Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
ఒక వాక్యములో సువార్త

THE GOSPEL IN ONE SENTENCE
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము ఉదయము, సెప్టెంబర్14, 2014
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord's Day Morning, September 14, 2014

"పాపులను రక్షించుటకు, క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు, పూర్ణాంగి కారమునకు యూగ్యమునైయున్నది; అట్టి వారిలో నేను ప్రధానుడను" (I తిమోతి 1:15).


జూలై 13 నుండి ఒంటరి తనముపై ప్రసంగాలు బోధిస్తున్నాను. క్రమంగా ఏడు ఆదివారాలు ఉదయము వాటిని చెప్పాను. ఈ రోజుల్లో యవనస్థులు అనుభవిస్తున్న ఒంటరి తనము సమస్యపై నేను బోధించాను. మళ్ళీ, మళ్ళీ నేనున్నాను, "ఎందుకు ఒంటరి తనము? ఇంటికి రండి – సంఘమునకు." ఒంటరి తనానికి విరుగుడుగా మన సంఘాన్ని ఇచ్చాను. ఆ ప్రసంగాలు సంఘము ఆధారంగా – వేదాంతులు దానిని "ప్రసంగిత్వము" అంటారు. మళ్ళీ మళ్ళీ చూపించాను సంఘము ఉన్నత విద్యార్ధులకు కళాశాల వయస్కులకు ఎంతో సహాయకరమని. ఒక మంచి, జీవించే సంఘము ఒంటరి తనము భావాలను అధిక మించడానికి సహాయపడుతుంది. ఈ ప్రసంగాలు బోధించేటప్పుడు మీలో చాల మంది గుడికి రావడం ప్రారంభించారు. ఇంకొక అంశము చెప్పే సమయము ఆసన్నమైంది. తరువాత అంశము ఏడు ఆదివారాలు నేను మళ్ళీ మళ్ళీ చెప్పిన రెండవ విషయాన్ని పై దృష్టి సారిస్తుంది. "ఎందుకు నశించుట? ఇంటికి రండి యేసు నొద్దకు – దేవుని కుమారుడు!" ఈ ఉదయం ఆ అంశాన్ని చూస్తాం. దయచేసి నిలబడి I తిమోతి 1:15 గట్టిగా చదువుదాం. స్కాట్ ఫీల్డ్ స్టడీ బైబిలులో 1274 వ పేజి లో ఉంది.

"పాపులను రక్షించుటకు, క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు, పూర్ణాంగి కారమునకు యూగ్యమునైయున్నది; అట్టి వారిలో నేను ప్రధానుడను" (I తిమోతి 1:15).

కూర్చోండి.

నా తర్పీదు ఎక్కువగా చైనీయ బాప్టిస్టు సంఘములోని, నా కాపరి డాక్టర్ తిమోతి లిన్, నుండి మరియు డాక్టర్ వెర్నోన్ మెక్ గీ, గొప్ప రేడియో బైబిలు బోధకుడు నుండి వచ్చింది. ప్రతిరోజూ చాల సంవత్సరాలు ఆయనది విన్నాను. మన పాఠ్యమును గూర్చి, డాక్టర్ మెక్ గీ అన్నాడు,

ఇది చాల ప్రాముఖ్య లేఖనము ఎందుకంటే అది నిర్ధారిస్తుంది "క్రీస్తు యేసు పాపులను రక్షించుటకు లోకములోనికి వచ్చెను." ప్రపంచంలో గొప్ప బోధకునిగా, అనిపించుకోడానికి రాలేదు. ఆయన [కేవలము] ఒక మాదిరి ఉంచడానికి రాలేదు, కాని అలా చేసాడు. ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు; "వారిలో నేను ప్రధానుడను" (J. Vernon McGee, Th.D., Thru the Bible, Volume V, Thomas Nelson Publishers, 1983, p. 434; note on I Timothy 1:15).

