Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
ఉజ్జీవంలో దేవుడు వాడే ప్రజలు

(ఉజ్జీవముపై 12 వ ప్రసంగము)
THE PEOPLE GOD USES IN REVIVAL
(SERMON NUMBER 12 ON REVIVAL)
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము సాయంకాలము, అక్టోబర్ 19, 2014
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord's Day Evening, October 19, 2014

"జ్ఞానులను సిగ్గు పరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు; బలవంతులైన వారిని సిగ్గు పరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు" (I కొరిందీయులకు 1:27).


ఈ పాఠ్య భాగములో ఉజ్జీవమును గూర్చిన విశిష్ట విషయము చెప్పబడింది. దేవుడు వెర్రి వారిని బలహీనులను ఎన్నుకుంటాడు, జ్ఞానులను బలవంతులను సిగ్గు పరచడానికి. బైబిలు చదివే ఎవరికైనా ఇది తేట తెల్లమవుతుంది. క్రీస్తు పుట్ట బోవుముందు, దేవుడు ఒక పేద అమ్మాయిని తల్లిగా ఎన్నుకున్నాడు. ఆయన పుట్టినప్పుడు, దేవుని కొంతమంది పేద గొర్రెల కాపరులను పూజించడానికి పంపాడు. దేవుడు హేరోదు రాజునుగాని, ఇశ్రాయేలు పెద్దలను గాని బాల క్రీస్తు నొద్దకు పంపలేదు. దానికి బదులు ముగ్గురు జ్ఞానులను దూరదేశము నుండి పంపాడు. యేసు తన పరిచర్య ప్రారంభించే ముందు, దేవుడు ప్రకటించడానికి ప్రధాన యాజకుని పంపలేదు. దానికి బదులు, పేద బాప్మిష్మమిచ్చు ప్రవక్త, యోహానును పంపాడు. యేసు పన్నెండుగురు అపోస్తలులను పిలిచేముందు, ఆయన సాన్ హెడ్రిన్ నుండి, యూదా ఉన్నత న్యాయస్థానము నుండి ఎన్నుకోలేదు. బదులుగా, ఆయన ఎన్నిక లేని చిన్న పన్నెండు మంది జాలరులను పిలిచాడు. యేసు యూదాకు బదులుగా, ఆయన తర్షీసు వాడైన హంతకుడు సౌలును ఎన్నుకున్నాడు, "ప్రధాన" పాపిగా ఆయన పిలుచుకున్నాడు, భయంకర పాపి! క్రీస్తు జీవితంలో ఇది తేటగా ఉంది

"జ్ఞానులను సిగ్గు పరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు; బలవంతులైన వారిని సిగ్గు పరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు" (I కొరిందీయులకు 1:27).

పాత నిబంధనలో కూడా మళ్ళీ మళ్ళీ ఇదే సంభవించింది. దేవుడు కయీనుపైన హేబెలును ఎన్నుకున్నాడు, కయీను జేష్టుడైనప్పటికినీ, ప్రాముఖ్యమైనప్పటికిని. దేవుడు ఏశావు బదులు యాకోబును ఎన్నుకున్నాడు, ఏశావు జేష్టుడైన వారసుడయినప్పటికినీ. దేవుడు పదకొండు అన్నలపైన యాసేపును ఎన్నుకున్నాడు, ఆఖరివాడైన బలహీనుడైనా. దేవుడు ఫరో పైన మోషేను ఎన్నుకున్నాడు. ఆయన భూమిపై బలిష్టుడైన వానిపైన గొర్రెల కాపరిని ఎన్నుకున్నాడు. దేవుడు మిధ్యానీయుల నుండి ఇశ్రాయెలీయులను రక్షించుటకు గిద్యోనును ఎన్నుకున్నాడు – గిద్యోను ఇలా అన్నప్పటికిని, "నా కుటుంబం పేదది...నా తండ్రి ఇంటిలో నేను అల్పుడును" (న్యాయాధిపతులు 6:15). దేవుడు చిన్న సమూయేలును, అనాధను, ప్రధాన యాజకుని ఇద్దరి కుమారులపై ఎన్నుకున్నాడు. దేవుడు గొర్రెల బాలుడైన దావీదును బలాడ్యుడైన రాజైన సౌలుపైన ఎన్నుకున్నాడు.

మళ్ళీ మళ్ళీ, క్రైస్తవ చరిత్ర అంతటిలో, ఈ వాక్యము సత్యము,

"జ్ఞానులను సిగ్గు పరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు; బలవంతులైన వారిని సిగ్గు పరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు" (I కొరిందీయులకు 1:27).

