

లూథర్ తన పాపాన్ని గూర్చి గ్రహింపు కలిగి యున్నాడు. దానిని హృదయ రోగము అని పిలిచాడు. తన నేరారోపణ నుండి ఏదీ తనను విడుదల చెయ్యలేదు. బైబిలు చదువుతూ, జోహానా స్టాపుట్జ్ మాటలు, ఆలోచించాడు, "మధుర రక్షకుని గాయాలు చూడు." తన అధ్యయనంలో క్రీస్తు సిలువ చూసాడు. ఆయన చూసాడు ఉగ్రత దేవుని ప్రేమ సిలువపై ఉన్న క్రీస్తులో ఎలా కలిసాయో. లూథర్ తన తల్లికి ఇలా రాసాడు,

రాత్రి పగలు నేను వెదికాను దేవుని న్యాయానికి "నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును" అనే మాటకు మద్య సంబంధాన్ని గూర్చి. నేను గ్రహించాను దేవుని న్యాయమంటే నీతి దేవుని కృప కనికరాలను బట్టి విశ్వాసము ద్వారా [క్రీస్తులో] న్యాయం చేస్తుంది. కనుక నాకనిపించింది నేను తిరిగి జన్మించనని తెరువబడిన ద్వారాల ద్వారా పరదైనుకు వెళ్తానని. లేఖనాలన్నింటికి కొత్త అర్ధము వచ్చింది (Roland H. Bainton, Here I Stand, Mentor Books, 1977, page 49).

అప్పటి నుండి లూథర్ వేదాంతము "సిలువ వేదాంతము" అని పిలువబడింది. ఆయన అన్నాడు, "సిలువ మాత్రమే మన వేదాంతము." మీ పాపము నుండి రక్షింపబడాలంటే, సిలువ వేయబడిన క్రీస్తు నందలి విశ్వాసము ద్వారానే! సిలువపై ఉన్న క్రీస్తు! పరిశుద్ధ దేవుని దగ్గరకు రావడానికి వేరే మార్గము లేదు.

తన అధ్యయనములో లూథర్ ఇది చూసాడు. ఆయన చూసాడు మన పాఠ్య భాగములో దేవుని నీతి దేవుని గుణానికి సంభందించినది కాదు – ఇది దేవుడిచ్చే నీతి, ఇది యేసు నందలి విశ్వాసము ద్వారా మనకు ఇస్తాడు. "నీతిమంతులు విశ్వాస మూలంగా జీవిస్తారు" (రోమా 1:17). డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు, "మన విశ్వాసము మనలను నీతిమంతులుగా చెయ్యదు. అది యేసు క్రీస్తు నీతి చేస్తుంది – ఇంకా ఏదీ కాదు!...విశ్వాసము క్రియలవడానికి, విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడడానికి దేవుడు మనలను భద్ర పరుస్తాడు. అది [క్రీస్తు] నీతి నన్ను సరిగా ఉంచుతుంది, అది విశ్వాసము ద్వారా వస్తుంది. విశ్వాసము...ఒక మార్గము, క్రీస్తు నీతి మన కివ్వడానికి..." (Martyn Lloyd-Jones, M.D., Romans – Exposition of Chapter 1, The Gospel of God, Banner of Truth, 1985 edition, p. 307).

లూథర్ ఈ మాటలు చదివాక, "నీతిమంతులు విశ్వాస మూలముగా జీవించెదరు" అయన అన్నాడు, "పౌలు మాట నాకు వచ్చింది... పారడైస్ కు గుమ్మము." డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు, "ఏమి ప్రత్యక్షత! ఏమి మార్పు! భయంకర, హీన, విశాద సాదువు, ఉపవాసము ద్వారా చేమటోర్చిన వాడు, విపలుడైనవాడు, సంస్కరణ అదినేత అయ్యాడు! మహిమాయుక్త, సువార్త బోధకుడు ‘దేవుని పిల్లలు మహిమాయుక్త స్వతంత్రతను’!" అనుభవిస్తున్నాడు (ల్లాయిడ్-జోన్స్, ఐబిఐడి., పేజి 309). గ్రిఫత్ పాటలో, పరిశుద్ద కౌంట్ జింజేన్ డార్డ్ అన్నాడు,

యేసు, నీరక్తము నీతి
   నా అందము, నా మహిమ వస్ర్తము;
మండుచుండు లోకము మద్య, ఈ దుస్థితిలో,
   ఆనందము తో నా తల పైకేత్తుతాను.
("యేసు, నీ రక్తము నీతి" కౌంట్ నికోలస్ వాన్
   జిజెంన్ డోర్ద్ చే, 1700-1760).

లేక, ఎడ్వర్డ్ మౌంట్ అన్నాడు,

నా నిరీక్షన కట్టబడింది
   యేసు రక్తము పై నీతి పై...
ఆయన నీతిలో అలంకరింపబడి,
   నిరాపరాదిగా సింహాసనము ముందు నిలబడడానికి.
క్రిస్తుపై, గట్టి బండపై, నిలబడును;
   మిగిలిన నేలంతా మునిగిపోయే ఇసుక;
మిగిలిన నేలంతా మునిగిపోయే ఇసుక.
   ("గట్టి బండ" ఎడ్వర్డ్ మోటచ్, 1797-1874).
      (“The Solid Rock” by Edward Mote, 1797-1874).

యేసును నమ్మాలను ఈ రాత్రి మిమ్ములను అడుగుతున్నాను, "లోక పాపములను మోసికోనిపోవు, దేవుని గొర్రె పిల్ల" (యోహాను 1:29). యేసును నమ్మినప్పుడు, రక్షింపబడతావు, నితిమంతుడవుగా తీర్చబడి, నిరంతరము సురక్షితంగా ఉంటావు. ఈ రాత్రి యేసును నమ్ముతాడని నిరిక్షిస్తున్నాను. లూదర్ వలే, నీవు "తిరిగి జన్మిస్తావు తెరువబడిన ద్వారాల ద్వారా [వెళ్తావు] పరదైసుకు వెళ్తావు." జోహాన్న స్టాపిట్జ్ లూదర్ తొ అన్నటు, "మదుర రక్షకుని గాయాలు చూడండి."

"విశ్వాసము నీతి మూలముగా జీవించెదరు" (రోమా 1:17).

డాక్టర్ చాన్, కొందరు యేసును నమ్మి రక్షింప బడునట్లు ప్రార్ధించండి! ఆమెన్.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ఫ్రుథోమ్: రోమా 1:15-17.
ప్రసంగము ముందు పాట బెంజిమిన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్: "యేసు, మీ రక్తము నీతి"
(కౌంట్ నికొలాస్ వాన్ జింజెన్ డోర్ప్ చే, 1700-1760; జాన్ వేస్లీచే అనువదింపబడినది, 1703-1791)
“Jesus, Thy Blood and Righteousness”
(by Count Nicolaus von Zinzendorf, 1700-1760; translated by John Wesley, 1703-1791).


ద అవుట్ లైన్ ఆఫ్

OUTLINE