"ఇది నమ్మదగిన మాట." అపోస్తలుని అర్ధము నమ్మశక్యమైన మాట, దానిని నమ్మవచ్చు లెక్కించవచ్చు. ఆమాట "పూర్ణాంగికారము." అది అంగీకరంచదగినది ఎందుకంటే అది సత్యము కనుక. లెక్కింపదగిన అంశీకరింపదగిన ఈ మాట ఏంటి? అది ఇది – "క్రీస్తు యేసు పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చెను; వారిలో నేను ప్రధానుడను." మీరు నమ్మవచ్చు. మీరు దానిని లెక్కించవచ్చు. మీరు ఆ విషయాన్ని తప్పక సత్యముగా అంగీకరించాలి! "క్రీస్తు యేసు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు, వారిలో నేను ప్రధానుడను." మీరు ఆ విషయాన్ని తప్పక అంగీకరించాలి ఎందుకంటే అది సత్యము కనుక – పూర్ణ సత్యము – "క్రీస్తు యేసు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు"! ఈ వచనము నుండి మూడు గొప్ప సత్యాలు నేర్చుకుంటాం.

I. మొదటిది, క్రీస్తు వ్యక్తిని గూర్చి నేర్చుకుంటాం.

"క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను." ఆయన "వచ్చాడు." మనలా ఆయన సృష్టించబడలేదు. మనము ఈ లోకములోనికి రాలేదు. మనం ఈ లోకంలో, సృష్టింపబడ్డాము. కాని క్రీస్తు "ఈ లోకములోనికి వచ్చాడు." ఎక్కడ నుండి వచ్చాడు? మన మధ్య జీవించడానికి దివి నుండి భువికి వచ్చాడు. యోహానును సువార్త చెప్తుంది,

"ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను... ఆ వాక్యము శరీరధారియై, కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను..." (యోహాను 1:1, 14).

తండ్రియైన దేవునితో క్రీస్తుపైన ఉన్నాడు. తరువాత ఆయన కిందికి వచ్చాడు, శరీరధారిగా, మన మద్య నివసించాడు! అదే "శరీర ధారత్వము." అంటే "శరీరంలో" ఆయన దేవుడు. అదే చార్లెస్ వెస్లీ (1707-1788) తన చక్కని పాటలో చెప్పాడు, "దేవత్వము శరీర రూపము దాల్చింది; శరీర ఆత్మకు ఘనత, మానవునిగా నివసించాడు, మన ఇమ్మానుయేలు యేసు; జాగ్రత్తగా విను, దూతల సమూహం పాడుతుంది, నూతనంగా జన్మించిన రాజుకు మహిమ" (“Hark, the Herald Angels Sing,” by Charles Wesley, 1707-1788). ఎమిలీ ఇలియట్ అన్నాడు, "మీరు సింహాసనాన్ని రాజ కిరీటాన్ని వదిలారు నా కొరకై భూమి పైకి వచ్చినప్పుడు" (“Thou Didst Leave Thy Throne” by Emily E. S. Elliott, 1836-1897).

ఆయన ఎందుకు పరలోకం విడిచి భూలోకానికి వచ్చాడు? కన్య మరియ గర్భంలో ఎందుకు ప్రవేశించాడు? మన మధ్య ఎందుకు జీవించాడు? ఆయన ఎందుకు వేదన బాధ భరించాడు? సిలువ నెక్కి కాళ్ళకు చేతులకు ఎందుకు మేకులు కొట్టించుకున్నాడు? ఎందుకు శరీర దారియైన దేవుడు, శరీరములో ఉన్న దేవుడు, ఆ సిలువపై శ్రమ పడ్డాడు? మన పాఠ్య భాగము చెప్తుంది, "క్రీస్తు యేసు ఈ లోకమునకి వచ్చాడు," కాని ఎందుకు ఆయన ఈ లోకములోనికి వచ్చాడు? అది తరువాత విషయానికి మనలని నడుపిస్తుంది.