ఆది క్రైస్తవులు పేదలు నిర్భాగ్యులు. చాల మంది బానిసలు. రోమా చక్రవర్తులచే మరణమునకు హింసింపబడియున్నారు. ఎవ్వరు ఆ చక్రవర్తులను గుర్తుంచుకోరు (న్యూరోను తప్ప), భూమిపై వారు అధిక శక్తివంతులయినప్పటికిని. ప్రపంచంలో ప్రజలు కేటకొంబ్ హత సాక్షులను జ్ఞాపకముంచుకుంటారు శుభ శుక్రవారమున ప్రతి ఏటా పోప్ కొలోస్సియంలో ప్రార్ధన జరిపేటప్పుడు! ఈ హత సాక్ష బానిసలు పురాతన రోమా శక్తిని అధికమించారు!

లూథర్ ను గూర్చి ఆలోచించండి. తనను గూర్చి డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్-జోన్స్ ఏమి అన్నాడో వినండి:

ఏ ఆశ ఉందని ఒక మనిషి , అపరచిత భక్తుడు మార్టిన్ లూథర్ కు, ఏమి నిరీక్షణ ఉంది? సంఘమునకు వ్యతిరేకంగా నిలబడడానికి అతను ఎవరు. మరియు...పన్నెండు పదమూడు శతాబ్దాల, సంప్రదాయానికి వ్యతిరేకంగా? ఈ ఒక వ్యక్తి లేచి అన్నాడు, "నేను మాత్రము ఒప్పు, మీరంతా తప్పు." అది అతని గూర్చి నేడు చెప్పబడుతుంది. అయిననూ, మీరు చూస్తారు, దేవుని ఆత్మ అతని ద్వారా పనిచేసింది. తను ఒక్కడైనను, నిలబడ్డాడు, మరియు ఒంటరిగా నిలబడ్డాడు, మరియు పరిశుద్ధాత్మ తనను గౌరవించింది. ప్రొటస్టంట్ సంస్కరణ వచ్చింది, కొనసాగింది, అదే మాదిరిగా ఉంది...నేను చెప్తున్నదేమిటంటే తన సంఘములో దేవుడు కదలుట ప్రారంభించినప్పుడు, ఉజ్జీవానికి మార్గము సిద్ధ పరుస్తున్నప్పుడు, అలా ఆయన చేస్తాడు. తన భారాన్ని కొంతమందిపై పెడతాడు, ప్రత్యేకింపబడిన వారు, ఉన్నవారు, మరియు కూడుకొనే వారు, మౌనంగా, అపరిచితంగా, మరియు గమనిక లేని వారుగా, ఎందుకంటే వారికి ఈ భారము గ్రహింపు ఉంటుంది కాబట్టి (Martyn Lloyd-Jones, M.D., Revival, Crossway Books, 1987, pp. 203, 167).

ఈ ఉజ్జీవాలన్నింటిలో చరిత్రలో ఇదే చూస్తారు. జేమ్స్ మెక్ క్వికెన్ ఇంకొక ఇద్దరితో మాట్లాడాడు, పరిస్థితి అంతా చూసారు, వారు ముగ్గురు చిన్న సందులో ఒక తరగతి గదిలో కూడుకున్నారు. అది చూసే ఆధిక్యత నాకు కలిగింది ఉత్తర ఐర్లాండ్ లో. అలాంటి స్థలాన్ని చూడాడానికి వెళ్ళాను, ఎందుకంటే అటువంటి ప్రదేశంలో ఉండడం నాకు ఇష్టం...వారు ప్రార్ధన పిలుపు పొందారు (ల్లాయిడ్-జోన్స్, ఐబిఐడి., పేజి 165).

మరియు, బహుశా, 1859 ఉజ్జీవము ఉత్తర ఐర్లాండ్ లో వచ్చింది పరిశుద్ధాత్మ కృమ్మరింపు కొరకు ఈ ముగ్గురు ప్రార్ధించినప్పుడు. డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు, "నన్ను నమ్మండి, నా స్నేహితులారా, వచ్చే ఉజ్జీవములో, ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం అవుతుంది, మరి ముఖ్యంగా కార్య నిర్వాహకులకు. అది [సామాన్య, ఊహించని] గమనింపనిదిగా వస్తుంది. స్త్రీ పురుషులు మౌనంగా వెళ్తారు భారముతో, వారికి, వారు సహాయం చేసుకోలేరు కాబట్టి, అది లేకుండా జీవించలేరు కాబట్టి, వారు ఇతరులను కలవ ఇష్టపడతారు. అదే అనుభూతి ఉన్న వారిని, దేవునికి మోర పెడతారు" (ల్లాయిడ్-జోన్స్, ఐబిఐడి., పేజి 165-166).

డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ ఇంకా అలా అన్నాడు, "వారికి మెథడిజం శాఖలతో పరిచయం ఉంది. అది ఎలా ప్రారంభమైంది...? అలాగే ప్రారంభమైంది, ఇద్దరు వెస్లీ సహోదరులతో, వైట్ ఫీల్డ్, ఇతరులతో, వారంతా ఇంగ్లాండ్ సంఘ సభ్యులు...అది జరుగుతుందని ఎవరికీ తెలియదు, కాని వారు కలుసుకున్నారు ఒక దగ్గర కూడుకున్నారు కాబటి" (ఐబిఐడి., పేజి 166).

మన అందరికి తెలుసు జార్జి వైట్ ఫీల్డ్ మరియు జాన్ మరియు చార్లెస్ వెస్లీ. మునుపు ఎవరికీ వారు తెలియదు. వారు సామాన్య యవనులు అంగ్లకన్ సంఘ మృత స్థితిని చూసారు, వారు క్రీస్తు నందలి సజీవ అనుభవముతో దేవుడు మహిమ పరచబడడం చూడాలనుకున్నారు.

ఒకరు, నేననుకుంటాను బిషఫ్ రైలీ అన్నాడు, జాన్ వెస్లీ ఇంగ్లాండ్ సంఘ నాయకుడైన, కెంటన్ బరీ ఆర్క్ బిషఫ్ అయి ఉండాల్సింది. కాని, బహుశా, ఆ స్థానానికి ఆలోచించలేదు కూడ. బదులుగా, వెక్కిరింపబడ్డాడు. ఆక్స్ ఫర్డ్ విశ్వవిధ్యాలయంలో బోధింపకూడదన్నారు, అక్కడే పట్ట భద్రుడయ్యాడు, ఎందుకంటే ఆయన బోధకులకు విద్యార్ధులకు తిరిగి జన్మించాలని చెప్పాడు. తన తల్లి, సుజానా వెస్లీ, ఆయన వలన భాద పడింది ఎందుకంటే తను ఒక "ఉద్రేకిగా" – వ్యంగ్యంగా బోధిస్తున్నాడని – ఆమె మారక ముందు. యాభై మూడు సంవత్సరాలు, జాన్ వెస్లీ రోజుకు మూడు సార్లు జనులకు బోధించే వాడు ఇంగ్లండు మైదానంలో. కాని తన తెగ వారే ఈ గొప్ప వ్యక్తిని వెక్కిరించే వారు. ఆయన ఎన్నడు గౌరవింప బడలేదు ఎనభై సంవత్సరాలు వచ్చే వరకు. ఈ మధ్యలో, జాన్ వెస్లీ పరిచర్యలో, ఆరుగురు కెంటన్ బరీ ఆర్క్ బిషఫ్ గా ఉన్నారు. ఇవి వారి పేర్లు,

జాన్ పోటర్ (1737-1747)
John Potter (1737-1747)
థామస్ హీర్దింగ్ (1747-1757)
Thomas Herring (1747-1757)
మేథ్యూ హట్టన్ (1757-1758)
Matthew Hutton (1757-1758)
థామస్ సెక్కర్ (1758-1768)
Thomas Secker (1758-1768)
ఫ్రెడరిక్ కార్న్ వాలిస్ (1768-1783)
Frederick Cornwallis (1768-1783)
జాన్ మూర్ (1783-1805)
John Moore (1783-1805).

ఆంగ్లికన్ చరిత్ర కారుడు ఈ ఆరుగురి "గొప్ప" వ్యక్తులను పేర్కొని ఉంటాడు. కాని ప్రతి క్రైస్తవునికి జాన్ వెస్లీ పేరు తెలుసు. తన సహోదరుడు, చార్లెస్ పేరు కూడ, ఆయన పాటలు భూమిపై అన్ని తెగల సంఘాలలో పాడతారు. కాని వైట్ ఫీల్డ్ ఇతర ఇద్దరు వెస్లీలు చిన్నవారు, అపరిచిత యువకులు వారు 1738 లో నూతన సంవత్సర సందర్భంలో కూడి, పరిశుద్ధాత్మ కృమ్మరింపు కొరకు ప్రార్ధించారు, మొదటి గొప్ప మేల్కొలుపు ఆంగ్ల ప్రపంచంపై వచ్చేముందు.