II. రెండవది, క్రీస్తు ఉద్దేశాన్ని మనం నేర్చుకుంటాం.

మొదటి విషయంలో నేను మీకు చెప్పాను ఎవరు ఈ లోకంలోని వచ్చారు అని – అతడు శరీర ధారియైన దేవుడు – త్రిత్వములోని రెండవ వ్యక్తి. ఇప్పుడు మనం చూస్తాం ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు,

"క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు పాపులను రక్షించడానికి" (I తిమోతి 1:15).

ఆయన ఈలోకానికి రావడానికి ఉద్దేశము పాపులను రక్షించడానికి. మనకు క్రీస్తు తేటగా చెప్పబడింది, "పాపాల కోసం శ్రమ పడ్డాడు, నీతి మంతుడు అవినీతి మంతుల కొరకు, దేవుని దగ్గరకు మనలను చేర్చడానికి" (I పేతురు 3:18). తిరిగి, అపోస్తలుడైన పేతురు చెప్పాడు "ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మొసుకొనెను" (I పేతురు 2:24). అపోస్తలుడైన పౌలు అన్నాడు, "క్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయెను" (I కొరిందీయులకు 15:3). క్రీస్తు ఇష్ట పూర్వకంగా సిలువ చెంతకు వెళ్ళాడు, నీ స్థానంలో శ్రమ పడడానికి, నీ పాప ప్రాయశ్చిత్తము చెల్లించడానికి, ఆయన స్వరక్తముతో నీ పాపాలు కడగడానికి, పరలోకంలో నిన్ను చేర్చుకోడానికి దేవునికి వీలు కలిగించడానికి. క్రీస్తు ఈ లోకానికి పాపులను రక్షించడానికి, పాపారోపణ నుండి పాపాన్ని తీసివేయడానికి, "నీ పాపలన్నింటిని కడిగి వేయడానికి" (I యోహాను 1:7). క్రీస్తే స్వయంగా అన్నాడు, "నేను ఈ లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు, కాని రక్షించడానికి వచ్చాను" (యోహాను 12:47). ప్రవక్తయైన యెషయా చాల తేట తెల్లము చేసాడు ఇలా చెప్పి,

"మన అతిక్రమములను బట్టి అతడు గాయ పర్చబడెను, మన దోషములను బట్టి నలుగ గోట్టబడెను...అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది" (యెషయా 53:5).

క్రీస్తు రక్తము భయంకర పాపులను వారి పాపాల నుండి రక్షింప గలదు. క్రీస్తు రక్తానికి ఈ శక్తి ఉంది ఎందుకంటే ఆయన గొప్ప వ్యక్తి! క్రీస్తు దేవుని అద్వితీయ కుమారుడు!

స్పర్జన్ అన్నాడు క్రీస్తు దివి నుండి భువికి పాపులను రక్షించడానికి వచ్చాడు. స్పర్జన్ అన్నాడు,

     క్రీస్తు యేసు పరలోకంలోనే ఉండిపోతే మానవులను రక్షింప లేకపోయేవాడు. ఆయన "లోకానికి వచ్చాడు" పాపులను రక్షించడానికి. పతనము ఎంత ఘోరమంటే మన పతన స్థలానికి ఆయన రావలసి వచ్చింది...ఆయన పరలోకంలో కూర్చొని పాపులను రక్షింపలేడు; ఆయన [తప్పక] లోకానికి రావలసి వచ్చింది; కల్మష సృష్టి దగ్గరకు నిత్యత్వ సృష్టి కర్త దిగి రావలసి వచ్చింది...ఆయన పాపులను రక్షింప లేడు, గొప్ప పతన స్థితిలో, శరీర దారి కాకుండా, మన స్వభావాన్ని ఆయనపై వేసుకోకుండా...ఇక్కడ ఉండకుండా... [పరలోకానికి] తిరిగి వెళ్ళలేడు ఇలా చెప్తూ "సమాప్త మాయెను," ఆయన మొదటిగా చనిపోకుండా. [ఆయన] తలపై ముళ్ళ కిరీటం ఉండాలి, [ఆయన] కళ్ళు సమాధి చీకటిలో మూయబడాలి,... మానవుడు విమోచింప బడక [ముందు]...ఓ పాపి, నీవెప్పుడు నశించావు, నిత్యత్వంలో నశించావు, అనంత రక్షకుడు తన శరీరాన్ని నేరవేర్పుగా [ఉంచాడు] ఉంచాడు పాపులను వారి పాపాల నుండి రక్షించడానికి (C. H. Spurgeon, “The Faithful Saying,” The Metropolitan Tabernacle Pulpit, volume 24, Pilgrim Publications, 1972 edition, p. 304).

III. మూడవది, క్రీస్తు శక్తిని గూర్చి మనం నేర్చుకుంటాం.

"పాపులను రక్షించుటకు, క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు, పూర్ణాంగి కారమునకు యూగ్యమునైయున్నది; అట్టి వారిలో నేను ప్రధానుడను" (I తిమోతి 1:15).

అపోస్తలుడైన పౌలు అన్నాడు ఆయన "ప్రధాన" పాపి అని – అందరిలో భయంకర పాపి. పౌలు క్రీస్తుకు వ్యతిరేకంగా చాల కఠినంగా మాట్లాడాడు. చాల మంది క్రైస్తవులను చంపడంలో పౌలే బాధ్యుడు. భయంకర పాపికి పౌలు ఒక గొప్ప ఉదాహరణ. పౌలు ఉదాహరణ నుండి, పాపులందరూ గమనించవచ్చు, గొప్ప పాపి గొప్ప క్రైస్తవుడు కావచ్చు. క్రీస్తు భయంకర శత్రువు ఆయన శ్రేష్టమైన సేవకుడవవచ్చు. అదే పౌలుకు జరిగింది – నీకు కూడా అది జరగవచ్చు. క్రీస్తు శక్తి నిన్ను పాపి నుండి పరిశుద్దునిగా మారుస్తుంది! "క్రీసు యేసు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు; అట్టి వారిలో నేను ప్రధానుడను."

తొలిసారిగా యువకుడిగా ఉన్నప్పుడు పదమూడేల్లప్పుడు, బాప్టిస్టు సంఘానికి తీసుకొని వెళ్ళబడ్డాను. మా పక్కింటి వాళ్ళు నన్ను బాప్టిస్టు సంఘానికి తీసుకెళ్ళారు. నాలాంటి పాపిని రక్షించడానికి క్రీస్తు వచ్చాడని నాకు తెలియదు. నాకు అది తెలియకుండానే బాప్మిస్మము పొందాను. నేను యేసును విషాద వ్యక్తిగా అనుకోకుండా సిలువ వేయబడిన వానిగా అనుకున్నాను. క్రీస్తు నందలి విశ్వాసము ద్వారా రక్షణగా గూర్చిన ప్రసంగాలు విని ఉండాల్సింది. కాని ఆ ప్రసంగాలు అర్ధం కాలేదు. అపోస్తలుడైన పౌలు అన్నాడు,

"మా సువార్త మరుగు చేయబడిన యెడల నశించుచున్న, వారి విషయంలోనే మరుగు చేయబడియున్నది" (II కొరిందీయులకు 4:3).

నేను తప్పక నశించేవాడను! సువార్త తప్పకుండా నా కొరకు దాచబడి ఉంది!

యుదా పాత గుడిలో ఈష్టర్ రోజున వేసాను. యుదా క్రీస్తును అప్పగించిన శిష్యుడు. మూడు సంవత్సరాలు యుదా పాత్ర వేసాను. అయినా గుడ్డి వానిగా ఉన్నాను. ఇంకా అర్ధం కాలేదు యేసు నా పాపమూ కొరకు శ్రమపడి నన్ను రక్షించడానికి చనిపోయాడని. ఈష్టర్ నాటికలు ఒకప్పుడు, యుదా మాటలు అరచి చెప్పాను,

"నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితిని" (మత్తయి 27:4).