"జ్ఞానులను సిగ్గు పరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు; బలవంతులైన వారిని సిగ్గు పరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు" (I కొరిందీయులకు 1:27).

ఈ వచనము వివరిస్తుంది ఉజ్జీవంలో యువకులు ఎందుకు నాయకులుగా ఉంటారు అని. సంఘములో యువకులు మొదట దేవుని ఆత్మ కదిలింపు పసిగడతారు. యువకులు నీతి కొరకు, ఉజ్జీవం కొరకు దేవుని నిజత్వము కొరకు ఆకలి దప్పులు కలిగి యుంటారు.

నేను చూసిన మొదటి ఉజ్జీవము చైనీయ బాప్టిస్టు సంఘములో యువకుల మద్య కొండలలో వేసవిలో చోటు చేసుకుంది. ఒక ఉదయాన్న ప్రార్ధనకు కూడినప్పుడు దేవుని ఆత్మ బలంగా వారిపై దిగి వచ్చింది, వారు తిరిగి వెళ్ళినా, ఆదివారం వరకు సంఘములో కొనసాగింది. ఉజ్జీవము ఆదివారము పగలు రాత్రి కొనసాగింది. ఆ యువకుల ప్రార్ధనలు ఇంకా నాకు గుర్తున్నాయి. నాకు ఇంకా గుర్తు ఉంది ఆ అధ్బుతం ఆశ్చర్యం, కన్నీటి పశ్చాత్తాపము, ఒప్పుకోలు ప్రార్ధనలు, ఆ కూటాలలో దేవుని సమీపత.

బాప్టిస్టు సంఘము వర్జీనియాలో ఉజ్జీవములో, ముగ్గురు అమ్మాయిలు పాడడం చూసాను. వారు నొచ్చుకొని ఏడ్చారు, సంఘమంతా ఉజ్జీవపు భావన పొందారు – "దేవుడు మన మధ్యకు వచ్చాడు."

"సేక్సనీలో హార్న్ హాట్ లో ఉజ్జీవము వచ్చింది యవనస్థుల మధ్య ఆగష్టు 13 న." ఆగష్టు 29 న "రాత్రి పది గంటల నుండి మరునాడు ఉదయము వరకు, చలించే సన్నివేశము చోటు చేసుకుంది, హేర్నేట్ అమ్మాయిలు [మూడు గంటలు] ప్రార్ధనలో, పాటలలో విలాపములో గడిపారు. ఆ సమయములో అబ్బాయిలు ఇంకొక చోట పట్టుదల ప్రార్ధన చేస్తున్నారు. ప్రార్ధన విజ్ఞాపన ఆత్మ పిల్లలపై దిగింది అది అధిక శక్తి వంతమైనది మాటలలో వివరింప శక్యము కానిది" (John Greenfield, Power From On High, World Wide Revival Prayer Movement, 1950, p. 31).

1973 అక్టోబర్ లో బోర్నియా బారియోలో జూనియర్ సెకండరి పాఠశాల విద్యార్ధుల మద్య ఉజ్జీవము ప్రజ్వరిల్లింది. ఇద్దరు అబ్బాయిలు కలిసి ప్రార్దిస్తుండగా పాఠశాల అంతా ప్రార్దిస్తుండగా, పాఠశాల అధికారి ఆత్మ కార్యమును మొదట వ్యతిరేకించి, పశ్చాత్తాప పడ్డాడు (Shirley Lees, Drunk Before Dawn, Overseas Missionary Fellowship, 1979, pp. 185-189).

బ్రియాన్ హెచ్. ఎడ్వర్డ్స్ అన్నాడు, "ప్రాముఖ్యము ఏమంటే ఉజ్జీవ సమయాల్లో...యవనస్థులు మారిన సవాలు గలిగిన వారు, వారు చాల సందర్భాల్లో నిజాయితీగా ఉజ్జీవము కొరకు ప్రార్ధించి కనిపెడతారు, వారి మద్య ప్రారంభమవుతుంది...ఇది ఉజ్జీవంలో అంశము, ఇది గమనింపబడదు, ఉజ్జీవ విశ్లేషకులచే" (Brian H. Edwards, Revival! A People Saturated With God, Evangelical Press, 1991 edition, p. 165).

"జ్ఞానులను సిగ్గు పరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు; బలవంతులైన వారిని సిగ్గు పరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు" (I కొరిందీయులకు 1:27).