అది నా పాపాన్ని గూర్చి ఆలోచింప చేసింది. పాపము నాకు భయంకరంగా మారింది. నేను క్రీస్తును అప్పగించినట్టుగా భావించాను, అది వాస్తవమే. ప్రతి పాపి క్రీస్తును అప్పగిస్తాడు.

నేననుకున్నాను "మంచి" పనులు చేయడం ద్వారా నిజ క్రైస్తవునిగా ఉండగలను అనుకున్నాను. నేను భావించాను నేను చాల మంచిగా ఉండాలి లేకుంటే క్రైస్తవుని కాలేనని. 1958 లేక 1959 లో నేను లైఫ్ మేగజైన్ కథ చదివాను డాక్టర్ ఆల్బర్ట్ స్కేట్ చర్ ను గూర్చి. స్కేట్ చర్ ఆఫ్రికాలో వైద్య మిస్సనరి. లైఫ్ మేగజైన్ ఆయనను గొప్ప మానవతావాదిగా, దయగల మంచి ఆఫ్రికాలో మిస్సనరి వైద్యునిగా ప్రశంచించింది. మిస్సనరీ నవాలని ఆలోచించడం ప్రారంభించాను. అది నన్ను నిజ క్రైస్తవునిగా చేస్తుందను కున్నాను. నేను డాక్టర్ టామ్ డూలేను గూర్చి విన్నాను, ఆయన వియత్నాం కంబోడియాలకు మిస్సనరీ. తరువాత డాక్టర్ జేమ్స్ హడ్సన్ టేలర్ ను గూర్చి చదివాను, ఆయన 19వ శతాబ్దంలో చైనాకు వైద్య మిస్సెనరీ. నేననుకున్నాను, "అది చేస్తాను. చైనాలో మిస్సనరీ అవుతాను. అప్పుడు నిజ క్రైస్తవుడనవుతాను యుదా వలే పాపిని కాను." అందుకు నేను మొదటి చైనీయ బాప్టిస్టు సంఘములో చేరాను. నాకు 19 సంవత్సరాలు. అప్పుడు సేవను గూర్చి చదవడానికి బయోలా కాలేజికి వెళ్ళాను, మిస్సనరీగా ఉండవచ్చునని. అది నన్ను రక్షిస్తుందనుకున్నాను.

బయోలా కాలేజి కూటాల క్రమములో, చార్లెస్ వెస్లీచే (1707-1788) రచించబడిన పాటను ఆరాధన ప్రారంభంలో పాడాం. ఆపాట ముందెన్నడూ వినలేదు. నాకు మంచి అభిప్రాయము కలిగింది. రెండవ రోజుకు ఆ పాట తలపై నా వెంట్రుకలను నిలబెట్టింది! నాకు విద్యుత్తు నా శరీరంలో ప్రసరించినట్టయింది ప్రతి ఉదయము ఆపాట పాడేటప్పుడు.

అది నేను పొందుకోగలనా
   రక్షకుని రక్తములో మూల్యాముగా?
ఆయన నాకై మరణించాడు, ఆయనకు నొప్పి ఎవరు కలిగించారు?
   నాకొరకై, ఆయనను మరణానికి ఎవరు అప్పగించారు?
అద్భుత ప్రేమ! ఎలా ఉంటుంది,
   మీరు, నా దేవుడు, నా కొరకై మరణించుట?
అద్భుత ప్రేమ! ఎలా ఉంటుంది,
   మీరు, నా దేవుడు, నా కొరకై మరణించుట.

ఆయన తండ్రి సింహాసనాన్ని విడిచాడు,
   ఉచిత, అనంతమైనది ఆయన కృప;
తన్ను రిక్తునిగా చేసుకొని కేవలము ప్రేమతో,
   ఆదాము నిస్సహాయ సంతతికై రక్తము కార్చాడు;
‘పూర్తిగా కృప, ఉదృత మరియు ఉచిత,
   ఓనా దేవా, అది నన్ను కనుగొంది!
అద్భుత ప్రేమ! ఎలా ఉంటుంది,
   మీరు, నా దేవుడు, నా కొరకై మరణించుట.
("అది నేను పొందుకో గలనా?" చార్లెస్ వెస్లీచే, 1707-1788).
(“And Can It Be That I Should Gain?” by Charles Wesley, 1707-1788).

నేను పదే పదే పాడాను. కాగితముపై మాటలు వ్రాసుకొని మళ్ళీ మళ్ళీ మళ్ళీ పాడాను. "అద్భుత ప్రేమ! ఎలా ఉంటుంది, మీరు, నా దేవుడు, నా కొరకై మరణించుట." డాక్టర్ చార్లెస్ జె. ఉడ్ బ్రిడ్జి (1902-1995) ప్రతి రోజు ప్రసంగీకుడు. రెండవ పేతురు ద్వారా బోధించాడు. వారాంతానికి నేను రక్షింపబడ్డాను! ఇంటికి వెళ్తూ పాడాను, "అద్భుత ప్రేమ! ఎలా ఉంటుంది, మీరు, నా దేవుడు, నా కొరకై మరణించుట."

"పాపులను రక్షించుటకు, క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు, పూర్ణాంగి కారమునకు యూగ్యమునైయున్నది; అట్టి వారిలో నేను ప్రధానుడను" (I తిమోతి 1:15).

నేను మీ కొరకు ప్రార్ధిస్తున్నాను! క్రీస్తు యేసును మీరు నమ్మాలని ప్రార్ధిస్తున్నాను – ఆయన ద్వారా పాపము నుండి రక్షింపబడాలని. క్రీస్తు ద్వారా పాపము నుండి మీరు రక్షింపబడాలని ప్రార్ధిస్తున్నాను – మీ హృదయముతో ఇలా పాడాలని, "అద్భుత ప్రేమ! ఎలా ఉంటుంది, మీరు, నా దేవుడు, నా కొరకై మరణించుట." మీరు పూర్తిగా అర్ధం చేసుకోలేకపోతే, చింత పడకండి. మళ్ళీ ఇది బోధిస్తాను. ఇంకా ఎక్కువ వినడానికి తిరిగి తప్పకుండా రండి! ఆమెన్. డాక్టర్ చాన్, ప్రార్ధనలో దయచేసి నడిపించండి.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ఫ్రుథోమ్: I తిమోతి 1:12-16.
ప్రసంగము ముందు పాట బెంజిమిన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్:
"ఇప్పుడు నేను యేసుకు చెందినవాడను" (నోర్మన్ జె. క్లేటన్ చే, 1903-1992).
“Now I Belong to Jesus” (by Norman J. Clayton, 1903-1992).


ద అవుట్ లైన్ ఆఫ్

ఒక వాక్యములో సువార్త

THE GOSPEL IN ONE SENTENCE

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

"పాపులను రక్షించుటకు, క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు, పూర్ణాంగి కారమునకు యూగ్యమునైయున్నది; అట్టి వారిలో నేను ప్రధానుడను" (I తిమోతి 1:15).

I.   మొదటిది, క్రీస్తు వ్యక్తిని గూర్చి నేర్చుకుంటాం,
యోహాను 1:1, 14.

II.  రెండవది, క్రీస్తు ఉద్దేశాన్ని మనం నేర్చుకుంటాం,
I పేతురు 3:18; 2:24; I కొరిందీయులకు 15:3;
I యోహాను 1:7; యోహాను 12:47; యెషయా 53:5.

III. మూడవది, క్రీస్తు శక్తిని గూర్చి మనం నేర్చుకుంటాం,
II కొరిందీయులకు 4:3; మత్తయి 27:4.