ఏమి కర్మిచయాల్ పరిశుద్ధాత్మ కృమ్మరింపు ను ఇలా వర్ణించాడు,

ఉదయ ఆరాధన ముగింపులో విరామము వచ్చింది. బోధించువాడు, ఆపాడు, అంతరంగిక శక్తిని అకస్మాత్తుగా గ్రహించాడు. ప్రార్ధించడం కూడ అసాధ్యమైంది. బాలుర పాఠశాలలో ఒకరు ప్రార్ధించ ప్రయత్నించారు, కాని [కన్నీళ్లు] కారాయి, తరువాత ఇంకొకరు, తరువాత అందరు, మొదట ఆ కుర్రవాళ్ళు కూడా ఏడ్చారు. చాల మంది యవనులు ఏడ్చారు క్షమాపణ కొరకు ప్రార్ధించారు. స్త్రీ లకు ప్రాకింది. ఇది అద్భుతం – ఇంకొక మాట లేదు – వివరాలు తప్పిపోయాయి. తరువాత చాలామంది, దేవునికి మోర పెట్టారు, ప్రతి అబ్బాయి మరియు అమ్మాయి, పురుషుడు మరియు స్త్రీ, అందరిని [మర్చిపోయి]. శబ్దము అలల చప్పుడు ఉంది చెట్లలో గొప్ప గాలిలా...మొదట ఆ ఉద్యమము మారిన అబ్బాయిల మధ్య, పాఠశాల బాలుర మధ్య, మా పిల్లల మధ్య...సమావేశంలో మిగిలిన యువకుల మధ్య. ఏడు నెలల తరువాత ఆమె నివేదించింది, "సుమారుగా [యువకులంతా] మార్చబడినారు" (J. Edwin Orr, Ph.D., The Flaming Tongue, Moody Press, 1973, pp. 18, 19).

మాటలు గమనించండి, "మొదట ఉద్యమము మారిన అబ్బాయిల మధ్య, పాఠశాల బాలుర మధ్య...సమావేశంలో మిగిలిన యువకుల మధ్య." అలా తరుచు సంఘానికి ఉజ్జీవము వస్తుంది – ఎందుకంటే యువకులు ఉజ్జీవంలో పరిశుద్ధాత్మ కృమ్మరింపు కొరకు వేచి ఉంటారు. అది నేను కళ్ళారా చూసాను మూడు ఉజ్జీవాలలో, దేవుడు తన ఆత్మను గొప్ప శక్తిని క్రుమ్మరించినప్పుడు యవనస్థులపై లాస్ ఎంజిలాస్ లో, శాన్ ఫ్రాన్సిస్కో స్థలములో, వర్జీనియాలోని, వర్జీనియా బీచ్ లో.

ఇప్పుడు, నేను ఈ రాత్రి మన యవనస్తులతో మాట్లాడుతున్నాను. ముద్రింపబడిన ప్రసంగ ప్రతిని ఇంటికి తీసుకెళ్ళడానికి ఇస్తాము. మీరు చదివి మరలా వచ్చే వారమంతా చదువుతారని నా నిరీక్షణ. నా నిరీక్షణ ఈ ప్రసంగములోని విషయాలు మీ జీవితంలో సంభావించాలని, మన సంఘములో జరగాలని.

మీరనుకోవచ్చు, "డాక్టర్ హైమర్స్ ఇలాంటివి మన సంఘంలో జరగడానికి అనుమతించరు అని." మీరు తప్పు. నేను నమ్ముతాను ఉజ్జీవంను గూర్చి నాకు భాగా తెలుసు, నేను ఆత్మను ఆర్పను ఆయన ప్రత్యక్షతను ఆపను, దేవుడు కనికరించి సౌభాతృత్వ ఉజ్జీవ శక్తితో దిగి రావాలి! ప్రవక్త యెషయా మాటలు మీ ప్రార్ధనలలో కలపవచ్చు,

"గగనము చీల్చుకొని, నీవు వచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక" (యెషయా 64:1).

డాక్టర్ చాన్, దయచేసి ప్రార్ధనలో నడిపించండి.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ఫ్రుథోమ్: I కొరిందీయులకు 1:26-31.
ప్రసంగము ముందు పాట బెంజిమిన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్:
"ప్రార్ధించుట నాకు నేర్పుము" (ఆల్ బెర్ట్ ఎస్. రీట్జ్, 1879-1966).
“Teach Me to Pray” (by Albert S. Reitz, 1879-1966).